Foxconn
-
వివక్షతతో కూడిన ప్రమాణాలు తొలగింపు
భారత్‌లో యాపిల్ సరఫరాదారుగా ఉన్న ఫాక్స్‌కాన్ తన ఉద్యోగుల నియామక ఏజెంట్లకు ఆదేశాలు జారీచేసింది. కంపెనీ నియామక పద్ధతుల్లో మార్పులు చేసింది. ఉద్యోగ ప్రకటనల్లో లింగం, వైవాహిక స్థితి, వయసు వంటి వివక్షతతో కూడిన ప్రమాణాలను తొలగించాలని స్పష్టం చేసింది. ఈమేరకు రాయిటర్స్ దర్యాప్తును అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు.చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూర్‌లోని ఐఫోన్ తయారీ ప్లాంట్‌లో వివాహిత మహిళలను అసెంబ్లింగ్-లైన్ విభాగంలో పని చేసేందుకు ఫాక్స్‌కాన్ గతంలో మినహాయించినట్లు రాయిటర్స్ దర్యాప్తులో తేలింది. కానీ హై ప్రోడక్టివిటీ అవసరం అయినప్పుడు మాత్రం వివాహత మహిళలపై ఎలాంటి షరతులు విధించలేదని తెలిపింది. ఈ మేరకు జూన్ 25న రాయిటర్స్ సిద్ధం చేసిన పరిశోధన పత్రాన్ని అనుసరించి కంపెనీ తాజాగా వివక్షతతో కూడిన వివరాలు రిక్రూట్మెంట్ ప్రకటనలో ఉండకూడదని ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారిని లింగం, వయసు, వైవాహిక స్థితిని అనుసరించి వేరు చేయడం సరికాదని తెలిపింది. దాంతో సదరు వివరాలు లేకుండానే చెన్నైలో కొన్ని సంస్థలు ఉద్యోగాల కోసం ప్రకటనలు ఇస్తున్నాయి.ఇదీ చదవండి: నారాయణ మూర్తిని మించిన సేనాపతిఫాక్స్కాన్ ఏజెన్సీ ఇచ్చిన ఓ ప్రకటన ప్రకారం స్మార్ట్‌ఫోన్ తయారీ యూనిట్‌లోని మొత్తం అసెంబ్లింగ్ స్థానాలు తెలిపారు. కానీ వయసు, లింగం, వైవాహిక ప్రమాణాల గురించి ప్రస్తావించలేదు. ‘ఎయిర్ కండిషన్డ్ వర్క్‌ప్లేస్, ఉచిత రవాణా, క్యాంటీన్ సౌకర్యం, ఉచిత హాస్టల్, నెలవారీ జీతం రూ.14,974 లేదా దాదాపు 177 అమెరికన్ డాలర్ల’ వివరాలతో ప్రకటన ఇచ్చారు. -
ఫాక్స్‌కాన్‌ను మరింత విస్తరించండి
సాక్షి, హైదరాబాద్/సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టడం ద్వారా వ్యాపార విస్తరణ చేపట్టాలని ప్రముఖ సెల్ఫోన్ల తయారీ కంపెనీ ఫాక్స్‌కాన్ ఇంటర్‌కనెక్ట్ టెక్నాలజీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలు, లిథియం బ్యాటరీల తయారీకి సైతం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. హైటెక్నాలజీ ఉత్పత్తుల తయారీ, ఆవిష్కరణలకు రాష్ట్రంలో అత్యంత అనుకూల వాతావరణం ఉందని వివరించారు. ప్రభుత్వం కొత్తగా నిర్మించ తలపెట్టిన ఫోర్త్‌సిటీలో భాగస్వాములు కావాలని కోరారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబుతో కలిసి సోమవారం కొంగరకలాన్‌లోని ఫాక్స్‌కాన్ పరిశ్రమను ఆయన సందర్శించారు.గంటకు పైగా అక్కడ గడిపిన ఆయన ఫ్యాక్టరీ ఏర్పాటులో పురోగతిని పరిశీలించారు. అనంతరం కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. కంపెనీ ఉత్పత్తులు, నిరుద్యోగ యువతకు కల్పించనున్న ఉపాధి అవకాశాలను అడిగి తెలుసుకున్నారు. సకాలంలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కంపెనీ ప్రస్తుత, భవిష్యత్తు కార్యకలాపాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తోడ్పాటునందిస్తుందన్నారు. ఫాక్స్‌కాన్ కంపెనీ సీఈఓ, చైర్మన్ సిడ్నీ లూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రాజెక్టు పురోగతిని సీఎంకు వివరించారు.కంపెనీ నిర్వహణకు సంబంధించిన కొన్ని సమస్యలను ఆయన ప్రస్తావించగా, వాటి సత్వర పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. గ్లోబల్ టెక్నాలజీ రంగంలో పెట్టుబడులకు సరైన గమ్యస్థానంగా రాష్ట్రాన్ని బలోపేతం చేయడంలో భాగంగా సీఎం రేవంత్ ఈ పర్యటనను చేపట్టారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తదితరులు ఆయన వెంట ఉన్నారు. -
భారత్‌లో యాపిల్ నాలుగు స్టోర్లు..? ఎక్కడంటే..
ప్రపంచ దిగ్గజ సంస్థ యాపిల్ భారత్‌లో తన రిటైల్ స్టోర్లను విస్తరించాలని యోచిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ, ముంబయిలో రిటైల్ స్టోర్లను ప్రారంభించిన యాపిల్ మరో నాలుగు అవుట్లెట్లను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఉత్పత్తులకు భారీగా డిమాండ్ ఏర్పడుతుంది. అందుకు అనుగుణంగా ఉత్పాదకతను పెంచేలా కంపెనీ ఏర్పాట్లు చేస్తోంది. దేశీయంగా యాపిల్ ఉత్పత్తుల తయారీ కోసం ఫాక్స్‌కాన్, టాటా వంటి కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. సెప్టెంబర్ 20న యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దాంతో దేశంలోని ముంబయి, ఢిల్లీ స్టోర్‌ల్లో భారీగా వినియోగదారుల రద్దీ నెలకొంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థను ఆసరాగా చేసుకుని కంపెనీ రెవెన్యూ పెంచుకోవాలని ఆశిస్తుంది. దేశంలో కొత్తగా బెంగళూరు, పుణె, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబయిలో రిటైల్ స్టోర్లు ప్రారంభించాలని యోచిస్తోంది. దాంతోపాటు ‘మేడ్ ఇన్ ఇండియా’లో భాగంగా ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ను స్థానికంగా తయారు చేయాలనే ప్రతిపాదనలున్నట్లు కంపెనీ అధికారులు పేర్కొన్నారు.ఇదీ చదవండి: కేంద్రం కొత్త పథకాలు ప్రారంభం.. ఎవరికంటే..ఆపిల్ రిటైల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డెయిడ్రే ఓబ్రియన్ మాట్లాడుతూ..‘భారత్‌లో సంస్థ రిటైల్ స్టోర్లు విస్తరించాలని యోచిస్తోంది. అందుకు అనుగుణంగా మెరుగైన టీమ్‌ను సిద్ధం చేస్తున్నాం. మా కస్టమర్ల సృజనాత్మకత, అభిరుచికి అధిక ప్రాధాన్యం ఇస్తాం. వారి ఇష్టాలకు అనువుగా సరైన ఉత్పత్తులను అందించడం సంస్థ బాధ్యత. స్థానికంగా స్టోర్లను పెంచడం ద్వారా మరింత ఎక్కువ మంది వినియోగదారులకు సేవలందించే అవకాశం ఉంటుంది’ అన్నారు. -
రూ.8,357 కోట్లతో అసెంబ్లింగ్ యూనిట్!
స్మార్ట్‌ఫోన్ డిస్ప్లే మాడ్యుళ్ల అసెంబ్లింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ఫాక్స్‌కాన్ సంస్థ యోచిస్తోంది. తమిళనాడులో ప్రారంభించాలనుకుంటున్న ఈ యూనిట్ ఏర్పాటు కోసం సుమారు ఒక బిలియన్ డాలర్లు(రూ.8,357 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైనట్లు అధికారులు తెలిపారు.ఫాక్స్‌కాన్ ఇప్పటికే తమిళనాడులో యాపిల్ ఐఫోన్ ఉత్పత్తులను తయారు చేస్తోంది. వీటిని దేశీయంగా వాడడంతోపాటు, ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. తాజాగా ప్రతిపాదించిన యూనిట్ అందుబాటులోకి వస్తే చైనా వంటి దేశాల నుంచి అసెంబ్లింగ్ చేసిన డిస్ప్లే మాడ్యూల్స్‌ను దిగుమతి చేసుకునే బదులుగా స్థానికంగానే వీటిని ఉత్పత్తి చేయవచ్చు. దాంతో ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు పేర్కొన్నారు. ఈ యూనిట్ ఎలక్ట్రానిక్ అసెంబ్లీ, తయారీలో ఫాక్స్‌కాన్‌కు విలువ జోడిస్తుందని తెలిపారు. స్మార్ట్‌ఫోన్ అసెంబ్లింగ్‌లో దాదాపు 5 శాతం రెవెన్యూ ఉత్పత్తి అయితే, డిస్ప్లే అసెంబ్లింగ్‌లో అదనంగా మరో 2-3 శాతం రెవెన్యూ ఉత్పత్తి అవుతుందని నిపుణులు పేర్కొన్నారు.ఇదీ చదవండి: నూనెల ధర ఎందుకు పెరిగింది?ఫాక్స్‌కాన్ భారత్‌లో గూగుల్ పిక్సెల్ ఫోన్లను కూడా అసెంబుల్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఈమేరకు ఇరు కంపెనీల మధ్య కొంతకాలంగా చర్యలు సాగుతున్నాయి. డిస్ప్లే మాడ్యూళ్లలో ప్రధానంగా 60-65% విడిభాగాలు చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నారు. దక్షిణ కొరియా 20-25% సరఫరా చేస్తోంది. స్థానికంగా డిస్ప్లే అసెంబ్లింగ్ యూనిట్ ప్రారంభమైతే దిగుమతులు తగ్గి స్థానిక అవసరాలు తీర్చుకునే వెసులుబాటు ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
డిజైన్, టెక్నాలజీలో మహిళలకు అగ్రస్థానం
ఐఫోన్ కాంట్రాక్టు తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ తమ భారత విభాగంలో మహిళలకు ప్రాధాన్యమివ్వడంపై మరింతగా దృష్టి పెడుతోంది. మహిళలను కేవలం అసెంబ్లింగ్ విభాగానికే పరిమితం చేయకుండా డిజైన్, టెక్నాలజీ సంబంధ హోదాల్లో సారథ్యం వహించేలా చర్యలు చేపడుతున్నట్లు ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యంగ్ లియు తెలిపారు.మహిళలు తమ కెరియర్లో పురోగతి సాధించేందుకు కంపెనీ మరిన్ని అవకాశాలు కల్పిస్తున్నట్లు లియు పేర్కొన్నారు. ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో 70 శాతం మంది మహిళలు, 30 శాతం మంది పురుషులు ఉన్నారు. ఫాక్స్‌కాన్‌కు సంబంధించి భారత్‌లో మొత్తం 48,000 మంది ఉద్యోగులు ఉండగా, కొత్తగా రిక్రూట్ చేసుకున్న వారిలో 25 శాతం మంది వివాహిత మహిళలు ఉన్నట్లు లియు వివరించారు. సంస్థ ఇటీవలే చెన్నైకి దగ్గర్లోని శ్రీపెరంబుదూర్‌లో మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌ను ఆవిష్కరించింది.ఇదీ చదవండి: ప్రభుత్వ కంపెనీలకు జరిమానా!ఫాక్స్‌కాన్ రూ.25,000 కోట్లతో కర్ణాటకలో మొబైల్ తయారీ ప్లాంటును నిర్మిస్తోంది. దీనితో 40,000 పైచిలుకు ఉద్యోగాల కల్పన జరుగుతుందని అంచనా. ఎలక్ట్రిక్ వాహనాల కోసం బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ యూనిట్ ఏర్పాటు కోసం తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. -
ఏడాదిలోనే రూ.2 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం
ప్రపంచ దిగ్గజ సంస్థగా పేరున్న యాపిల్ భారత్‌లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేవలం ఇండియాలోనే రూ.2 లక్షల కోట్ల వ్యాపారం సాగించింది. దేశీయంగా ఐఫోన్లు, మ్యాక్బుక్లు, ఐప్యాడ్లు, యాపిల్ వాచ్లకు భారీ గిరాకీ ఏర్పడిందని కంపెనీ తెలిపింది. ఏడాది వ్యవధిలోనే రూ.2 లక్షల కోట్లు వ్యాపార మార్కును సాధించడానికిగల కారణాలను కంపెనీ విశ్లేషించింది.కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు ఎంతో ఉపయోగపడ్డాయి.పాక్స్‌కాన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుని తమిళనాడులో ఐఫోన్లను తయారు చేస్తోంది.2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా తయారైన రూ.1.35 లక్షల కోట్ల విలువైన ఐఫోన్లను కంపెనీ ఇతర దేశాలకు ఎగుమతి చేసింది. స్థానికంగా రూ.68,000 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.అంతర్జాతీయంగా యాపిల్ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌కు తగిన విధంగా తయారీ పెంచేందుకు ఫాక్స్కాన్తోపాటు విస్ట్రోన్, పెగాట్రాన్ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకుంది.కర్ణాటకలో యాపిల్ ఐఫోన్ తయారీ ప్లాంట్ ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’ను సిద్ధం చేస్తోంది. ఏటా ఆ ప్లాంట్‌లో దాదాపు 2 కోట్లు యూనిట్లను తయారుచేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.దేశీయంగా యాపిల్ ఉత్పత్తులను విక్రయించేందుకు ప్రత్యేకంగా ముంబయి, ఢిల్లీలో అవుట్లెట్లు ఏర్పాటు చేశారు.ఈకామర్స్ ప్లాట్‌పామ్‌లతో జతకట్టి యాపిల్ 42 శాతం ఉత్పత్తులను విక్రయిస్తోంది.ఇదీ చదవండి: చిన్న కిటుకుతో సిబిల్ స్కోర్ పెంపుప్రధానంగా యాపిల్ ప్రీమియం ఉత్పత్తులపై ఎక్కువ దృష్టి పెడుతోంది. దానివల్ల మార్జిన్ ఎక్కువగా సమకూరుతుంది.అత్యాధునిక మార్కెటింగ్‌తో పెరుగుతున్న బ్రాండ్ విలువ కంపెనీకి ఎంతో లాభం చేకూరుస్తోంది. -
భారత్‌లో ఫాక్స్‌కాన్ బ్యాటరీ స్టోరేజ్ ప్లాంట్
శ్రీపెరంబదూర్: భారత్‌లో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్టు తైవాన్‌కు చెందిన ఎల్రక్టానిక్స్ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ చైర్మన్ యాంగ్లీ ప్రకటించారు. ఎలక్ట్రిక్ వాహన విభాగంపై దృష్టితో బ్యాటరీ తయారీ వ్యాపార విస్తరణపై ఫాక్స్‌కాన్ దృష్టి సారించింది. ఈ సంస్థ ఈ–బస్‌ల కోసం తైవాన్‌లో ఇలాంటి ప్లాంట్ ఒకదాన్ని ఇప్పటికే ఏర్పాటు చేయగా, ఈ ఏడాదే ఉత్పత్తి మొదలు కానుంది. ‘‘3ప్లస్3 భవిష్యత్ పరిశ్రమ ఏర్పాటుకు వేచి చూస్తున్నాం. తమిళనాడులో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్ఎస్) ఏర్పాటు విషయంలో సహకారం ఎలా అన్నదానిపై పరిశ్రమల మంత్రితో చర్చిస్తున్నా’’ అని యాంగ్లీ తెలిపారు. సోలార్, విండ్ టర్బయిన్ల ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్‌ను నిల్వ చేసేందుకు బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థలు వీలు కలి్పస్తాయి. మన దేశం పెద్ద ఎత్తున పునరుత్పాదక ఇంధన వనరులకు ప్రాధాన్యం ఇస్తుండడం తెలిసిందే. దీంతో ఈ విభాగంలో అవకాశాలను సొంతం చేసుకునేందుకు ఫాక్స్‌కాన్ ఆసక్తిగా ఉన్నట్టు యాంగ్లీ మాటలను బట్టి తెలుస్తోంది. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిశగా ఫాక్స్‌కాన్ ప్రణాళికలు అమలు చేస్తోంది. త్వరలోనే ఈవీల తయారీ మొదలవుతుందని యాంగ్లీ తెలిపారు. భారత్‌లో ఇప్పటివరకు తాము 1.4 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశామని, వ్యాపారం 10 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందినట్లు చెప్పారు. రానున్న ఏడాది కాలంలో మరిన్ని పెట్టుబడులు పెడతామని ప్రకటించారు. ప్రస్తుత భారత పర్యటనలో భాగంగా పలు రాష్ట్రాల సీఎంలతో యాంగ్లీ సమావేశం కావడం గమనార్హం. ఎన్నో రాష్ట్రాలను సందర్శించిన తర్వాత భారత్ వృద్ధి పథకంలో ఉందని అర్థమవుతోందంటూ.. ఈ ప్రయాణంలో ఫాక్స్‌కాన్ సైతం భాగస్వామి కావాలనుకుంటున్నట్టు యాంగ్లీ చెప్పారు. -
‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’ విస్తరణపై చర్చలు
ఫాక్స్‌కాన్ కంపెనీ భవిష్యత్తు విస్తరణ అవకాశాలు ఎలా ఉన్నాయో కర్ణాటక ప్రభుత్వంతో చర్చించింది. ఈమేరకు కంపెనీ సీఈఓ యంగ్ లియు కర్ణాటకలో మొబైల్ ఫోన్ల తయారీ యూనిట్ ప్రారంభించేందుకు సీఎం సిద్ధరామయ్యతో చర్చలు జరిపారు. రాష్ట్రంలో ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’ పేరుతో ఫాక్స్‌కాన్ ఐఫోన్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించింది. అనంతరం ఐటీఐఆర్ ఇండస్ట్రీ ఏరియాలో ప్రభుత్వం 300 ఎకరాల భూమిని ఫాక్స్‌కాన్‌కు కేటాయించింది. ఈమేరకు భవిష్యత్తు విస్తరణ అవకాశాలు ఎలా ఉన్నాయనే అంశాలపై తాజాగా చర్చలు జరిగాయి.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ..‘ఫాక్స్‌కాన్‌తో రాష్ట్ర ప్రభుత్వం జతకట్టడం సంతోషంగా ఉంది. ఈ సహకారంతో స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది. ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (ఈఎస్డీఎం) రంగంలో కర్ణాటక దేశ ఎగుమతుల్లో భాగమైంది. రాష్ట్రంలో సమర్థవంతమైన లాజిస్టిక్స్, విద్యుత్ సరఫరా, నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్ ఉంది. కంపెనీలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని లాభాలు పొందాలి. దాంతోపాటు రాష్ట్రానికి మేలు చేయాలని భావిస్తున్నాం. ఫాక్స్‌కాన్ తన ప్రాజెక్ట్‌లను విజయవంతంగా అమలు చేయడానికి అవసరమైన సహాయాన్ని అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అని అన్నారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, భారీ, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి ఎంబీ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.ఇదీ చదవండి: విషపూరిత మందులు.. లక్షల్లో మరణాలు!తమిళనాడులో ఇప్పటికే ఫాక్స్‌కాన్ ఐఫోన్లను తయారు చేస్తోంది. దేశీయంగా, అంతర్జాతీయంగా యాపిల్ ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుండడంతో తయారీని పెంచాలని కంపెనీ నిర్ణయించింది. దాంతో కర్ణాటకలో ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’ పేరుతో భారీ ప్రాజెక్ట్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దొడ్డబల్లాపుర, దేవనహల్లిలో 300 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ ప్రాజెక్ట్ విలువ రూ.22,000 కోట్లుగా అంచనా వేశారు. దీనివల్ల సుమారు 40,000 మందికి ఉపాధి లభిస్తుందని కంపెనీ చెప్పింది. ఈ యూనిట్లో ఏటా రెండు కోట్ల స్మార్ట్ఫోన్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫాక్స్‌కాన్ ఇప్పటికే ‘ప్రాజెక్ట్ చీతా’ పేరుతో ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే మెకానికల్ కాంపోనెంట్ల తయారీ ప్లాంట్‌ను బెంగళూరులో ఏర్పాటు చేస్తోంది. -
ఫోర్త్‌సిటీ ఏర్పాటులో మీ విజన్ అద్భుతం
సాక్షి, న్యూఢిల్లీ: ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్లతోపాటు అన్నిరంగాల్లో విస్తరించే సత్తా హైదరాబాద్‌కు ఉందని అంతర్జాతీయ దిగ్గజ పారిశ్రామిక సంస్థ ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్‌లియూ అన్నారు. త్వరలోనే తన బృందంతో కలిసి నగరాన్ని సందర్శిస్తానని తెలిపారు. యంగ్‌లియూ నేతృత్వంలోని ఫాక్స్‌కాన్ ప్రతినిధి బృందం ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఆయన అధికారిక నివాసంలో శుక్రవారం ఉదయం సమావేశమైంది. నగరానికి ఉన్న చరిత్ర.. పారిశ్రామిక సంస్థల విస్తరణకు ఉన్న అనుకూలత, అద్భుతమైన వాతావరణ పరిస్థితులను సీఎం రేవంత్ ఫాక్స్‌కాన్ బృందానికి వివరించారు.430 ఏళ్ల కింద పునాదిరాయి పడిన హైదరాబాద్‌లో అభివృద్ధిని మరింతగా పరుగులు పెట్టించేందుకే తాము ప్రస్తుత ప్రపంచ అవసరాలకు తగినట్టు ఫ్యూచర్ సిటీ పేరుతో నాలుగోనగరానికి (ఫోర్త్ సిటీ) రూపకల్పన చేస్తున్నామని సీఎం రేవంత్ వివరించారు. ఫోర్త్ సిటీలో విద్య. వైద్యం, క్రీడా, ఎలక్ట్రానిక్స్–ఎలక్ట్రికల్, స్కిల్స్..ఇలా బహుముఖంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఫోర్త్ సిటీలో ఫాక్స్‌కాన్ సంస్థ పరిశ్రమలు పెట్టేందుకు అవసరమైన అన్ని అనుమతులు ఇవ్వడంతోపాటు అవసరమైన మద్దతు అందజేస్తామని సీఎం ఫాక్స్‌కాన్ చైర్మన్‌కు హామీ ఇచ్చారు. ఫోర్త్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అందిస్తున్న ప్రోత్సాహకాలు, ఇటీవల సీఎం రేవంత్ నేతృత్వంలో తమ బృందం అమెరికా, దక్షిణకొరియాలో పర్యటించి దిగ్గజ పారిశ్రామిక సంస్థలతో జరిపిన చర్చలు, చేసుకున్న ఒప్పందాలను మంత్రి శ్రీధర్ బాబు యంగ్లియూకి వివరించారు.ఫోర్త్ సిటీ రూపకల్పనలో ముఖ్యమంత్రి దార్శనికత, పారిశ్రామిక అనుకూల విధానాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని యంగ్‌లియూ రేవంత్‌ను అభినందించారు. తాను సాధ్యమైనంత త్వరలోనే హైదరాబాద్‌ను సందర్శిస్తానని.. అంతకుముందే తమ చీఫ్ క్యాంపస్ ఆపరేషన్స్ ఆఫీసర్ క్యాథీ యాంగ్, సంస్థ భారత దేశ ప్రతినిధి వీలీ నేతృత్వంలోని బృందం హైదరాబాద్ వస్తుందని చెప్పారు.ప్రస్తుత ప్రపంచానికి అవసరమైన స్కిల్స్‌ను యువతకు అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ప్రారంభిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి ఫాక్స్‌కాన్ చైర్మన్‌కు వివరించారు. ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శులు జయేశ్ రంజన్, డాక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి , ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డిలతో పాటు డాక్టర్ ఎస్.కే. శర్మ, బాబ్చెన్, జొవూ, సూషొకూ, సైమన్సంగ్ తదితరులు పాల్గొన్నారు. -
భారత్‌లో ఐప్యాడ్ తయారీ..?
భారత్‌లో యాపిల్ ఉత్పత్తులను తయారుచేస్తున్న ఫాక్స్‌కాన్ తన కార్యకలాపాలను విస్తరించాలని యోచిస్తోంది. ప్రస్తుతం తమిళనాడు యూనిట్లో యాపిల్ ఐఫోన్లను తయారుచేస్తున్న కంపెనీ త్వరలో ఐప్యాడ్లను కూడా అసెంబుల్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ మేరకు త్వరలో కంపెనీ నుంచి ప్రకటన విడుదల కావొచ్చని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు తెలిపారు.యాపిల్ భారత్‌లో మరిన్ని ఉత్పత్తులను తయారుచేసేందుకు ఆసక్తిగా ఉందని గతంలోనే ప్రకటించింది. ఇప్పటికే ముంబయి, దిల్లీలో ప్రత్యేకంగా యాపిల్ అవుట్లెట్లను ప్రారంభించింది. తమిళనాడులో ఫాక్స్‌కాన్ ద్వారా ఐఫోన్లను తయారు చేస్తోంది. ఆ యూనిట్‌లోని పరికరాల్లో కొన్నింటిని అప్‌గ్రేడ్ చేసి ఐప్యాడ్లను తయారు చేయవచ్చని నిపుణులు సూచించినట్లు తెలిసింది. అందుకు సంస్థ కూడా ఆమోదం తెలిపిందని కొందరు అధికారులు చెప్పారు. త్వరలో దీనిపై కంపెనీ స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. యాపిల్ ఉత్పత్తుల తయారీకి సంబంధించి పూర్తిగా చైనాపైనే ఆధారపడకుండా విభిన్న ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. అందులో భాగంగా ఐప్యాడ్ తయారీలో కొంత భాగాన్ని గత సంవత్సరం వియత్నాంకు మళ్లించారు.తమిళనాడులో కొత్త యూనిట్ కోసం భారత్‌కు చెందిన ఓ సంస్థ రూ.1,200 కోట్లు వెచ్చిస్తున్నట్లు ఫాక్స్‌కాన్ ఫిబ్రవరిలో ప్రకటించింది. బడ్జెట్ 2024-25లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బేసిక్ కస్టమ్స్ డ్యూటీను 20 శాతం నుంచి 15 శాతానికి తగ్గిస్తున్నట్లు చెప్పారు. దాంతో దేశీయ తయారీకి ప్రోత్సహం లభించనుంది. యాపిల్ సంస్థ ఫాక్స్‌కాన్ ద్వారా భారత్‌లో ఐప్యాడ్ల ఉత్పత్తి ప్రారంభిస్తే స్థానికంగా మరింత మంది ఉపాధి పొందుతారని నిపుణులు చెబుతున్నారు. దాంతోపాటు అంతర్జాతీయంగా భారత్‌లో తయారైన ఉత్పత్తులను ఎగుమతి చేసి సొమ్ము చేసుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల(పీఎల్ఐ) వల్ల కూడా దేశీయ తయారీని పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెబుతున్నారు.ఇదీ చదవండి: భారమవుతున్న విద్యారుణాలు!ట్రెండ్‌ఫోర్స్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ బోయ్స్ ఫ్యాన్ మాట్లాడుతూ..‘భారత్‌లో ఐప్యాడ్ ఉత్పత్తిని చేపట్టడం వల్ల సప్లై-చైన్ డిమాండ్‌ను భర్తీ చేయవచ్చు. దేశీయంగా యాపిల్ ఉత్పతులకు మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా ఐప్యాడ్ ఎగుమతులు 49 మిలియన్ల(4.9 కోట్లు)కు చేరుకుంటాయని అంచనా’ అని తెలిపారు. -
‘ఓలా అలా కాదు’.. మహిళా నియామకాలపై భవిష్ అగర్వాల్
ఫాక్స్‌కాన్ నియామక పద్ధతులపై వచ్చిన వార్తలపై ఓలా వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ భవీష్ అగర్వాల్ స్పందించారు. తమ కొత్త కర్మాగారాల్లో వివాహితలతో సహా మహిళల నియామకం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. వివాహితలను నియమించుకోవడంపై ఓలాకు ఎటువంటి వ్యతిరేక విధానం లేదని అగర్వాల్ పేర్కొన్నారు.ఇటీవల ఓ మీడియా సమావేశంలో భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ.. 'మహిళలు ఎక్కువ క్రమశిక్షణ, నైపుణ్యంతో ఉంటారు. మేము మా కర్మాగారాలలో మహిళా శ్రామిక శక్తిని నియమించడం కొనసాగిస్తాం. పెళ్లైన మహిళలను నియమించుకోకూడదనే ఫాక్స్‌కాన్ లాంటి విధానాలు మా దగ్గర లేవు’ అన్నారు.భారత్‌లో మహిళా శ్రామిక శక్తి తక్కువగా ఉందని, దీనిని పరిష్కరించడానికి తమ వంతు కృషి చేస్తున్నామని భవిష్ అగర్వాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం జూనియర్ స్థాయి ఉద్యోగాల్లో మహిళలను ఎక్కువగా నియమించుకుంటున్నామని, సీనియర్ మేనేజ్మెంట్ స్థాయిలో కూడా మరింత మంది మహిళలను నియమించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు.కాగా మహిళా శ్రామిక శక్తిని పెంపొందించడంపై ఓలా ఎలక్ట్రిక్ గతంలోనే తమ వైఖరిని ప్రకటించింది. "ఈ రోజు, ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీని పూర్తిగా మహిళలే నడుపుతారని ప్రకటించడానికి నేను గర్విస్తున్నాను. ఈ వారం మేము మొదటి బ్యాచ్ ను స్వాగతించాం. పూర్తి సామర్థ్యంతో, ఫ్యూచర్ ఫ్యాక్టరీ 10,000 మందికి పైగా మహిళలకు ఉపాధి కల్పిస్తుంది, ఇది మహిళలకు మాత్రమే పనిచేసే ప్రపంచంలోనే అతిపెద్ద కర్మాగారం, ఏకైక మహిళా ఆటోమోటివ్ తయారీ కేంద్రంగా మారుతుంది'' అని బ్లాగ్ పోస్ట్‌లో భవిష్ అగర్వాల్ పేర్కొన్నారు.యాపిల్ ఉత్పత్తుల అతిపెద్ద సరఫరాదారు అయిన ఫాక్స్‌కాన్ భారత్‌లోని తన ఐఫోన్ కర్మాగారంలో వివాహిత మహిళలను ఉద్యోగాలకు తిరస్కరిస్తున్నట్లు ఇటీవలి పరిశోధనాత్మక నివేదిక బహిర్గతం చేసింది. తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో ఉన్న ప్రధాన ఐఫోన్ అసెంబ్లింగ్ ఫ్యాక్టరీలో వివాహిత మహిళలను ఉద్యోగావకాశాల నుంచి తప్పించారని నివేదిక ఆరోపించింది. -
తైవాన్ వ్యక్తికి పద్మభూషణ్ - ఎవరీ యంగ్ లియు!
Foxconn CEO Young Liu: 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం 132 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. అవార్డు గ్రహీతలలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయడు, మెగాస్టార్ చిరంజీవితో పాటు తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ కంపెనీ సీఈఓ 'యంగ్ లియు' (Young Liu) ను కూడా పద్మభూషణ్ వరించింది. 66 ఏళ్ల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO).. తైవాన్‌కు చెందిన హాన్ హై టెక్నాలజీ గ్రూప్ (ఫాక్స్‌కాన్) చైర్మన్ 'యంగ్ లియు' నాలుగు దశాబ్దాల కాలంలో మూడు కంపెనీలను స్థాపించారు. ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో యంగ్ లియుకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించింది. యంగ్ లియు స్థాపించిన మూడు కంపెనీలలో యంగ్ మైక్రో సిస్టమ్స్ అని పిలువబడే మదర్బోర్డ్ కంపెనీ (1988), నార్త్‌బ్రిడ్జ్ అండ్ సౌత్‌బ్రిడ్జ్ ఐసీ డిజైన్ కంపెనీ (1995), ఐటీఈ టెక్ అండ్ ఏడీఎస్ఎల్ ఐసీ డిజైన్ కంపెనీ (1997) ఉన్నాయి. తైవాన్‌కు చెందిన యంగ్ లియు 1978లో తైవాన్‌లోని నేషనల్ చియావో తుంగ్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రోఫిజిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి, ఆ తరువాత సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందాడు. భారతదేశంలో ఫాక్స్‌కాన్ ఉనికి భారతదేశంలో.. ముఖ్యంగా దక్షిణ ప్రాంతంలో గణనీయమైన పెట్టుబడులు, వెంచర్లతో తన ఉనికిని వేగంగా విస్తరిస్తున్న కంపెనీల జాబితాలో ఫాక్స్‌కాన్ ఒకటిగా ఉంది. ఈ సంస్థ తమిళనాడులో ఐఫోన్ తయారీ యూనిట్ ఏర్పాటు చేసింది. ఇందులో సుమారు 40000 మంది పనిచేస్తున్నారు. ఫాక్స్‌కాన్ సంస్థ బెంగళూరు శివార్లలో యూనిట్‌ను నెలకొల్పడానికి కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి కూడా సుముఖత చూపిస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా కొత్త నిర్మాణ ప్రాజెక్టుల కోసం 1.6 బిలియన్ డాలర్ల గణనీయమైన పెట్టుబడితో భారతదేశంలో తన ఉనికిని విస్తృతం చేయబోతున్నట్లు ఫాక్స్‌కాన్ సీనియర్ అధికారి గత సంవత్సరం తెలిపారు. దీన్ని బట్టి చూస్తే రానున్న రోజుల్లో ఫాక్స్‌కాన్ దేశంలో విస్తృత సేవలను అందించనున్నట్లు సమాచారం. పద్మ అవార్డ్స్ 2024 కేంద్రం ప్రకటించిన మొత్తం పద్మ అవార్డులలో 5 పద్మవిభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. అవార్డు గ్రహీతలలో 30 మంది మహిళలు, 8 మంది విదేశీయులు / NRI / PIO / OCI వర్గానికి చెందిన వారు, 9 మంది మరణానంతర అవార్డు గ్రహీతలు ఉన్నారు. విదేశీయులకు పద్మ అవార్డులు ఎందుకిస్తారంటే! కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న పద్మ అవార్డ్స్ వెబ్సైట్ ప్రకారం.. ప్రతిష్టాత్మక పద్మ అవార్డులను కేవలం భారతీయులకు మాత్రమే ఇవ్వాలనే నిబంధన లేదు. దేశంలో కళలు, సాహిత్యం, విద్య, సామాజిక సేవ, సైన్స్, ఇంజనీరింగ్, ప్రజా వ్యవహారాలు, క్రీడలు, వైద్యం, పౌర సేవ, వాణిజ్యం, పరిశ్రమలతో సహా అనేక రంగాలలో విశిష్టమైన, అసాధారణమైన సేవలందించిన ఎవరికైనా పద్మ అవార్డులు ప్రకటిస్తారు. ఈ ఏడాది ఈ విభాగంలో 8 మంది ఉన్నట్లు తెలుస్తోంది. -
రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలుపుతాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పారిశ్రామిక రంగాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రకటించారు. పారిశ్రామికరంగ అభివృద్ధిలో భాగంగా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు సులభంగా లభించేలా చూస్తామని, మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్‌కు చెందిన హాన్‌హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీ కంపెనీ లిమిటెడ్ ప్రతినిధి వీ లీ నేతృత్వంలోని బృందం మంగళవారం సచివాలయంలో సీఎం రేవంత్‌ను కలిసింది. ఈ భేటీలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో ఫాక్స్‌కాన్ చేపట్టిన ప్రాజెక్టు పురోగతిపై చర్చించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా రేవంత్ పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అభివృద్ధిని వేగవంతం చేస్తామని, అన్ని రంగాలను ప్రోత్సహించేందుకు స్నేహపూర్వక విధానాలు అవలంబిస్తామని చెప్పారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందన్నారు. కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్ ఉత్పాదక కేంద్రం నిర్వహణకు, ఫాక్స్‌కాన్ రాష్ట్రంలో చేపట్టే భవిష్యత్తు ప్రాజెక్టులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. రెండేళ్లలో 25 వేల ఉద్యోగాలు... ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థగా పేరొందిన ఫాక్స్‌కాన్‌కు యాపిల్ ఐఫోన్‌తోపాటు గూగుల్, షియోమీ, అమెజాన్, హ్యూలెట్ పాకర్డ్, అలీబాబా, సిస్కో, ఫేస్బుక్, సోనీ, మైక్రోసాఫ్ట్, నోకియా వంటి దిగ్గజ కంపెనీలు కస్టమర్లుగా ఉన్నాయి. చైనా, వియత్నాం, థాయ్‌లాండ్, మలేసియా, అమెరికా, యూరప్, భారత్ సహా 24 దేశాల్లో ఫాక్స్‌కాన్ కార్యకలాపాలు సాగిస్తోంది. భారత్‌లో శ్రీసిటీ (ఏపీ), శ్రీపెరంబదూర్ (తమిళనాడు), బెంగళూరు (కర్ణాటక)తోపాటు తెలంగాణ (కొంగరకలాన్)లో ఉత్పాదక కేంద్రాలు ఉన్నాయి. యాపిల్ ఐఫోన్లకు ఇయర్‌పాడ్స్ తయారీకి సంబంధించి తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహించేందుకు ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర ప్రభుత్వంతో ఫాక్స్‌కాన్ ఒప్పందం కుదుర్చుకుంది. ప్లాంటు నిర్మాణం కోసం ఈ ఏడాది మే 15న శంకుస్థాపన చేసింది. కొంగరకలాన్ ప్లాంటు ద్వారా దశలవారీగా లక్ష ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే రెండేళ్లలో ఫాక్స్‌కాన్ కొంగరకలాన్ యూనిట్ ద్వారా 25 వేల ఉద్యోగాల కల్పన జరగనుంది. -
దేశంలో నిలిచిన ఐఫోన్ల తయారీ.. కారణం చెప్పిన ఫాక్స్‌కాన్
ప్రపంచ దిగ్గజ సంస్థ యాపిల్ తన ఐఫోన్ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని చైనా నుంచి ఇండియాకు మార్చిన సంగతి తెలిసిందే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ఇండియా వేగంగా అభివృద్ధి చెందుతోంది. దాంతో చైనా తర్వాత ఇతర దేశాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్న గ్లోబల్ కంపెనీలకు భారత్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అందువల్లే యాపిల్ సంస్థ దేశంలోని చెన్నైలో తైవాన్ కంపెనీ ఫాక్స్‌కాన్ ద్వారా ఐఫోన్లు తయారుచేస్తోంది. కానీ ప్రస్తుతం అది నిలిచిపోయింది. అందుకుగల కారణాలు ఎంటో ఈ కథనంలో తెలుసుకుందాం. తైవాన్ టెక్ కంపెనీ ఫాక్స్‌కాన్ యాపిల్ ఐఫోన్లను మన దేశంలోని చెన్నైలో తయారు చేస్తోంది. అయితే తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కంపెనీ తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. అక్కడి పరిస్థితులు ఇంకా కొలిక్కి రాకపోవటంతో ఐఫోన్ల నిలిపివేత ఇంకా కొనసాగుతోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించాక ఉత్పత్తి తిరిగి ప్రారంభిస్తామని సంస్థ వర్గాలు తెలిపాయి. తమిళనాడు వ్యాప్తంగా మిచౌంగ్ తుపాను వల్ల కురుస్తోన్న కుండపోత వర్షాలతో చెన్నైలోని ఫాక్స్‌కాన్ ప్లాంట్ వరదల్లో మునిగిపోయింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఫాక్స్‌కాన్, పెగాట్రాన్ చెన్నై సమీపంలోని తమ ఫ్యాక్టరీల్లో ఐఫోన్ ఉత్పత్తిని నిలిపివేసాయి. నగరంలోని అనేక ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీళ్లు చేరుకోవడంతో రవాణాకు తీవ్ర అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఇదీ చదవండి: తగ్గిన డీజిల్ అమ్మకాలు.. కారణం ఇదే.. చైనా నుంచి ఐఫోన్ తయారీని మార్చాలనే క్రమంలో యాపిల్ తన ఉత్పత్తిని 2020లో ఇండియాకు షిఫ్ట్ చేసింది. ఇప్పుడు భారతదేశం ఐఫోన్ ఉత్పత్తిలో సుమారు 7 శాతం వాటాను కలిగి ఉంది. అయితే 2025 నాటికి కంపెనీ తన ఉత్పత్తిని 25 శాతానికి పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ లక్ష్యాన్ని అందుకునే దిశగా కంపెనీ తన ప్రయత్నాలను కొనసాగిస్తోంది. ప్రస్తుతం కంపెనీలో దాదాపు 35,000 ఉద్యోగులు పనిచేస్తున్నారు. గడిచిన రెండో త్రైమాసికం(సెప్టెంబర్)లో 25 లక్షల యూనిట్లను తయారుచేసినట్లు తెలిసింది. -
భారత్‌లో మరో 1.6 బిలియన్ డాలర్లు
ముంబై: ఐఫోన్ల కాంట్రాక్ట్ తయారీ సంస్థ, తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫాక్స్‌కాన్ భారత్‌లో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించడంపై దృష్టి పెడుతోంది. ఈ క్రమంలో తాజాగా మరో 1.6 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 13 వేల కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు తైవాన్‌లోని స్టాక్ ఎక్స్చేంజీలకు సంస్థ తెలియజేసింది. భారత్‌లోని తమ అనుబంధ సంస్థ హోన్ హాయ్ టెక్నాలజీ ఇండియా మెగా డెవలప్మెంట్ ద్వారా పెట్టుబడులు పెట్టనున్నట్లు పేర్కొంది. చైనాకు మాత్రమే పరిమితం కాకుండా కార్యకలాపాలను ఇతర దేశాలకు కూడా మళ్లించే వ్యూహంలో భాగంగా (చైనా ప్లస్ వన్) కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా–చైనా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండటం తరచుగా సమస్యలకు దారి తీస్తున్న నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. ఫాక్స్‌కాన్ ఇప్పటికే భారత్‌లో దాదాపు 8 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. భారత మార్కెట్లో అవకాశాల రీత్యా ఇక్కడ తమ పెట్టుబడులను గతేడాదితో పోలిస్తే మరింతగా పెంచుకునే అవకాశం ఉందని కంపెనీ చైర్మన్ యంగ్ లియు ఇటీవలే తెలిపారు. ఐఫోన్ల తయారీలో టాప్.. అమెరికా టెక్ దిగ్గజం యాపిల్‌కు అత్యధికంగా ఐఫోన్లను సరఫరా చేసే కాంట్రాక్ట్ తయారీ సంస్థల్లో ఫాక్స్కాన్ది అగ్రస్థానం. భారత్‌లోనూ పోటీ సంస్థలైన టాటా, పెగాట్రాన్‌కు మించి ఉత్పత్తి చేస్తోంది. ఫాక్స్‌కాన్ ఆదాయంలో దాదాపు సగభాగం ఐఫోన్ల తయారీ ద్వారానే ఉంటోంది. కంపెనీకి భారత్‌లో 40,000 మంది పైగా వర్కర్లు ఉన్నారు. ఇక్కడ మొత్తం 30 ఫ్యాక్టరీలు ఉండగా, ఏటా దాదాపు 10 బిలియన్ డాలర్ల ఆదాయం వస్తోంది. 2022లో ఫాక్స్‌కాన్ ఆదాయం 216 బిలియన్ డాలర్లు కాగా అందులో భారత విభాగం వాటా 4.6%గా నమోదైంది. అంతక్రితం ఏడాది 2021లో ఇది 2%గా ఉండేది. తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఎల్రక్టానిక్ పరికరాల తయారీ కోసం మరో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని ఫాక్స్‌కాన్ యోచిస్తోంది. అటు కర్ణాటకలో రూ. 8,800 కోట్లతో ఐఫోన్ విడిభాగాల యూనిట్ నెలకొల్పే యోచన కూడా ఉంది. ఇందుకు తుమకూరులోని జపాన్ ఇండస్ట్రియల్ టౌన్షిప్లో స్థలాన్ని కూడా అధికారులు పరిశీలించినట్లు సమాచారం. కొత్తగా ప్రతిపాదించిన 1.6 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళికల్లోనే ఈ ఇన్వెస్ట్మెంట్ కూడా భాగంగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీతో కొత్తగా 14,000 పైచిలుకు ఉద్యోగాల కల్పన జరగవచ్చని అంచనా. ఇందులో ఫోన్ స్క్రీన్లు, వెలుపలి కవరింగ్‌లు తయారు చేసే అవకాశం ఉంది. సెమీకండక్టర్లపైనా దృష్టి.. భారత్‌లో తొలి సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ఫాక్స్‌కాన్ సైతం పోటీపడుతోంది. ఇందుకోసం ముందుగా వేదాంత సంస్థతో జట్టు కట్టినప్పటికీ, తర్వాత ఆ జాయింట్ వెంచర్ నుంచి పక్కకు తప్పుకుంది. భారతీయ భాగస్వామి అవసరం లేకుండా సొంతంగానే ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తోంది. ఇందుకు సంబంధించి తమ ఫ్యాబ్ యూనిట్ ప్లాన్‌కి ఆమోదం పొందేందుకు ప్రభుత్వంతో చర్చలు కూడా జరుపుతున్నట్లు కంపెనీ గతంలో తెలిపింది. -
27 సంస్థలకు ఐటీ హార్డ్‌వేర్ పీఎల్ఐ స్కీము
న్యూఢిల్లీ: దేశీయంగా ఐటీ హార్డ్‌వేర్ తయారీని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) స్కీము కింద 27 సంస్థలు ఎంపికయ్యాయి. అనుమతి పొందిన వాటిలో డెల్, హెచ్‌పీ, ఫ్లెక్స్‌ట్రానిక్స్, ఫాక్స్‌కాన్ మొదలైన కంపెనీలు ఉన్నాయి. ఈ సంస్థల్లో 95 శాతం కంపెనీలు (23) ఇప్పటికే తయారీకి సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మిగతా నాలుగు కంపెనీలు వచ్చే 90 రోజుల్లో ఉత్పత్తి ప్రారంభించగలవని ఆయన వివరించారు. ‘ఈ 27 దరఖాస్తులతో దాదాపు రూ. 3,000 కోట్ల మేర పెట్టుబడులు రాగలవు. అంతకన్నా ముఖ్యంగా విలువను జోడించే ఉత్పత్తుల తయారీ వ్యవస్థ భారత్ వైపు మళ్లగలదు‘ అని మంత్రి పేర్కొన్నారు. పీసీలు, సర్వర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు వంటి ఐటీ హార్డ్‌వేర్ తయారీలో భారత్ దిగ్గజంగా ఎదిగేందుకు ఇది తోడ్పడగలదని వివరించారు. అదనంగా రూ. 3.5 లక్షల కోట్ల విలువ చేసే ఉత్పత్తుల తయారీకి, ప్రత్యక్షంగా 50,000 మంది .. పరోక్షగా 1.5 లక్షల మంది ఉపాధి పొందడానికి స్కీము దోహదపడగలదని మంత్రి చెప్పారు. -
మోదీజీ..వచ్చే ఏడాదికి గొప్ప బర్త్‌డే గిఫ్ట్: ఫాక్స్‌కాన్ పోస్ట్ వైరల్
యాపిల్ ఐఫోన్ తయారీదారు తైవాన్‌కు చెందిన పాక్స్కాన్(Foxconn) దేశంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించనుంది. భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాలలో దాని తయారీ సౌకర్యాలను వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భారీగా ఉద్యోగావకాశాలను కల్పించనుంది. భారతదేశంలో తన ఉద్యోగులను రెట్టింపు చేయాలని నిర్ణయించింది ఫాక్స్‌కాన్ ప్రతినిది లింక్డ్ఇన్ ఖాతా ద్వారా ఈవిషయాన్ని స్వయంగా ప్రకటించారు. ఆదివారం ప్రధానమంద్రి నరేంద్ర మోదీ 73వ పుట్టినరోజు సందర్భంగా ఫాక్స్‌కాన్ ప్రతినిధి వి లీ ఈ విషయాన్నిఅధికారికంగా ప్రకటించారు. "హ్యాపీ బర్త్‌డే, గౌరవ ప్రధానమంత్రి. మీ నాయకత్వంలో ఫాక్స్‌కాన్ భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందింది. వచ్చే ఏడాది గొప్ప బహుమతి అందించేలా మరిన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, దేశంలో వ్యాపార వృద్ధితోపాటు, రెట్టింపు ఉపాధిని అందించే లక్ష్యంతో మరింత కష్టపడి పని చేస్తామంటూ ప్రకటించారు. చైనాఆంక్షల నేపథ్యంలో అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ ఇండియాపై దృష్టిపెడుతోంది. తద్వారా ఐఫోన్ విక్రయాలకు పెద్ద మార్కెట్‌గా ఉన్న చైనాపై ఆధార పడటాన్ని తగ్గించాలని కంపెనీ చూస్తోంది. తమిళనాడు ప్లాంట్‌లో ఇప్పటికే 40వేల మంది ఉద్యోగులను నియమించుకుంది. (మ్యూచువల్ ఫండ్స్‌లో ఎన్నో అవకాశాలు..కానీ వాటిని నమ్మొద్దు!) ఫాక్స్‌కాన్ ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద కాంట్రాక్ట్ తయారీదారుగా ఉన్న సంగతి తెలిసిందే. ఆగస్టులో, ఫాక్స్‌కాన్ రాష్ట్రంలోని రెండు ప్రాజెక్టులలో 600 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కర్ణాటక ప్రకటించింది. ఇక్కడ ఐఫోన్ల కేసింగ్ కాంపోనెంట్స్ , చిప్ తయారీకి సంబంధించిన పరికరాల ఉత్పత్తికానున్నాయి. మరోవైపు తెలంగాణలోఇటీవల మరో 400 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. దీంతో ఆ సంస్థ మొత్తం 550 మిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టనుంది. (గణేష్ చతుర్థి: ఈ మూడు రోజులు సెలవులేనా? ఇవిగో వివరాలు) గత నెలలో ఎర్నింగ్స్ బ్రీఫింగ్ సందర్భంగా, ఫాక్స్‌కాన్ ఛైర్మన్ లియు యంగ్-వే ఇండియా మార్కెట్‌పై భారీ ఆశలే ప్రకటించారు. మల్టీ బిలియన్ డాలర్ల పెట్టుబడులు ప్రారంభం మాత్రమేనని పేర్కొనడం గమనార్హం. -
భారత్‌లో ఫాక్స్‌కాన్ ఈవీ ప్లాంట్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తైవాన్‌కు చెందిన చిప్ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ భావిస్తోంది. అయితే ఫాక్స్‌కాన్ ఇతర ఈవీ కంపెనీల కోసం కాంట్రాక్ట్ తయారీ చేపడుతుందా లేదా సొంత బ్రాండ్ కింద మోడళ్లను విక్రయించబోతోందా అనే విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి తమిళనాడును తమ స్థావరంగా ఉపయోగించుకోవాలని ఫాక్స్‌కాన్ చైర్మన్ చర్చించినట్లు తెలుస్తోంది.ఫాక్స్‌కాన్ మాతృ సంస్థ హాన్ హాయ్ టెక్నాలజీ గ్రూప్ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యంగ్ లేయో యూఎస్‌లోని ఓహియోతోపాటు థాయ్‌లాండ్‌లో ఈవీ ప్లాంటు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని అలాగే అతి త్వరలో భారత్‌లో కూడా ఈవీ ఫ్యాక్టరీని నిర్మిస్తాం అని తెలిపారు. -
చైనాకు షాకిచ్చిన యాపిల్ సంస్థ..భారత్ లో ఐఫోన్15 సిరీస్ ఫోన్ల తయారీ..
-
యాపిల్ కీలక నిర్ణయం.. చైనా గొంతులో పచ్చి వెలక్కాయ?!
ప్రపంచ వ్యాప్తంగా 85 శాతం ఐఫోన్ల తయారీతో గుత్తాదిపత్యం వహిస్తున్న డ్రాగన్ కంట్రీకి భారీ షాక్ తగలనుందా? తాజాగా, యాపిల్ తీసుకున్న నిర్ణయం చైనా గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లు అయ్యిందా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. ఐఫోన్ల తయారీలో ప్రధాన దేశమైన చైనాకు, యాపిల్ ప్రొడక్ట్‌ల తయారీ, సరఫరా, అమ్మకాలు, సర్వీసింగ్ వంటి విభాగాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న భారత్‌కు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ కీలక నిర్ణయం తీసుకుంది. చైనాను కాదనుకొని భారత్‌లో ఐఫోన్ 15ను భారీ ఎత్తున తయారు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలో తమిళనాడు పెరంబదూర్ కేంద్రంగా ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్‌కు ప్లాంట్‌లో గతంలో కంటే ఎక్కువగానే ఈ లేటెస్ట్ ఐఫోన్లను తయారు చేయనుంది. చైనాలో తయారైన యాపిల్ ప్రొడక్ట్‌లు ఇతర దేశాలకు దిగుమతి చేసిన వారం రోజుల తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. అప్రమత్తమైన టిమ్‌కుక్ యాపిల్ సంస్థ గత కొన్నేళ్లుగా చైనాలో తన ఉత్పత్తుల్ని తయారీ, అమ్మకాలు నిర్వహిస్తుంది. అయితే, డ్రాగన్ కంట్రీలో సప్లయి చైన్ సమస్యలు, అమెరికా - చైనాల మధ్య తగ్గిపోతున్న వ్యాపార సత్సంబంధాలు, అదే సమయంలో తయారీ కేంద్రంగా ఎదిగేందుకు ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా అమెరికాతో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకుని, తనను తాను తయారీ కేంద్రంగా మార్చుకోవాలని కోరింది. ఇలా వరుస పరిణామాలతో యాపిల్ సీఈవో టిమ్‌కుక్ అలెర్ట్ అయ్యారు. చైనాలో వ్యాపారం ఎప్పటికైనా ప్రమాదమనే ఓ అంచనాకు వచ్చిన యాపిల్ గత కొన్నేళ్లుగా తన వ్యాపారాన్ని ప్రపంచ దేశాలకు విస్తరిస్తుంది. ఇందులో భాగంగా భారత్‌లో ఐఫోన్ 15 తయారీని ప్రారంభించనుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. చైనా నుంచి భారత్‌కు చైనాలో సప్లయి చైన్ సమస్యలతో యాపిల్ తన తయారీని భారత్‌కు తరలించాలని భావించింది. కాబట్టే గత ఏడాది భారత్‌లో తయారైన యాపిల్ ఐఫోన్ షిప్మెంట్ విలువ 65 శాతం పెరిగింది. ఐఫోన్ల విలువ 162 శాతం పెరిగిందంటూ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది. ఆ నివేదికను ఊటంకిస్తూ ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ మరో రిపోర్ట్‌ను వెలుగులోకి తెచ్చింది. 2022లో భారత్‌లో మొత్తం స్మార్ట్‌ఫోన్ షిప్మెంట్ విలువలో యాపిల్‌కు 25 శాతం వాటాను కలిగి ఉందని వెల్లడించింది. ఈ వృద్ది రేటు 2021లో 12 శాతం నుండి పెరిగినట్లు మరికొన్ని సంస్థలు నివేదించాయి. ప్రమాదం అంచున చైనా ఆధిపత్యం ప్రపంచ వ్యాప్తంగా 85 శాతం ఐఫోన్లను చైనానే తయారు చేస్తుందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదికలో టెక్నాలజీ రిపోర్టర్ జిన్మీ షెన్ తెలిపారు. అయినప్పటికీ, యాపిల్ తన తయారీని చైనా నుంచి బయట (ముఖ్యంగా భారత్‌కు) దేశాలకు తరలించాలని భావిస్తున్నందున బీజింగ్ తన ఆధిపత్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని టెక్నాలజీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉 ప్రపంచ చరిత్రలో నష్ట జాతకుడు ఇతనే! -
ఎయిర్‌పాడ్స్ ఇక మేడ్ ఇన్ ఇండియా.. హైదరాబాద్‌లోనే తయారీ
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ కోసం వైర్లెస్ ఇయర్‌బడ్స్ (ఎయిర్‌పాడ్స్)ను ఫాక్స్‌కాన్ తమ హైదరాబాద్ ప్లాంటులో తయారు చేయనుంది. 2024 డిసెంబర్ నాటికి భారీ స్థాయిలో వీటి ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ ప్లాంటుపై ఫాక్స్‌కాన్ దాదాపు 400 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తోంది. ఐఫోన్ల తర్వాత యాపిల్ పోర్ట్‌ఫోలియోలో అత్యధికంగా అమ్ముడయ్యే ఉత్పత్తుల్లో ఎయిర్పాడ్లు రెండో స్థానంలో ఉన్నాయి. ట్రూ వైర్లెస్ స్టీరియో (టీడబ్ల్యూఎస్) మార్కెట్లో 36 శాతం వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. మరోవైపు, తమ ప్రణాళికలను సక్రమంగా అమలు చేయగలిగితే భారత్‌లో బిలియన్ల కొద్దీ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయని కంపెనీ రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా హోన్ హాయ్ టెక్నాలజీ గ్రూప్ (ఫాక్స్‌కాన్) చైర్మన్ యంగ్ లియు తెలిపారు. వార్షిక ప్రాతిపదికన భారత్‌లోని తమ విభాగం 10 బిలియన్ డాలర్ల పైగా టర్నోవరు సాధించినట్లు వివరించారు. -
భారత్‌లో ఫాక్స్‌కాన్.. 500 మిలియన్ల పెట్టుబడికి గ్రీన్ సిగ్నల్
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్‌కు ఐఫోన్లను తయారీ చేసి సరఫరా చేసే ఫాక్స్‌కాన్ టెక్నాలజీ సంస్థ భారత్ రెండు మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్లను నిర్మించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఏకంగా 500 మిలియన్ల పెట్టుబడి పెట్టే యోచనలో ఉందంటూ బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఫాక్స్‌కాన్ ఈ తయారీ యూనిట్లను కర్ణాటకలో నిర్మించనుండగా..ఒక ఫ్యాక్టరీ ఐఫోన్ల తయారీ, రెండో ఫ్యాక్టరీలో యాపిల్‌కు విడిభాగాలు ఉత్పత్తి చేయనుందని నివేదిక పేర్కొంది. అయితే, ఏ రాష్ట్రంలో ఫ్యాక్టరీలను నిర్మించాలనే అంశంపై ఫాక్స్‌కాన్ స్పష్టత ఇచ్చినప్పటికీ.. ప్రాంతం ఎక్కడనేది నిర్ణయించలేదు. ఈ వారంలో ప్లాంట్ ఏర్పాటుకు కావాల్సిన అనువైన ప్రాంతంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ ఏడాది మార్చిలో కర్నాటకలో ఫాక్స్ కాన్ యూనిట్ కోసం 80 బిలియన్ రూపాయల ($972.88 మిలియన్లు) పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించింది. చైనా కంటే భారత్‌లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్‌కాన్ కంపెనీ సిద్ధమైంది. తమిళనాడులో ఎలక్ట్రానిక్ వస్తువుల విడిభాగాల తయారీ కేంద్రంలో 16 బిలియన్లను పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదర్చుకుంది. తద్వారా 6,000 మందికి ఉపాధి కలగనుంది. కాగా, ఫాక్స్ కాన్ తమిళనాడు రాజధాని చెన్నైకి సమీపంలోని కాంచీపురం జిల్లాలో నిర్మించనుందని తెలుస్తోంది. దీనిపై ఫాక్స్‌కాన్, తమిళనాడు ప్రభుత్వాలు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఇదీ చదవండి : చైనాను వద్దనుకొని వచ్చేస్తోంది?.. భారత్‌లో ఫాక్స్‌కాన్ 700 మిలియన్ డాలర్ల పెట్టుబడులు -
సెమీకండక్టర్ ప్లాంటు.. వారి ప్రతిపాదనలు వేర్వేరుగా పరిశీలిస్తాం...
న్యూఢిల్లీ: భారత్‌లో సెమీకండక్టర్ ప్లాంటు ఏర్పాటుకు సంబంధించి వేదాంత, ఫాక్స్‌కాన్ సంస్థలు వేర్వేరుగా ప్రతిపాదనలను సమర్పించేంత వరకు ప్రభుత్వం వేచి చూస్తుందని, తర్వాత తగు విధంగా వాటిని మదింపు చేస్తుందని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. గతంలో ఇరు సంస్థలు జాయింట్ వెంచర్‌గా ప్రతిపాదనలు ఇచ్చాయని, ప్రస్తుతం అవి వేర్వేరుగా ప్రపోజల్స్ ఇచ్చే యోచనలో ఉన్నాయని పేర్కొన్నారు. సెమీకాన్ ఇండియా 2023 కార్యక్రమంలో భాగంగా అధునాతన సెమీకండక్టర్ టెక్నాలజీల ఎగ్జిబిషన్ ప్రారంభంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. సెమీకండక్టర్ రంగంలో 70 ఏళ్లలో లేనంత పురోగతిని గత 15 నెలల్లో సాధించగలిగామని పేర్కొన్నారు. -
‘సెమీ’ ఆశలకు సడన్ బ్రేకులు!
ఆశించిన పురోగతికి అర్ధంతరంగా బ్రేకులు పడినప్పుడు నిరాశ సహజమే! అందులోనూ అది సాక్షాత్తూ ప్రధాని గొప్పగా చెప్పిన ఆత్మనిర్భర ఆశయాలకు భంగకరమని అనిపించినప్పుడు నిరుత్సాహం మరీ ఎక్కువే! భారత దేశ సెమీ కండక్టర్ల (చిప్‌ల) తయారీ ఆకాంక్షలకు ఇప్పుడు అలాంటి అవరోధాలే వచ్చాయి. సెమీ కండక్టర్ల తయారీకి కలసి కృషి చేసేందుకు ఒక్కటైన తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థ ‘ఫాక్స్‌కాన్’, భారత సంస్థ ‘వేదాంత’ ఇప్పుడు దేని దారి అది చూసుకోవడం అలాంటి పరిణామమే. దీనివల్ల భారత చిప్ లక్ష్యాలకు ఇబ్బంది ఏమీ ఉండదని కేంద్రం చెబుతున్నప్పటికీ అది సంపూర్ణ సత్యమేమీ కాదు. చిప్‌ల తయారీ నిమిత్తం వేదాంత– ఫాక్స్‌కాన్‌లు గత ఏడాది ఉమ్మడి భాగస్వామ్యానికి దిగి, గుజరాత్ ప్రభుత్వంతో 19.5 బిలియన్ డాలర్ల విలువైన సెమీ కండర్ల కేంద్రం ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నాయి. తీరా పట్టుమని పది నెలలకే ఆ గ్రూపు నుంచి వైదొలగుతున్నట్టు ఫాక్స్‌కాన్ ప్రకటించడం ఒక విధంగా ఆకస్మిక బ్రేకనే చెప్పాలి. ఎలక్ట్రానిక్స్ తయారీ, డిజైన్ రంగంలో ప్రపంచ కేంద్రంగా మన దేశం ఆవిర్భవించేందుకు తగిన వాతావరణ పరికల్పనే లక్ష్యంగా పెట్టుకున్న భారత సెమీ కండక్టర్ మిషన్ (ఐఎస్ఎం)కు ఇది శుభవార్త కానే కాదు. ‘సెమీ కండక్టర్ల ఆలోచనను నిజం చేయడానికి’ వేదాంత సంస్థతో కలసి ఏడాది పైగా కృషి చేసిన ఫాక్స్‌కాన్ పరస్పర అంగీకారంతో, ఈ ఉమ్మడి భాగస్వామ్య ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు సోమవారం ప్రకటించింది. అంటే ఇక ఆ బృహత్ ప్రయత్నంలో ఫాక్స్‌కాన్ పేరు ఉండదు. ప్రాజెక్ట్ పూర్తిగా వేదాంత సంస్థకే సొంతమన్నమాట. తొలి ప్రకటన వచ్చిన 24 గంటలలోపే ఇటు ఫాక్స్‌కాన్ సైతం విడిగా తగిన సాంకేతిక భాగస్వామిని చేర్చుకొని, తనదైన వ్యూహంతో ముందుకు నడుస్తుందన్న సంకేతాలొచ్చేశాయి. కలసి అడుగులేసిన సంస్థలు ఏడాదికే ఇలా వేరు కుం పట్లయిన పరిణామానికి కారణాలేమిటన్నది అవి చెప్పలేదు. గుజరాత్లో చిప్‌ల తయారీకి కావాల్సిన లైసెన్స్‌తో కూడిన సాంకేతిక పరిజ్ఞానంకోసం వేదాంత, ఫాక్స్‌కాన్‌లు ఎస్టీమైక్రోను ఆసరాగా బరిలోకి దింపాయి. కానీ, ప్రభుత్వం మాత్రం సదరు యూరోపియన్ చిప్ తయారీ సంస్థ కూడా నిష్పూచీగా మిగలక, ఒప్పందంలో భాగస్వామిగా ఉండాల్సిందే అనడంతో చిక్కొచ్చినట్టుంది. ప్రపంచంలో 37 శాతం చిప్‌లు తైవాన్వే! భారత ఎలక్ట్రానిక్ చిప్ అవసరాలన్నీ ప్రధానంగా దిగుమతి ద్వారానే తీరుతున్నాయి. కొన్నేళ్ళుగా ఏటా దాదాపు 1000 కోట్ల డాలర్ల విలువైన చిప్‌లను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అందులో సుమారు 70 శాతం చైనా నుంచి వస్తున్నవే. చిప్‌ల తయారీలోని ఈ అంతరాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఐఎస్ఎం ప్రారంభమైంది. అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, అనేక ఐరోపా దేశాలు చిప్‌ల తయారీ సత్తా పెంచుకుంటున్నాయి. తాజాగా భారత్ ఆ పరుగులో చేరింది. దేశంలో చిప్‌ల తయారీ కేంద్రాల్ని నెలకొల్పాలని వచ్చేవారికి పెట్టుబడి రూపంలో ప్రోత్సాహకాలిచ్చేందుకు సిద్ధపడింది. అమెరికా చిప్ తయారీ సంస్థ మైక్రాన్ ఇటీవలే భారత్‌లో చిప్ కేంద్రానికి ఆమోదం పొందింది. కేంద్ర, గుజరాత్ సర్కార్లు దానికి గణనీయంగా పెట్టుబడి సాయం చేస్తున్నాయి. ఆత్మ నిర్భరతకై ఇలాంటి యత్నాలు జరుగుతున్న వేళ భారీ ఒప్పందమైన వేదాంత – ఫాక్స్‌కాన్ చిక్కుల్లో పడడమే విచారకరం. కారణాలేమైనా గత ఏడాది ఫిబ్రవరి 14న ఫాక్స్‌కాన్– వేదాంతల మధ్య మొలకెత్తిన ప్రేమ మూణ్ణాళ్ళ ముచ్చటైంది. గుజరాత్లో చిప్‌ల తయారీ కేంద్రాల ఏర్పాటుకై గత సెప్టెంబర్‌లో చేసుకున్న రూ. 1.54 లక్ష కోట్ల మేర ఒప్పందాలు ఇరుకునపడ్డాయి. ఏ సంస్థకు ఆ సంస్థ విడివిడిగా ముందుకు పోయినా భారత సెమీ కండక్టర్ల మిషన్‌లో జాప్యం తప్పదనిపిస్తోంది. చిప్‌ల తయారీకి తగ్గ పునాది లేకున్నా చిప్ డిజైన్‌లో మాత్రం మన దేశం ముందంజలో ఉంది. దాన్ని ఆయుధంగా మలుచుకోవాలి. సొంత తయారీతో పదునుపెట్టుకోవాలి. పైగా, కరోనాతో సరఫరా వ్యవస్థలకు అంతరాయం, రష్యా – ఉక్రెయిన్ యుద్ధంతో వచ్చిపడ్డ అనివార్యతల రీత్యా రక్షణ, ఎలక్ట్రానిక్స్ తదితర కీలక రంగాల్లో భారత్ ఎంత త్వరగా సొంతకాళ్ళపై నిలబడగలిగితే వ్యూహాత్మకంగా అంత మంచిది. ఆ మాటకొస్తే, ప్రచ్ఛన్న యుద్ధకాలంలో అమెరికా పైచేయి సాధించగలిగిందీ ఈ చిప్‌ల వల్లేనంటారు విశ్లేషకులు. అమెరికా, చైనాల మధ్య ఇప్పుడు నడుస్తున్న భౌగోళిక రాజకీయాల తోపులాటలోకూ ఇవే కారణం. ఇవాళ దేశాలన్నీ తమ గడ్డపైనే అన్ని రకాల చిప్‌ల రూపకల్పనకు అత్యంత ప్రాధాన్యమిస్తోందీ, ప్రోత్సాహకాలిస్తున్నదీ అందుకే. కాబట్టి, మనకు అవసరమైన చిప్‌ల డిజైనింగ్ నుంచి తయారీ దాకా అన్నీ మన చేతుల్లోనే ఉండడం పోటీలో ముందు ఉండడానికో, ఆర్థిక ప్రయోజనాల రీత్యానో కాకున్నా... వ్యూహాత్మకంగా భారత్‌కు అత్యంత కీలకం. అందుకే, వేదాంత – ఫాక్స్‌కాన్‌ల బంధం విచ్ఛిన్నమైందన్న నిరాశను పక్కనపెట్టి, సెమీ కండక్టర్ల రంగాన్ని దృఢంగా నిర్మించేందుకు మరింతగా కృషి చేయాలి. చైనా లాంటివి పడనివ్వకుండా చేసినా పట్టుదలతో సాగాలి. వేదాంత – ఫాక్స్‌కాన్‌లకు ఇరుకున పెట్టిన ఆర్థిక, సాంకేతిక అంశాలనూ క్షుణ్ణంగా పరిశీలించాలి. భవిష్యత్తులో ఇలాంటి మరో ప్రయత్నానికి ఆ చిక్కులు రాకుండా నివారించాలి. సెమీ కండక్టర్ల రంగంలో సాంకేతిక విజ్ఞాన బదలీని ప్రోత్సహించాలి. పరిశోధన, అభివృద్ధిలో దేశ, విదేశీ సంస్థల మధ్య సహకారాన్నీ పెంచిపోషించడమూ అంతే ముఖ్యం. ఎందుకంటే, ఐఎస్ఎం కింద రూ. 76 వేల కోట్ల కేటాయింపుతో నాలుగు పథకాలు ప్రవేశపెట్టామంటున్న ప్రభుత్వం సంస్థలకు తగిన వాతావరణం కల్పిస్తేనే ఫలితం. మేకిన్ ఇండియాకు బ్రేకులు పడకూడదంటే అది అత్యంత కీలకం. -
అనిల్ అగర్వాల్‌కు మరో దెబ్బ? టాటా గ్రూపుతో ఫాక్స్‌కాన్ చర్చలు?
తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం ఫాక్స్‌కాన్ రూ.1.6 లక్షల కోట్ల(19.5 బిలియన్ల డాలర్ల) ప్రాజెక్టును వెనక్కి తీసుకుని చైర్మన్ అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని వేదాంత గ్రూపునకు భారీ షాక్ ఇచ్చింది. భారతదేశంలో సెమీకండక్టర్ ఉత్పత్తి కోసం జాయింట్ వెంచర్ (జేవీ) నుండి వైదొలగాలని సోమవారం తన నిర్ణయాన్ని ప్రకటించిన సంస్థ దేశీయంగా మరో టాప్ కంపెనీతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. టాటా గ్రూప్‌తో సంభావ్య టై-అప్ కోసం ఫాక్స్‌కాన్ అన్వేషిస్తోందని సీఎన్‌బీసీ ఆవాజ్ రిపోర్ట్ చేసింది. ముఖ్యంగా, టాటా గ్రూప్ ఇటీవలి సెమీకండక్టర్ ప్రయత్నాలలో ఉంది. మరోవైపు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ప్రాజెక్టుకు ఫాక్స్‌కాన్ కట్టుబడి ఉందనీ, దేశం ఒక బలమైన సెమీకండక్టర్ తయారీ పర్యావరణ వ్యవస్థను విజయవంతంగా స్థాపించాలని చూస్తోందని ఫాక్స్‌కాన్ మంగళవారం మరోసారి స్పష్టం చేసింది. సరైన భాగస్వాముల కోసం సమీక్షిస్తున్నామని, దేశీయ, అంతర్జాతీయ వాటాదారులను స్వాగతించడానికి సిద్ధంగా ఉందని కంపెనీ తెలిపింది. దీనికి సంబంధించి అప్లికేషన్‌ను సమర్పించే దిశగా పని చేస్తోందని ప్రకటించడం ఈ వార్తలు ఊతమిస్తోంది. (వేదాంత చిప్ ప్లాంటుకు బ్రేక్ ) తరువాతి తరం వృద్ధిని ప్రారంభించే క్రమంలో దేశంలో సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించిన ఈ మెగా ప్రాజెక్టును కోసం వేదాంత ప్రయత్నించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ రాయితీలను అందిపుచ్చుకునేందుకు ఫాక్స్ కాన్-వేదాంత జాయింట్ వెంచర్‌గా గుజరాత్ లో సెమీ కండక్టర్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావించాయి. అయితే పరస్పర అంగీకారంతో ఈ డీల్ నుంచి తప్పుకుంటున్నట్టు ఫాక్స్‌కాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. (90 శాతం ఉద్యోగాలు ఫట్: సిగ్గూ, శరం, మానవత్వం లేదా? సీఈవోపై పైర్)