mahalakshmi
-
మహాలక్ష్మి నన్ను కొట్టింది!.. అందుకే ముక్కలు చేశా
బనశంకరి: ఐటీ నగరంలో వయ్యాలికావల్ మునేశ్వరనగరలో మహాలక్ష్మీ (29) అనే నేపాలీ యువతిని హత్య చేసి, ఖండాలుగా నరికి ఫ్రిజ్‌లో కుక్కి పారిపోయిన హంతకుడు ముక్తిరంజన్ రాయ్ కూడా కడతేరిపోయాడు. అతడు ఒడిశాలో ఆత్మహత్య చేసుకున్నాడు. హత్యకు కారణాలను డెత్‌నోట్‌లో రాశాడు. ఈ నెల 3వ తేదీన ప్రేయసి మహాలక్ష్మీని హత్యచేశానని అందులో తెలిపాడు. ఆమె ఇంటికి వెళ్లాను, వ్యక్తిగత విషయాలతో గొడవ జరిగింది, ఆమె నాపై దాడి చేసింది. సహనం కోల్పోయి ఆమెను హత్య చేశానని రాశాడు. శరీరాన్ని 59 ముక్కలు చేసి ఫ్రిజ్‌లో పెట్టాను. ఆమె ప్రవర్తనతో విరక్తిచెంది ఈ దారుణానికి పాల్పడ్డానని తెలిపాడు. ముందుగా ఆమెను గొంతు పిసికి చంపాను, తరువాత బాత్రూమ్లో ఆమె శరీరాన్ని హ్యాక్సా బ్లేడుతో ముక్కలుముక్కలుగా చేశాను. ఆపై ఫ్రిజ్‌లో పెట్టాను. బాత్రూమ్లో యాసిడ్ పోసి శుభ్రం చేశానని డెత్‌నోట్‌లో రాశాడు.సొంతూరికి వెళ్లి ఆత్మహత్య20 రోజులుగా మృతదేహం ఫ్రిజ్‌లో ఉండిపోయింది. నాలుగు రోజుల కిందట యువతి హత్య వెలుగులోకి వచ్చింది. ముక్తిరంజన్ రాయ్‌తో ఎక్కువసార్లు మాట్లాడినట్లు కాల్ డేటాలో తేలింది. ఇద్దరూ ఒకే మాల్లో పనిచేసేవారు. అలా ప్రేమాయణం ప్రారంభించారు. హత్య తరువాత దుండగుడు 23వ తేదీ ఒడిశాలో సొంతూరైన పండి గ్రామానికి వెళ్లిపోయాడు. ఇంట్లో గడిపి మరుసటి రోజు స్కూటర్, ల్యాప్‌టాప్ తీసుకుని సమీప శ్మశానానికి వెళ్లాడు. చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. -
మహాలక్ష్మి కేసులో షాకింగ్ ట్విస్ట్
భువనేశ్వర్: బెంగళూరులో సంచలనం సృష్టించిన మహలక్ష్మి హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసు నిందితుడు ముక్తి రంజన్ రాయ్ అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. ఒడిషాలోని తన సొంత ఊరికి పారిపోయిన అతను.. ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. బెంగళూరులో మహాలక్ష్మి అనే మహిళను చంపి ముక్కలుగా నరికి ఫ్రిడ్జిలో దాచిన ఉదంతం గురించి తెలిసిందే. ఈ కేసులో ముక్తీ రంజన్ రాయ్‌ను తొలి నుంచి అనుమానిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలో భద్రక్(ఒడిషా) జిల్లా పాండి గ్రామానికి పారిపోయిన రాయ్.. సమీపంలోని కూలేపాడు గ్రామానికి వెళ్లి ఓ చెట్టుకు ఉరేసుకున్నాడు. ఘటనా స్థలంలో ఓ స్కూటీ, అందులో నోట్ బుక్ ఉన్నాయని ఒడిషా పోలీసులు చెబుతున్నారు. అందులో మహాలక్ష్మిని తానే చంపానని, ఆ బాధతోనే బలవనర్మణానికి పాల్పడుతున్నట్లు ముక్తి రంజన్ రాయ్ రాసినట్లు నోట్ దొరికిందని తెలిపారు. అయితే.. బెంగళూరు పోలీసులు దీనిని ధృవీకరించుకోవాల్సి ఉంది. గత శనివారం ఫ్రిజ్‌లో ఉన్న శవం వాసన రావడంతో అసలు విషయం బయటపడింది. అయితే చాలా తొందరగానే బెంగళూరు పోలీసులు ఈ కేసును చేధించగలిగారు. సెప్టెంబర్ 1 నుంచి మహాలక్ష్మి మాల్‌కు వెళ్లడం లేదు. అదే రోజు నుంచి ముక్తి కూడా పనికి వెళ్లలేదు. బహుశా హత్య సెప్టెంబర్2వ తేదీనే జరిగి ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. మహాలక్ష్మి(26) బెంగళూరులోని ఓ మాల్లో పని చేస్తోంది. భర్త నుంచి ఆమె దూరంగా ఉంది. ఈ క్రమంలో మాల్లోనే పని చేస్తున్న ముక్తి రంజన్‌కు దగ్గరైంది. అయితే గత కొంతకాలంగా మహాలక్ష్మి.. మరో వ్యక్తితో చనువుగా ఉంటోందని భర్త హేమంత్ దాస్ పోలీసులకు తెలిపాడు. ఈ క్రమంలోనే ప్రియురాలిపై కోపం పెంచుకున్న ముక్తి రంజన్.. ఆమెను కిరాతకంగా హత్య చేసి ఉంటాడని బెంగళూరు పోలీసులు భావిస్తున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
అత్త ఇంటికి అల్లుడు నిప్పు
మైసూరు: భార్యను తన వెంట పంపించడం లేదనే కోపంతో అత్త ఇంటికి నిప్పు పెట్టాడో అల్లుడు. ఈ సంఘటన తాలూకాలోని అరసనకెరె గ్రామంలో జరిగింది. మంగళగౌరి అనే యువతికి టీ.కాటూరు నివాసి శ్రీనివాస్‌తో వివాహమైంది. పూల వ్యాపారం సాగించే శ్రీనివాస్ భార్యతో గొడవ పడడంతో ఆమె పుట్టినింటికి వెళ్లిపోయింది. అత్తమామలే తన భార్యను పంపించడం లేదని పగ పెంచుకున్నాడు. అత్త ఇంటికి వెళ్లి తలుపు సందులో నుంచి పెట్రోలు పోసి నిప్పంటించి పరారయ్యాడు. ఇంటిలో మంటలు వ్యాపించి అక్కడ ఉన్న సుమారు రూ.20 వేల విలువ చేసే వస్తువులు కాలిబూడిదయ్యాయి. ఈ ఘటనపై జయపుర పోలీసులు కేసు నమోదు చేశారు. -
వాడొక శాడిస్టు!
బనశంకరి: వయ్యాలికావల్ మునేశ్వరబ్లాక్‌లో మహాలక్ష్మీ (29) హత్య కేసుకు సంబంధించి వైద్య బృందం శవపరీక్ష నివేదికను విచారణ అధికారులకు అందజేశారు. మరోపక్క వయ్యాలి కావల్ పోలీసులు కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. ఘటనా స్థలంలో తనిఖీల్లో ఫ్రిడ్జ్‌పై వేలిముద్రల ఆచూకీ లభించినట్లు తెలిసింది. దీనిపై ఎఫ్ఎస్ఎల్ నిపుణులు నుంచి పోలీసులు సమాచారం సేకరించారు. మహాలక్ష్మీ హత్య వెనుక హంతకుడు ఒక్కరేనా లేక ఇద్దరా అనే దానిపై అనుమానం వ్యక్తమైంది. హంతకుడిని శాడిస్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి అనుమానిత హంతకుడి సోదరుడిని పిలిపించి సుమారు 2 గంటల పాటు విచారణ చేపట్టిన పోలీసులు సమాచారం రాబట్టారు. హతురాలు మహలక్ష్మీ అనుమానిత హంతకుడు ఒకేచోట పనిచేసేవారు. మల్లేశ్వరంలోని వస్త్రదుకాణంలో ఇద్దరు పనిచేసేవారు. పలు కారణాలతో హంతకుడు ఆరునెలలు క్రితం విడిచిపెట్టాడు. దీంతో అప్పటి నుంచి మహలక్ష్మీ అతని నుంచి దూరంగా ఉండటంతో అతనిలో పగ రగిలింది. ఆ కారణంగానే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది.హంతకుడిలో వికృత ప్రవృత్తి :మహలక్ష్మీ హంతకుడు సడోమాసోకిస్ట్ తరహా ఉన్నారని అతడిని త్వరలో అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు తెలిపారు. హంతకుడు మహిళ దేహాన్ని 30 ముక్కలుగా కోసి ప్రిజ్‌లో భద్రపరచాడు. హంతకుడిలో శాడిస్టు ప్రవృత్తి ఉన్నట్లు వైద్య నిపుణులు గుర్తించారు. -
మహాలక్ష్మి హత్య కేసులో నిందితుడిని పట్టుకుంటాం
దొడ్డబళ్లాపురం: బెంగళూరు వయ్యాలికావల్‌లోని బసప్ప గార్డెన్లో జరిగిన మహాలక్ష్మి హత్య కేసులో కీలక సమాచారం లభించిందని, త్వరలో నిందితుడిని అరెస్టు చేస్తామని హోంమంత్రి జీ పరమేశ్వర్ తెలిపారు. సోమవారం ఇందుకు సంబంధించి మీడియాతో మాట్లాడిన ఆయన ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో ఉన్నందున ఎటువంటి సమాచారం ఇవ్వలేనన్నారు. నిందితులు ఎంతమంది అనేది స్పష్టత రాలేదని అయితే త్వరలో అరెస్టు చేస్తామన్నారు. మరోవైపు పోలీసులు ఆరు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.వాసవి దేవాలయం క్యాషియర్ ఇంట్లో చోరీవాసవి దేవాలయం క్యాషియర్ ఇంట్లో చోరీ జరిగిన సంఘటన మాగడి పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణంలోని వాసవి దేవాలయం ఖజాంచి అయిన వేణుగోపాల్ ఇంట్లో చోరీ జరిగింది. వేణుగోపాల్ ఆదివారం ఆర్యవైశ్య సంఘం కార్యక్రమం నిమిత్తం చెన్నపట్టణకు కుటుంబ సమేతంగా వెళ్లారు. ఆ రోజు రాత్రి ఇంట్లో జొరబడ్డ దొంగలు దేవాలయానికి సంబంధించిన 4 కేజీల బంగారు, వెండి ఆభరణాలు దోచుకున్నారు. వేణుగోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాగడి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
యువతిని 30 ముక్కలుగా నరికి..
దొడ్డబళ్లాపురం: ఓ యువతిని చంపి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిన భయానక ఘటన బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. వయ్యాలికావల్ పోలీస్‌స్టేషన్ పరిధి మల్లేశ్వరంలోని ఓ ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో శనివారం స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి సోదా చేయగా ఫ్రిజ్‌లో కుక్కిన మహిళ శరీర భాగాలు 30కి పైగా బయటపడ్డాయి. వారం క్రితం ఈ దారుణం చోటుచేసుకున్నట్లు భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన మహాలక్ష్మి (29)అనే బాధితురాలు కర్ణాటకలో కొంతకాలంగా ఉంటున్నారని ఏసీపీ సతీశ్ కుమార్ చెప్పారు. సింగిల్ బెడ్ రూం ఇంట్లో ఆమె ఒక్కతే ఉంటున్నారని తెలిపారు. ఆమె వివరాలను సేకరించామని, అయితే ఇప్పుడే వాటిని బయటపెట్టలేమని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. పరిచయమున్న వారే దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానాలున్నాయి. ఇలా ఉండగా, మహాలక్ష్మి హత్యకు గురైన విషయం తెలిసిన ఆమె భర్త కూడా అక్కడికి చేరుకున్నాడు. మహాలక్ష్మి మాల్లో పని చేస్తుండగా, అతడు బెంగళూరుకు సమీపంలోని ఆశ్రమంలో ఉద్యోగి అని సమాచారం. -
అర్ధరాత్రి భర్త చేసిన పనికి బుల్లితెర నటి ఎమోషనల్..!
కోలీవుడ్ ప్రముఖ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తుంటారు. గతేడాది నటి మహాలక్ష్మి శంకర్‌ను ఆయన పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో తరచుగా వార్తల్లొ నిలిచారు. వీరిద్దరి పెళ్లి తర్వాత ఓ కేసులో అరెస్ట్ అయిన రవీందర్ ఇటీవలే బెయిల్‌పై రిలీజై వచ్చారు కూడా. ఆ తర్వాత తమిళ బిగ్‌బాస్ సీజన్‌పై రివ్యూలు ఇస్తూ అభిమానులను అలరించారు. తాజాగా ఈ జంట మరోసారి వార్తల్లో నిలిచింది. ఇవాళ రవీందర్ భార్య మహాలక్ష్మి పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు సర్ప్రైజ్ ఇచ్చాడు. అర్ధరాత్రి కేక్ తీసుకొచ్చి భార్య బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను మహాలక్ష్మి తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. అంతే ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. మహాలక్ష్మి తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఈ పుట్టినరోజు తీవ్ర భావోద్వేగాలతో నిండిపోయింది. నా భర్త అర్ధరాత్రి నన్ను నిద్రలేపి కేక్‌తో సర్ప్రైజ్ ఇచ్చారు. అతన్ని భర్తగా కలిగి ఉండటం చాలా అదృష్టంగా భావిస్తున్నా. మా అమ్మ, సోదరుడు నన్ను మానసిక వికలాంగుల కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ పిల్లలకు అన్న దానం చేశాం. ఇది నా గుండెకు హత్తుకునే అనుభవం. ముఖ్యంగా మా అమ్మ, చిన్న సోదరుడు చోటేకి ధన్యవాదాలు. మా నాన్న బంగ్లాదేశ్ నుంచి విష్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చారు. అన్ని సమయాల్లో అండగా నిలిచిన మామయ్యకు ధన్యవాదాలు. ఈ రోజు నా జీవితంలో ఎల్లప్పుడూ ప్రత్యేకమైంది. మీ అందరు నా చుట్టూ ఉన్నందుకు సంతోషంగా ఉన్నా. ఈ రోజున శుభాకాంక్షలు తెలిపేందుకు సమయాన్ని వెచ్చించినందుకు నా కుటుంబం, స్నేహితులందరికీ, నన్ను ప్రేమించే వారికి కృతజ్ఞతలు' అంటూ మహాలక్ష్మి పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు మహాలక్ష్మికి బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అయితే తన పుట్టినరోజు సందర్భంగా నటి మహాలక్ష్మి కీలక నిర్ణయం తీసుకున్నారు. అవయవదానానికి ఆమె ముందుకొచ్చారు. నేను చనిపోయాక కూడా నా ఆర్గాన్ ఇతరుల రూపంలో బతికే ఉంటాయని ఆమె తెలిపారు. నేను ఒక అవయవ దాతగా మారి ఇతరుల జీవితాల్లో వెలుగులు తీసుకురాగలననే నమ్మకంతో ప్రేరణ పొందినట్లు వెల్లడించారు. నా నిర్ణయంతో అవసరమైన వారికి మంచి జరుగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Pephands (@pephands_org) View this post on Instagram A post shared by Mahalakshmi Shankar (@mahalakshmi_actress_official) View this post on Instagram A post shared by Mahalakshmi Shankar (@mahalakshmi_actress_official) -
మహాలక్ష్మి సిటీ బస్సులు ప్రారంభం..!
-
మహాలక్ష్మి స్కీమ్ తో మహిళలకు అవస్థలు.. సజ్జనార్ క్లారిటీ
-
మహాలక్ష్మీ స్కీమ్, కొత్త బస్సులపై సజ్జనార్ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మహాలక్ష్మి స్కీమ్, కొత్త ఆర్టీసీ బస్సుల గురించి టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే 2,375 కొత్త బస్సులు తీసుకుంటున్నట్టు తెలిపారు. అలాగే, మహాలక్ష్మీ స్కీమ్ ద్వారా 12కోట్లకుపైగా మహిళలు బస్సుల్లో ప్రయాణించినట్టు సజ్జనార్ చెప్పుకొచ్చారు. కాగా, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఈరోజు నాంపల్లిలోని తెలుగు వర్సిటీలో బ్లైండ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ లూయిస్ బ్రెయిలీ 215వ జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా పాల్గొని క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చరిత్రాత్మక నిర్ణయం. తెలంగాణలో 45 రోజుల్లో 12కోట్లకు పైగా మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారని అన్నారు. ఇదే సమయంలో సజ్జనార్..‘ఉచిత ప్రయాణం కారణంగా వికలాంగులకు కేటాయించిన సీట్లలో కూడా మహిళలు కూర్చుంటున్నారు. ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు నా దృష్టికి వచ్చాయి. త్వరలో 2,375 కొత్త బస్సులు తీసుకుంటున్నాం. అప్పుడు కొంత వెసులుబాటు కలుగుతుంది. అవసరమైతే వికలాంగుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసే విధంగా ఆర్టీసీ యాజమాన్యం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. అనౌన్స్మెంట్, ఎంక్వయిరీ రూమ్ ఉద్యోగాల్లో అంధులకు అవకాశం కల్పిస్తాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
మరోసారి తెరపైకి నిర్మాత రవీందర్.. ఈసారి ఏకంగా ఆక్సిజన్‌తో!
కోలీవుడ్ ప్రముఖ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తుంటారు. గతేడాది నటి మహాలక్ష్మి శంకర్‌ను ఆయన పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో తరచుగా వార్తల్లొ నిలిచారు. పెళ్లి తర్వాత ఓ కేసులో అరెస్ట్ అయిన రవీందర్ ఇటీవలే బెయిల్‌పై రిలీజ్ అయ్యారు. అయితే ప్రస్తుతం జైలు నుంచి విడుదలైన రవీందర్ యూట్యూబ్‌లో వీడియోలు చేస్తున్నారు. తమిళ బిగ్‌బాస్ సీజన్‌పై రివ్యూలు ఇస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఆయన యూట్యూబ్‌లో వీడియో చూస్తే అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. తాజా వీడియోలో ఏకంగా ఆక్సిజన్ ట్యూబ్ పెట్టుకుని మరీ కనిపించారు. అంతే కాకుండా అనారోగ్యంతోనే బిగ్‌బాస్ ఎపిసోడ్‌పై తన రివ్యూ ఇచ్చారు. ఇది చూసిన అభిమానులు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ మీ పట్టుదల సూపర్ సార్ అంటూ కామెంట్స్ చేశారు. మరికొందరేమో ముందు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి సార్.. బిగ్‌బాస్ రివ్యూలు ఎప్పుడైన ఇవ్వొచ్చు అంటూ సలహాలు ఇస్తున్నారు. అయితే మొహానికి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకోవడంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని వెల్లడించారు. వారం రోజులుగా ఐసీయూలో చికిత్స తీసుకున్నట్లు రవీందర్ పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు నెటిజన్స్ ఆరోగ్యం సహకరించనప్పుడు వీడియోలు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. కాగా.. లిబ్రా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆయన పలు సినిమాలు నిర్మించిన రవీందర్ కోలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత బుల్లితెర నటి మహాలక్ష్మితో అతని వివాహం జరిగింది. దీంతో మీడియా, అభిమానుల దృష్టిని వారు ఆకర్షించారు. -
TSRTC: వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం: సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. దీంతో, బస్సుల్లో విపరీతంగా రద్దీ పెరిగిపోయింది. అవసరం లేకున్నా కొందరు బస్సుల్లో ప్రయాణించడంతో ఫుట్‌బోర్డుపై వేలాడుతూ ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో ప్రయాణికులకు జాగ్రత్తలు చెప్పిన ఓ మహిళా కండక్టర్‌ను కొందరు మహిళలు దూషించడంతో ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. అంతటితో ఆగకుండా ఆమెను బస్సు నుంచి దింపేశారు. ఇక, ఈ ఘటనను ఆర్టీసీ యాజమాన్యం సీరియస్‌గా తీసుకుంది. దీనిపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రయాణికులకు వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటనపై సజ్జనార్ స్పందిస్తూ..‘టీఎస్ఆర్టీకి సిబ్బంది వెన్నుముక. వారు అనునిత్యం నిబద్దతతో విధులు నిర్వర్తిస్తూ ప్రతి రోజు లక్షలాది ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. సిబ్బంది కృషి వల్లనే సంస్థ మనగలుగుతుంది. మహాలక్ష్మి స్కీమ్ అమలులోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. సంస్థకు బ్రాండ్ అంబాసిడర్లైనా సిబ్బందిని కొందరు దూషించడం, దాడులు చేయడం సరికాదు. ఇలాంటి ఘటనలకు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం సహించదు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే మా అధికారులు ఈ ఘటనలపై పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆర్టీసీ సిబ్బందికి ప్రయాణికులు సహకరించాలి. క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సహకరించాలని కోరుతున్నాం అని అన్నారు. #TSRTC కి సిబ్బంది వెన్నుముక. వారు అనునిత్యం నిబద్దతతో విధులు నిర్వర్తిస్తూ ప్రతి రోజు లక్షలాది ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. సిబ్బంది కృషి వల్లనే సంస్థ మనగలుగుతుంది. మహాలక్ష్మి స్కీమ్ అమలులోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. సంస్థకు బ్రాండ్… pic.twitter.com/4PIOXQmAAX — V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 28, 2023 -
జీరో టికెట్‌పై కండక్టర్ల కన్నింగ్ ప్లాన్.. చర్యలకు TSRTC రెడీ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జీరో టికెట్ విషయంతో కొందరు కండక్టర్లు అత్యుత్యాహం చూపిస్తున్నారు. ఎక్కువ మందిని తీసుకెళ్తున్నామని చూపించుకోవడానికి లెక్కలు పెంచుతూ ఇష్టారీతిన టికెట్స్ కొడుతున్నారు. ఈ విషయం ఆర్టీసీ అధికారులు దృష్టికి చేరడంలో దీనిపై యాజమాన్యం చర్యలకు సిద్ధమైంది. వివరాల ప్రకారం.. కేపీహెచ్బీలో ఓ ప్రయాణికురాలు బస్సు ఎక్కారు. ఆధార్‌కార్డు చూపించి టికెట్ ఎస్ఆర్ నగర్ వరకూ టికెట్ ఇవ్వమని కోరారు. అయితే, బస్సు కండక్టర్ మాత్రం ఆమెకు.. కోఠి వరకూ జీరో టికెట్ ఇచ్చారు. దీంతో, టికెట్‌పై అదేంటని ప్రయాణికురాలు ప్రశ్నించగా.. మీరేమీ డబ్బులు ఇవ్వలేదు కదా? అని అన్నాడు. అదే బస్సుల్లో సదరు కండక్టర్ మరొకరికి కూడా ఇలాగే టికెట్ ఇచ్చినట్టు తేలింది. కాగా, విషయాన్ని సదరు ప్రయాణికులు అధికారులు దృష్టికి తీసుకువెళ్లారు. ఇలాంటి ఫిర్యాదులు గ్రేటర్‌జోన్ అధికారుల దృష్టికి వెళ్లాయి. దీంతో, యాజమాన్యం చర్యలకు సిద్ధమైంది. అయినా కండక్టర్లలో మార్పు రావడంలేదు. అయితే.. అంతకుముందు నుంచి కూడా 2850 బస్సులులే ఉండగా.. ప్రయాణికులు మాత్రం రెట్టింపు అయ్యారు. గతంలో 11లక్షల మంది ప్రయాణిస్తే.. ప్రస్తుతం ఆ సంఖ్య 18లక్షలకు చేరింది. ఉదయం, సాయంత్రం బస్సులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. సీట్లు 60శాతం మహిళలతో నిండిపోతున్నాయి. 43 సీట్ల మెట్రో ఎక్స్‌ప్రెస్, 45 సీట్ల ఆర్డినరీ బస్సుల్లో వందమంది వరకూ ప్రయాణిస్తున్నారు. ఎంత పెరిగినా 2850 బస్సుల్లో 18లక్షల మంది ఎలా అవుతారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎక్కువమంది ప్రయాణికుల్ని తీసుకెళ్తే డ్రైవర్, కండక్టర్లకు యాజమాన్యం నజరానాలు ప్రకటించింది. అందుకే కొంతమంది జీరో టిక్కెట్లు జారీ చేసి లెక్కలు పెంచుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్ల చేతివాటం! 100 శాతం ఆక్యుపెన్సీ రేషియో పెంచడం కోసం మహిళా ప్రయాణికులు ఎక్కిన దాని కన్నా ఎక్కువ జీరో టిక్కెట్లు కొడుతున్న ఆర్టీసీ కండక్టర్లు. ఉత్తి పుణ్యానికి జీరో టిక్కెట్లు కొడుతూ ప్రభుత్వం ధనం వృధా చేస్తున్న కండక్టర్లు. మహబూబ్ నగర్ నుండి తాండూరు… pic.twitter.com/Ht6fnPZP4q — Telugu Scribe (@TeluguScribe) December 24, 2023 ఇటీవల ఓ పల్లెవెలుగులో కండక్టర్ కూడా ఇలాగే చేసినట్టు ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ప్రయాణికులు బస్సు ఎక్కకపోయినా కండక్టర్ జీరో టికెట్ కొడుతున్నారని సదరు ప్రయాణికుడు ఆరోపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
ఫ్రీ జర్నీ.. తెలంగాణ మహిళలకు అలర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళలకు అలర్ట్. నవంబర్ 15 అంటే రేపు శుక్రవారం నుంచి ప్రయాణాల్లో ఆధార్ సహా ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాల్సిందే. కండక్టర్లకు ఆ కార్డుల్ని చూపించడంతో పాటు.. జీరో టికెట్ తీసుకోవాల్సిందేనని టీఎస్ఆర్టీసీ మహిళా ప్రయాణికులకు సూచించింది. ఉదయం నుంచి ఈ నిబంధన అమలు అవుతుందని తెలిపింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఒకటైన మహాలక్ష్మి పథకంలో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లకు ఉచిత ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తోంది. డిసెంబర్ 9న ఈ స్కీమ్ ప్రారంభం అయ్యింది. అయితే తొలివారం గుర్తింపు కార్డు అక్కర్లేకుండానే ప్రయాణించే వెసులుబాటు కల్పించింది. ఆ తర్వాత మాత్రం ఏదైనా గుర్తింపు కార్డు ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలుపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పర్యవేక్షించారు. గురువారం వర్చువల్‌గా అధికారులతో సమావేశమైన ఆయన.. కండక్టర్లు జీరో టికెట్ జారీ చేయాలని, ప్రయాణికురాలు విధిగా జీరో టికెట్ తీసుకోవాలని కోరారు. ప్రస్తుతానికి ఎలాంటి ఫిర్యాదులు లేకుండా పథకం విజయవంతంగా అమలు అవుతోందని.. అతి తక్కువ సమయంలోనే జీరో టికెట్ కోసం సాప్ట్ వేర్ ను అప్ డేట్ చేశారని అధికారుల్ని అభినందించారాయన. ‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ అమల్లో భాగంగా శుక్రవారం నుంచి మహిళలకు జీరో టికెట్లను జారీ చేస్తున్నట్లు @TSRTCHQ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు(@SajjanarVC) తెలిపారు. ప్రతి ప్రయాణికురాలు విధిగా జీరో టికెట్ ను తీసుకుని సంస్థకు సహకరించాలని ఆయన కోరారు. మహిళలకు జీరో… pic.twitter.com/XgPKGPqtpf — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 14, 2023 మహాలక్ష్మి పథకంలో భాగంగా ఫ్రీ జర్నీ స్కీమ్ కింద.. రాష్ట్రవ్యాప్తంగా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులు, సిటీలో ఆర్డీనరీ, మెట్రో బస్సుల్లో మాత్రమే ఉచితంగా ప్రయాణించే వీలు ఉంది. తెలంగాణ వాళ్లకు(గుర్తింపు కార్డు ఉండాల్సిందే) మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. -
ఆయన తగ్గలేదు.. నేనే లావెక్కుతా: మహాలక్ష్మి
తమిళ నిర్మాత, లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవీందర్ చంద్రశేఖరన్, నటి మహాలక్ష్మి వివాహం తర్వాత చాలా మంది నుంచి ట్రోల్స్ ఎదుర్కొన్నారు. చాలా రహస్యంగా పెళ్లి చేసుకున్న వారిద్దరి పెళ్లి ఫోటోలు బయటకు రావడంతో భారీగా వైరల్ అయ్యాయి. వివాహం తర్వాత రవీందర్ చాలా అవహేళనలు ఎదుర్కొన్నాడు. దీనికి ప్రధాన కారణం ఆయన మితిమీరిన బరువు ఉండటమే.. మహాలక్ష్మి మాత్రం నాజుగ్గా ఉంటుంది. దీంతో డబ్బు కోసమే రవీందర్‌ను మహాలక్ష్మి పెళ్లి చేసుకుందంటూ ఆమెను నెటిజన్లు ట్రోల్ చేశారు. ఇలా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న ఈ జంట మాత్రం లైఫ్‌ను ఆనందంగానే లీడ్ చేస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మహాలక్ష్మి తన వ్యక్తిగత జీవితం గురించి, భర్త గురించి ఓపెన్‌గా చెప్పింది. తనను ఎక్కువగా బాధపెట్టిన దాని గురించి బహిరంగంగా మాట్లాడింది. 'మా పెళ్లి సందర్భంగా చాలా మంది ట్రోల్స్ చేశారు. కానీ వాటన్నింటినీ పట్టించుకోలేదు. అలాగే నా భర్త రవీందర్ బరువు ఎక్కువగా ఉండడంతో ఆయన కోసం నేనూ బరువు పెరిగేందుకు ప్లాన్ చేస్తున్నాను. బరువు తగ్గాలని రవీందర్ ఎంత ప్రయత్నం చేసినా అది కుదరడం లేదు.. కాబట్టి నేనే ఆయన మాదిరి బరువు పెరగాలని చూస్తున్న. బరువు పెరిగేందుకు నేను అధికంగా కొవ్వు పదర్థాలు కూడా తీసుకుంటున్నాను. ఆర్ధరాత్రి సమయంలో ఎక్కువగా ఫుడ్ తింటున్నాను. ఆ సమయంలో నాకు నిద్ర కూడా పోతుంది. ఎలాగైనా నేను కూడ ఆయనలా మారాలి. అప్పుడైనా ఈ ట్రోల్స్ ఆగిపోతాయి అనుకుంటా.' అని ఆమె సంచలన నిర్ణయం తీసుకుంది. కానీ తన భర్త రవీందర్ జుట్టు నెరిసిపోవడం చాలా బాధగా ఉందని ఆ ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది. మహాలక్ష్మి నిర్ణయాన్ని మార్చుకోవాలని లేదంటే ఆరోగ్య సమస్యలు వస్తాయని తన భర్త చెప్పినా అందుకు ఆమె అంగీకరించలేదని తెలిపింది. ఏమేమైనా త్వరలో బరువు పెరగాలనే ఆలోచనతో మహాలక్ష్మి ఉంది. ప్రస్తుతం ఆమె చెప్పిన మాటలు కోలీవుడ్‌లో వైరల్ అవుతున్నాయి. మహాలక్ష్మి, రవీందర్ ఇద్దరిదీ కూడా రెండో పెళ్లినే.. ఇద్దరికీ మొదటి వివాహం నుంచి ఒక బిడ్డ ఉంది. మొదటి వివాహం ముగిసిన తర్వాత ఇద్దరూ కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు.పెళ్లి సమయంలో మహాలక్ష్మి డబ్బు కోసమే రవీందర్‌ని పెళ్లిచేసుకుందని, అతని సంపద చూసి నటి పెళ్లికి సిద్ధమైందని పలువురు చెప్పారు. అంతేకాదు మహాలక్ష్మి లాంటి అందమైన అమ్మాయిని పొందడానికి నిర్మాత రవీందర్ ఎన్నో ట్రిక్కులు వేశారని సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వచ్చాయి. అయితే ట్రోల్స్‌ను అధిగమించి మంచి వైవాహిక జీవితాన్ని గడపగలమని వారు చాలాసార్లు నిరూపించారు. ఆ మధ్య వారిద్దరూ విడాకులు తీసుకున్నారనే పుకార్లు వచ్చాయి. వాటిలో నిజం లేదని ఆమె తెలిపింది. ఆ మధ్య రవీందర్‌పై చీటింగ్ కేసు నమోదు కావడంతో జైలుకు వెళ్లే పరిస్థితి కూడా వచ్చింది. ఒకరిని మోసం చేసి డబ్బులు తీసుకున్నారంటూ నిర్మాతపై కేసు నమోదైంది. చివరికి ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది. View this post on Instagram A post shared by Mahalakshmi Shankar (@mahalakshmi_actress_official) -
కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే మాట తప్పదు: డిప్యూటీ సీఎం భట్టి
ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ఒకటైన మహాలక్ష్మి పథకం అమలులో భాగంగా ఖమ్మం పాత బస్టాండ్‌లో మహిళలకు తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ ఆర్టీసీ బస్సులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు , పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలకు ఉచిత టికెట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం, కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే మాట తప్పదని తెలిపారు. ఇది ప్రజల ప్రభుత్వం, రాహుల్ గాంధీ చెప్పినట్టుగా అన్ని హామీలను అమలు చేస్తాం, సంపాదను సృష్టిస్తాం, సంపాదను ప్రజలకు పంచుతామని పేర్కొన్నారు. మహిళలు ఒక్క రూపాయ ఖర్చు లేకుండా ప్రయాణం చేయొచ్చని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గత ప్రభుత్వం అమలు చెయ్యలేదని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వేచ్ఛగా బ్రతకోచ్చని, ఎలాంటి నిర్భందాలు ఉండవని తెలిపారు. ఖమ్మం జిల్లాలో 10కి 9 స్థానాలల్లో ప్రజలు గెలిపించారని గుర్తుచేశారు. ప్రజలు ఆఫీస్‌ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, అధికారులు ప్రజల ఇంటికి వచ్చి పనులు చేస్తారని తెలిపారు. రెవేన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ప్రజలు అద్భుతమైన విజయాన్ని అందించన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. సోనియా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం, ఇప్పుడు రెండు పధకాలను అమలు చేశామని తెలిపారు. మహిళ ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ స్కీమ్‌లను ప్రారంభించామని పేర్కొన్నారు. వ్యవసాయం ,మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లా ప్రజల కాళ్ళు కడిగి నెత్తిన పోసుకున్న మీ ఋణం తీర్చుకోలేమని అన్నారు. తన రాజకీయ జీవితం 40 ఏళ్ళు ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ళు అవకాశం కల్పించారని అన్నారు. గతంలో కొందరు పనికిరాని వ్యక్తుల వలన తప్పులు జరిగాయని మండిపడ్డారు. -
పనుండి చార్మినార్ వెళ్లి.. గచ్చిబౌలిలో చెల్లిని, హయత్‌నగర్‌లో బంధువులను కలిసి వస్తున్నా!
పనుండి చార్మినార్ వెళ్లా.. అక్కడి నుంచి గచ్చిబౌలిలో మా చెల్లెలి ఇంటికెళ్లి, అటు నుంచి హయత్‌నగర్ వెళ్లి మా పేరెంట్స్‌తో మాట్లాడి.. కోఠిలో షాపింగ్ చేసి వచ్చే సరికి లేటయిందండీ! -
గ్యారంటీగా అమలు చేస్తాం
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని 2004లో కరీంనగర్ గడ్డ మీద సోనియాగాంధీ మాట ఇచ్చారు. ఆ మాట మీద నిలబడి 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించారు. నాది తెలంగాణ అని గర్వంగా చెప్పుకొనే అవకాశం కల్పించారు. ఆ స్ఫూర్తి, ఆలోచనతోనే ఈ ఏడాది సెప్టెంబర్ 17న తుక్కుగూడ సభలో ఆరు గ్యారంటీల పేరుతో రాష్ట్ర ప్రజలకు హామీలు ఇచ్చారు. ఆ ఆరు గ్యారంటీల్లో రెండింటిని సోనియా జన్మదినం సందర్భంగా శనివారం నుంచి అమల్లోకి తెస్తున్నాం. తెలంగాణ ఇచ్చినట్టుగానే ఆరు గ్యారంటీలనూ అమలు చేస్తాం..’’అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. శనివారం శాసనసభలో కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం.. అసెంబ్లీ ప్రాంగణంలోనే చేయూత, మహాలక్ష్మి పథకాలకు పచ్చజెండా ఊపారు. ‘చేయూత’పథకం కింద రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధి రూ.10 లక్షలకు పెంపు, ‘మహాలక్ష్మి’పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ, ఇతర మంత్రులు, శాసనసభ్యులతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. తాము ఇచ్చిన ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో నిక్కచ్చిగా అమలు చేస్తామని చెప్పారు. తెలంగాణను సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. డిసెంబర్ 9 తెలంగాణకు పండుగ రోజు అని వ్యాఖ్యానించారు. లోగో ఆవిష్కరించి.. జెండా ఊపి.. ‘చేయూత’పథకంలో భాగంగా రాష్ట్రంలోని పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య చికిత్సల పరిమితిని రూ.10 లక్షలకు పెంచుతూ లోగో, పోస్టర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. తర్వాత మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్కలతోపాటు మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రేలతో కలసి మహిళల ఉచిత ప్రయాణ బస్సును జెండా ఊపి ప్రారంభించారు. ఉచిత టికెట్‌ను ఆవిష్కరించారు. ఉప్పల్ డిపోకు చెందిన టీఎస్08జెడ్ 0143 నంబర్ బస్సులో మహిళా ప్రయాణికులతో కలసి లోయర్ ట్యాంక్‌బండ్ ప్రాంతంలోని అంబేడ్కర్ విగ్రహం వరకు ప్రయాణించారు. ఈ బస్సులో సీఎంతోపాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, సీఎస్ శాంతికుమారి, మహిళా ఐఏఎస్ అధికారులు వాణీప్రసాద్, టీకే శ్రీదేవి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, మహిళా ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి, యశస్వినిరెడ్డి, ఎమ్మెల్యేల బంధువులు ప్రయాణించారు. ఈ సందర్భంగా తొలి ఉచిత టికెట్‌ను తెలంగాణకు చెందిన ప్రఖ్యాత బాక్సర్ నిఖత్ జరీన్‌కు రేవంత్‌రెడ్డి అందజేశారు. ఈ బస్సుతోపాటు ఏర్పాటు చేసిన మరో రెండు బస్సుల్లో జీహెచ్ఎంసీ కార్మికులు, విద్యార్థినులు ప్రయాణించారు. ఈ కార్యక్రమంతో రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఆర్టీసీ ప్రారంభించింది. అంబేడ్కర్‌కు ఘనంగా నివాళి అర్పించి.. అసెంబ్లీ నుంచి బస్సులో ట్యాంక్‌బండ్ వరకు వెళ్లిన సీఎం రేవంత్, మంత్రులు, అధికారులు.. అక్కడ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తర్వాత సీఎం సహా అందరూ అదే ఆర్టీసీ బస్సులో తిరిగి వెళ్లారు. ఈ సందర్భంగా రేవంత్ బస్సులో నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ఉండగా.. మంత్రి సీతక్క, కొండా సురేఖ ఇద్దరూ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నేటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అంటూ పోస్టర్లను ప్రదర్శించారు. ‘మహాలక్ష్మి’తో మరింత సంతోషం: రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ కొత్త ప్రభుత్వంలో తనకు రవాణాశాఖ దక్కడం సంతోషంగా ఉందని.. తనకు ఆ శాఖను కేటాయించిన తొలిరోజే ఆర్టీసీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే పథకాన్ని ప్రారంభించటం మరింత సంతోషాన్ని కలిగించిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ‘‘ఇది గొప్ప పథకం, మహిళలకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. దీన్ని అంతా కలసి విజయవంతం చేయాలి. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వెసులుబాటు ఉందన్న ఉద్దేశంతో.. అంతగా అవసరం లేకున్నా బస్సుల్లో ప్రయాణిస్తూ ఉంటే తోటివారికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకే అవసరమున్న మహిళలు దీన్ని వినియోగించుకోవాలని కోరుతున్నా. ఓ రెండు వారాలు దీన్ని సమీక్షిస్తూ తదనుగుణంగా చర్యలు తీసుకుంటాం. నేను కొత్త మంత్రిని అయినందున శాఖపై పూర్తి అవగాహన రావాల్సి ఉంది. త్వరలోనే కార్యాచరణ ప్రారంభిస్తాను’’అని పొన్నం ప్రభాకర్ చెప్పారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో పేదలకు వైద్యం రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రారంభించిన ‘చేయూత’పథకం ద్వారా రాష్ట్రంలోని పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించనున్నారు. ఈ పథకంలో భాగంగా నిరుపేదలకు ఆరోగ్య భద్రతను కల్పించే రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఒక్కో కుటుంబానికి ఏటా రూ.10 లక్షల వరకు ఉచితంగా వైద్య సాయం అందుతుంది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 90.10 లక్షల కుటుంబాలు ఈ పథకం కింద లబ్ధి పొందుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వైద్యపరంగా మొత్తం 1,672 ప్యాకేజీలు అమలుకావడంతోపాటు 21 స్పెషాలిటీ సేవలు అందుతాయని వెల్లడించాయి. -
మహాలక్ష్మీ పథకం ప్రారంభం.. మహిళలకు ఉచిత ప్రయాణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల హామీల్లో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. అసెంబ్లీ వద్ద ఆర్టీసీ బస్సుల్లో మహిళలు, యువతులు ఉచితంగా ప్రయాణించే మహాలక్ష్మి పథకాన్ని సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లాంఛనంగా ప్రారంభించారు. అలాగే, రాజీవ్ ఆరోగ్యశ్రీ(చేయూత)ని ప్రారంభించిన సీఎం, మంత్రులు. దీంతో, ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి మహాలక్ష్మీ పథకం అమలులోకి రానుంది. తెలంగాణలో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. అసెంబ్లీ ఆవరణలో మూడు బస్సులు ప్రారంభమయ్యాయి. ఇక, ఆరోగ్యశ్రీ కింద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వైద్యఖర్యులను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయ తీసుకుంది. మంత్రులు సీతక్క, కొండా సురేఖ పచ్చజెండాను ఊపి బస్సులను ప్రారంభించారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. నేడు సోనియా గాంధీ పుట్టినరోజు. డిసెంబర్ 9 తెలంగాణకు పండుగ రోజు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను సోనియా నెరవేర్చారు. నాది తెలంగాణ అని చెప్పుకునే అవకాశాన్ని సోనియా మనకు ఇచ్చారు. మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాం. తెలంగాణవ్యాప్తంగా మహాలక్ష్మీ పథకం అమలులోకి వస్తుంది. ఆరు గ్యారంటీల్లో భాగంగా రెండు గ్యారంటీలను అమలుచేస్తున్నాం అని అన్నారు. అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ మంత్రులు, మహిళ నేతలు బస్సులో ట్యాంక్ బండ్‌కు బయలుదేరారు. దీంతో, అక్కడ సందడి వాతావరణం చోటుచేసుకుంది. ఇక, నేటి మధ్యాహ్నం నుంచి మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేయవచ్చు. నిఖత్ జరీన్‌కు ప్రోత్సాహకం.. అలాగే, బాక్సర్ జఖర్ ఘరీన్‌కు రూ. 2కోట్ల చెక్‌ను సీఎం రేవంత్ అందించారు. వరల్డ్ చాంపియన్, కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్, బాక్సర్ నిఖత్ జరీన్‌కు పారిస్ ఒలింపిక్స్ సన్నద్ధత కోసం రూ.2 కోట్ల చెక్ అందించిన సీఎం రేవంత్ రెడ్డి. -
జేబులో నోటులాంటి కేసీఆర్‌ను వదులుకోవద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సంపదను పెంచి పేదలకు పంచి వారిని కడుపులో పెట్టుకుని చూడాలన్నదే సీఎం కేసీఆర్ విధానమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడిస్తాం, కూల్చేస్తామని కొందరు అంటున్నారని, జేబులో నోటు లాంటి సీఎంను వదులుకోవద్దని పిలుపునిచ్చారు. ఖైరతాబాద్ నియోజకవర్గ బీజేపీ నేత పల్లపు గోవర్దన్, హిమాయత్‌నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి శుక్రవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ చిల్లర మాటలకు పడిపోతే హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోతుందని అన్నారు. హైదరాబాద్‌లో మౌలిక వసతులు మెరుగు పరుస్తూ నగరాన్ని పసిగుడ్డులా చూసుకుంటున్నామన్నారు. ‘వండి పెట్టుడు.. మూతి తుడుసుడు తప్ప అన్నీ ప్రభుత్వమే చేస్తుంది’అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో మరో లక్ష ఇళ్లు హైదరాబాద్ మహా నగరంలో పేదల కోసం ఇప్పటికే లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి 70వేలు పంపిణీ చేశామని, మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరో లక్ష ఇళ్లు నిర్మిస్తామని కేటీఆర్ వెల్లడించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా హైదరాబాద్ మెట్రోను 400 కి.మీ మేర విస్తరిస్తామన్నారు. సినీ నటులు రజనీకాంత్, సన్నీ డియోల్, లయ తదితరులు హైదరాబాద్‌ను అమెరికా నగరాలతో పోలి్చన విషయాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి, దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్కు యునైటెడ్ ముస్లిం ఫోరం మద్దతు మైనారీ్టల సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేస్తున్న బీఆర్ఎస్కు అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణ మద్దతును ఇస్తున్నట్లు యునైటెడ్ ముస్లిం ఫోరం ప్రకటించింది. ప్రగతిభవన్‌లో ఫోరం ప్రతినిధులు శుక్రవారం మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ముస్లింల జీవితాల్లో గణనీయ మార్పు వచి్చందని, బడ్జెట్లో కేటాయింపులు పెంచడంతో పాటు మైనారిటీ విద్యా సంస్థల ఏర్పాటు వంటివి ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో అక్బర్ నిజాముద్దిన్, జియాఉద్దిన్ నయ్యర్, సయ్యద్ మసూద్ తదితరులున్నారు. -
నేను ఏ తప్పూ చేయలేదు.. ఏడ్చేసిన మహాలక్ష్మి భర్త
చీటింగ్ కేసులో అరెస్టయిన తమిళ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయితే తనను అన్యాయంగా కేసులో ఇరికించాడని వాపోయాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఎమోషనలయ్యాడు. 'నాకు మా అమ్మ తర్వాత మహాలక్ష్మి అంటేనే ఎక్కువ ఇష్టం. ఆమె నాకు దొరికిన వరం. మా ఇద్దరినీ ఎవరూ విడదీయలేరు. ట్రోలర్స్ ఎన్నైనా అనుకోండి.. ఎంతైనా తిట్టుకోండి. కానీ మమ్మల్ని వేరు చేయలేరు. నన్ను అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్లినప్పుడు కింద కూర్చోమన్నారు. కానీ అందరికీ వారి శరీరం సహకరించినట్లుగా నా బాడీ నాకు సహకరించదు. నేను చెప్పేది కూడా వినకుండా అరెస్ట్ చేసి లాక్కెళ్లారు. నేను ఏ తప్పూ చేయలేదు. నా మీద ఫిర్యాదు చేసిన వ్యక్తే అనేక తప్పుడు పనులు చేశాడు, దొంగతనాలు చేశాడు. అవన్నీ నాకు తెలిసిపోవడంతో నామీదే తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయించాడు. నేను అతడిని వదిలిపెట్టను. తన బండారం మొత్తం బయటపెడతాను, దోషిగా నిరూపిస్తాను' అంటూ ఏడ్చేశాడు రవీందర్. ఏ కేసులో అరెస్ట్ అయ్యాడంటే? వ్యర్థాల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్రాజెక్ట్‌తో కోట్లు సంపాదించవచ్చంటూ చెన్నైకి చెందిన బాలాజీ అనే వ్యక్తిని నమ్మించాడు రవీందర్. అందుకు కావాల్సిన నకిలీ పత్రాలను సిద్ధం చేసి అతడి దగ్గరి నుంచి రూ.15 కోట్లకు పైగా డబ్బు తీసుకున్నాడు. 2020లో సెప్టెంబర్ 17న ఈ ఒప్పందం జరిగింది. అయితే డబ్బు ముట్టిన తర్వాత రవీందర్ ప్రాజెక్ట్‌ను పక్కన పడేశాడని, కనీసం తన డబ్బు తిరిగివ్వాలని కోరినప్పటికీ అందుకు సరిగా స్పందించలేదని బాలాజీ వాదన. దీంతో అతడు చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు రవీందర్‌ను అరెస్ట్ చేశారు. రెండు, మూడు రోజుల క్రితమే అతడు బెయిల్ మీద బయటకు వచ్చాడు. View this post on Instagram A post shared by Mahalakshmi Shankar (@mahalakshmi_actress_official) చదవండి: తన టైమ్ బాగుందంటోన్న నేషనల్ క్రష్ -
అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు: బుల్లితెర నటి తీవ్ర ఆరోపణలు!
కోలీవుడ్ ప్రముఖ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవలే చీటింగ్ కేసులో జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఒక వ్యాపారవేత్తను ఆయన మోసం చేసినందుకు గాను అరెస్ట్ అయ్యాడు. ఈ వార్త కోలీవుడ్‌లో సంచలనంగా మారింది. అయితే గతేడాది బుల్లితెర నటి మహాలక్ష్మి శంకర్‌ను ఆయన పెళ్లి చేసుకున్నారు. అయితే ఇటీవల భర్త జైలుకు వెళ్లినప్పటికీ ఎప్పటిలాగే ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేసింది. దీంతో భర్త జైల్లో ఉంటే మీకిది అవసరమా నెటిజన్స్ ఆమెను తప్పుపడుతున్నారు. (ఇది చదవండి: 'హ్యాపీ బర్త్ డే క్యూటీ'.. బన్నీ ఎమోషనల్ పోస్ట్!) అయితే తాజాగా వీరిద్దరి వ్యవహారం కోలీవుడ్‌లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం రవీందర్ జైలులో ఉండగా.. ఆయన భార్య మహాలక్ష్మి సంచలన కామెంట్స్ చేసింది. తన భర్త రవీందర్ తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని ఆరోపించింది. ఈ విషయాలన్నీ తనకు చెప్పలేదని బంధువులతో వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మహాలక్ష్మి మాట్లాడుతూ..'పెళ్లికి ముందు ఇలాంటి విషయాలు నాకు తెలియవు. రవీందర్ కూడా సమస్యలుని అనే విషయం చెప్పలేదు.. నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు' అంటూ తన భర్త రవీందర్ గురించి సన్నిహితుల ముందు చెప్పింది. ప్రస్తుతం ఈ విషయంలో కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. రవీందర్ జైలుకెళ్లడం వల్ల అతని భార్య మహాలక్ష్మి ఒత్తిడికి లోనవుతున్నట్లు కూడా కొందరు చెబుతున్నారు. అయితే ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కాగా.. ఓ వైపు ఆమెకు ఇప్పటికే పెళ్లై ఓ కొడుకు కూడా ఉన్నాడు. ఆమె అనిల్ అనే వ్యక్తిని పెళ్లాడింది. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో 2019లో విడాకులు తీసుకున్నారు. గతేడాది నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ వివాహం చేసుకుంది. ప్రస్తుతం అతను మోసం కేసులో అరెస్టవడంతో మహాలక్ష్మి చేసిన కామెంట్స్ కోలీవుడ్‌లో చర్చకు దారితీశాయి. కాగా.. ఇటీవలే ఈ జంట మొదటి వివాహా వార్షికోత్సవం కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. (ఇది చదవండి: నటి మహాలక్ష్మి భర్త రవీందర్ అరెస్ట్) View this post on Instagram A post shared by Ravindar Chandrasekaran (@ravindarchandrasekaran) -
భర్త జైల్లో ఉంటే ఫోటోషూట్స్‌తో బిజీగా ఉన్న మహాలక్ష్మి!
కోలీవుడ్‌లో నటి మహాలక్ష్మి- నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ జంట వెరీ పాపులర్.. వీరిద్దరూ కలిసి ఫోటో దిగినా, వీడియోలు షేర్ చేసినా ఇట్టే వైరల్ అవుతుంటాయి. ఆదర్శ దంపతులని కొందరు కితాబిస్తే.. డబ్బు కోసమే అతడిని పెళ్లి చేసుకుందని మరికొందరు విమర్శిస్తుంటారు. ఇకపోతే ఇటీవలే చీటింగ్ కేసులో రవీందర్ అరెస్టయిన సంగతి తెలిసిందే! ప్రస్తుతం ఆయన ఇంకా జైల్లోనే ఉన్నాడు. భర్త జైల్లో.. భార్య ఫోటోషూట్స్‌తో బిజీలో ఇటువంటి సమయంలో మహాలక్ష్మి చేసిన పనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భర్త జైల్లో ఉంటే నటి ఫోటోషూట్లతో బిజీగా ఉంది. వరుసగా ఫోటోషూట్స్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంటోంది. అంతా మంచే జరుగుతుంది.. నా హృదయం నీకోసమే ఎదురుచూస్తోంది అని వాటికి క్యాప్షన్ జోడించింది. క్యాప్షన్ బాగానే ఉన్నా మహాలక్ష్మి ఫోటోషూట్, అందులో ఆమె సరదాగా చిరునవ్వులు ఒలికించడం చూస్తే ఏదో తేడా కొడుతోందంటున్నారు కొందరు నెటిజన్లు. పెళ్లికంటే ముందే డీల్ నిజంగానే మహాలక్ష్మి డబ్బు కోసమే అతడిని పెళ్లాడి, ఇప్పుడు కావాలనే తనని జైలుకు పంపించిందా? అన్న అనుమానాలు సైతం వ్యక్తం చేస్తున్నారు. అయితే నటి అభిమానులు మాత్రం ఈ ఆరోపణలను తిప్పికొడుతున్నారు. వీరు చాలాకాలంగా ప్రేమించుకున్నప్పటికీ పెళ్లి మాత్రం గతేడాదే జరిగిందని.. దానికంటే ముందే ఈ ప్రాజెక్ట్ గురించి ఒప్పందం చేసుకున్నారని అంటున్నారు. నిర్మాత అరెస్ట్.. కారణమేంటంటే.. వ్యర్థాల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్రాజెక్ట్‌తో కోట్లు సంపాదించవచ్చంటూ చెన్నైకి చెందిన బాలాజీ అనే వ్యక్తిని నమ్మబలికించాడు రవీందర్. అందుకు కావాల్సిన నకిలీ పత్రాలను సిద్ధం చేసి అతడి దగ్గరి నుంచి రూ.15 కోట్లకు పైగా డబ్బు తీసుకున్నాడు. 2020లో సెప్టెంబర్ 17న ఈ ఒప్పందం జరిగింది. అయితే డబ్బు ముట్టిన తర్వాత రవీందర్ ప్రాజెక్ట్‌ను పక్కన పడేశాడు. పోనీ, తన డబ్బు తిరిగివ్వాలని కోరినప్పటికీ అందుకు సరిగా స్పందించలేదు. దీంతో బాలాజీ చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు రవీందర్‌ను అరెస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Mahalakshmi Shankar (@mahalakshmi_actress_official) View this post on Instagram A post shared by Mahalakshmi Shankar (@mahalakshmi_actress_official) View this post on Instagram A post shared by Mahalakshmi Shankar (@mahalakshmi_actress_official) చదవండి: మీరా సూసైడ్.. కంటతడి పెట్టిస్తున్న విజయ్ ఆంటోని భార్య మాటలు.. -
కన్నబిడ్డలనే కాల్వలోకి తోసి...
బిజినేపల్లి: కల్లు తాగొద్దని భర్త హెచ్చరించాడన్న కోపంతో ఓ తల్లి ముక్కుపచ్చలారని తన నలుగురు చిన్నారులను కాల్వలో విసిరేసింది. ఈ ఉదంతం శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని ఎర్రకుంటతండాలో చోటుచేసుకుంది. మండలంలోని లట్టుపల్లి పంచాయతీ పరిధిలోని ఎర్రకుంట తండాకు చెందిన లలిత మంగనూర్‌కు చెందిన శరబందను ఎనిమిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి కూతుళ్లు మహాలక్ష్మి (7), సాత్విక (5), మంజుల (3)తోపాటు 7 నెలల కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలో లలిత కొన్నాళ్లుగా మందు కల్లును తాగుతుండటంతో పలుమార్లు భర్త శరబంద మందలించాడు. దీంతో భర్త తరచూ మందలిస్తున్నాడని లలిత శనివారం బిజినేపల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. పోలీసులు శరబందను స్టేషన్‌కు రావాలని ఫోన్ చేసి పిలిచారు. మధ్యాహ్నం కావడంతో పిల్లలకు ఏమైనా తినిపించుకు వస్తానని చెప్పి వెళ్లిన లలిత.. పోలీస్‌స్టేషన్ సమీపంలోని కేఎల్ఐ కాల్వలోకి చిన్నారులతో కలిసి దిగింది. అటుగా వెళ్తున్న కొందరు ఆమెను గమనిస్తుండగానే నలుగురు చిన్నారులను కాల్వలోకి విసిరేసింది. వెంటనే వారు బిజినేపల్లి పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించి కాల్వలోకి దిగారు. పోలీసులు సైతం కాల్వ వద్దకు వచ్చి గాలించగా.. నీటి ఉధృతికి చిన్నారులు కిలోమీటరు మేర కొట్టుకుపోయారు. చివరికి ముగ్గురు కుమార్తెల మృతదేహాలు లభించగా.. బాలుడు మార్కండేయ ఆచూకీ లభించలేదు. అప్పటికే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. చిన్నారులను కాల్వలో విసిరేసిన తల్లిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న భర్త శరబంద సైతం పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నాడు. చిన్నారుల మృతదేహాలను పోలీసులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
దటీజ్ డాక్టర్ మహాలక్ష్మీ..వెయ్యికి పైగా డైడ్బాడీస్కి పోస్ట్‌మార్టం
‘అమ్మాయిలు పోస్ట్‌మార్టం చేయలేరు’ ఈ అపోహ తప్పని నిరూపిస్తున్నారు ఈ రంగంలోకి వస్తున్న యువ డాక్టర్లు. నాలుగేళ్లలో వెయ్యికి పైగా మృతదేహాలకు పోస్ట్‌మార్టం చేసి, అమ్మాయిలూ చేయగలరు అని నిరూపిస్తున్నారు కర్ణాటకలోని కార్వార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మహాలక్ష్మి మన దేశంలో మొట్టమొదటి ఫోరెన్సిక్ సైంటిస్ట్‌గా డాక్టర్ రుక్మిణీ కృష్ణమూర్తి వార్తల్లో నిలిచారు. ముంబయ్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీలో 1974లో చేరిన ఆమె రిటైర్ అయ్యేంతవరకు వర్క్ చేశారు. ఆమె స్ఫూర్తితో ఆ తర్వాత ఈ రంగంవైపు ఆసక్తి చూపినవాళ్లు ఉన్నారు. కానీ, వేళ్లమీద లెక్కించదగిన సంఖ్యలోనే ఉన్నారు. అనారోగ్యంతో ఉన్నవారిని చూడటం సాధారణం. కానీ, కాలిపోయిన శరీరాలు, ప్రమాదాలలో ఛిద్రమైన శరీరాలు, నీటిలో మునిగిపోయిన శరీరాలు చూడటం సాధారణం కాదు. విషం కారణంగా శరీరం నీలం రంగులోకి మారడం లేదా ఆత్మహత్య కారణంగా మృతదేహాలను చూడటం మరింత బాధాకరం. సున్నితమనస్కులైన మహిళలు ఈ ఛాలెంజ్‌ను స్వీకరించలేరనేది అందరూ అనుకునేమాట. అయితే, ఈ వృత్తిని తాను ఛాలెంజింగ్‌గా తీసుకున్నానని చెబుతున్నారు డాక్టర్ మహాలక్ష్మి. చదువుకునే రోజుల్లో... ‘‘అమ్మనాన్నలకు ఐదుగురం ఆడపిల్లలం. అందులో ముగ్గురం డాక్టర్లమే. ఒక అక్క డెంటిస్ట్, మరొకరు ఆయుర్వేద డాక్టర్. వాళ్లని చూసే నేనూ డాక్టర్ కావాలని కల కన్నాను. ఆయుర్వేద వైద్యురాలైన మా అక్క ఫోరెన్సిక్ డాక్టర్ కావాలనుకుంది. కానీ, తను ఆ దారిలో వెళ్లలేకపోయింది. నేను ఈ టాపిక్‌ను ఎంచుకున్నప్పుడు మా అక్క ఎంతో సపోర్ట్‌నిచ్చింది. మా నాన్న ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసేవారు. అమ్మ గృహిణి. మా ఇంట్లో ఎప్పుడూ చదువుకే ప్రాధాన్యత ఉండేది. రిస్క్ ఎందుకు అన్నారు.. చదువుకునే రోజుల్లో సీఐడీ సీరియల్ చూసేదాన్ని. అందులో ఫోరెన్సిక్ విభాగం నాకు చాలా ఆసక్తిగా అనిపించేది. ఎంబీబీఎస్ రెండో సంవత్సరంలోనే ఫోరెన్సిక్‌కు సంబంధించిన సమాచారం తెలుసుకోవడం మొదలుపెట్టాను. మా ప్రొఫెసర్లు కూడా నాకు ఆ విభాగానికి సంబంధించిన సమాచారాన్ని, నేర కథనాలను వివరించేవారు. ఇందుకు సంబంధించిన నవలలు కూడా చదివాను. మా క్లాస్మేట్ అబ్బాయిలు మాత్రం ‘ఈ విభాగం వద్దు, అమ్మాయివి ఎందుకు రిస్క్. ఇది కేవలం మార్చురీ గురించి మాత్రమే కాదు, సాక్ష్యం కోసం కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. పోలీసులతో కలిసి పనిచేయాలి. రాత్రి, పగలు ఎప్పుడు అవసరమున్నా చురుగ్గా పనిచేయాలి. లేడీస్‌కి అంత సులభం కాదు’ అన్నారు. ‘మా నాన్నగారు కూడా పెళ్లై, సంప్రదాయ కుటుంబంలోకి వెళితే ఇబ్బందులుగా మారతాయి’ అన్నారు. కానీ, ఒక కేసు దర్యాప్తులో ఫోరెన్సిక్ నిపుణుల పాత్ర చాలా ముఖ్యం అని నాకు తెలుసు. ఈ ఫీల్డ్‌లో ఛాలెంజెస్ ఎక్కువ. నేను చేయగలను అని భావించే ఈ విభాగంలోకి వచ్చాను. ఇప్పుడు నా నిర్ణయాన్ని అంతా సమర్ధిస్తున్నారు’’ అని వివరించారు ఈ ఫోరెన్సిక్ డాక్టర్. అనేక పరిశోధనలు.. మేల్ డామినేటెడ్ వృత్తిలో ఎలా చోటు సంపాదించుకున్నావని నన్ను చాలామంది అడుగుతుంటారు. సవాళ్లు అంటే ఇష్టం అని చెబుతుంటాను. నేను పుట్టి పెరిగింది కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలోని హుబ్లీ నగరం. ప్రాథమిక విద్య వరకు బెల్గాంలో చదివాను. ఆ తర్వాత కాలేజీ చదువంతా హుబ్లీలోనే. 2007 నుండి 2017 మధ్యన బెల్గాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి ఎంబీబీఎస్ పూర్తి చేశాను. ఏడాది పాటు గ్రామీణ ప్రజలకు సేవ చేశాను. 2020లో ఫోరెన్సిక్ విభాగంలో చేరాను. అప్పటి నుండి అనేక పరిశోధనలను ఫోరెన్సిక్ నిపుణుల బృందంతో కలిసి పనిచేశాను. మెడికల్ స్టూడెంట్స్‌కు క్లాసులు తీసుకుంటున్నాను. ఈ విభాగంలో గోల్డ్ మెడల్ వచ్చింది. – డాక్టర్ మహాలక్ష్మి