
తమిళనాడు, పెరంబూరు: బుల్లితెర నటుడు ఈశ్వర్‌పై అతని భార్య, బుల్లితెర నటి జయశ్రీ మంగళవారం పోలీస్‌కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వంశం సీరియల్ ద్వారా ప్రాచుర్యం పొందిన నటి జయశ్రీ. అమె బుల్లితెర నటుడు ఈశ్వర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తిరువాన్మయూర్ కామరాజర్ నగర్‌లో నివశిస్తున్న వీళ్ల మధ్య విబేధాలు తలెత్తాయి. నటి జయశ్రీ ఇటీవల తన ఆస్తులకు చెందిన డాక్యుమెంట్స్‌ను కుదవ పెట్టుకున్నాడని, తనను కొడుతూ చిత్ర వదకు గురి చేస్తున్నాడని భర్తపై అడయారు మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో ఈశ్వర్ తన భార్యను కొట్టినట్లు అంగీకరించడంతో అతన్ని అరెస్ట్ చేసి జైలులో పెట్టారు. కాగా మంగళవారం నటి జయశ్రీ చెన్నై పోలీస్‌కమిషనర్ కార్యాలయంలో తన భర్తపై మరో ఫిర్యాదు చేసింది.
అందులో తన భర్త అరెస్ట్ అయిన తరువాత తనకు హత్యాబెదిరింపులు వస్తున్నాయని, వారెవరో కనిపెట్టి తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. అనంతరం జయశ్రీ మీడియాతో మాట్లాడుతూ.. తన భర్త ఈశ్వర్ వేరే టీవీ నటితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని చెప్పింది. అంతే కాకుండా పెళ్లి అయిన తరువాత తాగుడుకు అలవాటు పడ్డాడని, జూదానికి వ్యసనపరుడు అయ్యాడని చెప్పింది. గంజాకు అలవాటు పడినట్లు చెప్పింది. తన డబ్బు, బంగారం తాకట్టు పెట్టాడని తెలిపింది. అంతే కాకుండా తను అక్రమ సంబంధం పెట్టుకున్న నటితో కలిసి ఉన్న వీడియో కాల్స్ చేసేవాడని చెప్పింది. తాగి వచ్చి తన కూతురును లైంగిక వేధింపునకు గురి చేసే వాడని పేర్కొంది. ఇదంతా సహించలేకే తాను అడయారు పోలీసులకు ఫిర్యాదు చేశానంది. దీంతో పోలీసులు ఈశ్వర్‌ను అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. హాత్యాబెదిరింపు కాల్స్ రావడంతో పోలీస్‌కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు నటి జయశ్రీ చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment