సాక్షి, న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ రంగ దిగ్గజం, తైవాన్‌కు చెందిన హాన్ హై టెక్నాలజీ గ్రూప్ (ఫాక్స్‌కాన్)యూనిట్‌ను తెలంగాణలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యంగ్ లియును కోరారు. గురువారం ఢిల్లీలో లియుని కలిసిన కేటీఆర్.. దేశంలో కంపెనీ విస్తరణ ప్రణాళి కలను చర్చించారు. తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహించడానికి మౌలిక సదుపా యాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ఆయనకు వివరించారు.
రాష్ట్రంలో కంపెనీ కొత్త యూనిట్ల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని, రాష్ట్రం అందించే ప్రోత్సాహం కోసం ఎదురుచూస్తున్నామని యంగ్ లియు తెలిపారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... ఫాక్స్‌కాన్ సంస్థకు తెలంగాణ నుంచి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. సాధ్యాసాధ్యాలను అన్వేషించేందుకు బృందాన్ని రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నామన్నారు. సమావేశం లో ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ సుజయ్ కరంపురి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment