బహ్రయిచ్: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రయిచ్‌లో తోడేళ్ల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా 11 ఏళ్ల బాలికపై తోడేలు దాడి చేసింది. ఈ దాడిలో బాలిక తీవ్రంగా గాయపడింది. దీంతో బాధిత బాలికను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఈ దాడి అనంతరం స్థానికుల్లో భయాందోళనలు మరింతగా పెరిగాయి. బహ్రయిచ్ జిల్లాలోని దాదాపు 50 గ్రామాల్లో నరమాంస భక్షక తోడేళ్లు భీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటివరకూ అటవీశాఖ ఐదు తోడేళ్లను పట్టుకుంది. ‘ఆల్ఫా’ అనే తోడేలు కోసం వెదుకులాట సాగిస్తోంది. బహ్రయిచ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అజిత్ ప్రతాప్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ తాము ఇంకా ఒక తోడేలును పట్టుకోవాల్సి ఉందని అన్నారు. అంతకుముందు ఆగస్టు 29న అటవీ శాఖ బృందం నాలుగో తోడేలును పట్టుకుంది.
గత కొంతకాలంగా బహ్రయిచ్,సీతాపూర్‌లలో తోడేళ్లు భీభత్సం సృష్టిస్తున్నాయి. ఇటీవల ఐదేళ్ల బాలికపై తోడేలు దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. సీతాపూర్‌లో కూడా తోడేలు దాడులు చోటుచేసుకున్నాయి. ఈ ప్రాంతంలో ఆరుగురిపై తోడేలు దాడి చేసింది. తోడేలు బారిన పడిన ఒక వృద్ధురాలు మృతి చెందింది. బహ్రయిచ్‌లో తోడేళ్ల దాడిలో ఏడుగురు మరణించినట్లు వార్తలు వచ్చాయి. 35కి పైగా గ్రామాల్లో తోడేళ్ల భయంతో ప్రజలు ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారు. గ్రామంలో దాదాపు డజను తోడేళ్లు సంచరిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. అయితే వీటి సంఖ్య చాలా తక్కువేనని అటవీశాఖ అధికారులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: తోడేళ్ల పగ.. దడ పుట్టిస్తున్న నిజాలు
Comments
Please login to add a commentAdd a comment