నైనిటాల్ : ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌లోని తానక్‌పూర్‌కి వెళుతున్న పూర్ణగిరి జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ హఠాత్తుగా వెనక్కి పరుగులు తీయడం ప్రారంభించింది. డ్రైవర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆగకుండా 35 కి.మీ. వెనక్కి ప్రయాణించింది. చివరకు ఖాతిమా స్టేషన్‌లో ఆగడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఢిల్లీ నుంచి బుధవారం బయల్దేరిన రైలు తానక్‌పూర్ చేరుతుందనగా రైల్వే ట్రాక్‌పైనున్న జంతువుని ఢీకొట్టింది.
దీంతో రైలు నియంత్రణ కోల్పోవడమే కాకుండా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వెనక్కి మళ్లింది. డ్రైవర్ బ్రేక్ వేయడానికి ప్రయత్నిస్తే అవి ఫెయిల్ అయ్యాయి. రైల్వే బోగీల మధ్యనున్న ప్రెజర్ పైపులు లీక్ కావడంతో బ్రేకులు ఫెయిల్ అయ్యాయని భావిస్తున్నారు. తానక్‌పూర్ కొండల మధ్య ఉండడంతో రైలు వెనక్కి పరుగులు తీసిందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment