
బారిపడా: ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో దారుణం జరిగింది. 40 ఏళ్ల వ్యక్తి 'గుట్కా' కొనడానికి తన తండ్రిని రూ.10 అడిగాడు. ఇవ్వడానికి నిరాకరించిన తండ్రిని తల నరికి చంపేశాడు. నిందితుడు.. తండ్రి తలను చందువా పోలీస్ స్టేషన్‌కు తీసుకుని వచ్చి లొంగిపోయాడు. మృతి చెందిన వ్యక్తిని బైధర్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు.
తల్లిదండ్రులు, నిందితుడికి మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకోగా, తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి తండ్రిని దారుణంగా హత్య చేశాడు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన అతని తల్లి అక్కడి నుంచి పారిపోయింది. పోలీస్ అధికారి మాట్లాడుతూ చిన్న సమస్య హత్యకు దాని తీసిందని తెలిపారు. పోలీసులు ఫోరెన్సిక్ బృందంతో కలిసి గ్రామానికి చేరుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment