యూపీలో ఆగని తోడేళ్ల బెడద.. బాలుడిపై దాడి | Another Wolf Attack On Boy In Up Bahraich | Sakshi
Sakshi News home page

యూపీలో ఆగని తోడేళ్ల బెడద.. బాలుడిపై దాడి

Published Fri, Sep 6 2024 9:31 AM | Last Updated on Fri, Sep 6 2024 1:07 PM

Another Wolf Attack On Boy In Up Bahraich

photocredit: PIXABAY

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్‌లో తోడేళ్ల దాడులు ఆగడం లేదు. కనిపిస్తే కాల్చేసేందుకు తుపాకులు పట్టుకుని షూటర్లు తిరుగుతున్నా అవి వెనక్కు తగ్గడం లేదు. తాజాగా గురువారం(సెప్టెంబర్‌ 5) రాత్రి  ఓ తోడేలు పదేళ్ల బాలుడిపై దాడి చేసింది. కొత్వాలీ ప్రాంతంలో ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిపై తోడేలు విరుచుకుపడింది. ఈ దాడిలో బాలుడి ముఖంపై గాయాలయ్యాయి. 

తోడేళ్ల వరుస దాడులతో భయం గుప్పిట్లో బతుకుతున్న బహ్రెయిచ్‌ దాని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తాజా దాడితో మరింత భయాందోళనలకు గురవుతున్నారు. బహ్రెయిచ్‌లో ఇప్పటివరకు జరిగిన తోడేళ్ల దాడుల్లో 8 మంది దాకా మరణించగా 35 మంది గాయప డ్డట్లు తెలుస్తోంది . తోడేళ్ల దాడులను ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం విపత్తుగా ప్రకటించింది. 

తోడేళ్లు కనిపిస్తే కాల్చేయడానికి షూటర్లను రంగంలోకి దింపింది. అయితే వాటి పిల్లలపై దాడి చేసినప్పుడు, అవి ఏర్పరుచుకున్న ఆశ్రయాలను ధ్వంసం చేసినపుడు మాత్రమే తోడేళ్లు ప్రతీకార దాడులకు దిగుతాయని నిపుణులు చెబుతున్నారు. 

బహ్రెయిచ్‌లో తోడేళ్లు మనుషులపై వరుస దాడులకు దిగడానికి ఇదే కారణమయి ఉండొచ్చని వారు అనుమానిస్తున్నారు. సాధారణ పరిస్థితుల్లో అయితే తోడేళ్లది దాడికి పాల్పడే స్వభావం కాదని నిపుణులు చెబుతుండడం గమనార్హం. 

ఇదీచదవండి.. రక్తం మరిగిన తోడేళ్లు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement