పెషావర్: పాకిస్తాన్‌లో షియా-సున్నీల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ, తాజాగా కుర్రం జిల్లాలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. దీంతో షియా-సున్నీల హింసాత్మక ఘటనల్లో మృతుల సంఖ్య 122కి చేరింది. ఈ వివరాలను పోలీసులు, ఆస్పత్రివర్గాలు మీడియాకు తెలియజేశారు.
సున్నీ- షియా వర్గాల మధ్య హింస గత వారం రోజులుగా జరుగుతోంది. తాజాగా ఈ రెండు వర్గాల మధ్య మరోసారి కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించగా, ఆరుగురు గాయపడ్డారు. ఈ హింసాకాండ అనంతరం గవర్నర్ ఫైసల్ కరీం కుండీ.. ముఖ్యమంత్రి అలీ అమీన్ గండాపూర్‌ను ప్రాంతాన్ని సందర్శించాలని కోరారు. నవంబర్ 21న కుర్రం జిల్లాలోని పరాచినార్ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్‌పై ఆకస్మిక దాడి జరిగిన తర్వాత, అలీజాయ్- బగన్ గిరిజన సమూహాల మధ్య హింస చెలరేగింది.
నాడు ప్యాసింజర్ వ్యాన్‌పై జరిగిన దాడిలో 47 మంది మృతిచెందారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన పలువురు ప్రయాణికులు చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 57కి చేరింది. శుక్రవారం వరకు కొనసాగిన కాల్పుల ఘటనల్లో 65 మంది మృతి చెందినట్లు పోలీసులు, ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అంతకుముందు ప్రభుత్వం సమక్షంలో షియా- సున్నీ వర్గాల మధ్య ఏడు రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. తరువాత దీనిని 10 రోజులకు పొడిగించించారు.
ఇది కూడా చదవండి: చైనాలో జర్నలిస్ట్‌పై గూఢచర్యం ఆరోపణలు.. ఏడేళ్ల జైలు
Comments
Please login to add a commentAdd a comment