డెహ్రాడూన్: ఉత్తరఖండ్‌లో చెలరేగిన హింస ఘటనకు సంబంధించిన కీలక నిందితుడు అబ్దుల్ మాలిక్‌ను ఎట్టకేలకు పోలిసులకు పట్టుబడ్డాడు. హింస చెలరేగిన 16 రోజులకు ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఉన్న అబ్దుల్ మాలిక్‌ను ఢిల్లీలో పట్టుకోని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫిబ్రవరి 8న హల్ద్వానీ ప్రాంతంలోని బంభూల్‌పురాలో ప్రభుత్వ స్థలంలో అనుమతి లేకుండా నిర్మించిన మదరసాను కూల్చేందుకు మున్సిపల్ సిబ్బంది ప్రయత్నించింది.
దీంతో స్థానికులకు,మున్సిపల్ సిబ్బందికి మధ్య హింస చెలరేగింది. మున్సిపల్ సిబ్బందిపై స్థానికులు రాళ్లు,పెట్రోల్ బాంబులు విసరటంతో మంటలు చెలరేగాయి. ఈ హింస ఘటనలో ఆరుగురు మరణించగా.. సుమారు 100 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో పోలీసులు, మీడియాకు చెందిన వారు ఉండటం గమనార్హం.
అయితే.. అబ్దుల్ మాలిక్ మదరసాను నిర్మించాడని తెలుస్తోంది. మున్సిపల్ సిబ్బంది ఆ మదస్సాను కూల్చివేయడాన్ని అతను తీవ్రంగా వ్యతిరేకించాడు. ఇక.. కూల్చివేత ప్రక్రియను నిలిపివేయాలని అతని భార్య సఫియా మాలిక్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో వారికి అనుకూలమైన తీర్పు వెలువడలేదు.
దీంతో మున్సిపల్ సిబ్బంది అనుమతిలేని మదర్సాను కూల్చడానికి ప్రయత్నించారు. దీంతో అక్కడి స్థానికుల్లో తీవ్రమై వ్యతిరేకత ఎదురైంది. అది కాస్త.. హింసగా చెలరేగింది. అయితే ఈ ఘటనలో అబ్దుల్ మాలిక్ హస్తం ఉందని..కావాలనే అతను హింసను ప్రేరేపించాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటన జరిగినప్పటి నుంచి అబ్దుల్ పరారీలో ఉన్నాడు. అతని కోసం వెతుకుతున్న ఉత్తరఖండ్ పోలీసులకు ఎట్టకేలకు అబ్దుల్ పట్టుబడ్డాడు. అతన్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment