Continuous movement
-
కొనసాగుతున్న షియా-సున్నీల హింసాకాండ.. 122 మంది మృతి
పెషావర్: పాకిస్తాన్లో షియా-సున్నీల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ, తాజాగా కుర్రం జిల్లాలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. దీంతో షియా-సున్నీల హింసాత్మక ఘటనల్లో మృతుల సంఖ్య 122కి చేరింది. ఈ వివరాలను పోలీసులు, ఆస్పత్రివర్గాలు మీడియాకు తెలియజేశారు.సున్నీ- షియా వర్గాల మధ్య హింస గత వారం రోజులుగా జరుగుతోంది. తాజాగా ఈ రెండు వర్గాల మధ్య మరోసారి కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించగా, ఆరుగురు గాయపడ్డారు. ఈ హింసాకాండ అనంతరం గవర్నర్ ఫైసల్ కరీం కుండీ.. ముఖ్యమంత్రి అలీ అమీన్ గండాపూర్‌ను ప్రాంతాన్ని సందర్శించాలని కోరారు. నవంబర్ 21న కుర్రం జిల్లాలోని పరాచినార్ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్‌పై ఆకస్మిక దాడి జరిగిన తర్వాత, అలీజాయ్- బగన్ గిరిజన సమూహాల మధ్య హింస చెలరేగింది.నాడు ప్యాసింజర్ వ్యాన్‌పై జరిగిన దాడిలో 47 మంది మృతిచెందారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన పలువురు ప్రయాణికులు చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 57కి చేరింది. శుక్రవారం వరకు కొనసాగిన కాల్పుల ఘటనల్లో 65 మంది మృతి చెందినట్లు పోలీసులు, ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అంతకుముందు ప్రభుత్వం సమక్షంలో షియా- సున్నీ వర్గాల మధ్య ఏడు రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. తరువాత దీనిని 10 రోజులకు పొడిగించించారు.ఇది కూడా చదవండి: చైనాలో జర్నలిస్ట్‌పై గూఢచర్యం ఆరోపణలు.. ఏడేళ్ల జైలు -
ఆగని తోడేళ్ల దాడులు.. మేకను నోట కరచుకుని..
బహ్రాయిచ్: యూపీలోని బహ్రాయిచ్‌లో తోడేళ్ల భీభత్సం కొనసాగుతోంది. నాన్పరా తహసీల్ పరిధిలో ఒక ఇంటి బయట కట్టిన మేకను తోడేళ్లు చంపుకుతిన్నాయి. ఈ ఘటన సీసీటీవీలో రికార్డయ్యింది. దానిలో తోడేళ్లు మేకను తమ నోట కరచుకుని తీసుకువెళుతున్న దృశ్యాలు కనిపించాయి.ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్ జిల్లాలో నరమాంస భక్షక తోడేళ్లు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పాలనా యంత్రాంగం ఇప్పటి వరకు చాలా తోడేళ్లను పట్టుకున్నప్పటికీ, తోడేళ్ల దాడులు ఆగడం లేదు. తాజాగా బహ్రాయిచ్‌లోని బీజేపీ శాసనమండలి సభ్యుడు పద్మాసేన్ చౌదరి ఫామ్‌హౌస్‌లో నాలుగు తోడేళ్ల గుంపు కనిపించింది. వీటిలో ఒక కుంటి తోడేలు కూడా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెతుకుతున్న తోడేలు ఇదేనని భావిస్తున్నారు. అయితే ఈ కొత్త తోడేళ్ల గుంపు స్థానికులను మరింతగా భయపెడుతోంది.ఆరు తోడేళ్ళ గుంపు మనుషులపై దాడి చేస్తున్నదని గుర్తించిన అటవీశాఖ అధికారులు అతికష్టం మీద ఐదు తోడేళ్లను పట్టుకున్నారు. ఇంకా ఒక తోడేలు మిగిలివుందని చెబుతున్నారు. కాగా ఆ తోడేళ్ల గుంపు నరమాంస భక్షకులుగా మారడానికి కారణమేమిటన్నది పరిశోధించాల్సిన అంశమని అటవీ అధికారి తెలిపారు. తాజాగా తోడేళ్లు కనిపించిన ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించి, విచారణ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: World Rose Day 2024: క్యాన్సర్‌ను జయించాలని కోరుకుంటూ.. -
Bahraich: ఆగని తోడేళ్ల దాడులు.. ఈసారి 11 ఏళ్ల బాలికపై..
బహ్రయిచ్: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రయిచ్‌లో తోడేళ్ల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా 11 ఏళ్ల బాలికపై తోడేలు దాడి చేసింది. ఈ దాడిలో బాలిక తీవ్రంగా గాయపడింది. దీంతో బాధిత బాలికను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ఈ దాడి అనంతరం స్థానికుల్లో భయాందోళనలు మరింతగా పెరిగాయి. బహ్రయిచ్ జిల్లాలోని దాదాపు 50 గ్రామాల్లో నరమాంస భక్షక తోడేళ్లు భీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటివరకూ అటవీశాఖ ఐదు తోడేళ్లను పట్టుకుంది. ‘ఆల్ఫా’ అనే తోడేలు కోసం వెదుకులాట సాగిస్తోంది. బహ్రయిచ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అజిత్ ప్రతాప్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ తాము ఇంకా ఒక తోడేలును పట్టుకోవాల్సి ఉందని అన్నారు. అంతకుముందు ఆగస్టు 29న అటవీ శాఖ బృందం నాలుగో తోడేలును పట్టుకుంది. గత కొంతకాలంగా బహ్రయిచ్,సీతాపూర్‌లలో తోడేళ్లు భీభత్సం సృష్టిస్తున్నాయి. ఇటీవల ఐదేళ్ల బాలికపై తోడేలు దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. సీతాపూర్‌లో కూడా తోడేలు దాడులు చోటుచేసుకున్నాయి. ఈ ప్రాంతంలో ఆరుగురిపై తోడేలు దాడి చేసింది. తోడేలు బారిన పడిన ఒక వృద్ధురాలు మృతి చెందింది. బహ్రయిచ్‌లో తోడేళ్ల దాడిలో ఏడుగురు మరణించినట్లు వార్తలు వచ్చాయి. 35కి పైగా గ్రామాల్లో తోడేళ్ల భయంతో ప్రజలు ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారు. గ్రామంలో దాదాపు డజను తోడేళ్లు సంచరిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. అయితే వీటి సంఖ్య చాలా తక్కువేనని అటవీశాఖ అధికారులు అంటున్నారు.ఇది కూడా చదవండి: తోడేళ్ల పగ.. దడ పుట్టిస్తున్న నిజాలు -
లాక్డౌన్ 5.0!
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి కట్టడికి దేశవ్యాప్త లాక్డౌన్ మరి కొన్నాళ్లు కొనసాగుతుందనే సంకేతాలు వస్తున్నాయి. లాక్డౌన్ 5.0 ఉంటుందనే సమాచారం ఢిల్లీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మే 31 తర్వాత మరో రెండు వారాల పాటు లాక్డౌన్ కొనసాగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లాక్డౌన్లో 70% పైగా కేసులు నమోదైన 11 ప్రధాన నగరాల పైననే ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశముంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్, పుణే, థానే, జైపూర్, సూరత్, ఇండోర్‌లో కఠిన ఆంక్షల కొనసాగింపు ఉంటుందని తెలుస్తోంది. (ఆర్థిక రాజధాని అతలాకుతలం) లాక్డౌన్లో గుడులు, ఇతర ప్రార్థన స్థలాలను పునః ప్రారంభించేందుకు అనుమతించే అవకాశముంది. మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ దేవాలయాలకు వెళ్లేందుకు అనుమతించవచ్చు. సామూహిక ప్రార్థనలు, మత పరసామూహిక కార్యక్రమాలను అనుమతించకపోవచ్చని తెలుస్తోంది. సినిమాహాళ్లు, స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యా సంస్థలు, షాపింగ్ మాల్స్, ప్రజలు భారీగా గుమికూడే అవకాశమున్న ఇతర ప్రాంతాల మూసివేత ఐదో దశ లాక్‌డౌన్‌లోనూ కొనసాగనుందని తెలుస్తోంది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో లాక్డౌన్ సాధించిన ఫలితాలపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. (లాక్డౌన్ 5.0 : ఆ నగరాలపై ఫోకస్) -
ఈసారి ఏడుతో సరి
సమైక్య ఉద్యమం ఎఫెక్ట్ టెన్త్‌లో దిగజారిన ఫలితం 92.87 ఉత్తీర్ణత శాతంతో జిల్లాకు ఏడో స్థానం గత ఏడాదికంటే తగ్గిన ఉత్తీర్ణత శాతం 241 పాఠశాలల్లో 100 శాతం ఫలితాలు చిత్తూరు(టౌన్), న్యూస్‌లైన్: జిల్లాలో ఉధృతంగా జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమం పదో తరగతి ఫలితాలపై ప్రభావం చూపింది. 2012-13 విద్యాసంవత్సరంలో 94.92 శాతంతో రాష్ట్రంలో మొదటి స్థానం సాధిం చిన జిల్లా ఈసారి 92.87 శాతం ఉత్తీర్ణత సాధించి 7వ స్థానంతో సరిపెట్టుకుంది. మొత్తం 51,116మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాయగా, 47,472 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 26,539 మందికిగాను 24,468 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 24,577 మందికిగాను 23,004మంది ఉత్తీర్ణులయ్యారు. 2010-2011, 2011-2012 విద్యాసంవత్సరాల్లో జిల్లాకు వరుసగా నాలుగో స్థానం రాగా, 2012-2013లో మొదటి స్థానం వచ్చింది. విద్యాశాఖ, ఉపాధ్యాయవర్గాలు మళ్లీ మొదటి స్థానం వస్తుందని భావించినా జిల్లాకు ఏడో స్థానమే వచ్చింది. గత సంవత్సరం కాస్త తక్కువ మంది విద్యార్థులు పరీక్షలు రాసినప్పటికీ ఎక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గతంతో పోల్చుకుంటే ఈసారి 2.05 శాతం ఉత్తీర్ణత తగ్గింది. బాలికలదే పై చేయి పదేళ్లుగా పదో తరగతి ఫలితాల్లో పైచేయి సాధిస్తున్న బాలికలు ఈసారి కూడా బాలుర కంటే 1.4 శాతం అధికంగా ఉత్తీర్ణులయ్యూరు. బాలుర ఉత్తీర్ణత శాతం 92.2 ఉండగా, బాలికల ఉత్తీర్ణత శాతం 93.6గా నమోదయింది. కాగా జిల్లాకు ఊరట కలిగే విషయం ఏంటంటే పరీక్ష రాసిన విద్యార్థుల్లో 383 మంది 10కి 10 జీపీఏ పాయింట్లు సాధించారు. ఈ అంశంలో రాష్ట్రంలో జిల్లా రెండో స్థానం పొందింది. అన్ని డివిజన్లలో కలిపి 241 ప్రభుత్వ పాఠశాలలు 100 శాతం ఫలితాలు సాధించాయి. గత సంవత్సరం 206 పాఠశాలలు 100 శాతం ఫలితాలు సాధించగా, ఈసారి ఆ సంఖ్య పెరిగింది. చిత్తూరు డివిజన్లో 115 ప్రభుత్వ పాఠశాలలు నూరు శాతం ఫలితాలు సాధించగా, తిరుపతిలో 53, పుత్తూరులో 65, మదనపల్లెలో 8 పాఠశాలలకు వంద శాతం ఫలితాలు వచ్చాయి. కస్తూర్భా పాఠశాలల్లో మంచి ఫలితాలు రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న కస్తూర్భా గాంధీ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు పది ఫలితాల్లో మంచి ప్రతిభ కనబరిచారు. రామకుప్పం, రొంపిచెర్ల, గంగవరం, గుడుపల్లె, తంబళ్లపల్లె, కేవీ పల్లె, ఎర్రావారిపాళెం, పెద్దమండ్యం, కుప్పం, శాంతిపురం, ములకలచెరువుల్లోని పాఠశాలల్లో నూరు శాతం ఫలితాలు వచ్చాయి. శాంతిపురం కేజీబీవీలో చదువుతున్న బీవీ.పవిత్ర, కుప్పం కేజీబీవీలో చదువుతున్న ఆర్ పవిత్ర అనే విద్యార్థినులు 10కి 10 జీపీఏ పాయింట్లు సాధించారు. సమైక్య ఉద్యమం ప్రభావం రాష్ట్ర విభజన నేపథ్యంలో జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావం పదో తరగతి ఫలితాలపై పడింది. జూలై 31వ తేదీ ప్రారంభమైన ఉద్యమం సీమ జిల్లాల్లో ఉధృతంగా జరిగింది. ముఖ్యంగా మన జిల్లాలో అయితే ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొన్నారు. దీంతో చాలా రోజుల పాటు పాఠశాలలు జరగలేదు. అంతేగాక ఆగష్టు 22వ తేదీ నుంచి ఉపాధ్యాయులు నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. అక్టోబర్ 10వ తేదీ వరకు ఇది జరిగింది. దీంతో పదో తరగతి విద్యార్థులకు సకాలంలో సిల బస్ పూర్తికాలేదు. ఉపాధ్యాయులు పదో తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పాలని డీఈవో కోరినప్పటికీ కొంత మంది మాత్రమే స్పందించి పాఠాలు చెప్పారు. ఈ కారణంగానే ఫలి తాలు తగ్గినట్లు విద్యాశాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు. ఉద్య మం తర్వాత పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, స్టడీ మెటీరియల్ ఇచ్చి చదివించినప్పటికీ కొంత మంది విద్యార్థులు పాస్ కాలేకపోయారు. దీంతో ఉత్తీర్ణత శాతం తగ్గి జిల్లాకు అత్యుత్తమ స్థానం రాలేదని భావిస్తున్నారు.