ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌లో ప్రస్తుతం పరిస్థితులు మరింత ఘోరంగా తయారయ్యాయి. దేశంలోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రాంతంలో రెండు గిరిజన గ్రూపుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ హింసాకాండలో ఇప్పటివరకు 36 మంది మృతిచెందారని, వందలాది మంది గాయపడ్డారని తెలుస్తోంది. ఇరువర్గాల మధ్య భీకర ఘర్షణలు చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో పాల్గొన్నవారు మారణాయుధాలు కూడా ఉపయోగించారని సమాచారం.
పాకిస్తాన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఖైబర్ పఖ్తుంఖ్వాలోని కుర్రం జిల్లాలో ఒక భూమి స్వాధీనం కోసం రెండు గిరిజన గ్రూపుల మధ్య సాయుధ పోరాటం జరిగింది. ఈ సందర్భంగా చోటుచేసుకున్న హింసాయుతకాండలో 36 మంది మృతిచెందగా, 162 మంది గాయపడ్డారు. గ్రామంలో గతంలో కూడా వివిధ తెగలు, మత సమూహాల మధ్య ఘర్షణలు జరిగినట్లు అధికారులు తెలిపారు. తాజా ఘటన ఎగువ కుర్రం జిల్లా బొషెరా గ్రామంలో చోటుచేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment