rivers
-
11 నదుల అనుంధానానికి రూ. 40 వేల కోట్లు
దేశంలో నదుల అనుసంధానం వివిధ ప్రాంతాలు తాగు,సాగునీటి అవసరాలను తీరుస్తుందనే మాట మనం ఎప్పటి నుంచో వింటున్నాం. దీనిని రాజస్థాన్‌లో సాకారం చేసేందుకు మోదీ సర్కారు ముందుకొచ్చింది.రాజస్థాన్‌లోని 11 నదులను అనుసంధానం చేసేందుకు దాదాపు రూ.40 వేల కోట్ల విలువైన ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ప్రారంభించనున్నారని, కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాజస్థాన్‌ను నీటి మిగులు రాష్ట్రంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గుజరాత్లో జరిగిన సుచి సెమికాన్ సెమీకండక్టర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాటిల్ మాట్లాడుతూ, భవిష్యత్తులో నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు వాటర్ హార్వెస్టింగ్‌పై కృషి చేయాలని ఆయన వివిధ కంపెనీలకు విజ్ఞప్తి చేశారు.రాజస్థాన్‌లో తీవ్రమైన నీటి సంక్షోభం ఉందని, నరేంద్ర మోదీ ప్రారంభించనున్న 11 నదులను అనుసంధానించే ప్రాజెక్టుతో రాష్టంలో తలెత్తుతున్న నీటి సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు. రాజస్థాన్-మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు చేపట్టిన తాగునీటి ప్రాజెక్టు ద్వారా ఆయా రాష్ట్రాలలో నీటి ఎద్దడి తగ్గుతుందన్నారు. నూతనంగా చంబల్, దాని ఉపనదులైన పార్వతి, కలిసింద్, కునో, బనాస్, బంగంగా, రూపారెల్, గంభీరి, మేజ్ తదిర ప్రధాన నదులను అనుసంధానం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఫలితంగా ఝలావర్, కోట, బుండి, టోంక్, సవాయి మాధోపూర్, గంగాపూర్, దౌసా, కరౌలి, భరత్పూర్, రాజస్థాన్‌లోని అల్వార్ మధ్యప్రదేశ్‌లోని గుణ, శివపురి, షియోపూర్, సెహోర్‌లతో సహా కొత్తగా ఏర్పడిన 21 జిల్లాలకు ప్రయోజనం చేకూరనుందని తెలిపారు. ఇది కూడా చదవండి: Year Ender 2024: ప్రధాని మోదీ పర్యటించిన దేశాలివే.. మీరూ ట్రిప్‌కు ప్లాన్ చేసుకోవచ్చు -
నదులు ఎండిపోతున్నాయ్!
నదులు మానవాళి పాలిట జీవనాడులు. నది లేకపోతే జీవమే లేదు. అలాంటి నదులు ప్రస్తుతం తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 లక్షల నదులు విపరీతమైన మార్పులకు లోనవుతున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ మార్పులు ఇలాగే కొనసాగితే తాగడానికి నీరు దొరకదని, మరోవైపు విపరీతమైన వరదలను ఎదుర్కోవాల్సి వస్తుందని అధ్యయనకారులు హెచ్చరిస్తున్నారు. ఇవీ ప్రమాదాలు...మరికొద్ది కాలంలో ప్రపంచంలోని అనేక నదుల్లో అతి స్వల్ప పరిమాణంలో నీరు అందుబాటులో ఉందని నివేదిక పేర్కొంది. → అవి నెమ్మదిగా దుమ్ము, చిన్న రాళ్ళతో కూడిన అవక్షేపంగా మారిపోతాయని హెచ్చరించింది. → ఫలితంగా దీంతో తాగడానికి, పంటలకు, పశువులను పోషించడానికి మంచి నీటి కొరత ఏర్పడుతుందని అధ్యయన సారథి, హైడ్రాలజీ ప్రొఫెసర్ డోంగ్మే ఫెంగ్ తెలిపారు. → నదులు భూమికి రక్తనాళాల వంటివని, అవి ప్రవహించే తీరులో మార్పులు మనపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఫెంగ్ హెచ్చరించారు.క్షీణిస్తున్న నదులు భూమిపై నదులు లోనవుతున్న మార్పులపై సిన్సినాటీ విశ్వవిద్యాలయం అధ్యయనం చేసింది. శాటిలైట్ డేటా, కంప్యూటర్ మోడలింగ్ పరిజ్ఞానంతో పలువురు శాస్త్రవేత్తలు 35 ఏళ్లుగా భూమిపై ప్రతి రోజూ ప్రతి నది నీటి ప్రవాహాన్ని మ్యాపింగ్ చేశారు. ఇందులో వెల్లడైన విషయాలు వారిని దిగ్భ్రాంతికి గురి చేశాయి. ప్రపంచంలోని అతి పెద్ద నదుల్లోని సగం నదుల్లో నీటి ప్రవాహం అతి వేగంగా తగ్గుముఖం పడుతోంది! ఈ తగ్గుదల వేగం కొన్నింట్లో ఏటా 5 శాతముంటే మరికొన్నింట్లో ఏకంగా 10 శాతం దాకా ఉన్నట్టు అధ్యయనం తేల్చింది. ఇది చాలా వేగవంతమైన మార్పని హెచ్చరించింది. ఆఫ్రికాలోని రెండో అతి పెద్ద నది కాంగో, చైనాలో ప్రముఖ నది యాంగ్జీ, దక్షిణ అమెరికాలోని ప్లాటా వంటి నదులైతే ఇప్పటికే గణనీయంగా క్షీణించిపోయాయి. ముంచుకొస్తున్న వరద ముప్పు ఇక పర్వత ప్రాంతాల్లోని పలు చిన్న నదుల పరిస్థితి భిన్నంగా ఉంది. వాటిలో ప్రవాహం 17 శాతం పెరిగింది. హిమాలయాల వంటి ప్రాంతాల్లో జలవిద్యుత్ ప్రణాళికలు ఊహించని ప్రమాదాలు తెచ్చి పెడుతున్నాయి. అవక్షేపం దిగువకు రవాణా అవుతోంది. ఇది వరదలను తీవ్రతరం చేస్తోంది. గత 35 ఏళ్ల కాలంలో ఎగువ ప్రాంతాల్లోని ఇలాంటి చిన్నాచితకా నదుల వల్ల భారీ వరదలు ఏకంగా 42 శాతం పెరిగాయని అధ్యయనంలో తేలింది. వాతావరణంలో అధిక మార్పులు, నదీ ప్రవాహాలకు మానవులు అంతరాయం కలిగించడం వంటివే ఇందుకు కారణమని సివిల్ అండ్ ఎని్వరాన్మెంటల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ కోలిన్ గ్లీసన్ చెప్పారు. ‘‘ఈ వాతావరణ మార్పులు ప్రధానంగా మానవ కార్యకలాపాలు, శిలాజ ఇంధనాల వల్ల ఏర్పడ్డ వాతావరణ సంక్షోభమే. వాటివల్ల వర్షపాత పరిస్థితులు మారుతున్నాయి. మంచు కరిగి రేటు వేగవంతం అవుతోంది. స్తోందని, ఫలితంగా వరదలు ముంచెత్తుతున్నాయి’’ అని ఆయన వివరించారు. ‘‘పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో దుర్భర కరువు, మరికొన్ని ప్రాంతాల్లో కనీవినీ ఎరగని వరదలు పరిపాటిగా మారే రోజు దూరంలో లేదు’’ అన్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Bihar: విషాదాన్ని మిగిల్చిన పండుగ.. నీట మునిగి 46 మంది మృతి
పాట్నా: బిహార్‌లో జివుతియా పండుగ వేడుకల్లో పెను విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నదీ స్నానాలు చేసే క్రమంలో 46 మంది నీట మునిగి మరణించారు. వీరిలో 37 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో ముగ్గురు గల్లంతైనట్లు పేర్కొన్నారు.కాగా బిహార్ రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ‘జీవిత్పుత్రిక’ పండుగ జరుపుకున్నారు. తమ పిల్లల క్షేమం కోసం తల్లులు ఉపవాసం ఉండటంతో పాటు పిల్లలతో కలిసి నదులు, చెరువుల్లో పవిత్ర స్నానాలు చేస్తారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని 15 జిల్లాల పరిధిలోని నదుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తూ సుమారు 46 మంది గల్లంతయ్యారు.వీరిలో ఇప్పటి వరకు 43 మంది మృతదేహాలను వెలికితీసినట్లు విపత్తు నిర్వహణ విభాగం(డీఎండీ) అధికారులు తెలిపారు. తదుపరి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. తూర్పు, పశ్చిమ చంపారన్, నలంద, ఔరంగాబాద్, కైమూర్, బక్సర్, సివాన్, రోహ్తాస్, సరన్, పాట్నా, వైశాలి, ముజఫర్‌పూర్, సమస్తిపూర్, గోపాల్‌గంజ్, అర్వాల్ జిల్లాల్లో మునిగిపోయిన సంఘటనలు నమోదయ్యాయి.ఈ విషాద ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున నష్ట పరిహారం అందజేస్తామని సీఎం నితీష్‌కుమార్ వెల్లడించారు. నష్టపరిహారం అందించే ప్రక్రియ ప్రారంభమైందని, చనిపోయిన వారిలో ఎనిమిది మంది కుటుంబ సభ్యులకు ఇప్పటికే పరిహారం అందిందని సీఎం ఓ ప్రకటనలో తెలిపారు. -
‘రివర్స్’తో నందిని నెయ్యి
సాక్షి ప్రతినిధి, తిరుపతి: లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. మహాపచారానికి పాల్పడ్డారని పచ్చి అబద్ధాలు వల్లిస్తూ శ్రీవారి సన్నిధిలో రివర్స్ టెండర్లు ఏమిటంటూ గద్దించిన సీఎం చంద్రబాబు తాజాగా అదే విధానంలో నిబంధనలకు విరుద్ధంగా నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ సంస్థకు కేటాయించడంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది.టెండర్లో ఎల్ 1గా నిలిచిన కర్ణాటకకు చెందిన నందిని డెయిరీకి పూర్తి స్థాయిలో నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇవ్వకుండా రివర్స్ టెండర్ పిలిచి అత్యధికంగా ఆల్ఫా మిల్క్ సంస్థకు కేటాయించడం గమనార్హం. నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఆల్ఫా మిల్క్ ఫుడ్స్‌కు కట్టబెట్టేందుకే లడ్డూలో జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయనే ఆరోపణలు తెరపైకి తెచ్చి రివర్స్ టెండర్ విషయాన్ని పక్కదారి పట్టించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎల్ 1 కాదని ఎల్ 2కి ఎలా ఇస్తారు? ‘రివర్స్’ మతలబేంటి?తిరుమలలో స్వామి వారి ప్రసాదాలకు వినియోగించే నెయ్యి సరఫరా కాంట్రాక్టును తమకు అనుకూలమైన వారికి కట్టబెట్టాలని కూటమి పెద్దలు ముందుగానే నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా టీటీడీ గత నెల 7 తేదీన మూడు నెలలకు సరిపడా నెయ్యి సరఫరాకు ఈ టెండర్లు పిలిచింది. ఇందులో కర్ణాటకకు చెందిన నందిని(కర్ణాటక కో–ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ లిమిటెడ్) కిలో నెయ్యి రూ.470 చొప్పున సరఫరా చేసేందుకు కోట్ చేసి ఎల్ 1గా నిలిచింది.ఢిల్లీకి చెందిన ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ సంస్థ రూ.530 కోట్ చేసి ఎల్ 2గా నిలిచింది. నిబంధనల ప్రకారం ఎల్ 1గా నిలిచిన నందినికే టెండర్ దక్కాలి. అయితే నందినిని కాదని ‘ముఖ్య’ నేత ఆల్ఫా ఫుడ్స్ సంస్థకు నెయ్యి టెండర్ కేటాయించాలని నిర్ణయించుకున్నారు. దీంతో టీటీడీ వెంటనే రివర్స్ టెండర్లు పిలిచింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నిబంధనల ప్రకారం ఈ టెండర్లు పిలిచిన తరువాత తిరిగి టెండర్లు పిలవాల్సి వస్తే మళ్లీ ఈ టెండర్‌నే పిలవాలి.రివర్స్ టెండర్‌కి అవకాశమే లేదు. అయితే టీటీడీ ఈవో ఆదేశాల మేరకు గత నెల 9న రివర్స్ టెండర్స్ నిర్వహించారు. ఈసారి ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ కిలో నెయ్యి రూ.450 చొప్పున కోట్ చేయగా నందిని కిలో రూ.475కి కోట్ చేసింది. ఈ టెండర్లో ఆల్ఫా మిల్క్ ఫుడ్స్‌కి 65 శాతం నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఖరారు చేశారు. రివర్స్ టెండర్‌పై వివాదాన్ని తెరపైకి తేకుండా నందినికి 35 శాతం నెయ్యి సరఫరా అవకాశం కల్పించారు. -
నదుల అనుసంధానం.. భారీగా వ్యాపారావకాశాలు: ఐసీఆర్ఏ
గత కొన్నేళ్లుగా వాటర్ సెక్టార్ మీద కేంద్ర ప్రభుత్వ దృష్టి బాగా పెరిగింది. ఇందులో భాగంగానే నదుల అనుసంధానాలను వేగవంతం చేసింది. నదుల ప్రాజెక్టులను అనుసంధానం చేయడం వల్ల రూ. కోట్ల వ్యాపార అవకాశాలు లభిస్తాయని 'ఐసీఆర్ఏ' నివేదికలో పేర్కొంది. వచ్చే దశాబ్దంలో ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, నిర్మాణ (EPC) సంస్థలకు రూ. 2 లక్షల కోట్ల విలువైన వ్యాపార అవకాశాలు లభించవచ్చని అంచనా.నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (NWDA) 16 ద్వీపకల్ప నదులను, 14 హిమాలయ నదుల అనుసంధానాలతో కూడిన మొత్తం 30 ఇంటర్ లింకింగ్ రివర్ ప్రాజెక్టులను అనుసంధానించనుంది. కేంద్రం 2024-25 ఆర్ధిక సంవత్సరానికి గానూ జల్ జీవన్ మిషన్‌కు భారీ నిధులను కేటాయించింది.ప్రణాళికలో నాలుగు ప్రధాన లింక్‌లు ప్రారంభం మాత్రమే.. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రాజెక్టులు అనుసంధానానికి అనుమతులు లభిస్తాయని ఐసీఆర్ఏ కార్పొరేట్ రేటింగ్స్ వైస్ ప్రెసిడెంట్ అండ్ సెక్టార్ హెడ్ చింతన్ లఖానీ పేర్కొన్నారు. మంత్రిత్వ శాఖ బడ్జెట్లో ఈ ప్రాజెక్టుల ప్రస్తుత వాటా తక్కువగా ఉందని ఆయన వెల్లడించారు. ఇదీ చదవండి: పాల ప్యాకెట్లు అమ్ముకునే స్థాయి నుంచి వేలకోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా..కెన్ - బెత్వా, కోసి - మెచి, పర్బతి - కలిసింద్ - చంబల్, గోదావరి - కావేరి మాత్రమే ప్రణాళికలో ఉన్న నాలుగు ప్రధాన లింక్‌లు. 2034 - 35 నాటికి మొత్తం రూ. 2.6 లక్షల కోట్లతో ఈ ప్రాధాన్యతా లింక్‌లు పూర్తవుతాయని ఐసీఆర్ఏ వెల్లడించింది. ఇందులో గోదావరి - కావేరి అనుసంధానం చాలా పెద్దది. కోసి - మెచి చాలా చిన్నది. ఇంటర్ లింకింగ్ రివర్ ప్రాజెక్టులు పూర్తయిన తరువాత వ్యవసాయ సంబంధిత వ్యాపారాలు పెరుగుతాయి. -
Updates: ‘అధికారులెవరూ రాలేదండీ’
AP And Telangana Floods News Latest Updates In Teluguశ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద జలాశయం 2 రేడియల్ క్రెస్టు గేటు 10 అడుగులు మేర ఎత్తి దిగువకు నీటి విడుదల ఇన్ ఫ్లో : 1,38,833 క్యూసెక్కులు ఔట్ ఫ్లో : 96,081 క్యూసెక్కులు పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు.. ప్రస్తుతం : 884.60 అడుగులు పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు .. ప్రస్తుతం : 213.4011 టీఎంసీలు కుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తివిజయవాడ 12 రోజులైనా ముంపు ప్రాంత ప్రజలకు తప్పని తిప్పలు ఇంకా మోకాళ్ల లోతు నీటిలోనే నానుతున్న అంబాపురంలోని కాలనీలు వరదలో ఉండలేక ఇళ్లను వదిలి వెళ్లిపోయిన ప్రజలు దొంగల భయంతో మళ్లీ ఇళ్లకు చేరుకుంటున్న కొందరు ప్రభుత్వం నుంచి ఈరోజు వరకూ తమకు ఎలాంటి సహాయం అందలేదని ఆగ్రహం మంచినీరు కూడా సప్లై చేయడం లేదంటున్న అంబాపురం ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని ఇళ్ల నుంచి బయటికి వస్తున్న వరద బాధితులు ఎన్యుమరేషన్ దాదాపు పూర్తైందంటున్న అధికారులు.. తమ వద్దకు ఏ ఒక్కరూ రాలేదంటున్న వరద బాధితులువాలంటీర్ వ్యవస్థ ఉంటే తమకు ఇలాంటి సమస్య ఎదురయ్యేది కాదంటున్న అంబాపురం వాసులునల్లగొండనాగార్జునసాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదలభద్రాచలంతగ్గుముఖం పట్టిన గోదావరి ప్రవాహంఈరోజు ఉదయం 11 గంటలకు 42.7అడుగుల గోదావరి నీటిమట్టంమొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించిన అధికారులుసూర్యాపేటఅనంతగిరి, కోదాడ మండలాల్లో పర్యటించిన కేంద్ర బృందంఅనంతగిరి మండలం గోండ్రియాల, కోదాడ మండలం తొగర్రాయి, కూచిపూడిలో ధ్వంసం అయిన ఇళ్లలు, నష్టపోయిన పంట, కోతకు గురైన రహదారులను పరిశీలించిన కేంద్ర బృందం క్లిక్ చేయండి: దేవుడా ఈ నరకం ఇంకెన్నాళ్లూ! ప్రకాశం బ్యారేజీ వద్ద కేంద్ర బృందంప్రకాశం బ్యారేజీని పరిశీలించిన కేంద్ర బృందంబోటు ప్రమాదంలో దెబ్బ తిన్న బ్యారేజీని పరిశీలించిన సభ్యులుఖమ్మం ఖమ్మం నగరంలోని వరదల్లో నీట మునిగిన నయా బజార్ కాలేజీ ని పరిశీలించిన ఎమ్మెల్సీ కోదండరాం అనంతరం వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ కొనసాగుతున్న ఆపరేషన్ బోట్ప్రకాశం బ్యారేజ్ దగ్గర కొనసాగుతున్న బోట్ల తొలగింపు కార్యక్రమంనిన్నంతా కష్టపడ్డ అండర్ వాటర్ టీంఇవాళ కూడా కొనసాగనున్న పనులుబోట్లను ముక్కలు చేసి ఆపై బెలూన్లతో తొలగించే యత్నంమెదక్ఏడుపాయాల ఆలయం మళ్లీ మూసివేతసింగూరు గేట్లు ఎత్తేయడంతో భారీగా నీరుఆలయాన్ని తాకుతూ నీటి ప్రవాహంరెండ్రజుల కిందటే తెరుచుకున్న ఆలయంఈలోపే మళ్లీ మూసేసిన నిర్వాహకులుబ్యారేజీకి కేంద్ర కమిటీనేడు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో పర్యటించనున్న కేంద్ర కమిటీ ప్రకాశం బ్యారేజీ చెంతకు కమిటీప్రస్తుత బ్యారేజీ పరిస్థితిపై ఆరా తీయనున్న సభ్యులు ఎన్టీఆర్ జిల్లా:వరద ప్రభావిత ప్రాంతాల్లో అనిల్ సుబ్రహ్మణ్యం నేతృతంలో కేంద్ర బృందం పర్యటనకలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించిన కేంద్ర బృందంవరద ముంపు ప్రాంతాల డ్రోన్ విజువల్స్ పరిశీలననష్టంపై కేంద్ర బృందానికి వివరించిన కలెక్టర్ జి.సృజనకేంద్ర బృందాన్ని కలిసి తమకు జరిగిన నష్టంపై వినతిపత్రం అందజేసిన కృష్ణామిల్క్ యూనియన్ (విజయ డైరీ ) చలసాని ఆంజనేయులుఫోటో ఎగ్జిబిషన్ అనంతరం ప్రకాశం బ్యారేజ్, బుడమేరు గండ్లు పడిన ప్రాంతం, ఈలప్రోలు, రాయనపాడు, జక్కంపూడి, అజిత్ సింగ్ నగర్ ప్రాంతాలను పరిశీలించనున్న కేంద్ర బృందం నంద్యాల:శ్రీశైలం జలాశయానికి కోనసాగుతున్న వరద నీరుజలాశయం 1 గేటు 10 అడుగులు మేరకు మరొక్కసారి ఎత్తి దిగువకు నీటి విడుదలఇన్ ఫ్లో: 1,38,833 క్యూసెక్కులుఔట్ ఫ్లో: 96,081 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుప్రస్తుతం : 884.50 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ: 215.8070 టీఎంసీలుప్రస్తుతం: 212.9198 టీఎంసీలుకుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి విజయవాడ:విజయవాడలో ఇంకా ముంపులోనే పలు కాలనీలు12 రోజులైనా బురదలోనే ముంపు ప్రాంతాలుశుభ్రం చేసుకునేందుకు అవస్థలుపడుతున్న కాలనీల వాసులునీళ్లలో నానుతున్న ఎల్బీఎస్ నగర్, కండ్రిక, తోటివారి వీధిముంపులోనే ప్రకాశ్ నగర్, అంబపురంలోపల కాలనీల ప్రజలకు అందని సాయం రోడ్ల మీద బురద పేరుకుపోవటంతో ప్రజలకు అవస్థలుప్రచార ఆర్భాటంగా ఎన్యుమరేషన్మ్యాపింగ్ ఉంటేనే ఎన్యుమరేషన్ అంటున్న అధికారులుఇంట్లోని సామాన్లకు మాత్రమే జరుగుతున్న ఎన్యుమరేషన్ ఖమ్మం జిల్లాఖమ్మం నగరంలో బొక్కలగడ్డ, ధంసలాపురం ప్రాంతాల్లో పర్యటిస్తున్న కేంద్ర బృందం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాభద్రాచలం వద్ద తగ్గుతున్న గోదావరి నీటి మట్టంఈరోజు ఉదయం 9 గంటలకు 43.3 అడుగులుకు చేరిన గోదావరి నీటిమట్టంఅమలులో ఉన్న మొదటి ప్రమాద హెచ్చరికఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద స్వల్పంగా తగ్గిన గోదావరి వరద.స్పిల్ వే ఎగువన 33.750 మీటర్లుస్పిల్ వే దిగువన 25.580 మీటర్లు నీటిమట్టం నమోదు.48 రేడియల్ గేట్ల ద్వారా 12,46.342,క్యూసెక్కుల గోదావరి వరద నీటిని దిగువకు విడుదల.ఏలూరు జిల్లాజంగారెడ్డిగూడెం మండలం కొంగ వారిగూడెం ఎర్రకాలవ జలాశయానికి తగ్గిన వరద నీరు.పూర్తిస్థాయి నీటిమట్టం 83.50 మీటర్లు ప్రస్తుత నీటిమట్టం 81.87ఇన్ ఫ్లో 1565 క్యూసెక్కులు అవుట్ ఫ్లో గేట్లు ఎత్తి 1806 క్యూసెక్కుల నీటిని దిగువ విడుదల చేసిన అధికారులునల్లగొండ జిల్లానాగార్జునసాగర్ ప్రాజెక్టు కు తగ్గిన వరదక్రస్ట్ గేట్లు మూసివేతఇన్ ఫ్లో: 68235 క్యూసెక్కులుఅవుట్ ఫ్లో : 43298 క్యూసెక్కులుపూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులుప్రస్తుత నీటి మట్టం: 589.60 అడుగులుపూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం: 312.0450 టీఎంసీలుప్రస్తుత నీటి నిల్వ: 310.8498 టీఎంసీలుకొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తిఎడమ కాలువకు నీటిని నిలిపివేసి నేటికి 12 రోజులుసూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామచంద్రాపురం వద్ద ఇంకా పూడ్చివేయని కాలువ గండిసూర్యాపేట జిల్లా:పులిచింతల అప్డేట్ఇన్ ఫ్లో 31,182క్యూసెక్కులుఅవుట్ ఫ్లో:16,000క్యూసెక్కులుపూర్తిస్థాయి నీటి మట్టం:175 అడుగులుప్రస్తుత నీటి మట్టం:172.767 అడుగులుపూర్తి స్థాయి నీటి సామర్థ్యం: 45.77 టీఎంసీలుప్రస్తుత నీటి నిల్వ: 38.765 టీఎంసీలుపవర్ జనరేషన్ :16000 క్యూసెక్కులు.నిజామాబాద్ జిల్లాశ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరదఇన్ ఫ్లో 35 వేల క్యూసెక్కులుఔట్ ఫ్లో 35 వేల క్యూసెక్కులుప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1090 అడుగులు, 80 టీఎంసీలుప్రస్తుతం 1090 అడుగులు, 80 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రంలో రెండో రోజు కేంద్ర ప్రభుత్వ కమిటీ పర్యటన.ఖమ్మం, సూర్యాపేటలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్న బృందం.వరద బాధితులను ఆదుకోవాలని నిన్న సెంట్రల్ కమిటీకి నివేదిక ఇచ్చిన సిఎస్.ఇవ్వాల్టితో ముగియనున్న రాష్ట్ర పర్యటన.జూరాల అప్డేట్మహబూబ్ నగర్ జిల్లా: జూరాల ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద13 గేట్స్ ఎత్తివేతఇన్ ఫ్లో : 1 లక్ష 26 వేల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో : 1 లక్ష 26 వేల 243 క్యూసెక్కులుపూర్తిస్థాయి నీటి సామర్థ్యం: 318.270 మీటర్లు, ప్రస్తుత నీటి సామర్థ్యం: 318.350మీటర్లుపూర్తిస్థాయి నీటి నిల్వ: 9.657 టీఎంసీలు , ప్రస్తుత నీటి నిల్వ : 9.316 టీఎంసీలుఎగువ, జూరాల జల విద్యుత్ కేంద్రం లో మొత్తం 5 యూనిట్లలో ఉత్పత్తి కొనసాగుతుంది. తూర్పుగోదావరి జిల్లాగోదావరిలోకి భారీగా వచ్చి చేరుతున్న వరద నీరుబ్యారేజ్ వద్ద 15.3 అడుగులుగా నమోదైన గోదావరి వరద నీటిమట్టం15 లక్షల 30 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదలబ్యారేజ్ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరికకోనసీమలో పలుచోట్ల నీట మునిగిన కాజ్వేలుసఖినేటిపల్లి మండలం అప్పన రాముని లంక టేకి శెట్టిపాలెం మధ్య వరద నీరు రావడంతో పడవలపై రాకపోకలుఅప్పనపల్లి-పెదపట్నం లంక మధ్య వరద నీరు రావడంతో అవస్థలు పడుతున్న స్థానికులుఇప్పటికే నీట మునిగిన గంటి పెదపూడి, ఎదురుబిడియం, కనకాయలంక కాజ్వేలువరద ఉదృతి ఎక్కువగా ఉండటంతో రెండు రోజులపాటు వినాయక నిమజ్జనాన్ని చేయకూడదని ఆదేశాలు జారీ చేసిన అధికారులుకోనసీమలో ఉదృతంగా ప్రవహిస్తున్న వశిష్ట , గౌతమి, వైనతేయ నదులు -
పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం
దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పర్వత ప్రాంతాలు మొదలుకొని మైదాన ప్రాంతాల వరకు అన్నిచోట్లా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గత రెండు రోజులుగా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి.రాజస్థాన్‌లో కురుస్తున్న కుండపోత వర్షాలకు సంభవించిన పలు ప్రమాదాలలో మరో ఎనిమిది మంది మృతి చెందారు. గడచిన రెండు రోజుల్లో 22 మంది వర్ష సంబంధిత ప్రమాదాల్లో మృతిచెందారు. కరౌలి, హిందౌన్లలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్యామ్‌లు, నదులు పొంగిపొర్లడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. విపత్తు సహాయక దళాలు కరౌలి, హిందౌన్‌లలో 100 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.హిమాచల్ ప్రదేశ్‌లో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఆకస్మిక వరదల కారణంగా రెండు జాతీయ రహదారులతో సహా మొత్తం 197 రోడ్లు మూసుకుపోయాయి. బీహార్‌లో గంగా నది సహా అన్ని ప్రధాన నదుల నీటిమట్టం పెరిగింది. రాజధాని పట్నాలో గంగ, పున్పున్ నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. గంగా నదికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరింది.గంగానది నీటిమట్టం పెరగడంతో ముంగేర్, భాగల్పూర్, పట్నా తీర ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. -
వాగులు దాటి వైద్యసేవలు..
వెంకటాపురం(కె): ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు దాటి ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండలం సీతారాంపురంలో వైద్య సిబ్బంది శుక్రవారం వైద్య శిబిరం నిర్వహించారు.ఈ గ్రామానికి వెళ్లాలంటే వాగులు దాటాలి. వర్షాలు పడుతుండడంతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అయినా వైద్యాధికా రి భవ్యశ్రీ, సిబ్బంది వాగులో నడుములోతు నీటిలో నడుచుకుంటూ గ్రామానికి వెళ్లారు. 67 మందికి పరీక్షలు జరిపి మందులు అందజేశారు. కలిపాక గ్రామంలోని ఇద్దరు గర్భిణులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. -
Khushboo Gandhi: బీ గుడ్.. డూ గుడ్!
మనదేశంలో ఏడాదికి 9,400 టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ కాలువలు, నదుల్లోకి చేరుతోంది. ఇందులో ఎక్కువ భాగం ప్యాకింగ్‌కు ఉపయోగించినదే ఉంటోంది. ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నాం. ఓ చిన్న హెయిర్ ఆయిల్ బాటిల్‌ని ప్యాక్ చేయడానికి దానికంటే నాలుగురెట్లు బరువున్న ప్యాకింగ్ మెటీరియల్‌ని ఉపయోగిస్తారు. అందులో కాగితంతో చేసిన అట్టపెట్టె ఉంటుంది. బాటిల్ పగలకుండా ప్లాస్టిక్ బబుల్ రేపర్ ఉంటుంది. కాగితం ఇట్టే మట్టిలో కలిసిపోతుంది. దాంతో ఇబ్బంది ఉండదు. మరి ప్లాస్టిక్ బబుల్ ర్యాపర్ ఎన్నేళ్లకు మట్టిలో కలుస్తుంది. ‘వస్తువులు రవాణాలో పగలకుండా ఉండాలంటే బబుల్ ర్యాపర్ ప్లాస్లిక్తోనే చేయాలా? కొబ్బరిపీచుతో బబుల్ ర్యాప్ చేసాను చూడండి’ అంటూ కుషన్‌ను పోలిన కాయిర్ పౌచ్‌ను చూపించింది ఖుష్బూ గాంధీ. అలాగే కాయిర్ బోర్డ్‌లో ఒక పొరలోకి గాలిని చొప్పించి బుడగలు తెప్పించింది. ముంబయిలో పుట్టి పెరిగిన ఖుష్బూ గాంధీ నిఫ్ట్‌లో మెటీరియల్ డెవలప్మెంట్ కోర్సు చేసింది.‘గో డూ గుడ్’ స్టార్టప్ ద్వారా ఎకో ఫ్రెండ్లీ ప్యాకింగ్ మెటీరియల్‌ని తయారు చేస్తోంది. ప్లాస్టిక్‌కి వ్యతిరేకంగా తనదైన శైలిలో ఉద్యమిస్తోన్న ఖుష్బూ... ‘ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి’ అని మైకులో గొంతుచించుకుంటే సరిపోదు, ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయం చూపిస్తే ఆటోమేటిగ్గా ప్లాస్టిక్‌ని దూరం పెట్టేస్తారు’ అంటోంది. ఇంకా...‘నా ప్రయోగాలు నాకు లాభాలను తెచ్చిపెడతాయో లేదో తెలియదు, కానీ సస్టెయినబుల్ లైఫ్ స్టయిల్ వైపు సమాజాన్ని నడిపించడంలో మాత్రం విజయవంతం అవుతాను’ అంటోంది ఖుష్బూ గాంధీ. ఎకో ఫ్రెండ్లీ సిరా!‘‘ప్లాస్టిక్ బబుల్ ర్యాపరే కాదు, పేపర్ మీద ప్రింటింగ్ కోసం ఉపయోగించే ఇంక్ కూడా అంత త్వరగా నేలలో ఇంకదు. పైగా మట్టిని కలుషితం చేస్తుంది. సీ వీడ్ (సముద్ర నాచు), నాచురల్ కలర్ పిగ్మెంట్స్తో ఇంకు తయారు చేశాం. ఒకసారి ఉపయోగించి పారేసే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లేట్‌కు బదులు వ్యవసాయ వ్యర్థాలతో ప్లేట్లు తయారు చేస్తున్నాం. ఇక్కడ మరో విషయం చె΄్పాలి. ఒకసారి వాడిపారేసే పేపర్ ప్లేట్లు, గ్లాసులకు ల్యామినేషన్తో కోటింగ్ వేస్తుంటారు. నేను దానికి కూడా ప్రత్యామ్నాయం కనుక్కున్నాను. ఎకో ఫ్రెండ్లీ కోటింగ్ చేస్తున్నాం. ‘గో డూ గుడ్’ ద్వారా మేము పది టన్నుల ప్లాస్టిక్ వాడకాన్ని నివారించగలిగాం. అలాగే ఎకో ఫ్రెండ్లీ ఇంక్‌తో ఒకటిన్నర లక్షల ఉత్పత్తులు అక్షరాలద్దుకున్నాయి. ఏడు టన్నుల బయో డీగ్రేడబుల్ బబుల్ ర్యాపర్లను వాడుకలోకి తెచ్చాం. ఈ ప్రయత్నంలో ఐదు టన్నుల వ్యవసాయ వ్యర్థాలు వినియోగంలోకి వచ్చాయి. లధాక్‌లో ప్లాస్టిక్ వేస్ట్! నేను ఈ రంగలోకి అడుగు పెట్టడానికి కారణం పదేళ్ల కిందటి లధాక్ పర్యటన. మారుమూల ప్రదేశాలు ప్లాస్టిక్ కవర్లతో నిండిపోయి ఉన్నాయి. షాంపూ సాషే నుంచి లేస్ ర్యాపర్ వరకు అవీ ఇవీ అనే తేడా లేకుండా ప్రతి పదార్థమూ ప్లాస్టిక్‌లోనే ప్యాక్ అవుతోందని నాకు తెలిసిందప్పుడే. ఆ చెత్త కాలువల్లోకి చేరకుండా అంతటినీ ఒకచోట పోగు చేసి తగలబెడుతున్నారు. వాళ్లకు చేతనైన పరిష్కారం అది. ఇంతకంటే పెద్ద పరిష్కారమార్గాన్ని కనుక్కోవాలని అప్పుడు అనిపించింది. ఆ తర్వాత నేను మెటీరియల్ డెవలప్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం స్పెయిన్కెళ్లాను. కోర్సు పూర్తయ్యేలోపు నా ఆలోచనకు ఒక స్పష్టమైస రూపం వచ్చింది. బయోడీగ్రేడబుల్ వస్తువులతో ప్లాస్టిక్‌కి సమాధానం చెప్పవచ్చనే ధైర్యం వచ్చింది. పీజీ పూర్తయి తిరిగి ఇండియాకి రాగానే మా తమ్ముడు, మా వారితో కలిసి పూణేలో నా డ్రీమ్ ్రపాజెక్ట్ ‘గో డూ గుడ్’కు శ్రీకారం చుట్టాను. ఇది విజయవంతంగా నడుస్తోంది’’ అని వివరించిందామె. ఖుష్బూ పేరుకు తగినట్లు పరిమళభరితంగా తన విజయ ప్రస్థానాన్ని రాసుకుంటోంది. మరి... మనం మన చరిత్రను ఏ సిరాతో రాసుకుందాం... మట్టిని కలుషితం చేసే ఇంకుతోనా లేక మట్టిలో కలిసిపోయే ఇంకుతోనా. మనమే నిర్ణయించుకోవాలి. -
నీటినిల్వలో అగ్రగామి ‘కృష్ణా’
సాక్షి, అమరావతి: దేశంలో అత్యధిక నీటినిల్వ సామర్థ్యం గల జలాశయాలున్న నదుల్లో కృష్ణానది అగ్రగామిగా నిలిచింది. అతి పెద్ద నది అయిన గంగ, రెండో అతి పెద్ద నది అయిన గోదావరి కన్నా నీటినిల్వ సామర్థ్యం ఉన్న జలాశయాల్లో అగ్రగామిగా కృష్ణానది కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) రికార్డుల్లోకి ఎక్కింది. దేశంలో హిమాలయ, ద్వీపకల్ప నదులతోపాటు అన్ని నదీపరివాహక ప్రాంతాల్లో (బేసిన్లలో) నిర్మాణం పూర్తయిన జలాశయాల నీటినిల్వ సామర్థ్యం 9,105.92 టీఎంసీలు. ఇందులో 1,788.99 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లతో కృష్ణానది ప్రథమ స్థానంలో నిలిచింది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రిజర్వాయర్ల నీటినిల్వ సామర్థ్యం 589.67 టీఎంసీలు కావడం గమనార్హం. అంటే.. దేశంలో అన్ని బేసిన్లలోని రిజర్వాయర్ల నీటినిల్వ సామర్థ్యంలో కృష్ణా బేసిన్ రిజర్వాయర్ల సామర్థ్యం 19.65 శాతం కావడం గమనార్హం. గంగా, గోదావరి కన్నా మిన్న.. హిమాలయ పర్వతాల్లో హిమానీనదాల్లో జన్మించి దేశంలో ప్రవహించే గంగానది అతి పెద్దది. గంగా బేసిన్లో ఉన్న జలాశయాల నీటినిల్వ సామర్థ్యం 1,718.91 టీఎంసీలు. పశ్చిమ కనుమల్లో నాసిక్ వద్ద జన్మించి ద్వీపకల్పంలో ప్రవహించే గోదావరి రెండో అతి పెద్ద నది. ఈ బేసిన్లో రిజర్వాయర్ల నీటినిల్వ సామర్థ్యం 1,237.61 టీఎంసీలు. వీటిని పరిశీలిస్తే.. నీటినిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లలో గంగ, గోదావరి కంటే కృష్ణానదే మిన్న అని స్పష్టమవుతోంది. రిజర్వాయర్ల నీటినిల్వ సామర్థ్యంలో గంగ, గోదావరి రెండు, మూడుస్థానాల్లో నిలవగా.. దేశంలో పశ్చిమం వైపు ప్రవహించే నర్మదానది నాలుగోస్థానంలో నిలిచింది. ఇక దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే వర్షఛాయ ప్రాంతంలో పుట్టి, ప్రవహించే పెన్నానది బేసిన్లో 239.59 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లున్నాయి. రిజర్వాయర్ల నీటినిల్వ సామర్థ్యంలో పెన్నా బేసిన్ దేశంలో తొమ్మిదోస్థానంలో నిలవడం గమనార్హం. హిమాలయ నది అయిన బ్రహ్మపుత్ర బేసిన్లో రిజర్వాయర్ల నీటినిల్వ సామర్థ్యం 88.65 టీఎంసీలు మాత్రమే. -
Jivitputrika festival: 24 గంటల వ్యవధిలో.. బిహార్‌లో 22 మంది నీటమునక
పట్నా: బిహార్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో 24 గంటల వ్యవధిలో నదులు, చెరువుల్లో స్నానాలు చేసేందుకు వెళ్లిన 22 మంది మృత్యువాత పడినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. వీరిలో అత్యధికులు జీవిత్పుత్రికా పండుగ సందర్భంగా స్నానాలు చేయడానికి వెళ్లిన మహిళలేనన్నారు. ఈ పండుగ రోజు మహిళలు తమ సంతానం బాగుండాలని దేవుణ్ని కోరుకుంటూ ఉపవాస దీక్షలు, నదీ స్నానాలు ఆచరించడం సంప్రదాయం. భోజ్‌పూర్‌లో బహియారా ఘాట్ వద్ద సోనె నదిలో స్నానాలు చేసేందుకు వెళ్లిన 15–20 మధ్య వయస్కులైన బాలికలు సెల్ఫీ తీసుకుంటూ నీటి ఉధృతికి కొట్టుకుపోయినట్లు అధికారులు వివరించారు. భోజ్‌పూర్‌లో అయిదుగురు, జెహానాబాద్‌లో నలుగురు, పట్నా, రొహతాస్ల్లో ముగ్గురు చొప్పున, దర్భంగా, నవడాల్లో ఇద్దరేసి, కైమూర్, మాధెపురా, ఔరంగాబాద్‌ల్లో ఒక్కరు చొప్పున జల సమాధి అయినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. -
దంచికొడుతున్న వానలు.. మళ్లీ యమునకు పోటెత్తిన వరద.. రెడ్ అలర్ట్ జారీ
ఢిల్లీ: ఉత్తరాదిలో వర్షాలు కాస్త తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పుంజుకున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలు పలు రాష్ట్రాలను మళ్లీ వణికిస్తున్నాయి. ఇప్పటివరకు సంభవించిన వరదల భీబత్సం నుంచి తేరుకోకముందే మరోమారు ముప్పు పొంచి ఉంది. నిన్న రాత్రి ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో వానలు దంచికొట్టాయి. దీంతో ప్రయాగ్‌రాజ్ వద్ద గంగా, యమునా నది ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోయింది. వర్షాలకు తోటు రహదారులపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఉత్తరప్రదేశ్‌లో గంగ, యమునా నది ప్రవాహం ఉద్దృతంగా ప్రవహిస్తోంది. ఫఫమౌ వద్ద గంగా నది ప్రవాహం 11 సెంటీమీటర్ల నుంచి 24 సెంటీమీటర్ల వరకు పెరిగిపోయింది. నైనీ వద్ద యమునా నది 29 సెంటీమీటర్ల మేర పెరిగింది. ఉత్తరఖండ్‌లో చమోలీ జిల్లాలో జాతీయ రహదారి 7పై కొండచరియలు విరిగిపడ్డాయి. వర్షాలతో రాష్ట్రంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. అటు అసోంలోనూ వరదలు సంభవించాయి. దాదాపు 47 జిల్లాలు వరదల్లో చిక్కుకున్నాయి. 32,400 మంది ప్రజలు వరదలకు ప్రభావితమయ్యారు. గత 24 గంటల్లో కురిసిన వర్షాలకు ఉత్తరప్రదేశ్‌లో 10 మంది వరకు మరణించారు. పంజాబ్, హర్యానాల్లో వర్షాలకు దాదాపు 55 మంది మృతి చెందినట్లు సమాచారం. ఇక వరదలతో అతలాకుతలం అయిన హిమాచల్ ప్రదేశ్‌లో ఇప్పటికే రూ.8000 కోట్ల నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గత మూడు రోజులుగా యమునా నది ప్రవాహం పెరగడంతో ఢిల్లీ వణికిపోయింది. ప్రస్తుతం పరిస్థితి కొంత మెరుగుపడినా ఇంకా కొన్ని ప్రాంతాలు వరద నీటిలోనే ఉన్నాయి. త్రాగునీటి వ్యవస్థ, విద్యుత్ సరఫరాకు ఇంకా కొన్ని ప్రాంతాల్లో అంతరాయం కొనసాగుతోంది. మళ్లీ ఇప్పుడు వర్షాల రావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. రాజ్‌ఘాట్ నుంచి నిజాముద్దీన్ మార్గంలో ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో ఐపీ ఫ్లైఓవర్ రింగ్ రోడ్డు కాకుండా వేరే మార్గంలో రావాలని వాహనదారులకు సూచనలు చేస్తున్నారు పోలీసులు. ఇదీ చదవండి: వరద గుప్పిట ఉండగానే మళ్లీ అందుకున్న భారీ వర్షం.. ఢిల్లీలో స్తంభించిన జనజీవనం -
IMD Alert: దంచికొడుతున్న వాన.. ఇంకా ముప్పు పొంచి ఉంది.. జాగ్రత్త!
ఢిల్లీ: వరదలతో అతలాకుతలం అవుతున్న ఉత్తరభారతానికి ఇంకా ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పషం చేసింది. ఇప్పటికే జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్ లకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా నదుల్లో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రవాహ వేగానికి బ్రిడ్జిలు కుప్పకూలిపోతున్నాయి. పలు భవనాలు నీటమునిగాయి. నగరాలు నుంచి పల్లెలదాక కాలనీలు జలమయమయ్యాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. మరో రెండు రోజుల పాటు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఐఎమ్‌డీ హెచ్చరికలు జారీ చేసింది. నదీ ప్రవాహాలకు దగ్గరగా వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఉత్తరభారతాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. కొండచరియలు విరిగి పడిన ఘటనల్లో 19 మంది చనిపోయారు. ఢిల్లీలోని యమున సహా పలు నదులు పొంగిపొర్లుతున్నాయి. ఆకస్మిక వరదలతో రహదారులపై రాకపోకలు స్తంభించాయి. దేశ రాజధానిలో నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత వర్షం కురిసింది. 24 గంటల వ్యవధిలో ఏకంగా 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1982 జూలై తర్వాత, ఈ స్థాయిలో వాన దంచికొట్టడం ఇదే ప్రథమం. ఇదీ చదవండి: ఉత్తరాదిని ముంచెత్తిన వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం.. -
గంగా తరంగం.. కాదిక నిరంతరం
పావన గంగా తరంగం.. బ్రహ్మపుత్ర గాంభీర్యం.. సింధునదీ సోయగం ఇక గతమే అంటోంది ఓ అధ్యయనం. మరో ఎనభై ఏళ్ల తరువాత ఈ జీవనదుల్లో వర్షాకాలంలోనే నీటి ప్రవాహం ఉంటుందని చెబుతోంది. భారత ఉపఖండానికి హిమాలయాలే జీవగర్ర. ఇక్కడ పుట్టిన గంగ, సింధు, బ్రహ్మపుత్ర వంటి జీవనదులు ఉపఖండంలోని మెజారిటీ భాగాన్ని సస్యశ్యామలం చేస్తూ భారత దేశాన్ని ప్రపంచానికే అన్నపూర్ణగా మారుస్తున్నాయి. హిమాలయాల్లో జరిగే ప్రతి మార్పూ భారత ఉపఖండంపై పెను ప్రభావం చూపుతుంది. అటువంటి హిమాలయాలు భూతాపం కారణంగా ప్రస్తుతం సంకటస్థితిని ఎదుర్కొంటున్నాయి. ధ్రువప్రాంతాలు మినహాయిస్తే భూగోళంలో అత్యధిక హిమపాతం కనిపించే హిమాలయాల్లో మరికొన్నేళ్లలో మంచు మటుమాయమైపోతుందని తాజా అధ్యయనంలో తేలింది. సాక్షి, అమరావతి: ఉత్తరార్ధగోళంలో 1950 నుంచి 2019 వరకు ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ, వర్షపాతం, హిమపాతం తదితర వాతావరణ సంబంధిత గణాంకాలపై బర్క్లీ–మిచిగాన్ యూనివర్సిటీలు సంయుక్తంగా అధ్యయనం చేశాయి. యూరోపి యన్ సెంటర్ నుంచి సేకరించిన సమాచా రాన్ని ఈ రెండు యూనివర్సిటీల ప్రొఫెసర్లు లోతుగా విశ్లేషించారు. ఆ గణాంకాలను 2024 నుంచి 2100 వరకూ వర్తింపజేసి వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేశా రు. ఈ అధ్యయనంలో ముఖ్యాంశాలు ఇవీ.. ♦పర్యావరణ కాలుçష్యం కారణంగా వాతావరణంలో జరుగుతున్న మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగు తున్నాయి. ఉష్ణోగ్రతలు ఒక డిగ్రీ పెరిగితే.. ఉత్తరార్ధగోళంలో హిమాల యపర్వతాల నుంచి యూరప్‌లో విస్తరించిన ఆల్ప్స్ పర్వతాల వరకూ వర్షపాతం 15 శాతం పెరుగుతోంది. ఆ మేరకు హిమపాతం తగ్గుతోంది. ♦ ఉత్తరార్ధగోళంలో మన దేశానికి ఉత్తర సరిహద్దుగా ఉన్న హిమాలయాల నుంచి యూరప్‌లోని ఆల్ప్స్ అమెరికాలోని రాఖీ పర్వతాల వరకూ చూస్తే.. హిమాల యాల్లోనే అధిక వర్షపాతం నమోదవు తోంది. ఆ మేరకు హిమపాతం గణనీయంగా తగ్గుతోంది. ♦ హిమాలయాల్లో పుట్టిన గంగ, సింధు, బ్రహ్మపుత్ర నదులు, వాటి ఉప నదుల్లో ఆకస్మిక వరదలకు ప్రధాన కారణం.. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు వర్షపాతం పెరగడమే. ఈ వరదల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో పాటు సారవంతమైన నేల కోతకు గురవుతోంది. ఈ ప్రభావం వల్ల హిమాలయాలకు దిగువన నివసించే కోట్లాది ప్రజల జీవనం అస్తవ్యస్తమవుతోంది. ♦హిమాలయపర్వతాల్లో ప్రధానంగా హిందూకుష్ పర్వత శ్రేణుల్లో హిమనీనదాలు (గ్లేసియర్స్) కరుగుదల ఇటీవలి కాలంలో 65 శాతం పెరిగినట్లు ఐసీఐఎంవోడీ (ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెయిన్ డెవలప్మెంట్) సంస్థ తేల్చింది. 2100 నాటికి హిందూకుష్ పర్వతాల్లోని హిమనీనదాలు ప్రస్తుతం ఉన్న పరిమాణంలో 80 శాతం మాయం కావడం ఖాయమని ఆ సంస్థ పేర్కొంది. ♦ హిమపాతం తగ్గడం, హిమనీనదాలు వేగంగా కరుగుతుండటాన్ని బట్టి చూస్తే జీవనదులైన గంగ, బ్రహ్మపుత్ర, సింధు వంటి నదులు, వాటి ఉప నదుల్లో 2100 తరువాత వర్షాకాలంలో మాత్రమే నీటి ప్రవాహం కనిపిస్తుంది. మిగతా సమయాల్లో ఆ జీవనదులు ఎండిపోవడం ఖాయం. దీనివల్ల భారతదేశ ప్రజల ఆహార అవసరాలు తీర్చడంలో అత్యంత కీలకమైన గంగా సింధు మైదానానికి నీటి లభ్యత కష్టమే. -
భారతదేశంలోని టాప్ 10 అతిపెద్ద నదులు
-
ప్రపంచంలోని టాప్ 10 అతిపెద్ద నదులు
-
చెరువులు, కుంటలపై మత్స్యకారులకే పూర్తి హక్కులు
సాక్షి, హైదరాబాద్: చెరువులు, కుంటలపై మత్స్యకారులకే పూర్తి హక్కులున్నాయని, దళారుల పెత్తనాన్ని సహించేది లేదని మత్య్స, పాడి పరిశ్రమల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ హెచ్చరించారు. చేపల పెంపకంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని సోమవారం బేగంపేట హరిత ప్లాజాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు, చేపల చెరువుల నిర్మాణానికి ముందుకొచ్చే వారికి ప్రభుత్వం అన్నివిధాలుగా చేయూతనిస్తుందని చెప్పారు. అన్ని వసతులతో కూడిన హోల్‌సేల్ చేపల మార్కెట్‌ను కోహెడ వద్ద 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నట్లు చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని చెరువుల వల్ల మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వాటిని మత్స్య శాఖ పరిధిలోకి తీసుకొచ్చామని మంత్రి వివరించారు. వివిధ మత్స్య సొసైటీలు, మత్స్యకారుల మధ్య విభేదాల పరిష్కారానికి ఒక కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలకు మత్స్య సొసైటీలను ఏర్పాటు చేసి.. 18 ఏళ్లు నిండిన మత్స్యకారుడికి సొసైటీలో సభ్యత్వం కల్పిస్తున్నామని వివరించారు. అనంతరం ఆరు ఉత్తమ మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు మెమెంటోలు, 15 నూతన సొసైటీలకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను మంత్రి అందజేశారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా, ఎమ్మెల్సీ బండ ప్రకాశ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా పాల్గొన్నారు. -
దయ... ధర్మం... దాయాది..
కనివిని ఎరుగని కష్టం ఎదురైనప్పుడు కన్నీటిని తుడిచే సాంత్వన కావాలి. దశాబ్ది కాలం పైగా ఎరుగని భారీ వరదలు... దేశంలోని 150 జిల్లాల్లో 110 జిల్లాలను ముంచెత్తిన కష్టం... దేశ భూభాగంలో మూడోవంతు ప్రాంతంపై, 3.3 కోట్ల మందిపై ప్రభావం... దేశంలోని ప్రతి ఏడుగురిలో ఒక బాధితుడు... పదకొండు వందల మందికి పైగా మృతులు. ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన పాకిస్తాన్ ప్రస్తుతం ఉన్న కష్టానికి ఈ లెక్కలే సాక్ష్యం. ఇన్ని ఇక్కట్లతో ఆ దేశం ఆపన్న హస్తం కోసం చూస్తోంది. దాయాదికి సాయం అందించడానికి భారత్ సిద్ధంగా ఉందంటూ వస్తున్న వార్తలపై అనుకూల, ప్రతికూల వైఖరులతో ఇప్పుడు దేశంలో చర్చ రేగుతోంది. ఐరోపా, చైనా సహా ప్రపంచంలో పలు ప్రాంతాలు అత్యధిక ఉష్ణోగ్రతలు, దుర్భిక్షంతో బాధపడుతుంటే, పాక్ వరదల్లో చిక్కుకుంది. పర్యావరణ విపరిణామాలకు ఇది నిదర్శనం. ఎండా కాలంలోని అత్యధిక ఉష్ణోగ్రతలతో హిమాలయాలు సహా వివిధ పర్వతశ్రేణుల్లో హిమానీనదాలు కరిగి, మే నాటికే పాక్‌లో నదులన్నీ నిండుకుండలయ్యాయి. ఆపై వానాకాలంలో ఊహకందని రీతిలో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం రావడంతో పరిస్థితి చేయిదాటింది. జూలై నుంచి పెరుగుతున్న వరదలతో స్థానికులకు కన్నీళ్ళే మిగిలాయి. భూతాపోన్నతికి తక్కువ కారణమైనా, ఇంతటి పర్యావరణ విపరిణామానికి ఇస్లామాబాద్ లోనవడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో కర్బన ఉద్గార దేశాలకు తమ తప్పు లేని బాధిత దేశాలకు నిధులివ్వాల్సిన నైతిక బాధ్యత ఉంది. పాకిస్తాన్‌కు ఇది పచ్చి గడ్డుకాలం. ఈ ఏడాది మొదట్లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పతనమయ్యాక పీఠమెక్కిన షెహబాజ్ షరీఫ్ సర్కారు ఇంకా నిలదొక్కుకోనే లేదు. ఎన్నికలు జరపాలని ఇమ్రాన్ వీధికెక్కారు. అంతకంతకూ రాజకీయ అనిశ్చితి పెరుగుతోంది. మరోపక్క ద్రవ్యోల్బణం తారస్థాయికి చేరింది. దిగుమతుల సామర్థ్యం అడుగంటింది. ఈ పరిస్థితుల్లో ప్రతి చిన్న సాయం విలువైనదే. అసహజ వాతావరణ పరిస్థితులు చుట్టుముట్టిన పాకిస్తాన్‌కు సాయం అందించాల్సిందిగా ఐరాస సైతం అభ్యర్థించింది. అమెరికా, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, టర్కీ సహా పలు దేశాలు ఇప్పటికే సహాయం అందిస్తున్నాయి. నిజానికి, అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాక్ దీర్ఘకాలంగా ఆర్థిక ఉద్దీపన కోసం నిరీక్షిస్తోంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఎట్టకేలకు 110 కోట్ల డాలర్ల ఉద్దీపనకు మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ పరిస్థితుల్లో సోదర భారత్ సైతం పెద్ద మనసుతో వరద బాధితులకు సాయం చేయడమే సరైన చర్య. ఇంతవరకూ నోరు విడిచి భారత సాయం కోరని పాక్ పాలకులు సైతం ఒక అడుగు ముందుకు వేయాలి. భారత్ నుంచి కూరగాయల దిగుమతికి ఆలోచిస్తామని ఒకసారి, భారత భూ సరిహద్దు ద్వారా ఆహారం పంపడానికి అనుమతించాలన్న అంతర్జాతీయ సంస్థల అభ్యర్థనపై సంకీర్ణ భాగస్వాములతో, కీలకమైనవారితో చర్చించి నిర్ణయిస్తామని మరోసారి పాక్ ఆర్థిక మంత్రి వ్యాఖ్యానించడం అసంబద్ధం. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడూ భౌగోళిక రాజకీయాలకే ప్రాధాన్య మిస్తే, అది అమానుషం. గతంలోనూ ఇలాగే ద్వైపాక్షిక, దౌత్య గందరగోళాలతో ఇరు దేశాల మధ్య సాయానికి గండిపడ్డ సందర్భాలున్నాయి. 2000ల తొలినాళ్ళలో పరిస్థితి ఇలా ఉండేది కాదు. 2001లో భుజ్ భూకంపం వేళ మనకు పాక్ సాయం చేస్తే, 2005లో కశ్మీర్లో, పాక్ ఆక్రమిత కశ్మీర్లో భూకంపం వచ్చినప్పుడు నియంత్రణ రేఖ, వాఘా సరిహద్దులు దాటి మనం సరఫరాలు అందించాం. కానీ, 2008 నాటి 26/11 ముంబయ్ దాడుల తర్వాత ప్రకృతి వైపరీత్యాల వేళ సైతం పరస్పర సాయాలు బాగా తగ్గిపోయాయి. నిరుడు కరోనా రెండో వేవ్‌లో తమ దేశం గుండా ఆక్సిజన్ కారిడార్‌కు పాక్ ప్రధాని ఇమ్రాన్ ముందుకొచ్చినా, మన పాలకులు ఓకే చెప్పలేదు. 2010 నాటి వరదల వేళ 2.5 కోట్ల డాలర్ల మేర ఆర్థిక, వస్తు సాయం సహా గతంలో మనం అనేకసార్లు పాక్‌కు సాయం చేసినా, అది పాముకు పాలు పోసినట్టే అయిందని విమర్శకుల వాదన. అందులో కొంత నిజం లేకపోలేదు. అలాగే, కశ్మీర్‌కు వర్తించే ఆర్టికల్ 370ని 2019లో రద్దు చేశాక పొరుగుదేశమే మనతో వాణిజ్య సంబంధాలు తెగతెంపులు చేసుకుంది. అయితే గతాన్ని తవ్వుకొనే కన్నా, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవడం ముఖ్యం. దేశంలో అధిక భాగం వ్యవసాయ భూములు నీట మునగడంతో పాకిస్తాన్‌కు ఆహార కొరత, అలాగే ఆరోగ్య సమస్యలు పొంచి ఉన్నాయి. వీటన్నిటి దృష్ట్యా రాజకీయాలను పక్కనపెట్టి అమాయక ప్రజల కష్టాలను ఆలోచించాలి. సామాన్య పాకిస్తానీయులకు ఆహార, ఆరోగ్య, తాత్కాలిక ఆవాసాల సాయం చేయడం వల్ల భారత్‌కూ లాభాలున్నాయి. సద్భావన పెరుగుతుంది. వ్యూహాత్మకంగా చూస్తే – పాక్‌లో చైనా చేప ట్టిన బీఆర్ఐ ప్రాజెక్టులు ఇరుకునపడ్డాయి. పాక్ సైతం అమెరికాతో సంబంధాలను మళ్ళీ మెరుగు పరుచుకోవాలని చూస్తోంది. పరిస్థితుల్ని సానుకూలంగా మలుచుకోవడానికి ఇదే సమయం. వరద సాయం ద్వారా దాయాదుల స్నేహానికి భారత్ ద్వారాలు తెరవాలి. నిరుడు ఆఫ్ఘన్‌కు 40 వేల మెట్రిక్ టన్నుల గోదుమలు పంపిన మనం పాక్‌కూ సాయం చేయాలి. పొరుగు వారు కొండంత కష్టంలో ఉన్నప్పుడు చూపాల్సిన మానవతకు మీనమేషాలు లెక్కించడం ధర్మం కాదు. అపకారికి సైతం ఉపకారం చేయాలనే సిద్ధాంతాన్ని నమ్మిన ధర్మభూమికి అసలే పాడి కాదు. దాయాదుల పోరులో దయనీయ ప్రజానీకం కష్టపడితే అది ప్రకృతి శాపం కాదు... పాలకుల పాపం! -
గురువాణి: అమ్మ ప్రేమకన్నా...
పసిపిల్లలకు లోకంలో తల్లికన్నా ప్రియమైనది ఏదీ ఉండదు. అమ్మతో మాట్లాడడం, అమ్మని ముట్టుకోవడం, అమ్మతో ఆడుకోవడం, అమ్మ పాట వినడం, అమ్మ స్పర్శ... వీటికన్నా ప్రియమైనవి లోకంలో ఉండవు. సమస్త జీవకోటినీ సష్టించే పరబ్రహ్మ స్వరూపం అమ్మే. ఈ లోకంలోకి రాగానే పాలిచ్చి, ఆహారమిచ్చి పోషించే మొట్టమొదటి విష్ణు స్వరూపం అమ్మయే. అన్ని ప్రాణులను తన వెచ్చటి స్పర్శతో నిద్రపుచ్చే ప్రేమైకమూర్తి అయిన హర స్వరూపం కూడా అమ్మయే. అందుకే అమ్మ సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త సమాహార స్వరూపం. అటువంటి అమ్మకన్నా ప్రియమైనది ప్రపంచంలో మరేముంటుంది? అయితే ఒకటి గమనించాలి. అమ్మకడుపులోంచి వచ్చిన వాడు మళ్లీ అమ్మ కడుపులోకి పోలేడు. కానీ ఈ దేశం మట్టిలో పుట్టి... మళ్ళీ చిట్ట చివర ఈదేశం మట్టిలో కలిసిపోతాం. అందువల్ల జన్మభూమి తల్లికన్నా గొప్పది. తల్లికన్నా ప్రియమైనది. అందునా భారత దేశం. ఇంత గొప్పదేశంలో పుట్టినవాళ్ళం...భరతమాత బిడ్డలం. ఇది సామాన్యమైన భూమినా..!!! ఇది వేదభూమి, ఇది కర్మ భూమి(వేద సంబంధమైన క్రతువులు జరుపుకోవడానికి అర్హమైన భూమి)... ఎన్ని పుణ్యనదులు ప్రవహిస్తున్నాయో ఇక్కడ ఈ భావనలతో ఉప్పొంగిన ఓ మహాకవి పరవశించిపోయి ........ జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయ నేత్రి జయ జయ సశ్యామల సు శ్యామచలా చేలాంచల జయ వసంత కుసుమలతా చరిత లలిత చూర్ణ కుంతల జయ మదీయ హృదయాశ్రయ లాక్షారుణ పద యుగళా జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ.... ... ఇలా అల్లి ఓ పాట రాసేసాడు. ఆయనే దేవులపల్లి కృష్ణ శాస్త్రి.. ఈ అమ్మకు పుట్టిన బిడ్డలు అనంతం. వారందరికీ అమ్మ పోలికలే వచ్చాయట... ఏమిటా పోలికలు... త్యాగం, పదిమందికీ పెట్టడం, పరోపకారం, కృతజ్ఞత, ఆతిథ్యం...ఉపకారం చేసినవాడికి ఉపకారం చేయడమే కాదు, అపకారికి కూడా ఉపకారం చేయగల విశాల హృదయం... వీటన్నింటికీ మించి ఓర్పు... ఓర్పును మించిన ధర్మం, ఓర్పును మించిన సత్యం, ఓర్పును మించిన యజ్ఞం ఉండవు... అంత గొప్ప ఓర్పు కలిగి ఉండడం, అరిషడ్వర్గాలను జయించడం, తనలో ఉన్న పరబ్రహ్మాన్ని తెలుసుకోవడం.. అమ్మకున్న ఈ లక్షణాలన్నీ బిడ్డలకొచ్చాయి. అందుకే వారి హృదయాలలో ఆమె ఎప్పుడూ పచ్చని చీర కట్టుకుని వెలిగిపోతూ కన్పిస్తూంటుంది. పరమ పవిత్రమైన ఆమె పాదాలు.. ఈ సృష్టిలో ఆమె పాదాలను ముద్దాడడం పసిపిల్లవాడి పారవశ్యం. కవిగా దేవులపల్లి ఎంత పరవశించిపోయారంటే ‘‘అక్షరమక్షరం నా మనసు కరిగితే ఈ పాటయిందమ్మా..’’.అని చెప్పుకుని ఆమె పాదపద్మాలకు సమర్పించుకున్నారు. అత్యంత పవిత్రమైన ఈ అమృతోత్సవాల సందర్భంగా ఇంత మధురమైన దేశభక్తి గేయాన్ని రాసిన దేవులపల్లి కృష్ణశాస్త్రిగారిని స్మరించుకుంటే... మనం కూడా ఆయనలా చిన్నపిల్లలమై ఆమె పాదాలను ముద్దాడే అనుభూతిని పొందుదాం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
వామ్మో కోవిడ్ వ్యర్థాలు
కోవిడ్–19.. ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి. దాని నియంత్రణకు ప్రపంచవ్యాప్తంగా జనం మాస్కులు, చేతికి ప్లాస్టిక్ తొడుగులు, పీపీఈ కిట్లు, కరోనా టెస్టింగ్ కిట్లు, ప్లాస్టిక్ శానిటైజర్ సీసాలు విపరీతంగా ఉపయోగించారు. వీటిలో చాలావరకు ఒకసారి వాడి పారేసేవే. ఇవన్నీ చివరికి ఏమయ్యాయో తెలుసా? వ్యర్థాలుగా మారి సముద్రాల్లో కలిసిపోయాయి. ఎంతగా అంటే ఏకంగా 25,000 టన్నులకుపైగా పీపీఈ కిట్లు, ఇతర కరోనా సంబంధిత ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాలు, నదులు, చెరువుల్లోకి చేరుకున్నాయి. ఇంకా చేరుతూనే ఉన్నాయి. ఇవి జల వనరుల్లోని జీవజాలం పాలిట ప్రాణాంతకంగా మారుతున్నాయని అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకుల అధ్యయనంలో తేలింది. జీవ జాతులకు ప్రత్యక్ష ముప్పు 2019 డిసెంబర్లో కరోనా మహమ్మారి జాడ తొలుత చైనాలో బయటపడింది మొదలు 2021 ఆగస్టు వరకే 193 దేశాల్లో ఏకంగా 84 లక్షల టన్నుల కరోనా సంబంధిత ప్లాస్టిక్ వ్యర్థాలు వెలువడినట్లు అంచనా. వీటిలో ఏకంగా 70 శాతం జల వనరుల్లోకి చేరుకున్నాయని చెబుతున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సురక్షితంగా నిర్వీర్యం చేయడానికి సరైన సదుపాయాలు లేకపోవడమే ప్రధాన సమస్య అంటున్నారు. కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో ప్రపంచమంతటా నెలకు ఏకంగా 129 బిలియన్ల మాస్కులు, 65 బిలియన్ల గ్లౌజ్‌లు వాడేసినట్టు అంచనా. వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ సరిగా లేకపోవడంతో ఇవి వ్యర్థాలుగా మారిపోయాయి. మాస్కు.. ప్లాస్టిక్ బాంబు ఒకసారి వాడి పారేసే ఫేస్ మాస్కులను ప్లాస్టిక్ బాంబుగా పరిశోధకులు అభివర్ణించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మాస్క్‌లు, పీపీఈ కిట్లు, టెస్టింగ్ కిట్ల ముప్పు ఇప్పటికిప్పుడు ప్రత్యక్షంగా అనుభవంలోకి రాకున్నా రానున్న దశాబ్దాల్లో మాత్రం వాటి ప్రభావం దారుణంగా ఉంటుందని చెప్పారు. భూమిపై, సముద్రంలో ఉంటే జీవజాలానికి ప్రమాదం తప్పదని, వ్యర్థాల నిర్వహణపై ప్రపంచదేశాలు ఇప్పటికైనా దృష్టి పెట్టాలని సూచించారు. వేస్ట్ మేనేజ్మెంట్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకోవాలని, సామర్థ్యం పెంచుకోవాలని పేర్కొన్నారు. భవిష్యత్తులో కరోనా లాంటి మహమ్మారులు దాడి చేస్తే పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ఇప్పటి నుంచి సన్నద్ధం కావాలని ప్రభుత్వాలకు హితవు పలికారు. వాడి పారేసిన పీపీఈ కిట్లు, మాస్క్‌ల కుప్పల్లో పక్షులు చిక్కుకుపోయి విలవిల్లాడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కరోనా సంబంధిత ప్లాస్టిక్ వ్యర్థాల్లో అత్యధికంగా ఆసుపత్రుల నుంచి వెలువడినవే కావడం గమనార్హం. ఇవీ ప్రత్యామ్నాయాలు... ► చేతులు శుభ్రం చేసుకోవడానికి ప్లాస్టిక్ సీసాల్లో వచ్చే శానిటైజర్ కంటే వేడినీరు, సబ్బు వాడుకోవడం ఉత్తమం. సబ్బులు ఇప్పుడు భూమిలో సులభంగా కలిసిపోయే ప్యాకేజింగ్‌లో వస్తున్నాయి. ప్లాస్టిక్ సీసాల్లోని హ్యాండ్ శానిటైజర్లు కాకుండా సబ్బులు వాడుకుంటే పర్యావరణానికి ఎంతోకొంత మేలు చేసినట్టే. ► సింగిల్ యూజ్ ఫేస్‌మాస్క్‌లు వాడితే ప్రతి ఏటా కోట్లాది టన్నుల వ్యర్థాలు పేరుకుపోతాయి. వీటికంటే పునర్వినియోగ మాస్క్‌లు మంచివి. అంటే శుభ్రం చేసుకొని పలుమార్లు వాడుకునేవి. వీటిని వాషబుల్ మాస్క్‌లు అని పిలుస్తున్నారు. వీటిని పర్యావరణహిత మెటీరియల్‌తో తయారు చేస్తున్నారు. ► ప్లాస్టిక్ ముప్పు తెలిసినవారూ కరోనా సమయంలో వైరస్ భయంతో ప్లాస్టిక్ బ్యాగ్‌లు వాడారు. కానీ కాగితపు సంచులు, బట్ట సంచులు మంచి ప్రత్యామ్నాయమని నిపుణులు చెబుతున్నారు. ► హోటళ్లలో వాడే ప్లాస్టిక్ పొర ఉన్న కాగితపు కప్పులు లక్షల టన్నుల వ్యర్థాలుగా మారుతున్నాయి. గాజు, పింగాణి గ్లాసులను వేడి నీరు, సబ్బుతో శుభ్రం చేసి వాటిని మళ్లీ ఉపయోగించుకోవడం దీనికి మంచి ప్రత్యామ్నాయం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పర్ర భూములను చెరబడుతున్న ఆక్వా చెరువులు
సాక్షి, అమలాపురం(కోనసీమ జిల్లా): వేలాది ఎకరాల పంట భూముల నుంచి ముంపు నీరు, ఇతర డ్రెయిన్ల నీరు దిగడానికి సముద్రపు మొగలు ఎంతో అవసరం. సరిగ్గా ఇక్కడే సహజసిద్ధంగా ఏర్పడిన పర్ర భూములను కొంతమంది స్వార్థపరులు కబ్జా చేసి, అక్రమంగా ఆక్వా చెరువులు ఏర్పాటు చేయడంతో మొగలు పూడుకుపోతున్నాయి. ఫలితంగా ఏటా వేలాది ఎకరాల్లో పంటలు ముంపు బారిన పడి, కోనసీమ రైతులు భారీగా నష్టపోతున్నారు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్), మద్రాస్ కన్జర్వెన్స్ యాక్టులను తోసిరాజని మరీ పర్ర భూముల్లో ఆక్వా చెరువులు తవ్వేస్తున్నా.. వేలాది ఎకరాల వరి ఆయకట్టు ముంపునకు కారణమవుతున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు. కొల్లేరు ఆపరేషన్ తరహాలో అక్రమ చెరువులను ధ్వంసం చేసి, రెగ్యులేటర్లు నిర్మిస్తేనే ఇక్కడ ముంపు సమస్యకు మోక్షం కలుగుతుందని ఇరిగేషన్ నిపుణులు, రైతులు చెబుతున్నారు. పులికాట్, కొల్లేరు తరహాలోనే కోనసీమలోని కాట్రేనికోన మండలం వృద్ధ గౌతమి నదీపాయ నుంచి అల్లవరం మండలం వైనతేయ నదీపాయ వరకూ సుమారు 6 వేల ఎకరాల్లో పర్ర భూములున్నాయి. మధ్య డెల్టాలో 1.72 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతోంది. రామేశ్వరం, కూనవరం మొగల ద్వారా సుమారు 65 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో 45 వేల ఎకరాలు వరి ఆయకట్టు ఉంది. మిగిలింది ఆక్వా చెరువులుగా మారిపోయింది. మొత్తం 45 వేల ఎకరాల ఆయకట్టు ముంపు నీరు ఈ మొగల ద్వారానే దిగాల్సి ఉంది. అయితే మొగలు పూడుకుపోవడం, వీటిని తెరచినా ముంపునీరు దిగకపోవడంతో రైతులు ఏటా రూ.60 కోట్ల మేర పంటలు నష్టపోతున్నారని అంచనా. పర్ర భూముల కబ్జా మొగల ద్వారా నేరుగా సముద్రంలోకి నీరు దిగే అవకాశం తక్కువ. భారీ వర్షాల సమయంలో ముంపునీరు రామేశ్వరం, కూనవరం డ్రెయిన్ల నుంచి పర్ర భూముల్లోకి వెళ్లేది. కూనవరం డ్రెయిన్ నీరు చిర్రయానం పర్ర భూమి ద్వారా వెళ్లి పల్లం, నీళ్లరేవు, ఏటిమొగ వద్ద సముద్రంలోకి వెళ్లేది. దీనివల్ల భారీ వర్షాల సమయంలో చేలు ముంపు బారిన పడినా రెండు మూడు రోజుల్లోనే నీరు తీసేది. కొన్నేళ్లుగా పర్ర భూముల్లో పెద్ద ఎత్తున ఆక్వా చెరువులు ఏర్పాటయ్యాయి. రామేశ్వరం పర్ర భూముల్లో 480 ఎకరాలు, ఎస్.యానాం, చిర్రయానాం పర్ర భూముల్లో సుమారు 1,650 ఎకరాల విస్తీర్ణంలో అక్రమ ఆక్వా సాగు జరుగుతున్నట్టు అంచనా. సుమారు 2,130 ఎకరాల భూమి కబ్జాల బారిన పడటంతో డ్రెయిన్ల ద్వారా వస్తున్న ముంపునీరు పర్ర భూముల్లోకి వెళ్లే సామర్థ్యం పడిపోయింది. ఆక్వా చెరువుల వల్ల ముంపునీరు పర్రభూముల ద్వారా కాకుండా మొగల ద్వారానే సముద్రంలో కలవాల్సి వస్తోంది. ఇసుక మేటలు వేయడంతో మొగల వెడల్పు కుదించుకుపోతోంది. కూనవరం స్ట్రెయిట్ కట్ ద్వారా 25 క్యూమిక్స్ (క్యూబిక్ మీటర్ పర్ సెకన్) నీరు సముద్రంలోకి దిగాల్సి ఉండగా, మొగ తెరచిన తరువాత కూడా 10 క్యూమిక్స్ కూడా దిగడం లేదు. కొల్లేరు తరహాలోనే.. పూర్వపు పశ్చిమ, కృష్ణా జిల్లాల సరిహద్దులో ఉన్న కొల్లేరు సరస్సులో కబ్జాలు చేసి, ఏర్పాటు చేసిన ఆక్వా చెరువులను నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ధ్వంసం చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో అక్కడ రూ.412 కోట్లతో మూడుచోట్ల రెగ్యులేటర్లు నియమిస్తున్నారు. ఇదేవిధంగా పర్ర భూముల్లోని ఆక్రమణలను సైతం తొలగించాలని ఇక్కడి రైతులు కోరుతున్నారు. మొగల పరిస్థితిపై గతంలో కూనా ఓషనోగ్రఫీ, ఉస్మానియా ఓషనోగ్రఫీ విభాగాలు సర్వేలు చేశాయి. డ్రెయిన్ నుంచి మొగ దాటుకుని సముద్రంలోకి 200 మీటర్ల మేర లాంగ్ రివిట్మెంట్లు నిర్మించాలని సూచించాయి. వీటికి ఆటోమెటిక్ రెగ్యులేటర్లు నిర్మించాలని సిఫారసు చేశాయి. డ్రెయిన్‌లో నీరు ఎక్కువగా ఉన్నప్పుడు తెరచుకునేలా.. సముద్రం పోటు సమయంలో మూసుకుపోయేలా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ప్రకారం రెగ్యులేటర్లు నిర్మించాలని రైతులు కోరుతున్నారు. అనధికార చెరువులపై చర్యలు పర్ర భూముల్లో అనధికారికంగా ఆక్వా చెరువులు సాగు చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. అలాగే పంచనదిని ఆనుకుని కూడా చెరువులున్నాయి. వీటిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. – ఆర్.నాగార్జున,డీఈఈ, డ్రెయిన్ అమలాపురం మొగల స్వరూపమిదీ.. కూనవరం ప్రధాన మురుగు కాలువ ద్వారా ఉప్పలగుప్తం, కాట్రేనికోన, ముమ్మిడివరం, అమలాపురం మండలాల్లోని సుమారు 35 వేల ఎకరాల్లోని ముంపునీరు దిగాల్సి ఉంది. రంగరాజు, ఓల్డ్ సమనస, అయినాపురం, గొరగనమూడి మీడియం డ్రెయిన్ల నీరు కూడా దీని ద్వారానే వస్తోంది. 1996 తుపాను సమయంలో దీనికి గండి పడింది. తరువాత ఏప్రిల్ నుంచి జూలై వరకూ పూడుకుపోయి, మిగిలిన సమయంలో అప్పుడప్పుడు కొద్దిమేర తెరచుకుంటోంది. అల్లవరం మండలం రామేశ్వరం మొగ ద్వారా వాసాలతిప్ప, పంచనది డ్రెయిన్ల నుంచి వస్తున్న ముంపునీరు దిగుతోంది. అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాలకు చెందిన సుమారు 25 వేల ఎకరాల్లోని ముంపునీరు దీని ద్వారా దిగాల్సి ఉంది. ముంపునీరు రామేశ్వరం మొగ వద్దకు వచ్చి ఇక్కడున్న పర్ర భూమిలోకి చేరుతోంది. అక్కడి నుంచి కిలోమీటరు ప్రవహించి సముద్రంలో కలుస్తోంది. (క్లిక్: పంట కాలువను కబ్జా చేసిన అయ్యన్న) -
చెరువులకు అమృత్ యోగం
సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలో అమృత్ సరోవర్ పథకం ద్వారా కొత్త చెరువుల తవ్వకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉపాధి హామీ పథకం ద్వారా వీటి తవ్వకం జరగనుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా ఎకరా స్థలంలో కొత్త చెరువుల నిర్మాణం జరగనుంది. నీటి ఒరవ ఉన్న ప్రాంతంలో ఇలాంటి వాటిని తవ్వనున్నారు. కొత్త చెరువుల తవ్వకానికి స్థలం దొరకని చోట ఉన్న పాతవి ఆధునీకరిస్తున్నారు. ఇప్పటికే 50 నుంచి 100 ఎకరాల ఆయకట్టు ఉన్న చెరువులను ఈ కార్యక్రమం కింద ఎంపిక చేశారు. జిల్లా వ్యాప్తంగా 31 మండలాల పరిధిలోని 96 చెరువులను అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఈ పనులకు సంబం«ధించిన ప్రతిపాదనలు సైతం జిల్లా కలెక్టర్‌కు సమర్పించారు. ఇప్పటికే 86 చెరువులకు జిల్లా కలెక్టర్ పరిపాలన అనుమతులు ఇచ్చారు. మిగిలిన వాటిని త్వరలోనే మంజూరు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చెరువుల్లో జంగిల్ క్లియరెన్స్, పూడికతీత, బౌండరీల నిర్మాణం, చెరువు సరిహద్దు వెంబడి మొక్కల పెంపకం చేపట్టనున్నారు. ప్రభుత్వం పూడికతీతలో భాగంగా తవ్వే మట్టిని అవసరమైన రైతులు తమ సొంత ఖర్చులతో పొలాలకు తరలించుకునే వెసలుబాటు కల్పించారు. చెరువు కమిటీల నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగనుంది. రూ. 8.24 కోట్ల నిధులతో చెరువుల నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికే 81 చెరువుల పరిధిలో పనులు మొదలయ్యాయి. మిగిలిన చోట త్వరలోనే మొదలు కానున్నాయి. ఉపాధి హామీ కూలీలతోనే చెరువుల నిర్మాణ పనులు జరగనున్నాయి. కూలీల కోసం రూ. 7.47 కోట్ల నిధులు వెచ్చించనున్నారు. మెటీరియల్ కాంపోనెంట్ కింద మరో రూ. 77.296 లక్షలు ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే పనులు మొదలుకాగా 2022 ఆగస్టు నాటికి కొన్ని చెరువు పనులను పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత 2023 ఆగస్టు నాటికి మిగిలిన పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ చెరువుల అభివృద్ధితో జిల్లా వ్యాప్తంగా దాదాపు 10 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. దీంతోపాటు పెద్ద ఎత్తున భూగర్బ జలాలు పెంపొందనున్నాయి. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో చెరువుల నిర్మాణ పనులు జరగనున్నాయి. 8అటవీశాఖ పరిధిలో 126 పనులు అమృత్ సరోవర్‌లో భాగంగా అటవీశాఖ పరిధిలో పెద్ద ఎత్తున పనులు చేపట్టనున్నారు. ప్రధానంగా అట్లూరు, సిద్దవటం, కాశినాయన, సీకే దిన్నె, పెండ్లిమర్రి మండలాల పరిధిలోని అటవీ ప్రాంతంలో ఇప్పటికే 16 ట్యాంకులను గుర్తించారు. ఇవి కాకుండా మరో 110 పర్కులేషన్, మినీ పర్కులేషన్ ట్యాంకులను సైతం గుర్తించారు. వీటికి సంబంధించి అటవీశాఖ అంచనాలను రూపొందించి జిల్లా కలెక్టర్‌కు పంపనుంది. అనంతరం సదరు పనులను మంజూరు చేయనున్నారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలతోనే ఈ పనులు చేపట్టనున్నారు. ఇందుకోసం సుమారు రూ. 3 కోట్లకు పైగా నిధులను వెచ్చించనున్నారు. జిల్లాలో చెరువుల అభివృద్ధిపై ప్రభుత్వం శ్రీకారం చుట్టడం, తద్వారా ఉపాధి హామి కూలీలకు పెద్ద ఎత్తున పనులు కల్పించే చర్యలు చేపట్టడంతో రైతులు, కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా పనులు పూర్తయ్యేలా చర్యలు అమృత సరోవర్ పథకం కింద ఉపాధి హామీ నిధులతో జిల్లాలో 96 చెరువులను అభివృద్ది చేస్తున్నాం. ఎకరా విస్తీర్ణంలో కొత్తవి నిర్మిస్తున్నాం. స్థలం అందుబాటులో లేని దగ్గర ఉన్న పాత చెరువులను అభివృద్ధి చేస్తున్నాము. వీలైనంత త్వరగా చెరువుల పనులను పూర్తి చేయనున్నాం. దీనివల్ల మరింత ఆయకట్టు సాగులోకి రానుంది. – విజయరామరాజు, జిల్లా కలెక్టర్ ఉపాధిహామీ నిధులతో చెరువుల అభివృద్ధి పనులు ప్రభుత్వం అమృత్ సరోవర్ కింద కొత్త చెరువుల నిర్మాణంతోపాటు పాతవి అభివృద్ది చేస్తోంది.డ్వామా ఆధ్వర్యంలో ఉపాధి కూలీల ద్వారా ఈ పనులు చేపట్టాం. ఇందుకోసం రూ. 8.24 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తాం. చెరువుల అభివృద్ధితో భూగర్భజలాలు పెరగనున్నాయి. – యదుభూషణరెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్, డ్వామా, కడప -
చెరువుల అభివృద్ధికి రూ. 4.98 కోట్లు మంజూరు
పీలేరురూరల్ : మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె ని యోజకవర్గాల్లో 12 చెరువుల అభివృద్ధికి రూ. 4.98 కోట్లు నిధులు మంజూరైనట్లు మదనపల్లె ఇరిగేషన్ ఈఈ సురేంద్రరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని చింతలచెరువు అభివృద్ధి పనులను ఆయన ప రిశీలించారు. ఆయన మాట్లాడుతూ పీలేరు నియో జకవర్గంలో పీలేరు మండలం చింతలచెరువుకు రూ.22 లక్షలు, కేవీపల్లె మండలం అమ్మగారిచెరువు కు రూ. 29 లక్షలు, కలకడ మండలం కదిరాయుని చెరువుకు రూ. 24 లక్షలు నిధులు మంజూరు అ య్యాయని చెప్పారు. అలాగే కలికిరి మండలంలో పెద్ద ఒడ్డు, మల్లిసముద్రం, దిగువ చెరువుకు రూ. 57.50 లక్షలు, తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువు మండలం పెద్దచెరువుకు రూ. 22 లక్షలు, బి.కొత్తకోట మండలం పెద్దచెరువుకు రూ. 33 లక్ష లు, పీటీఎం మండలం పెద్దచెరువుకు రూ. 49 లక్ష లు, తంబళ్లపల్లె మండలం రాతిచెరువుకు రూ. 47 లక్షలు, పెద్దమండ్యం మండలంలో మర్రికుంట చెరువు, పొట్టివానికుంట, ముసలికుంటకు రూ. 43 లక్షలు, మదనపల్లె మండలం సీటీఎం పెద్దచెరువుకు రూ. కోటి నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఆరు నెలల్లో పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇరిగేషన్ డీఈ ప్రసన్నకుమారి, ఏఈ ఎత్తిరాజులు పాల్గొన్నారు. -
ఈ చికిత్స సరైనదేనా?
ఆలోచన మంచిదే. కానీ, ఆచరణలో చిత్తశుద్ధి చూపితే మరీ మంచిది. దేశంలోని 13 ప్రధాన నదుల ‘పునరుజ్జీవనం’ కోసం కేంద్ర ప్రభుత్వం వేసిన ప్రణాళిక, చేసిన ప్రకటన చూశాక నిపుణులు చేస్తున్న వ్యాఖ్య ఇది. దేశ భౌగోళిక విస్తీర్ణంలో 57.45 శాతం మేర భాగాన్ని చుట్టి వచ్చే 13 ప్రధాన నదులు, వాటి 202 ఉపనదుల జలాలకు సంబంధించిన ప్రాజెక్టు ఇది. కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ చెబుతున్నట్టే అంతా జరిగితే, పెను మార్పు వస్తుంది. దేశంలో అటవీ విస్తీర్ణం 7,417 చదరపు కిలోమీటర్ల మేర పెరుగుతుంది. కాకపోతే, నదుల క్షీణత వెనుక ఉన్న అసలు కారణాలను వదిలేసి, అటవీ పెంపకమంటూ కొత్త సీసాలో పాత సారాగా ఈ ప్రతిపాదన తెచ్చారా? కాగితాల మీది పదును సర్కారు కార్యాచరణలోనూ కనపడుతుందా? గత రెండు, మూడు దశాబ్దాలుగా వ్యవసాయంలో నీటి దుర్వినియోగం, పెచ్చుమీరిన పట్టణీ కరణతో నీటి కోసం ఒత్తిడి పెరిగింది. నదీగర్భాలు ఎండిపోతున్నాయి. సహజసిద్ధంగా సాగాల్సిన భూగర్భ జలమట్టాల పెంపునకు గండిపడుతోంది. భూసారం క్షీణిస్తోంది. వర్షపునీటితో నిండు కుండలు కావాల్సిన నదులు ఎండమావులవుతున్నాయి. అంతకంతకూ పెరుగుతున్న జనాభాతో దేశంలో సగటు నీటి లభ్యత బాగా తగ్గిపోతోంది. నదుల రాష్ట్రంగా పేరున్న పంజాబ్‌లోని దక్షిణ ప్రాంతం సహా అనేక రాష్ట్రాలు ఎడారులయ్యే ప్రమాదంలో పడ్డాం. సారవంతమైన భూములనూ, భారీ పంట దిగుబడులనూ కోల్పోయే పరిస్థితి వచ్చింది. దానికి పరిష్కారంగా ప్రభుత్వం చెబుతున్న నదుల పునరుజ్జీవనం సుమారు రూ. 19,300 కోట్ల పైగా అంచనా వ్యయంతో కూడిన పంచవర్ష ప్రణాళిక. 23 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలకు విస్తరించిన నదులకు కాయకల్ప చికిత్స. హిమాలయ ప్రాంతంలోని ఝీలమ్, చీనాబ్, రావి, బియాస్, సత్లెజ్, యమున, బ్రహ్మపుత్ర, ఎండిపోయిన నదుల విభాగంలో లూనీ, దక్కన్ భూభాగంలోని కృష్ణా, గోదావరి, కావేరి, నర్మద, మహానది – ఇలా మొత్తం 13 నదులు ఈ భారీ పునరుజ్జీవన ప్రణాళికలో ఉన్నాయి. ఈ నదులకు కొత్త జవజీవాలు కల్పించడానికి చేపట్టాల్సిన చర్యలతో వివరణాత్మకమైన ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)లను డెహ్రాడూన్‌లోని ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్’ (ఐసీఎఫ్ఆర్ఈ) సిద్ధం చేసింది. ప్రాథమికంగా నదీ తీరం వెంట చెట్లను పెంచడం ద్వారా నదీజలాలకు పునరుత్తేజం తేవాలన్నది ఆలోచన. అలా పెంచే నదీ తీరస్థ అడవులన్నీ ‘సహజసిద్ధమైన బఫర్లు’గా, ‘బయోఫిల్టర్లు’గా నదుల స్వీయ శుద్ధీకరణకు తోడ్పడతాయని భావన. గతం గమనిస్తే – 2030 నాటికల్లా 50 లక్షల హెక్టార్ల మేర క్షీణించిన భూభాగాన్ని పునరుద్ధరిస్తామంటూ ‘బాన్ ఛాలెంజ్’ కింద 2015లో మన దేశం వాగ్దానం చేసింది. తాజాగా నదీజలాల పునరుజ్జీవన ప్రణాళికతో ఆ లక్ష్యానికి చేరువ కావచ్చని ప్రభుత్వ వర్గాల ఆశాభావం. అందుకు తగ్గట్లే, కొత్తగా పెంచే ఈ నదీ తీరస్థ అడవులు ‘కార్బన్ సింక్’లుగా పదేళ్ళలో, ఆపైన ఇరవై ఏళ్ళలో ఎన్ని మిలియన్ టన్నుల మేరకు వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుంటాయనే లెక్క కూడా కట్టారు. కేవలం కర్బన వాయువులను పీల్చుకోవడానికే కాక, భూగర్భ నీటిమట్టం పెరగడానికీ, భూక్షయాన్ని అరికట్టడానికీ ఈ నదుల పునరుజ్జీవన ప్రాజెక్ట్ తోడ్పడుతుందని అంచనా. ఒక రకంగా 2015–16లో ప్రయోగాత్మకంగా చేపట్టిన గంగా నది పునరుజ్జీవన పథకం లాంటిదే ఈ సరికొత్త 13 నదుల ప్రణాళిక! ఆర్భాటంగా మొదలైన ఆ ప్రభుత్వ పథకం ఏ మేరకు వాస్తవంగా సఫలమైందో చూస్తూనే ఉన్నాం. ఎనిమిదేళ్ళ తర్వాత ఇప్పటికీ గంగా నదీజలాల స్వచ్ఛత మాటలకే పరిమితమైంది. ఇప్పుడు ఈ పునరుజ్జీవన పథకమూ అదే బాటలో నడిస్తే లాభం లేదు. నదుల పునరుజ్జీవన ప్రణాళికకు వాతావరణ మార్పుల లాంటి అడ్డంకులూ ఉన్నాయి. సరైన రీతిలో మొక్కల పెంపకం లాంటి వివిధ అంశాలపై ప్రాజెక్ట్ సఫలత ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా, నాటే చెట్ల వయసు, పరిమాణం లాంటివి కూడా దృష్టిలో పెట్టుకొని నాణ్యమైనవాటిని నాటితేనే ఫలితం. నదీ తీరం వెంట మొక్కలు నాటడాని కన్నా ముందుగా భూసారం, నేలలోని తడిని పరి రక్షించే చర్యలు చేపట్టడం కీలకం. నదీ తీరస్థ అటవీ పెంపకం పేరిట స్థానిక పర్యావరణాన్ని దెబ్బ తీయకూడదు. ఆ ప్రాంతాలకే ప్రత్యేకమైన చెట్టూచేమా, పొదలు, తుప్పలను కాపాడుకోవాలి. నిజానికి, నదీ జలాల సహజ ప్రవాహాలను అడ్డుకుంటూ అనేక చిన్నా పెద్ద ఆనకట్టల నిర్మాణం, పారిశ్రామిక కాలుష్యం, వాతావరణ మార్పులతో హిమానీనదాలు కరిగిపోవడం, భూగర్భజలాల దుర్వినియోగం – ఇలా నదుల క్షీణతకు అసలు కారణాలు అనేకం. వాటిని పరిష్కరించే ఆలోచన చేయకుండా, పిడుగుకీ బియ్యానికీ ఒకే మంత్రంలాగా నదీతీరంలో మొక్కలు నాటితే చాలనుకోవడం ఏమిటి? పర్యావరణవేత్తలు వేస్తున్న ప్రశ్న ఇదే. అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకోవడం మొదలు నదుల ఆయకట్టులోని అటవీ పర్యావరణ వ్యవస్థలను కాపాడడం లాంటివి నదులకు కొత్త జవజీవాలను ఇస్తాయి. అవేమీ చేయకుండా, తప్పనిసరి అటవీ పెంపక చట్టం (క్యాంపా) కింద హిమాచల్‌లో, సత్లెజ్ ఎగువ ఆయకట్టులో చెట్లు పెంచితే, ఆ ఆలోచన విఫలమైంది. ఆ ప్రాంత భూభాగ సహజ స్వభావాన్ని దెబ్బతీసింది. ఆ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకపోతే కష్టం. అన్ని సమస్యలకూ పరిష్కారం ఒకటే అనుకుంటే నష్టం. ఎక్కడో గాయానికి, మరెక్కడో మందు పూస్తే సరిపోదని గ్రహించి, పాలకులు చిత్తశుద్ధితో నదీజలాల పునరుజ్జీవన చర్యలు చేపట్టాలి. -
World Water Day,: ‘సాగు’ మారకుంటే∙ నదులు ఎడారే
కోల్‌కతా: మన పంటల సాగు పద్ధతులు తక్షణమే మారకపోతే దేశంలోని నదులు ఈ శతాబ్దంలోనే ఎండిపోయి ఎడారిగా మారడం ఖాయమని పశ్చిమ బెంగాల్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కల్యాణ్ రుద్ర హెచ్చరించారు. భూగర్భ జలాలు ఎప్పటికీ అంతరించిపోవని చాలామంది భావిస్తున్నారని, అందులోని ఎంతమాత్రం నిజం లేదని తేల్చిచెప్పారు. భూగర్భ జలాలు పడిపోవడం అనేది నదుల మనుగడను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. పంటల సాగు పద్ధతులను వెంటనే మార్చుకోవాలని, లేకపోతే గంగానదితో సహా ఇతర నదులు ఎండిపోతాయని వెల్లడించారు. తద్వారా మన నాగరికత ఉనికి సైతం ప్రమాదంలో పడుతుందన్నారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా భారత్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యక్రమంలో కల్యాణ్ రుద్ర మాట్లాడారు. మనదేశంలో పంటల సాగు కోసం భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానంలో మార్పు రావాలన్నారు. చెరువులు, కుంటలు విస్తృతంగా తవ్వుకోవాలని, వాననీటిని, ఉపరితల జలాలను సంరక్షించుకోవాలని సూచించారు. భూగర్భ జలాలపై ఆధారపడడం మానుకోవాలని చెప్పారు. డ్యామ్‌లు, కాలువల నిర్మాణం అధిక వ్యయంతో కూడుకున్న వ్యవహారమని వివరించారు.