
ఛత్తీస్‌గఢ్: బీజాపూర్ సరిహద్దుల్లో ప్రాంతాల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. సోమవారం భద్రతా బలగాలు- మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇప్పటికే 11 మంది మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయినట్లు సమాచారం.
దేశంలో మావోయిస్టులను 2026 మార్చి కల్లా ఏరివేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఇటీవల ప్రకటించారు. సల్వాజుడుం పేరుతో 2007లో మావోయిస్టుల ఏరివేతలో నేరుగా కేంద్రం జోక్యం చేసుకునే ప్రక్రియ.. ప్రస్తుతం ఆపరేషన్ కగార్ (ఫైనల్ మిషన్)కు చేరుకుంది.