కొప్పర్తిలో డిక్సన్‌ టెక్నాలజీస్‌ పరిశ్రమ | Dixon Technologies industry in Kopparti | Sakshi
Sakshi News home page

కొప్పర్తిలో డిక్సన్‌ టెక్నాలజీస్‌ పరిశ్రమ

Published Wed, Mar 10 2021 4:29 AM | Last Updated on Wed, Mar 10 2021 4:30 AM

Dixon‌ Technologies‌ industry in Kopparti - Sakshi

క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసిన డిక్సన్‌ టెక్నాలజీస్‌ ఇండియా లిమిటెడ్‌ చైర్మన్‌ సునీల్‌ వాచని, సీఈవో పంకజ్‌ శర్మ. చిత్రంలో మంత్రి గౌతమ్‌రెడ్డి

సాక్షి, అమరావతి:  వైఎస్సార్‌ కడప జిల్లా కొప్పర్తిలో ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు డిక్సన్‌ టెక్నాలజీస్‌ ముందుకు వచ్చింది. డిక్సన్‌ టెక్నాలజీస్‌ ఇండియా లిమిటెడ్‌ చైర్మన్‌ సునీల్‌ వాచని, సీఈవో పంకజ్‌ శర్మ, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డితో కలిసి మంగళవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి కొప్పర్తిలో పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలిపారు. కొప్పర్తిలో ఏర్పాటు చేసే ఈ పరిశ్రమ ద్వారా దాదాపు రెండు నుంచి మూడు వేల మందికి ఉపాధి కలి్పంచనున్నట్లు సీఎం వైఎస్‌ జగన్‌కు ఆ కంపెనీ చైర్మన్, సీఈవో వివరించారు.

కొప్పర్తి ఎల్రక్టానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌లో పెట్టుబడులు పెట్టేందుకు డిక్సన్‌ టెక్నాలజీస్‌ ముందుకు రావడం శుభపరిణామం అని ముఖ్యమంత్రి జగన్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని సీఎం పేర్కొన్నారు. కొప్పర్తి యూనిట్‌లో మొబైల్స్, వేరియబుల్స్, ల్యాప్‌టాప్స్, ట్యాబ్లెట్స్, సెక్యూరిటీ ఎక్విప్‌మెంట్స్, కెమెరాలు తయారు చేయనున్నట్లు డిక్సన్‌ టెక్నాలజీస్‌ ఇండియా ప్రతినిధులు వెల్లడించారు. తిరుపతి యూనిట్‌ను విస్తరించి అదనంగా 1,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని వారు ముఖ్యమంత్రి జగన్‌కు వివరించారు. హోం అప్లయెన్సెస్‌ విభాగంలో బాష్‌ కంపెనీతో ఒప్పందం చేసుకుని వాషింగ్‌ మెషిన్ల తయారీ యూనిట్‌ నెలకొల్పనున్నట్లు వెల్లడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement