jaya sri
-
మహాలక్ష్మికి నా భర్తతో అఫైర్.. అందుకే ఆమె భర్త వదిలేశాడు : నటి
ప్రముఖ తమిళ నిర్మాత రవీందర్ బుల్లితెర నటి వీజే మహాలక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. చూడచక్కని రూపంతో అందంగా ఉన్న మహాలక్ష్మీ.. భారీకాయుడైన రవీందర్‌ను పెళ్లాడటంతో ఈ జంట హాట్‌టాపిక్‌గా నిలిచింది. వీరి పెళ్లి గురించి తమిళనాటే కాకుండా సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ మధ్యకాలంలో వీళ్లపై వచ్చినన్ని ట్రోల్స్ ఎవరి మీద వచ్చి ఉండవు. వీరిద్దరికి ఇది రెండో పెళ్లి. తాజాగా మహాలక్ష్మి గురించి నటి జయశ్రీ సంచలన ఆరోపణలు చేసింది. మహాలక్ష్మికి తన భర్తతో అఫైర్ ఉందని, అందుకే మొదటి భర్త ఆమెను వదిలేశాడంటూ పేర్కొంది. తన ముందే ఆమెతో వీడియో కాల్స్ చేసి మాట్లాడేవాడని, అంతేకాకుండా మహాలక్ష్మి కొడుకు తన భర్తను నాన్న అని పిలుస్తున్నాడంటూ గతంలో జయశ్రీ ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఆ వార్తలను కొట్టిపారేసిన మహాలక్ష్మి జయశ్రీ కావాలనే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తుందని, ఇందులో నిజం లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా తన వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో రవీందర్ తనకు అండగా నిలబడ్డాడని, అందుకే అతనితో కొత్త జీవితం ప్రారంభించానని తెలిపింది. -
ప్రేమను పంచుదాం
ప్రస్తుత పరిస్థితుల్లో అందరిలోనూ స్ఫూర్తిని పెంచి, ప్రేమను పంచాలనే ఉద్దేశంతో కమల్ హాసన్ కరోనా వైరస్ పోరాటంపై ‘అరివుమ్ అన్బుమ్’ (బుద్ధి, ప్రేమ) పేరుతో ఓ పాటను సిద్ధం చేశారు. జిబ్రాన్ సంగీతం అందించిన ఈ పాటను పాడటంతో పాటు కమల్ హాసనే స్వయంగా రాశారు. ఈ పాటకు కమల్ తో పాటు సుమారు 12 మంది ప్రముఖులు గొంతు కలిపారట. శంకర్ మహదేవన్, అనిరుధ్, జిబ్రాన్, యువన్ శంకర్ రాజా, దేవిశ్రీ ప్రసాద్, బొంబాయి జయశ్రీ, సిద్ శ్రీరామ్, సిద్ధార్థ్, శ్రుతీ హాసన్, ఆండ్రియా, తమిళ బిగ్ బాస్ ఫేమ్ ముగెన్ ఈ పాటను ఆలపించారు. ఈ పాటను ఎవరింట్లో వాళ్లు ఉండి రికార్డ్ చేశారు. ‘‘ఈ పాటను కమల్ హాసన్ గారు కేవలం రెండు గంటల్లో రాసేశారు. పాటలో 12 మంది వాయిస్ మాత్రమే కాదు 37 మంది కోరస్ వాయిస్‌లు వినిపిస్తాయి. వాళ్లను ఆన్ లైన్ ఆడిషన్ చేసి సెలక్ట్ చేశాను’’ అని ఈ పాటకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు జిబ్రాన్. త్వరలోనే ఈ పాట విడుదల కానుంది. -
పుడమి తల్లికి ప్రణామం
గాత్రాలన్నీ శృతిలో ఉన్నాయి. తొమ్మిది మంది గాయనీగాయకులు! బాంబే జయశ్రీ–టు–శంకర్ మహదేవన్. ఇక స్వరాలు కావాలి. పుడమిపై పరిచేశాడు అమృత్ రామ్‌నాథ్. కర్ణాటక సంగీతంలో కసుగాయి. 21 ఏళ్లుంటాయంతే. పాడతాడు. పాటలకు ఉయ్యాలలు కడతాడు. అతడికొచ్చింది ఆఫర్! వరల్డ్ ఎర్త్డేకి మంచి మ్యూజిక్ వీడియో చెయ్యాలి. అదీ ఆఫర్. ఆర్నెల్ల కిందటే వరల్డ్ ‘ఎర్త్ డే నెట్వర్క్’.. ఇండియాలో వెదకులాట మొదలు పెట్టింది. బాగా పాడేవారి కోసం. బాగా ట్యూన్ కట్టేవాళ్ల కోసం. బాగా లిరిక్స్ రాసేవారి కోసం. ఎర్త్ డే నెట్వర్క్కి భారతీయ రాయబారి బాంబే జయశ్రీ. కర్ణాటక లలిత సంగీత, సినీ గాయని. జయశ్రీనే దగ్గరుండి టీమ్‌ని తయారు చేసుకున్నారు. ఉత్సాహవంతుడైన అమృత్ రామనాథ్కి దర్శకత్వ బాధ్యతల్ని ఇచ్చేశారు! ఆ సంగీత దృశ్యకావ్యమే.. ‘ధర్తీ మా’. పుడమి తల్లికి ప్రణమిల్లడం. ఒకే పాటను ఎనిమిది భాషల్లో.. హిందీ, బెంగాలీ, మరాఠీ, పంజాబీ, తమిళ్, కన్నడ, మలయాళం, గుజరాతీలలో.. పాడించాలి. ఒకే భావాంశానికి ఈ ఎనిమిది భాషల్లో అక్షరాలను పొదగాలి. వయోలిన్, గిటార్, తబలా, మృదంగం.. ప్రధాన వాద్యాలు. అందరూ తిరుగులేని విధంగా కుదిరారు. లిరిక్స్ వచ్చేశాయి. కొంత పని అయ్యాక మార్చి 25 కి కట్టుబడి నిలిచిపోయింది. లాక్డౌన్! అప్పటికి రికార్డింగ్ అయింది ముగ్గురి గాత్రాలు మాత్రమే. జయశ్రీ, అభిషేక్, శ్వేత. చెన్నైలోని అమృత్ రామ్‌నాథ్ హోమ్ స్టూడియోలో ఉన్నారు వాళ్లు ముగ్గరూ. మిగతావాళ్లు చెన్నై చేరుకోలేకపోయారు. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరు, శాన్ఫ్రాన్సిస్కో.. ఎక్కడున్న వాళ్లు అక్కడి నుంచే పాడి పంపిస్తే.. మిగతా ఖాళీలను స్టూడియోలో పూరించుకున్నాడు అమృత్ రామనాథ్. ఆ మాత్రం త్వరగానైనా అయింది.. ప్లానింగ్‌లో అతడు జాగ్రత్తగా ఉండటం వల్లనే. జయశ్రీ మేమ్‌తో తను ఎన్నిమాటలైనా పడతాడు. కానీ జయశ్రీ మేమ్కు మాట రాకూడదు అనుకున్నాడు. ఒరిజినల్ ట్యూన్ ఇదీ అనుకున్నాక ఆ ట్యూన్‌కి తగ్గట్లు హిందీలో తనే పాట భావాన్ని రాయించి మిగతా ఏడు భాషల్లోని గేయ రచయితలకు పంపించాడు. ఎర్త్ డే నెట్వర్క్కి సహ రాయబారి కౌశికి చక్రవర్తి. ఆమె కూడా రామ్‌నాథ్‌కి కీలకమైన దర్శక సహకారం అందించారు. చిత్రా సాయిరామ్ (కన్నడ), చేతనా శ్రీకాంత్ (హిందీ, మరాఠీ) కార్తీక్ దలాల్ (గుజరాతీ), వి.పి.రామ్‌నాథ్ (బెంగాలీ), మథురాంతకి (తమిళ్), షిజిత్ నంబియార్ (మలయాళం), విధూ పుర్కాయస్థ (పంజాబీ).. వీళ్ల నుంచి పాట లిరిక్స్ తెప్పించి, మూలార్థానికి అనువాదాలు సరిపోయిందీ లేనిదీ చెక్ చేయించిందంతా కౌశికీనే. బెంగాలీ లిరిక్స్ రాయడంలో రామ్‌నాథ్‌కి కూడా ఆమె సహాయం చేశారు. యజ్ఞం పూర్తి అయింది. ‘‘భూమాతా నీకు వందనాలు. మా జీవనాధారం నువ్వే. తరాలుగా మా పోషణ నువ్వే. ప్రణామాలు తల్లీ.. నీకు ఆత్మ ప్రణామాలు..’’ అని ‘ధర్తీ మా’.. ఆలపించే ఈ బహుభాషా స్తుతి గీత గుచ్ఛం.. యాదృచ్ఛికంగానే అయినా సరైన సమయంలో వచ్చింది. వరల్డ్ఎర్త్డే సందర్భంగా నేడు విడుదల అవుతున్నా.. ఈ కరోనా కష్ట కాలమూ ఒక సందర్భం అయింది. -
టీవీ నటితో అక్రమ సంబంధం..
తమిళనాడు, పెరంబూరు: బుల్లితెర నటుడు ఈశ్వర్‌పై అతని భార్య, బుల్లితెర నటి జయశ్రీ మంగళవారం పోలీస్‌కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వంశం సీరియల్ ద్వారా ప్రాచుర్యం పొందిన నటి జయశ్రీ. అమె బుల్లితెర నటుడు ఈశ్వర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తిరువాన్మయూర్ కామరాజర్ నగర్లో నివశిస్తున్న వీళ్ల మధ్య విబేధాలు తలెత్తాయి. నటి జయశ్రీ ఇటీవల తన ఆస్తులకు చెందిన డాక్యుమెంట్స్‌ను కుదవ పెట్టుకున్నాడని, తనను కొడుతూ చిత్ర వదకు గురి చేస్తున్నాడని భర్తపై అడయారు మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో ఈశ్వర్ తన భార్యను కొట్టినట్లు అంగీకరించడంతో అతన్ని అరెస్ట్ చేసి జైలులో పెట్టారు. కాగా మంగళవారం నటి జయశ్రీ చెన్నై పోలీస్‌కమిషనర్ కార్యాలయంలో తన భర్తపై మరో ఫిర్యాదు చేసింది. అందులో తన భర్త అరెస్ట్ అయిన తరువాత తనకు హత్యాబెదిరింపులు వస్తున్నాయని, వారెవరో కనిపెట్టి తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. అనంతరం జయశ్రీ మీడియాతో మాట్లాడుతూ.. తన భర్త ఈశ్వర్ వేరే టీవీ నటితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని చెప్పింది. అంతే కాకుండా పెళ్లి అయిన తరువాత తాగుడుకు అలవాటు పడ్డాడని, జూదానికి వ్యసనపరుడు అయ్యాడని చెప్పింది. గంజాకు అలవాటు పడినట్లు చెప్పింది. తన డబ్బు, బంగారం తాకట్టు పెట్టాడని తెలిపింది. అంతే కాకుండా తను అక్రమ సంబంధం పెట్టుకున్న నటితో కలిసి ఉన్న వీడియో కాల్స్ చేసేవాడని చెప్పింది. తాగి వచ్చి తన కూతురును లైంగిక వేధింపునకు గురి చేసే వాడని పేర్కొంది. ఇదంతా సహించలేకే తాను అడయారు పోలీసులకు ఫిర్యాదు చేశానంది. దీంతో పోలీసులు ఈశ్వర్‌ను అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. హాత్యాబెదిరింపు కాల్స్ రావడంతో పోలీస్‌కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు నటి జయశ్రీ చెప్పింది. -
అత్త కాళ్లు నరికిన కోడలు
-
అత్త కాళ్లు నరికిన కోడలు
కూతురి పేరిట ఇల్లు రిజిస్ట్రేషన్ చేసినందుకు ఆగ్రహం చౌటుప్పల్: ఓ కోడలు తన అత్త రెండు కాళ్లు నరికింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. చౌటుప్పల్‌లోని బంగారిగడ్డ కాలనీలో నివసించే ముచ్చెర్ల రాములు, మంగమ్మ (60) దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. చిన్న కుమార్తె సుజాతకు వికలత్వం ఉంది. ఇటీవల తన పేరిట చౌటుప్పల్‌లో ఉన్న రెండు ఇళ్లలో ఒక ఇంటిని కుమార్తె సుజాత పేరిట రిజిస్ట్రేషన్ చేసింది. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న కోడలు జయశ్రీ.. నిత్యం అత్తతో గొడవపడేది. ఈ క్రమంలో ఆదివారం సైతం వివాదం నెలకొంది. ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగింది. ఆవేశంతో కోడలు జయశ్రీ అత్తను రోకలిబండతో కొట్టి ఇంట్లో ఉన్న గడ్డపారను తీసుకువచ్చి రెండు కాళ్లను నరికింది. మంగమ్మ కేకలు వేయడంతో స్థానికులు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
ఉరవకొండ : ఇంటర్లో ఫెయిలైన ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. మైలారం పల్లి గ్రామానికి చెందిన రైతుకూలీ శ్రీనివాసులు కుమార్తె జయశ్రీ(17) పామిడిలోని తన అవ్వ వద్ద ఉంటూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీనియర్ ఇంటర్ హెచ్ఈసీ చదువుతోంది. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఆమె ఫెయిల్ అయ్యింది. మనస్థాపానికి గురైన జయశ్రీ సోమవారం మైలారంపల్లిలోని తన ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఊరేసుకుంది. కుటుంబ సభ్యులు హుటాహుటినా ఉరవకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కడుపు కోత
అక్కాచెల్లెళ్లయిన ఇద్దరు చిన్నారుల దుర్మరణం ఇంటి నుంచి వెళ్లిన క్షణాల్లోనే దారుణం తల్లిదండ్రుల కన్నీరు మున్నీరు వారిద్దరూ ఒకే రక్తం పంచుకుపుట్టిన అక్కా చెల్లెళ్లు..ఇద్దరికీ రెండేళ్లే తేడా కావటంతో ఎప్పుడూ కలిసిమెలిసి తిరిగేవారు. ఒకే స్కూల్లో ఆరు, నాలుగు తరగతులు చదువుకుంటూ, చెట ్టపట్టాలేసుకుని బడికి వెళ్లేవారు. చదువుల్లో చక్కగా రాణిస్తూ ఆ ఇంటికి, అమ్మా నాన్నల కంటికీ వెలుగయ్యారు. శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈ చిన్నారులు ఇద్దరు కన్నుమూయటంతో తల్లిదండ్రులు అంతులేని శోకంలో మునిగిపోయారు. విశాఖపట్నం, న్యూస్‌లైన్ : ఎందరో దేవుళ్లకు మొక్కుకున్నాక కలిగిన ఇద్దరు సంతానాన్ని మృత్యువు మినీబస్సు రూపంలో క బళించిం ది. అల్లారుముద్దుగా పెంచుకున్న ఆ తల్లిదండ్రులకు కడుపు కోతను మిగిల్చింది. శని వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కాచెల్లెళ్లు జయశ్రీ (11), విజయశ్రీ (9) మృతి చెందారు. మేనమామతో కలిసి బైక్‌పై స్కూలుకు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ప్ర యివేటు స్కూలు మినీ బస్సు ఢీకొనటంతో ఈ దుర్ఘటన జరిగింది,పట్టాభిరెడ్డి తోట నివాసి పినిశెట్టి అప్పలనారాయణ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. కార్మికుడైన అప్పలనారాయణ దంపతులు పిల్లలే లో కంగా జీవిస్తున్నారు. కుమార్తెల కోరికలను ఏనాడూ కాదనలేదు. శక్తికి మించిన చదువులు చదివిస్తున్నారు. పిల్లల మరణంతో తల్లిదండ్రులు తల్లడిల్లారు. ‘దేవుడా ఇలా చేశావేంటి‘ అంటూ తలలు బాదుకుని ఏడ్చారు. ‘మేము బతికేది పిల్లల కోసం ఇంకా మా బతుకులు ఎందుకు!’ అంటూ రోదించారు. ఆఖరి పరీక్ష రోజే..: శనివారంతో పరీక్షలు పూర్తి కావడంతో చలాకీగా తయారయ్యారు. ఆఖరి పరీక్ష కావడంతో జయశ్రీ, విజయశ్రీ సంతోషంగా గడిపారు. చకచకా స్కూల్‌కి సిద్ధమయ్యారు. ఆఖరి పరీక్ష పూర్తితో ఇక సెలవుల్లో సరదాగా గడుపుదామని ఆశపడ్డారు. సినిమా, బీచ్ అంటూ కోరికలు కోరారు. పరీక్షలు పూర్తి అయితే అలాగే చేద్దామని తల్లిదండ్రులు అంగీకరించారు. వారికి టాటా చెప్పి స్కూల్‌కు బయలుదేరారు. ఇంటి నుంచి వెళ్లిన నిమిషం వ్యవధిలో ప్రమాదానికి గురయ్యారు. అప్పటి వరకూ కళ్ల ముందు సంతోషంగా గడిపిన పిల్లలకు ప్రమాదం జరిగిందని తెలిసి షాక్‌కు గురయ్యారు. ప్రమాద స్థలంలో జయశ్రీ తొలుత మృతి చెందినట్టు తల్లిదండ్రులకు తెలియగా గుండెలు బాదుకున్నారు. చిన్న కుమార్తె విజయశ్రీ గాయాలవడంతో బతికి ఉందని తెలిసి కంగారుపడ్డారు. కొంతసేపటికి విజయశ్రీ మరణించిందన్న సమాచారంతో తల్లి స్పృహ తప్పింది. ఆఖరి పరీక్ష రాయకుండానే అనంత లోకాలకు వెళ్లిపోయారు. -
మానవత్వం మంట కలిసింది
క్షతగాత్రుల సెల్ఫోన్లను తస్కరించారు మృత్యువుతో పోరాడి ఓడిన యువకుడు మదనపల్లెక్రైం, న్యూస్‌లైన్: తోటి మనిషి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే కాపాడాల్సింది పోయి వారి వద్దనున్న నగదు, సెల్ఫోన్లను తస్కరించి వారిని మృత్యుఒడికి చేరువ చేసిన సంఘటన మంగళవారం రాత్రి కురబలకోట మండలంలో చోటు చేసుకుంది. కన్న తల్లిదండ్రులు మదనపల్లెలోనే ఉన్నప్పటికీ కుమారుడు స్థానిక ప్రభుత్వాస్పత్రిలో సుమారు 7 గంటలకు పైగా మృత్యువుతో పోరాడి కన్నుమూశాడు. సమాచారం లేకపోవడం వల్లే తల్లిదండ్రులు ఒక్కగానొక్క కుమారుడిని కాపాడుకోలేక పోయారు. కురబలకోట మండలం అంగళ్లుకు చెందిన రమణ, వసుంధర దంపతులకు కుమారుడు రెడ్డిశేఖర్ (21), కుమార్తె జయశ్రీ ఉన్నారు. రమణ దంపతులు పదేళ్లక్రితం మదనపల్లెలో స్థిరపడ్డారు. రెడ్డిశేఖర్ కారుడ్రైవర్‌గా పని చేస్తున్నారు. ఇదిలా ఉండగా కలికిరి మండలం గుట్టపాళెంకు చెందిన రెడ్డెప్ప కుమారుడు రెడ్డిభాస్కర్(22) స్థానిక నీరుగట్టువారిపల్లె మాయాబజార్లో అద్దె రూములో ఉంటూ ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్నారు. రెడ్డిభాస్కర్, రెడ్డిశేఖర్ ఇద్దరూ స్నేహితులు. మంగళవారం సాయంత్రం ఇద్దరూ ద్విచక్ర వాహనంపై అంగళ్లుకు వెళ్లారు. రాత్రి 11.50 గంటలకు మదనపల్లెకు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలోని అంగళ్లు గొర్రెలసంత వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన రెడ్డిశేఖర్, రెడ్డిభాస్కర్ రోడ్డుపై పడి కొట్టుమిట్టాడుతున్నారు. సమాచారం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడ గుమికూడారు. వారి ప్రాణాలను కాపాడాల్సిందిపోయి డబ్బు, సెల్ఫోన్లను తస్కరించారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడికి చేరుకుని బాధితులను అంబులెన్స్‌లో ఎక్కించారు. బాధితుల వద్ద సెల్ఫోన్లు ఉన్నాయా, ఉంటే ఎవరైనా తీసుకున్నారా అని స్థానికులను అడిగినా అందరూ తెలియదంటూ జారుకున్నారు. ఆ తర్వాత బాధితులను మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితులకు వెంటిలేటర్ సదుపాయంతో చికిత్స అందిస్తే ప్రాణాలు దక్కే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. అయితే బాధితుల సంబంధీకులు తెలియక బయటి ఆస్పత్రికి రెఫర్ చేయలేక ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది తంటాలు పడ్డారు. ఉదయం 6 గంటలకు సమాచారం అందుకున్న రెడ్డిభాస్కర్ బంధువులు ఆస్పత్రికి చేరుకుని వెంటనే బెంగళూరుకు తీసుకెళ్లారు. పట్టణంలోనే ఉన్న రెడ్డి శేఖర్ తల్లిదండ్రులు కూడా ఆస్పత్రికి చేరుకున్నారు. అన్ని ఏర్పాట్లు చేసుకుని అంబులెన్స్‌ను ఆస్పత్రికి తీసుకొచ్చేలోగా కుమారుడు మృతి చెందాడు. ‘అయ్యో నేనెవ్వరికీ ఎలాంటి మోసం చేయలేదే.. నాకెందుకు దేవుడు ఇంత కడుపుకోత విధించాడంటూ’ రెడ్డిశేఖర్ తల్లి గుండెలు బాదుకుంటూ విలపించారు. ముదివేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
స్వధార్‌హోమ్ వంచితులకు ఆసరా, ఆత్మవిశ్వాసం
ఏ అమ్మాయీ తనకై తాను ఇల్లొదిలి వచ్చేయదు. ఎవరో ప్రేమించి మోసం చేసి ఉంటారు. ఎవరో దయతలచి, దగా చేసి ఉంటారు. ఎవరో నమ్మించి ‘అమ్మక’ ద్రోహం చేసి ఉంటారు. ఎవరో తోడుగా వచ్చి, చెయ్యి వదిలేసి ఉంటారు. మీ ఊళ్లో... మా ఊళ్లో... ఏ ఊళ్లోనైనా.... తలదాచుకోడానికి చాలా ఇళ్లే ఉంటాయి. కానీ ఇలాంటి అమ్మాయికి... దుఃఖంలో తడిచి నిలబడిన అమ్మాయికి... తలుపు తెరిచే ఇల్లు ఒక్కటీ కనిపించదు. కనీసం ‘ఎవరమ్మా నువ్వు?’ అనేవారొక్కరూ కనిపించరు. ఎవరి భయం వారిది. ఎవరి కారణాలు వారివి. అయితే జయశ్రీ భయపడలేదు. ఏ కారణమూ ఆమెను వెనుకంజ వెయ్యనివ్వలేదు. ఇల్లొదిలొచ్చిన పిల్లెవరైనా మా ఇంటి పిల్లే అని... పట్టెడన్నం పెడుతోంది. పచ్చని జీవితాన్నీ ఇస్తోంది. వంచితులకు ఆమె పంచుతున్న అనురాగం, ఆత్మవిశ్వాసమే... ఈవారం జనహితం. తమ వాళ్ల నుంచి తప్పిపోయినవారు, ట్రాఫికింగ్ నుంచి తప్పించుకున్నవారు, వంచనకు గురయినవారు, వివిధ కారణాలతో ఇళ్ల నుంచి పారిపోయి వచ్చినవారు... ఇలా రకరకాల కారణాలచేత సమాజానికి దూరమై ఏం చేయాలో పాలుపోని ఒంటరి స్త్రీలకు కరీంనగర్‌లోని ‘స్వధార్‌హోమ్’ కొండంత అండగా నిలుస్తోంది. వారికి పట్టెడన్నం పెట్టడంతో పాటు పచ్చటి జీవితాన్ని కూడా ప్రసాదిస్తోంది. ‘బాధిత స్త్రీల పునరావాస కేంద్రం’ పేరుతో ఉన్న ఈ హోమ్‌ని నడిపిస్తోన్న జయశ్రీ ‘ప్రకృతి’ అనే స్వచ్ఛందసంస్థలో భాగంగా ఎనిమిదేళ్లక్రితం స్వధార్ హోమ్‌ని ఏర్పాటుచేశారు. అప్పటినుంచి బాధిత స్త్రీలకు అండగా నిలుస్తూ... వారికి ఆత్మవిశ్వాసం కలిగించి, సమాజానికి మళ్లీ కొత్తగా పరిచయం చేస్తున్నారు. ‘ప్రకృతి’ నీడలో... సమాజం పంచభూతాలకు అండగా నిలబడకపోతే ప్రకృతి పచ్చగా ఉండలేదంటారు జయశ్రీ. అందుకే మొక్కలు నాటడం వంటి పనులతో పచ్చదనాన్ని పోషిస్తూనే... 1997లో ‘ప్రకృతి’ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థని నెలకొల్పి, మహిళా సంక్షేమం, స్వయం ఉపాధి శిక్షణల కోసం పనిచేస్తున్నారు. ఇందులో భాగంగానే మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వరంలో నడుస్తోన్న స్వధార్ హోమ్‌ని తన సొంతిల్లులా భావించి బాధిత మహిళలకు బంగారు భవిష్యత్తు కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ‘‘స్వధార్ హోమ్‌లో ఒక్కో మహిళది ఒక్కో కష్టం. వారిని సమస్యల నుంచి బయటపడేయడమే కాకుండా, సమస్యల్ని ఎదుర్కొనేలా కూడా తీర్చిదిద్ది, కొత్త జీవితాలివ్వడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఇప్పటివరకూ 350 మంది ఇక్కడ ఆశ్రయం పొందారు. ప్రస్తుతం హోమ్‌లో 50 మంది మహిళలున్నారు. వీరిలో పదేళ్ల నుంచి అరవై ఏళ్ల వయసువారున్నారు’’ అంటూ తమ సంస్థ గురించి వివరించారు జయశ్రీ. లా చదివిన జయశ్రీకి విద్యార్థి వయసు నుంచే సేవాకార్యక్రమాల పట్ల ఆసక్తి ఉండేది. ప్రస్తుతం ఒక ప్రైవేటు పాఠశాలను నిర్వహిస్తూ, ‘ప్రకృతి’ అనే ఎన్జీవోని నడుపుతున్నారు. ఆశ్రయంతో పాటు... ‘‘2005లో స్వధార్ హోమ్ స్థాపించాక... దాని గురించి జిల్లా ప్రజలందరికీ తెలియజేయాలనుకున్నాను. చిత్రం ఏమిటంటే... ఆ అవసరం లేకుండానే బాధిత మహిళలు ఒక్కొక్కరుగా హోమ్‌కి రావడం మొదలుపెట్టారు. అత్యాచారానికి గురైన ఓ నలుగురు అమ్మాయిలకు ఇక్కడే ఆశ్రయం కల్పించాం. వారిలో ఇద్దరు... తిరిగి వారి ఇళ్లకు వెళ్లిపోయారు. మరో అమ్మాయికి మతిస్థిమితం లేకపోవడంతో ఇక్కడే ఉండిపోయింది. ఇంకో అమ్మాయి కూరగాయల షాపు పెట్టుకుని తన బతుకు తాను బతుకుతోంది. అత్తింటి వేధింపులు భరించలేక మా హోమ్‌కి చేరుకున్న మహిళలకు, ఆమె భర్త, అత్త్తమామలకు కౌన్సెలింగ్ చేయడం... ఉమ్మడి కుటుంబంలో కాపురం కష్టమనుకుంటే మేమే దగ్గరుండి వేరు కాపురం పెట్టించడం, అయినా భర్త నుంచి బాధలు తప్పడం లేదంటే మా హోమ్‌లోనే కొన్నాళ్లు ఉంచి వారి కాళ్లమీద వారు నిలబడేలా ఏదైనా వృత్తిశిక్షణ ఇప్పించడం వంటి పనులు చేస్తున్నాం. భర్త చనిపోయిన మహిళల్లో కొందరు... అందరూ ఉన్న అనాథల్లా ఉన్నారు. వీరినే కాదు, పట్టెడన్నం పెడితే చాలంటూ వచ్చే వృద్ధులను కూడా స్వధార్ హోమ్ అక్కున చేర్చుకుంటోంది. ఏదో ఒక పనిచేసుకుని బతికే ఓపిక ఉన్నవారితో వారికిష్టమైన పనిచేయిస్తున్నాం. అలా ఓ నలుగురు వృద్ధులు ఇక్కడే కూరగాయలు అమ్మి పొట్ట పోసుకుంటున్నారు’’ అంటూ తన హోమ్‌కి వచ్చిన మహిళల గురించి చెప్పారు జయశ్రీ. చదువు... ఉపాధి... స్వధార్ హోమ్‌లో పెద్దవాళ్లే కాదు, విద్యార్థులు సైతం ఉన్నారు. ‘‘తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలతోపాటు విద్యార్థి వయసులోనే ప్రేమ పేరుతో ఇంటి నుంచి పారిపోయి వచ్చిన అమ్మాయిలు కూడా ఉన్నారు. వారికి కౌన్సెలింగ్ చేసి వారి తల్లిదండ్రులకు అప్పగించేవరకూ జాగ్రత్తగా చూసుకుంటున్నాం. పెద్దవాళ్ల పరిస్థితి పక్కన పెడితే చిన్నపిల్లలను ఏళ్ల తరబడి మా దగ్గరే పెట్టుకుని చదువు చెప్పించి, వారికి దారి చూపించడం కొంచెం కష్టమైన పనే. నిజానికి స్వధార్ హోమ్ గైడ్‌లైన్స్ ఏంటంటే... ఇక్కడికి వచ్చిన బాధిత మహిళలు మూడు నెలల నుంచి మూడు సంవత్సరాల వరకూ ఉండొచ్చు. ఆ లోపు వారికి ఉపాధిమార్గం చూపించి బయటికి పంపేయాలి. పిల్లలు చదువులో పడ్డాక వారు సెటిల్ అవ్వడానికి ఏళ్ల సమయం పడుతుంది. వారిని మధ్యలోనే మీ దారి మీరు చూసుకోండంటే ఎక్కడికి వెళతారు? అందుకే మేం ఆ గైడ్‌లైన్స్‌ని ఫాలో అవ్వడంలేదు. ఇన్ని నెలలు... ఇన్ని సంవత్సరాలు అనే నిబంధనలు పెట్టుకోకుండా వచ్చినవారి పరిస్థితిని బట్టి ప్లాన్ చేసుకుంటున్నాం. ఇక్కడ మీకు ఒక కేసు వివరాలు చెబుతాను... స్వప్న అనే అమ్మాయికి తల్లిదండ్రులు లేరు. ఏడోతరగతిలో ఉండగానే మేనమామ మహారాష్ట్రకు చెందిన ఓ నలభైఏళ్ల వ్యక్తికిచ్చి పెళ్లి చేసేశాడు. అక్కడికి వెళ్లాక ఆ అమ్మాయిని అతను మరోవ్యక్తికి అమ్మడానికి ప్రయత్నిస్తుంటే విషయం అర్థం చేసుకున్న స్వప్న వెంటనే కరీంనగర్లో ఉన్న స్నేహితురాలికి ఫోన్ చేసింది. ఆమె ఆ ఊరి సర్పంచ్‌కి తెలియజేస్తే అతను మా చెవిన వేశాడు. మేం పోలీసుల సాయంతో మహారాష్ర్ట నుంచి మా హోమ్‌కి రప్పించుకుని, స్కూల్లో చేర్పించాం. ప్రస్తుతం తను నర్సింగ్ ఫైనలియర్ చదువుతోంది. కొంత ప్రభుత్వసాయం, కొందరు దాతల చేయూతతో హోమ్‌ని నడుపుతున్నాం. ఇక్కడికి వచ్చే బాధిత మహిళల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో హోమ్ కెపాసిటి పెంచాల్సిన అవసరం ఉంది. దానికోసం ప్రయత్నాలు చేసుకుంటున్నాను’’ అని ముగించారు జయశ్రీ. ఆ హోమ్‌కి వెళ్లేంతవరకే బాధ. అక్కడున్న మహిళల సమస్యలు తెలుసుకున్న తోటివారు తమ బాధల్ని మరిచిపోతారు. కాని హోమ్ నిర్వాహకులకు మాత్రం ఒక్కో మహిళా ఒక్కో ఛాలెంజ్. లేదంటే వారి సమస్యల్ని పరిష్కరించి వారిని తిరిగి మళ్లీ జీవితంలో స్థిరపర్చడం అంత తేలికైన విషయం కాదు. ఆ పూటకు ఆశ్రయం కల్పించమని వచ్చిన మహిళలకు భరోసా గల భవిష్యత్తుని ఏర్పాటుచేస్తున్న ఈ స్వచ్ఛంద సంస్థ లక్ష్యాలు నెరవేరాలని కోరుకుందాం. - భువనేశ్వరి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: ఎస్. ఎస్ ఠాగూర్