violence
-
రక్తమోడుతున్న ‘వెండితెర’
నాటి క్లైమాక్స్ సీన్: హీరో గన్ను పట్టుకుని సుదూరం నుంచి విలన్ అండ్ కో మీద బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నాడు..పిట్టల్లా వారంతా నేల కొరిగిపోతున్నారు. ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. మంచి పైన చెడు గెలిచింది అంటూ సంతోషంగా ఇంటికి తిరుగు ముఖం పట్టారు.నేటి క్లైమాక్స్: హీరో విలన్ అండ్ కో మీద ఎగిరి దూకాడు చేతులు కట్టేసి ఉన్నప్పటికీ..అడవి మృగాన్ని తలపిస్తూ వరుసపెట్ట్లి కంఠాల్ని నోటితో కరిచేశాడు.. కండల్ని దంతాలతో లాగేశాడు. రక్తమోడుతున్న నోటిని నాలుకతో తుడుచుకున్నాడు. ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం కూడా మరచిపోయారు ఎందుకంటే వారు అప్పటికే షాక్‌లో ఉన్నారు.. చెడు మీద చెడు గెలిచిందో మంచి గెలిచిందో తెలీని అదే షాక్‌లో ఇంటికి తిరుగుముఖం పట్టారు.కళాత్మకమా? హింసాత్మకమా?ఆటవికన్యాయమే ఆధునిక సినిమా విజయసూత్రంగా మారిందా? వయె‘‘లెన్స్’’ లో నుంచే సినిమా రూపకర్తలు తమ సుసంపన్న భవిష్యత్తును దర్శిస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలకు కాదు అని చెప్పే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఇప్పుడు లేదు. మొన్నటి కెజీఎఫ్ నుంచి నేటి మార్కో(Marco Movie) దాకా దక్షిణాదిలో, మొన్నటి కిల్(Kill) నుంచి నిన్నటి యానిమల్ దాకా ఉత్తరాదిలో..భాషా బేధాల్లేకుండా.. గత రెండు మూడేళ్లుగా సినిమా తెర అవిశ్రాంతంగా రక్తమోడుతోంది. నవరసాల్ని పంచే వినోదం నవనాడుల్లో దానవత్వాన్ని పెంచి పోషిస్తోంది. కళ్ల ముందు తెగిపడుతున్న శరీరభాగాలు కనపడితేనే కౌంటర్లలో టిక్కెట్లు తెగుతాయనే ప్రమాదకర విశ్వాసం సినీజీవుల్లో ప్రబలుతోంది.ఈ పరిస్థితికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కోవిడ్–19 మహమ్మారి ఇంట్లో నుంచే సినిమాలను ఎక్కువగా వీక్షించే విధానాన్ని సృష్టించింది. ఇది దేశంలోని ఇతర భాషలతో పాటు కొరియన్ జపనీస్తో సహా ప్రపంచ సినిమాలకు వారిని సన్నిహితం చేసింది. దాంతో క్రూరమైన పంధాకు పేరొందిన పలు సినిమా పరిశ్రమల చిత్రాలు మనకీ చేరువయ్యాయి. చెన్నైకి చెందిన జికె సినిమాస్ మేనేజింగ్ డైరెక్టర్ రూబన్ మతివానన్ మాట్లాడుతూ యువతలో యాక్షన్ హింసాత్మక చిత్రాల పట్ల మోజు పెరిగిందని అన్నారు మహమ్మారి తర్వాత, థియేటర్లు యాక్షన్, థ్రిల్లర్ గ్యాంగ్‌స్టర్, హింసాత్మక చిత్రాలతో నిండిపోతున్నాయి. ‘‘ఈ ధోరణి యూత్‌ను ఆకర్షిస్తున్నప్పటికీ, సినిమాలకు కుటుంబ ప్రేక్షకులను కూడా రాకుండా చేస్తుంది. సినిమా అంటే అన్ని వర్గాల ప్రేక్షకులనూ కలిగి ఉండాలి’’ అన్నారాయన.కొబ్బరికాయ కొట్టిన కెజీఎఫ్...గతంలోనూ సినిమాల్లో వయెలెన్స్ ఉండేది అయితే ఈ స్థాయిలో కాదు. ఈ ట్రెండ్‌కి శ్రీకారం చుట్టింది కెజీఎఫ్(KGF Movie) అని చెప్పొచ్చు. అక్కడ నుంచి వరుసగా ఈ తరహా చిత్రాలు తెరప్రవేశం చేస్తూ వచ్చాయి. గత ఏడాది బాలీవుడ్ హిట్స్‌గా నిలిచిన యానిమల్, కిల్... బాలీవుడ్ చరిత్రలోనే అత్యంత హింసాత్మక చిత్రాలుగా అవతరించాయి. తండ్రి మీద అవ్యాజ్యమైన ప్రేమ కలిగిన ఓ యువకుడు ఆ సాకుతో సాగించిన దారుణ మారణకాండ యానిమల్ కాగా, ఓ రైల్లో ప్రేమజంట డెకాయిట్ల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ నేపధ్యంలో ఓ సైనికాధికారి సాగించిన హత్యాకాండ కిల్.. రెండూ ప్రేక్షకులకు కొత్తదనాన్ని క్రూరత్వంలో ముంచి పంచాయి. ఇక ఇటీవలే విడుదలైన మార్కో భారతీయ చిత్రాల తాజా హింసోన్మాదానికి పరాకాష్ట. అత్యధిక శాతం సన్నివేశాలు చూడలేక ప్రేక్షకులు కళ్ల మీద కర్చీఫ్‌లు కప్పుకున్న సినిమా ఇదేననే ఘనతను దక్కించుందంటే ఏ స్థాయిలో మార్కో హింసను పండించిందో అర్ధం చేసుకోవచ్చు. విషాదమో విచిత్రమో లేక వినాశనమో తెలీదు గానీ ఈ చిత్రాలన్నీ అత్యంత సమర్ధులైన, సృజనశీలురైన దర్శకుల చేతుల్లో రూపుదిద్దుకున్నవి. దీంతో ఇవి నచ్చి మెచ్చి ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. పైన చెప్పుకున్నవే కాకుండా అఖండ, దేవర, పుష్ప2..ఇలా భారీ కలెక్షన్లు సాధించిన, సాధిస్తున్న చిత్రాలన్నీ విపరీతమైన హింసకు పట్టం కట్టినవే కావడం గమనార్హం. ఇది అహింసో పరమో ధర్మః అని నినదించిన మన భారతీయ ధర్మానికి గొడ్డలిపెట్టుగానే చెప్పాలి.మన వ్యక్తిగత వృత్తి పరమైన జీవితాలలో టెన్షన్ల నుంచి తప్పించుకునే మార్గం సినిమా. ప్రస్తుత క్రైమ్ చిత్రాలు మనసును మరోవైపు మళ్లిస్తున్నప్పటికీ... మితిమీరిన హింస ప్రభావానికి గురైనప్పుడు, మనస్సును మరింత గందరగోళానికి గురి చేస్తుందని సైకాలజిస్ట్‌లు హెచ్చరిస్తున్నారు. ఈ చిత్రాల్లో హీరోలకు చట్టంతో పనిలేదు, కోర్టుల జాడే ఉండట్లేదు, మంచి చెడు మీమాంస అసలే కనపడదు. ఓ వయసు దాటిన వారి సంగతి ఎలా ఉన్నా... ఇప్పుడిప్పుడే ఓ పర్సనాలిటీ(వ్యక్తిత్వం) రూపుదిద్దుకుంటున్న యువ మనస్తత్వాలను ఇవి ప్రభావితం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. విజయమే లక్ష్యంగా సినిమా రూపొందించడంలో తప్పులేదు కానీ.. దాని కోసం సామాజిక బాధ్యతను విస్మరించడం తప్పు మాత్రమే కాదు..ముప్పు కూడా. దీనిని మన సినిమా దర్శకులు గుర్తించాలి..అది సమాజానికి...సమాజంలో భాగమైన సినిమా రూపకర్తలకు, వారి పిల్లల భవిష్యత్తుకు కూడా అవసరం. -
‘కాస్గంజ్’ కేసులో 28 మందికి యావజ్జీవం
లక్నో: సంచలనం సృష్టించిన కాస్గంజ్ హింసాకాండ కేసులో 28 మంది దోషులకు ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అలాగే రూ.80 వేల చొప్పున జరిమానా చెల్లించాలని దోషులను ఆదేశించింది. న్యాయస్థానం ఈ మేరకు శుక్రవారం తీర్పు వెలువరించింది. 2018 జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉదయం ఉత్తరప్రదేశ్‌లోని కాస్గంజ్లో నిర్వహించిన తిరంగా యాత్రలో హింస చోటుచేసుకుంది. మత కలహాలు చెలరేగాయి. తిరంగా యాత్రను కొందరు అడ్డుకున్నారు. యాత్రలో పాల్గొన్న చందన్ గుప్తా అనే వ్యక్తిని కాల్చి చంపారు. దీంతో హింస మరింత ప్రజ్వరిల్లింది. కాస్గంజ్ మూడు రోజులపాటు అట్టుడికిపోయింది. ఈ ఉదంతం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. చందన్ గుప్తాను హత్య చేయడంతోపాటు హింసకు కారణమైన దుండుగులపై పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య, హత్యాయత్నం, అల్లర్లకు పాల్పడడం, జాతీయ జెండాను అవమానించడం వంటి ఆరోపణలతో వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు ప్రభుత్వం అప్పగించింది. ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు గురువారం 28 మందిని దోషులుగా తేల్చింది. శుక్రవారం శిక్ష ఖరారు చేసింది. నసీరుద్దీన్, అసీమ్ ఖురేషీ అనే నిందితులపై తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా గుర్తించింది. -
మొజాంబిక్‌లో జైల్ బ్రేక్
మపుటో: మొజాంబిక్‌లో ఎన్నికల అనంతర హింస చల్లారడం లేదు. రాజధాని మపుటో శివార్లలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో కూడిన సెంట్రల్ జైల్లో బుధవారం అల్లర్లు చెలరేగాయి. పోలీసు సిబ్బంది నుంచి కొందరు ఖైదీలు ఆయుధాలు లాక్కుని తోటివారిని విడిపించడం మొదలు పెట్టారు. అల్లర్లు, తిరుగుబాటును అణిచేందుకు భద్రతా దళాలు వెంటనే రంగంలోకి దిగారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణలో 33 మంది మృతి చెందారు. 15 మందికి పైగా గాయపడ్డట్టు ప్రాథమిక సమాచారం. ఆ క్రమంలో జైలు గోడ కూలిపోవడంతో ఏకంగా 6,000 మందికి పైగా జైలు నుంచి తప్పించుకున్నట్టు దేశ పోలీసు జనరల్ కమాండర్ బెర్నార్డినో రఫెల్ తెలిపారు. వారిలో 150 మందిని పట్టుకున్నామన్నారు. ‘‘నేరారోపణలు రుజువైన 29 మంది కరడుగట్టిన ఉగ్రవాదులను కూడా ఖైదీలు విడిపించుకుపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరో రెండు జైళ్లలోనూ ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి’’అని వివరించారు. ఖైదీలు జైలు నుంచి పారిపోతున్న వీడియోలు వైరల్‌గా మారాయి. అధికార పార్టీకి వ్యతిరేకంగా గత అక్టోబర్‌లో జరిగిన ఎన్నికల్లో దీర్ఘకాలంగా అధికారంలో ఉన్న ఫ్రెలిమో పార్టీ విజయం సాధించింది. ఫలితాలను నిరసిస్తూ అప్పట్నుంచే దేశమంతటా ఆందోళనలు జరుగుతున్నాయి. అధికార పార్టీ విజయాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం సోమవారం ధ్రువీకరించింది. దాంతో ఒక్కసారిగా అల్లర్లు తీవ్రతరమయ్యాయి. వాటిలో ఒక్క రోజే కనీసం 21 మంది మరణించినట్టు ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. -
మొజాంబిక్‌లో హింస.. 21 మంది మృతి
మ్యాపుటు:తూర్పు ఆఫ్రికా దేశమైన మొజాంబిక్‌లో హింస చెలరేగింది. ఈ హింసాత్మక ఘనటల్లో21మంది దాకా మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఏడాది అక్టోబర్ 9న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఫ్రీలిమో పార్టీ అధ్యక్ష అభ్యర్థి డేనియల్ చాపో ఘన విజయం సాధించారు. ఈ ఎన్నిక వివాదాస్పదమైంది. దీనిపై ఓటమి చెందిన అధ్యక్ష అభ్యర్థి వెనాన్సియో సుప్రీంకోర్టుకు వెళ్లారు.కోర్టు చాపో ఎన్నిక సరైనదేనంటూ తాజాగా తీర్పిచ్చింది. దీంతో వెనాన్సియో మద్దతుదారులు హింసకు పాల్పడ్డారు. మొత్తం 236 హింసాత్మక ఘటనలు జరిగాయి. మృతిచెందిన 21 మందిలో ఇద్దరు పోలీసులున్నారు. ఆందోళనకారులు చాలా వాహనాలకు నిప్పంటించారు. రాజధాని మ్యాపుటులో అల్లరిమూకలు షాపులు దోచుకున్నారు. హింసకు భయపడి రాజధాని నగరం నుంచి ప్రభుత్వ అధికారులు పారిపోయినట్లు తెలుస్తోంది. కోర్టు తీర్పు నేపథ్యంలోనే ఆందోళనలతోపాటు దోపిడీలు జరుగుతున్నాయని మొజాంబిక్ తాత్కాలిక మంత్రి పాస్కోల్ రోండా ధృవీకరించారు. కాగా,అధ్యక్ష ఎన్నికల్లో చాపోకు 65 శాతం ఓట్లు రాగా వెనాన్సియోకు 24 శాతం ఓట్లు వచ్చాయి. -
పుట్టింది కెనడాలో. అన్నీ ఎదురుదెబ్బలే.. కట్ చేస్తే!
బాధితురాలిగా సానుభూతి తప్ప సరిౖయెన సలహాలు, సహాయం అందుకోలేకపోయింది రసిక సుందరం.తన చేదు జ్ఞాపకాలను దృష్టిలో పెట్టుకొని ‘ఇమార’ అనే స్వచ్ఛందసంస్థను ప్రారంభించింది. జెండర్ బేస్డ్ వయొలెన్స్‌ను నివారించడానికి, బాధితులకు అనేక రకాలుగా అండగా నిలవడానికి ‘ఇమార’ ద్వారా కృషి చేస్తోంది రసిక సుందరం.రెండు సంవత్సరాల క్రితం రసిక సుందరపై క్లోజ్‌ఫ్రెండ్ దాడి చేశాడు. ఊహించని ఈ సంఘటనకు భీతిల్లిన రసిక డిప్రెషన్లోకి వెళ్లింది. ఆ చీకటి నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవాలనుకుంది. అయితే వారితో వరుసగా చేదు అనుభవాలు ఆమెను నిరాశకు గురి చేశాయి.‘చాలామంది నన్ను అవమానించారు. చికిత్స ఫీజులు కూడా ఎక్కువే’ గతాన్ని గుర్తు చేసుకుంది రసిక.మంచి లాయర్ దొరకక పోవడం ఆమెకు మరో అడ్డంకిగా మారింది. దీంతో తనను వేధించిన వ్యక్తిపై కేసు పెట్టలేదు.తన అనుభవాల నేపథ్యంలో ‘ఇమార సర్వైవర్ సపోర్ట్’ ఫౌండేషన్ ప్రారంభించింది. ఇది సెక్సువల్ అండ్ జెండర్–బేస్డ్ (ఎస్జీబీవి) నివారించడానికి కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థ. ‘హింస నుంచి ప్రాణాలతో బయటపడిన వారికి మేము అండగా ఉంటాం. క్షేత్రస్థాయిలోకి వెళ్లి జెండర్–బేస్డ్ వయొలెన్స్ అంటే ఏమిటి అనేదాని గురించి అవగాహన కలిగించడం, ప్రాణాలతో బయటపడిన వారికి ఎలా సహాయపడవచ్చో చెప్పడం, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటూ కష్టాల్లో ఉన్నవారికి ఎలా అండగా ఉండవచ్చో చెబుతాం’ అంటున్న రసిక విద్యాలయాల నుంచి కాలనీ వరకు ఎన్నో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది. (పాల వ్యాపారంతో ఏడాదికి రూ.3 కోట్లు సంపాదన: రేణు విజయ గాథ)న్యాయ, వైద్యసహాయం, పోలీసు సహాయం కోసం వన్–స్టాప్ సెంటర్లకు రూపకల్పన చేయనుంది. ‘ఇమార’ ఫౌండేషన్ కోసం ఫెమినిస్ట్ రిసెర్చర్ కృతి జయకుమార్ మార్గదర్శకంలో ఎంతోమంది వాలెంటీర్లు, ఇతర స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తోంది రసిక. ఆర్థిక వేధింపులు, బలవంతపు గర్భస్రావం....ఇలా ఎంతో మంది బాధితులు ‘ఇమార’ను సంప్రదిస్తున్నారు.‘వరల్డ్ పల్స్ ప్లాట్‌ఫామ్’ ద్వారా ఆఫ్రికాలోని మానవ అక్రమ రవాణా బాధితురాలు ఒకరు రసికను సంప్రదించారు. మానవ అక్రమ రవాణాకు పాల్పడేవారు తనను లక్ష్యంగా చేసుకొని ఎలా కష్టపెడుతున్నారో చెప్పింది. కొన్నేళ్ళుగా వారి చెరలో ఉన్న బాధితురాలు తన ఇద్దరు పిల్లలతో కలిసి బయటికి రావడానికి భద్రతను కోరింది. ‘ఇం పాక్ట్ అండ్ డైలాగ్ ఫౌండేషన్’ వ్యవస్థాపకురాలు పల్లవి ఘోష్ సహాయ సహకారాలతో బాధితురాలిని, ఆమె పిల్లలను చెర నుంచి విముక్తి కలిగించగలిగింది రసిక. అయితే బాధితురాలి కష్టాలు అక్కడితో ఆగిపోలేదు. కొత్త దేశంలో ఆహారం, ఆశ్రయం, ఆర్థిక సమస్యలలాంటి ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. ఇది తెలుసుకొని యాంటీ ట్రాఫికింగ్ న్యాయవాదుల సహకారంతో గ్లోబల్ నెట్వర్కింగ్ ద్వారా ఆమెకు ఎలాంటి సమస్యలు లేకుండా చేసింది రసిక. ఇప్పటి వరకు ఏడు వందల మందికి పైగా బాధితులకు ‘ఇమార’ సహాయ సహకారాలు అందించింది. ధైర్యాన్ని ఇచ్చింది. (భార్యకోసం బంగారు గొలుసుకొన్నాడు.. దెబ్బకి కోటీశ్వరుడయ్యాడు!)కెనడాలో పుట్టిన రసిక ఎనిమిదేళ్ల వయసులో తన కుటుంబంతో కలిసి భారతదేశానికి తిరిగివచ్చింది. తమ కుమార్తెలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల మధ్య పెరగాలనే తల్లిదండ్రుల కోరికే వారు భారత్‌కు తిరిగిరావడానికి కారణం. చెన్నైలో డిగ్రీ చేసిన రసిక టొరంటోలోని యార్క్ యూనివర్శిటీలో పై చదువులు చదివింది. శరణార్థుల హక్కులు, వలస హక్కులు, లింగ–ఆధారిత హింస(జెండర్ బేస్డ్ వయొలెన్స్) చుట్టూ కేంద్రీకృతమైన మానవ హక్కులకు సంబంధించి ఇంటర్న్‌షిప్ చేసింది. జెండర్ సెక్యూరిటీ ప్రాజెక్ట్‌లలో పనిచేసింది.‘ఏ స్వచ్ఛంద సంస్థకు అయినా నిధుల సమీకరణకు సంబంధించి మొదటి మూడేళ్లు కష్టకాలం’ అంటున్న రసిక సుందరం తన కుటుంబం, స్నేహితులు ఇచ్చిన డబ్బుతో ‘ఇమార’ను నడుపుతోంది. ‘ఒక్క క్లిక్‌తో డేటాబేస్‌ను బాధితులు యాక్సెస్ చేసే యాప్‌ను రూపొందించడంపై దృష్టి పెట్టింది .లింగ ఆధారిత హింసను అంతం చేయడం కోసం పని చేస్తున్న ఇతర స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేయాలనుకుంటుంది రసిక సుందరం. -
కొనసాగుతున్న షియా-సున్నీల హింసాకాండ.. 122 మంది మృతి
పెషావర్: పాకిస్తాన్లో షియా-సున్నీల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ, తాజాగా కుర్రం జిల్లాలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. దీంతో షియా-సున్నీల హింసాత్మక ఘటనల్లో మృతుల సంఖ్య 122కి చేరింది. ఈ వివరాలను పోలీసులు, ఆస్పత్రివర్గాలు మీడియాకు తెలియజేశారు.సున్నీ- షియా వర్గాల మధ్య హింస గత వారం రోజులుగా జరుగుతోంది. తాజాగా ఈ రెండు వర్గాల మధ్య మరోసారి కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించగా, ఆరుగురు గాయపడ్డారు. ఈ హింసాకాండ అనంతరం గవర్నర్ ఫైసల్ కరీం కుండీ.. ముఖ్యమంత్రి అలీ అమీన్ గండాపూర్‌ను ప్రాంతాన్ని సందర్శించాలని కోరారు. నవంబర్ 21న కుర్రం జిల్లాలోని పరాచినార్ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్‌పై ఆకస్మిక దాడి జరిగిన తర్వాత, అలీజాయ్- బగన్ గిరిజన సమూహాల మధ్య హింస చెలరేగింది.నాడు ప్యాసింజర్ వ్యాన్‌పై జరిగిన దాడిలో 47 మంది మృతిచెందారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన పలువురు ప్రయాణికులు చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 57కి చేరింది. శుక్రవారం వరకు కొనసాగిన కాల్పుల ఘటనల్లో 65 మంది మృతి చెందినట్లు పోలీసులు, ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అంతకుముందు ప్రభుత్వం సమక్షంలో షియా- సున్నీ వర్గాల మధ్య ఏడు రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. తరువాత దీనిని 10 రోజులకు పొడిగించించారు.ఇది కూడా చదవండి: చైనాలో జర్నలిస్ట్‌పై గూఢచర్యం ఆరోపణలు.. ఏడేళ్ల జైలు -
Bangladesh: చిన్మయ్ ప్రభు అరెస్టుపై నిరసనల వెల్లువ
ఢాకా: బంగ్లాదేశ్‌లో ఇటీవలి కాలంలో హిందువులపై దాడుల ఘటనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా ఇస్కాన్ పుండరీక్ ధామ్ అధ్యక్షుడు చిన్మయ్ కృష్ణన్ దాస్‌ను చిట్టగాంగ్‌లో బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్ట్‌కు వ్యతిరేకంగా హిందూ సంఘాలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపాయి.ఇంతలో బీఎన్పీ, జమాత్ కార్యకర్తలు హిందువులపై దాడికి దిగారు. ఈ దాడిలో దాదాపు 50 మంది గాయపడ్డారు. చిన్మయ్ కృష్ణన్ దాస్ అరెస్టును వ్యతిరేకిస్తూ హిందువులు మౌల్వీ బజార్లో ‘జై సియా రామ్’, ‘హర్ హర్ మహాదేవ్’ అని నినాదాలు చేస్తూ భారీ టార్చ్ ర్యాలీ నిర్వహించారు. ఈ నేపధ్యంలోనే వారిపై దాడులు చోటుచేసుకున్నాయి. ఇదేవిధంగా షాబాగ్‌లో చిట్టగాంగ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కుశాల్ బరన్పై కూడా దాడి జరిగింది. గాయపడిన ఆందోళనకారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన ఫోటోలు దాడుల తీవ్రతను తెలియజేస్తున్నాయి.పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ ఈ సంఘటనలను ఖండించారు. చిన్మయ్ ప్రభు అరెస్టు అన్యాయమని, దీనిని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని, వెంటనే చర్యలు తీసుకోవాలని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్‌కు విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్‌లోని హిందూ మైనారిటీల హక్కుల కోసం చిన్మయ్ ప్రభు నిరంతరం పోరాడుతున్నారని సుకాంత్ మజుందార్ ట్విట్టర్లో రాశారు. ఆయన అరెస్టు దరిమిలా బంగ్లాదేశ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. Fighting between colleges have started in US-backed Noble Laureate ruled Bangladesh. Students carrying weapons attacking each other. Many casualties. Chaos at campuses. Situation grim pic.twitter.com/EwQbmKMPBM— Megh Updates 🚨™ (@MeghUpdates) November 25, 2024బంగ్లాదేశ్ పోలీసులు ఢాకా విమానాశ్రయంలో చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారిని అరెస్టు చేశారు. పోలీసు డిటెక్టివ్ బ్రాంచ్ ప్రతినిధి రెజౌల్ కరీమ్ తెలిపిన వివరాల ప్రకారం చట్టపరమైన ప్రక్రియ ప్రకారమే అరెస్టు జరిగింది. తదుపరి చర్యల కోసం చిన్మయ్ దాస్‌ను సంబంధిత పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఈ ఘటనలు బంగ్లాదేశ్‌లోని హిందూ మైనారిటీల భద్రతపై పలు సందేహాలను లేవనెత్తుతున్నాయి.ఇది కూడా చదవండి: 11 గంటలు లేటుగా వందేభారత్.. ప్రయాణికుల ఆందోళన -
సంభాల్ హింస: ఎంపీ సహా 400 మందిపై కేసు
ఉత్తర ప్రదేశ్‌లోని సంభాల్‌లో ఆదివారం చెలరేగిన హింసాత్మక ఘటనలో పోలీసులు చర్యలు చేపట్టారు. దాదాపు 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. 400 మందిపై ఏడు కేసులు నమోదు చేశారు. కేసు నమోదైన వారిలో సంభాల్ ఎంపీ, సమాజ్‌వాదీ పార్టీ నేత జియావుర్ రెహమాన్, స్థానిక ఎమ్మెల్యే ఇక్బాల్ మెహమూద్ కుమారుడు సోహైల్ ఇక్బాల్ కూడా ఉన్నారు. వీరిద్దరూ హింసకు పాల్పడటంతోపాటు జనాలను గుంపులుగా సమీకరించి, అశాంతిని రెచ్చగొట్టడం వంటివి పాల్పడ్డారని అభియోగాలు మోపుతూ కేసు నమోదు చేశారు.కాగా సంభాల్ పట్టణంలో మొగల్ కాలానికి చెందిన షాహీ జామా మసీదు ఉన్న చోట గతంలో హరిహర మందిరం ఉండేదన్న ఫిర్యాదుతో న్యాయస్థానం సర్వేకి ఆదేశించింది. దీంతో ఆదివారం సర్వే నిర్వహిస్తుండగా హింస చేలరేగింది. గుంపుగా వచ్చిన కొందరు స్థానికులు సర్వేకు వ్యతిరేంగా మసీదు ముందు నినాదాలతో ఆందోళనకు దిగారు. చదవండి: ఘొర పరాజయం.. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నానా పటోలే రాజీనామాపోలీసులపై రాళ్లు రువ్వి, వాహనాలకు నిప్పు పెట్టారు. స్పందించిన పోలీసులు లాఠీలు, టియర్ గ్యాస్ షెల్స్ ఉపయోగించారు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ అల్లర్లలో నలుగురు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. రాళ్ల దాడిలో సీఐ సహా 15 నుంచి 20 మంది పోలీసులకు సైతం గాయాలయ్యాయి.ఈ ఘటనపై అధికార బీజేపీ, కాంగ్రెస్ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నాయి. బీజేపీ కుట్ర పన్నిందని కాంగ్రెస్, హింసను కాంగ్రెస్ ప్రేరేపిస్తోందని బీజేపీ ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. ఇక సోమవారం సంభల్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. స్కూళ్లను బంద్ చేశారు. ప్రజలు గుంపులుగా గుమిగూడటంపై నిషేధం విధించారు.#WATCH | Delhi: On Sambhal stone pelting incident, Samajwadi Party MP Akhilesh Yadav says "Our MP Zia ur Rahman was not even in Sambhal and despite that an FIR was lodged against him...This is a riot done by the government...Right after the order was passed by the Court, police… pic.twitter.com/qwPGtpho1m— ANI (@ANI) November 25, 2024 -
ఆకాశంలో సగమంతా గాయమే
ప్రకృతి అంటేనే వైవిధ్యం.. అందులో భాగమే స్త్రీ.. పురుషులు! దానర్థం ఒకరు తక్కువ.. ఒకరు ఎక్కువ అని కాదు! ఒకరి మీద ఒకరి ఆధిపత్యం ఉండాలనీ కాదు!ఇద్దరూ సమానమే అని, ప్రగతికి ఇద్దరి శక్తియుక్తులూ అవసరమే అని! దీన్ని చాటడానికి, వైవిధ్యం అంటే వివక్ష అని అపార్థం చేసుకున్న ప్రపంచాన్ని చైతన్యపరచడానికి యూఎన్ఓ ప్రతి ఏడు నవంబర్ 25ను మహిళలు, బాలికలపై హింస నిర్మూలన (ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వయొలెన్స్ అగైన్స్ట్ విమెన్ అండ్ గర్ల్స్) దినంగా పరిగణిస్తోంది.స్త్రీ స్వేచ్ఛ, స్త్రీ శక్తి, స్త్రీ సాధికారత, స్త్రీ–పురుష సమానత్వం.. ఎట్సెట్రా చెప్పుకోవడానికి, వినడానికి, రాసుకోవడానికి, చర్చించడానికి బాగుంటాయి! డిక్షనరీలో అర్థాలు తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి!నిజ జీవితంలో మాత్రం.. ఇంటి నుంచి ఆన్లైన్ దాకా మహిళలపై జరుగుతున్న శారీరక, భావోద్వేగ, మాటల దాడులెన్నో కనిపిస్తాయి. అసలు మహిళల విషయంలో ప్రపంచంలోని ఏ దేశమూ పర్ఫెక్ట్గా లేదని తేలింది ‘విమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇండెక్స్ (డబ్ల్యూపీఎస్)’ సర్వేలో! మహిళల భద్రత, రక్షణ, న్యాయం వంటి విషయాల్లో డబ్ల్యూపీఎస్ 177 దేశాల్లో ఓ సర్వే చేపట్టింది. అందులో ఏ దేశమూ వందకు వంద మార్కులు తెచ్చుకోలేదు. ఉన్నదాంట్లో చూస్తే మహిళల భద్రత, రక్షణ, న్యాయం వంటి విషయాల్లో మెరుగైన దేశంగా డెన్మార్క్‌కు మొదటి స్థానం వచ్చింది. తర్వాత స్థానాల్లో స్విట్జర్లండ్, స్వీడన్, ఫిన్లండ్, లక్సంబర్గ్, ఐస్లండ్, నార్వే, ఆస్ట్రియా, నెదర్లండ్స్, న్యూజీలండ్ దేశాలు ఉన్నాయి. ఆ జాబితాలో మన దేశం 128వ స్థానంలో నిలిచింది! గత ఏడేళ్లతో పోల్చుకుంటే మనం 20 స్థానాలు ఎగబాకి కాస్త మెరుగుపడ్డాం. అట్టడుగున అఫ్గానిస్థాన్ కనిపించింది. ఇక మన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా నివేదిక కూడా మహిళలపై హింస (డొమెస్టిక్ వయొలెన్స్ వగైరా) ఆందోళనకర స్థాయిలో పెరుగుతోందని చెబుతోంది. అందుకు ఉదాహరణలను చూడండి.. ‘నాకిష్టం లేదు అని చెబితే ఆ మాటను రెస్పెక్ట్ చేయాలి కదా! ఆయన కోరికకు మానసికంగా నేను రెడీగా ఉన్నానా.. లేదా అని పట్టదా? నేనేం యంత్రాన్ని కాను కదా..! భర్తయినంత మాత్రాన భరించాల్సిందేనా.. అర్థం చేసుకోవాల్సిన అవసరం అతనికి లేదా!’‘ఆ విషయంలో నన్ను మా ఆయన ఇబ్బంది పెట్టని రోజు లేదు. ఇంట్లో కొడుకు, కోడలు, వాళ్ల పిల్లలు తిరుగుతుంటారు. ఎంత సిగ్గుగా ఉంటుంది! అవేవీ ఆయనకు పట్టవు. అరవైకి దగ్గర పడుతున్న నాలో ముందసలు అంత శక్తి, ఉత్సాహం ఉండాలి కదా.. గ్రహించడు ఎందుకు! ఆయన చెప్పినట్టు వినట్లేదని ఎంత వేధిస్తున్నాడో! ఈ బాధ ఎవరికి చెప్పుకోవాలి..?!‘మా ఇంట్లో నాకన్నిటికీ రిస్ట్రిక్షన్సే! నాకు జీన్స్, క్రాప్ టాప్స్ అంటే ఇష్టం. వేసుకుంటే బాయ్స్ కామెంట్ చేస్తారని మా అన్నయ్య వేసుకోనివ్వడు. కాలేజ్‌లో, రోడ్డున పోయేవాడు ఎవడు కామెంట్ చేసినా వాళ్లను వదిలేసి నన్ను తిడతాడు, ఇంట్లో వాళ్లతో తిట్టిస్తాడు. నాకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ఇష్టం. కానీ మా అన్నయ్య వల్ల మామూలు బీఎస్సీలో చేరాల్సి వచ్చింది!’‘మా అమ్మాయి మంచి అథ్లెట్. కోచింగ్‌కి పంపించాలని ఇంట్లో యుద్ధమే చేశా. కానీ ఆ టైమ్‌లోనే స్పోర్ట్స్ ఫీల్డ్‌లో మహామహులు వినేశ్ ఫోగట్, సాక్షి లాంటి వాళ్లకు జరిగినవి చూసి.. అమ్మో అమ్మాయి అథ్లెట్ కాకపోయినా పర్లేదు, వేధింపులతో రోడ్డెక్కకుండా ఉంటే చాలు అనుకుని గమ్మునుండిపోయాను!’‘నా సీనియర్ మేల్ కొలీగ్ హెరాస్మెంట్ భరించలేక మేనేజర్‌కి రిపోర్ట్ చేశాను. అతను నాదే తప్పన్నట్టు బిహేవ్ చేశాడు. దాంతో నా సీనియర్ కొలీగ్ మరింత రెచ్చిపోయాడు. ఇంట్లో తలనొప్పులు చాలవన్నట్టు ఆఫీస్‌లో కూడా ఏం పెట్టుకుంటాను? అందుకే మంచి శాలరీ డ్రా చేస్తున్నా, ఆ హెరాస్మెంట్ తట్టుకోలేక జాబ్‌కి రిజైన్ చేశాను!’ఇవికాక బాల్యవివాహాలు, బాడీషేమింగ్స్, ట్రోలింగ్స్, డీప్‌ఫేక్స్, జడ్జిమెంట్స్, వరకట్న వేధింపుల నుంచి నిర్భయ, దిశ, హత్రాస్.. కోల్కత్తా డాక్టర్ హత్యాచార సంఘటనల దాకా.. ఒకటి మరువకముందే మరొకటి కళ్ల ముందే జరుగుతున్న దారుణాలు ఎన్నని! ఇలాంటివన్నిటినీ మౌనంగా భరించాల్సిన అవసరం లేదని, ఆఫ్‌లైన్‌లో ఎక్కడైనా.. ఆన్లైన్లో ఎప్పుడైనా.. మహిళలు, బాలికల మీద ఏ రూపంలో హింస కనిపించినా గళమెత్తాలని చాటుతోంది యుఎన్ఓ! అందుకే ఏటా నవంబర్ 25ను మహిళలు, బాలికలపై హింస నిర్మూలన (ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వయొలెన్స్ అగైన్స్ట్ విమె¯Œ అండ్ గర్ల్స్) దినంగా జరుపుతోంది. పురుషాధిపత్య భావజాలంతో కండిషన్ అయిన పరిస్థితులను మార్చాలని చెబుతోంది. దీని మీద అవగాహన కోసం ప్రపంచ వ్యాప్తంగా పదహారు రోజుల క్యాంపెయిన్ని నిర్వహిస్తోంది. ఇది ఏటా నవంబర్ 25న మొదలై, మానవ హక్కుల దినోత్సవమైన డిసెంబర్ పది వరకు సాగుతుంది. ఈ కథనం ఆదిలోనే చెప్పుకున్నట్లు స్త్రీలపై హింస విషయంలో ఏ దేశమూ భిన్నంగా లేదు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న దేశాల నుంచి అగ్రరాజ్యాల దాకా అన్నీ ఒకే తాటి మీదున్నాయి. గృహహింస లేని ఇల్లు.. వేధింపుల్లేని చోటు ప్రపంచంలో ఎక్కడా లేవంటే ఆశ్చర్యం కాదు. అలాంటి హింసలేని ఇల్లు, చోటు కోసమే ప్రపంచమంతా ఐక్యమై పోరాడాలని, స్త్రీలు, బాలికలు ఎదుర్కొంటున్న పరిస్థితుల మీద, వాళ్ల భద్రత, రక్షణ కోసం ఉన్న చట్టాల మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే యూఎన్ఓ ఈ పదహారు రోజుల క్యాంపెయిన్ని నిర్వహిస్తోంది. ఆ పిలుపు అందుకుని మనదేశంలోనూ స్త్రీవాదులు, ప్రజాస్వామికవాదులు, రచయితలు, కళాకారులు, పలు స్వచ్ఛంద సంస్థలు ఏటా ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సాంకేతిక అభివృద్ధి నేపథ్యంలో కొత్త రూపాల్లో కనిపిస్తున్న హింసను గుర్తిస్తున్నారు. దాన్నుంచి రక్షణ కోసం ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు, చేయాల్సిన చట్టాల గురించి చర్చిస్తున్నారు, సూచనలిస్తున్నారు. స్త్రీలను సాటి పౌరులుగా గౌరవించే సమాజం కోసం కృషి చేస్తున్నారు. మన దగ్గరున్న మహిళా చట్టాలు...గృహహింస చట్టం.. 2005, పనిప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం.. 2013, పోక్సో (ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్) యాక్ట్.. 2012, బాల్యవివాహాల నిషేధ చట్టం.. 2006, మహిళల అసభ్య చిత్రీకరణ నిషేధ చట్టం.. 1986, వరకట్న నిషేధ చట్టం..1961, మహిళల అక్రమ రవాణా నిరోధక చట్టం.. 1956, రేప్ కేసులకు 376 ఐపీసీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని సెక్షన్ 67, పెళ్లి పేరుతో మహిళను మోసగిస్తే 69 బీఎన్నెస్, పెళ్లయిన ఏడేళ్లలోపు మహిళ అనుమానాస్పద స్థితిలో మరణిస్తే.. 304బి ఐపీసీ (80, బీఎన్నెస్), పలురకాల లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా 354 ఐపీసీ (74 – 78 బీఎన్నెస్), మహిళ మర్యాదకు భంగం వాటిల్లితే 509 ఐపీసీ (79 బీఎన్నెస్) మొదలైనవి ఉన్నాయి. వీటితో పాటు మహిళల భద్రత, రక్షణ కోసం తెలుగు రాష్ట్రాల్లో దిశ, షీ టీమ్స్, కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని సైబర్‌క్రైమ్ పోర్టల్, వన్ స్టాప్ సెంటర్స్ వంటివీ అందుబాటులో ఉన్నాయి.గృహహింస అంటే..గృహహింస అంటే కేవలం పెళ్లైన స్త్రీలపై జరిగేదే అనే అపోహ ఉంది. కానీ, ఈ చట్టం ప్రకారం.. తండ్రి మొదలు అన్న, తమ్ముడు, సహచరుడు, భర్త వరకు ఎవరైనా మహిళల పట్ల వేధింపులకు పాల్పడితే వారిపై గృహహింస కింద కేసు పెట్టవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే స్త్రీ ఆరోగ్యానికి, వ్యక్తిగత భద్రతకు, స్వేచ్ఛకు మానసికంగా, శారీరకంగా, లైంగికంగా, ఆర్థికంగా ఎటువంటి భంగం కలిగించినా సదరు పురుషుడికి చట్టపరమైన శిక్ష ఉంటుంది. జైలు శిక్ష ఉండదు కానీ, ఆర్థిక పరిహారం, ప్రత్యేక వసతి, ఆ పురుషుడి నుంచి రక్షణ ఆదేశాలు లభిస్తాయి. మన దేశంలో భర్త పెట్టే లైంగిక హింసకు క్రిమినల్ చట్టంలో శిక్షలు లేనప్పటికీ, గృహహింస చట్టం కింద మాత్రం బాధితులకు ఉపశమనం దొరుకుతోంది. దీనికి, 498ఏ (85 బీఎన్నెస్)కి సంబంధం లేదు. గృహహింస కింద కేసు వేయాలి అంటే, స్త్రీ – శిశు సంక్షేమ అధికారుల దగ్గర కానీ, మేజిస్ట్రేట్ దగ్గర కానీ దరఖాస్తు చేసుకోవాలి. 498ఏ ఫిర్యాదును పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి.మన దేశంలో స్త్రీలపై హింసకు గల కారణాలు.. మూలం పురుషాధిపత్య భావజాలమే! టీవీ, సినిమా, సోషల్ మీడియా వంటి మాధ్యమాల్లో మహిళను సెక్సువల్ ఆబ్జెక్ట్‌గా చూపించడం, నిరక్షరాస్యత, మహిళలకు ఆర్థిక స్వావలంబన లేకపోవడం, తమ రక్షణ, భద్రతకు సంబంధించిన చట్టాల మీద సరైన అవగాహన లేకపోవడం, బహిరంగ ప్రదేశాల్లో సురక్షిత వాతావరణం (సీసీటీవీ కెమెరాలు, వీథి లైట్లు, పబ్లిక్ టాయిలెట్లు వగైరా) లేకపోవడం, సురక్షితమైన రవాణా సౌకర్యాలు తగినన్ని లేకపోవడం లాంటివన్నీ కారణాలే అని చెబుతున్నారు నిపుణులు.నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS)లో దేశంలోని 30 శాతం మహిళలు (15– 49 ఏళ్ల మధ్య) శారీరక, లైంగిక లేదా గృహహింసకు గురవుతున్నారని తేలింది.ఈ ‘డే’ వెనుక చరిత్రకరీబియన్ దేశమైన డొమినికన్ రిపబ్లిక్కి 1930ల నుంచి 1960ల దాకా రఫైల్ త్రూహీయో(Rafael Trujillo) అధ్యక్షుడిగా ఉన్నాడు. అతనొక నియంత. హింసకు ప్రతిరూపం. క్రూరత్వానికి పరాకాష్ట. అతని పాలనలో డొమినికన్ రిపబ్లిక్ అట్టుడికింది. తన దారికి అడ్డొచ్చిన వాళ్లందరినీ జైళ్లల్లో పెట్టి.. ఊచకోత కోశాడు. మానవ హక్కులను కాలరాశాడు. జాత్యహంకార ధోరణితో డొమినికన్ రిపబ్లిక్లో ఉంటున్న వేలాది హైతీయుల మీద సామూహిక హత్యకాండకు పాల్పడ్డాడు. అందమైన అమ్మాయిలను వెదికి తెచ్చిపెట్టేందుకు వందల సంఖ్యలో ఉద్యోగులను నియమించాడు. ఆడవాళ్లను విలాస వస్తువులుగా చూశాడు. ఈ నియంత హింసాత్మక చర్యలను వ్యతిరేకిస్తూ మీరాబాల్ సిస్టర్స్‌గా పేరొందిన పాట్రియా, మినర్వా, మారియా థెరీసా అనే ముగ్గురు అక్కచెల్లెళ్లు అజ్ఞాత ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ విషయం తెలిసి రఫైల్ ఆ ముగ్గురినీ బెదిరించాడు. వాళ్లు బెదరలేదు. దాంతో తరచుగా వాళ్లను అరెస్ట్ చేయిస్తూ.. వేధించేవాడు. అయినా వాళ్లు వెనక్కి తగ్గక ఆ నియంత క్రూరత్వాన్ని వివరిస్తూ, అతని చేతుల్లో మరణించిన వారి పేరు మీద కరపత్రాలను పంచసాగారు. దాంతో ఒకరోజు రఫైల్ తన మనుషుల చేత ఆ ముగ్గురినీ చంపించి, వాళ్ల జీప్‌లోనే పెట్టి, జీప్‌కి యాక్సిడెంట్ చేయించి.. దాన్నొక రోడ్డు ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ ప్రజలు నమ్మలేదు. అది రఫైల్ చేయించిన హత్యే అని గ్రహించి, ఆ నియంత మీద తిరగబడి అతణ్ణి చంపేశారు. అలా దాదాపు మూడు దశాబ్దాల నియంతృత్వ పాలన అంతమైంది. ప్రజాస్వామ్యానికి, స్త్రీవాదానికి చిహ్నంగా నిలిచిన ఆ ముగ్గురు అక్కచెల్లెళ్లను డొమినికన్ రిపబ్లిక్ ప్రజలు "Las Mariposas.. ద బటర్‌ఫ్లైస్’గా స్మరించుకుంటారు. అందుకే ‘ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వయొలెన్స్ అగైన్స్ట్ విమెన్ అండ్ గర్ల్స్’కి లోగోగా బటర్ఫ్లైనే నిర్ణయించింది యూఎన్ఓ! ‘మీరాబాల్ సిస్టర్స్’ హత్య తర్వాత వాళ్ల మరో సోదరి డిడే.. తన సోదరీమణుల ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించింది. మహిళల మీద జరుగుతున్న హింసను వ్యతిరేకిస్తూ, మహిళా హక్కుల మీద అవగాహన కల్పించేందుకు కృషి చేసింది. ఆ మీరాబాల్ సిస్టర్స్ గౌరవార్థమే యూఎన్ఓ 1999లో నవంబర్ 25ను ‘ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వయొలెన్స్ అగైన్స్ట్ విమెన్ అండ్ గర్ల్స్’ గా గుర్తించి, ఏటా నిర్వహించాలని ప్రకటించింది. మహిళల మీద జరుగుతున్న హింస, అణచివేతలను వ్యతిరేకించాలని, నిర్భయంగా ఎదిరించాలని, హింసలేని, శాంతియుత, సంతోషకరమైన జీవితం ప్రతి మహిళ హక్కని ఎలుగెత్తిన ఈ సోదరీమణులను టైమ్స్.. 2020లో ‘హండ్రెడ్ విమెన్ ఆఫ్ ద ఇయర్’ సంచికలో చేర్చింది. పాఠ్యాంశం చేయాలికాలం మారినట్టే హింస కూడా మారుతోంది. స్త్రీల మీద కనిపించే హింస కన్నా కనపడని హింస ఎక్కువైంది. దానికి సామాజిక మాధ్యమాలు వేదికయ్యాయి. ఈ సైబర్‌క్రైమ్ ట్రోలింగ్ వద్దే ఆగడంలేదు. మార్ఫ్ చేసిన ఫొటోలు, వీడియోలు పోర్న్ సైట్లల్లో పెట్టడం వరకు వెళుతోంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టాలలో కూడా తగిన మార్పులు చేయడం అత్యంతవసరం. మరోవైపు స్త్రీల భద్రత కోసం ప్రస్తుతమున్న చట్టాల మీద చైతన్యమూ కల్పించాలి. సెక్సువల్ ఎడ్యుకేషన్‌ను ఎలా అయితే తప్పనిసరి చేశారో, అలాగే స్త్రీల మీద జరుగుతున్న హింస, దాన్ని ఎదుర్కోవడానికి ఉన్న చట్టాలు వంటివాటి పైనా స్కూల్ స్థాయి నుంచే అవగాహన కల్పించాలి. జెండర్ సెన్సిటివిటీని ఒక పాఠ్యాంశం చేయాలి. లేకపోతే ఎప్పటిలాగే స్త్రీల మీద హింస నార్మలైజ్ అవుతుంది.దేశ వ్యాప్తంగా నాలుగు లక్షల 70 వేలకు పైగా గృహహింస కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న ప్రొటెక్షన్ ఆఫీసర్ల సంఖ్య కేవలం 3,637 మాత్రమే. ఇందులో 2,655 మంది అడిషనల్ చార్జ్లోని వాళ్లే! చాలా రాష్ట్రాల్లో ఐఏఎస్ అధికారులే అడిషనల్ చార్జ్‌లో ఉన్నారు.పురుషాధిపత్య భావజాలంతో కండిషన్ అయిన పరిస్థితులను మార్చాలని చెబుతోంది. దీని మీద అవగాహన కోసం ప్రపంచ వ్యాప్తంగా పదహారు రోజుల క్యాంపెయిన్ని నిర్వహిస్తోంది. ఇది ఏటా నవంబర్ 25న మొదలై, మానవ హక్కుల దినోత్సవమైన డిసెంబర్ పది వరకు సాగుతుంది. ఈ కథనం ఆదిలోనే చెప్పుకున్నట్లు స్త్రీలపై హింస విషయంలో ఏ దేశమూ భిన్నంగా లేదు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న దేశాల నుంచి అగ్రరాజ్యాల దాకా అన్నీ ఒకే తాటి మీదున్నాయి. గృహహింస లేని ఇల్లు.. వేధింపుల్లేని చోటు ప్రపంచంలో ఎక్కడా లేవంటే ఆశ్చర్యం కాదు. అలాంటి హింసలేని ఇల్లు, చోటు కోసమే ప్రపంచమంతా ఐక్యమై పోరాడాలని, స్త్రీలు, బాలికలు ఎదుర్కొంటున్న పరిస్థితుల మీద, వాళ్ల భద్రత, రక్షణ కోసం ఉన్న చట్టాల మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే యూఎన్ఓ ఈ పదహారు రోజుల క్యాంపెయిన్ని నిర్వహిస్తోంది. ఆ పిలుపు అందుకుని మనదేశంలోనూ స్త్రీవాదులు, ప్రజాస్వామికవాదులు, రచయితలు, కళాకారులు, పలు స్వచ్ఛంద సంస్థలు ఏటా ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సాంకేతిక అభివృద్ధి నేపథ్యంలో కొత్త రూపాల్లో కనిపిస్తున్న హింసను గుర్తిస్తున్నారు. దాన్నుంచి రక్షణ కోసం ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు, చేయాల్సిన చట్టాల గురించి చర్చిస్తున్నారు, సూచనలిస్తున్నారు. స్త్రీలను సాటి పౌరులుగా గౌరవించే సమాజం కోసం కృషి చేస్తున్నారు. -
ఘర్షణలకు ముగింపెప్పుడు?
నవంబరు 11 నుంచి కనిపించకుండా పోయిన మహిళలు, పిల్లలవిగా భావిస్తున్న ఆరు మృతదేహాలు మణిపుర్ సరిహద్దులోని నది నుండి స్వాధీనం చేసుకున్నట్లు వచ్చిన నివేదికల తర్వాత రాజధాని ఇంఫాల్ లోయలో భయంకర వాతావరణం నెలకొంది. నిరసనకారులు వీధుల్లోకి వచ్చి, వాహనాలను తగుల బెట్టి, పలువురు ఎమ్మెల్యేల నివాసాలపైనా, సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయం పైనా దాడి చేశారు. దీంతో గిరిజనేతర మెయితీల ఆధిపత్యంలో ఉన్న లోయలోని ఏడు జిల్లాల్లో ప్రభుత్వం ఇంటర్నెట్, మొబైల్ డేటా సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. గిరిజన కుకీ– జోలు ఎక్కువగా ఉండే చుట్టుపక్కల కొండలు, ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, బిష్ణుపూర్ జిల్లాలలో కూడా కర్ఫ్యూ విధించారు. ప్రపంచమంతా తిరిగొచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ... ఈ క్లిష్ట పరిస్థితు ల్లోనూ మణిపుర్ రాష్ట్రాన్ని సందర్శించి అక్కడ శాంతిని పునరుద్ధరించే పని చేపట్టక పోవడం దిగ్భ్రాంతిని కలిగించే అంశం. ఇరవై నెలలుగా ఈశాన్య రాష్ట్రమైన మణిపుర్లో హింస రాజుకుంటోంది. 2023 మే 3న రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు దగ్గరగా ఉన్న చురాచాంద్‌పూర్ పట్టణంలో మెయితీ కమ్యూనిటీ– కుకీ తెగ మధ్య హింస చెలరేగింది. తమకు షెడ్యూల్డ్ తెగ హోదా ఇవ్వాలని గిరిజనేతర మెయితీ ప్రజలు డిమాండ్ చేయడం ఘర్షణలకు తక్షణ అని అంటున్నారు. కుకీలను మెయితీలు బయటి వ్యక్తులుగా, మాదకద్రవ్యాల వ్యాపారులుగా చూస్తారు. తమకు ఎస్టీ హోదా లేనందువల్ల తాము కుకీ ప్రాంతాల్లో భూములు కొనలేక పోతున్నట్లు వారు భావిస్తారు. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పరిపాలనా స్థానాలను కలిగి ఉన్న మెయితీలే తమ అవకాశాలన్నింటినీ కొట్టేస్తున్నట్లు కుకీలు భావి స్తారు. కొన్నేళ్లుగా రెండు వర్గాల మధ్య అనేక గొడవలు జరుగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన ప్రస్తుత అల్లర్లు ప్రజల ఆరోగ్యం, జీవనోపాధి, విద్యలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.మణిపుర్ జనాభాలో 53 శాతం ఉన్న మెయితీ కమ్యూనిటీని ఎస్టీ జాబితాలో చేర్చాలనే డిమాండ్ ఒక్కటే ప్రస్తుత హింసకు కారణం అని చెప్పలేం. అంతర్లీనంగా ఒకరి పట్ల ఒకరికి ఉన్న కోపం, చాలా కాలంగా వారి మధ్య కొనసాగుతున్న వైరుధ్యం లాంటివి అన్నీ కలిసి నేటి దుఃస్థితికి దారితీశాయి. రాష్ట్రంలోని కొండ ప్రాంతాలలోని రక్షిత అడవులపై ప్రభుత్వ నిర్బంధం, తాము హింసకు గురవుతున్నామన్న భావన కుకీలలో అసంతృప్తిని కలిగిస్తోంది. మయన్మార్ నుంచి అక్రమంగా భారత్‌లో ప్రవేశించిన కుకీలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. సరిహద్దు ఆవల, మణిపూర్‌లో తాము నివసించే ప్రాంతాలను కలిపి ప్రత్యేక కుకీ ల్యాండ్ కావాలనే వేర్పాటువాదులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం కూడా మరో కారణం. అలాగే కుకీలు మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్నారని పేర్కొంటూ కుకీ ప్రజలందరినీ ‘డ్రగ్ లార్డ్స్’ అని ప్రస్తావించడాన్ని వారు నిరసిస్తున్నారు. గిరిజన గ్రామాలలో జనాభా పెరగడంతో, వారు తమ పూర్వీకుల హక్కుగా భావించే చుట్టుపక్కల అటవీ ప్రాంతాలకు వ్యాపిస్తున్నారు. దీన్ని ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఇదీ కుకీల్లో ఆగ్రహానికి హేతువే.కొత్త గ్రామాలను ఎలా గుర్తించాలనే అంశంపై ప్రభుత్వానికి అసలు ఒక విధానం లేదు. అలాగే మణి పుర్లో పారదర్శకమైన అటవీ విధానం లేదు. దీంతో పాలక బీజేపీ కూటమిలోనూ దుమారం రేగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మరింత విషమించకుండా కేంద్రం మరింత వివేకంతో వ్యవహరించాలి.– డా‘‘ ముచ్చుకోట సురేష్ బాబుప్రజా సైన్స్ వేదిక అధ్యక్షుడు ‘ 99899 88912 -
రగులుతున్న అగ్నిపర్వతం!
ఏణ్ణర్ధం దాటినా... మణిపుర్ మండుతూనే ఉంది. జాతుల మధ్య ఘర్షణ తగ్గకపోగా, అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా పదిరోజుల క్రితం ఓ కుకీ మహిళ అత్యాచారం – హత్య, దానికి ప్రతిగా మెయితీలపై కుకీ తీవ్రవాదుల దాడులు, చివరకు ఓ సహాయ శిబిరం నుంచి నవంబర్‌లో అపహరణకు గురైన ఓ పసిబిడ్డతో సహా ఆరుగురు అమాయక మెయితీలు ప్రాణాలు కోల్పోవడం... ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. సీఎం సహా రాష్ట్రంలో ప్రజా ప్రతినిధుల ఇళ్ళపై దాడులతో చివరకు రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లో కర్ఫ్యూ, ఇంటర్నెట్ స్తంభన, వివాదాస్పదమైన సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం విధింపు, కేంద్రం నుంచి అదనపు బలగాలను పంపడం దాకా వెళ్ళింది. ప్రభుత్వ మనుగుడకు ముప్పేమీ లేకున్నా, బీజేపీ సర్కారుకు తమ మద్దతును ఉపసంహరించుకున్నట్టు నేషనల్ పీపుల్స్ పార్టీ ప్రకటించడం మిత్రుల్లోనూ బీజేపీ పట్ల పెరుగుతున్న అసంతృప్తికి నిదర్శనం. గత 2023 మేలో హింసాకాండ మొదలైనప్పటి నుంచి జాతుల ఘర్షణల్లో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 60 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఎంతసేపటికీ బాహ్య శక్తులు కారణమంటూ ఆరోపించడం, శుష్కవాగ్దానాలు చేయడమే తప్ప, రాష్ట్రం రావణకాష్ఠమైనా పరిస్థితిని అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర పాలకులు పూర్తిగా విఫలమయ్యారు. మణిపుర్ సామాజిక – ఆర్థిక జీవితంలో జాతుల ఉనికి అత్యంత కీలకమైనది. దాన్నిబట్టే ఆ ఈశాన్య రాష్ట్రంలో భూములపై హక్కులు, తదనుగుణంగా రాజకీయ సైద్ధాంతిక విభేదాలు రూపు దిద్దుకుంటూ వచ్చాయి. దాదాపు డజనుకు పైగా గిరిజన తెగలను కలిపి, బ్రిటీషు పాలనా కాలంలో కుకీలు అని పేరుపెట్టారు. విభిన్న జాతుల్లో ప్రధానమైనవైన మెయితీ వర్గానికీ, కుకీలకూ మధ్య పాలకులు తమ స్వార్థప్రయోజనాల కోసం అగ్నికి ఆజ్యం పోశారు. అదే అసలు సమస్య. జనరల్ వర్గానికి చెందిన మెయితీలు తమకు కూడా షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) హోదా కల్పించాలని కోరు తున్నారు. అయితే, దానివల్ల తమ ప్రయోజనాలు దెబ్బ తింటాయని కుకీల ఆందోళన. మరోపక్క మిజోరమ్తోనూ, పొరుగున మయన్మార్‌లోని చిన్ రాష్ట్రంతోనూ జాతి సంబంధాలున్న కుకీల వాంఛ వేరు. మణిపుర్ నుంచి తమ ప్రాంతాన్ని విభజించి, ప్రత్యేక పాలనా వ్యవస్థ ఏర్పాటు చేయాలని వారు బలంగా వాదిస్తున్నారు. ఇది చాలదన్నట్టు మెయితీ వర్గానికి చెందిన మణిపుర్ ప్రస్తుత ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ, కుకీలను అణచివేస్తున్నారనే అభిప్రాయం రోజురోజుకూ బలపడుతూ వచ్చింది. ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణమయ్యాయి. కారణాలు ఏమైనా, రాష్ట్రంలోని బీజేపీ పాలిత ప్రభుత్వ సారథి అన్ని వర్గాలనూ ఒక తాటి మీదకు తీసుకురావడంలో విఫలమవడంతో బాధ్యత అంతా కేంద్రం భుజాల మీద పడింది. కేంద్ర హోమ్‌శాఖ మొన్న అక్టోబర్‌లో మెయితీ, కుకీల వర్గాల రాజకీయ ప్రతినిధులతో సమావేశం జరిపింది కానీ, శాంతిసాధన దిశగా అడుగులు పడలేదు. ప్రత్యేక శాసనవ్యవస్థతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం తమకు కావాల్సిందేనని కుకీలు భీష్మించుకు కూర్చున్నారు. మణిపుర్ విభజనతో మాత్రమే సాధ్యం. అయితే, కేంద్ర జోక్యంతో సమస్యను పరిష్కరించవచ్చని ఇప్పటికీ కుకీలు భావిస్తున్నారు. ఇంత సంక్షోభంలోనూ అది ఓ సానుకూల అంశం. ఢిల్లీ పెద్దలు దాన్ని వినియోగించుకోవాలి. కానీ, అలా జరుగుతున్నట్టు లేదు. విధానపరంగా, రాజకీయంగా సీఎం విఫలమయ్యారని తెలుస్తున్నా, గద్దె మీది బీరేన్‌సింగ్‌ను మార్చడానికి బీజేపీ, కేంద్రంలోని ఆ పార్టీ పెద్దలు ఎందుకు ముందుకు రావడం లేదో తెలియదు. బీరేన్‌పై అంత ప్రేమ ఎందుకన్నది బేతాళప్రశ్న. డబుల్ ఇంజన్ సర్కార్‌తో ప్రగతి అంటే ఇదేనా? మణిపుర్‌ను దేశంలో అంతర్భాగమని వారు అనుకోవట్లేదా? ఈశాన్యంలో పార్టీ విస్తరణపై ఉన్న శ్రద్ధలో కాసింతైనా శాంతిస్థాపనపై కాషాయ పెద్దలకు ఎందుకు లేదు? అంతకంతకూ క్షీణిస్తున్న పరిస్థితులు ప్రభుత్వంతో పాటు రాజకీయ పక్షాలు సైతం బాధ్యతను వదిలేశాయనడానికి సూచన. ఈ సంక్షుభిత ఈశాన్య రాష్ట్రానికి ఇప్పుడు కాస్తంత సాంత్వన కావాలి. బాధిత వర్గాలన్నిటినీ ఓదార్చి, ఉపశమనం కలిగించే పెద్ద మనసు కావాలి. పౌరసమాజాన్ని కూడా భాగస్వామ్యపక్షం చేసి, సమస్యకు రాజకీయ పరిష్కారం చూడడమే మార్గం. అందుకు కేంద్ర సర్కారు ఇప్పటికైనా చిత్తశుద్ధితో చొరవ తీసుకోవాలి. పాలకులు మణిపుర్‌ను వట్టి శాంతిభద్రతల కోణం నుంచే చూస్తే కష్టం. దాని వల్ల సామాన్య ప్రజానీకానికీ, ఈశాన్య ప్రాంతంలోని సాయుధ బలగాలకూ కష్టాలు పెరుగుతాయి. రాష్ట్రంలో చేజారిన పరిస్థితుల్ని ఇప్పటికైనా చక్కదిద్దేందుకు కేంద్రం ప్రయత్నించకపోతే, అది దేశ సమగ్రతకే ప్రమాదం. పొరుగున మయన్మార్, బంగ్లాదేశ్‌లలో సంక్షుభిత వాతావరణం నెలకొని ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అప్రమత్తత అత్యవసరం. అనేక సాయుధ తీవ్రవాద గ్రూపులతో, ఇట్టే చొరబాట్లకు చాలా అవకాశం ఉన్న సరిహద్దుల్లో మణిపుర్ ఉందని విస్మరించరాదు. కేవలం సాయుధ బలగాల మోహరింపుతో అక్కడ శాంతి సాధ్యంకాదు. హింసలో తాత్కాలిక విరామాన్ని చూపి, అదే శాంతి అని నమ్మబలకడం మూర్ఖత్వం. అన్ని వర్గాల మధ్య సామరస్యం, సహజీవనం సాగేలా రాజకీయ ఏర్పాటు చేయగలిగితేనే హింసకు తెర పడుతుంది. కేంద్రం ఇప్పటికైనా చిత్తశుద్ధితో అందుకు సర్వశక్తులూ ఒడ్డాలి. లేదంటే, అగ్ని పర్వతం సమీపంలోనే ఉన్నా అలసత్వంతో వ్యవహరిస్తున్నట్టే! దాదాపు 33 లక్షల సోదర భారతీయ జనాభాను స్వార్థ ఆర్థిక, అధికార ప్రయోజనాల కోసం గాలికి వదిలేస్తున్నట్టే! గుజరాత్, ముజఫర్ నగర్, ఢిల్లీ లాంటి అనేక చోట కొద్ది రోజుల్లో హింసకు ముకుతాడు వేయగలిగినచోట ఇన్ని నెలలుగా ఒక రాష్ట్రాన్ని మంటల్లో వదిలేయడం ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశ పాలకులకు సిగ్గుచేటు! -
పశ్చిమ బెంగాల్: ఇరువర్గాల మధ్య చెలరేగిన హింస.. నిషేదాజ్ఞలు అమలు
ముర్షిదాబాద్: పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలోని బెల్దంగా ప్రాంతంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో పరిస్థితులను చక్కదిద్దేందుకు పోలీసు అధికారులు ఆ ప్రాంతంలో నిషేధాజ్ఞలు విధించారు. డిజిటల్ డిస్ప్లే బోర్డులో అభ్యంతరకర మెసేజ్ వచ్చిన నేపధ్యంలో ఈ ఘర్షణలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పోలీసులు ఇప్పటివరకూ 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు.బెల్దంగాలో జరిగిన ఘర్షణల్లో కొందరికి స్వల్ప గాయాలైనట్లు పోలీసు అధికారి తెలిపారు. ఘర్షణలు చోటుచేసుకున్న ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. కార్తీకమాస పూజల వేదిక సమీపంలోని గేటు వద్ద ఏర్పాటు చేసిన డిస్ప్లే బోర్డుపై ఉన్న సందేశం ఒక వర్గానికి ఆగ్రహం తెప్పించింది. ఈ నేపధ్యంలోనే ఇరు వర్గాల మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. ఇరువర్గాల వారు ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఒక పోలీసు వాహనంపై కూడా దాడి జరిగింది. ఈ నేపధ్యంలో పోలీసులు లాఠీచార్జి చేశారు. పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చినప్పటికీ ఉద్రిక్తత కొనసాగుతోంది.ఈ ఘర్షణల కారణంగా సీల్దా నుంచి ముర్షిదాబాద్ వెళ్తున్న భాగీరథి ఎక్స్‌ప్రెస్ కొన్ని గంటలపాటు నిలిచిపోయింది. ఈ ఘటనకు మమతా బెనర్జీ ప్రభుత్వమే కారణమని బీజేపీ ఆరోపించింది. కాగా తృణమూల్ కాంగ్రెస్ నేత ఒకరు మాట్లాడుతూ ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, ఈ అల్లర్లకు పాల్పడినవారిని గుర్తించి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు.ఇది కూడా చదవండి: స్విమ్మింగ్ పూల్‌లో గంతులేస్తూ.. -
మణిపూర్ లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు
-
రాజస్థాన్‌లో చెలరేగిన హింస.. 60 మంది అరెస్ట్
టోంక్: రాజస్థాన్‌లోని టోంక్ జిల్లాలోని డియోలీ ఉనియారాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నరేష్ మీనా ఎన్నికల విధుల్లో ఉన్న ఎస్‌డిఎం అమిత్ చౌదరిని చెప్పుతో కొట్టారు. అనంతరం హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. #WATCH | Rajasthan by-poll independent candidate from Deoli-Uniara, Naresh Meena allegedly physically assaulted SDM at a polling station in Samravata villageVehicles vandalised and torched in Samravata village after the incident. pic.twitter.com/dv8jLnymh2— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) November 13, 2024ఈ ఉదంతంపై ఫిర్యాదు అందిన దరిమిలా పోలీసులు నరేష్ మీనాను అరెస్ట్ చేసేందుకు వెళ్లగా, సంరవత గ్రామస్తులు పోలీసులపై దాడి చేసి, దౌర్జన్యానికి దిగారు. నరేష్ మీనా మద్దతుదారులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఉదంతంలో ఇప్పటి వరకు 60 మందిని అరెస్ట్ చేసినట్లు అజ్మీర్ రేంజ్ ఐజీ ఓం ప్రకాశ్ తెలిపారు. టోంక్ హింసాకాండపై జిల్లా అదనపు ఎస్పీ బ్రిజేంద్ర సింగ్ భాటి మాట్లాడుతూ పరిస్థితులను సమీక్షిస్తున్నామన్నారు. ప్రధాన నిందితుడు నరేష్ మీనా కోసం వెతుకుతున్నామని తెలిపారు. గ్రామంలో భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నారు. Rajasthan: 60 people have been arrested so far in the case of ruckus, stone pelting, and arson incident in Samravata village last night, when police tried to apprehend Naresh Meena, independent candidate for Deoli Uniara assembly constituency by-polls in Tonk district, after he…— ANI (@ANI) November 14, 2024ఇది కూడా చదవండి: కార్తీకమాసంలో ఉసిరిని పూజిస్తే... -
Breaking : మణిపూర్‌లో మళ్లీ హింస.. 11మంది ఎన్కౌంటర్
-
బంగ్లా: అవామీ లీగ్ ర్యాలీ.. ఢాకాలో ఉద్రిక్తత
ఢాకా: బంగ్లాదేశ్‌లో నూర్ హుస్సేన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని షేక్ హాసినా అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులు చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారినట్లు అక్కడి మీడియా పేర్కొంది. షహీద్ నూర్ హొస్సేన్ స్క్వేర్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించాలని అవామీ లీగ్ పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో పలువురు అవామీ లీగ్ మద్దతుదారులపై దాడి జరిగినట్లు వెల్లడించింది. బంగాబంధు అవెన్యూలోని షేక్ హసీనా పార్టీ కేంద్ర కార్యాలయం ముందు ఈ ఘటన జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఇక.. మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం ఆగస్టు 5న తిరుగుబాటు ద్వారా పతనమైన అనంతరం ఇవాళ(ఆదివారం) నూర్ హుస్సేన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించాలని అవామీ లీగ్ పార్టీ మొదటిసారి నిర్ణయం తీసుకుంది. విమోచన యుద్ధం విలువలు, ప్రజాస్వామ్య సూత్రాలను విశ్వసించే సాధారణ ప్రజలు, కార్యకర్తలను నూర్ హుస్సేన్ చత్తర్ (జీరో పాయింట్) వద్ద మార్చ్‌లో చేరాలని పార్టీ ఆహ్వానించింది. ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులను తొలగించి బంగ్లాదేశ్ అవామీ లీగ్ నాయకత్వంలో ప్రజాస్వామ్య పాలనను పునఃస్థాపన చేయాలని కూడా పిలుపునిచ్చింది.Despite suppression from 32 political groups, police, 191 platoons of BGB, the army, and espionage, the AL has marched across the zero point. These are not corrupt people; they’ve received no rewards from the AL in the past decade. Yet, today, they’re struggling for it! pic.twitter.com/Q9Q1JmY8YW— Tasin Mahdi 🇧🇩 (@in_tasin) November 10, 2024అయితే.. ఈ ప్రకటన వెలువడిన వెంటనే బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం నిరసన ర్యాలీకి అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న అవామీ లీగ్ ఫాసిస్ట్ పార్టీ.. ఈ ఫాసిస్ట్ పార్టీ బంగ్లాదేశ్‌లో నిరసనలు నిర్వహించేందుకు అనుమతించేది లేదని యూనస్ ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ ఆలం అన్నారు. రాజకీయ కార్యకర్త, అవామీ లీగ్ యువజన ఫ్రంట్, జూబో లీగ్ నాయకుడు నూర్ హొస్సేన్ నవంబర్ 10, 1987న ఎర్షాద్ వ్యతిరేక ఉద్యమంలో హత్యకు గురయ్యాడు.చదవండి: ఉక్రెయిన్-రష్యా యుద్ధం.. ట్రంప్ మరో కీలక నిర్ణయం -
USA Presidential Elections 2024: పరిధులు దాటుతున్న మస్క్
అమెరికా అధ్యక్ష ఎన్నికలు అతి సమీపానికి వచ్చిన నేపథ్యంలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతిచ్చే క్రమంలో స్పేస్ ఎక్స్ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పరిధులు దాటుతున్నారు. డెమొక్రటిక్ అభ్యరి్థ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌పై హింసాత్మక, అసభ్య పదజాలం ఉపయోగిస్తున్నారు. ట్రంప్, హారిస్ పోటీని గ్లాడియేటర్ నేపథ్య పోరాటంగా అభివర్ణిస్తూ మస్క్‌కు చెందిన అమెరికా సూపర్ పీఏసీ ఎక్స్‌లో పోస్ట్ చేసిన వీడియో దుమారం రేపుతోంది. రెచ్చగొట్టే, హింసాత్మక చిత్రాలతో రూపొందించిన ఈ వీడియోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్‌ను చేతిలో కత్తులతో గ్లాడియేటర్లా చూపారు. మైదానంలో హారిస్ తలపడుతున్నట్టు, ఆమె ముఖంపై తన్నుతున్నట్టు రూపొందించారు. ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన పెన్సిల్వేనియా ర్యాలీని చూపుతూ మస్క్ వాయిస్ ఓవర్‌తో వీడియో మొదలవుతుంది. ఈ ఎన్నికలు అమెరికాతో పాటు పాశ్చాత్య నాగరికత భవితవ్యాన్ని నిర్ణయిస్తాయని భావిస్తున్నట్టు మస్క్ చెబుతారు. రాకెట్లు, జెట్లు, హల్క్ చొక్కా విప్పడం, ట్రంప్ ప్రసంగాలు, పలు సినీ క్లిప్పింగులు వీడియలో చోటుచేసుకున్నాయి. దీని సృష్టికర్తలు నియో–నాజీలంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సూపర్ పీఏసీ ఎక్స్ గతంలోనూ హారిస్ లక్ష్యంగా ఇలాంటి వీడియోలు చేసింది. ఆమెను ‘సి–వర్డ్’(కమ్యూనిస్టు)గా అభివరి్ణస్తూ పోస్ట్ చేసిన ఆ వీడియోను వెంటనే తొలగించింది. ట్రంప్‌కు మద్దతుగా, డెమొక్రాట్లను విమర్శిస్తూ ప్రకటనల కోసం సూపర్ పీఏసీ ఇప్పటికే భారీగా ఖర్చు చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇరు వర్గాల ఘర్షణ.. పోలీసు కేసు నమోదు
బరేలీ: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. బరేలీ జిల్లాలో రెండు వర్గాలు పరస్పరం ఇటుకలు, రాళ్లు రువ్వుకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘర్షణలకు కారకులుగా అనుమానిస్తున్న 20 మంది గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు.ఈ ఘటన బరేలీలోని కిలా పోలీస్ స్టేషన్ పరిధిలో గల శ్మశాన వాటికలోని వాల్మీకి ప్రాంతంలో చోటుచేసుకుంది. మద్యం సేవించే విషయమై రెండు వర్గాల మధ్య మొదలైన వాగ్వాదం చివరికి ఒకరిపై ఒకరు ఇటుకలు, రాళ్లతో దాడి చేసుకునేవరకూ దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఘటన కారణంగా ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఉదంతంపై అటుగా వెళ్తున్న వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ ఇరు వర్గాలవారు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ నేపధ్యంలో పోలీసులు గుంపును లాఠీలతో చెదరగొట్టారు. ఈ కేసులో బాకర్‌గంజ్ అవుట్‌పోస్టు ఇన్చార్జి ప్రమోద్ కుమార్‌తో పాటు 20 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సంఘటనా స్థలంలో శాంతిభద్రతలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఈ కేసులో తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: ముందే గుర్తిద్దాం... గుండె కోత ఉండదు.. -
బహ్రాయిచ్‌లో కొనసాగుతున్న ఆందోళనలు
బహ్రాయిచ్: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌లో దుర్గామాత విగ్రహ నిమజ్జనం ఊరేగింపులో ఒక యువకుడు మృతి చెందిన దరిమిలా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఐదు వేల మంది స్థానికులు మహసీ తహసీల్ కార్యాలయం ముందు ఆ యువకుని మృతదేహాన్ని ఉంచి, నిరసనకు దిగారు.బహ్రాయిచ్ జిల్లాలోని మహరాజ్‌గంజ్ మార్కెట్లో ఆదివారం దుర్గామాత నిమజ్జనం సందర్భంగా కాల్పుల ఘటన చోటుచేసుకుంది. దీనిలో ఒక యువకుడు మృతిచెందాడు. రామ్‌గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెహువా మన్సూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. బహ్రాయిచ్‌లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్న దరిమిలా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఇటువైపుగా వచ్చిపోయే వాహనాలను తనిఖీ చేస్తున్నారు.రెహువా మసూర్ గ్రామస్తులు దుర్గామాత విగ్రహంతో నిమజ్జనానికి వెళుతూ, డీజేను ప్లే చేశారు.దీంతో ఆగ్రహంచిన మరోవర్గం వారు రాళ్లదాడికి పాల్పడటంతో పాటు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ సమయంలో పోలీసులు పరిస్థితిని అదుపు చేయలేకపోవడంతో పరిస్థితి చేయిదాటిపోయింది. మరోవర్గం జరిపిన కాల్పుల్లో రామ్ గోపాల్ మిశ్రా(22) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. యువకుని మృతితో ఉద్రిక్తతలు మరింగా పెరిగాయి. వేలాది మంది గ్రామస్తులు నిరసనకు దిగారు. స్థానికంగా ఉన్న ఒక ఆస్పత్రికి, షోరూంకు నిప్పు పెట్టారు. పలు ఇళ్లకు కార్లకు కూడా నిప్పు పెట్టారు.నిరసనకు దిగిన వారితో పోలిస్తే పోలీసుల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో పోలీసులు పరిస్థితిని అదుపు చేసే పరిస్థితి లేదు. అయితే ఈ కేసులో 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురు నిందితులను గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదిపరి చర్యలకు ఉపక్రమించారు. ఇది కూడా చదవండి: దుర్గా నిమజ్జనంలో హింస.. ఒకరు మృతి -
దుర్గా నిమజ్జనంలో హింస.. ఒకరు మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌లో దుర్గా విగ్రహ నిమజ్జన ఊరేగింపులో హింస చెలరేగింది. ఒక వర్గానికి చెందినవారు రాళ్లు రువ్వడంతో పాటు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ యువకుడు మృతి చెందడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఈ సమయంలో జరిగిన తొక్కిసలాటలో పలువురు గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం జిల్లాలోని పలు చోట్ల హిందూ సంస్థలు నిరసనలు చేపట్టాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసు అధికారులు ఘటనా స్థలంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.యూపీలోని బహ్రాయిచ్‌లో జరిగిన హింసాకాండపై జిల్లా ఎస్పీ వృందా శుక్లా మీడియాకు పలు వివరాలను అందించారు. ఈ ఉదంతంతో ప్రమేయమున్న 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, సల్మాన్ అనే నిందితుడి ఇంటి దగ్గర కాల్పులు జరిగాయని తెలిపారు. 22 ఏళ్ల యువకుడు రామ్ గోపాల్ మిశ్రా కాల్పుల్లో మృతిచెందాడన్నారు.బహ్రాయిచర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, పోలీసు స్టేషన్ ఇన్‌ఛార్జి హార్ది, మహసీ పోలీస్ పోస్ట్ ఇన్చార్జితో సహా ఆరుగురు పోలీసుల నిర్లక్ష్యాన్ని గుర్తిస్తూ ఉన్నతాధికారులు వారిని సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ బహ్రాయిచ్‌లో చోటుచేసుకున్న ఘటనకు కారకులైనవారిని విడిచిపెట్టబోమని అన్నారు. నిందితులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇది కూడా చదవండి: రక్తమోడిన దేవరగట్టు -
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపై భారత్ ఆందోళన చెందుతోంది: జై శంకర్
ఇజ్రాయెల్-ఇరాన్‌ల మధ్య భీకర యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హమాస్ అగ్రనేతలను అంతమొందించిన ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణుల వర్షాన్ని కురిపించడంతో పశ్చిమాసియా నిప్పు కణికలా మారింది. ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేని స్థితి నెలకొంది.ఈనేపథ్యంలో ఇరాన్- ఇజ్రాయెల్‌ల మధ్య జరుగుతున్న ఈ ఘర్షణపై భారత్ ఆందోళన చెందుతోందని భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ పేర్కొన్నారు. ఇదే కాకుండా లెబనాన్, హౌతీ, ఎర్ర సముద్రంలో జరిగే ఏ సంఘర్షణ విస్తృతమయ్యే అవకాశాలపైనా ఆందోళన చెందుతోందని తెలిపారు.చదవండి: మధ్యప్రాచ్యంలో యుద్ద భేరీ..ఈ మేరకు యూఎస్ వాషింగ్టన్‌లోని థింక్ తాంక్ కార్నేగీ ఎండోమెంట్ కార్యక్రమంలో భాగంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడిని ‘తీవ్రవాద చర్యగా’ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ప్రతిస్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఏ దేశమైనా ప్రతిస్పందించడానికి అంతర్జాతీయ మానవతా చట్టాన్ని పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. అది ఎంతో ముఖమన్న జై శంకర్.. సంక్లిష్ట సమయంలో చర్చల ప్రాముఖ్యతను తక్కువగా అంచనా వేయకూడదన చెప్పారు. చర్చలతో ఘర్షణలను ఆపవచ్చని నేను భావిస్తున్నట్లుఇదిలా ఉండగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార దాడులు ప్రారంభించింది. ఇజ్రాయెల్‌లోని టెల్అవీవ్, జెరూసలెంపై మంగళవారం రాత్రి ఏకబిగిన 180 క్షిపణుల్ని ప్రయోగించింది. వీటిలో చాలావాటిని అమెరికా సాయంతో ఇజ్రాయెల్ అడ్డుకోగలిగింది. మరికొన్ని ఈ నగరాలను తాకాయి. ప్రాణనష్టం వివరాలు తెలియనప్పటికీ- తమవైపు కొద్దిమంది మాత్రమే గాయపడ్డారని ఇజ్రాయెల్ ప్రకటించింది. హెజ్బొల్లాపై ప్రతీకారం తీర్చుకునేందుకు లెబనాన్‌లో భూతల దాడులు ప్రారంభించామని ఇజ్రాయెల్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇరాన్ క్షిపణుల ప్రయోగం మొదలైంది. ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు 12 నిమిషాల వ్యవధిలోనే ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించాయి. -
సమాజాన్ని చూసే తీరును నా కూతుళ్లు మార్చేశారు
న్యూఢిల్లీ: దివ్యాంగుల పట్ల, ముఖ్యంగా దివ్యాంగ బాలల పట్ల సమాజం వ్యవహరించే తీరులో మార్పు రావాల్సిన అవసరముందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. దివ్యాంగ బాలలు లైంగిక హింసకు సులువైన లక్ష్యాలుగా మారుతున్నారంటూ ఆవేదన వెలిబుచ్చారు. ఈ దారుణాల నుంచి కాపాడుకోవడం, వాటి బారిన పడేవారి పట్ల సహానుభూతితో వ్యవహరించడం మనందరి బాధ్యత అన్నారు. శనివారం ఆయన దివ్యాంగ బాలల హక్కుల పరిరక్షణపై 9వ జాతీయ సదస్సులో పాల్గొన్నారు. దివ్యాంగుల హక్కులపై సుప్రీంకోర్టు హాండ్‌బుక్‌ను విడుదల చేశారు. అనంతరం ప్రారంభోపన్యాసం చేశారు. ‘‘దివ్యాంగ బాలల భద్రత, సంక్షేమానికి నా హృదయంలో ప్రత్యేక స్థానముంది. నేను దివ్యాంగులైన ఇద్దరు ఆడపిల్లల తండ్రిని. సమాజం పట్ల నా దృక్కోణాన్ని నా కూతుళ్లు పూర్తిగా మార్చేశారు’’ అని చెప్పారు. నైపుణ్యం, సామర్థ్యాలతో నిమిత్తం లేకుండా బాలల హక్కులను పరిపూర్ణంగా పరిరక్షించే ఆదర్శ సమాజమే మనందరి లక్ష్యం కావాలని సూచించారు. ఇందుకోసం పలు కీలకాంశాలపై దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు. ‘‘దివ్యాంగ బాలల సమస్యలను గుర్తించాలి. లైంగిక దాడుల వంటి హేయమైన నేరాల బారిన పడే దివ్యాంగ బాలికలను అక్కున చేర్చుకుని వారిలో ధైర్యం నింపాలి. పూర్తిగా కోలుకునేందుకు అన్నివిధాలా దన్నుగా నిలవాలి. పోలీస్‌స్టేషన్ మొదలుకుని కోర్టు దాకా ప్రతి దశలోనూ వారి పట్ల అత్యంత సున్నితంగా, సహానుభూతితో వ్యవహరించాలి. ఇందుకు అవసరమైన మేరకు బాలల న్యాయ వ్యవస్థకు, దివ్యాంగుల హక్కుల చట్టానికి మార్పులు చేయాలి. ఇందుకు అంతర్జాతీయ చట్టాల నుంచి స్ఫూర్తి పొందాలి. వారిపై అకృత్యాలను నివారించడంపై ప్రధానంగా దృష్టి సారించాలి. ఆ బాలలకు నాణ్యతతో కూడిన విద్య, అనంతరం మెరుగైన ఉపాధి తదితర అవకాశాలు కల్పించాలి. తద్వారా అడుగడుగునా అండగా నిలవాలి. ఈ విషయమై వారి తల్లిదండ్రులతో పాటు పోలీసులకు, లాయర్లకు, న్యాయమూర్తులకు కూడా మరింత అవగాహన కల్పించాలి’’ అని సీజేఐ పిలుపునిచ్చారు. -
సీబీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. న్యాయవ్యవస్థపై నిందలా?
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో 2021 ఎన్నికల తర్వాత చెలరేగిన హింసలపై సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల తర్వాత జరిగన హింసకు సంబంధించిన కేసులను ఆ రాష్ట్రం వెలుపలకు (బెంగాల్ కాకుండా) బదిలీ చేయాలని కోరుతూ కేంద్ర దర్యాప్తు సంస్థ చేసిన అభ్యర్థనపై సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది. కాగా ఎన్నికల తర్వాత హింసకు సంబంధించిన కేసు దర్యాప్తును కల్‌కతా హైకోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే సాక్షులను బెదిరించే అవకాశం ఉందన్న కారణంతో ఈ 45 కేసులను బెంగాల్ నుంచి మరోరాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ సీబీఐ గతేడాది డిసెంబర్లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో నేడు విచారణ చేపట్టిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిథాల్‌లతో కూడిన ధర్మాసనం.. బెంగాల్‌లోని మొత్తం న్యాయవ్యవస్థపై సీబీఐ అభ్యంతరాలు వ్యక్తం చేయడంపై తప్పుపట్టింది. సీబీఐ తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజును ఉద్దేశించి బెంచ్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బదిలీ పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని సూచించింది.‘మిస్టర్ రాజు.. బెంగాల్‌లోని అన్ని కోర్టులు ఘర్షణ వాతావరణంలో ఉన్నాయని మీరు మాట్లాడుతున్నారు. దీనికి మీరు ఎటువంటి ఆధారాలు ఈ పిటిషన్లో ప్రస్తావించారు? విచారణలు సక్రమంగా జరగడం లేదని, అక్రమంగా బెయిళ్లు ఇస్తున్నాయని ఆరోపణలు చేశారు. న్యాయ వ్యవస్థ మొత్తం ఘర్షణ వాతావరణంలో పని చేస్తోందనేలా పిటిషన్ ఉంది. మీ అధికారులకు (సీబీఐ) జ్యుడీషియల్ అధికారులంటే ఇష్టం లేకపోవచ్చు. కానీ అలాంటి ప్రకటనలు చేయవద్దు’ అని సీబీఐకి సూచించింది.ఈ పిటిషన్ ధిక్కార నోటీసుకి తగిన కేసని.. న్యాయవాదికి సమన్లు జారీ చేస్తామని సుప్రీం ధర్మాసనం బెదిరించింది. అయితే న్యాయవ్యవస్థపైన చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా లేవని ఏఎస్జీ రాజు చెప్పారు. పిటిషన్ రాతలో కొంత లోపం ఉన్నట్లు అంగీకరించి క్షమాపణలు కోరవడంతో కోర్టు తీవ్ర చర్యలు తీసుకోలేదు. అనంతరం పిటిషన్ ఉపసంహరించుకునేందుకు అనుమంతించింది. దీంతో కొత్త పిటిషన్‌ను సమర్పిస్తామని ఎస్పీ రాజు కోర్టుకు తెలపడంతో పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. -
అస్థిరత ఏర్పడినప్పుడల్లా... హిందువులే టార్గెట్
అంటారియో: బంగ్లాదేశ్‌లో హిందువుల మీద జరుగుతున్న హింసపై భారత సంతతికి చెందిన కెనడా ఎంపీ చంద్ర ఆర్య తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లో హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులతో సహా మతపరమైన మైనారిటీలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులను ఆయన ఎత్తిచూపారు. కెనడా పార్లమెంటులో ఈ మేరకు ప్రకటన చేశారు. బంగ్లాలో అస్థిరత ఏర్పడినప్పుడల్లా ఈ సమూహాలు, ముఖ్యంగా హిందువులు లక్ష్యంగా అవుతున్నారని, ఎక్కువగా హింసకు గురవుతున్నారని వాపోయారు. 1971లో బంగ్లాకు స్వాతంత్య్రం వచి్చనప్పటి నుంచీ జనాభాలో మతపరమైన మైనారిటీల సంఖ్య భారీగా తగ్గిందని వెల్లడించారు. కెనేడియన్ హిందువులు బంగ్లాదేశ్‌లోని తమ బంధువులు, ఆస్తుల భద్రత గురించి ఆందోళన చెందుతున్నారని ఆర్య తెలిపారు. దీనిపై అవగాహన కలి్పంచేందుకు సెపె్టంబర్ 23న కెనడా పార్లమెంట్ ముందు ర్యాలీ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. బంగ్లాదేశ్‌తో సంబంధాలున్న కెనేడియన్ బౌద్ధులు, క్రిస్టియన్ల కుటుంబాలు కూడా ఇందులో పాల్గొంటాయని తెలిపారు. హిందువులపై దాడులు బంగ్లాదేశ్‌లో ఇటీవలి తిరుగుబాటు తర్వాత దేశవ్యాప్తంగా హింస చెలరేగడం తెలిసిందే. దేశవ్యాప్తంగా 27 జిల్లాల్లో హిందువులు దాడులను ఎదుర్కొంటున్నారు. హిందూ దేవాలయాలను భారీగా టార్గెట్ చేశారు. ప్రార్థనా మందిరాలతో సహా మతపరమైన మైనారిటీలను ప్రత్యేక లక్ష్యంగా చేసుకున్నట్టు బంగ్లాదేశ్‌లోని జమాతే ఇస్లామీ అంగీకరించింది. దీనికితోడు రాజీనామా చేసి దేశం వీడిన మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ నాయకులను హతమార్చడం, వారి ఇళ్లకు నిప్పు పెట్టడం వంటివి పెద్దపెట్టున జరిగాయి. మైనారిటీలు, ఇతరులపై జరుగుతున్న హింసపై విచారణకు ఐరాస మానవ హక్కుల నిజ నిర్ధారణ బృందం తాజాగా ఢాకా చేరుకుంది. ఎవరీ ఆర్య? ఎంపీ చంద్ర ఆర్య కర్ణాటకకు చెందినవారు. రెండేళ్ల క్రితం కెనడా పార్లమెంటులో తన మాతృభాష కన్నడలో మాట్లాడారు. ఆ వీడియో వైరల్ కావడంతో అందరి దృష్టినీ ఆకర్షించారు. అంటారియోలోని నేపియాన్ ఎలక్టోరల్ జిల్లాకు కెనడా హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కర్నాటకలోని తుమకూరు జిల్లాకు చెందిన ఆర్య కెనడా రాజకీయాల్లో పనిచేస్తూనే తన భారత మూలాలతో సంబంధాలను కొనసాగిస్తున్నారు. -
మణిపూర్‌లో హై టెన్షన్.. పోలీసులు Vs ప్రజలు, విద్యార్థులు
ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. కేవలం 10 రోజుల వ్యవధిలోనే 11 మంది మృతిచెందారు.అయితే, సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. తాజాగా జరిగిన హింసలో దాదాపు 11 మంది ప్రజలు మృతి చెందారు. ఇక, నిన్న(సోమవారం) కూడా పలు ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. ఈరోజు విద్యార్థులు మణిపూర్‌లోని రాజ్‌భవన్‌ను ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విద్యార్థులపైకి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అటు నుంచి విద్యార్థులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. मणिपुर में प्रदर्शनकारियों ने राज्यपाल के घर पर किया पथराव. मोदी जी अभी रूस और यूक्रेन के बीच युद्ध रुकवाने में व्यस्त हैं!#ManipurVoilence #Manipur pic.twitter.com/t2E3honaQn— Newswala (@Newswalahindi) September 10, 2024 ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన ప్రభుత్వంలో పలు జిల్లాల్లో కర్ఫ్యూ విధించింది. శాంతి భద్రతల రీత్యా తూర్పు, పశ్చిమ ఇంఫాల్‌ల జిల్లాల్లో మంగళవారం మధ్యాహ్నం నుంచి కర్ఫ్యూ విధిస్తున్నట్లు జిల్లా యంత్రాగం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, కర్ఫ్యూ నేపథ్యంలో ప్రజలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. కర్ఫ్యూకు సంబంధించి కొత్త ఉత్తర్వులు జారీ చేసే వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో అత్యవసర సేవలకు, మీడియాకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.Imphal under CurfewIt seems to be the shortcut to maintaining law and order. @NBirenSingh @narendramodi @AmitShah After 16th months of #Manipurcrisis this is what you can come severely affecting the small-time business and unorganised workforce.#ManipurFightsBack… pic.twitter.com/2pDPUKTKrs— khaba (@krishnankh) September 10, 2024 ఏడాది నుంచి ఘర్షణలు..ఇదిలా ఉండగా.. ఏడాదికి పైగా కొనసాగుతున్న మణిపూర్ తెగల మధ్య ఘర్షణలు ఇంక తగ్గడం లేదు. కొండ ప్రాంతాల్లో నివసించే కుకీలు, మైదాన ప్రాంతాల్లో నివసించే మెయితీల మధ్య నెలకొన్న వైరం గత ఏడాది మే నెలలో ప్రత్యక్ష ఘర్షణలకు, దాడులకు దారితీసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచీ వివిధ స్థాయుల్లో ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. బీరెన్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మెయితీల పక్షం వహిస్తూ కుకీల అణచివేతకు తోడ్పడుతున్నదనే ఆరోపణలున్నాయి. The condition in Manipur has become very critical now…#Manipur #ManipurConflict #ManipurCrisis #ManipurFightsBack pic.twitter.com/R8GKNFUOGg— Anindya Das (@AnindyaDas1) September 10, 2024 మరోవైపు.. మణిపూర్ ఘర్షణల్లో 220 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఇరు వర్గాల వారు ఉన్నప్పటికీ కుకీలే అధికంగా ఉన్నట్టు సమాచారం. మహిళలపై కనీవినీ ఎరుగని రీతిలో అమానుషమైన దాడులు జరగడం మణిపూర్‌కు మచ్చ తెచ్చింది. మణిపూర్‌లో మారణహోమాన్ని ఆపేందుకు కేంద్రం జోక్యం చేసుకోకపోగా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నది. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటివరకు మణిపూర్ గురించి, అక్కడి మహిళలపై జరుగుతున్న ఘోరాల గురించి మాట్లాడకపోవడమే ఇందుకు నిదర్శనం. దీంతో పౌర ప్రభుత్వ పాలన పట్టు తగ్గిపోయి మిలిటెంట్ గ్రూపుల హవా పెరిగింది.ఇది కూడా చదవండి: పూటుగా మద్యం సేవించి.. బీజేపీ అధ్యక్షుడి కుమారుడి కారు బీభత్సంMatinee show for #ManipurCrisis. When #Meities have to stage a protest this is the precautions the state security forces react,in #Churachandpur and #Kangpokpi, #Kukis_Zo are allowed to march with guns. #ManipurConflict #iPhone16Plus #Kuki_ZoEngineeredManipurViolence #iPhone pic.twitter.com/28FPjkl4JH— Adu-Oirasu. (@themeiteitweets) September 10, 2024 Students are protesting in Manipur after the death of 9 People.The condition in Manipur is getting worse everyday.Godi media is busy in Hindu-Muslim Propaganda….they won’t show these things 👇pic.twitter.com/DHMUUwGilj— Dhruv Rathee (Parody) (@dhruvrahtee) September 9, 2024