
చత్తీస్‌గఢ్: చత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసులు, మావోయిస్టుల మధ్య చోటుచేసుకున్న ఈ ఎన్‌కౌంటర్‌లో 5 మంది మావోయిస్టులు మృతి చెందారు. నారాయణపూర్-దంతెవాడ-కొండగావ్ అంతర్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఎన్‌కౌంటర్ ఘటన జరిగింది.
ఈస్ట్ బస్తర్ డివిజన్ పరిధిలోని గోబెల్ ప్రాంతంలోని ముంగేడి గ్రామంలో మావోయిస్టులుపై అంతర్ జిల్లా ఉమ్మడి ఆపరేషన్‌ను పోలీసులు, జవాన్లు సంయూక్తంగా నిర్వహించారు. ఆపరేషన్‌లో యూనిఫారం ధరించిన ఐదుగురు మావోయిస్టులు ఆయుధాలతో సహా మృతి చెందారు.
పెద్ద సంఖ్యలో మావోయిస్టులకు గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో నారాయణపూర్ డీఆర్‌జీకి చెందిన ముగ్గురు జవాన్లకు గాయాలు అయినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment