
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు చావుదెబ్బ తగిలింది. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో 30 మంది నక్సలైట్లు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ-నారాయణ్‌పుర్ సరిహద్దులో ఎన్‌కౌంటర్ జరిగింది.
దంతెవాడ, నారాయణ్‌పుర్ పోలీసుల సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఘటనా స్థలం నుంచి మృతి చెందిన 30 మంది మావోయిస్టుల మృత దేహాలతోపాటు, భారీ సంఖ్యలో ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని పోలీసు అధికారులు పేర్కొన్నారు.
ఒకే రోజు 30 మంది మావోయిస్టులు మృతి చెందటం మావోయిస్టులు పార్టీకి అతి పెద్ద ఎదురు దెబ్బ. ఈ ఏడాది ఇది ఐదో పెద్ద ఎన్ కౌంటర్ కావటం గమనార్హం. గడిచిన 10 నెలల వ్యవధిలో జరిగిన వరుస ఎన్‌కౌంటర్లలో 225 మంది మావోయిస్టులు మృతి చెందారు.ఈ వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టు పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తాజా ఎన్‌కౌంటర్ నేపథ్యంలో కేంద్ర మావోయిస్టు పార్టీ అత్యవసరంగా సమావేశమైనట్లు సమాచారం. ఎన్‌కౌంటర్ తీరుపై కేంద్ర పార్టీ నేతలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
చదవండి: కాంగ్రెస్ యువతను చీకటి ప్రపంచంలోకి నెడుతోంది: అమిత్ షా
Comments
Please login to add a commentAdd a comment