కలిమెల సమితిలో దారుణం | One were arrested woman assaulting case Orissa | Sakshi
Sakshi News home page

కలిమెల సమితిలో దారుణం

Feb 22 2025 7:45 AM | Updated on Feb 22 2025 7:45 AM

One were arrested woman assaulting case Orissa

మల్కన్‌గిరి(భువనేశ్వర్‌): మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి గుముకా పంచాయతీలో దారుణం జరిగింది. ఓ మహిళపై ఆత్యాచారం చేసి అనంతరం ఆమెను హత్య చేశాడో మృగాడు. వివరాల్లోకి వెళితే.. గుముకా గ్రామంలో సీంగే మడ్కమి (30) అనే మహిళ నివసిస్తుంది. ఆమె భర్త మాల్ల మడ్కమి వలస కూలీగా ఆంధ్రాలో పని చేస్తున్నాడు. 

వీరి తొమ్మిదేళ్ల కుమారుడు వెంకటాపల్లేం ఆశ్రమ పాఠశాలలో ఉంటూ చదువుకుంటున్నారు. సీంగే పొలం పనులు చేసుకుంటూ ఒక్కర్తే ఉంటుంది. సీంగే ఓంటరిగా ఉంటున్నట్టు తెలుసుకున్న పుల్లిమేట్ల గ్రామానికి చెందిన ముక్క పడియామి గురువారం సాయంత్రం ఆమె ఇంట్లోకి చొరబడి ఆత్యాచారం జరిపి అనంతరం చంపేశాడు. సీంగే కేకలు విన్న స్థానికులు ఇంటి తలుపులు తెరచి చూడగా నిందితుడు పారిపోతుండగా పట్టుకొని చెట్టుకు కట్టి దేహశుద్ధి చేశారు. 

అనంతరం కలిమెల పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసు ఐఐసీ చంద్రకాంత్‌ తండ వచ్చి నిందితుడ్ని అరెస్టు చేశారు. అయితే స్థానికులు కొట్టడంతో తీవ్రంగా గాయపడడంతో అతన్ని కలిమెల ఆరోగ్యకేంద్రానికి చికిత్స నిమిత్తం తరలించారు. కాగా సీంగే మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు భర్తకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసు అధికారులు చెప్పారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement