Mekapati Goutham Reddy
-
పేరు తొలగించిన మాత్రాన..!
నెల్లూరు, సాక్షి: అధికారం చేపట్టిన వెంటనే.. కొనసాగుతున్న సంక్షేమ పథకాలను ఆపేయడం, వ్యవస్థలను నిర్వీర్యం చేయడం.. ఆఖరికి గత ప్రభుత్వ ఆనవాలు లేకుండా చేయడం పనిగా పెట్టుకున్నారు చంద్రబాబు. తాజాగా.. మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీ వద్ద నేమ్ బోర్డులోంచి దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి పేరును తొలగించడం విమర్శలకు తావిస్తోంది.వైఎస్సార్ హయాంలో 2008లో బ్యారేజ్ పనులు ప్రారంభమైనప్పటికీ.. ఆయన మరణాంతరం ఆ పనులు అటకెక్కాయి. ఆయన వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్ సీఎం అయ్యాక.. రూ.131 కోట్ల వ్యయంతో సంగం బ్యారేజీని పూర్తి చేయించారు. అలాగే 1195 మీటర్ల పొడవుతో రెండు లైన్ల బ్రిడ్జి రోడ్ కూడా నిర్మించారు.ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల 3.85 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతోంది.నాడు సీఎంగా బ్యారేజ్ వద్ద గౌతమ్ రెడ్డి విగ్రహావిష్కరణలో వైఎస్ జగన్.. మేకపాటి కుటుంబ సభ్యులుఇక.. మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజీ నిర్మాణం కోసం నిరంతరం శ్రమించారు. ఆయన హఠాన్మరణం జిల్లావాసులను కలచివేసినా… గౌతంరెడ్డి పేరు చిరస్థాయిగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ బ్యారేజ్‌కు ఆయనపేరు పెట్టాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం పట్ల నెల్లూరు వాసులు, రైతాంగం హర్షం వ్యక్తం చేశారు. నేడు.. కక్షపూరితంగా ఆ పేరు తొలగించడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన పేరు చెరిపినా.. ప్రాజెక్టు కోసం ఎవరు నిజంగా కృషి చేశారనే చరిత్రను మాత్రం చెరపలేరని స్థానికులు అంటున్నారు. -
Mekapati Goutham Reddy: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కాంస్య విగ్రహావిష్కరణ (ఫొటోలు)
-
తప్పు చేయం.. తలవంపులు తీసుకురాం
ఆత్మకూరు: దివంగత మంత్రి, తన సోదరుడు మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆలోచనలు ఎంతో ముందుచూపుతో ఉన్నతంగా ఉండేవని, ఆయనతో ఉండే అనుబంధంతో తాను చిన్న వయసులోనే ఈ విషయాన్ని గమనించానని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి అన్నారు. పట్టణంలో ఏడీఎఫ్, ఎంజీఆర్ ఫౌండేషన్ల ద్వారా సొంత నిధులతో నిర్మించిన ఎంజీఆర్ మున్సిపల్ బస్టాండ్‌ను శుక్రవారం అట్టహాసంగా ప్రారంభించారు. పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్ పాల్గొన్న ఈ సభలో ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి మాట్లాడారు. 1995లో లండన్‌లో చదువు పూర్తి చేసుకొని దేశంలో అడుగుపెట్టిన గౌతమ్‌రెడ్డి అప్పట్లో మాల్ లాంటివి లేకపోవడంతో అది ఏర్పాటు చేసే ఆలోచన చేశారన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికై సరిగ్గా ఈ రోజుతో ఏడాది పూర్తయిందని, ఇచ్చిన మాట మేరకు తొలి కానుకగా మున్సిపల్ బస్టాండ్‌ను ప్రజలకు అంకితం చేస్తున్నానని తెలిపారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పలు వినతులు అందాయని, వాటిని దృష్టిలో ఉంచుకొని ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. ఏడీఎఫ్ ద్వారా రూ.10 కోట్ల సొంత నిధులు వెచ్చించనున్నట్లు తెలిపారు. ఆత్మకూరు నుడా పరిధిలో చేరడం సంతోషకరమని, పేదలకు మరో 15 వేల ఇళ్లు నిర్మించేందుకు అవకాశం కలిగిందని తెలిపారు. ఇప్పటికే రెండు జాబ్‌మేళాలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించగా, శనివారం మరో 1,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా 23 కంపెనీలతో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్‌లో మరో జాబ్‌మేళా నిర్వహిస్తామన్నారు. నారంపేట వద్ద ఏర్పాటు చేసిన ఇండస్ట్రి యల్ పార్కులో ఆరు నెలల్లో ఓ పరిశ్రమ ఏర్పాటు కానుందని, అక్కడ 3 వేల మందికి ఉద్యోగాలు కల్పి ంచేలా పరిశ్రమలు తీసుకురానున్నట్లు తెలిపారు. రానున్న మూడేళ్లలో సోమశిల హైలెవల్ కెనాల్ పూర్తి చేయనున్నట్లు తెలిపారు. తద్వారా ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లోని మెట్ట మండలాలకు సాగు, తాగునీరు లభిస్తుందన్నారు. నియోజకవర్గంలో రెండు జాతీయ రహదారులు ఉండగా, మరో జాతీయ రహదారి రానుందన్నారు. వేర్‌హౌసింగ్, లాజిస్టిక్ పార్కు ఏర్పాటుకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని త్వరలోనే ఆ పనులు వేగవంతమయ్యేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తప్పు చేయం.. తలవంపులు తీసుకురాం మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆత్మకూరు: గత 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నామని, తమ కుటుంబీకులు తప్పు చేయబోరని, ప్రజలకు తలవంపులు తీసుకురామని నెల్లూరు మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ఆత్మకూరులో ఎంజీఆర్ బస్టాండ్ ప్రారంభోత్సవం అనంతరం బహిరంగసభలో ఆయన మాట్లాడారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సేవలు వినియోగించుకున్న కాంగ్రెస్ పార్టీ అనంతరం చెప్పుడు మాటలతో వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఇబ్బందులకు గురిచేయడంతో ఎంపీ పదవికి సైతం రాజీనామా చేసి ఆ కుటుంబం వెంట నడిచామన్నారు. ఆత్మకూరు ప్రాంతానికి తమ కుటుంబం తరపున చిరుకానుకగా ఈ బస్టాండ్‌ను సొంత నిధులతో నిర్మించిన అందజేసినట్లు తెలిపారు. దివంగత వైఎస్సార్ వల్లనే వెలుగొండ ప్రాజెక్ట్, సోమశిల హైలెవల్ కెనాల్ రూపురేఖలు దాల్చాయని, వాటిని వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా త్వరలోనే ప్రారంభిస్తారని పేర్కొన్నారు. సీఎం ఆశీర్వాదంతో తన సోద రుడు మేకపాటి రాజగోపాల్‌రెడ్డి ఉదయగిరి ఇన్చార్జిగా వ్యవహరిస్తారన్నారు. 600 వాగ్దానాలిచ్చి, వాటి ని తుంగలో తొక్కి, మళ్లీ కొత్త మేనిఫెస్టోతో వస్తున్న చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మబోరన్నారు. తండ్రీ, కొడుకులు, దత్తపుత్రుడు అబద్దాలు చెబుతూ ప్రజలను నమ్మించేందుకు పాదయాత్ర,బస్సుయాత్ర చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వీరికితోడు పచ్చపత్రికలు బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని, వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో తిరిగి వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి సతీమణి కీర్తిరెడ్డి, కుమార్తె అనన్య, కుమారుడు అర్జున్, తల్లి మణిమంజరి పాల్గొన్నారు. -
టీడీపీ నిర్లక్ష్యం.. జగన్ సంపూర్ణం
లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించి అన్నదాత ముఖాల్లో ఆనందం చూడాలనే సంకల్పంతో దివంగత నేత వైఎస్సార్ సంగం బ్యారేజ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అనంతరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు వివిధ కారణాలతో బ్యారేజ్ నిర్మాణ పనులపై నిర్లక్ష్యం చూపాయి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టాక తండ్రి ఆశయాన్ని నెరవేరుస్తూ రైతులకు అవసరమైన మేర సాగునీరందించాలనే లక్ష్యంతో సంగం బ్యారేజ్ నిర్మాణాన్ని పూర్తి చేసి రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. సంగం: రైతులకు ఇచ్చిన మాటను నెరవేర్చేందుకు అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విశేష కృషి చేశారు. వీరి కృషి ఫలితంగానే సంగం వద్ద మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్ నిర్మితమై రైతుల పొలాలకు సాగునీరు అందుతుండడంతో వారి ఆనందానికి అవధులు లేవు. 2004వ సంవత్సరంలో సంగంకు వచ్చిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు, ప్రజలు సంగం వద్ద పెన్నానదిపై నిర్మించిన ఆనకట్ట శిథిలమైందని, బ్యారేజ్‌ను నిర్మించాలని విన్నవించారు. అప్పటికే ఉన్న పాత ఆనకట్టను నిర్మించి 125 సంవత్సరాలు దాటడంతో ప్రమాదకరంగా తయారైంది. ఆనకట్ట దెబ్బతింటే లక్షలాది మంది రైతులు ఇబ్బందులు పడతారని గ్రహించిన ఆయన 2006లో సంగం వద్ద రూ.90 కోట్ల నిర్మాణ వ్యయంతో నూతన బ్యారేజ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టి శంకుస్థాపన చేశారు. మొదట్లో బ్యారేజ్ నిర్మాణం గిట్టుబాటు కాదని కాంట్రాక్టర్ నిర్మాణం చేపట్టకపోవడంతో వైఎస్సార్ అధికారులతో చర్చించి 2008లో బ్యారేజ్ నిర్మాణ వ్యయాన్ని రూ.110 కోట్లకు పెంచి మరో సంస్థకు పనులు అప్పగించారు. దీంతో నూతన బ్యారేజ్ నిర్మాణ పనులు జోరందుకున్నాయి. 2009లో వైఎస్సార్ అకాల మృతితో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం సంగం బ్యారేజ్ నిర్మాణంపై శీతకన్ను వేయడంతో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చెందారు. టీడీపీ హయాంలో కాలయాపన 2009లో వైఎస్సార్ మృతి అనంతరం వచ్చిన ముఖ్యమంత్రులు బ్యారేజ్ నిర్మాణంపై సక్రమంగా దృష్టి సారించలేదు. దీంతో పనులు నత్తనడకన సాగాయి. తదుపరి 2014లో ఏర్పాటైన తెలుగుదేశం ప్రభుత్వం సైతం బ్యారేజ్ నిర్మాణం పూర్తయితే జిల్లాలోని 6 నియోజకవర్గాల్లోని అన్నదాతల దృష్టిలో వైఎస్సార్ దేవుడవుతారనే భయంతో పనులు సక్రమంగా జరగకుండా ప్లాన్, డిజైన్ల మార్పుల పేరుతో కాలయాపన చేసింది. దీంతో బ్యారేజ్ నిర్మాణం ఇక జరగదని రైతులు భావించారు. హామీ ఇచ్చి.. ధైర్యం నింపి.. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా అప్పట్లో ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి సంగం వచ్చి అసంపూర్తిగా ఉన్న బ్యారేజ్ నిర్మాణ పనులను పరిశీలించారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే త్వరగా బ్యారేజ్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఆత్మకూరు నియోజకవర్గ సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్ర చేసిన వైఎస్సార్సీపీ నేత మేకపాటి గౌతమ్‌రెడ్డి సైతం సంగం బ్యారేజ్‌ను తమ ప్రభుత్వంలో పూర్తి చేస్తామని చెప్పారు. ఆనందంలో అన్నదాతలు నూతన బ్యారేజ్‌ను ప్రారంభించిన తరువాత రెండు పంటలు పండించుకుంటున్న అన్నదాతల్లో ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. జిల్లాలోని ఆత్మకూరు, సర్వేపల్లి, కావలి, నెల్లూరు, నెల్లూరురూరల్, కోవూరు నియోజకవర్గాల్లో 5 లక్షల ఎకరాలకు పైగా అధికార ఆయకట్టు రైతులకు, అనధికారికంగా మరో లక్ష ఎకరాలకు పైగా ఆయకట్టుకు నూతన బ్యారేజ్ ద్వారా సాగునీటి సరఫరా జరుగుతోంది. కావలి, నెల్లూరు పట్టణ ప్రజలకు తాగునీరు సైతం ఇక్కడి నుంచే సరఫరా చేస్తున్నారు. దీంతోపాటు బ్యారేజ్ వద్ద 0.5 టీఎంసీల నీరు నిల్వ ఉండడంతో భూగర్భజలాలు పెరిగి సంగం ప్రాంతంలో సాగు, తాగునీటి సమస్యలు తొలగిపోయాయని రైతులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నూతన బ్యారేజ్ నిర్మాణ పనులు పరుగులు పెట్టాయి. తన తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను, కాంట్రాక్ట్ సంస్థలను సమన్వయపరిచి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తూ బ్యారేజ్ నిర్మాణ పనులను వేగవంతం చేశారు. అంతేకాకుండా 850 మీటర్లు ఉన్న బ్యారేజ్‌ను 1185 మీటర్లకు పైగా పెంచి రూ.340 కోట్ల వ్యయంతో నిర్మించేలా చర్యలు తీసుకున్నారు. అప్పటి ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సైతం ఆత్మకూరు తన నియోజకవర్గం కావడంతో సంగం బ్యారేజ్ నిర్మాణం త్వరగా పూర్తి చేసేందుకు పూనుకున్నారు. ఇరిగేషన్‌శాఖ మంత్రిగా ఉన్న పి.అనిల్‌కుమార్‌యాదవ్ సైతం బ్యారేజ్‌ను పరిశీలించి పనులు వేగవంతం చేశారు. తండ్రి వైఎస్సార్ ఇచ్చిన మాటను కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేరుస్తూ బ్యారేజ్ నిర్మాణాన్ని పూర్తి చేయించారు. ఈ సమయంలో ఐటీ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో సంగం బ్యారేజ్‌కు ఆయన పేరు పెడుతూ 2022 సెప్టెంబర్ 6వ తేదీన బ్యారేజ్‌ను ప్రారంభించి స్నేహధర్మాన్ని సైతం చాటుకున్నారు. రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్ వల్ల జిల్లాలోని 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాం. పాత ఆనకట్ట శిథిలమైన సమయంలో సాగునీరు అందించాలంటే ఆనకట్ట వద్ద ఇసుక బస్తాలు వేసి నీరు సరఫరా పరిస్థితి ఉండేది. ప్రస్తుతం బ్యారేజ్ నిర్మాణం పూర్తి కావడం వల్ల జిల్లాలోని రైతాంగానికి పూర్తిగా సాగునీరు, అవసరమైన చోట్ల తాగునీటిని సైతం అందిస్తున్నాం. – మేకల అనిల్‌కుమార్‌రెడ్డి, రుణపడి ఉన్నారు సంగం బ్యారేజ్‌కు శంకుస్థాపన చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డికి, బ్యారేజ్ నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి జిల్లా రైతాంగం, ప్రజలు రుణపడి ఉన్నారు. 5 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు సరఫరా అవుతుండడం చాలా సంతోషకరం. – పులగం శంకర్‌రెడ్డి. అన్నారెడ్డిపాళెం, సంగం అపర భగీరథుడు వైఎస్సార్ సంగం వద్ద పాత ఆనకట్ట శిథిలావస్థకు చేరడంతో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నూతన బ్యారేజ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి మా ప్రాంతానికి నీరందించేలా కృషి చేసిన అపర భగీరథుడు. ఎన్ని ప్రభుత్వాలు మారినా బ్యారేజ్ నిర్మాణాన్ని ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తి చేసి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. – మెట్టుకూరు వాసుదేవరెడ్డి, సంగం -
నేడు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మొదటి వర్ధంతి
-
మరువలేని నేత.. సదాస్మరామి.. మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రథమ వర్ధంతి
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం మర్రిపాడు మండలంలోని బ్రాహ్మణపల్లిలో నిర్వహించారు. ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి, నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని గౌతమ్ రెడ్డికి నివాళులు అర్పించారు. మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మికంగా మృతి చెంది ఏడాది అయినా ఇంకా జనం గుండెల్లో గూడుకట్టుకుని ఉన్నారు. మరువలేని నేతను.. మరోసారి స్మరించుకునేందుకు అభిమానులు వర్ధంతి కార్యక్రమానికి తరలివచ్చారు. ఇందుకుతగ్గట్టుగానే కుటుంబ సభ్యులు విస్తృత ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని పలువురు ప్రముఖులతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని మేకపాటి అభిమానులు, వైఎస్సార్సీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా వర్ధంతి కార్యక్రమానికి హాజరై ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. -
‘చిరస్మరణీయుడు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ప్రజా, రాజకీయ జీవితాన్ని విశ్లేషిస్తూ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి.. రచయిత, జర్నలిస్ట్ విజయార్కె రాసిన ‘చిరస్మరణీయుడు’ పుస్తకాన్ని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను సీఎం జగన్ నెమరువేసుకున్నారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి, పిల్లుట్ల రఘు, మోచర్ల నారాయణ రావు, పీర్ల పార్ధసారధి పాల్గొన్నారు. చదవండి: ఏపీపై ‘దుష్టచతుష్టయం’ పగబట్టిందా.. వచ్చే ఎన్నికల వరకు భరించాల్సిందేనా? -
స్థపతి వడయార్‌కు స్వర్ణ కంకణం బహూకరించిన సీఎం జగన్
సాక్షి, సోమశిల (నెల్లూరు): దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కాంస్య విగ్రహాల రూపకల్పన చేసిన స్థపతి వడయార్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వర్ణ కంకణం బహూకరించారు. సంగంలో మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రి బహిరంగ సభలో విగ్రహాలు తయారు చేసిన స్థపతి వడయార్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా స్థపతి చేతికి స్వర్ణ కంకణాన్ని తొడిగి అభినందించారు. చదవండి: (నెల్లూరు రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు పచ్చజెండా) -
Mekapati Goutham Reddy Sangam Barrage: పెన్నా పారవశ్యం!
సాక్షి, అమరావతి: పెన్నా యవనికపై చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జీవనాడులైన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్‌లను జలయజ్ఞంలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. ఈ రెండు బ్యారేజీలను పూర్తి చేసిన ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం జాతికి అంకితం చేశారు. తండ్రి చేపట్టిన రెండు బ్యారేజీలను తనయుడు పూర్తి చేసి జాతికి అంకితం చేయడం దేశ చరిత్రలో ఇదే ప్రథమమని అధికారవర్గాలు చెబుతున్నాయి. వందేళ్ల స్వప్నమైన రెండు బ్యారేజీలు సాకారమవడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సంగం బ్యారేజ్ కింద 3.85 లక్షల ఎకరాలు, నెల్లూరు బ్యారేజ్ కింద 99,525 ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లందించేందుకు మార్గం సుగమమైంది. ఏటా ఇసుక బస్తాలకు భారీ వ్యయం ► నెల్లూరు జిల్లాలో కనిగిరి, కావలి, కనుపూరు కాలువల ద్వారా ఆయకట్టుకు నీళ్లందించేలా పెన్నా నదిపై సంగం వద్ద 1882–83లో 846 మీటర్ల పొడవు, 0.9 మీటర్ల ఎత్తుతో బ్రిటీష్ సర్కార్ ఆనకట్ట నిర్మించింది. ఆనకట్టకు దిగువన నదీ గర్భంలో నిర్మించిన రోడ్డు ద్వారా సంగం–పొదలకూరు మండలాల మధ్య రాకపోకలు సాగించేవారు. సంగం ఆనకట్ట శిథిలమవడంతో 0.3 మీటర్ల ఎత్తున ఇసుక బస్తాలు వేసి నీటిని నిల్వ చేసినా ఆయకట్టుకు సక్రమంగా నీళ్లందేవి కావు. పెన్నాకు వరద వస్తే ఇసుక బస్తాలు కొట్టుకుపోయేవి. ఇసుక బస్తాల కోసం ఏటా రూ.50 లక్షల నుంచి రూ.కోటికిపైగా వ్యయమయ్యేది. వరద వస్తే సంగం–పొదలకూరు మండలాల మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించేవి. ఆనకట్టలో నీళ్లు లేక తాగునీటికి తీవ్ర ఇక్కట్లు ఎదురయ్యేవి. ► సంగం ఆనకట్టకు 20 కి.మీ. దిగువన నెల్లూరు సమీపంలో 1854–55లో 481.89 మీటర్ల పొడవు, 0.7 మీటర్ల ఎత్తుతో ఆనకట్టను నిర్మించిన బ్రిటీష్ సర్కార్ సర్వేపల్లి, జాఫర్ సాహెబ్ కాలువల ద్వారా ఆయకట్టుకు నీళ్లందించింది. 1862లో వరదలకు కొట్టుకుపోవడంతో అదే ఏడాది మళ్లీ కొత్తగా 621.79 మీటర్ల పొడవుతో ఆనకట్ట నిర్మించారు. ఈ ఆనకట్ట కూడా శిథిలమవడంతో ఆయకట్టుకు నీళ్లందించడం సవాలుగా మారింది. ఇసుక బస్తాలు వేసి నీటిని నిల్వ చేసినా వరద వస్తే కొట్టుకుపోయేవి. దీనికోసం చాలా ఖర్చయ్యేది. పెన్నాకు ఏమాత్రం వరద వచ్చినా నెల్లూరు–కోవూరు మధ్య రాకపోకలు స్తంభించిపోయేవి. ఆనకట్టలో నీరు లేక నెల్లూరు దాహార్తితో తల్లడిల్లేది. ► సాగు, తాగునీరు, రవాణా, ముంపు ముప్పు సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఆనకట్టల స్థానంలో సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్‌ను నిర్మించాలని వందేళ్లుగా నెల్లూరు ప్రజలు కోరుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. 2004 మే 14న సీఎంగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసిన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి నెల్లూరు జిల్లా ప్రజల వందేళ్ల కలను సాకారం చేస్తూ సంగం, నెల్లూరు బ్యారేజ్‌ల పనులకు శ్రీకారం చుట్టారు. ఆయన హఠాన్మరణంతో పనులకు గ్రహణం పట్టింది. నాటికి, నేటికి ఇదీ తేడా... సంగం, నెల్లూరు బ్యారేజ్‌ల పనులను 2014 నుంచి 2016 వరకూ అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్ పూర్తిగా నిలిపివేసింది. ఆ తర్వాత కమీషన్లు వసూలు చేసుకునేందుకు వీలున్న పనులను మాత్రమే చేపట్టారు. చివరకు రెండు బ్యారేజ్‌లను పూర్తి చేయలేక చేతులెత్తేశారు. 2019 మే 30న సీఎంగా బాధ్యతలు చేపట్టాక జలయజ్ఞం ప్రాజెక్టులపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. 2008 ఏప్రిల్ 29న నెల్లూరు బ్యారేజ్ పనులకు శంకుస్థాపన చేసిన వైఎస్సార్ సంగం, నెల్లూరు బ్యారేజ్‌లను ప్రాధాన్యతగా చేపట్టి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. కరోనా, పెన్నాకు మూడేళ్లుగా వరదలు వంటి ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ రెండు బ్యారేజ్‌లను సీఎం జగన్ పూర్తి చేశారు. సాగు, తాగునీటితోపాటు రవాణా సమస్యలను శాశ్వతంగా పరిష్కరించారు. బ్యారేజ్‌ల ద్వారా వరదను సమర్థంగా నియంత్రించి ముంపు ముప్పు తప్పించేలా మార్గం సుగమం చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తి చేసిన నెల్లూరు బ్యారేజ్ మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్ ఎక్కడ : శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం వద్ద పెన్నా (సోమశిల రిజర్వాయర్‌కు 40 కి.మీ. దిగువన) పరీవాహక ప్రాంతం: 50,122 చదరపు కిలోమీటర్లు బ్యారేజ్ పొడవు : 1,195 మీటర్లు (బ్యారేజ్‌కు అనుబంధంగా రెండు వరసల రోడ్ బ్రిడ్జి) గేట్లు : 85 గేట్లు(12 మీటర్లు ఎత్తు, 2.8 మీటర్ల వెడల్పుతో 79 గేట్లు.. 12 మీటర్ల ఎత్తు, 3.8 మీటర్ల వెడల్పుతో 6 స్కవర్ స్లూయిజ్ గేట్లు) గేట్ల మరమ్మతుల కోసం సిద్ధం చేసిన స్టాప్ లాగ్ గేట్లు : 9 గేట్ల నిర్వహణ విధానం : వర్టికల్ లిఫ్ట్ గరిష్ట వరద విడుదల సామర్థ్యం : 7,50,196 క్యూసెక్కులు గరిష్ట నీటి మట్టం : 35 మీటర్లు గరిష్ట నీటి నిల్వ : 0.45 టీఎంసీలు కనీస నీటి మట్టం : 32.2 మీటర్లు ఆయకట్టు : 3.85 లక్షల ఎకరాలు అంచనా వ్యయం : రూ.335.80 కోట్లు వైఎస్సార్ హయాంలో వ్యయం : రూ.30.85 కోట్లు టీడీపీ హయాంలో వ్యయం : రూ.86.10 కోట్లు (కాంట్రాక్టర్ నుంచి కమీషన్లు వసూలు చేసుకోవడానికి సులభమైన పనులను మాత్రమే చేపట్టారు) వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన వ్యయం : రూ.131.12 కోట్లు నెల్లూరు బ్యారేజ్ ఎక్కడ : నెల్లూరు నగరానికి సమీపంలో పెన్నా నదిపై (మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌కు 20 కి.మీ. దిగువన) పరీవాహక ప్రాంతం : 51,800 చదరపు కిలోమీటర్లు బ్యారేజ్ పొడవు : 640 మీటర్లు (బ్యారేజ్‌కు అనుబంధంగా రెండు వరుసల రోడ్ బ్రిడ్జి) గేట్లు : 51 (పది మీటర్లు ఎత్తు, మూడు మీటర్ల వెడల్పుతో 43 గేట్లు.. పది మీటర్లు ఎత్తు, 4.3 మీటర్ల ఎత్తుతో ఎనిమిది స్కవర్ స్లూయిజ్ గేట్లు) గేట్ల మరమ్మతుకు సిద్ధం చేసిన స్టాప్‌లాగ్ గేట్లు: 6 గేట్ల నిర్వహణ : వర్టికల్ లిఫ్ట్ గరిష్ట వరద విడుదల సామర్థ్యం : 10,90,000 క్యూసెక్కులు గరిష్ట నీటి మట్టం : 14.3 మీటర్లు గరిష్ట నీటి నిల్వ : 0.4 టీఎంసీలు కనీస నీటి మట్టం : 11.3 మీటర్లు ఆయకట్టు : 99,525 ఎకరాలు అంచనా వ్యయం : రూ.274.83 కోట్లు వైఎస్సార్ హయాంలో చేసిన వ్యయం : రూ.86.62 కోట్లు టీడీపీ హయాంలో చేసిన వ్యయం : రూ.71.54 కోట్లు (కాంట్రాక్టర్ నుంచి కమీషన్లు వసూలు చేసుకోవడానికి సులభమైన పనులను మాత్రమే చేశారు) వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన వ్యయం : రూ.77.37 కోట్లు. -
సంగం బ్యారేజీ వద్ద వైఎస్సార్, గౌతంరెడ్డి విగ్రహాలు
కొత్తపేట: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం బ్యారేజీ వద్ద దివంగత సీఎం వైఎస్సార్, దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డిల కాంస్య విగ్రహాలతో పాటు, నెల్లూరు బ్యారేజ్ కమ్ బ్రిడ్జి వద్ద వైఎస్సార్ విగ్రహాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహాలను డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన ప్రముఖ జాతీయ శిల్పి డి.రాజ్‌కుమార్ వుడయార్ తయారు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ మేరకు ఈ మూడు విగ్రహాలను తయారు చేసినట్టు రాజ్‌కుమార్ ఆదివారం ‘సాక్షి’తో చెప్పారు. ఒక్కో విగ్రహాన్ని 2.5 టన్నుల కాంస్యంతో 15 అడుగుల ఎత్తుతో తయారు చేశానన్నారు. గౌతంరెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో సంగం బ్యారేజీ వద్ద వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, తయారు చేయాల్సిందిగా తనకు సూచించారని గుర్తు చేసుకున్నారు. కానీ వైఎస్సార్ విగ్రహంతో పాటు గౌతంరెడ్డి విగ్రహాన్ని కూడా తయారు చేయాల్సి వచ్చిందని రాజ్‌కుమార్ భావోద్వేగానికి లోనయ్యారు. కొత్తపేట శిల్పశాలలో వైఎస్సార్, గౌతంరెడ్డి విగ్రహాలతో శిల్పి రాజ్‌కుమార్ -
సీఎం జగన్ నెల్లూరు జిల్లా పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. పెన్నానదిపై సంగం వద్ద నిర్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ బహిరంగసభలో మాట్లాడతారు. తరువాత ముఖ్యమంత్రి జగన్ నెల్లూరు చేరుకుని నెల్లూరు బ్యారేజ్ కమ్ బ్రిడ్జిని ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. సీఎం జగన్ పర్యటన ఇలా.. ► ఉదయం 9.30 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 10.40 గంటలకు సంగం చేరుకుంటారు. ► 11–1.10 గంటల మధ్య మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌ను ప్రారంభించి, బహిరంగసభలో ప్రసంగిస్తారు. ► 1.20 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1.45 గంటలకు నెల్లూరు బ్యారేజ్ వద్దకు చేరుకుంటారు. ► 1.50–2.20 గంటల మధ్య నెల్లూరు బ్యారేజ్ కమ్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు. ► 2.20 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4.15 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
దశాబ్దాల కల ‘సంగం’ సాకారం
మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్ నిర్మాణం పూర్తి కావడంతో పెన్నా డెల్టాలోని 2.47 లక్షల ఎకరాలు, కనుపూరు కాలువ కింద 63 వేలు, కావలి కాలువ కింద 75 వేలు వెరసి మొత్తంగా 3.85 లక్షల ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లందించడానికి మార్గం సుగమం అయ్యింది. ప్రధానంగా నెల్లూరుకు ముంపు ముప్పు తప్పింది. చెప్పిన మాట మేరకు యుద్ధ ప్రాతిపదికన బ్యారేజ్ నిర్మాణం పూర్తి చేయడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన నిబద్ధతను చాటుకున్నారు. దీనికి తోడు నెల్లూరు బ్యారేజీ కమ్ బ్రిడ్జి కూడా రికార్డు సమయంలో పూర్తి కావడం విశేషం. (మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి రామగోపాలరెడ్డి ఆలమూరు): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రజల దశాబ్దాల స్వప్నం సాకారమైంది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్ పనులను ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తి చేశారు. ఈనెల 6న బ్యారేజ్‌ను జాతికి అంకితం చేయనున్నారు. దీంతో పాటు నెల్లూరు బ్యారేజీ కమ్ బ్రిడ్జిని కూడా రికార్డు సమయంలో పూర్తి చేశారు. సంగం బ్యారేజీ నిర్మాణం ద్వారా పెన్నా వరదలను సమర్థవంతంగా నియంత్రించి, ముంపు ముప్పు నుంచి నెల్లూరు జిల్లా ప్రజలను తప్పించవచ్చు. బ్యారేజ్‌లో 0.45 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉండటం వల్ల పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరగడం ఖాయం. తద్వారా తాగునీటి ఇబ్బందులు తీరుతాయి. మేకపాటి గౌతమ్‌రెడ్డి బ్యారేజ్ కమ్ బ్రిడ్జిని పూర్తి చేయడం ద్వారా సంగం, పొదలకూరు మండలాల మధ్య రాకపోకల సమస్యను సీఎం వైఎస్ జగన్ శాశ్వతంగా పరిష్కరించారు. శిథిలమైనా పట్టించుకోని దుస్థితి నెల్లూరు జిల్లా సంగం వద్ద పెన్నా నదిపై 1882–83లో బ్రిటీష్ సర్కార్ 0.9 మీటర్ల ఎత్తున ఆనకట్టను నిర్మించి.. పెన్నా డెల్టా, కనుపూరు, కావలి కాలువల కింద ఆయకట్టుకు 1886 నుంచి నీళ్లందించడం ప్రారంభించింది. ఈ ఆనకట్టకు దిగువన నదీ గర్భంలో నిర్మించిన రోడ్డు ద్వారా సంగం–పొదలకూరు మండలాల మధ్య రాకపోకలు సాగుతున్నాయి. పెన్నాలో వరద పెరిగితే ఈ రెండు మండలాల మధ్య రాకపోకలు స్తంభించిపోయేవి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఆనకట్ట శిథిలావస్థకు చేరుకోవడంతో.. దానిపై 0.3 మీటర్ల మేర ఇసుక బస్తాలు వేసి, నీటిని నిల్వ చేసినా.. ఆయకట్టుకు నీళ్లందించడం కష్టంగా మారింది. సంగం ఆనకట్ట స్థానంలో బ్యారేజ్ నిర్మించి, ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీళ్లందించాలని నెల్లూరు జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తూ వచ్చారు. అయితే ఆ డిమాండ్‌ను 2006 వరకూ ఎవరూ పట్టించుకోలేదు. సీఎం వైఎస్ జగన్ పూర్తి చేసిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ స్వప్నం సాకారం దిశగా అడుగులు.. నెల్లూరు జిల్లా ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసే దిశగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2006 మే 28న సంగం బ్యారేజ్‌కు శంకుస్థాపన చేశారు. రూ.147.50 కోట్ల అంచనా వ్యయంతో 2008 మే 21న పనులు చేపట్టారు. మహానేత వైఎస్ హయాంలో బ్యారేజ్ పనులు పరుగులు తీశాయి. ఈ పనులకు అప్పట్లో రూ.30.85 కోట్లు వ్యయం చేశారు. అయితే మహానేత వైఎస్ హఠాన్మరణం సంగం బ్యారేజ్ పనులకు శాపంగా మారింది. కమీషన్లు వచ్చే పనులకే టీడీపీ హయాంలో పెద్దపీట సంగం బ్యారేజ్‌ను నిర్మిస్తున్న ప్రాంతంలో పెన్నా నది వెడల్పు 1,400 మీటర్లు. కానీ.. అప్పట్లో సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో) చీఫ్ ఇంజనీర్ 846 మీటర్ల వెడల్పుతో బ్యారేజ్ (కాంక్రీట్ నిర్మాణం), ఇరువైపులా 554 మీటర్ల వెడల్పుతో మట్టికట్టలు నిర్మించేలా డిజైన్‌ను ఆమోదించారు. బ్యారేజ్ నిర్మాణ సమయంలో ఇబ్బందులు ఏర్పడటంతో డిజైన్లలో మార్పులు చేయాలని 2013లో అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం 2013 నవంబర్ 23న నిపుణుల కమిటీని నియమించింది. బ్యారేజ్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించిన నిపుణుల కమిటీ.. 1,195 మీటర్ల వెడల్పుతో బ్యారేజ్ (కాంక్రీట్ కట్టడం) నిర్మించాలని 2014లో నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను ఆమోదించడంలో రెండేళ్ల పాటు జాప్యం చేసిన టీడీపీ సర్కార్.. ఎట్టకేలకు 2016 జనవరి 21న బ్యారేజ్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో అంచనా వ్యయాన్ని రూ.335.80 కోట్లకు పెంచింది. బ్యారేజ్‌ను 2017కు పూర్తి చేస్తామని ఒకసారి.. 2018కి పూర్తి చేస్తామని మరోసారి.. 2019కి పూర్తి చేస్తామని ఇంకోసారి ముహూర్తాలను మారుస్తూ వచ్చింది. టీడీపీ సర్కార్ కేవలం కమీషన్లు వచ్చే పనులకే అధిక ప్రాధాన్యం ఇచ్చింది. బ్యారేజ్‌లో 85 పియర్స్(కాంక్రీట్ దిమ్మెలు)ను సగటున 22 మీటర్ల చొప్పున అరకొరగా పూర్తి చేసింది. చేసిన పనుల కంటే.. ధరల సర్దుబాటు(ఎస్కలేషన్), పనుల పరిమాణం పెరిగిందనే సాకుతో అధికంగా బిల్లులు చెల్లించింది. రూ.86.10 కోట్లను ఖర్చు చేసినా బ్యారేజ్ పనులను ఒక కొలిక్కి తేలేకపోయింది. పెన్నా నదిపై సంగం బ్యారేజీ దిగువ వైపు నుంచి... అటు కరోనా, ఇటు వరద.. అయినా పూర్తి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక సంగం బ్యారేజ్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రాధాన్యత ప్రాజెక్టుగా ప్రకటించి, శరవేగంగా పూర్తి చేయాలని జల వనరుల శాఖ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. 2020 మార్చి నుంచి 2021 ఆఖరుదాకా కరోనా మహమ్మారి విజృంభించింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో 2019–20, 2020–21, 2021–22లో పెన్నా నది ఉప్పొంగి ప్రవహించింది. 2019–20 లో 42.52, 2020–21లో 301.52, 2021–22లో 373.52 టీఎంసీల నీరు నెల్లూరు బ్యారేజీ నుంచి సముద్రంలో కలిసిందంటే ఏ స్థాయిలో వరద వచ్చిందో అంచనా వేసుకోవచ్చు. ఓ వైపు కరోనా మహమ్మారి తీవ్రత.. మరో వైపు పెన్నా వరద ఉధృతితో పోటీ పడుతూ సంగం బ్యారేజ్ పనులను సీఎం వైఎస్ జగన్ పరుగులెత్తించారు. బ్యారేజ్ 85 పియర్లను 43 మీటర్ల ఎత్తుతో పూర్తి చేయించారు. ఈ పియర్స్ మధ్య 12 మీటర్ల ఎత్తు, 2.8 మీటర్ల వెడల్పుతో 79 గేట్లు, కోతకుగురై వచ్చిన మట్టిని దిగువకు పంపడానికి 12 మీటర్ల ఎత్తు, 3.8 మీటర్ల వెడల్పుతో 6 గేట్లు (స్కవర్ స్లూయిజ్) బిగించారు. వరద ప్రవాహం వచ్చినప్పుడు దిగువకు విడుదల చేయడానికి వీలుగా గేట్లను ఎత్తడానికి, దించడానికి విద్యుత్‌తో పనిచేసే హాయిస్ట్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. బ్యారేజ్‌కు ఎగువన ఎడమ వైపున 3.17 కిలోమీటర్లు, బ్యారేజ్‌కు కుడి వైపున 3 కిలోమీటర్ల పొడవున కరకట్టలను పటిష్టం చేశారు. సంగం నుంచి పొదలకూరుకు రాకపోకలు సాగించడానికి వీలుగా బ్యారేజ్‌పై రెండు వరుసల రోడ్ బ్రిడ్జిని పూర్తి చేశారు. కనిగిరి, కావలి కాలువలకు సంయుక్తంగా నీటిని సరఫరా చేసే రెగ్యులేటర్, కనుపూరు కాలువకు నీటిని సరఫరా చేసే రెగ్యులేటర్లను పూర్తి చేశారు. ఈ పనులను రూ.131.12 కోట్ల ఖర్చుతో పూర్తి చేసి.. నెల్లూరు ప్రజల దశాబ్దాల స్వప్నాన్ని సాకారం చేశారు. నెల్లూరు బ్యారేజీ కమ్ బ్రిడ్జి ప్రాజెక్టు సైతం రికార్డు సమయంలో నెల్లూరు బ్యారేజీ కమ్ బ్రిడ్జిని కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పూర్తి చేసింది. జలయజ్ఞంలో భాగంగా దివగంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008–09లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టును పదేళ్ల తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి సీఎంగా పూర్తి చేశారు. నెల్లూరు నగరానికి సమీపాన ఇప్పటికే ఉండే పాత ఆనకట్టకు వంద మీటర్ల ఎగువున ఇంకొక కొత్త బ్యారేజీ కమ్ బ్రిడ్జి ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టును కూడా ఈ నెల 6న జాతికి అంకితం చేయనున్నారు. 13 ఏళ్ల క్రితం మొదట్లో రూ.147.20 కోట్ల అంచనాతో మొదలు పెట్టిన ఈ ప్రాజెక్టులో 2014కు ముందే రూ.86.62 కోట్ల మేరకు పనులు పూర్తయ్యాయి. తర్వాత ప్రాజెక్టు వ్యయం రూ.274.83 కోట్లకు పెరిగింది. 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం రూ.71.54 కోట్లు ఖర్చు చేసినా ప్రాజెక్టు పూర్తి చేసే ఆలోచనతో కాకుండా ప్రాజెక్టు నిర్మాణంలో కేవలం కమీషన్లకు అవకాశం ఉన్న పనులు చేపట్టేందుకు ఆసక్తి చూపింది. అయితే 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఈ ప్రాజెక్టును ప్రాధాన్యత ప్రాజెక్టుగా గుర్తించారు. కేవలం మూడేళ్లలో రూ.77.37 కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టు ప్రధాన కాంక్రీట్, ఇతర మట్టి పనులన్నింటినీ ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా 72 గ్రామాల పరిధిలోని 99,525 ఎకరాల్లో సాగు నీటి పారుదల అవకాశాలు మెరుగు పడతాయి. నెల్లూరు– కోవూరుల మధ్య రాకపోకల ఇబ్బందులు పూర్తిగా తొలగిపోనున్నాయి. ఆనకట్టకు ఎగువన ఇన్ఫిల్ట్రేషన్ బావులు నిండడం వల్ల ఆ ప్రాంతంలో భూగర్భ జల మట్టం పెరిగి నెల్లూరు çనగరం.. ఆ చుట్టు పక్కల ప్రాంతాలకు తాగునీటి అవసరాలు తీరే అవకాశం ఉంది. ఇదో మహోజ్వల ఘట్టం సంగం బ్యారేజ్ నిర్మాణాన్ని మహానేత వైఎస్సార్ ప్రారంభిస్తే.. ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ పూర్తి చేసి ఈ నెల 6న జాతికి అంకితం చేయనుండటం మహోజ్వల ఘట్టం. కరోనా తీవ్రత, పెన్నా వరద ఉధృతిని తట్టుకుని.. బ్యారేజ్‌ను పూర్తి చేశాం. నెల్లూరు జిల్లా ప్రజలకు మేకపాటి గౌతమ్‌రెడ్డి చేసిన సేవలను స్మరించుకుంటూ బ్యారేజ్‌కు ఆయన పేరు పెట్టాం. పెన్నా డెల్టా, కనుపూరు, కావలి కాలువల ఆయకట్టుకు నీళ్లందించి సస్యశ్యామలం చేస్తాం. – అంబటి రాంబాబు, జల వనరుల శాఖ మంత్రి రికార్డు సమయంలో పూర్తి సీఎం ఆదేశాల మేరకు బ్యారేజ్‌ను రికార్డు సమయంలో పూర్తి చేశాం. 3.85 లక్షల ఎకరాలకు నీళ్లందించడానికి ఇది దోహదపడుతుంది. బ్యారేజ్‌లో నిత్యం 0.45 టీఎంసీలను నిల్వ చేయడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. సాగు, తాగునీటికి ఇబ్బంది ఉండదు. బ్రిడ్జితో సంగం–పొదలకూరు మధ్య రవాణా సమస్యకు పరిష్కారం లభించింది. – సి.నారాయణరెడ్డి, ఈఎన్సీ నాణ్యతకు ప్రాధాన్యత సంగం బ్యారేజ్ పనులను అత్యంత నాణ్యతతో శరవేగంగా పూర్తి చేశాం. సీఎం వైఎస్ జగన్ ప్రాధాన్యత ప్రాజెక్టుగా సంగం బ్యారేజ్‌ను ప్రకటించి.. గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ మేరకు గడువులోగా పూర్తి చేశాం. నెల్లూరు జిల్లా ప్రజల దశాబ్దాల కలను సీఎం వైఎస్ జగన్ నిజం చేశారు. – హరినారాయణ రెడ్డి, సీఈ, తెలుగుగంగ -
సస్యశ్యామలం.. సిరుల పంటలకు సంగం బ్యారేజీ సిద్ధం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రతిష్టాత్మకమైన సంగం బ్యారేజీ చివరి దశ పనులు చురుగ్గా సాగుతున్నాయి. పెన్నా డెల్టాకు జీవనాడిగా అభివర్ణించే ఈ బ్యారేజీ పనులు 95 శాతానికి పైగా పూర్తయ్యాయి. మిగిలిన పనులను శరవేగంగా పూర్తిచేసి.. ఈ సీజన్లోనే ప్రారంభించేందుకు జలవనరులశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. సంగం వద్ద పెన్నానదిపై 1882–86 మధ్య బ్రిటిష్ సర్కార్ బ్యారేజీ నిర్మించింది. ఈ బ్యారేజీ ద్వారా లక్షలాది ఎకరాలకు నీళ్లందుతాయి. బ్యారేజీ శిథిలావస్థకు చేరుకోవడంతో నీటినిల్వ సామర్థ్యం కనిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో ఆయకట్టుకు నీళ్లందించడం కష్టంగా మారింది. జలయజ్ఞంలో భాగంగా కొత్త బ్యారేజీకి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరర్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ఆయన మరణానంతరం వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. బ్యారేజీ పనులు చేయడంలో టీడీపీ సర్కార్ పూర్తిగా విఫలమైంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక సంగం బ్యారేజీని ప్రాధాన్య ప్రాజెక్టుగా చేపట్టిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరలో జాతికి అంకితం చేయనున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రైతుల కలల బ్యారేజీ నిర్మాణం పూర్తయింది. బీడు భూముల్లో సిరుల పంటలు పండనున్నాయి. ఐదున్నర లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు యోగ్యకరం కానుంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అంకరార్పణ చేస్తే, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్మాణ పనులు పూర్తిచేశారు. శిథిలావస్థలో ఉన్న 135 ఏళ్ల నాటి ఆనకట్ట కమ్ బ్యారేజీ సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంది. త్వరలో మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా జాతికి అంకితం కానుంది. బ్రీటీష్ కాలంలో సింహపురి ప్రాంత అన్నదాతల కోసం నిర్మించిన సంగం బ్యారేజ్ శిథిలావస్థకు చేరుకుంది. సాగునీటి కోసం అన్నదాతలు, తాగునీటి కోసం నెల్లూరు ప్రజలకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఈనేపథ్యంలో 1999లో అప్పటి ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సంగం బ్యారేజీ నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర చేపట్టారు. సంగం బ్యారేజీ నిర్మించాలని డిమాండ్ చేశారు. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో చలనం లేకపోయింది. రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా ప్రతిపక్షనేత హోదాలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సంగం పర్యటించారు. అన్నదాతల అభ్యర్థన మేరకు తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే సంగం వద్ద పెన్నానదిలో నూతన బ్యారేజ్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మాట తప్పని, మడమ తిప్పని దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం రూ.122.50 కోట్ల వ్యయంతో 2006లో నూతన బ్యారేజ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత వైఎస్సార్ అకాల మరణంతో బ్యారేజీ పనులు నత్తనడకన సాగాయి. బ్యారేజ్‌పై రాకపోకల కోసం ఏర్పాట్లు నిర్మాణం పూర్తి సంగం నూతన బ్యారేజ్ నిర్మాణ పనులను వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పూర్తిచేసింది. 1,195 మీటర్ల పొడవుతో పెన్నానదిలో బ్యారేజ్ నిర్మాణం చేపట్టారు. ఈ బ్యారేజ్‌కి 85 గేట్లు ఏర్పాటుచేసి వాటి నిర్వహణకు మోటార్లు సైతం ఏర్పాటు చేశారు. బ్యారేజ్ నుంచి కుడివైపు కనుపూరు కాలువ, నెల్లూరు చెరువుకు నీటిని విడుదల చేసే రెగ్యులేటర్లు, ఎడమ వైపు కనిగిరి రిజర్వాయర్, బెజవాడ పాపిరెడ్డి కాలువలకు నీటిని విడుదల చేసే నిర్మాణాలు పూర్తయ్యాయి. సంగం పాత ఆనకట్ట జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంటే నూతన బ్యారేజ్ నిర్మాణం వల్ల జిల్లాలో 5.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి దూరదృష్టి అందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. నిధుల వృథాకు చెక్ పాత ఆనకట్ట వల్ల కనుపూరు కాలువ, బెజవాడ పాపిరెడ్డి కాలువకు నీరు అందించేందుకు ప్రతి సంవత్సరం రూ.50 లక్షలకు పైగా నిధులతో ఇసుక బస్తాలు ఏర్పాటుచేసి నీరు అందించేవారు. నూతన బ్యారేజ్ నిర్మాణం వల్ల ఇసుక బస్తాలతో పనిలేకపోవడంతో ప్రతి సంవత్సరం రూ.50లక్షలకు పైగా ప్రజాధనం వృథా కాకుండా నిలిచిపోతుంది. పైగా సంగం బ్యారేజ్ వద్ద 0.45 టీఎంసీల నీరు నిల్వ ఉండనుంది. మరోవైపు భూగర్భజలాలు పెరిగి నీరు మోటార్లకు సైతం అందుతుందని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాకపోకల సమస్యకు బ్రేక్ నిత్యం సంగం పాత బ్యారేజ్ పైన రాకపోకలు స్తంభించేవి. ప్రజలకు తీవ్ర అసౌకర్యాలు ఉండేది. త్వరలో ఈ సమస్య తీరిపోనుంది. నూతన బ్యారేజ్ మీద రాకపోకల కోసం 7.5 మీటర్ల వెడల్పుతో 1,195 మీటర్ల పొడవున రోడ్డు నిర్మించారు. రెండు వైపులా వాహనాలు తిరిగే వీలు ఏర్పడింది. పాదచారులు నడిచేందుకు వీలుగా 1.5 మీటర్ల నడక దారిని సైతం నిర్మించారు. సంగం నుంచి పొదలకూరు, చేజర్ల, రాపూరు, వెంకటగిరి మండలాలకు రాకపోకలు సౌకర్యం మెరుగుపడుతుంది. ఆనందంలో అన్నదాతలు కలలు కార్యరూపం దాల్చడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శంకుస్థాపన చేసిన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి, పనులు పూర్తిచేసిన ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నూతన బ్యారేజ్‌కు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరు పెట్టడం జగన్మోహన్రెడ్డి మంచితనానికి నిలువెత్తు నిదర్శనమని అన్నదాతలు, ప్రజలు హర్షాతిరేకాల మధ్య చెబుతున్నారు. అపర భగీరథుడు డాక్టర్ వైఎస్సార్ సంగం బ్యారేజ్ స్థానంలో నూతన బ్యారేజ్‌కు శంకుస్థాపన చేసిన దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అపర భగీరథుడు. అన్నదాతల కష్టాలు తెలిసిన నేత నూతన బ్యారేజ్‌తో సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. సాగునీరు పొందిన ప్రతి రైతు ఆ మహానుభావుడి పేరును చిరకాలం గుర్తుంచుకుంటారు. – పులగం శంకర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ తండ్రికి మించిన తనయుడు తండ్రి శంకుస్థాపన చేసిన సంగం నూతన బ్యారేజ్‌ను దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చొరవతో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టుదలతో పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తండ్రికి మించిన తనయుడు. అన్నదాతల కష్టాలు తీర్చిన తండ్రి, తనయులను ఎప్పుడూ గుర్తించుకుంటారు. – కంటాబత్తిన రఘునాథరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు గౌతమ్‌రెడ్డి పేరు పెట్టడం శుభపరిణామం సంగం నూతన బ్యారేజ్‌కి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరు పెట్టడం శుభపరిణామం. దీని ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనను నమ్ముకున్న వారికి ఎంతటి మర్యాదనిస్తారో తెలియచెప్పారు. అంతేకాకుండా తన దగ్గరి వారిని ఎప్పుడు గుర్తుంచుకుంటారనే విషయం మరోమారు రుజువైంది. – ముడి మల్లికార్జునరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు, మర్రిపాడు -
వైఎస్సార్సీపీ తిరుగులేని ఆధిక్యం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో ఉప ఎన్నికలో భాగంగా ఈ నెల 23న పోలింగ్ నిర్వహించారు. 1,37,289 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవడంతో 64.26 శాతం ఓటింగ్ నమోదైంది. ఆదివారం ఆత్మకూరులోని ఆంధ్ర ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. తొలి రౌండ్ నుంచి 20వ రౌండ్ వరకు ప్రతి రౌండ్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి ఆధిక్యత సాధించారు. సరాసరి ప్రతి రౌండ్లో 4 వేల ఓట్ల ఆధిక్యత దక్కించుకున్నారు. అధికార పార్టీకి బీజేపీ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. పోస్టల్ బ్యాలెట్లో సైతం వైఎస్సార్సీపీ సత్తా చాటింది. 208 పోస్టల్ బ్యాలెట్లలో వైఎస్సార్సీపీకి 167 ఓట్లు లభించాయి. బీజేపీకి 21, నోటాకు 3, బీఎస్పీకి 7, ఇతరులకు 10 ఓట్లు లభించాయి. ఫ్యాన్ గాలికి బీజేపీ గల్లంతు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ సునామీకి బీజేపీ గల్లంతయ్యింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి సునీల్ దియోధర్, కేంద్ర మాజీ మంత్రులు, రాజ్యసభ సభ్యులు, బీజేపీ జాతీయ నేతలు ఆత్మకూరులో తిష్టవేసి కోలాహలంగా ఎన్నికల ప్రచారం చేశారు. అధికార వైఎస్సార్సీపీపై అనేక అభాండాలు వేస్తూ ప్రచారం సాగించారు. బీజేపీ ఆరోపణలను ప్రజలు నిర్మొహమాటంగా తోసిపుచ్చారు. కేవలం 19,353 ఓట్లు మాత్రమే దక్కించుకుని 14.1 «శాతానికి ఆ పార్టీ పరిమితమైంది. తిరుపతి పార్లమెంటు, బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కూడా డిపాజిట్టు కోల్పోయిన బీజేపీ.. తాజాగా మూడోసారి ఆత్మకూరులోనూ డిపాజిట్ దక్కించుకోలేకపోయింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు బీజేపీ పోలింగ్ ఏజెంట్లుగా కూర్చొన్నప్పటికీ వారి ఆటలు సాగలేదు. ఓటర్లు ప్రభుత్వ పాలనను సమర్థిస్తూ.. అనైతిక మద్దతుకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. ఎన్నికల అధికారి హరేందిర ప్రసాద్ చేతుల మీదుగా డిక్లరేషన్ ఫారం అందుకుంటున్న మేకపాటి విక్రమ్‌రెడ్డి అపారంగా పెరిగిన ఓటర్ల మద్దతు ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓటర్ల మద్దతు ఆపారంగా పెరిగింది. పోలింగ్ శాతం గణనీయంగా పడిపోయినప్పటికీ మంచి మెజార్టీ సాధించడం ద్వారా నేతలు సత్తా చాటారు. 2019 ఎన్నికల్లో 83.38% పోలింగ్ అయ్యింది. ఈ ఉప ఎన్నికలో కేవలం 64.26 శాతానికే పోలింగ్ పరిమితమైంది. ఓటర్లు పోలింగ్‌కు వెళితే వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలుస్తారనే కారణంగా టీడీపీలోని ఓ సామాజిక వర్గం నేత, తన సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ట్రాక్టర్లలో నెర్రవాడ వెంగమాంబ తిరునాళ్లకు తరలివెళ్లేలా ప్రేరేపించారు. మర్రిపాడు, సంగం, ఆత్మకూరు మండలాల నుంచి పెద్ద ఎత్తున తిరునాళ్లకు వెళ్లడంతో ఓటింగ్ శాతం భారీగా పడిపోయింది. అయినప్పటికీ పోలైన ఓట్లలో 74.47 శాతం వైఎస్సార్సీపీకి దక్కాయి. 2019లో 53.22 శాతం ప్రజలు మద్దతుగా నిలిస్తే, ఇప్పుడు అందుకు అదనంగా 21.25 శాతం మంది ఓటర్లు మద్దతుగా నిలిచారు. మొదటి రౌండ్ లెక్కింపు పూర్తయ్యేసరికి మేకపాటి విక్రమ్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్‌పై 5,337 ఓట్ల మెజార్టీని సాధించారు. ఈ పరంపర తుది రౌండ్ వరకు కొనసాగింది. ఆత్మకూరు పరిధిలోని 6 మండలాల్లో గణనీయమైన మెజార్టీ దక్కింది. గౌతమ్ అన్న పేరు నిలబెడతా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పాలన, పేదల పట్ల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి, దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పట్ల ప్రజలు చూపిన ఆదరణే నా విజయానికి కారణం. ప్రణాళికా బద్ధంగా ఆత్మకూరు ఉన్నతికి కృషి చేస్తాను. గౌతమ్ అన్న పేరు నిలబెడతాను. భారీ మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు. నా విజయం కోసం విశేషంగా కృషి చేసిన వైఎస్సార్సీపీ శ్రేణులకు ధన్యవాదాలు. – మేకపాటి విక్రమ్‌రెడ్డి, ఎమ్మెల్యే, ఆత్మకూరు -
ఆత్మకూరు ఉప ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభం
సాక్షి, నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీకి అధికారులు ఎన్నికల సామాగ్రిని తరలించారు. 279 పోలింగ్ కేంద్రాల్లో 377 ఈవీఎంలను ఎన్నికల అధికారులు సిద్ధం చేశారు. కాగా, ఈ ఉప ఎన్నికల కోసం 1300 మంది సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. ఇది కూడా చదవండి: ఆత్మకూరు ఉప ఎన్నిక.. సంకటస్థితిలో బీజేపీ! -
ఆత్మకూరు ఉప ఎన్నిక: పోలింగ్‌కు ఏర్పాటు పూర్తి
ఆత్మకూరు: ఈ నెల 23న జరగనున్న ఆత్మకూరు శాసనసభ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు రిటర్నింగ్ అధికారి, జేసీ ఎంఎన్ హరేందిర ప్రసాద్ తెలిపారు. ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలింగ్‌కు ఒక రోజు ముందు ప్రచారం నిలిపివేయాలనే ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగిసిందన్నారు. గురువారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు, పోలింగ్ సిబ్బందికి పూర్తిస్థాయి సామగ్రిని అందించామన్నారు. నియోజకవర్గంలో 279 పోలింగ్ కేంద్రాల్లో ఏపీఎస్పీ కేంద్ర బలగాలతో పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 123 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి అక్కడ ప్రత్యేక బందోబస్తును నియమించామన్నారు. మొత్తం జనరల్ స్టాఫ్ 1,339 మంది, పోలీసులు 1,032 మంది, మైక్రో అబ్జర్వర్లు 142 మంది, సెక్టార్ అధికారులు 38 మంది మాస్టర్ ట్రెయినీలు 10 మంది, వీడియో గ్రాఫర్లు 78 మంది పోలింగ్ జరిగేంత వరకు విధుల్లో ఉంటారన్నారు. ఇప్పటికే ఓటర్లకు, పంచాయతీ కార్యదర్శులు, బీఎల్ఓలు, వలంటీర్ల సహకారంతో ఓటరు స్లిప్‌లు పంపిణీ జరిగిందన్నారు. ఓటర్లు తప్పనిసరిగా స్లిప్‌లతో పాటు గుర్తింపు కార్డు ఓటరు ఐడీ లేదా ఆధార్ బ్యాంకు పాసుపుస్తకం, పాస్‌పోర్ట్ తదితర వాటిలో ఏదో ఒక గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకొచ్చి చూపాలన్నారు. పోలింగ్ సిబ్బందికి రెండు విడతలుగా ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఓటర్లు నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, టాయిలెట్, విద్యుత్ వసతులు ఏర్పాటు చేసినట్లు, సజావుగా పోలింగ్ జరిగేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఇది కూడా చదవండి: ఆత్మకూరు ఉప ఎన్నిక.. సంకటస్థితిలో బీజేపీ! -
ఆత్మకూరు ఉప ఎన్నిక.. సంకటస్థితిలో బీజేపీ!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచార ఘట్టం మంగళవారం సాయంత్రానికి ముగిసింది. చివరి క్షణం వరకు రాజకీయ పార్టీ అగ్రనేతల హడావుడి కొనసాగింది. మంగళవారం సాయంత్రం 6 గంటలతో ప్రచారం పూర్తి కావడంతో అధికారుల ఆదేశాల మేరకు బయట ప్రాంతాల నుంచి వచ్చిన నియోజకవర్గయేతరులు వెళ్లిపోవాలని ఆర్వో, జేసీ ఎంఎన్ హరేందిర ప్రసాద్ ఆదేశించారు. పక్షం రోజులుగా హోరెత్తించిన మైకులు మూగబోయాయి. నామినేషన్లు పర్వం ముగిసిన తర్వాత ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ప్రతిష్టంగా చేపట్టాయి. వైఎస్సార్సీపీ మండలానికి ఒక మంత్రిని ఇన్చార్జిగా నియమించి ఎన్నికల ప్రచార బాధ్యతలను అప్పగించారు. ప్రభుత్వ చిత్తశుద్ధి, పనితీరు, సంక్షేమ పాలనకు దర్పంగా ఆత్మకూరు తీర్పు ఉండాలని ప్రజల్ని కోరారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి అండగా నిలిచినట్లే ఆయన సోదరుడు వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డిని ఆశీర్వదించాలని గ్రామాలను చుట్టేస్తూ ప్రజల్ని కోరారు. అర్హతే ప్రామాణికంగా అందించిన సంక్షేమ పాలన కారణంగా ఘనమైన మెజార్టీతో తమ అభ్యర్థి విజయం సాధిస్తారని ఆ పార్టీ నేతలు విశ్వాసం ప్రదర్శిస్తున్నారు. సంకటస్థితిలో బీజేపీ తిరుపతి, బద్వేల్ ఉప ఎన్నికల తరహాలో ఆత్మకూరులోనూ బీజేపీ అగ్రనేతలంతా రంగ ప్రవేశం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ వ్యవహారాల ఇన్చార్జితో పాటు, రాజ్యసభ సభ్యులు,, మాజీ కేంద్ర మంత్రులు ఆత్మకూరులో తిష్ట వేసి ఆ పార్టీ శ్రేణులను నడిపించారు. బీజేపీ అభ్యరి్థని గెలిపించాలని ప్రజల్ని కోరారు. కాగా అభ్యర్థి భరత్‌కుమార్ నాన్‌లోకల్ కావడంతో ఆ సమస్య బీజేపీని వెంటాడుతూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో కనీస పరువు నిలుపుకునే స్థాయిలో ఓట్లు దక్కితే చాలు అన్నట్లు ఆ పార్టీ నేతల వైఖరి కనిస్తోందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. వీరికి ఈ దఫా బీఎస్పీ నుంచి గట్టి పోటీ తప్పడం లేదు. గతంలో కాస్తా తక్కువ ఓట్లతో బీజేపీ కంటే వెనుకబడిన బీఎస్పీ ఈ దఫా అధిగమించేందుకు విశేషంగా ప్రయత్నించింది. ఆ మేరకు ప్రజల చెంతకు చేరి పోటాపోటీగా ప్రచారం చేపట్టారు. మెజార్టీపైనే అందరి అంచనాలు నియోజకవర్గ ఉప ఎన్నికల బరిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి జి భరత్‌కుమార్, బీఎస్పీ అభ్యర్థి ఎన్ ఓబులేసులు ప్రధానంగా తలపడుతుండగా బరిలో మొత్తం 14 మంది ఉన్నారు. అయితే ఇప్పటికే వైఎస్సార్సీపీ అన్ని మండలాల్లో, మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల్లో ఇంటింటికి తిరిగి పార్టీ అమలు చేస్తున్న నవరత్న పథకాలను వివరిస్తూ ప్రజలను ఓట్లు వేయాలని అభ్యర్థించిన విషయం తెలిసిందే. నియోజకవర్గంలో 2,13,138 ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళల సంఖ్య అధికంగా 1,07,367 కాగా, పురుష ఓటర్లు 1,05,960 మంది ఉన్నారు. 2019 ఎన్నికల్లో 82.44 శాతం ఓ ట్లు పోల్ కాగా, ఈ ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం ఏ మేరకు నమోదు అవుతుందో వేచి చూడాల్సి ఉంది. ఇది కూడా చదవండి: ఆదరించండి.. అభివృద్ధి చేసి చూపుతాం -
ఆత్మకూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విక్రమ్ రెడ్డి ప్రచారం
-
తండ్రి అండ.. అన్న ఆశయం నీడ
తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డి సుదీర్ఘ రాజకీయ అనుభవం, సోదరుడు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఇచ్చిన ఆత్మకూరు ప్రజల అండదండలతో వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఉప ఎన్నికలు ఏకగ్రీవం కాకుండా అడ్డుకున్నామని చెప్పుకోవడం మినహా, ప్రధాన పార్టీలకు స్థానిక అభ్యర్థులు కరువయ్యారు. ఆత్మకూరులో బీజేపీ స్థానికేతరుడైన భరత్‌కుమార్ యాదవ్‌ను బరిలోకి దింపాల్సి వచ్చింది. మరో వైపు విక్రమ్‌రెడ్డి ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పార్టీలకు అతీతంగా ప్రజాభిమానాన్ని చూరగొన్న దివంగత గౌతమ్‌రెడ్డికి ఓటు రూపంలో నివాళులర్పించాలని పోలింగ్ తేదీ కోసం తహతహలాడుతున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నికల్లో మేకపాటి విక్రమ్‌రెడ్డి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా అతి తక్కువ సమయంలో ప్రజల అభిమాన పాత్రుడు అయ్యాడు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డిపై గూడుకట్టుకున్న అభిమానాన్ని ఆయన సోదరుడు విక్రమ్‌రెడ్డి పట్ల చాటుకుంటున్నారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ప్రతి చోట ప్రజలు చూపిస్తున్న అభిమానాన్ని చూసి విక్రమ్‌రెడ్డి సైతం భావోద్వేగానికి గురవుతున్నారు. తన అన్నపై పెంచుకున్న అభిమానం, నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, గౌతమ్‌రెడ్డి ఆశయాలు నెరవేరుస్తానని ఘంటాపథంగా చెబు తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బీ–ఫారం ఇచ్చిన తర్వాత ఈ నెల 2న నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. రెండు రోజుల్లో 18 పంచాయతీల ప్రజల దరికి మేకపాటి విక్రమ్‌రెడ్డి చేరారు. ప్రత్యక్ష రాజకీయాలకు కొత్త అయినప్పటికీ స్థానికులతో మమేకమవుతూ, వారి సమస్యలను తెలుసుకుంటూనే ప్రభుత్వ ఆవశ్యకతను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రజల సంక్షేమం కోరుతున్న ప్రభుత్వాన్ని బలపర్చాలని, సోదరుడు గౌతమ్‌రెడ్డి ఆశయ సాధన కోసం అంతా ఏకమై తీర్పు చెప్పాలని కోరుతున్నారు. గ్రామాల్లో అనూహ్య మద్దతు లభిస్తోండడంతో మరింత ఉత్సాహంతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఈ ఉప ఎన్నిక రెఫరెండమ్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీకి స్థానికేతరుడే దిక్కు భారతీయ జనతా పార్టీకి ఆత్మకూరులో అభ్యర్థి కరువయ్యారు. నోటిఫికేషన్ ప్రకటించక మునుపే ముందే పోటీ చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆత్మకూరులో పోటీ చేసేందుకు సన్నద్ధమయ్యారు. ఒకప్పుడు ఆత్మకూరులో బీజేపీ గణనీయమైన మద్దతు లభించింది. 1985, 89ల్లో స్వల్ప ఓట్లు తేడాతో ఆ పార్టీ ఓటమి పాలైంది. అటువంటి నియోజకవర్గంలో ఈ దఫా డిపాజిట్లు కాదు కదా.. కనీస ఓట్లు కూడా పడే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మూకుమ్మడిగా దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డికి ఓటు రూపంలో నివాళులర్పించాలని ప్రజలు పార్టీలకతీతంగా భావిస్తున్నారు. ఈ తరుణంలో స్థానిక నాయకులు పోటీ పెట్టకూడదని నిర్ణయించుకున్నారు. అదే విషయాన్ని బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి బాహాటంగా ప్రకటించారు. అయినప్పటికీ బీజేపీ పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో స్థానికులు ఎవరూ ముందుకు రాలేదు. స్థానికేతరులే దిక్కయ్యారని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఆ పార్టీ తరఫున జిల్లా అధ్యక్షుడు భరత్‌కుమార్‌ను బరిలోకి దింపారు. అపార మద్దతు లభిస్తోంది – మేకపాటి విక్రమ్‌రెడ్డి ప్రభుత్వం నుంచి రాజకీయ పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. సోదరుడు దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి ఆత్మకూరు ప్రజల్లో ఒక్కరుగా మమేకమయ్యారు. ఆత్మకూరును అన్నీ విధాలు అభివృద్ధి చేయాలనే ధృడ సంకల్పంతో ముందుకెళ్లారు. ఆయన మృతితో రాజకీయాలకు వర్గాలకతీతంగా ప్రజల నుంచి అపార మద్దతు లభిస్తోంది. అనంతసాగరం మండలం మినగల్లు పంచాయతీలో ప్రచారం అనంతరం వెంకటరెడ్డిపల్లె స్థానిక నేతలతో ఇష్టాగోష్టి నిర్వహించాను. రాజకీయాలకు కొత్త అయినప్పటికీ ప్రజలు చూపిస్తున్న ఆదరాభిమానాలతో ముందుకు వెళ్తున్నాను. నిరంతరం ప్రజలతో మమేకం అవుతూ ప్రజాజీవితానికి అంకితం కానున్నట్లు ప్రకటించారు. సోదరుడి ఆశయసాధన కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సైనికుడిగా పని చేయనున్నట్లు వివరించారు. తన తండ్రి సుదీర్ఘ రాజకీయ అనుభవాలను అనుసరించి ప్రజల కోసమే పని చేస్తాను. స్థానిక సమస్యలను ప్రణాళికా బద్ధంగా పరిష్కరించేందుకు విశేషంగా కృషి చేస్తాను. విక్రమ్ అన్నలో గౌతమన్నను చూసుకుంటున్నాం పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం జీర్ణించుకోలేనిది. ఆయన సోదరుడు వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డిలో గౌతమ్ అన్నను చూసుకుంటున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో గౌతమన్న ఆశయాల సాధన కోసం విక్రమ్‌రెడ్డి ద్వారా సాధించుకోవాలని ప్రజలు ఆకాంక్షతో పోలింగ్ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. – పెయ్యల సంపూర్ణమ్మ, అనంతసాగరం ఎంపీపీ భారీ మెజార్టీయే గౌతమన్నకు ఘన నివాళి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించినప్పుడే ఘనమైన నివాళి. గౌతమన్న ప్రత్యేక పంథాతో వివాద రహితుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీని దీవించి భారీ మెజార్టీతో గెలిపించినప్పుడే గౌతమన్న ఆత్మ సంతోషిస్తుంది. – రాపూరు వెంకటసుబ్బారెడ్డి, అనంతసాగరం జెడ్పీటీసీ సభ్యుడు -
Mekapati Vikram Reddy: అమ్మ ఆశీర్వాదం.. సీఎం అభినందనలతో..
ఆత్మకూరు: ఆత్మకూరు శాసనసభకు త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డికి లక్ష ఓట్ల భారీ మెజార్టీ ఖాయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. విక్రమ్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమం గురువారం ఉదయం అట్టహాసంగా జరిగింది. ►విక్రమ్‌రెడ్డి తన తండ్రి నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, తల్లి మణిమంజరి, భార్య వైష్ణవి, సోదరి ఆదాల రచనలతో కలిసి తొలుత ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని బైపాస్‌రోడ్డు వద్ద కొలువైన అభయాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ►అనంతరం నెల్లూరుపాళెం మీదుగా ఆత్మకూరు పట్టణంలోకి ప్రవేశించిన అభ్యర్థి విక్రమ్‌రెడ్డికి వైఎస్సార్సీపీ నాయకులు ఆర్టీసీ డిపో వద్ద ఘన స్వాగతం పలికారు. మున్సిపల్ వైస్ చైర్మన్ డాక్టర్ కేవీ శ్రావణ్‌కుమార్ విక్రమ్‌రెడ్డికి శాలువా కప్పి భారీ పూలమాల వేశారు. ►అక్కడి నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ప్రచార వాహనంలో విక్రమ్‌రెడ్డి మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, రాజ్యసభసభ్యుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, సూళ్లూరుపేట, కందుకూరు ఎమ్మెల్యేలు కిలివేటి సంజీవయ్య, మానుగుంట మహీధర్‌రెడ్డి తదితరులతో కలిసి పట్టణంలోని ప్రధాన రహదారి మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. కార్యకర్తలు పార్టీ జెండాలు చేతపట్టి వాహనం ముందు సాగుతుండగా ప్రజలు పూలవర్షం కురిపించారు. ►బీఎస్సార్ సెంటర్లోని సుల్తాన్ షాహిద్ దర్గాకు రాజమోహన్‌రెడ్డి, విక్రమ్‌రెడ్డి నాయకులతో కలిసి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం హిల్రోడ్డులోని తెలుగు బాప్టిస్ట్ చర్చిలో ప్రార్థనల్లో పాల్గొన్నారు. ►కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అభయాంజనేయస్వామి గుడి వద్ద విక్రమ్‌రెడ్డిని కలిసి వైఎస్సార్సీపీ కండువా కప్పి అభినందనలు తెలిపారు. అలాగే నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్ పుష్పగుచ్ఛం అందజేశారు. ►తర్వాత ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా సాగింది. అక్కడి నుంచి ఎన్నికల నిబంధనల మేరకు మంత్రి కాకాణి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే, పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి రెండుసెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి, జేసీ హరేంద్ర ప్రసాద్‌కు అందజేశారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి, విజయ డెయిరీ చైర్మన్ కొండూరు రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి, ఎఫ్ఎఫ్సీ చైర్మన్ మేరిగ మురళి, డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతి, నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, ఆత్మకూరు మున్సి పల్ చైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మ, వైస్ చైర్మన్ షేక్ సర్దార్, వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు అల్లారెడ్డి ఆనంద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అమ్మ ఆశీర్వాదం తీసుకుని.. నెల్లూరు(సెంట్రల్): ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మేకపాటి విక్రమ్‌రెడ్డి గురువారం నెల్లూరులోని తన ఇంట్లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆత్మకూరుకు బయలుదేరి వెళ్లే ముందు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చిత్రపటం వద్ద నామినేషన్ పత్రాలను ఉంచారు. తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, తల్లి మణిమంజిరికి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. గౌతమ్‌రెడ్డి చిత్రపటానికి సాష్టాంగ నమస్కారం చేస్తున్న సమయంలో అక్కడున్న వారి కళ్లు చెమ్మగిల్లాయి. అనంతరం తల్లి చేతుల మీదుగా నామినేషన్ పత్రాలు తీసుకుని ఆత్మకూరుకు బయలుదేరారు. విద్యాధికుడు సాక్షి, నెల్లూరు: ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి విద్యాధికుడు. తన సోదరుడు గౌతమ్‌రెడ్డి లాగే ఉన్నత చదువులు చదివారు. వ్యాపార రంగంలో ఉన్న విక్రమ్‌రెడ్డి మేకపాటి కుటుంబ వారసుడిగా ఉప ఎన్నికల బరిలో నిలిచారు. ఆయన విద్యాభ్యాసం ఊటీలోని గుడ్‌షెపర్డ్ పబ్లిక్ స్కూల్లో జరిగింది. ఆపై బీటెక్ (సివిల్) ఐఐటీ చెన్నైలో పూర్తి చేసి, ఆస్ట్రేలియాలో ఎంఎస్ చదివారు. కేఎంసీ డైరెక్టర్‌గా వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. మేకపాటి కుటుంబంపై అభిమానం ఆత్మకూరు: ‘మేకపాటి కుటుంబంపై ఆత్మకూరు ప్రజలకు అపారమైన అభిమానం ఉంది. గత రెండు ఎన్నికల్లో ఇది కనిపించింది.’ అని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. నామినేషన్ అనంతరం ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. రానున్న ఉప ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదయ్యేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సీఎం అభినందించారు రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ మేకపాటి రాజమోహన్‌రెడ్డి సూచించిన విక్రమ్‌రెడ్డి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అవకాశం కల్పించారన్నారు. బీఫారం అందుకునే క్రమంలో విక్రమ్‌రెడ్డి తాను గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చూసిన విషయాలను, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఎంతో ఆసక్తిగా ముఖ్యమంత్రికి వివరించారన్నారు. దీంతో ఆయన విక్రమ్‌రెడ్డిని అభినందించి ఆశీర్వదించినట్లు చెప్పారు. వారివి మచ్చలేని రాజకీయాలు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ మేకపాటి కుటుంబం మచ్చలేని రాజకీయాలు చేస్తుంటారని, అదే వారికి శ్రీరామరక్ష అని చెప్పారు. గౌతమ్‌రెడ్డి మంత్రిగా తన బా«ధ్యతలను సంపూర్ణంగా నెరవేర్చారని, రాజకీయాల్లో నూతన ఒరవడిని సృష్టించారన్నారు. విక్రమ్‌రెడ్డి విద్యావంతుడని, రాజకీయాల గురించి ఇప్పుడిప్పుడే అవగాహన పెంచుకుంటున్నారని, తప్పనిసరిగా మంచి ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకుంటారన్నారు. దిగ్విజయంగా సాగుతారు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నిరాడంబరంగా నిర్వహించాలని అనుకున్న నామినేషన్ కార్యక్రమానికి ప్రజలు తరలిరావడం శుభపరిణామమన్నారు. పారిశ్రామికవేత్తగా దూసుకుపోతున్న విక్రమ్‌రెడ్డి రాజకీయాల్లో సైతం విజయపం«థాలో దిగ్విజయంగా సాగుతారని చెప్పారు. ప్రభుత్వంపై ప్రజలకు ఎంతో నమ్మకం అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ ఇటీవల గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కొన్ని గ్రామాల్లో, మున్సిపల్ పరిధిలో నాలుగు వార్డుల్లో తిరిగానన్నారు. సంక్షేమ పథకాలు పక్కాగా అందుతుండడంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ప్రజలకు ఎంత నమ్మకం ఉందో తెలిసిందన్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టేలా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించేలా కృషి చేస్తానని చెప్పారు. కార్యకర్తల అండతోనే నాయకులు తయారవుతారని, ఆ విషయం తాను గుర్తెరిగినట్లు, తప్పకుండా వారి మనోభావాల మేరకే పనిచేస్తానని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రజల అండదండలతో విజయం సాధిస్తానని, 2024లో ఎన్నికలకు సమాయత్తమయ్యేలా ఈ రెండేళ్లు పనిచేస్తానని అన్నారు. -
ఆ కుటుంబానికి రాజకీయాల్లో ఎలాంటి మచ్చలేదు: బాలినేని
సాక్షి, నెల్లూరు: మేకపాటి కుటుంబానికి రాజకీయాల్లో ఎలాంటి మచ్చ లేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఆ కుటుంబం ఎంతో కృషి చేసిందన్నారు. ఈ మేరకు బాలినేని మీడియాతో మాట్లాడుతూ.. ఆత్మకూరు అభ్యర్థి ఎంపికకు సంబంధించి రాజమోహన్‌రెడ్డి నిర్ణయానికి సీఎం జగన్ వదిలేశారు. లక్ష ఓట్ల మెజారిటీ తీసుకువచ్చి గౌతమ్‌కు ఘనమైన నివాళి ఇస్తాము. రెండేళ్లు మరింత కృషి చేసి 2024 ఎన్నికల్లో మరింత మెజారిటీ సాధిస్తామని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. కాగా, జూన్ 23వ తేదీన ఆత్మకూరు ఉప ఎన్నిక జరుగనుండగా, 26వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు. చదవండి: (ఆత్మకూరు ఉప ఎన్నిక: నామినేషన్ దాఖలు చేసిన విక్రమ్‌రెడ్డి) -
చెరగని గౌతమ ముద్ర
ఎన్నికల క్షేత్రంలో ఆత్మకూరు గడ్డపై మహామహులు తలపడ్డారు. ఏడు దశాబ్దాల చరిత్రలో నేటితరం దివంగత నేత మేకపాటి గౌతమ్‌రెడ్డి ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో 16 సార్లు ఎన్నికలు జరిగితే.. ఇందులో అత్యధిక మెజార్టీల రికార్డు ఆయనకే సొంతమైంది. అతి స్వల్ప మెజార్టీతో విజయ తీరానికి చేరిన చరిత్రను ఆనం సంజీవరెడ్డి దక్కించుకున్నారు. వరుసగా రెండేసి సార్లు గెలుపొందిన ముగ్గురిలో మేకపాటి గౌతమ్‌రెడ్డి ఒకరు. ప్రజల మనస్సు దోచిన ఆయన అకాల మరణంతో ఉప ఎన్నికలు తెరపైకి వచ్చాయి. ఉప ఎన్నికల్లోనూ గౌతమ్ ముద్ర సృష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాజకీయ యవనికపై ఎందరో నేతలు వస్తుంటారు.. కానీ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న వారు ఒకరో ఇద్దరు ఉంటారు. అందులో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఒకరు. జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజాభిమానాన్ని మూటకట్టుకున్న నేటి తరం నాయకుడు గౌతమ్ చెరగని ముద్ర వేశారు. వరుసగా రెండు దఫాలు అత్యధిక మెజార్టీలు దక్కించుకున్న నేతగా మేకపాటి గౌతమ్‌రెడ్డి ఈ నియోజకవర్గ చరిత్రలో మిగిలిపోయారు. 1952 నుంచి 2019 వరకు 16 దఫాలు ఎన్నికలు జరిగాయి. తాజాగా ఈ నెల 23న ఉప ఎన్నిక జరగనుంది. నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగడం ఇది రెండు దఫా అవుతుంది. 1958లో తొలిసారి ఆత్మకూరు ఉప ఎన్నికలు రాగా, మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి దివంగతులు కావడంతో రెండో దఫా ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ప్రస్తుతం నామినేషన్లు పర్వం కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా మేకపాటి విక్రమ్‌రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. అత్యధికం గౌతమ్‌రెడ్డి.. అతి స్వల్పం సంజీవరెడ్డి ఆత్మకూరు ఎన్నికల చరిత్రలో అత్యధిక మెజార్టీ మేకపాటి గౌతమ్‌రెడ్డి సొంతం కాగా, అతి స్వల్ప మెజార్టీ ఆనం సంజీవరెడ్డి దక్కాయి. 1958లో బెజవాడ గోపాల్‌రెడ్డి ఆత్మకూరు, సర్వేపల్లి నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి రెండు చోట్ల విజయం సాధించారు. అప్పట్లో ఆయన సర్వేపల్లిలో కొనసాగుతూ ఆత్మకూరు శాసనసభ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో అప్పట్లో ఉప ఎన్నికల అనివార్యమైంది. ఆనం సంజీవరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి, తన సమీప ప్రత్యర్థి జీసీ కొండయ్యపై 45 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆనం సంజీవరెడ్డికి 22,358 ఓట్లు లభించగా, పీఎస్పీ అభ్యర్థి జీసీ కొండయ్యకు 22,313 ఓట్లు లభించాయి. ఆత్మకూరు చరిత్రలో ఇది అతి స్వల్ప మెజార్టీగా చరిత్రగా నిలిచిపోయింది. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి గౌతమ్‌రెడ్డి 31,412 ఓట్లు మెజార్టీ లభించింది. రెండో దఫా 2019 ఎన్నికల్లోనూ 22,276 ఓట్ల అత్యధిక మెజార్టీ వచ్చింది. ఈ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీలు ఇవే కావడంతో ఆ రికార్డులు గౌతమ్‌రెడ్డికి దక్కాయి. స్వల్ప మెజార్టీతో విజయం దక్కించుకున్న వారిలో మరో ఇరువురు ఉన్నారు. 1989లో కాంగ్రెస్ అభ్యర్థి బి సుందరరామిరెడ్డి బీజేపీ అభ్యర్థి కె ఆంజనేయరెడ్డిపై 334 ఓట్లుతో విజయం సాధించారు. 1999లో కాంగ్రెస్ అభ్యర్థి బొల్లినేని కృష్ణయ్య, టీడీపీ అభ్యర్థి కొమ్మి లక్షుమయ్యనాయుడిపై 2,069 ఓట్లతో విజయం సాధించారు. ఇవే తక్కువ మెజార్టీతో అభ్యర్థులు గెలుపొందిన ఎన్నికలు కావడం విశేషం. టీడీపీయేతరులే విజేతలు ఆత్మకూరు నియోజకవర్గం ఆది నుంచి కాంగ్రెస్ పార్టీకి అడ్డాగా నిలిచిందనే చెప్పాలి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు 7 సార్లు ఎన్నికలు జరిగితే.. 5 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. రెండు సార్లు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. 1983 నుంచి 2019 వరకు 9 సార్లు ఎన్నికలు జరిగితే 1983, 94లో మాత్రమే టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. నాలుగు సార్లు కాంగ్రెస్, ఒకసారి స్వతంత్ర అభ్యర్థి, రెండు సార్లు వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయం దక్కించుకున్నారు. వరుసగా రెండు సార్లు గెలిచిన జాబితాలో ముగ్గురు ఆత్మకూరులో 16 దఫాలుగా ఎన్నికలు జరిగితే.. వరుసగా రెండు సార్లు విజయం సాధించిన వారు ముగ్గురే. ఇందులో మేకపాటి గౌతమ్‌రెడ్డి ఒకరు. 1958, 1962లో వరుసగా రెండు సార్లు ఆనం సంజీవరెడ్డి ఇక్కడి నుంచి విజయం సాధించారు. 1978లో తొలిసారి విజయం సాధించిన బి సుందరరామిరెడ్డి 1983లో టీడీపీ అభ్యర్థి అనం వెంకటరెడ్డితో తలపడి ఓడిపోయారు. తిరిగి 1985, 89లో వరుసగా కాంగ్రెస్ అభ్యర్థిగా అక్కడి నుంచి సుందరరామిరెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత 2014, 19ల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా మేకపాటి గౌతమ్‌రెడ్డి వరసగా రెండు సార్లు ఘన విజయం సాధించారు. -
ఆత్మకూరు ఉప ఎన్నిక: నామినేషన్ దాఖలు చేసిన విక్రమ్‌రెడ్డి
నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా గురువారం విక్రమ్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. సీఎం జగన్ చేతుల మీదుగా బుధవారం బీ ఫారం అందుకున్న విక్రమ్‌రెడ్డి.. నేడు నామినేషన్ దాఖలు చేశారు. విక్రమ్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డితో పాటు వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. బైపాస్‌రోడ్డులోని అభయాంజనేయస్వామి ఆలయంలో విక్రమ్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నెల్లూరు సెంటర్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘నామినేషన్‌కు వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులు అందరూ రావడం సంతోషం. ఈ ఎన్నికలు నాకు కొత్త. అయినా సీరియస్‌గా తీసుకుని పని చేస్తాం. ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తాం’ అని పేర్కొన్నారు. కాగా, జూన్ 23వ తేదీన ఆత్మకూరు ఉప ఎన్నిక జరుగనుండగా, 26వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు. చదవండి👉 సీఎం జగన్ చేతుల మీదుగా బీ ఫారం అందుకున్న విక్రమ్‌రెడ్డి -
సీఎం జగన్ చేతుల మీదుగా బీ ఫారం అందుకున్న విక్రమ్‌రెడ్డి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా మేకపాటి విక్రమ్ రెడ్డి బీ ఫారం అందుకున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం సీఎం జగన్‌తో విక్రమ్‌రెడ్డి భేటీ అయ్యారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి పోటీ చేయనున్నారు. ఈ భేటీకి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి హాజరయ్యారు. చదవండి: (YSR Congress Party: వైఎస్సార్సీపీ ప్లీనరీ తేదీలు, వేదిక ఖరారు) -
వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని బలపరుద్దాం
ఆత్మకూరు: రాష్ట్రంలో మూడేళ్లుగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో సంక్షేమ ఫలాలు వెల్లివిరుస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని సమైక్యంగా బలపరుద్దామని నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కోరారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల నేపథ్యంలో స్థానికంగా శ్రీధర్ గార్డెన్స్‌లో మంగళవారం నియోజకవర్గ స్థాయి వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మృతితో ఉప ఎన్నికలు జరుగుతాయని కలలో కూడా అనుకోలేదని, ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితి వస్తుందని ఊహించలేదన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా మూడేళ్లుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. కరోనా కష్టకాలంలోనూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిబాగా లేకున్నా సంక్షేమ పథకాలు ఆగలేదని గుర్తు చేశారు. మూడు మార్లు ఎంపీగా జిల్లా ప్రజలు తనను గెలిపించారని, ఆత్మకూరు నుంచి గౌతమ్‌రెడ్డికి రెండు సార్లు ఘన విజయం అందించారని ఈ రుణం తీర్చుకోలేనిదన్నారు. ప్రస్తుతం జరగనున్న ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో విక్రమ్‌రెడ్డి పోటీ చేస్తున్నారని, ఆయన్ను నిండు మనస్సుతో ఆశీర్వదించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. తమ కోడలు శ్రీకీర్తి గౌతమ్‌రెడ్డి పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఉన్నారని, ఆ ఫౌండేషన్‌లో తామంతా సభ్యులమేనని, ప్రభుత్వం ద్వారా చేయలేని పనులను ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సేవచేస్తామని అన్నారు. 2వ తేదీన నామినేషన్ గురువారం మేకపాటి విక్రమ్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నట్లు, నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని రాజమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఉదయం 9 నుంచి నిరాడంబరంగా ఆర్డీఓ కార్యాలయం వరకు నాయకులతో కలిసి వెళ్లి 11 గంటల సమయంలో నామినేషన్ దాఖలు చేస్తారన్నారు. ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది: మేకపాటి విక్రమ్‌రెడ్డి ఇటీవల పార్టీ ఆదేశాల మేరకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని పలు మండలాల్లో నిర్వహించినప్పుడు లబ్ధిదారులు తమకు అందుతున్న సంక్షేమ పథకాలను తెలిపి ప్రభుత్వంపై తమకున్న నమ్మకాన్ని వెల్లిబుచ్చారని మేకపాటి విక్రమ్‌రెడ్డి అన్నారు. కార్యకర్తలు పారీ్టకి స్తంభాల్లాంటి వారని, వారు చేసిన కృషితోనే నాయకులు పదవుల్లోకి వస్తారని, వారి మేలు ఎప్పటికి మరచిపోలేమన్నారు. తొలుత దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల శ్రీహరినాయుడు, పార్టీ మండలాల కనీ్వ నర్లు అల్లారెడ్డి ఆనంద్‌రెడ్డి, పందిళ్లపల్లి సుబ్బారెడ్డి, రాపూరు వెంకటసుబ్బారెడ్డి, జితేంద్రనాగ్‌రెడ్డి, తూమాటి విజయభాస్కర్‌రెడ్డి, బొర్రా సుబ్బిరెడ్డి, నాయకులు గంగవరపు శ్రీనివాసులునాయుడు, కంటాబత్తిన రఘునాథరెడ్డి, ఎంపీపీలు కేతా వేణుగోపాల్‌రెడ్డి, బోయళ్ల పద్మజారెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు పీర్ల పార్థసారథి, మున్సిపల్ చైర్పర్సన్ గోపారం వెంకటమణమ్మ, వైస్ చైర్మన్లు డాక్టర్ కేవీ శ్రావణ్‌కుమార్, సర్దార్ తదితరులు పాల్గొన్నారు.