కిల్లర్‌గా ఎలా మారాడంటే..
బనశంకరి: ఐటీ నగరంలో వయ్యాలికావల్ మునేశ్వరనగరలో మహాలక్ష్మీ (29) అనే నేపాలీ యువతిని హత్య చేసి, ఖండాలుగా నరికి ఫ్రిజ్‌లో కుక్కి పారిపోయిన హంతకుడు ముక్తిరంజన్ రాయ్ కూడా కడతేరిపోయాడు. అతడు ఒడిశాలో ఆత్మహత్య చేసుకున్నాడు. హత్యకు కారణాలను డెత్‌నోట్‌లో రాశాడు.
ఈ నెల 3వ తేదీన ప్రేయసి మహాలక్ష్మీని హత్యచేశానని అందులో తెలిపాడు. ఆమె ఇంటికి వెళ్లాను, వ్యక్తిగత విషయాలతో గొడవ జరిగింది, ఆమె నాపై దాడి చేసింది. సహనం కోల్పోయి ఆమెను హత్య చేశానని రాశాడు. శరీరాన్ని 59 ముక్కలు చేసి ఫ్రిజ్‌లో పెట్టాను. ఆమె ప్రవర్తనతో విరక్తిచెంది ఈ దారుణానికి పాల్పడ్డానని తెలిపాడు. ముందుగా ఆమెను గొంతు పిసికి చంపాను, తరువాత బాత్‌రూమ్‌లో ఆమె శరీరాన్ని హ్యాక్‌సా బ్లేడుతో ముక్కలుముక్కలుగా చేశాను. ఆపై ఫ్రిజ్‌లో పెట్టాను. బాత్‌రూమ్‌లో యాసిడ్ పోసి శుభ్రం చేశానని డెత్‌నోట్‌లో రాశాడు.
సొంతూరికి వెళ్లి ఆత్మహత్య
20 రోజులుగా మృతదేహం ఫ్రిజ్‌లో ఉండిపోయింది. నాలుగు రోజుల కిందట యువతి హత్య వెలుగులోకి వచ్చింది. ముక్తిరంజన్ రాయ్‌తో ఎక్కువసార్లు మాట్లాడినట్లు కాల్ డేటాలో తేలింది. ఇద్దరూ ఒకే మాల్‌లో పనిచేసేవారు. అలా ప్రేమాయణం ప్రారంభించారు. హత్య తరువాత దుండగుడు 23వ తేదీ ఒడిశాలో సొంతూరైన పండి గ్రామానికి వెళ్లిపోయాడు. ఇంట్లో గడిపి మరుసటి రోజు స్కూటర్, ల్యాప్‌టాప్ తీసుకుని సమీప శ్మశానానికి వెళ్లాడు. చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment