కృష్ణా నదిలో గౌతమ్‌రెడ్డి అస్థికలను నిమజ్జనం చేస్తున్న కృష్ణార్జునరెడ్డి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం)/ఉదయగిరి: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అస్థికలను పవిత్ర నదుల్లో నిమజ్జనం చేశారు. గౌతమ్‌రెడ్డి వారం రోజుల క్రితం గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. ఆయన అస్థికలను కుమారుడు కృష్ణార్జునరెడ్డి ఆదివారం కృష్ణా, గోదావరి నదుల్లో శాస్త్రోక్తంగా నిమజ్జనం చేశారు.
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద పావన గోదావరి నదిలో స్థానిక కోటిలింగాల ఘాట్ వద్ద నిర్వహించిన నిమజ్జన కార్యక్రమంలో మంత్రులు ధర్మాన కృష్ణదాస్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తదితరులు పాల్గొని గౌతమ్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గౌతమ్‌రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు. విజయవాడలోని కృష్ణానదిలో నిర్వహించిన గౌతమ్‌రెడ్డి అస్థికల నిమజ్జనం కార్యక్రమంలో మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు జోగి రమేష్, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్, వైఎస్సార్‌సీపీ నేత దేవినేని అవినాష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment