
ప్రముఖ తమిళ నిర్మాత రవీందర్ బుల్లితెర నటి వీజే మహాలక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. చూడచక్కని రూపంతో అందంగా ఉన్న మహాలక్ష్మీ.. భారీకాయుడైన రవీందర్‌ను పెళ్లాడటంతో ఈ జంట హాట్‌టాపిక్‌గా నిలిచింది. వీరి పెళ్లి గురించి తమిళనాటే కాకుండా సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ మధ్యకాలంలో వీళ్లపై వచ్చినన్ని ట్రోల్స్ ఎవరి మీద వచ్చి ఉండవు.
వీరిద్దరికి ఇది రెండో పెళ్లి. తాజాగా మహాలక్ష్మి గురించి నటి జయశ్రీ సంచలన ఆరోపణలు చేసింది. మహాలక్ష్మికి తన భర్తతో అఫైర్ ఉందని, అందుకే మొదటి భర్త ఆమెను వదిలేశాడంటూ పేర్కొంది. తన ముందే ఆమెతో వీడియో కాల్స్ చేసి మాట్లాడేవాడని, అంతేకాకుండా మహాలక్ష్మి కొడుకు తన భర్తను నాన్న అని పిలుస్తున్నాడంటూ గతంలో జయశ్రీ ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
అయితే ఆ వార్తలను కొట్టిపారేసిన మహాలక్ష్మి జయశ్రీ కావాలనే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తుందని, ఇందులో నిజం లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా తన వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో రవీందర్ తనకు అండగా నిలబడ్డాడని, అందుకే అతనితో కొత్త జీవితం ప్రారంభించానని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment