![AP Man Searches In YouTube On How To Do This](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/14/mobilesarching3.jpg.webp?itok=4id2OT05)
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఎన్టీఆర్ జిల్లాలో దారుణం జరిగింది. వ్యసనాలకు బానిసైన కొడుకు.. యూట్యూబ్‌లో వీడియో చూసి తండ్రి హత్యకు స్కెచ్ వేశాడు. అనుమానం రాకుండా భూ తగాదాలో ప్రత్యర్థులు హతమార్చినట్లు డ్రామాలాడాడు. పోలీసుల విచారణతో మర్డర్ మిస్టరీ వీడింది. ఈ నెల 8వ తేదీన మైలవరం మండలం మెర్సుపల్లి వద్ద వక్తి మృతదేహం లభ్యం కాగా, మృతుడు ములకలపెం గ్రామానికి చెందిన కడియం శ్రీనివాసరావుగా పోలీసులు గుర్తించారు.
వ్యవసనాలకు బానిసై తండ్రి శ్రీనివాసరావును హతమార్చిన కొడుకు పుల్లారావు.. పేకాట, ఆన్ లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్‌లలో డబ్బు పోగొట్టుకున్నాడు. గతంలో పుల్లారావు చేసిన నాలుగు లక్షల అప్పును తండ్రి శ్రీనివాసరావు తీర్చాడు. వ్యసనాలకు బానిసై అప్పుల పాలైన కొడుకు పుల్లారావును పలుమార్లు తండ్రి మందలించాడు. దీంతో తండ్రిని చంపేందుకు పుల్లారావు స్కెచ్ వేశాడు.
యూట్యూబ్‌లో సీరియల్ కిల్లర్ మర్డర్ వీడియోలు చూసిన పుల్లారావు.. ఒకే దెబ్బతో ఎలా మనిషి ప్రాణం తీయొచ్చు అని యూట్యూబ్‌లో సెర్చ్ చేశాడు. పథకం ప్రకారం ఈనెల 8వ తేదీన పొలంలో ఉన్న తండ్రిని కర్రతో కొట్టి చంపేశాడు. తన తండ్రి మృతిపై అనుమానాలున్నాయంటూ డ్రామాకు తెరతీసిన మృతుడి కుమారుడు పుల్లారావు.. కేసు తనపైకి రాకుండా ఉండేందుకు గ్రామస్తులతో కలిపి నిరసనలు చేపట్టాడు. పోలీసుల విచారణలో పుల్లారావే హంతకుడని నిర్థారణ కావడంతో నిందితుడిని మైలవరం పోలీసులు అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment