Electronics industry
-
ఎల్రక్టానిక్స్, గృహోపకరణాలకు జోష్!
న్యూఢిల్లీ: గృహోపకరణాలు, కన్జ్యూమర్ ఎల్రక్టానిక్ పరిశ్రమ ఈ ఏడాది అమ్మకాలపై బలమైన అంచనాలను పెట్టుకుంది. పండుగల సీజన్‌కుతోడు, వన్డే ప్రపంచ క్రికెట్ కప్ పోటీలు ఉండడంతో అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయని, క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 20 శాతం వృద్ధి నమోదు అవుతుందని అంచనా వేస్తోంది. ఏటా పండుగల సీజన్లో అధిక విక్రయాలు నమోదవుతుండడం సాధారణమే. కాకపోతే ఈ ఏడాది క్రికెట్ పోటీలు కూడా రావడం అమ్మకాలకు కలిసొస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 1987 తర్వాత పండుగల సీజన్ సమయంలో క్రికెట్ ప్రపంచ కప్ టోర్నమెంట్ రావడం ఇదే మొదటిసారి కానుంది. దీంతో టీవీలు, ముఖ్యంగా పెద్ద తెరల సెట్లు, ఆడియో ఉత్పత్తులు, సౌండ్ బార్లు, హెడ్ఫోన్లు, ఇయర్‌బడ్స్ అధికంగా అమ్ముడుపోతాయనే అంచనాలు నెలకొన్నాయి. సంప్రదాయ, చిన్న తెరల టీవీల స్థానంలో 55 అంగుళాల పెద్ద టీవీలను వినియోగదారులు కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయని కంపెనీలు భావిస్తున్నాయి. ప్రీమియం, అల్ట్రా ప్రీమియం అయిన క్యూఎల్ఈడీ, ఓఎల్ఈడీ టీవీలకు సైతం డిమాండ్ ఉంటుందని అంచనాతో ఉన్నాయి. వన్డే వరల్డ్‌కప్ అక్టోబర్ 5న ప్రారంభం అవుతుండగా, నవంబర్ 9న ముగియనుంది. ఆకర్షణీయమైన ఆఫర్లు గత సీజన్ల మాదిరే ఈ ఏడాది కూడా వడ్డీ రహిత రుణ సదుపాయం, కొత్త మోడళ్ల ఆవిష్కరణ, విస్తృత ప్రచారంతో అమ్మకాలు పెంచుకోవాలని ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల కంపెనీలు యోచిస్తున్నాయి. ప్రస్తుత పండుగల సమయంలో అమ్మకాలు గతేడాది స్థాయిలోనే ఉండొచ్చు. కాకపోతే ఈ ఏడాది ప్రీమియం ఉత్పత్తుల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నాం. వీటి అమ్మకాలు 30% పెరగొచ్చు. కాకపోతే మాస్ విభాగం (తక్కువ ధరల ఉత్పత్తులు) ఒత్తిడిని ఎదుర్కొనవచ్చు. ఈ ఏడాది ఆరంభం నుంచి ద్రవ్యోల్బణ ప్రభావం కొనసాగుతోంది. దీంతో విచక్షణారహిత వినియోగంపై ఒత్తిడి నెలకొంది. రుతుపవనాల్లో వ్యత్యాసం, కొన్ని రాష్ట్రాల్లో సరైన వర్షాలు కురవకపోవడం వ్యవసాయ ఆదాయాన్ని ప్రభావితం చేస్తుంది. ఇవి మాస్ ఉత్పత్తుల అమ్మకాలపై ప్రభావం పడేలా చేస్తాయి. కనుక ఈ విభాగంలో అమ్మకాలు ఏమంత మెరుగ్గా ఉంటాయని భావించడం లేదు’’అని గోద్రేజ్ అప్లయెన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది వివరించారు. -
పదేళ్లలో లక్ష మందికి ఉపాధి
సాక్షి, హైదరాబాద్: తైవాన్‌కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ (హోన్ హై టెక్నాలజీ గ్రూప్) రాష్ట్రంలో భారీ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చింది. మొబైల్ఫోన్లు, ట్యాబ్‌ల అనుబంధ ఉత్పత్తుల పరిశ్రమను స్థాపించనుంది. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమీపంలోని కొంగరకలాన్ లేదా బాచుపల్లి సమీపంలోని దుండిగల్‌లో 250 ఎకరాల్లో ఇది ఏర్పాటు కానుంది. ఈ పరిశ్రమ ద్వారా రానున్న పదేళ్లలో లక్షమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి, ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. సంస్థ చైర్మన్ యంగ్ ల్యూ నేతృత్వంలోని ప్రతినిధి బృందం గురువారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో సమావేశమై ఆయన సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దేశానికి వచ్చిన అతిపెద్ద ఎలక్ట్రానిక్స్రంగ పెట్టుబడుల్లో ఇది ముఖ్యమైనదని సమావేశం అనంతరం సీఎం కార్యాలయం ప్రకటించింది. గురువారం యంగ్ ల్యూ పుట్టినరోజు కావడంతో స్వదస్తూరితో ప్రత్యేకంగా తయారుచేసిన గ్రీటింగ్ కార్డును సీఎం కేసీఆర్ ఆయనకు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సమావేశం అనంతరం ప్రగతిభవన్‌లో యంగ్ల్యూ ప్రతినిధి బృందానికి మధ్యాహ్న భోజనంతో ఆతిథ్యమిచ్చారు. ఒప్పంద కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, ప్రత్యేక సీఎస్‌లు రామకృష్ణారావు, అరవింద్ కుమార్, పరిశ్రమల శాఖ అదనపు కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి, డైరెక్టర్ ఎలక్ట్రానిక్స్ సుజయ్ కారంపురి తదితరులు పాల్గొన్నారు. అన్ని రకాల సాయం అందిస్తాం: సీఎం కేసీఆర్ అంతర్జాతీయంగా అనేక దేశాల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిరంగ ముఖచిత్రాన్ని గుణాత్మకంగా మార్చిన గొప్ప సంస్థ ‘ఫాక్స్‌కాన్’తన కార్యకలాపాలకు రాష్ట్రాన్ని గమ్యస్థానంగా ఎంపిక చేసుకోవడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సంస్థ కార్యకలాపాలకు అన్ని రకాల సహాయ, సహకారాలను అందిస్తామని హామీనిచ్చారు. ఫాక్స్‌కాన్‌తో లక్షకుపైగా ఉద్యోగాల కల్పనకు అవకాశం రావడం గొప్ప విషయన్నారు. సాధ్యమైనంత వరకు స్థానిక యువతకు ఉద్యోగాలు లభించేలా చర్యలు చేపడతామని ప్రకటించారు. ఈ సమావేశ సమయంలోనే టీఎస్ఐఐసీ అధికారులు కొంగరకలాన్, దుండిగల్ ప్రాంతాలపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. తైవాన్ మా సహజ భాగస్వామి.. ‘రాష్ట్రాన్ని గొప్పగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణను అమలుచేస్తోంది. బంగారు తెలంగాణ సాధనకు అనేక గొప్ప ప్రాజెక్టులను చేపట్టింది. ఫాక్స్‌కాన్ రాక రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి దోహదపడుతుంది. తైవాన్ను తెలంగాణ సహజ భాగస్వామిగా భావిస్తున్నాం. ఫాక్స్‌కాన్ పురోగమనంలో రాష్ట్రం భాగమైనందుకు సంతోషంగా ఉంది’అని సీఎం కేసీఆర్ అన్నారు. పదేళ్లలో లక్ష ఉద్యోగావకాశాలు: మంత్రి కేటీఆర్ ఫాక్స్‌కాన్ పరిశ్రమ స్థాపనతో వచ్చే పదేళ్లలో లక్ష మందికిపైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు హర్షం వ్యక్తం చేశారు. విస్తృత అధ్యయనం చేశాకే వచ్చాం: ఫాక్స్‌కాన్ చైర్మన్ తెలంగాణ గురించి తమ సంస్థ విస్తృతంగా అధ్యయనం చేసిందని ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ ల్యూ తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉందని ప్రశంసించారు. రాష్ట్రంలో పెట్టుబడుల విషయంలో ఆశావహ దృక్పథంతో ఉన్నామన్నారు. ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తుల తయారీ.. ప్రపంచవ్యాప్తంగా విక్రయించే 40 శాతం ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను ఫాక్స్‌కాన్ తయారుచేస్తోంది. యాపిల్, మైక్రోసాఫ్ట్, నోకియా, సోనీ వంటి ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులను రూపొందిస్తోంది. ఫాక్స్‌కాన్ పరిశ్రమల్లో యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్, ఐపాడ్, ఐప్యాడ్, అమెజాన్‌కు చెందిన కిండిల్, బ్లాక్‌బెర్రీ లిమిటెడ్‌కు చెందిన స్మార్ట్ఫోన్లు, ఇతర పరికరాలు, గేమింగ్ సిస్టమ్స్, నోకియా, సోనీ పరికరాలు (ప్లే స్టేషన్ 3, ప్లే స్టేషన్ 4 గేమింగ్ కంన్సోల్స్) గూగుల్ పిక్సల్, షావోమీ పరికరాలు, సీపీయూ సాకెట్ల తయారీ జరుగుతోంది. ఈ సంస్థ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తమిళనాడులలో కార్యకలాపాలు సాగిస్తోంది. సెమీకండక్టర్ చిప్‌ల తయారీ కోసం.. సాక్షి, రంగారెడ్డి జిల్లా: యాపిల్ కంపెనీ ఫాక్స్‌కాన్‌కి అతిపెద్ద కస్టమర్. ఐఫోన్లు, ఐపాడ్లు, మాక్‌బుక్స్ ద్వారానే ఫాక్స్‌కాన్ 50 శాతం ఆదాయం ఆర్జిస్తోంది. కరోనా తర్వాత దేశంలోనే ఎలక్ట్రానిక్ చిప్‌ల తయారీకి కేంద్ర ప్రభుత్వం ముందుకురావడంతో మైనింగ్ దిగ్గజం వేదాంతతో కలిసి 20 బిలియన్ డాలర్లతో దేశంలో మొదటి సెమీకండక్టర్ చిప్ తయారీ ఫ్యాక్టరీని నిర్మించేందుకు ఫాక్స్‌కాన్ సన్నాహాలు చేస్తోంది. -
తెలంగాణలో ఫాక్స్‌కాన్ యూనిట్
సాక్షి, న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ రంగ దిగ్గజం, తైవాన్‌కు చెందిన హాన్ హై టెక్నాలజీ గ్రూప్ (ఫాక్స్‌కాన్)యూనిట్‌ను తెలంగాణలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యంగ్ లియును కోరారు. గురువారం ఢిల్లీలో లియుని కలిసిన కేటీఆర్.. దేశంలో కంపెనీ విస్తరణ ప్రణాళి కలను చర్చించారు. తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహించడానికి మౌలిక సదుపా యాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ఆయనకు వివరించారు. రాష్ట్రంలో కంపెనీ కొత్త యూనిట్ల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని, రాష్ట్రం అందించే ప్రోత్సాహం కోసం ఎదురుచూస్తున్నామని యంగ్ లియు తెలిపారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... ఫాక్స్‌కాన్ సంస్థకు తెలంగాణ నుంచి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. సాధ్యాసాధ్యాలను అన్వేషించేందుకు బృందాన్ని రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నామన్నారు. సమావేశం లో ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ సుజయ్ కరంపురి పాల్గొన్నారు. -
గోరుచుట్టుపై రోకటి పోటు
-
Reliance : తగ్గేదేలే.. ఇకపై ఈ రంగంలో పెను మార్పులే!
ఏ పని చేపట్టినా పక్కా వ్యూహంతో గ్రాండ్‌గా మొదలు పెట్టి సక్సెస్ కొట్టడమనేది రిలయన్స్ స్టైల్. ఫ్యూచర్ ఫ్యూయల్‌గా చెప్పుకుంటున్న హైడ్రోజన్ ఫ్యూయల్‌పై ఇప్పటిగా భారీగా పెట్టుబడులు పెడుతూ గిగా ఫ్యాక్టరీలు నిర్మిస్తోంది. తాజాగా ఎలక్ట్రానిక్స్‌లోకి ఎంటర్ అవుతోంది రిలయన్స్. రిలయన్స్ డిజిటల్ పేరుతో దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ స్టోర్లు ఈ గ్రూపు ఆధ్వర్యంలో ఉన్నాయి. అయితే వివిధ కంపెనీలకు చెందిన బ్రాండ్లనే ఇక్కడ విక్రయిస్తున్నారు తప్పితే రిలయన్స్‌కు అంటూ సొంత బ్రాండ్ లేదు. ఈ లోటును తీర్చే పనిలో పడ్డారు. అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ పరికరాల సంస్థ సాన్మినాతో రిలయన్స్ జట్టు కట్టింది. సాని్మనా ఇండియాలో 50 శాతం షేర్లను రూ. 1670 కోట్లతో రిలయన్స్ కొనుగోలు చేసింది. ఇకపై ఈ రెండు సంస్థలు కలిసి భారత్‌లో సంయుక్తంగా ఎలక్ట్రానిక్ పరికరాలు, ఉపకరణాలు ఉత్పత్తి చేయనున్నాయి. సన్మినాకు చెన్నైలో ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ ప్లాంటు ఉంది. తాజాగా కుదిరిన జాయింట్ వెంచర్ ప్లాన్స్‌ను అనుసరించి ఇదే ప్లాంటులో ఎలక్ట్రానిక్ పరికరాల తయారీని చేపడుతారు. భవిష్యత్తు అవసరాలకు తగ్గటుగా ఇతర ప్రాంతాల్లోనూ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్లను నెలకొల్పుతామని రిలయన్స్ తెలిపింది. భారత ప్రభుత్వ మేకిన్ ఇండియా స్ఫూర్తితో ఎలక్ట్రానిక్ సెగ్మెంట్లో ప్రవేశించినట్టు రిలయన్స్ తెలిపింది. దేశ అవసరాలకు తగ్గట్టు క్లౌడ్ కంప్యూటింగ్, 5జీ టెక్నాలజీ విస్తరణ, మెడికల్, హెల్త్‌కేర్, ఇండస్ట్రీయల్, క్లీన్టెక్, డిఫెన్స్, ఎయిరోస్పేస్ సెకార్టకు అవసరమై ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీపై ఫోకస్ చేస్తున్నామని రిలయన్స్ తెలిపింది. జియో రాకతో ఇండియాలో ఇంటర్నేట్ యూసేజ్‌లో పెను మార్పులు సంభవించాయి. ఈ కామర్స్ రంగం పది మెట్లు పైకి చేరుకుంది. పేపర్‌లెస్ ట్రాన్సాక్షన్స్ పెరిగాయి. రిలయన్స్ రాక కారణంగా త్వరలో ఎలక్ట్రానిక్ సెక్టార్‌లోనూ ఇదే తరహా మార్పులు చూడవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. చదవండి: ఏ అండ్ టీలో రిలయన్స్ రిటైల్ పెట్టుబడులు -
ఎలక్ట్రానిక్స్‌కు డ్రాగన్ షాక్!
న్యూఢిల్లీ: చైనా కారణంగా మరో విడత దేశీయ ఎలక్ట్రానిక్ పరిశ్రమ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. కరోనా వైరస్ నియంత్రణకు చైనా కఠినంగా వ్యవహరిస్తుండడంతో కీలకమైన విడిభాగాల సరఫరాలో కొరతకు కారణమవుతోంది. దీంతో దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీదారులు, స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు 10–30 శాతం మేర ఉత్పత్తిని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విమానాశ్రయాలు, ఓడరేవుల్లో చైనా ఆంక్షలు, నిషేధాజ్ఞలు విధించింది. దేశీయంగా ముఖ్యమైన పండుగుల సీజన్లోనే ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల విక్రయాలు భారీగా నమోదవుతుంటాయి. ఏడాది మొత్తం మీద 35–45 శాతం విక్రయాలు పండుగల సమయాల్లోనే కొనసాగుతుంటాయి. ఇదే సమయంలో కీలక విడిభాగాల కొరత నెలకొనడం ఈ ఏడాదికి సంబంధించి పరిశ్రమ వృద్ధి అంచనాలకు గండికొట్టేలా ఉంది. తాజా పరిణామాలతో రవాణా వ్యయాలు గడిచిన మూడు నెలల్లో రెట్టింపయ్యాయని.. ఉత్పత్తుల ధరలను పెంచక తప్పదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మనదేశంలో తయారయ్యే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు సంబంధించి 60–70 శాతం విడిభాగాలు చైనా నుంచే సరఫరా అవుతుంటాయి. పోర్ట్‌లు, ఎయిర్‌పోర్ట్‌ల మూత ఆగస్ట్ 21న సాంఘై పుడోంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో కార్గో కార్యకలాపాలను నిరవధికంగా నిలిపివేశారు. కార్మికులు కొంత మంది కరోనా వైరస్ బారిన పడడంతో గ్రౌండ్ హ్యాండ్లింగ్ పనులను నిర్వహిస్తున్న షాంఘై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ కరోనా క్వారంటైన్ పాలసీని ప్రకటించింది. అలాగే, చైనా నింగ్బో జోషువాన్ పోర్ట్‌ను సైతం మూసేశారు. చైనా సరఫరాలకు (ఎగుమతులు) షాంఘై, నింగ్బో రెండూ ముఖ్యమైనవి. కరోనా విషయంలో ఉపేక్షించేది లేదన్న చైనా విధానానికి వీటిని నిదర్శనంగా పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. చైనాలో సుమారు 15 పోర్ట్‌లు, ఎయిర్‌పోర్ట్‌లు కేవలం 30–70 శాతం సిబ్బందితో పరిమిత కార్యకలాపాలే నిర్వహిస్తుండడం గమనార్హం. వీటిల్లో ముఖ్యమైన బీజింగ్, షియామెన్ కూడా ఉన్నాయి. కరోనా కఠిన విధానాల ఫలితంగా ఇతర పోర్ట్‌లు, ఎయిర్పోర్ట్లైన హాంగ్‌కాంగ్, షెన్జెన్లోనూ రద్దీ పెరిగిపోయింది. ఫలితంగా ఎగుమతులకు రోజుల పాటు వేచి ఉండాల్సి రావడం పరిస్థితికి అద్దం పడుతోంది. స్మార్ట్ఫోన్ల విక్రయాలపైనా ప్రభావం స్మార్ట్ఫోన్ల షిప్మెంట్ల అంచనాల్లోనూ కోతలు విధించుకోవాల్సిన పరిస్థితులే నెలకొన్నాయి. చైనాలోని, ఓడరేవులు, విమానాశ్రయాల్లో ఆంక్షల వల్ల డిమాండ్‌కు సరిపడా చిప్సెట్లు, ఇతర కీలక విడిభాగాల సరఫరా సాధ్యపడడం లేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. టెక్ఆర్క్ అనే సంస్థ స్మార్ట్ఫోన్ల షిప్మెంట్లు 7 శాతం తగ్గొచ్చని తాజాగా అంచనా వేసింది. ఐడీసీ అనే సంస్థ ఈ ఏడాది మొత్తం మీద స్మార్ట్ఫోన్ల షిప్మెంట్లలో వృద్ధి ఉండకపోవచ్చని.. ఉన్నా ఒక్క శాతం వరకే ఉంటుందన్న తాజా అంచనాలను ప్రకటించింది. వాస్తవానికి 16% మేర షిప్మెంట్లు పెరుగుతాయని ఇదే సంస్థ లోగడ అంచనా వేయడం గమనార్హం. తాజా పరిణామాలతో ఫోన్ల ధరలను పెంచాల్సి వస్తుందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. కొరత కారణంగా పండుగల సీజన్లో విక్రయాలపైనా ప్రభావం పడొచ్చని అంచనా వేస్తున్నాయి. ‘‘2021లో 15.2–15.5 కోట్ల స్మార్ట్ఫోన్ల విక్రయాలను అంచనా వేస్తున్నాం. సరఫరాలో సమస్యల వల్ల ఈ ఏడాదికి సంబంధించి కంపెనీల అంచనాలు 5–15 శాతం మేర తగ్గొచ్చు’’ అని టెక్ఆర్క్ సంస్థ వ్యవస్థాపకుడు ఫైసల్కవూస తెలిపారు. ధరలు 3–5% వరకు పెరగొచ్చని చెప్పారు. చైనా నుంచి భారత్‌కు విడిభాగాల సరఫరాకు పట్టే సమయం రెట్టింపై 50–60 రోజులకు చేరుకుంది. పండుగల సీజన్లో భారీ విక్రయాల ఆకాంక్షలపై తాజా పరిస్థితులు నీళ్లు చల్లుతున్నాయి. -
పర్సనల్ కంప్యూటర్లు ప్రియం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిప్సెట్ కొరత ఎలక్ట్రానిక్స్ పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీస్తోంది. దీని ప్రభావం పర్సనల్ కంప్యూటర్ల (పీసీ) విభాగంపై స్పష్టంగా కనపడుతోంది. ఆన్లైన్ తరగతులు, ఇంటి నుంచి పని విధానం కారణంగా డిమాండ్ విపరీతంగా ఉన్నప్పటికీ సరఫరా ఆ స్థాయిలో జరగడం లేదు. ఇదే అదనుగా తయారీ కంపెనీలు ధరలను 50 శాతంపైగా పెంచాయి. లో ఎండ్ మోడళ్ల ఉత్పత్తిని దాదాపు నిలిపివేశాయి. రూ.50,000లోపు ధరలో ల్యాప్‌టాప్‌లు దొరకట్లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వినియోగదార్లు తప్పనిసరి పరిస్థితుల్లో ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, ఆల్ ఇన్ వన్స్ కోసం అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఏప్రిల్–జూన్ కాలంలో దేశవ్యాప్తంగా 32 లక్షల యూనిట్ల పీసీలు అమ్ముడైనట్టు సమాచారం. నిలిచిపోయిన సరఫరా.. ల్యాప్‌టాప్స్‌లో కొన్ని నెలల క్రితం వరకు రూ.17–25 వేల ధరల శ్రేణి వాటా 70 శాతం దాకా ఉండేది. రూ.26–40 వేల ధరల విభాగం 20 శాతం, రూ.40 వేలపైన ధరల్లో లభించే హై ఎండ్ మోడళ్ల వాటా 10 శాతం నమోదయ్యేది. ప్రస్తుతం పరిస్థితి తారుమారైంది. మార్కెట్ అంతా హై ఎండ్ మోడళ్లతోనే నిండిపోయింది. వీటికి కూడా 40–50 శాతం కొరత ఉంది. ఇక లో ఎండ్ మోడళ్లు అయితే కానరావడం లేదు. 100 శాతం నగదు ఇచ్చి కొనేందుకు వినియోగదార్లు సిద్ధపడ్డా పీసీ దొరకడం లేదు. ఇటువంటి పరిస్థితి పరిశ్రమలో ఇదే తొలిసారి అని ఐటీ మాల్ ఎండీ అహ్మద్ తెలిపారు. లో ఎండ్ ల్యాప్టాప్స్ సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని చెప్పారు. పేరుతోపాటు ధర కూడా.. కంపెనీలు ఎప్పటికప్పుడు మోడళ్ల పేరు మారుస్తున్నాయి. కొత్త స్టాక్ వచ్చిందంటే మోడల్ పేరు మారుతోంది. అంతేకాదు ఫీచర్లు మారకపోయినా ధరలను సవరిస్తున్నాయి. చిప్సెట్ కొరతను అడ్డుపెట్టుకుని పూర్తిగా హై ఎండ్ మోడళ్లవైపే మొగ్గు చూపుతున్నాయంటే కంపెనీలు ఏ స్థాయిలో వ్యూహాత్మకంగా పనిచేస్తున్నాయో అవగతమవుతోంది. కనీస ధరలు ల్యాప్‌టాప్ రూ.18 వేలది కాస్తా రూ.30 వేలకు చేరింది. హై ఎండ్‌లోనూ ధర 20 శాతంపైగా అధికమైంది. డెస్క్‌టాప్ రూ.25 వేల నుంచి రూ.38 వేలకు, ఆల్ ఇన్ వన్ రూ.30 వేల నుంచి రూ.43 వేలు అయింది. ప్రింటర్ల విషయంలో ఇంక్జెట్ రూ.2 వేల నుంచి రూ.4,500లు, లేజర్‌జెట్ రూ.9 వేలది కాస్తా రూ.16 వేలపైమాటే ఉంది. ధర పెరిగినా ప్రింటర్లు దొరకడం లేదు. -
ఎలక్ట్రానిక్ క్లస్టర్లు... ఎనర్జీ పార్కులు
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రానిక్స్ పరిశోధన, అభివృద్ధి, తయారీ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎలక్ట్రిక్ వాహన రంగంలో వస్తున్న పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు కూడా ఎలక్ట్రానిక్స్ రంగాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 2016లోనే ఎలక్ట్రానిక్స్ పాలసీని విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం... పెట్టుబడులు, ప్రోత్సాహకాలకు సంబంధించి ఇటీవల మార్గదర్శకాలు విడుదల చేసింది. దేశంలో ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో తెలంగాణ వాటా ప్రస్తుతం 7 శాతంకాగా వచ్చే నాలుగేళ్లలో అగ్రస్థానానికి చేరాలని భావిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతమున్న ఎలక్ట్రానిక్ క్లస్టర్లు, ఈవీ పార్కులకు తోడుగా కొత్త ఎలక్ట్రానిక్ క్లస్టర్లు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. పెట్టుబడులను ఆకర్షించేందుకు అవసరమైన మౌలికవసతులను మెరుగుపరచడం ద్వారా వచ్చే నాలుగేళ్లలో రూ. 73 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని, 3 లక్షల ఉద్యోగాలు లభించేలా చూడాలని భావిస్తోంది. ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ మాన్యుఫ్యాక్చరింగ్ (ఈఎస్డీఎం) హబ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు తెలంగాణ నైపుణ్య శిక్షణ అకాడమీ (టాస్క్) ద్వారా యువతకు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కొత్తగా ఈవీ క్లస్టర్లు, ఎనర్జీ పార్కులు... ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహన రంగం కోసం ప్రస్తుతం రాష్ట్రంలో ఔటర్ రింగురోడ్డు సమీపంలోని రావిర్యాలలో ‘ఈ–సిటీ’, మహేశ్వరంలో హార్డ్‌వేర్ పార్క్ 912 ఎకరాల్లో ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో ఎల్ఈడీ పార్కులో 10 సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించగా ఈవీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల అవసరాల కోసం మరో 3 కొత్త పార్కులు/క్లస్టర్లు ఏర్పాటు ప్రక్రియ కొలిక్కి వస్తోంది. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా చందన్వెల్లిలో ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాల కోసం ఈవీ క్లస్టర్‌ను టీఎస్ఐఐసీ అభివృద్ధి చేస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలోనూ 378 ఎకరాల విస్తీర్ణంలో కొత్త ఎనర్జీ పార్కు ఏర్పాటు పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ పార్కులో లిథియం–అయాన్ బ్యాటరీలు, సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీ యూనిట్లు ఏర్పాటవుతాయి. కొత్తగా దుండిగల్‌లోనూ 511 ఎకరాల్లో కొత్త ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌ను టీఎస్ఐఐసీ ప్రతిపాదించింది. వాటితోపాటు ప్రపంచస్థాయి ప్రమాణాలతో ప్రొటోటైపింగ్, టెస్టింగ్ వసతులతో కూడిన కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు కానుంది. ఏడాదిలోనే రూ. 4,500 కోట్ల పెట్టుబడులు... ఎలక్ట్రానిక్స్ రంగంలో పేరొందిన ఇంటెల్, మైక్రాన్, క్వాల్కామ్, మోటరోలా, ఏఎండీ, సిడాక్, యాపిల్ వంటి కంపెనీలతోపాటు మైక్రోమ్యాక్స్, స్కైవర్త్, ఒప్పో, వన్‌ప్లస్ వంటి మొబైల్‌ఫోన్ తయారీ కంపెనీలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి. గతేడాది ఎలక్ట్రానిక్స్ రంగంలో రూ. 4,500 కోట్ల పెట్టుబడులతోపాటు 15 వేల మందికి ఉపాధి లభించినట్లు పరిశ్రమల శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన కంపెనీలు కార్యకలాపాలను విస్తరిస్తుండటంతో ఐదేళ్లపాటు విద్యుత్‌పై 25 శాతం, పెట్టుబడులపై 20 శాతం చొప్పున సబ్సిడీ, ఏడేళ్లపాటు జీఎస్టీలో 100 శాతం మినహాయింపులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్లో మూడు షిఫ్టుల్లో మహిళలు పనిచేసేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది. -
కొప్పర్తిలో డిక్సన్ టెక్నాలజీస్ పరిశ్రమ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కడప జిల్లా కొప్పర్తిలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు డిక్సన్ టెక్నాలజీస్ ముందుకు వచ్చింది. డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ సునీల్ వాచని, సీఈవో పంకజ్ శర్మ, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో కలిసి మంగళవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి కొప్పర్తిలో పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలిపారు. కొప్పర్తిలో ఏర్పాటు చేసే ఈ పరిశ్రమ ద్వారా దాదాపు రెండు నుంచి మూడు వేల మందికి ఉపాధి కలి్పంచనున్నట్లు సీఎం వైఎస్ జగన్‌కు ఆ కంపెనీ చైర్మన్, సీఈవో వివరించారు. కొప్పర్తి ఎల్రక్టానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో పెట్టుబడులు పెట్టేందుకు డిక్సన్ టెక్నాలజీస్ ముందుకు రావడం శుభపరిణామం అని ముఖ్యమంత్రి జగన్ సంతోషం వ్యక్తం చేశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని సీఎం పేర్కొన్నారు. కొప్పర్తి యూనిట్లో మొబైల్స్, వేరియబుల్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్, సెక్యూరిటీ ఎక్విప్మెంట్స్, కెమెరాలు తయారు చేయనున్నట్లు డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా ప్రతినిధులు వెల్లడించారు. తిరుపతి యూనిట్‌ను విస్తరించి అదనంగా 1,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని వారు ముఖ్యమంత్రి జగన్‌కు వివరించారు. హోం అప్లయెన్సెస్ విభాగంలో బాష్ కంపెనీతో ఒప్పందం చేసుకుని వాషింగ్ మెషిన్ల తయారీ యూనిట్ నెలకొల్పనున్నట్లు వెల్లడించారు. -
ఐటీ, ఎలక్ట్రానిక్స్‌కు ప్రోత్సాహం
సాక్షి, అమరావతి: రానున్న రోజుల్లో అతి వేగంగా వృద్ధి చెందే రంగాలుగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. దేశంలో స్మార్ట్ఫోన్ల తయారీ, విడిభాగాల ఉత్పత్తి రెండు మూడేళ్లలో 800 మిలియన్లకు చేరుకుంటుందన్న అంచనాల నేపథ్యంలో ఈ రంగంలో పెట్టుబడులపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. ఇందులో భాగంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక పాలసీలను రూపొందించామన్నారు. నైపుణ్యం కలిగిన టెక్నీషియన్లు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో ఈ రంగాలకు ప్రోత్సాహం అందించడం ద్వారా పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ కేంద్ర బిందువుగా మారనుందని సీఎం జగన్ చెప్పారు. చెన్నైలోని జపాన్ కాన్సులేట్ జనరల్ మసయుకి తాగ మంగళవారం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించి రాష్ట్రాబివృద్ధిలో పాలు పంచుకోవాలని కోరారు. పలు ప్రముఖ సంస్థల ఆసక్తి.. పలు ప్రముఖ సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలను రాష్ట్రంలో ప్రారంభించేందుకు ఉత్సాహం చూపుతున్నాయని సీఎం వివరించారు. ఆదానీ ఎంటర్ప్రైజెస్ 200 మెగావాట్ల డేటా సెంటర్ పార్క్, స్కిల్ యూనివర్శిటీ, ఐటీ పార్క్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందన్నారు. దీని ద్వారా సుమారు 25,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయని, ఇంటెలిజెంట్ సెజ్‌లో ఫుట్‌వేర్ పరిశ్రమల ఏర్పాటు ద్వారా దాదాపు 12,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయని చెప్పారు. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు భారీ ప్రోత్సాహకాలు రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు భారీ ప్రోత్సాహకాలను అందిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ పార్క్‌ను ఏర్పాటు చేసి రానున్న రోజుల్లో హై ఎండ్ ఐటీ స్కిల్స్ యూనివర్సిటీ, ఇంక్యుబేషన్ సెంటర్స్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ల్యాబ్స్, కో వర్కింగ్ స్పేసెస్, ఐకానిక్ ఐటీ టవర్స్, స్టేట్ డేటా సెంటర్ల ఏర్పాటుతో ఐటీ సెక్టార్‌కు అన్ని విషయాల్లోనూ ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. వెయ్యి నుంచి రెండు వేల ఎకరాల్లో అన్ని వనరులతో ఐటీ కాన్సెప్ట్ సిటీలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సీఎం తెలిపారు. గ్రామ పంచాయతీల స్థాయిలో డిజిటల్ లైబ్రరీలు, హైస్పీడ్ ఇంటర్నెట్, 15 వేలకు పైగా గ్రామ పంచాయితీలకు వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం, దాదాపు 90 వేలకు పైగా వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేసి మారుమూల ప్రాంతాల ప్రజలకు కూడా ప్రభుత్వ సేవలను చేరువ చేసేలా చర్యలు చేపట్టామని వివరించారు. వైఎస్సార్ కడప జిల్లా కొప్పర్తిలో ప్రపంచస్ధాయి ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు ద్వారా తయారీదారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. ఈ క్లస్టర్లో పరిశ్రమల ఏర్పాటుకు భూమి, విద్యుత్తు, నీరు, రహదారులు, రైల్వే కనెక్టివిటీ, ఎయిర్ కార్గో తదితర సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రంలో నిపుణులైన ఐటీ, ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్ల కోసం విశాఖలో హై ఎండ్ ఐటీ స్కిల్స్ యూనివర్శిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 30 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటుతోపాటు ఐటీ, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాలకు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు ప్రకటించిందని చెప్పారు. పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం.. ఏపీలో పెట్టుబడులు పెట్టేవారికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, పారదర్శక విధానాలకు నిదర్శనంగా డీపీఐఐటీ, కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంక్‌లు సంయుక్తంగా ప్రకటించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ మొదటి ర్యాంకు సాధించిందని సీఎం జగన్ వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత పారదర్శకతతో సమర్థవంతమైన పాలనతో ప్రజల ముంగిటకే అన్ని సేవలను అందిస్తోందని, అదే క్రమంలో పెట్టుబడిదారులు, వ్యాపార భాగస్వాములకు ఉత్తమ వ్యాపార అవకాశాలను కల్పిస్తోందని సీఎం తెలిపారు. రాష్ట్రంలో స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందించేందుకు పెట్టుబడులు, వ్యాపార భాగస్వాములను ప్రభుత్వం ఆహ్వానిస్తోందన్నారు. -
ఏపీలో పెట్టుబడులకు తైవాన్ కంపెనీల ఆసక్తి
సాక్షి, అమరావతి: కాలుష్య రహిత, ఎలక్ట్రిక్ పరిశ్రమల ఏర్పాటుకు తైవాన్ కంపెనీల ఆసక్తి చూపుతున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఏపీఐఐసీ కార్యాలయంలో తైవాన్ డైరెక్టర్ జనరల్‌తో కలిసి మంత్రి గౌతమ్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పీఎస్ఏ వాల్సిస్ 700 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తోంది. అయితే దీనికి సంబంధించిన ప్రక్రియ మొత్తం పూర్తయ్యాకే పెట్టుబడులు, పరిశ్రమలపై ప్రకటన వెలువడుతుంది. ఏపీలో 'ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్' సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు తైవాన్ ఆసక్తి చూపుతోంది. రూ.15వేల కోట్లతో విశాఖలో అదానీ డేటా సెంటర్ పెట్టుబడులు పెట్టనుంది. రాబోయే ఎస్ఐపీబీ సమావేశంలో సుమారు రూ.20 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించనుంది. సెమీ కండక్టర్‌కు పెద్దపీట వేసే తైవాన్ కంపెనీలతో చర్చలు తొలిదశలో ఉన్నాయి. ఆ మేరకు మౌలిక సదుపాయాలు కల్పించాకే పెట్టుబడులు, పరిశ్రమలు ఏర్పాటు జరుగుతుంది. (ప్రజాశక్తి కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం జగన్) కాగా.. రాష్ట్రంలో ఉద్యోగాలు ఎక్కువ ఇచ్చే పరిశ్రమలను తీసుకొస్తున్నాం. తాజాగా 20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టే పరిశ్రమలు తీసుకొచ్చాం. అదాని డేటా సెంటర్, అపాచి కంపెనీల ద్వారా ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. 40 వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. తైవాన్‌తో ఈ బై సైకిల్ ఎగుమతులపై సంప్రదింపులు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకోస్తాం. అదాని సంస్థను మేము పంపేస్తున్నామని టీడీపీ నాయకులు ప్రచారం చేశారు. తప్పుడు ప్రచారం చేసిన టీడీపీ ఇప్పుడేం చెప్తుంది. వాళ్ళ కంటే ఎక్కువ ఉద్యోగాలు వచ్చేలా డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. అదాని డేటా సెంటర్ ద్వారా 24 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి' అని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు -
ఎలక్ట్రానిక్స్ రంగానికి వరాలు !
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ వృద్ధికి దోహదపడే పలు చర్యలను ఆర్థిక మంత్రి బడ్జెట్లో ప్రతిపాదించారని ఈ పరిశ్రమ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రతిపాదనల కారణంగా దేశీయ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ జోరు పెరుగుతుందని, ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ఆ వర్గాలు అంటున్నాయి. 1. టెలికాం, ఐటీ ఉత్పత్తుల దిగుమతులపై 10 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ(బీసీడీ)ని విధింపు. దేశీయ ఉత్పత్తికి ఊతమివ్వడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం లక్ష్యాలుగా ఈ చర్య తీసుకున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అగ్రిమెంట్ 1లో లేని ఐటీ, టెలికాం ఉత్పత్తులకు ఈ సుంకం వర్తిస్తుంది. ఈ చర్య కారణంగా వీఓఐపీ ఫోన్లు, కొన్ని టెలికాం నెట్వర్క్ ఉత్పత్తుల తయారీకి ప్రోత్సాహం లభిస్తుంది. 2. పర్సనల్ కంప్యూటర్ల తయారీలో ఉపయోగించే విడిభాగాలపై ప్రస్తుతం విధిస్తున్న 4 శాతం స్పెషల్ అడిషనల్ డ్యూటీ(ఎస్ఏడీ)ను తొలగించారు. దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై విద్యా సుంకాన్ని విధించారు. ఫలితంగా దేశీయంగా తయారయ్యే ఉత్పత్తుల ధర, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తుల ధర ఒకే విధంగా ఉంటుంది. 3. కలర్ పిక్చర్ ట్యూబ్‌లపై దిగుమతి సుంకం తొలగింపు. దీంతో వీటి ధరలు మరింతగా తగ్గుతాయి. 4. 19 అంగుళాల లోపు ఎల్ఈడీ, ఎల్సీడీ టీవీల తయారీలో ఉపయోగపడే స్క్రీన్లపై 10 శాతంగా ఉన్న బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని పూర్తిగా తొలగించారు. ఫలితంగా వీటి ధరలు తగ్గుతాయి. 5. ఒక ఏడాదిలో రూ. 25 కోట్లకు మించిన పెట్టుబడులపై 15% మూలధన ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఫలి తంగా ఎంఎస్ఎంఈలో పెట్టుబడుల పెరుగుతాయి. -
‘నిర్భయ’ పేరున ఎలక్ట్రానిక్ పరికరం
=ముంబైలో విడుదల = ఈసీఐఎల్ ఆధ్వర్యంలో తయారీ =త్వరలో నగర మార్కెట్లోకి.. కుషాయిగూడ,న్యూస్‌లైన్: ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) సంస్థ ‘నిర్భయ’ పేరిట తయారు చేసిన ఎలక్ట్రానిక్ పరికరం మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. ఆపదలో ఉన్న మహిళకు సహాయకారిగా ఉండేలా ఒక్క స్విచ్‌తో తాను ఎక్కడ ఉందీ, ఏ పరిస్థితుల్లో ఉందీ...తదితర విషయాలను ముందుగా నిర్దేశించిన నంబర్లకు సమాచారమందడం ఈ పరికరం ప్రత్యేకత. ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నిర్భయ’ ఉదంతంతో పాటు హైటెక్‌సిటీలో చోటుచేసుకున్న ‘అభయ’ ఘటనల నేపథ్యంలో ‘గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం’తో ఈ పరికరం పనిచేస్తుంది. ఈ పరికరాన్ని శుక్రవారం ముంబైలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అణు ఇంధనవిభాగం (డీఏఈ) చైర్మన్ డాక్టర్ రతన్‌కుమార్ సిన్హా ఆవిష్కరించారు. బార్క్ పరిశోధకులు రూపకల్పన చేయగా,ఈసీఐఎల్ సంస్థ ‘నిర్భయ’ పరికరాన్ని తయారు చేసిందని ఈసీఐఎల్ పీఆర్వో లక్ష్మీనారాయణ శనివారం ఇక్కడ తెలిపారు. సెల్‌ఫోన్‌కు అనుసంధానమయ్యే ఈ పరికరం త్వరలో మార్కెట్లోకి వస్తుందని ఆయన చెప్పారు.