TV serial
-
బుల్లితెర ప్రియులకు గుడ్ న్యూస్.. సరికొత్త సీరియల్ వచ్చేస్తోంది!
స్టార్ మా సపరివారంలో సరికొత్తగా మరో సీరియల్ వచ్చి చేరనుంది. 'నువ్వుంటే నా జతగా' అంటూ బుల్లితెర ప్రేక్షకులను అలరించనుంది. మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు తగినట్టుగా ఇంట్లో అందరికీ నచ్చేలా భిన్నమైన అంశాలను అందించడం స్టార్ మా ప్రత్యేకత. ఈసారి అందిస్తున్న కథ ప్రతి తరాన్నీ కనెక్ట్ చేయనుంది.'నువ్వుంటే నా జతగా' అనే సీరియల్ ప్రేమతో సాధించలేనిది ఈ ప్రపంచంలో ఏదీ ఉండదని రుజువు చేయడానికి వస్తున్న కథగా తీసుకొస్తున్నారు. సంప్రదాయానికి, సంస్కృతికి ఎంతో విలువ ఇచ్చే ఒక అమ్మాయికి.. గాలికి తిరిగే కుర్రాడికి మధ్య ఒక అనుకోని మూడుముళ్ల బంధం ఈ కథకి మూలం. ఈ సీరియల్ సోమవారం(డిసెంబర్ 16) నుంచే రాత్రి 9.30 గంటలకు ప్రసారం కానుంది. ప్రేమ ఉన్నచోట కోపం ఉంటుందనే ఒక ప్రాథమిక సూత్రానికి, ప్రేమ ఉంటే తప్పుని దిద్దాల్సిన బాధ్యత కూడా ఉంటుందనే మౌలికమైన ఆదర్శాన్ని ఈ సీరియల్ ద్వారా చూపించనున్నారు.ఏ అమ్మాయికైనా పెళ్లి గురించి ఎన్నో కలలు ఉంటాయి. కానీ ఆ కలలన్నీ మూడుముళ్లతోనే కరిగిపోతే? జీవితం అక్కడ ఆగిపోయినట్టు కాదు. పోగొట్టుకున్నచోటే వెతుక్కోవాలన్న థియరీని ఒక కొత్త దృక్పథంతో చెప్పే ఈ కథ స్టార్ మా బుల్లితెర ప్రేక్షకులను అలరించబోతోంది. -
స్టార్ మాలో మరో కొత్త సీరియల్
మహిళలు ఏ రంగంలో అయినా తమ ప్రతిభతో రాణించడానికి ఇప్పుడు ఆకాశమే హద్దు. ఎందరో ఇలా నిరూపించుకుని చరిత్ర సృష్టించారు. ఈ పరంపరలో ఎల్ ఎల్ బి చదువుకుని, లాయర్ గా తన వాదన వినిపించడానికి వస్తున్న గీత కథ ఇప్పుడు ప్రతి తెలుగు లోగిలినీ ప్రత్యేకంగా అలరించబోతోంది. ధైర్యసాహసాలతో, ఆత్మవిశ్వాసంతో లక్ష్య సాధన కోసం నమ్ముకున్న సిద్ధాంతాన్ని ఆచరించే “స్టార్ మా” సీరియల్ కథల పరంపరలో రానున్న "గీత ఎల్ ఎల్ బి" పూర్తిగా ఒక విలక్షణమైన కథ. బంధాలకు విలువ ఇచ్చి, వాటిని నిలబెట్టాలనుకునే అమ్మాయి జీవితంలో ఎదురయ్యే ఒడుదుడుకులు, తడబడినా నిలబడడానికి ఆ అమ్మాయి చేసే ప్రయత్నాలు, ఎదురైన రకరకాల మనుషులు అన్నీ కలిస్తే ఈ గీత జీవితం.ఒక సగటు అమ్మాయి జీవితంలో.. ఎవరు తనకు ప్రేరణ అనుకుందో అతనితోనే గొడవకు దిగాల్సి రావడం ఆమెకు ఎదురైన అతిపెద్ద సవాలు. న్యాయాన్ని గెలిపించడానికి ఆ అమ్మాయి పడే తపన, కొన్నిసార్లు ఆమె అనుభవించే సంఘర్షణ "గీత ఎల్ ఎల్ బి" సీరియల్ ని విభిన్నమైన సీరియల్ గా నిలబెట్టబోతోంది’ అని మేకర్స్ తెలిపారు. డిసెంబర్ 2 నుంచి రాత్రి 9.30 గంటలకు స్టార్ మాలో ఈ సీరియల్ ప్రసారం కానుంది. -
కొరియోగ్రాఫర్‌ను పెళ్లాడిన బుల్లితెర నటుడు
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. తాజాగా మరో నటుడు ఓ ఇంటివాడయ్యారు. బాలీవుడ్లో ఫేమస్ సీరియల్ నటుడు కిన్షుక్ వైద్య పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. హిందీలో కొరియోగ్రాఫర్‌గా రాణిస్తున్న దీక్షా నాగ్‌పాల్‌ను వివాహం చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.కాగా.. కిన్షుక్ వైద్య షక లక బూమ్ బూమ్ సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్నాడు. వీరి వివాహా వేడుక అలీబాగ్‌లో జరిగింది. ఈ పెళ్లికి సన్నిహితులు, బుల్లితెర తారలు కూడా హాజరయ్యారు. మహారాష్ట్ర సంప్రదాయ వేడుకలో ఈ జంట వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది ఆగస్టులో కిన్షుక్- దీక్షా ల నిశ్చితార్థం జరిగింది. దాదాపు మూడు నెలల తర్వాత వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ నూతన వధూవరులకు అభినందనలు చెబుతున్నారు. అంతేకాకుండా కిన్షుక్ వైద్య రాధా కృష్ణ, వో తో హై అల్బేలా, కర్న్ సంగిని వంటి సీరియల్స్‌లోనూ కనిపించారు. View this post on Instagram A post shared by Diiksha Nagpal (@diikshanagpal) -
బుల్లితెరపై శ్రీమద్ రామాయణం.. మిస్ట్ కాల్‌తో బహుమతి గెలవండి!
సమాజానికి ఆదర్శవంతమైన విలువలను చాటి చెప్పిన శ్రీ మహా విష్ణువు అవతార గాథే " శ్రీ మధ్ రామాయణం". తండ్రి మాట జవదాటని కొడుకుగా.. అన్నగా.. ఏకపత్నీవ్రతుడిగా.. స్నేహితుడిగా.. ప్రజల క్షేమం కోసం ధర్మం తప్పని రాజుగా.. అందరికి ఆదర్శంగా నిలిచిన శ్రీరామగాథను ఎన్ని సార్లు చూసినా తనివి తీరదని చెబుతుంటారు. రామాయణ ప్రియుల కోసం టీవీ సీరియల్ వచ్చేస్తోంది. ఈ శ్రీమద్ రామాయణం సీరియల్లో.. శ్రీ రాముని అవతార విశిష్టత , జన్మ వృత్తాంతం, లంకాధిపతి అయిన రావణాసురుడి జన్మ వృత్తాంతం నుంచి రామాయణంలోని అన్ని ఘట్టాలను కనులకు కట్టినట్లుగా చూపించనున్నారు. అద్భుతమైన సాంకేతిక విలువలతో చిత్రీకరించి శ్రీ రామ గాథను బుల్లితెర అభిమాన ప్రేక్షకులందరినీ అలరించేందుకు వచ్చేస్తోంది.శ్రీ మహర్షి వాల్మీకి రచించిన రామాయణాన్ని 'శ్రీమద్ రామాయణంగా' సూపర్ గ్రాఫిక్ టెక్నాలజీతో, అనుభవజ్ఞులైన నటీనటులతో, ఆకట్టుకునే డైలాగ్స్‌తో రూపొందించారు. ఈనెల 27 నుంచి బుల్లితెర ప్రియులను ఈ సీరియల్ అలరించనుంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజు సాయంత్రం 6.30 గంటలకు ప్రసారం కానుంది.ఈ సీరియల్ ప్రారంభ సందర్భంగా "జెమినిలో కాసుల వర్షం” అనే కాంటెస్ట్ నిర్వహిస్తోంది. మే 27 నుండి జూన్ 1 వరకు ఆరు రోజులపాటు అడిగే ప్రశ్నలకు ప్రేక్షకులు మిస్డ్ కాల్ ద్వారా సమాధానాలను తెలియజేసి బహుమతులను పొందే అవకాశం కల్పించింది. ప్రతి రోజు 500 మంది లక్కీ విజేతలని ఎంపిక చేయనున్నారు. -
యాక్టింగ్‌కు గుడ్ బై చెప్పి రూ.1400 కోట్ల కంపెనీ సీఈవోగా
దూరదర్శన్‌లో 1983లో ప్రసారమైన రామాయణం సీరియల్ గుర్తుందా? రామాయణం, రాముడి కథను అద్భుత దృశ్యకావ్యంగా బుల్లి తెరకు పరిచయం చేసిన ఘనత రామానంద్ సాగర్‌కు చెందుతుంది. ఇప్పటికీ కోట్లాది మంది భారతీయుల్లో గుండెల్లో నిలిచిపోయిన ఆధ్యాత్మిక అద్భుతమంది. రామాయణం తరువాత ఉత్తర రామాయణ్ కూడా తీసుకొచ్చారు రామానంద్. ఈ రెండూ అత్యధికంగా వీక్షించిన సీరియల్స్ రికార్డును కూడా సొంతం చేసుకున్నాయి. అంతేకాదు ఈ పాపులర్ సీరియల్లోని ప్రతి పాత్రధారుడు అద్భుతంగా నటించారు. సీత రాముడు అంటే ఇలానే ఉంటారా అన్న రీతిలో వారిని గుర్తుంచుకున్నారు జనం. ఈ సీరియల్లోని చాలా మంది నటులు ఇప్పటికీ నటనా రంగంలో కొనసాగుతున్నారు. శ్రీరాముడు తనయులు లవకుశుల్లో ఒకరిగా నటించిన వ్యక్తి ఇపుడు ఎక్కుడున్నాడో తెలుసా? నటనా ప్రపంచానికి పూర్తిగా దూరంగా వ్యాపారంలో అడుగుపెట్టి సక్సెస్ అయ్యాడు. ఒక కంపెనీకి సీఈవోగా కోట్లకు అధిపతిగా ఉన్నారు. ఆయన పేరే మయూరేష్ క్షేత్రమదే. బాల నటుడిగా మయూరేష్ లవుడి పాత్రలో కనిపించారు. అయితే 13 ఏళ్ల వయసులో నటనకు స్వస్తి చెప్పిన మయూరేష్ నటనకు స్వస్తి చెప్పిన మయూరేష్ చదువుల వైపు దృష్టి సారించాడు. ఫైనాన్స్ ప్రపంచంలో తన వృత్తిని కొనసాగించడానికి అమెరికా వెళ్లాడు. మయూర్ష్ 2003లో ప్రపంచ బ్యాంక్‌లో పరిశోధకుడిగా తన వృత్తిని ప్రారంభించి, ఆ తరువాత అనేక ఇతర సంస్థలలో పనిచేస్తూ ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చాడు. 2016లో ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెటింగ్ ప్లాట్‌ఫారమ్ కమిషన్ జంక్షన్లో చేరాడు. 2019 నాటికి మయూరేష్ కంపెనీ సీఈవో స్థాయికి ఎదిగారు. 2022 నాటికి, దీని ఈ కంపెనీ ఆదాయం 170 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 1400 కోట్లు) పైమాటే. కుటుంబంతో సహా అమెరికాలో నివసిస్తున్నారు. మయూరేష్ స్పైట్ అండ్ డెవలప్మెంట్ అనే పుస్తకాన్ని కూడా రాశాడు. ఈ సీరియల్లో కుష్ పాత్రను స్వప్నిల్ జోషి మరాఠీ సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇతనికి పిల్లు టీవీ అనే యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. రామాయణ సీరియల్లో శ్రీరాముడిగా నటించిన అరుణ్ గోవిల్, సీత పాత్రలో దీపికా చికిలియా, లక్ష్మణుడి పాత్రలో సునీల్ మెప్పించారు. జనవరి 22న అయోధ్యలో జరిగిన శ్రీరామ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ఈ ముగ్గురు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మా రాముడొచ్చాడు అంటూ వీరికి భక్తులు నీరాజనాలు పట్టిన సంగతి తెలిసిందే. -
గర్భస్రావమని చెప్పినా వినలేదు.. మరుసటి రోజే షూటింగ్: బుల్లితెర నటి
స్మృతి ఇరానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజకీయాల్లో అడుగు పెట్టకముందే సినీ ఇండస్ట్రీలో తనకుంటూ గుర్తింపు తెచ్చుకుంది. భాజపా తరఫున ఎంపీగా గెలిచిన స్మృతి ఇరానీ కేంద్రమంత్రిగా కొనసాగుతున్నారు. అయితే ఆమె బాలీవుడ్లో పలు సీరియల్స్‌లో నటించారు. క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ అనే సీరియల్లో ఫేమ్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత దాదాపు ఎనిమిదేళ్ల పాటు ఇండస్ట్రీలో రాణించారు. బుల్లితెర నటులకు అత్యుత్తమ అవార్డుగా భావించే ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డును వరసగా ఐదు సార్లు అందుకుని చరిత్ర సృష్టించింది. (ఇది చదవండి: ఎవరో ఒకర్ని కొట్టేసి పోతానన్న శివాజీ.. దేవుడు చూస్తాడట!) అయితే తాజాగా క్యుంకీ.. సాస్ భీ కభీ బహు థీ సీరియల్ సహానటి అపరా మెహతా ఆమె గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్మృతి ఇరానీ తన పిల్లలు జోర్, జోయిష్ పుట్టే సమయంలో ఒకరోజు ముందు కూడా షూటింగ్స్‌లో పాల్గొన్నారని మెహతా వెల్లడించారు. అయితే ఈ సీరియల్ షూటింగ్ సమయంలో జరిగిన ఓ చేదు అనుభవాన్ని ఆమె పంచుకున్నారు. అపరా మెహతా మాట్లాడుతూ.. ' స్మృతికి తన కుమారుడు జోర్ పుట్టే ముందు రోజు వరకు మాతో షూటింగ్లో ఉంది. డెలివరీ తర్వాత నాల్గవ రోజే షూట్ చేయడానికి తిరిగి వచ్చింది. రెండోసారి ఆమె కుమార్తె జోయిష్ జన్మించినప్పుడు కూడా అదే పని చేసింది. అయితే ఒకసారి ఆమెకు గర్భస్రావం జరిగినట్లు నాతో చెప్పింది. ఈ విషయాన్ని క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ టీమ్‌కు చెప్పినా వినలేదు. దీంతో మరుసటి రోజే షూటింగ్లో పాల్గొందని.' తెలిపింది. టీవీ పరిశ్రమలో పనిచేయడం చాలా కష్టమని.. అయితే దీనికి ఏ ఒక్క వ్యక్తిని నిందించలేమని పేర్కొంది. ఈ పరిశ్రమలో నిబద్ధత, అంకితభావం అవసరమని వెల్లడించింది. కాగా.. ఈ సీరియల్లో మెయిన్ లీడ్ తులసి విరానీ పాత్రను స్మృతి ఇరానీ పోషించగా.. సవితా మన్సుఖ్ విరానీ పాత్రలో అపరా మెహతా కనిపించింది. (ఇది చదవండి: 'పదేళ్ల పనిని వారంలో చేశారు'.. ఆ డైలాగ్పై నటుడి ప్రశంసలు!) -
పెళ్లయ్యాక కోడలిని చదవనిస్తారా?.. సరికొత్త కథనంతో 'మామగారు'!
తెలుగు రాష్ట్రాలలో బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తోన్న స్టార్ మాలో మరో కొత్త సీరియల్ వచ్చేసింది. సరికొత్త కథనంతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు "మామగారు" అనే సరికొత్త సీరియల్‌తో పలకరించింది. ఈ నెల 11 నుంచి ప్రతి రోజూ సాయంత్రం 6.30 గంటలకు ఈ సీరియల్ ప్రసారమవుతోంది. స్టార్ మాలో ప్రసారమయ్యే వినూత్నమైన కథనం కలిగిన ఈ సీరియల్.. అహంకారానికి - ఆత్మవిశ్వాసానికి నడుమ జరిగిన పోరులా ఉండనుంది. డిగ్రీని పూర్తి చేసి పీజీ చేయాలని.. ఉన్నత వుద్యోగం చేసి వికలాంగురాలైన చెల్లెలు, అమ్మ నాన్నలను కంటికి రెప్పలా చూసుకోవాలని కోరుకునే యువతి గంగ. బాగా చదువుకుని ఉద్యోగంలో చేరిన తర్వాత మాత్రమే ఒక పెద్ద కుటుంబంలో కోడలిగా అడుగు పెట్టాలని కోరుకుంటుంది ఆమె. చెంగయ్య , ఓ పెద్ద మనిషి. పేరున్న కుటుంబానికి చెందిన వ్యక్తి. తన మాటే చెల్లుబాటు కావాలనుకునే పంతం కలిగిన వ్యక్తి. ఆయన మూడో కుమారుడైన గంగాధరన్‌కు చదువుపై ఆసక్తి లేకపోవడంతో చిన్నతనంలోనే ఎలక్ట్రీషియన్‌గా పనికి వెళ్లాడు. తండ్రి చేత తిట్లు తినే అతను, ఈ బాధ ల నుంచి విముక్తి కావాలనుకుంటూ తప్పుడు సర్టిఫికెట్లు తో దుబాయ్‌కి వెళ్లాలని ప్రణాళిక చేస్తాడు. అయితే, అతను ఫోర్జరీ చేయాలనుకున్నది గంగకు చెందిన సర్టిఫికేట్లు కావటం... ఈ విషయం తెలిసి గంగ ఫిర్యాదు చేయటం తో , ప్రభుత్వం గంగాధరన్ పాస్‌పోర్ట్‌ను నిషేదిస్తుంది. పెళ్లి చేస్తే అయినా తమ కుమారుడు గంగాధరన్ మారతాడని భావించి.. చెంగయ్య తన సోదరి కుమార్తె సుభద్రతో గంగాధరన్‌కు వివాహం చేయాలని నిర్ణయించుకుంటాడు. కానీ సుభద్ర గంగాధరన్‌ని పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తుంది. అయినప్పటికీ చెంగయ్య పెళ్లికి ఏర్పాట్లు చేస్తాడు. తన స్నేహితుడి కుమార్తె గంగతో గంగాధరన్ పెళ్లి చేయాలని చెంగయ్య ప్లాన్ చేస్తాడు. అదే సమయంలో గంగ తండ్రికి ప్రాణాపాయస్థితి ఏర్పడటం... డబ్బుకు ఇబ్బంది పడుతున్న గంగకు ధన సహాయం చేసి ఆమె తండ్రిని కాపాడి బదులుగా తన కుమారుడిని పెళ్లి చేసుకోవాలని కోరతాడు. తమ కూతురును చెంగయ్య కొడుక్కిచ్చి పెళ్లి చేస్తానని హామీ ఇచ్చిన గంగ తండ్రి, పెళ్లయ్యాక కూడా గంగను చదివించాలని కోరతాడు. ఇంట్లో ఆడపిల్లలెవరూ పెద్దగా చదువుకోకూడదని నిషేధం విధించిన చెంగయ్య .. సరేనంటూ తల ఊపుతాడు. నిజానికి పితృ స్వామ్య స్వభావం నరనరాన జీర్ణించుకున్న చెంగయ్య.. తన భార్య డాక్టర్ అనే సంగతి కనీసం కుటుంబ సభ్యులకు కూడా తెలియనియ్యడు. అలాంటి వాడు తన కోడలిని చదువుకోనిస్తాడా ? అనేది సీరియల్ చూస్తేనే తెలుస్తుంది. తానెవరిని పెళ్లి చేసుకుంటున్నాడో కూడా తెలియని గంగాధరన్, మంగళసూత్రం కట్టేటప్పుడు గంగ ముఖం చూస్తాడు. తన దుబాయ్ కలలు కల్లలు కావటానికి కారణమైన గంగను భార్యగా గంగాధరన్ అంగీకరించాడా ? ఒక పెద్ద ఇంటికి కోడలు కావాలనే కల సాకారమైనందుకు సంతోషంగా కొత్త ఇంటికి అడుగు పెట్టిన గంగ.. ఒక వైపు తనను అసహ్యించుకునే భర్త, మరోవైపు స్త్రీలను బానిసలుగా భావించే మామగారు... నడుమ తన కలను సాకారం చేసుకోవటానికి ఎలా పోరాడుతుంది ? ఉత్కంఠ భరితమైన సన్నివేశాలతో మామగారు సీరియల్ మిమ్మల్ని అలరించేందుకు వచ్చేసింది. -
తెలుగు సీరియల్ నటుడు ఎంగేజ్మెంట్.. డాక్టర్‌బాబు సందడి
ఈ మధ్య సెలబ్రిటీలు పెళ్లి, నిశ్చాతార్థం లాంటి వాటితో బిజీ అయిపోతున్నారు. ఈ మధ్య సీరియల్ నటి, బిగ్ బాస్ ఫేమ్ కీర్తి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఆమె రూట్ లోనే ప్రముఖ తెలుగు సీరియల్ నటుడు ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. తాజాగా జరిగిన ఈ వేడుకలో డాక్టర్‌బాబు.. అదేనండి నిరూపమ్ తోపాటు పలువురు సందడి చేశారు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7 'ఉల్టా పల్టా' అసలు మీనింగ్ ఇదేనా!?) తెలుగు ప్రేక్షకులు సినిమాలని ఎంత ఆదరిస్తారో.. సీరియల్స్‌ని అంతకంటే ఎక్కువగా చూసేస్తుంటారు. అలా ప్రముఖ ఛానెల్లో ప్రసారమైన ముద్దమందారం, ముత్యమంత ముద్దు లాంటి సీరియల్స్‌తో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న కృష్ణా రెడ్డి ప్రస్తుతం పలు సీరియల్స్‌లో నటిస్తున్నాడు. ఇప్పుడు అతడు స్వాతి అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. బహుశా ఈ ఏడాదిలోనే పెళ్లి కూడా ఉండొచ్చు. ఈ వేడుకలో పలువురు సీరియల్ స్టార్స్ సందడి చేసి, కొత్త జంటని ఆశీర్వాదించారు. (ఇదీ చదవండి: సారీ చెప్పిన హీరో లారెన్స్.. ఆ గొడవపై కామెంట్స్!) -
కార్తీకదీపం కోసం చేయకూడని పనులు అన్ని చేయించారు
-
సెట్లో దురుసు ప్రవర్తన.. నటుడు చందన్‌పై నిషేధం
ఇటీవల షూటింగ్ సెట్లో బుల్లితెర హీరో ఓవరాక్షన్ చేసి చెంపదెబ్బతిన్న సంఘటన సంచలనం రేపింది. ‘స్టార్ మా’ ధారావాహిక సావిత్రమ్మ గారి అబ్బాయితో తెలుగులో గుర్తింపు పొందిన నటుడు చందన్ కుమార్ ‘శ్రీమతి శ్రీనివాస్’ సీరియల్లో లీడ్ రోల్ పోషిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం జరిగిన షూటింగ్ సెట్లో అసిస్టెంట్ డైరెక్టర్‌తో దురుసుగా ప్రవర్తించాడు. అంతేకాదు దుర్భాషలాడుతూ, అతడి తల్లిని దూషించాడు. దీంతో అసిస్టెంట్ డైరెక్టర్ నటుడితో వాదనకు దిగాడు. చదవండి: ఆ హీరోయిన్‌తో డేటింగ్ వార్తలపై నోరు విప్పిన చై ఈ క్రమంలో చందన్ ప్రవర్తన కాస్తా ఇబ్బందిగా అనిపించడంతో అక్కడి వారంత అతడిపై సీరియస్ అయ్యారు. అసిస్టెంట్ డైరెక్టర్‌కి క్షమాపణ చెప్పమనడంతో చందన్ కుమార్ నేనేంటో చూపిస్తా అంటూ సీరియస్ అయ్యాడు. దీంతో ఆగ్రహించిన అసిస్టెంట్ డైరెక్టర్ చందన్ కుమార్‌ని అందరి ముందే కొట్టాడు. చుట్టూ ఉన్న వాళ్ళు ఆపడానికి ప్రయత్నించగా చందన్ షూటింగ్ నుంచి వెళ్ళిపోయాడు. అయితే అక్కడితో గొడవ ముగిసింది అనుకుంటే చందన్ కన్నడ మీడియా ముందు తెలుగు పరిశ్రమపై అసత్యాలు ప్రచారం చేస్తూ, తెలుగు బుల్లితెరని కించపరుస్తూ మాట్లాడాడు. చదవండి: సెట్లో ఓవరాక్షన్ చేసి తన్నులు తిన్న హీరో.. వీడియో వైరల్ దీంతో ఈ వివాదం కాస్తా మరింత ముదిరింది. తెలుగు పరిశ్రమ గురించి తప్పుగా మాట్లాడినందుకు నేడు తెలుగు టీవీ ఫెడరేషన్ సమావేశం ఏర్పాటు చేసి చందన్‌పై బ్యాన్ విధించింది. తెలుగు టీవీ ఫెడరేషన్ సమావేశంలో బాధితుడు అసిస్టెంట్ డైరెక్టర్ మాట్లాడుతూ.. ‘షాట్ రెడీ అని నాలుగు సార్లు పిలిచాను, అయినా రాకుండా నన్ను కొట్టి, బూతులు తిట్టాడు. డైరెక్టర్‌కి కంప్లైంట్ చేస్తే బయటకి రా దమ్ముంటే నేనెంటో చూపిస్తానంటూ బెదిరించాడు’ అని తెలిపాడు. దీంతో చందన్ తీరును క్షమించరానిదిగా పరిగణించి తెలుగు టీవీ ఫెడరేషన్ చందన్‌ని బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటన ఇచ్చింది. -
‘యాక్.. ఇలాంటి చెత్త సీన్లు ఎలా తీస్తారు మీరు?’
మన దగ్గర వచ్చే కొన్ని సినిమాలు, సీరియల్స్‌లోని సన్నివేశాలు చూస్తే ఓవరాక్షన్కే.. ఓవరాక్షన్ నేర్పించే సత్తా ఉన్నట్లు అర్థం అవుతుంది. ఏ సీరియల్, ఏ సినిమా అనే టాపిక్ వద్దు. తాజాగా సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఓ హిందీ సిరీయల్‌కు సంబంధించిన సీన్ చూస్తే.. మీకు కడుపులో తిప్పుతుంది. యాక్ థూ ఇదేం దరిద్రం అని తిట్టుకోకమానరు. ఆ ఓవర్‌యాక్షన్ సీన్ వివరాలు.. (చదవండి: ప్రియుడిని తలుచుకుని వెక్కి వెక్కి ఏడ్చిన బిగ్‌బాస్ కంటెస్టెంట్) కొన్నేళ్ల క్రితం హిందీలో టెలికాస్ట్ అయిన ‘దిల్ సే ది దువా సౌభాగ్యవతి భవా’ సీరియల్లోని సీన్‌కు సంబంధించిన వీడియో క్లిప్ తాజాగా నెట్టింట్లో తెగ వైరలవుతోంది. దీనిలో హీరో-హీరోయిన్ల ఫస్ట్ నైట్ సన్నివేశం వస్తుంది. హీరో ప్రేమగా హీరోయిన్ను దగ్గరకు తీసుకునే సమయంలో ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో తెలియదు కానీ ఆమె ఒంటి మీదకు బొద్దింక ఎక్కుతుంది. దాన్ని చూసి హీరోయిన్ తన మీద పాము పడ్డట్లు ఫీలై భయంతో అల్లంత దూరం పారిపోతుంది. (చదవండి: ఆ హీరో తల్లి నన్ను చెప్పుతో కొట్టడానికి ప్రయత్నించింది: రేఖ) ఇక మన హీరో గారు ఆ బొద్దింకను దొరకబుచ్చుకుని.. తన భార్యను భయపెట్టినందకు ప్రతీకారంగా.. దాన్ని చంపాలనుకుంటాడు. కానీ హీరోయిన్ వారించడంతో ఆగిపోతాడు. ఆ సమయంలో అతడికి ఓ తింగరి ఆలోచన వస్తుంది. బొద్దింక మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం భార్య తన కోసం తెచ్చిన పాలల్లో దాన్ని వేసి.. శుభ్రంగా తాగి.. తృప్తిగా బ్రేవ్మంటాడు. (చదవండి: భారీ రెమ్యునరేషన్‌పై నెటిజన్ల ట్రోలింగ్.. రిప్లై ఇచ్చిన కరీనా) ఈ సన్నివేశం చూసి అటు హీరోయిన్‌కి ఇటు వీడియో చూస్తున్న మనకు ఒకేసారి కళ్లు తిరగడంతో పాటు వాంతులు కూడా అవుతాయి. ఇక ఈ వీడియో చూసిన నెటిజనులు సీరియల్ దర్శకుడిపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాంటి దరిద్రమైన ఆలోచనలు మీకు ఎలా వస్తాయి.. ఇలాంటి సన్నివేశాలు ఇంకో రెండు మూడు చూస్తే మా జీవితం మీద మాకే విరక్తి కలుగుతుంది.. యాక్ థూ అంటూ ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు నెటిజనులు. -
సీరియల్ ప్రమోషన్లో కృతిశెట్టి.. రెమ్యునరేషన్ ఎంతంటే?
ఒకే ఒక్క సినిమాతో ఎక్కడలేని క్రేజీ సంపాదించుకుంది ‘ఉప్పెన’ బ్యూటీ కృతిశెట్టి. ఆకర్షించే ఆందంతో పాటు, ఆకట్టుకునే నటనతో తెలుగు ప్రేక్షకులకు తక్కువ సమయంలోనే ఎక్కువ దగ్గరైంది. తొలి సినిమానే సూపర్, డూపర్ హిట్ అవ్వడంతో ఈ ‘బేబమ్మ’కు ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే నాని శ్యామ్ సింగరాయ్, సుధీర్ బాబు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాలతో పాటు లింగుస్వామి, రామ్ పోతినేని కాంబోలో రాబోతున్న చిత్రంలోనూ హీరోయిన్గా నటిస్తోంది. కేవలం సినిమాలే కాకుండా.. ప్రకటనల్లోనూ నటించేందుకు సిద్దమైంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ బ్యూటీకి ఉన్న క్రేజీని దృష్ట్యా పలు సంస్థలు తమ ప్రాడక్ట్స్ ప్రకటనల కోసం నటించమని కోరుతున్నాయట. ఇక ప్రముఖ ఎంటర్టైన్మెంట్ చానల్ జీతెలుగు అయితే బేబమ్మ క్రేజీని సీరియల్స్ ప్రమోషన్ కోసం వాడేసింది. జీతెలుగులో ప్రసారమయ్యే ఓ కొత్త సీరియల్ ప్రమోషన్లో కృతిశెట్టి పాల్గొంది. ఈ ప్రకటన కోసం కృతి ఏకంగా కోటి రూపాయలు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ, ఒకే ఒక్క సినిమాలో నటించి, ప్రకటనకు రూ. కోటి రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్గా కృతి రికార్డుల్లోకి ఎక్కినట్లే. -
Devatha : రుక్మిణి నిర్ణయంతో దేవుడమ్మ ఆగ్రహం..
సత్యకు న్యాయం జరగాలని రుక్మిణి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఇదే విషయాన్ని దేవుడమ్మతో ప్రస్తావించగా..సత్యకు కావాల్సిన సదుపాయాలు అన్నీ ఏర్పాటు చేస్తానని, ఏ లోటు రానివ్వనని దేవుడమ్మ మాటిస్తుంది. అయితే అది మాత్రమే కాదని,సత్యకు తన పెనిమిటికి పెళ్లి చేయాలని రుక్మణి తన మనసులో మాటను చెప్పేస్తుంది. దీనికి దేవుమ్మ ఏమని బదులిచ్చింది? సత్యను కోడలుగా అంగీకరిస్తుందా అన్నది తెలియాలంటే ఎపిసోడ్లో ఎంటర్ అవ్వాల్సిందే. దేవత సీరియల్ జులై8న 280వ ఎపిసోడ్ నాటి విశేషాలను తెలుసుకుందాం. సత్య జీవితం బావుండాలని, ఇందుకు ఆదిత్యతో పెళ్లి ఒక్కటే పరిష్కారమని రుక్మిణి బలంగా నమ్ముతుంది. ఇదే విషయాన్ని దేవుడమ్మతో చెప్పేందుకు ప్రయత్నిస్తుంది. తన చెల్లికి న్యాయం ఎలా చేస్తారంటూ ప్రశ్నిస్తుంది. ఇందుకు బాదులుగా సత్యకి అన్యాయం అయితే జరగదని దేవుడమ్మ బదులిస్తుంది. ఇందుకు గాను సత్యతో పాటు ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు కావాల్సిన సదుపాయాలు,డబ్బు వంటి విషయాల్లో ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటానని మాటిస్తుంది. మరి సత్య బిడ్డకు తండ్రి ఎలా అన్న రుక్మిణి ప్రశ్నకు దేవుడమ్మ సందేహిస్తుంది. తప్పులు మీరు చేసి నన్ను పరిష్కారం అడుగుతున్నారా అని అంటుంది. అయితే ఇందుకు ఒకటే దారని, అది సత్యకు, ఆదిత్యకు పెళ్లి చేయాలని రుక్మిణి చెప్తుంది. ఇది విన్న దేవుడమ్మ కోపంతో ఊగిపోతుంది. అసలు బుద్ది ఉందా ఇలా మాట్లాడానికి అంటూ రుక్మిణిపై కోప్పడుతుంది. ఇలా ఎప్పటికీ జరగదని తెగేసి చెప్పేస్తుంది. మరోవైపు సత్యను తీసుకెళ్లడానికి భాగ్యమ్మ వస్తుంది. ఇక్కడే ఉంటే సమస్యలు ఎక్కువ అవుతాయని, తనతో పాటు ఇంటికి తీసుకెళ్తానని పేర్కొంటుంది. దీనికి రుక్మిణి అడ్డుచెప్పగా, భాగ్యమ్మ మాత్రం వెనక్కి తగ్గదు. ఇక సత్య ఇల్లు దాటి వెళ్తే మన పరువే పోతుందని సూరి దేవుడమ్మకు చెప్తాడు. కనకం తన భర్తతో వచ్చి నానా గొడవ చేస్తుందని, అప్పుడు ఇంటి పరువు వీధికెక్కుతుందని పేర్కొంటాడు. మరి సూరి మాటలకు దేవుడమ్మ ఏకీభవించి సత్యను ఇంట్లోనే పెట్టుకుంటుందా లేక బయటకు పంపిస్తుందా అన్నది తర్వాతి ఎపిసోడ్లో చూద్దాం. -
karthika Deepam: నిజం చేప్పిన దీప, హడలేత్తిపోయిన మోనిత!
కార్తీకదీపం మే 12: దీప తండ్రి మురళీ కృష్ణ కార్తీక్ నా కూతురికి పిల్లలకు తల్లి అవసరం ఉంటుందని తెలిసి కూడా వెళ్లిందంటే అర్థమేంటని నిలదిస్తాడు. నా కూతురి ఒక బొమ్మల చూశారని, దానిలో ఆశలు రేపి మనసుతో ఆడుకున్నారంటాడు. నేను భర్తగా నిన్ను ఇంటికి తీసుకేళ్లున్నానని నీ కూతురితో చెప్పలేదుకదా అని కార్తీక్ అనగా.. మరి మా మ్మ-నాన్నలకు కోడలిగా తీసుకేళ్తున్న అని మీరు కూడా చెప్పలేదు కదా అంటాడు మొరళీ కృష్ణ. ఇంతలో అక్కడికి మోనిత వస్తుంది. ఆమెను చూడాగానే.. ఆహా పాపి చిరాయివని ఊరికే అన్నారా తలుచుకున్న లేకపోయిన తగలబుడుతుందంటూ కౌంటర్ వేస్తాడు మురళీ కృష్ణ. దీప దొరికిందా కార్తీక్ అని మోనిత అడగ్గానే.. ఏమ్మా దీప అత్తాగారింటి నుంచి వెళ్లిపోయిందని నీకు తెలుసా అనగా కార్తీక్ చెప్పాడని చెబుతుంది. దీంతో ఓహో.. నా కూతురు వెళ్లిపోతే నాతో చెప్పకుండ నీకు ఫోన్ చేసి చెప్పాడా అంటూ వ్యంగ్యంగా అంటాడు మురళీ కృష్ణ. దీంతో మోనితా మరీ మీ కూతురు నేను వెళ్లిపోతున్నానని మీతో అయినా చెప్పొచ్చు కదా అంటుంది. చెప్పదమ్మా నా కూతురికి ఆత్మాభిమానం ఎక్కువ.. విలువ లేని చోటుకి అస్సలు వెళ్లదు నీ..లా అంటూ సమాధానం ఇస్తాడు. మరీ నీ కూతురు కట్టుకున్న భర్తకు కూడా చెప్పకుండా వెళ్లిపోవడం కరెక్టా అని మోనితా ప్రశ్నించగా.. అది తప్పే మొగుడితో చెప్పకుండా వెళ్లడం, అది భార్యభర్తల సమస్య.. మరీ నువ్వేందుకు ఆ కుటుంబ సమస్యల్లో తలదూరుస్తున్నావు మాటిమాటి అని మోనితను అవమానించేలా మాట్లాడుతుంటాడు అయన. దీంతో కార్తీక్.. ఏం మాట్లాడుతున్నారు కూతురు కనిపించడంలేదనే ఆవేశంలో మాట్లాడుతన్నారనుకున్న కొంచం మర్యాదగా మాట్లాడండి అంటాడు. అలాగే హాయిగా విశ్రాంతి తీసుకుంటూ మందులు వేసుకొమ్మని చెప్పడం కూడా తప్పేనా అంటుండగా... దానికి మొరళీ కృష్ణ.. చెప్పడం తప్పు కాదు చెప్పే పద్దతి తప్పు.. అంటు శ్రీరామ నవమి రోజు జరిగిన విషయాన్ని గుర్తు చేస్తాడు. ఆ రోజు మీ స్నేహితురాలు మోనిత కాకుండా మీరు కానీ, మీ అమ్మతో కానీ టాబ్లెట్ ఇప్పిస్తే మారు మాట్లాడకుండా వేసుకునేది నా కూతురు అంటాడు. ఆ టబ్లెట్ మోనిత ఇస్తే ఏమైంది అని కార్తీక్ అడగ్గా.. తన చేతితో వేస్తే అమృతం కూడా విషయం అవుతుందంటాడు. అందుకే నా కూతురు కళ్లు తిరిగి పడిపోయింది అంటాడు ఆయన. ఇక వెంటనే మోనిత మాట్లాడుతూ.. మీ కుటుంబ విషయాల్లో కలుగజేసుకోవద్దని చెప్పిన మీకు నా గురించి అవమానం మాట్లాడే ఆర్హత కూడా లేదు. నేను ఒక డాక్టర్ని అన్న విషయం మర్చిపోకండి అంటుంది. అయితే దీప మీ ఇంటిక రాలేదా అని కార్తీక్ అడగ్గా.. రాలేదు, రాదు కూడా అది మనసు విరిగి వెళ్లింది, ఆ విజయనగరంలోనే దాని పని అది చేసుకుంటు ఉండేది అక్కనుంచి దాన్ని తీసుకు వచ్చి గుండెలో చిచ్చురేపారని మురళీ కృష్ణ అసహనం వ్యక్తం చేస్తాడు. దీనికి కార్తీక్ అవును బాగానే ఉండేంది, టిఫీన్లకు పప్పులు రుబ్బుతూ, బాగానే ఉండేది, మరీ ఆరోగ్యం పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తాడు. మధ్యలో మోనిత ఈ పెద్దాయనతో ఇక్కడ ఎందుకు మాటలు దీప ఎక్కడికి వెళ్లిందో వెతుకుదాం పదా అంటుంది. మరోవైపు దీప పోయ్యి దగ్గర పిండి వంటలు చేస్తూ ఉంటుంది. సరోజక్కతో ఈ దీప మళ్లీ వంటలక్కగా మారింది అంటూ నవ్వుకుంటుంది. ఇంతలో కార్తీక్, మోనితలు అక్కడి వస్తారు. సరోజక్క చూసి దీప డాక్టర్ బాబు వచ్చాడు అని సైగా చేస్తుంది. ఏదో ఆర్డర్ ఇచ్చిపోడానికి వచ్చినట్లున్నారని, ఏం కావాలో కనుక్కొని అడ్వాన్స్ తీసుకుని పంపించు అనగానే.. మోనిత దీపా... అంటూ పలకరిస్తుంది. ఒకేసారి అగ్రహంతో ఊగిపోయిన దీప పొయ్యిలోని మండే కట్టెతీసుకుని మోనితను ఇక్కడ నుంచి నడవవే.. ఇదంతా నీ వల్లే కదా నేను చస్తే నా మొగుడ్ని కట్టుకుందామని గుంట కాడి నక్కల ఎదురు చూస్తూ నాకు టాబ్లెట్ మార్చి ఇచ్చి కళ్లు తిరిగిపడిపోయేలా చేశావ్ అనగానే, మోనిత హడలెత్తిపోతుంది. విన్నావు కదా కార్తీక్ నేను వెళుతున్నా అంటూ మెల్లిగా జారుకుంటుంది మోనితా. ఆ తర్వాత దీప డాక్టర్ బాబుతో మీతో వచ్చింది వెళ్లింది కదా ఇంకేందుకు ఇక్కడున్నారు వెళ్లండి అనగానే.. పొయ్యిలో నీళ్లు పోసి దీపను లోపలికి పదా అంటూ లాక్కెళ్లి విచిత్రంగా ప్రవర్తిస్తాడు కార్తీక్. అది చూసి దీప ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది, దీపకు కార్తీ నిజం చెప్తాడా లేదా అనేది రేపటి ఎపిసొడ్లో తెలుసుకుందాం. -
karthika Deepam: పిల్లలకు తల్లి అవసరమా..
కార్తీకదీపం మే 11: డాక్టర్ భారతీ మోనితతో ‘భార్యభర్తలను విడదీయాలనుకోవడం అన్యాయమని, నిది నిజమైన ప్రేమ కాదు. ఉన్మాదం. కార్తీక్‌ను ప్రేమిస్తే ప్రేమించావ్.. కానీ నీకు సాయం కాదు కదా మద్దతు కూడా ఇవ్వను’ హెచ్చరించి వెళుతుంది. ఆ తర్వాత మోనిత జరిగిదంతా గుర్తుచేసుకుంటూ కోపంతో రగిలిపోతుంది. హెల్ప్ చేయకుంటే చేయకు నాకు నేను హెల్ప్ చేసుకుంటాను. ఎప్పటికీ దీపను కార్తీక్‌తో కలవనివ్వను, సుఖంగా కాపురం చేసుకొనివ్వను అంటూ తన క్రూరత్వాన్ని చూపిస్తుంది. ఇదిలా ఉండగ ఆదిత్య, శ్రావ్యలు మేడపైన కూర్చుని ఇంట్లో అసలు ఏం జరుగుతుంది. నువ్వు ఏం చేయట్లేదేంటి ఆదిత్య అంటుంది శ్రావ్య. సడెన్‌గా అత్తయ్య, మామయ్య ఎక్కడికి వెళ్లారు, అంత అర్జెంటుకు వెళ్లాల్సిన అవసరం ఏం వచ్చింది అంటుంది శ్రావ్య. అలాగే ఈమధ్య అత్తయ్య బావగారికే సపోర్టు చేస్తూ మాట్లాడారు. ఇదంతా చూస్తుంటే ఇంకేదో ఉందంటూ ఇంట్లో సమస్యల గురించి మాట్లాడుకుంటుంటారు. ఈలోపు హిమ, సౌర్యలు వాళ్ల దగ్గరికి వెళ్లి ఇంట్లో ఎవరులేరేంటని అడుగుతారు. అమ్మ ఎక్కడికి వెళ్లింది, ఇంట్లో కనిపించడం లేదని అడగడంతో శ్రావ్య, ఆదిత్యలు కంగారు పడుతూ కిందికి వెళ్లి దీప కోసం వెతుకుతుంటారు. ఇంతలో కార్తీక్ ఆస్పత్రి నుంచి ఇంటికి వస్తాడు. వదిన ఇంట్లో కనిపించడం లేదు అన్నయ్య అంటాడు ఆదిత్య. దీంతో కార్తీక్ కనిపించకుంటే వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా అంటాడు. నువ్వు ఆస్పత్రికి తీసుకేళ్లావేమో అనుకున్నాము అని ఆదిత్య అంటుండగా సౌర్య, హిమా కార్తీక్‌ని చూసి ఏడుస్తూ వస్తారు. అమ్మ లేదు డాడీ అని చెప్పగానే కార్తీక్ మీరు ఏం టెన్షన్ పడకండి ఎక్కడికి వెళుతుంది మిమ్మల్ని వదిలి అంటూ ఓదారుస్తాడు. మీరు పిల్లల్ని చూసుకోండి దీపను నేను తీసుకుని వస్తానంటూ కార్తీక్ అంటుండగా ఆదిత్య నీకు తెలుసా వదిన ఎక్కడికి వెళ్లిందో అని ప్రశ్నిస్తాడు. పిల్లల్ని వదిలి మీ వదిన ఎక్కడికి వెళుతుంది రా చెప్పింది చేయ్ అంటాడు. ఇక కార్తీక్, దీపను వేతికే పనిలో ఉండగా మోనిత కాల్ చేస్తుంది. ఎక్కడ ఉన్నావ్ భారతిని తీసుకురానా దీపకు నచ్చజెపుతుందని అంటుతుంది. దీంతో కార్తీక్ నేను బయట ఉన్నాను ఇప్పుడు అవసరం లేదని విసుగ్గా అంటాడు. దీంతో.. దీప మళ్లీ తట్టాబుట్ట సర్దేసిందా అంటుంది మోనిత. కార్తీక్ షాకై నీకేలా తెలుసని అనగా.. గెస్ చేశా అంటుంది మోనిత. దీంతో కార్తీక్ ఫోన్ కట్ వెళ్తుండగా మధ్యలో దీప తండ్రి మురళీ కృష్ణ ఎదురు పడతాడు. కార్తీక్ మురళీకృష్ణతో మీ అమ్మాయి కనిపించడం లేదు అని చెప్పగానే మీ ఇంట్లో లేదు.. అవును అని కార్తీక్ అంటుండగా.. మా ఇంట్లో కూడా లేదు అంటాడు మురళీకృష్ణ. వెతకడానికి బయలుదేరారా అని అడుగుతూ.. ఎక్కడ దొరుకుతుందని బయలుదేరారని మురళీకృష్ణ ప్రశ్నిస్తూ.. మీ ఇంట్లో పొగుట్టుకున్న దాన్ని లోకంలో ఎక్కడని వెతికి పట్టుకుందామనుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తాడు. మా అమ్మాయి పిచ్చిది పదేళ్ల క్రితం పొగొట్టుకున్నదాన్ని మళ్లీ పదేళ్ల తర్వాత మీ ఇంట్లో వెతుక్కుందామని వచ్చింది అని అనగా.. అది మీ అమ్మాయి అమాయకత్వం అంటాడు కార్తీక్. మరీ మీదీ అని మురళీకృష్ణ అడగ్గా.. నాకేం సంబంధం లేదంటూ.. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, అలాంటి ఆలోచన కూడా లేకుండా వెళ్లిపోయింది అంటాడు. అయితే పిల్లలకు తల్లి అవరమా అని మురళీ కృష్ణ అనగానే అదేం ప్రశ్న అంటాడు కార్తీక్. మరీ నా కూతురికి తెలియదా తల్లి లేకుంటే పిల్లలు తల్లడిల్లుతారని, అయినా వెళ్లిందంటే అర్థమేంటి అని ప్రశ్నించగా.. అది మీ కూతురి మూర్ఖత్వం అంటాడు కార్తీక్. చేసిందంత మీరు చేసి దాన్ని దోషిని చేస్తారేంటి అంటూ కార్తీక్‌ని మురళీకృష్ణ నిలదిస్తాడు. ఇక ఆ తర్వాత ఏమైందో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
బంజారాహిల్స్: టీవీ సీరియల్ మేనేజర్‌పై కేసు
సాక్షి, బంజారాహిల్స్: కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి అనుమతులు తీసుకోకుండా సమూహాలుగా ఏర్పడి టీవీ షూటింగ్‌ను నిర్వహిస్తున్న ఘటనలో తెలుగు టీవీ ప్రొడక్షన్ మేనేజర్ కె.ప్రవీణ్‌కుమార్(34)పై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. బుధవారం మధ్యాహ్నం ఫిలింనగర్‌లోని సాయిబాబా టెంపుల్ వద్ద మంగమ్మగారి అబ్బాయి మా టీవీ తెలుగు సీరియల్ షూటింగ్ జరుగుతుండగా సమాచారం అందుకున్న బంజారాహిల్స్ ఎస్ఐ రవిరాజ్ సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లారు. సుమారుగా 18 మంది వరకు ఈ షూటింగ్లో పాల్గొని కోవిడ్–19 మార్గదర్శకాలు పాటించకుండా షూటింగ్ నిర్వహించారని గుర్తించారు. పెద్ద ఎత్తున ప్రజలు ఉండటంతో పాటు ఏ ఒక్కరూ కూడా మాస్క్‌లు ధరించలేదని తెలిపారు. ఈ టీవీ సీరియల్ మేనేజర్ కె.ప్రవీణ్‌కుమార్‌పై ఐపీసీ సెక్షన్ 188, 269, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. -
నువ్వు నిజమైన జాతిరత్నానివి సామి!
టీవీ సీరియల్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్క పాయింట్ తీసుకుని ఏళ్లకేళ్లు సాగదీస్తూనే ఉంటారు. అందుకే వీటిని జీడిపాకం.. బబుల్గమ్తో పోలుస్తుంటారు. ఎవరెన్ని కామెంట్స్ చేసినా సీరియల్స్‌కు ఉండే క్రేజ్‌ను మాత్రం ఒప్పుకుని తీరాల్సిందే. ఇక తాజాగా సీరియల్స్‌లో కూడా సినిమాటిక్ సీన్లు బాగా పెరుగుతున్నాయి. రొమాన్స్, ఫైట్ సీన్లతో పాటు.. మరి కొన్ని అడ్వెంచరస్ సీన్లను కూడా రూపొందిస్తున్నారు దర్శకులు. ఇక ఈ మధ్య కాలంలో వచ్చే సీరియల్స్‌లో సినిమా దర్శకులు కూడా ఊహించలేని సీన్లు బాగా పెరిగిపోయాయి. ఇక మానవాతీత శక్తులకు సంబంధించిన సీరియల్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. వీటిలో లాజిక్‌ని వెతికితే మన చిప్పు దొబ్బుతుంది. ఇప్పుడు ఈ సీరియల్స్ పురాణం ఎందుకంటున్నారా.. తాజాగా ఓ సీరియల్‌కు సంబంధించిన సీన్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఈ సన్నివేశం చూసి నెటిజన్లు చేసే కామెంట్స్ వింటే సదరు సీరియల్ దర్శకుడు నిజంగానే అజ్ఞాతంలోకి వెళ్లిపోతాడు. అంతగా ఏం చేసాడబ్బా అనుకుంటున్నారా.. తన సీరియల్లో ప్రియుడు, ప్రియురాలి కోసం ఏకంగా చందమాను తుంచి ఆమెకు గిఫ్ట్‌గా ఇచ్చే సన్నివేశాన్ని రూపొందించాడు సదరు దర్శకుడు. ఈ సీన్ చూసిన తర్వాత నెటిజన్లు చేసే కామెంట్స్ చూస్తే పొట్ట చెక్కలవ్వడం ఖాయం. ఇంతకు ఈ అపురూప దృశ్యం ఏ సీరియల్లో వచ్చింది అంటే.. ‘యే జాదు హై జిన్ కా’. స్టార్ ప్లస్‌లో ప్రసారమైన ఫాంటసీ డ్రామా సీజన్ 2లోని సీన్ ఇది. అక్టోబరు 2019-నవంబరు 2020 మధ్య ప్రసారమైంది. తెలుగులో కూడా ఈ సీరియల్ వస్తుంది. జిన్ మాయాజాలం పేరుతో మాటీవీలో ఈ సీరియల్ వస్తుంది. ఇలాంటి జాతిరత్నం లాంటి సీన్ ఉన్న సీరియల్ కోసం హాట్‌స్టార్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకుని మరీ చూస్తున్నారు నెటిజన్లు. ఇక సీరియల్లో భాగంగా తనను పెళ్లి చేసుకోవాలంటే చందమాను తుంచి తీసుకురావాలని లవర్‌కి కండిషన్ పెడుతుంది ప్రియురాలు. దాంతో వెంటనే తన కారు వేసుకుని గాల్లోకి వెళ్లిపోయి.. చంద్రుడి పైకి మన మ్యాజిక్ స్టిక్ విసురుతాడు హీరో. ఆ దెబ్బకు చంద్రుడు ముక్కలైపోతాడు. కొన్ని ముక్కలు భూమ్మీదకి వచ్చి పడతాయి. Bara masla yeh hai ke chaand ka tukra nechay aa bhi gaya. Anyway I want that car 😔😔😔 pic.twitter.com/I8ZvcviyZf — Main Abdul Majid Hoon (@ComicsByMajid) March 28, 2021 ఇక ఈ సీన్ చూసిన జనాలు పిచ్చెక్కిపోతున్నారు. ‘‘మీ క్రియేటివిటీ తగలడా.. అసలు ఎలా వస్తాయ్ రా నాయనా మీకు ఇలాంటి లాజిక్‌లేని ఆలోచనలు’’.. ‘‘చంద్రుడిపైకి వెళ్లేందుకు ‘నాసా’ అనవసరంగా ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేస్తుంది.. ఇక మీదట మన హీరోని గారిని పంపిస్తే సరి’’.. ‘‘విఠలాచార్య చచ్చి బతికిపోయారు కానీ ఇప్పుడు కానీ ఉండుంటే ఈ సీన్ చూసి పోయేవారు కదరా’’ అంటూ కామెంట్ చేస్తున్నారు. పోతార్రోయ్ సర్వనాశనమైపోతారు అంటూ మీమ్స్ షేర్ చేస్తున్నారు. చదవండి: కార్తీక దీపం కోసం ‘ఐపీఎల్ టైమింగ్ మార్చండి' ఇట్లు.. ప్రేమతో మీ 'కార్తీకదీపం' దీప -
వంటలక్కను ఢీ కొట్టనున్న కృష్ణ తులసి!
టాలీవుడ్ సినీ దిగ్గజం, అగ్రదర్శకుడు కె.రాఘవేంద్రరావు గురించి తెలియనివారు ఉండరు. దాదాపుగా అందరు అగ్రహీరోలతోనూ బాక్సాఫీస్ హిట్స్ కొట్టిన ఆయన గత కొంత కాలంగా సినిమా దర్శకత్వానికి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. సినిమా రంగంలో టాప్‌లో వెలిగిన దర్శకేంద్రుడు తాజాగా ఓ తెలుగు టీవీ సీరియల్‌కు దర్శక పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టడం విశేషం. ఆర్కే టెలీ షో ద్వారా జీ తెలుగు చానెల్లో ప్రసారం కానున్న 'కృష్ణ తులసి' సీరియల్‌కు కె.రాఘవేంద్రరావు దర్శక పర్యవేక్షణ చేయనున్నారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ కృష్ణ తులసి అనేది ఒక స్ఫూర్తి దాయక మహిళకు చెందిన వైవిధ్యమైన జీవిత కధ కావడం తనను ఆకట్టుకుందన్నారు. సీరియల్లో కృష్ణతులసి పాత్ర తన హృదయానికి దగ్గరగా అనిపించిందని, ఈ పాత్ర తప్పనిసరిగా తెలుగు ప్రేక్షకులకు నచ్చుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సీరియల్ జీ తెలుగులో ఫిబ్రవరి 22 నుంచి ప్రసారం కానుందని జీ తెలుగు ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతానికైతే ఈ సీరియల్‌కు దండిగా ప్రచారం చేస్తున్నారు. పైగా రాఘవేంద్రరావు బరిలో దిగారంటే వంటలక్క సీరియల్‌కు ఏమైనా ఎఫెక్ట్ పడుతుందేమోనని అభిప్రాయపడుతున్నారు. మరి నిజంగానే కృష్ణ తులసి సీరియల్ టీఆర్పీలో కార్తీక దీపాన్ని దాటేస్తుందా? లేదా? అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే! చదవండి: నాన్న దగ్గర రాఘవేంద్రరావు అసిస్టెంట్‌గా చేశారు -
‘ముద్దు సీన్ గురించి అమ్మతో చర్చించాకే..’
బాలీవుడ్ నటి హీనా ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 11 ఏళ్ల క్రితం ‘యే రిష్తా క్యా కెహ్లాతా హై’ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు హీనా ఖాన్. ఆ తర్వాత బిగ్‌బాస్ షోతో మరింత ప్రచారం పొందారు. ఇక ఆమె నటించిన తొలి చిత్రం కేన్స్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. తాజాగా ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా సత్తా చాటారు హీనా ఖాన్. ఈ నేపథ్యంలో బాలీవుడ్లో తన ప్రయాణం గురించి హ్యూమన్స్ బాంబేతో పంచుకున్నారు హీనా ఖాన్. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. ‘నేను సనాతన కాశ్మీరీ కుటుంబం నుంచి వచ్చాను, అక్కడ నటన అనే మాట నిషిద్ధం. కాలేజీ చదువుల నిమిత్తం నన్ను ఢిల్లీ పంపేందుకు నా తల్లిదండ్రులు సందేహించారు. కానీ నాన్నను ఒప్పించి ఢిల్లీ వచ్చాను. ఆ సమయంలో ఓ స్నేహితురాలు సీరియల్ కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి. నువ్వు వెళ్లు అని చెప్పింది. నేను నో చెప్పాను. కానీ తను వదలలేదు. అలా తన బలవంతం మీద నేను ఆడిషన్‌కి వెళ్లాను. తర్వాతి రోజే నేను సెలక్ట్ అయినట్లు కాల్ వచ్చింది’ అన్నారు. ‘అలా 20 ఏళ్ల వయసులో ఇంట్లో చెప్పకుండా ముంబై వెళ్లాను. ఇల్లు వెతుక్కొవడంలో ప్రొడక్షన్ వాళ్లు నాకు ఎంతో సాయం చేశారు. ఇక నేను నటిస్తున్నాననే విషయం గురించి నాన్నతో చెప్పడానికి నాకు కొన్ని వారాలు పట్టింది. విషయం వినగానే ఆయన షాక్ అయ్యారు. అమ్మ స్నేహితులు, బంధువులు మా కుటుంబంతో బంధాలు తెంచుకున్నారు. కానీ నా సీరియల్ పాపులర్ అయ్యింది. కొన్నేళ్లపాటు టాప్‌లో కొనసాగింది. ఇక నాన్న కూడా అంగీకరించారు. కానీ చదువు కూడా కొనసాగించాలని కండిషన్ పెట్టారు. దాంతో బ్రేక్ టైంలో వెళ్లి పరీక్షలు రాసి వచ్చేదాన్ని. అమ్మవాళ్లు ముంబైకి మారారు’ అన్నారు. (చదవండి: ఇద్దరినీ ఇష్టపడి.. పెళ్లి చేసుకున్నా) బిగ్‌బాస్ ఎంట్రీతో మొత్తం మారిపోయింది ‘అలా ఎనిమిది సంవత్సరాల పాటు సీరియల్లో కొనసాగాను. ఇలా ఉండగానే 2017లో బిగ్‌బాస్ 11 ఆఫర్ వచ్చింది. అయితే సీరియల్స్‌లో నటించే సమయంలో నేను ‘షార్ట్స్ వేసుకోను.. అసభ్యకరమైన సన్నివేశాల్లో నటించనని’ కండిషన్స్ పెట్టాను. కానీ బిగ్‌బాస్ ఆఫర్ వచ్చేనాటికి నా సొంత నియమాలు రూపొందించుకున్నాను. ఇక మా అమ్మ నాన్న పెళ్లి సంబంధాలు చూడ్డం ప్రారంభించారు. దాంతో నేను రాకీ గురించి వారికి చెప్పాను. ఇది విని కుటుంబంలో అందరు షాక్ అయ్యారు. కానీ చివరకు ఒప్పుకున్నారు. ఇప్పుడు మా అమ్మనాన్న నా కంటే ఎక్కువ తననే ప్రేమిస్తారు’ అని తెలిపారు. (చదవండి: పదేళ్లుగా డేటింగ్.. ఇప్పుడు బ్రేకప్) సినిమాల్లోకి వెళ్లే రిస్క్ చేశాను ‘ఇక టీవీ అవకాశాలు ఇబ్బడిముబ్బడిగా వచ్చి పడుతున్న వేళ నేను ధైర్యం చేసి సినిమాల్లోకి వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నాను. ఇక నా మొదటి చిత్రం గతేడాది జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఎంపికయ్యింది. ఇది ఎంతో గర్వించదగ్గ విషయం. ఆ తర్వాత ఓటీటీలోకి ప్రవేశించాను. ఇక స్క్రిప్ట్‌లో భాగంగా ముద్దు సీన్లో నటించాల్సి వచ్చింది. దీని గురించి అమ్మనాన్నలకు చెప్పి.. వారు అర్థం చేసుకుని అంగీకరించిన తర్వతే ఆ సీన్‌కి ఎస్ చెప్పాను. ఆ చిత్రం ఇప్పుడు ఆన్లైన్లో అత్యధిక మంది చూసిన చిత్రాల జాబితాలో చేరింది. నేను మొట్టమొదట కెమెరాను ఎదుర్కొని 11 సంవత్సరాలు పూర్తయ్యాయి. శ్రీనగర్‌లో పుట్టిన చిన్నారి కేన్స్ వరకు వెళ్లడం గురించి నిజంగా ఊహించలేదు. కానీ కష్టమైన ఎంపికల శ్రేణి నన్ను ఇక్కడ వరకు నడిపించింది. శ్రీనగర్ నుంచి ముంబై వరకు చేరిన నా ప్రయాణంలో నా కుటుంబంలో.. మొదటి నటి నుంచి వేరే సమాజానికి చెందిన వారితో డేటింగ్ చేయడం వరకు నా స్వంత మార్గాన్ని నేనే ఏర్పాటు చేసుకున్నాను అని గర్వంగా చెప్పగలను’ అన్నారు హీనా ఖాన్. -
‘అనసూయ’గా వంటలక్క అత్తమ్మ!
‘కేరాఫ్ అనసూయ’తో మరో పవర్ఫుల్ పాత్ర ద్వారా ‘స్టార్ మా’ ప్రేక్షకుల ముంగిటకొస్తున్నారు అర్చన అనంత్. కార్తీకదీపం సీరియల్లో వంటలక్క దీపకు అత్తమ్మ సౌందర్యగా తెలుగు లోగిళ్లలో సుపరిచితమైన వ్యక్తి అర్చన అనంత్. ఐపీఎల్‌ను మించిన క్రేజ్ కార్తీకదీపం సీరియల్‌కు తెలుగునాట ఉన్నా సీరియల్లో అత్తమ్మగా తప్ప వ్యక్తిగతంగా అర్చన గురించి తెలిసింది అతి కొద్దిమందికి మాత్రమే! ఫ్యాషన్ డిజైనర్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాటపడిన అర్చన ఇప్పుడు నటిగా మాత్రం విశ్వరూపం చూపుతున్నారు. కార్తీకదీపంలో తనదైన నటనతో ప్రతి హృదయాన్నీ తట్టిలేపిన ఆమె ఇప్పుడు కేరాఫ్ అనసూయ అంటూ ‘స్టార్ మా ’ ఛానెల్లో అక్టోబర్ 12వ తేదీ నుంచి మధ్యాహ్నం 2గంటలకు తెలుగు లోగిళ్లను పలుకరించబోతున్నారు. నటనా రంగం వైపు మళ్లడం దగ్గర నుంచి అనసూయగా తాను చేయబోయే పాత్ర వరకూ అనేక అంశాలను ‘సాక్షి’ తో ముచ్చటించారు. అలా మొదలైంది.. డాక్టర్ కాబోయి యాక్టర్ అని చాలామంది అంటుంటారు కానీ, దానికి భిన్నం అర్చన కెరీర్ ప్రయాణం. అసలు తానెన్నడూ నటి కావాలని అనుకోలేదనే అంటుంటారామె. నటిగా మారడానికి గల కారణాలను ఆమె చెబుతూ ‘‘ఫ్యాషన్ డిజైనర్‌గా చేస్తున్నవేళ, తన సహచరులు ఓ కన్నడ ప్రాజెక్ట్ కోసం ఆడిషన్ ఇవ్వమని కోరడం జరిగింది. సరే, అడిగారు కదా అని వెళ్లి ఆడిషన్లో పాల్గొన్నాను. ఆ తరువాత నటించే అవకాశం వచ్చింది. చెబితే మీరు నవ్వుతారు కానీ, నా తొలి పాత్ర ఓ శవంలా పడుకోవడం. నో డైలాగ్స్... నో ఎక్స్ప్రెషన్స్. అదీ ఓ షార్ట్‌ఫిలిం కోసం! ఆ చిత్ర కెమెరామెన్ మా నాన్నకు స్నేహితులు కావడంతో నేను కూడా ఏం మాట్లాడలేకపోయాను. ఆయన అయితే ఏం లేదు.. మీరు శవంలా పడుకుంటే చాలన్నారు. అలాగే పడుకున్నాను.. అదిగో అలా నా నటనా ప్రయాణం ప్రారంభమైంది’’ అని చెప్పుకొచ్చారు. సినీ కుటుంబమే కానీ.. అర్చన కుటుంబ నేపథ్యం సినిమానే. నాన్న కన్నడ సినిమాలో పేరున్న నటులు అనంత వేలు. తమ ఇంట్లో సినిమా వాతావరణమే ఉండేది కానీ తనకు దానిమీద ఆసక్తి మాత్రం పెద్దగా ఉండేది కాదు. నాన్న చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. తన పరపతి ఉపయోగించి తనన్ను ఎక్కడా రికమెండ్ చేయలేదాయన అని వెల్లడించిన అర్చన... అన్నట్లు తమ నాన్నే తనకు మంచి ఫ్రెండ్ అని చెప్పుకొచ్చారు. కల నెరవేర్చుకోవడానికి పదేళ్లు పట్టింది.. నటిగా మారిన తరువాత తెలుగు వినోద పరిశ్రమలోకి రావాలనేది లక్ష్యంగా పెట్టుకున్నానన్నారు అర్చన. నిజానికి తన తొలి ప్రాజెక్ట్ కన్నడ అని చెప్పిన ఆమె కన్నడ, తమిళ, మలయాళ భాషలలో బిజీగా మారిన తరువాతనే తెలుగుకు రావడం జరిగిందన్నారు. తాను ఓ తెలుగు ప్రాజెక్ట్ కోసం వచ్చి తమిళ ప్రాజెక్ట్‌కు ఎంపికయ్యానని, అలాగే మలయాళంలో కూడా చేశానన్న ఆమె నటిగా మారిన పదేళ్లకు కానీ తెలుగులో తనకు అవకాశం లభించలేదన్నారు. కార్తీకదీపంలో సౌందర్య క్యారెక్టర్ కోసమే తనకు ఇన్నేళ్లూ అవకాశం లభించలేదేమోనని అప్పుడప్పుడూ అనిపిస్తుందంటూ కార్తీకదీపంలో ఆ పాత్ర లభించడం తన అదృష్టమన్నారు. కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ సీరియల్‌కు అభిమానులున్నారిప్పుడు. తనను సౌందర్యగా ఇప్పుడు ప్రతి ఒక్కరూ గుర్తిస్తుండటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆ క్యారెక్టర్లో ఇమిడిపోవడానికి తన నిజ జీవిత సంఘటనలు కూడా కారణమంటూ తన అమ్మ తమతో ప్రవర్తించే రీతిలోనే.. దీపతో సౌందర్య ఆ సీరియల్లో ప్రవర్తిస్తుందన్నారు. ఇకపై అనసూయ అనే అంటారు..? ‘కేరాఫ్ అనసూయ’ తెలుగులో తాను చేస్తోన్న తాజా సీరియల్ అని చెప్పారు అర్చన. సౌందర్య క్యారెక్టర్లాగానే అనసూయ క్యారెక్టర్ తనకు మంచి పేరు తీసుకువస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. అనసూయ క్యారెక్టరైజేషన్ గురించి ఆమె వెల్లడిస్తూ మనందరికీ డబ్బు పట్ల అమితమైన ప్రేమ ఉంటుంది. విలాసవంతమైన జీవితం గడపాలనే కోరికా ఉంటుంది. దానికోసం ఒకొక్కరూ ఒక్కోలా శ్రమిస్తారు. పేదింటి పిల్ల అయిన అనసూయ కూడా అంతే ! డబ్బున్న వ్యక్తిని పెళ్లాడితే తాను కోరుకున్న జీవితం వస్తుందని అలాగే చేస్తుంది. అంతేకాదు, తాను అనుభవిస్తున్నట్లుగానే విలాసవంతమైన జీవితం తన కుమార్తెలు కూడా అనుభవించాలనుకుని ఆ ప్రయత్నాలు చేస్తుంది. ఈ ప్రయత్నంలో జరిగే సంఘటనలే ‘కేరాఫ్ అనసూయ’. ఖచ్చితంగా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే క్యారెక్టర్ ఇది. ‘స్టార్‌మా’ లోనే తాజా సీరియల్ వస్తుండటం, అదీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రతి గృహిణినీ కదలించబోతుండటం పట్ల ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. ఇకపై మీ మీ అత్తమ్మ... అనసూయగా మారుతుండటాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తారనే నమ్ముతున్నాను. కార్తీకదీపం లాగానే స్ట్రాంగ్ క్యారెక్టర్‌తో సినీ రంగానికి... కన్నడంలో ఇప్పటికే మూడు చిత్రాలు చేశాను. కానీ తెలుగులో ఓ బలీయమైన క్యారెక్టర్‌తో రావాలని కోరుకుంటున్నాను. అదీ ఓ పవర్ఫుల్ పోలీసాఫీర్‌గా కనిపించాలనుకుంటున్నాను. అలాగే ‘దాసీ’ క్యారెక్టర్లో కూడా నటించాలనుకుంటున్నాను. టీవీ, సినిమా రెండూ వైవిధ్యమైన మాధ్యమాలు. రెండూ గొప్పవే అని అన్నారు. సహజసిద్ధంగా నటన ఉండాలనేది తన భావన అన్న అర్చన, కళ్లతోనే నటించడమే తన దృష్టిలో అసలైన నటనగా వెల్లడించారు. చక్కటి అవకాశం వస్తే ఓటీటీలలో కూడా చేయడానికి అభ్యంతరం లేదన్నారామె. -
ఇట్లు.. ప్రేమతో మీ 'కార్తీకదీపం' దీప
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో మాటీవీ చానెల్లో ప్రసారమవుతున్న కార్తీక దీపం సీరియల్‌కు ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుత తెలుగు సీరియళ్లలో అత్యధిక టీఆర్పీ రేటింగ్‌తో దూసుకుపోతున్న కార్తీకదీపం సీరియల్‌కు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు కూడా భారీగానే ఉన్నారు. ఈ సీరియల్ మాటీవీలో ప్రతిరోజు రాత్రి 7.30 గంటలకు ప్రసారమవుతుంది. తాజాగా ఇదే సమయంలో ఐపీఎల్ 13వ సీజన్ మ్యాచ్‌లు కూడా మొదలవుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సమస్యే వచ్చి పడింది. (చదవండి : కార్తీక దీపం కోసం ‘ఐపీఎల్ టైమింగ్ మార్చండి') ఇంట్లో ఒకే టీవీ ఉంటే ఒకరి కోసం ఒకరు త్యాగం చేయాలి.. లేకపోతే ఇంట్లో గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది. ఇదే సమస్యపై సెప్టెంబర్ 3న కార్తీకదీపం సీరియల్ కోసం ఐపీఎల్ టైమింగ్ మార్చాలంటూ సూర్యపేటకు చెందిన పవిత్రపు శివచరణ్ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో పాటు చెన్నై ఐపీఎల్ టీమ్, స్టార్ మాకి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇది చాలా సీరియస్ ఇష్యూ అని.. ఎలాగైనా ఐపీఎల్ మ్యాచ్‌లను రాత్రి 8 గంటలకు ప్రసారం చేయమని చెప్పవలసిందిగా స్టార్ మాకి కూడా సెపరేట్‌గా ట్వీట్ చేశాడు. అప్పట్లో ఈ వార్త సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్‌గా మారింది. దీనిపై స్టార్ మా కూడా స్పందిస్తూ శివచరణ్ అడిగింది సబబే కదా అంటూ రీట్వీట్ కూడా చేసింది. (చదవండి : 'మేం లేకపోయినా.. చెన్నైకి నష్టం లేదు') Looks like a genuine request 🙂#KarthikaDeepam https://t.co/mDqYnHCzPu — starmaa (@StarMaa) September 3, 2020 అయితే ఈ విన్నపం కార్తీకదీపంలో హీరోయిన్ దీప పాత్ర పోషిస్తున్న ప్రీమి విశ్వనాథ్‌కు తెలిసింది. ఒక సీరియల్‌ను ఇంతలా అభిమానించేవారు ఉంటారా అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అయితే ఐపీఎల్ టైమింగ్ మార్చడం కుదరని పని అని తెలుసుకున్న దీప(ప్రేమి విశ్వనాథ్) వారి అభిమానానికి సంతోషించి తానే స్వయంగా ఉత్తరంతో పాటు 32 అంగుళాల టీవీని కొని శివచరణ్ ఇంటికి పంపించింది. ఇప్పుడు శివ చరణ్ ఇంట్లో ఏ సమస్య లేదు.. ఇకపై రాదు కూడా.. ఎందుకంటే శివచరణ్ కుటుంబసభ్యులు ఒక టీవీలో కార్తీక దీపం చూస్తుంటే , మరొక టీవీలో ఐపీఎల్ మ్యాచ్‌లు చూసే అవకాశం లభించింది. ఈ వార్త తెలుసుకున్న మిగతావారు మాకు కూడా ఇలాంటి అవకాశం వస్తే ఎంత బాగుండు అని అనుకుంటున్నారు. (చదవండి : ఐపీఎల్ వీరులు వీరే.. ఈసారి ఎవరో?) @SGanguly99 sir please change the timing of @IPL from 7:30pm to 8:00pm because at 7:30pm our family will watch #KarthikaDeepam and we have only one TV in my house .so please change the timings sir and avoid conflicts in my house@ChennaiIPL@StarMaa — పవిత్రపు శివ చరణ్ (@pscharan07) September 3, 2020 -
కార్తీక దీపం కోసం ‘ఐపీఎల్ టైమింగ్ మార్చండి'
సాక్షి, హైదరాబాద్ : కరోనా కారణంగా నిరాశలో కూరుకున్న క్రికెట్ అభిమానులకు వినోదాన్ని పంచేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ 13 సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. మరో 15 రోజుల్లో యూఏఈ వేదికగా ఈ వేడుక మొదలు కానుంది. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు మొత్తం 53 రోజుల్లో 60 మ్యాచ్‌లు జరుగుతాయని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. గత సీజన్లలో పోలిస్తే అరగంట ముందే ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 4 గంటలకి బదులుగా 3.30కు, రాత్రి 8 గంటలకు బదులుగా 7.30కి మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. (సీఎస్కేకు మరో ఎదురుదెబ్బ!) ఈ క్రమంలో ఐపీఎల్ టైమింగ్స్ మార్చాలంటూ ఓ తెలుగు అభిమాని సౌరవ్ గంగూలీ, చెన్నై ఐపీఎల్, స్టార్ మా ను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో కోరారు. శివ చరణ్ అనే ట్విటర్ యూజర్ రాత్రి 7.30 గంటలకు స్టార్ మాలో కార్తీక దీపం సీరియల్ వస్తుందని ఆ సమయంలో ఇంట్లో గొడవలు కాకుండా చూడాలని కోరాడు. ‘సౌరవ్ గంగూలీ సర్ ఐపీఎల్ టైమింగ్స్ రాత్రి 7.30 నుంచి 8.00 గంటలకు మార్చండి. ఎందుకంటే 7.30 సమయానికి మా ఇంట్లో ‘కార్తీక దీపం' సీరియల్ చూస్తారు. అసలే మా ఇంట్లో ఒకే టీవీ ఉంది. దయచేసి టైమింగ్స్ మార్చి మా ఇంట్లో గొడవలు జరగకుండా చూడండి సార్.' అని పేర్కొన్నాడు. ఇక శివ చరణ్చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ మీమ్స్ క్రియెట్ చేస్తున్నారు. (వారి ప్రేమే నన్ను కట్టి పడేసింది: కోహ్లి) @SGanguly99 sir please change the timing of @IPL from 7:30pm to 8:00pm because at 7:30pm our family will watch #KarthikaDeepam and we have only one TV in my house .so please change the timings sir and avoid conflicts in my house@ChennaiIPL@StarMaa — పవిత్రపు శివ చరణ్ (@pscharan07) September 3, 2020 కాగా ఈ ట్వీట్‌పై స్టార్ మా స్పందించడం విశేషం. ‘ఇది చాలా నిజాయితీతో కూడి అభ్యర్థన' అంటూ సదరు వ్యక్తికి బదులిచ్చింది. ఇదిలా ఉండగా ఐపీఎల్ కార్యక్రమానికే కార్తీక దీపం అడ్డు వస్తుందంటే ఆ సీరియల్‌కు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. టెలివిజన్‌లో టాప్ రేటింగ్‌తో దూసుకుపోతూ.. ప్రజల ఆదరణను విశేషంగా ఆకట్టుకుంది. సీరియల్ చూడని వారికి కూడా అందులోని డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలు తెలిసేలా ప్రాచూర్యం పొందింది. మరి నెటిజన్ల అభ్యర్థన మేరకు ఐపీఎల్ టైమింగ్ మార్చుతారో లేదా అదే సమయానికి ఉంటుందో వేచి చూడాలి. (భజ్జీ.. ఎల్లో టీషర్ట్ మిస్సవుతున్నాం) Looks like a genuine request 🙂#KarthikaDeepam https://t.co/mDqYnHCzPu — starmaa (@StarMaa) September 3, 2020 -
‘స్వాతి చినుకులు’ ఫేం భరద్వాజ్‌కు కరోనా
-
కరోనా: మరో బుల్లితెర నటుడికి పాజిటివ్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. సాధారణ ప్రజలతో పాటు అధికారులు, పోలీసులు, సెలబ్రిటీలు సైతం కరోనా భారిన పడటం ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో కరోనా కేసులు పెగుతున్నాయి. ఇప్పటికే పలువురు టెలివిజన్ నటీనటులకు కరోనా పాజిటివ్ రాగా తాజాగా మరో నటుడికి పాజిటివ్ వచ్చింది. బుల్లితెర నటుడు భరద్వాజ్ రంగావిజ్జుల ఆదివారం కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో వెల్లడించారు. స్వాతిచినుకులు, బంధం అనే టీవీ సీరియళ్ల ద్వారా భరద్వాజ్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. (‘బిగ్‌బాస్-3’ ఫేం రవికృష్ణకు కరోనా..) తన ఆరోగ్యానికి సంబంధించి భరద్వాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు నిమిషాల వీడియో పోస్టు చేశారు. తనకు లక్షణాలేవి లేవని, ఎవరూ భయపడవద్దని సూచించాడు. సరైన ఆహార నియమాలు, మందులతో వ్యాధి నుంచి బయట పడవచ్చని పేర్కొన్నారు. అయితే తనతో కలిసి నటించిన వాళ్ళు ఐసోలేషన్‌లో ఉండాలని, టెస్టులు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక భరద్వాజ్ కరోనా సోకిన విషయంతో తెలియడంతో అతని అభిమానులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. కాగా ఇప్పటి వరకు నవ్య స్వామి, రవికృష్ణ, ఝాన్సీ, సాక్షి శివ, ప్రభాకర్ వంటి పలువురు బుల్లితెర నటులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. (మళ్లీ షూటింగ్‌లకు బ్రేక్) తెలుగు టీవీ నటికి కరోనా పాజిటివ్ -
బుల్లితెర ‘గుండన్న’ మనోడే
‘దేవమ్మా..దేవమ్మా...అంబిక ఇంటివద్ద ఇద్దరమ్మాయిలను చూశాను. ఒకవేళ వారు మీ పిల్లలై ఉంటారేమోనమ్మా...ఆవు చేన్లో మేస్తే దూడ గట్టులో మేస్తుందా... మీ అత్తమ్మలా నీవు అబద్దాలు చెబుతున్నావ్... నా కళ్లు నన్ను మోసం చేయలేవు శ్రీవల్లీ.. ఆడపిల్లల్ని చూశాక నాకనిపించింది. వాళ్లు దేవమ్మ పిల్లలేనని.. అంటూ ఈ టీవీలో ప్రసారమైన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సీరియల్లో దేవమ్మ అనుచరుడి పాత్ర పోషించిన గుండన్న మనోడే. సాక్షి, ఆదిలాబాద్ : ‘కలలు కనాలి.. వాటిని సాకారం చెయ్యాలి’ అని అన్నపెద్దల మాటలు నిజమని నిరూపించాడు.. సంకల్పానికి, ప్రతిభకు పేదరికం అడ్డురాదని తెలియజేశాడు ఈ యువకుడు. కెరమెరి మండలంలోని బారేమోడి గ్రామానికి చెందిన నికోడే సానాజి, కమలాబాయి దంపతులకు ముగ్గురు కూతుర్లు, ఇద్దరు కుమారులు. వారిలో చిన్నవాడు మధూకర్ అలియాస్ మధు. ప్రాథమిక విద్యాభ్యాసం బారేమోడిలో, 6వ తరగతి కెరమెరిలోని నవో దయ, 8వ సిర్పూర్(టీ)లో, 9,10వ కెరమెరి ఉన్నత పాటశాలలో, ఇంటర్ ప్రభుత్వ జూని యర్ కళాశాలలో పూర్తి చేశాడు. పదోతరగతి చదువుతుండగా పేపర్లో వచ్చిన యాడ్ చూసి సినిమా రంగంలో నటించేందుకు పాస్‌ఫొటో పంపించాడు. కానీ మూడేళ్ల వరకు ఎలాంటి సమాధానం రాలేదు.. 2010 వరంగల్ లో డిగ్రీ చదువుతుండగా తరచూ హైదరాబాద్‌లోని ఆయా స్టూడియోల్లోకి వెళ్లి వస్తుండేవాడు. (తెలంగాణ : అడ్డదారిలో ఎక్స్టెన్షన్లు) దిల్ రాజు కార్యాలయం చుట్టూ 50కి పైగా చక్కర్లు సినిమా, సీరియల్ పై ఉన్న మోజుతో హైదరాబాద్‌లోని ప్రముఖ దర్శక, నిర్మాత దిల్ రాజు కార్యాలయానికి 50కి పైగా చక్కర్లు కొట్టాడు. కానీ ఎవ్వరూ దరి చేరనివ్వలేదు. ఇలా కాదని 2011 లో సినిమా కార్యాలయంలో శిక్షణ కోసం రూ.5000 చెల్లించాడు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అనంతరం ఇతనిలో ఉన్న పట్టుదల చూసి “సాయిబాబా’ సినిమాలో ఓపాత్ర కోసం రూ.లక్ష కట్టామన్నారు. అంత స్థోమత లేకపోవడంతో ఆ అవకాశం కూడా చేజారి పోయింది. (పరిశ్రమలకు అన్ని విధాలా ప్రోత్సాహం) నాటకరంగంలో అడుగు 2017లో తెలంగాణ ప్రభుత్వం భాషా సంఘం ఆధ్వర్యంలో రంగస్థల నటుడిగా 40రోజులు శిక్షణ పొందాడు. అనంతరం ‘నక్షత్రం’ ‘ఫిదా’ సినిమాలో క్యారెక్టర్ పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన తెలంగాణం నాటకం రజాకార్ల పాత్రలో పోషించి ఆహూతుల నుంచి మన్ననలు పొందాడు. ఆదిలాబాద్, బాసర, నిర్మల్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో నిర్వహించిన కుమురం భీం, పోలీస్ తదితర నాటకాల్లో ప్రతిభ కనబర్చాడు. హైదరాబాద్‌లోని క్రిష్ణానగర్లో ఉంటూ టెక్నీషియన్‌గా పనిచేశాడు. ఈ తరుణంలోనే సొంతంగా 80 వీడియోలు తయారు చేశాడు. వాటిని డైరెక్టర్, ప్రొడ్యూసర్లకు చూపించాడు. దీంతో ఆయనలో ఉన్న ప్రతిభను గుర్తించి 2019లో ‘నిన్నే పెళ్లాడతా’ సీరియల్లో రౌడీ క్యారెక్టర్ ఇప్పించారు. అక్కడి నుంచి అతని ప్రయాణం ప్రారంభమైంది. (15 రోజుల్లోగా పంపేయండి ) మధు నటించిన సీరియల్లు ప్రస్తుతం జీటీవీలో వస్తున్న ‘నిన్నే పెళ్లాడతా’ లో రౌడీ పాత్ర, స్టార్‌మాలో వస్తున్న ‘కథలో రాజకుమారి’ లో తండ్రి పాత్ర, జీ తెలుగులో వస్తున్న ‘అత్తారింట్లో అక్కా చెల్లెల్లు’ లో రౌడీ క్యారెక్టర్, ఈ టీవీలో వస్తున్న మిష్టర్ అండ్ మి సెస్ భాను’లో పోలీస్ పాత్రలో, మ్యాంగో వెబ్ సిరీస్‌లో మాంత్రికుడి పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. తపన, దృఢసంకల్పం కావాలి ప్రతి మనిషిలో ఏదో ఒక గుణం ఉంటుంది. అదేమిటో మనకు తెలుసు. దాన్ని సాధించాలంటే తపన, కృషి, దృఢసంకల్పం తప్పనిసరి. పదోతరగతిలో ఉన్నప్పుడు శ్రీ మంజూనాథ సినిమా చూసి ఇంప్రెస్ అయ్యా. నేనెందుకు తెరపై కనిపించకూడదని అనుకున్నా. అప్పుడే నా ప్రయాణం మొదలైంది. అప్పుడే స్క్రీన్ పై కనిపించాలనే తపన నన్ను మీ ముందుకు తెచ్చింది. – నికోడే మధూకర్(మధు), ఆర్టిస్ట్ -
ఆ సీరియల్ మళ్లీ వచ్చేస్తోంది
ముంబై : లాక్డౌన్ వలన ప్రజలందరు ఇళ్ళకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టీవీ సీరియల్స్, సినిమా షూటింగ్స్ వాయిదా పడ్డాయి. దీంతో పాత కార్యక్రమాలను, పాత టీవి సీరియళ్లను రీటెలికాస్ట్ చేస్తూ వీక్షకులను ఆనందింపజేస్తున్నారు. ఇప్పటికే దూరదర్శన్ రామాయణం.మహభారతం సీరియల్స్‌ను తిరిగి ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా శ్రీకృష్ణ సీరియల్‌ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. (కరోనా కొత్త లక్షణం: పాదాలు, బొటనవేలు వాపు..!) ఈ విషయాన్ని ప్రసారభారతి తమ అధికారిక ట్విట్టర్లో వెల్లడించింది. 90లలో ప్రసారమైన పురాణ గాథ శ్రీకృష్ణని తిరిగి ప్రసారం చేయనున్నట్టు పేర్కొంది. రామానంద్ సాగర్ యొక్క 'శ్రీ కృష్ణ' మొదట 1993-1996 మధ్య ప్రసారం చేయబడింది. అప్పట్లో అత్యధిక రేటింగ్ పొందిన ఈ సీరియల్ మొట్టమొదట 1993లో దూరదర్శన్(డీడీ2లో) ప్రసారమయింది. ఆపై 1996 లో డీడీ నేషనల్ మళ్లీ మొదటి నుంచి ప్రసారం చేసింది. ఇప్పటికే అనేక ఛానెల్స్‌లో ప్రసారమైన ఈ పాపులర్ సీరియల్ తిరిగి ప్రసారం కాబోతుండడంతో అభిమానులు ఆనందిస్తున్నారు. మొత్తం 221 ఎపిసోడ్లుగా ఉన్న శ్రీకృష్ణా సీరియల్లో చిన్ని కృష్ణునిగా స్వప్నిల్ జోషి నటిస్తే.. పెద్ద కృష్ణునిగా సర్వదమన్ బెనర్జీ నటించాడు. Coming Soon! #ShriKrishna on @DDNational.#StayHome pic.twitter.com/1SD1RveGwi — Prasar Bharati (@prasarbharati) April 23, 2020 -
సీతాపహరణం చూస్తున్న ‘రావణుడు’!
-
సీతాపహరణం చూస్తున్న ‘రావణుడు’!
న్యూఢిల్లీ: భారత్‌లో రామాయణ, మహాభారత ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కిన సీరియళ్లు, సినిమాలు, నాటకాల ఆదరణకు కొదవే ఉండదు. ఇక లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమతమైన అభిమానులు, సెలబ్రిటీల కోరికమేరకు 37 ఏళ్ల క్రితం విజయవంతంగా ప్రదర్శితమైన రామాయణ్, మహాభారత్ సీరియళ్లను దూరదర్శన్ పునఃప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రేటింగ్స్ పరంగా నయా రికార్డులను సాధిస్తున్న రామాయణ్ మరోసారి వార్తల్లో నిలిచింది. నాడు రామాయణ్ సీరియల్లో రావణ పాత్రధారి అరవింద్ త్రివేది.. తాజాగా సీతాపహరణం దృశ్యాన్ని చూస్తున్న వీడియో వైరల్ అయింది. (చదవండి: డీడీ నంబర్ వన్) 81 ఏళ్ల వయసున్న త్రివేది సీతను అపహరించే ఘట్టం క్లైమాక్స్‌కు చేరుకున్న దృశ్యాల్ని టీవీ ముందు కూర్చుని ఆసక్తికరంగా వీక్షిస్తున్న వీడియో అది. సీతను రావణుడు చెరబడుతున్న సందర్భంలో ఆయన రెండు చేతులూ జోడించడం గమనార్హం. ఈ వీడియోను రామాయణ్ ఫ్యాన్స్ క్లబ్ ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో వైరల్ అయింది. కాగా, రామానంద్‌సాగర్ దర్శకత్వం, నిర్మాణ సారథ్యంలో 1987లో వచ్చిన ఈ సీరియల్లో రాముడిగా అరుణ్ గోవలి, సీతగా దీపికా చిఖిలా, లక్ష్మణుడిగా సునీల్ లహరి నటించారు. (చదవండి: ఒక్కరోజులోనే ఆ సీరియల్‌కు 50 మిలియన్ వ్యూస్) -
నా పేరుతో ట్విటర్లో నకిలీ ఖాతా: గోవిల్
తన అసలు ప్రొఫైల్ ఫొటోతో సోషల్ మీడియా నకిలీ ఖాతా ఉందని నటుడు అరుణ్ గోవిల్ అభిమానులకు స్పషం చేశాడు. ఈ విషయాన్ని తన అసలు ట్విటర్ ఖాతాలో వీడియో ద్వారా గురువారం వెల్లడించారు. ‘కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు నేను ఇచ్చిన సందేశాన్ని చూసిన ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్లో కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో ఆయన నా పేరుపై ఉన్న నకిలీ ట్విటర్ ఖాతాకు ట్యాగ్ చేశారు. అప్పుడే తెలిసింది నా పేరుపై నకిలీ ట్విటర్ అకౌంట్ ఉందని’ అంటూ వీడియోలో చెప్పుకొచ్చారు. అంతేగాక తన పేరుపై ఉన్న నకిలీ ఖాతాను ఫాలో అవుతున్న అభిమానులు వెంటనే అన్‌ఫాలో కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. (ఎక్తా కపూర్‌పై విరుచుకుపడ్డ ‘శక్తిమాన్’ హీరో) नमस्कार भाइयों एवं बहनो, एक आवश्यक सूचना आपको इस विडीओ के माध्यम से देना चाहता हूँ । आशा करताहूँ आप अवश्य समर्थन करेंगे !@realarungovil से विनती करें कि वो ऐसा ना करें ! pic.twitter.com/k7k9j8eWvi — Arun Govil (@arungovil12) April 6, 2020 కాగా రామనంద సాగర్ నిర్మించిన రామాయణంలో రాముడి పాత్ర పోషించాడు గోవిల్. రాముడి పాత్రతో ఆయన మంచి పేరు తెచ్చున్నారు. ప్రేక్షకుల నుంచి కూడా ఆయనకు అదరణ లభించింది. తన పేరుపై నకిలీ ఖాతా @realarungovil పేరుతో ఉందని.. తన అసలు ఖాతా @arungovil12 అని కూడా చెప్పారు. ఇక కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టేందుకు దేశంలో లాక్డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. దీంతో సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో సినిమాలకు, సీరియల్స్‌కు సంబంధించిన షూటింగ్‌లు ఆగిపోవడంతో సిరియల్స్ను పునఃప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. ‘మహభారతం’, ‘శక్తిమాన్’, ‘రామయణం’ కూడా మళ్లీ ప్రసారం చేస్తున్నారు. ఈ క్రమంలో తన ‘రామాయణాన్ని’ కూడా ప్రజలు తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నట్లు గోవిల్ పేర్కొన్నారు. (‘నా భార్యకు హెల్ప్ చేస్తున్న జానీ సార్’) -
కరోనా వల్ల ఓ మంచి జరిగింది: నటుడు
అలనాటి పౌరాణిక సీరియల్స్ రామాయణం, మహాభారతాలు వీక్షకులను టీవీలకు అతుక్కుపోయేలా చేశాయనడంలో అతిశయోక్తి లేదు. సుమారు మూడు దశాబ్దాల తరువాత తిరిగి ఇవి తిరిగి ప్రసారం కానున్నాయి. కరోనా భయంతో ఇంటిపట్టునే ఉన్న జనాలకు ఈ సీరియల్స్ తప్పకుండా ఊరట కలిగిస్తాయి. ఈ నేపథ్యంలో మహాభారతంలో దుర్యోధనుడిగా కనిపించిన నటుడు పునీత్ ఇస్సార్ ప్రేక్షకులకు కొన్ని సూచనలు అందించాడు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించేందుకుగానూ ప్రతి ఒక్కరూ సామాజిక ఎడం పాటించాలని కోరాడు. తమ గృహంలో బయటి వారు లోపలికి రావడం కానీ, లోపలి వారు బయటకు వెళ్లడం కానీ పూర్తిగా నిషేధమని తెలిపాడు. మాలాగే అందరూ ఇంటి గడప దాటవద్దని సూచించాడు. అంతేకాకుండా.. తాము ఇంటి పనులను కూడా విభజించుకున్నట్లు తెలిపాడు. కరోనా పుణ్యమాని కుటుంబం అంతా కలిసి భోజనం చేస్తున్నామని ఓ పాజిటివ్ అంశాన్ని సైతం చెప్పుకొచ్చాడు. పునీత్ మహాభారతం సీరియల్లో నటించడమే కాక దానికి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సీరియల్ డీడీ భారత్‌లో మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం ఏడింటికి గంట నిడివితో రెండు ఎపిసోడ్లు ప్రసారమవుతున్నాయి. దీనితోపాటు డీడీ నేషనల్లో రామాయణం ఉదయం తొమ్మిది గంటలకు ఒక ఎపిసోడ్, రాత్రి తొమ్మిదింటికి మరో ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ రెండూ కూడా మార్చి 28నుంచి ప్రారంభమయ్యాయి. (రామాయణ్ చూస్తున్నా.. మరి మీరు?) -
మీరు వర్క్ చేసే ఫీల్డ్ అలాంటిది..
‘అగ్నిసాక్షి’ సీరియల్ హీరో శంకర్ బుల్లితెర ప్రేక్షకులకు చిరపరిచితం. అసలు పేరు అర్జున్ అంబటి. బుల్లితెరపై గౌరితో ప్రణయం, పరిణయం గురించి ప్రేక్షకులకు తెలిసిందే. ‘స్టార్ మా’లో వచ్చే ఇస్మార్ట్ జోడీ రియాల్టీ షో ద్వారా తన అర్ధాంగి సురేఖతో కలిసి డ్యాన్స్ ప్రోగ్రామ్‌తో సందడి చేస్తున్నారు. ‘నేను బెంగళూరు నుంచి వచ్చాను అనుకున్నారు చాలామంది. కానీ, తెలుగింటి అబ్బాయినే’ అంటూ తన గురించి వివరించారు అర్జున్. ‘అగ్నిసాక్షి’ సీరియల్‌కు ముందు ‘అర్ధనారి’ అనే సినిమా చేశాను. మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత సౌఖ్యం, దేశముదురు ఇటీవల అశ్వమేధం సినిమాల్లో నటించాను. నేను స్క్రీన్ ముందుకు రాకముందు సాఫ్ట్వేర్ ఉద్యోగిని. చెన్నై, హైదరాబాద్‌లలో ఐటీ కంపెనీలో జాబ్ చేశాను. సినిమాలంటే ఉన్న ఆసక్తితో ఈ రంగం వైపుగా వచ్చాను. అయితే, సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తుండగా సీరియల్ ఆఫర్ వచ్చింది. ఆసక్తిగా అగ్నిసాక్షి వందలో ఒకటో రెండో ఇలాంటి సీరియల్ టాపిక్స్ వస్తాయనుకుంటాను. అరుదైన కథతో ఆసక్తిగొలిపే కథనం గల ఈ సీరియల్ నన్ను వరించడం గొప్పగా భావిస్తున్నాను. ఈ సీరియల్ నటుడిగా నన్ను నిలబెట్టింది. ఈ సీరియల్లో డ్రెస్సింగ్ స్టైల్ మిగతా అన్నింటికీ భిన్నంగా ఉంటుంది. అలాగే పెద్దలను గౌరవించడం, చిన్నవారిని ఆప్యాయంగా చూడటం, కుటుంబం.. ఆ పద్ధతులు... అన్నీ చాలా డిఫరెంట్. ఈ సీరియల్లోని విషయాలు కొన్ని నా నిజజీవితంలో పాటించేలా చేశాయి. చేసిన ఫస్ట్ సీరియల్‌కే మంచి గుర్తింపు వచ్చింది. అవార్డులూ వరించాయి. సాఫ్ట్వేర్ నుంచి.. మొదట్లో అందరూ నన్ను బెంగుళూరు అబ్బాయి అనుకున్నారు. కానీ, నేను పుట్టి పెరిగింది ఇక్కడే. మాది విజయవాడ దగ్గర నర్సరావు పేట. మా నాన్న ఫిల్మ్ డిస్టిబ్యూటర్. అమ్మ గృహిణి. తమ్ముడు, చెల్లీ ఉన్నారు. వాళ్లిద్దరూ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగం చేస్తున్నప్పుడు అనుకోకుండా నేనూ, సురేఖ బయట కలిశాం. మా పరిచయం స్నేహంగా మారింది. రెండేళ్లు గడిచాక ఇరు కుటుంబాల అంగీకారంతో మా ప్రేమ పెళ్లి పీటలెక్కింది. రియాల్టీ షో ‘స్టార్ మా టీవీ’లో ఇస్మార్ట్ జోడీ అనే పేరుతో వచ్చే భార్యభర్తల డ్యాన్స్ ప్రోగ్రామ్‌లో పాల్గొనడం ఇదే మొదటిసారి. నా భార్య సురేఖ సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ ఉద్యోగి. తనకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. మా ఇరువైపు కుటుంబాల్లో ఏ చిన్న ఈవెంట్ అయినా తన డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. కాకపోతే ఇలా కెమెరా ముందు డ్యాన్స్ చేయడం ఇదే మొదటిసారి. తను చాలా ఎగ్జయిట్‌మెంట్‌తో ఈ షోలో పాల్గొంది. అది చూసి నాకూ చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రోగ్రామ్‌లో ప్రతీవారం ఒక థీమ్ ఇస్తారు. వెడ్డింగ్, కుకింగ్ స్పెషల్.. అంటూ ఒక్కోవారం ఫన్ టాస్క్‌లు ఉంటాయి. రూమర్స్‌కి దూరం మా పెళ్లి అయ్యి ఏడాది పూర్తయ్యింది. సురేఖ చాలా సపోర్టివ్ నాకు. రూమర్స్ వచ్చినప్పుడు నేను కొంత డిస్టర్బ్ అయినా తనే నన్ను అర్థం చేసుకుంటుంది. ‘మీరు వర్క్ చేసే ఫీల్డ్ అలాంటిది. నేను అర్ధం చేసుకోగలను’ అంటుంది. తను చాలా కూల్ పర్సన్. మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తుంది. ఏదైనా విషయంలో ఇద్దరం గొడవపడినా.. తనే ముందు మాట్లాడి మూడీగా ఉన్న వాతావరణాన్ని ప్లెజెంట్‌గా మార్చేస్తుంది. అందరం ఒక చోట మా అమ్మ నాన్న విజయవాడలో. తమ్ముడు, చెల్లి విదేశాల్లో. మేం హైదరాబాద్‌లో. మా ఫ్యామిలీ అంతా ఒక్క దగ్గర ఇటీవల కాలంలో ఉన్నది లేదు. పండగలప్పుడు కూడా అందరం కలవడానికి కుదరడం లేదు. అదొక్కటే బాధగా ఉంటుంది. మేమందరం కలుసుకుని సరదాగా గడిపేలా ఒక్క పండగైనా చేసుకోవాలని మా వాళ్లకు చెబుతుంటాను.’– సంభాషణ: నిర్మలారెడ్డి -
టీవీ నటితో అక్రమ సంబంధం..
తమిళనాడు, పెరంబూరు: బుల్లితెర నటుడు ఈశ్వర్‌పై అతని భార్య, బుల్లితెర నటి జయశ్రీ మంగళవారం పోలీస్‌కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వంశం సీరియల్ ద్వారా ప్రాచుర్యం పొందిన నటి జయశ్రీ. అమె బుల్లితెర నటుడు ఈశ్వర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తిరువాన్మయూర్ కామరాజర్ నగర్లో నివశిస్తున్న వీళ్ల మధ్య విబేధాలు తలెత్తాయి. నటి జయశ్రీ ఇటీవల తన ఆస్తులకు చెందిన డాక్యుమెంట్స్‌ను కుదవ పెట్టుకున్నాడని, తనను కొడుతూ చిత్ర వదకు గురి చేస్తున్నాడని భర్తపై అడయారు మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో ఈశ్వర్ తన భార్యను కొట్టినట్లు అంగీకరించడంతో అతన్ని అరెస్ట్ చేసి జైలులో పెట్టారు. కాగా మంగళవారం నటి జయశ్రీ చెన్నై పోలీస్‌కమిషనర్ కార్యాలయంలో తన భర్తపై మరో ఫిర్యాదు చేసింది. అందులో తన భర్త అరెస్ట్ అయిన తరువాత తనకు హత్యాబెదిరింపులు వస్తున్నాయని, వారెవరో కనిపెట్టి తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. అనంతరం జయశ్రీ మీడియాతో మాట్లాడుతూ.. తన భర్త ఈశ్వర్ వేరే టీవీ నటితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని చెప్పింది. అంతే కాకుండా పెళ్లి అయిన తరువాత తాగుడుకు అలవాటు పడ్డాడని, జూదానికి వ్యసనపరుడు అయ్యాడని చెప్పింది. గంజాకు అలవాటు పడినట్లు చెప్పింది. తన డబ్బు, బంగారం తాకట్టు పెట్టాడని తెలిపింది. అంతే కాకుండా తను అక్రమ సంబంధం పెట్టుకున్న నటితో కలిసి ఉన్న వీడియో కాల్స్ చేసేవాడని చెప్పింది. తాగి వచ్చి తన కూతురును లైంగిక వేధింపునకు గురి చేసే వాడని పేర్కొంది. ఇదంతా సహించలేకే తాను అడయారు పోలీసులకు ఫిర్యాదు చేశానంది. దీంతో పోలీసులు ఈశ్వర్‌ను అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. హాత్యాబెదిరింపు కాల్స్ రావడంతో పోలీస్‌కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు నటి జయశ్రీ చెప్పింది. -
సూర్యకాంతం మొగుడు
‘ముత్యాల ముగు’్గ సీరియల్ చూసిన వారికి విరాట్‌గా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న సీరియల్ నటుడు ప్రజ్వల్. ఇప్పుడు ‘జీ తెలుగు’ లో ప్రసారమయ్యే ‘సూర్యకాంతం’ సీరియల్లో చైతన్యగా తన నటనతో మెప్పిస్తున్నాడు. కన్నడ సీరియల్ నటుడిగా పేరు తెచ్చుకున్న ప్రజ్వల్ తెలుగునాట గుర్తింపు తెచ్చుకున్న విధానాన్ని ఈ విధంగా వివరించారు. ‘‘ఇంటర్మీడియెట్ తర్వాత కన్నడలోని ఓ సీరియల్లో కృష్ణుడి పాత్ర కోసం నన్ను అడిగారు. అప్పటికి శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ఇస్తూ ఉండటం వల్ల ఆ పాత్రకు అవకాశం వచ్చింది. ఆ తర్వాత ‘పునర్ వివాహ్’ సీరియల్లో ప్రధాన పాత్ర పోషించాను. నటుడిగా మారకముందు నేను డాన్సర్‌ని. తొమ్మిదేళ్ల వయసు నుంచి నేను పుట్టకముందు అమ్మ సాగరసంగమం సినిమాలో కమల్‌హాసన్ గారిని చూసి అబ్బాయి పుడితే భరతనాట్యం నేర్పించాలనుకున్నారట. అలా నాకు భరతనాట్యం, కథక్ నేర్పించారు. ఎక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినా అక్కడకు తీసుకెళ్లేవారు అమ్మనాన్నలు. తొమ్మిదేళ్ల వయసు నుంచే ఉత్తర, దక్షిణ భారతదేశాలు ముఖ్యంగా కాశీ, రామేశ్వరం, ఢిల్లీ, హైదరాబాద్‌లలోనూ వేదికల మీద నృత్య ప్రదర్శనలు ఇచ్చాను. చిన్నప్పుడు అమ్మనే నాకు మేకప్ చేసేవారు. ఇప్పటికీ ఎక్కడ నా నృత్య ప్రదర్శన ఉన్నా మేకప్‌లో ఫినిషింగ్ టచ్ అమ్మనే ఇవ్వాలి. కళ్లకు కాజల్, నుదటన తిలకం అమ్మ దిద్దితేనే నాకూ ఆ నృత్యం సంపూర్ణం అనిపిస్తుంది. బేసిక్‌గా సైన్స్ స్టూడెంట్‌ని. ఇంటర్మీయెట్ తర్వాత ఇంజనీరింగ్ చదివాలా.. డాన్సర్‌గా నా కలను సంపూర్ణం చేసుకోవాలా అనే సందిగ్దం వచ్చింది. రెండోదానికే నా ఆలోచన మళ్ళింది. దీంతో కామర్స్ తీసుకొని, ఆర్ట్ ఫీల్డ్కి వచ్చాను. సూర్యకాంతం సీరియల్లో సన్నివేశం నృత్యం వల్ల మెరుగు రామాయణ, భారత కథలు, పురాణ పురుషులను నృత్యం ద్వారా చూపించాల్సి ఉంటుంది. దీనికి పురాణ, ఇతిహాసాలను క్షుణ్ణంగా ఔపోసన పడతాం. దీని వల్ల మానవ ప్రవృత్తి అర్ధమవుతుంది. జీవితంలో ఏదైనా అనుకోని సంఘటన ఎదురైతే నాడు ఇలాంటి సందర్భంలో వారు ఎలా ప్రవర్తించారో గుర్తుకువచ్చి మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటాం. భవిష్యత్తు ప్రణాళికలు సీరియల్స్‌లో చేరక ముందు నృత్యప్రదర్శనలు ఇస్తూనే డ్యాన్స్ క్లాసెస్ తీసుకునేవాడిని. భవిష్యత్తులో అకాడమీ ఏర్పాటు చేయాలని ఉంది. ప్రస్తుతం సీరియల్స్ వల్ల రెగ్యులర్ క్లాసులు తీసుకోవడం లేదు. ‘సూర్యకాంతం’లో... ‘జీ తెలుగు’లో వచ్చే ‘సూర్యకాంతం’ సీరియల్లో హీరో చైతన్య పాత్ర పోషిస్తున్నాను. చైతన్యకు కుటంబమే ప్రపంచం. అక్కలు, బావలు.. తప్ప మరొకటి తెలియదు. లోకజ్ఞానం అస్సలు లేదు. అలాంటి అతనికి పూర్తి అపోజిట్ క్యారేక్టర్ సూర్యకాంతంది. చదువు రాని అమ్మాయితోనూ, ఆమె కుటుంబంతో కలిసి ప్రయాణిస్తూ ఆమె కలలకు భరోసాగా నిలుస్తుంటాడు. తన కుటుంబాన్నీ–సూర్యకాంతం కుటుంబాన్నీ ఈ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తాడు అనేది ఇందులో ప్రధానంగా నడుస్తుంటుంది. అన్న చెబితే ఓకే! రియల్ లైఫ్ మా కుటుంబంలో మా అన్నయ్య నాకు చాలా సపోర్ట్.‘నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి పూర్తిగా అంకితమై ఉండాలి’ అని చెబుతారు. ‘మంచి జరిగిందా ఓకే. లేదంటే దానిని వదిలేసి మరోటి ఎంపిక చేసుకో’ అని చెబుతారు. చిన్నప్పటి నుంచి ఇంట్లోనూ, బయట నాకు సపోర్ట్ చేసేవారే దొరకడం నా అదృష్టం అనుకుంటాను. నా జీవిత భాగస్వామి కూడా నా సంతోషాన్ని, ఆసక్తిని పంచుకుని ప్రోత్సహించేలా రావాలని కోరుకుంటున్నాను. సినిమా, సీరియల్ ఏదైనా సైన్స్ ఫిక్షన్ స్టోరీలో లీడ్ రోల్లో నటించాలని ఉంది.’– నిర్మలారెడ్డి -
టీవీ సీరియల్ కెమెరామెన్ ఆత్మహత్య
చెన్నై,వేలూరు: జోలార్‌పేట బస్టాండ్ సమీపంలో చెన్నైకి చెందిన టీవీ సీరియల్ కెమెరామెన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెన్నై వలసరవాక్కం గంగమ్మ వీధికి చెందిన శశికుమార్(47) టీవీ సీరియల్ కెమెరామెన్. ఇతని భార్య రాఘవి. వీరికి ఒక కుమార్తె ఉంది. ఇదిలా ఉండగా శశికుమార్ పనిచేస్తున్న స్టూడియోలో ఉన్న కెమెరాను రూ.2 లక్షలకు కుదవపెట్టినట్లు తెలిసింది. దీంతో స్టూడియో యాజమాన్యం విరుగంబాక్కం పోలీసులకు శశికుమార్‌పై ఫిర్యాదు చేశారు. మనస్తాపానికి గురైన శశికుమార్ ఈనెల 9న ఇంటి నుంచి బయటకు వచ్చి తిరిగి ఇంటికి వెళ్లలేదు. ఈ క్రమంలో వేలూరు జిల్లా జోలార్‌పేట బస్టాండ్ సమీపంలోని చెరువు గట్టు వద్దనున్న ఒక చెట్టుకు శశికుమార్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గురువారం స్థానికులు గుర్తించారు. వెంటనే జోలార్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి విచారణ చేపట్టారు. అనంతరం అతని పర్సులో ఉన్న ఫొటోలను పరిశీలించగా అందులో భార్య, కుమార్తె ఫొటో ఉన్నట్లు గుర్తించారు. అనంతరం అతని సెల్‌ఫోన్ నంబర్ ద్వారా అతని వివరాలను తెలుసుకొని వలసరవాక్కం పోలీసుల ద్వారా కుటుంబసభ్యులకు సమాచారం అందజేశారు. భార్య రాఘవి తన భర్త మృతిపై అనుమానం ఉందని జోలార్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేస్తున్నారు. -
దాని అంతు నేను చూస్తాను
పిల్లల్లో కామిక్ సీరియళ్లు హింసను ప్రేరేపిస్తున్నాయి అని నిన్న మొన్నటి వరకు బెంగ పెట్టుకునేవాళ్లం. అయితే పెద్దలు చూసే టీవీ సీరియళ్లను, టీవీ డిబేట్లను చూస్తున్నందు వల్ల పిల్లల్లో కనిపిస్తున్న విపరీత ధోరణులతో పోలిస్తే.. కామిక్ హింసే నయం అనే భావన కలగడం సహజమే! ఒక ఇంట్లో : అన్నాచెల్లెళ్లు స్కూలు నుంచి వచ్చారు. ఎవరి హోమ్‌వర్క్ వాళ్లు చేసుకుంటున్నారు. స్కూలుకు తీసుకెళ్లిన బుక్స్ అన్నీ తిరిగొచ్చాయో లేదోనని కూతురి స్కూల్ బ్యాగ్‌ని అలవాటుగా చెక్ చేస్తోంది తల్లి. అందులో ఓ బుక్ ఆమెకు కనిపించినట్లు లేదు.‘‘దియా నీ సైన్సు పుస్తకాన్ని నేహా నుంచి తిరిగి తీసుకున్నావా?’’ అని కూతుర్ని అడిగింది. రాస్తున్న నోట్‌బుక్‌ని, బాల్పెన్నీ పక్కన పెట్టి సీరియస్‌గా పైకి లేచింది దియా. నేహా పేరు వినగానే ఆ పాప ముఖం అప్రసన్నంగా మారిపోయింది. కళ్లు పెద్దవి చేసింది. మూతి బిగించింది. ‘‘తన గురించి ఏమనుకుంటోంది! అది నా మీద కుట్ర పన్నుతుందా?’’ అంది! తల్లి బిత్తరపోయింది. ‘దియా..’ అంది! ‘‘దాని అంతు.. నేను చూస్తాను’’ అంది దియా. ‘దాని అంతు’ అని చిన్న విరామం ఇచ్చి ‘నేను చూస్తాను’ అని అంటున్నప్పుడు టీవీ సీరియళ్లలో పగబట్టి, ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న లేడీ క్యారెక్టర్లా ఉంది ఆరేళ్ల ఆ పాప. ఆ తల విసరడం, చేతులు తిప్పడం, కళ్లలో కోపాన్ని ఒలికించడం.. తల్లికి దడపుట్టించేలా ఉన్నాయి. దియా అన్నయ్య కూడా హోమ్‌వర్క్ ఆపేసి దియా వైపు ఆశ్చర్యంగా చూస్తుంటాడు.అక్కడితో ఆగదు దియా. కుడి చేతి పిడికిలి బిగించి పైకి లేపుతూ.. ‘‘అది నా చేతిలోంచి తప్పించుకోలేదు’’ అంటుంది. పళ్లు కూడా బిగిస్తుంది.‘‘దియా..!!’ అని ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది తల్లి. ‘‘ఆగు’’ అని పెద్దగా అరిచి తల్లిని అడ్డుకుంటుంది దియా. ఆగుతుంది తల్లి. అప్పుడు అంటుంది దియా.. ‘‘చూస్తూ ఉండమ్మా..’’ అని. దియా తల్లి చేష్టలుడిగిపోతుంది. ఇంకో ఇంట్లో : అక్కా తమ్ముడు టేబుల్ మీద ఎవరి ఆటలో వాళ్లు ఉంటారు. తమ్ముడు చిన్న చిన్న బ్లాక్స్‌తో టేబుల్‌పై బిల్డింగ్ నిలబెడుతుంటాడు. బొమ్మలతో ఆడుతుంటుంది అక్క. ఈ సీన్లో.. ఇంటికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ వస్తారు. పిల్లల అమ్మానాన్న ఎదురెళ్లి ఆ వచ్చిన భార్యాభర్తల్ని రిసీవ్ చేసుకుంటారు. ‘‘సారీ రమేశ్.. మా అబ్బాయి సి«ద్ ఆడుకోవడానికి రాలేకపోయాడు’’ అంటాడు ఆ వచ్చినాయన. ఆడుకోవడానికి వచ్చేటప్పుడు సిద్‌ను కూడా తెస్తామని ముందే మాట ఇచ్చినట్లున్నారు ఆ దంపతులు. కానీ వెంటబెట్టుకు రాలేకపోయారు. అందుకే ఆయన ‘సారీ’ చెప్పాడు.‘సారీ’ అనే మాట వినగానే బ్లాక్స్‌తో బిల్డింగ్ కడుతున్న పిల్లాడు వింతగా, విడ్డూరంగా, విసుగ్గా చూసి.. ‘‘సారీ..! సరిపోతుందా సారీ’’ అంటాడు. అంతేకాదు, తల అడ్డంగా ఊపుతూ.. ‘‘ఇది తేలిగ్గా తీసుకునేది కాదు’’ అని కూడా అంటాడు. వచ్చిన పెద్దలు, ఈ ఇంట్లో ఉన్న పెద్దలు ఇబ్బందిగా ముఖాలు చూసుకుంటారు. పిల్లాడు ఆపడు. ‘‘ఇది గట్టిగా తేల్చుకోవాల్సిన అంశం. సిద్ సమాధానం ఇవ్వాలి. ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇది చాలా అన్యాయం’’ అని రెండు చేతులూ గాలిలో ఊపుతాడు. వాడి మోచేయి తగిలి టేబుల్‌పై అంత వరకు బ్లాక్స్‌తో అతడు కట్టిన భవంతి కుప్పకూలిపోతుంది. ఇవి రెండూ.. వారం రోజులుగా డిస్నీ ఇండియా (తెలుగు) ప్రమోట్ చేస్తున్న వీడియోలు. ‘దట్ ఆక్వర్డ్ మోమెంట్’ పేరుతో పార్ట్’ 1, పార్ట్ 2 ఈ వీడియోలను ఫేస్బుక్లో అప్లోడ్ చేసింది డిస్నీ చానెల్. ప్రైమ్ టైమ్‌లో వచ్చే టీవీ సీరియళ్లు, హోరాహోరీగా సాగే న్యూస్ డిబేట్లు పిల్లలపై ఎంతగా ప్రభావం చూపుతున్నాయో చెబుతూ.. ‘పిల్లలు కేవలం పెద్దలు చూడవలసిన ప్రోగ్రామ్‌లను చూస్తుంటే ఏం నేర్చుకుంటారు? డిస్నీ కిడ్స్ ప్యాక్ తీసుకోండి. డిస్నీ యొక్క బాల్యపు మ్యాజిక్‌ను పదిలపరుచుకోండి’ అని అంటుంది డిస్నీ చానెల్. పై రెండు వీడియోల్లో లాస్ట్ సీన్‌గా.. పిల్లలు డిస్నీ కామిక్ సీరియళ్లు చూస్తూ లోకాన్ని మైమరిచి పకపక నవ్వేస్తుంటే వాళ్లను చూసి పేరెంట్స్ మురిసిపోతుంటారు. డిస్నీ ఈ వీడియోలను తన వ్యాపారం కోసమే తయారు చేసినా, పెద్దల ప్రోగ్రాములు ఆ చిన్న మెదళ్లను ఎలా దూకుడుగా, దుందుడుకుగా మార్చేస్తున్నదీ చక్కగా చెప్పగలిగింది. అంతేకదా.. కుట్రలు పన్నే అత్తాకోడళ్లు, బుసలుకొట్టే ఆడపడుచులు, పెద్ద గొంతేసుకుని డిబేట్‌కు వచ్చినవాళ్లపై విరుచుకుపడే ఆర్ణబ్ గోస్వాములు పదీ పన్నెండేళ్ల పిల్లలకు ఏం అవసరం? అయితే పిల్లలు చూసే కామిక్స్‌లో మాత్రం హింస ఉండటం లేదా? ఉంటుంది. కానీ అది నవ్వించే హింస. నవ్వునే మర్చిపోయేంత హింస కాదు. హింసలో ప్రేరేపించే గుణం ఉంటుంది. పిల్లల్లో త్వరగా ప్రేరణకు గురయ్యే బలహీనత ఉంటుంది. అందుకే టామ్ అండ్ జెర్రీ, మిక్కీ మౌజ్, పాపోయ్, 3 స్టూజెస్, సూపర్‌మేన్, లూనీ ట్యూన్స్, స్కూబీ డూ, బఫీ ది వాంపైర్ స్లేయర్, అమెరికన్ డాల్ వంటి కార్టూన్ షోలు ఇంతగా పిల్లల్ని ఆకట్టుకుంటున్నాయి. అయితే.. ‘‘ఆకట్టుకోవడం వరకు మంచిదేకానీ, వాటిల్లోని క్యారెక్టర్లు రోజంతా పిల్లల్ని అలా కట్టి పడేసి ఉంచుతున్నాయి. వారిలో దుడుకు స్వభావాన్ని పెంపొందిస్తున్నాయి’’ అని ఐయోవా స్టేట్ యూనివర్సిటీ నాలుగేళ్ల క్రితమే చేసిన ఒక అధ్యయనంలో వెల్లడయింది! పిల్లలు చూసే పెద్దవాళ్ల ప్రోగ్రాములు ఇందుకు రివర్స్. ఆకట్టుకోవు కానీ, కట్టేసుకుంటాయి. -
ప్రశ్నించే ఫటీచర్
కొందరు కార్లలో ఎందుకు తిరుగుతారు? కొందరు కటికనేల మీద ఎందుకు పరుండుతారు? కొందరికి తిండి ఎందుకు అరగదు? కొందరి కడుపుల్లో గుప్పెడు మెతుకులు ఎందుకు పడలేవు? ఫటీచర్ ఒక రచనలో నుంచి ఊడిపడే పాత్ర. కాగితాల్లో నుంచి అసలు ప్రపంచంలోకి వచ్చి ఈ లోకపు అపసవ్యతను చూసి బిత్తరపోతుంది. కథ రాస్తూ ఉండగా అందులోని ప్రధాన పాత్ర జనజీవనంలోకి వచ్చేస్తే ఎలా ఉంటుంది?! లోకం గురించి తెలియని ఆ పాత్ర చేసే హడావిడి చూస్తే ఎలా ఉంటుంది?! ఒక విచిత్రాన్ని చిత్రంగా అల్లి మనముందుకు తీసుకువచ్చింది దూరదర్శన్. 1991లో చేసిన ఆ ప్రయోగం పేరు ‘ఫటీచర్’. ఖాకీ రంగు ఖద్దరు చొక్కా, దానిమీదుగా ఓ నీలంరంగు జాకెట్, అదే రంగు ప్యాంటు, తలమీద టోపీ వేషధారణతో ఉండే ఓ వ్యక్తి లోకంలో ధనిక–బీద వ్యత్యాసాన్ని విచిత్రంగా చూస్తూ అందరి మధ్యా తిరుగుతుంటాడు. చుట్టూ ఉన్న పరిస్థితులు ఏవీ అర్థం గాక తనకున్న సందేహాలను అందరినీ అడిగి విసిగిస్తుంటాడు. అర గంటపాటు వచ్చే ఈ సీరియల్ చూస్తున్నంతసేపూ ఆశ్చర్యం, హాస్యభరితం, ఆలోచనాహితంగా చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది. ఊహాజనితమైన పాత్ర, ఆ పాత్ర చుట్టూ అల్లిన కథాంశంతో ఫటిచర్ బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. విషయమేంటంటే... ప్రఖ్యాత పుస్తకాల ప్రచురణ కర్త పౌల్ దగ్గర కొంతమంది రచయితలు ఉంటారు. వారంతా పౌల్‌తో తమకు వచ్చిన కొత్త కొత్త కథా ఆలోచనలను చెబుతుంటారు. అందులో భాగంగా ఓ రోజు రచయితల సమావేశంలో అజిత్ వచని అనే నవలా రచయిత పౌల్ ముందు ఓ నిరుపేద జీవితం గురించి నవలగా రాస్తే బాగుంటుందని చెబుతాడు. ఆ మాటల్లో భాగంగా పౌల్ తను నిరుపేద (ఫటీచర్)గా ఉన్ననాటి రోజుల నుంచి ప్రచురణ కర్తగా మారిన విధానం గురించి చెబుతాడు. ఆ ఫటిచర్ జీవిత చరిత్ర గురించి తను రాస్తానని చెబుతాడు అజిత్. అందుకు పౌల్ ‘ఓకే’ అనడం, అజిత్‌కి పట్టణంలోని ఓ విలాసవంతమైన హోటల్లో రూమ్ కేటాయించడం జరిగిపోతాయి. అజిత్ వచని ‘ఫటిచర్’ అని పేరు పెట్టి అతని గురించి నవల రాస్తూ ఉండగా.. ఆ కాగితాల్లో నుంచి ఫటిచర్ బయటకు వస్తాడు. ఈ విషయం అజిత్‌కు తెలియదు. అక్షరాల్లో నుంచి కాగితాలను నెట్టుకుంటూ బయటకు వచ్చిన ఫటిచర్ రూమ్ దాటి బయటకు వెళ్లడానికి ఆసక్తిగా చూస్తుంటాడు. అప్పుడే అటుగా వచ్చిన వెయిటర్‌తో మాటలు కలపడం, అక్కణ్ణుంచి ఇంకొంతమందిని కలుసుకోవడం, తనకు తెలియని వాటిని తెలుసుకోవడం, విచిత్రంగా వాదించడం చేస్తూ నిరుపేదలు ఉండే చోటుకి వెళతాడు. ఇతరనటీనటులు పంకజ్కపూర్తో పాటు అజిత్ వచని, నినా గుప్తా, రాజేష్ పూరీ, అనుపమ్‌ఖేర్, ప్రీతీ ఖేర్.. వంటి ప్రముఖ సినీ, నాటక రంగ నటీనటులు ఫటీచర్లో ఆకట్టుకున్నారు. ఫటీచర్గా పంకజ్ కపూర్ నాటక, సినీ రంగ నటుడు పంకజ్‌కపూర్. సినీ నటుడు షాహిద్ కపూర్ తండ్రి. చాలా టీవీ సీరియల్స్, సినిమాలలో నటించారు. ఫటీచర్కు ముందే డిటెక్టివ్‌గా (కరమ్‌చంద్ సీరియల్) పంకజ్‌కపూర్ టీవీ ప్రేక్షకులకు తెలుసు. ఎన్నో జాతీయ అవార్డులు పంకజ్‌కపూర్ ఖాతాలో చోటుచేసుకున్నాయి. ‘ఒకే పాత్రలో నన్ను ప్రేక్షకులు చూడకూడదనేది నా ప్రయత్నం. అందుకే విభిన్న పాత్రలను నా కెరియర్లో ఎంచుకున్నాను. అందులో ఫటీచర్ ఒకటి’ అని తెలిపారు ఓ ఇంటర్వ్యూలో పంకజ్ కపూర్. దారిద్య్రరేఖ ఫటీచర్ హోటల్లో ఉన్నప్పుడు అక్కడి టీవీలో వస్తున్న ఒక ఇంటర్వ్యూను చూస్తాడు. దారిద్య్రరేఖకు దిగువన, పైన ఉన్నవారు అనే విభజన గురించి ఆ కార్యక్రమంలో చెప్పడంతో అదేంటో తెలుసుకోవడానికి చాలామందిని అడుగుతుంటాడు. ఆ ‘రేఖల’ గురించి తెలియదని ‘రేఖ’ గురించి అయితే చెబుతామని అనే వ్యక్తులను కాదని ముందుకు వెళతుంటాడు. ఈ క్రమంలో ఫటీచర్కి, ఇతర వ్యక్తులకు మధ్య సాగే సంభాషణ హాస్యభరితంగా ఉంటుంది. ఆ క్రమంలోనే నిరుపేదలు ఉండే చోటుకి వెళతాడు. అక్కడ అనుకోకుండా అతనికి ఒక అంధురాలైన చెల్లెలు, మరుగుజ్జు తమ్ముడు, తాగుబోతు తండ్రి ఉన్న నిరుపేద కుటుంబం పరిచయం అవుతుంది. వారి సమస్యలు తెలుసుకుంటూ ఉంటాడు. ఆ కుటుంబానికి చేరువలోనే ఉన్న మున్సిపాలిటీ వాటర్పైప్లో తలదాచుకుంటాడు. మున్సిపాలిటీ వాళ్లు వచ్చి అతన్ని అక్కణ్ణుంచి వెళ్లిపొమ్మంటారు. తనకు ఇల్లు లేదని తాగుబోతు వ్యక్తి కుటుంబాన్ని కలుస్తాడు. ఆ జీవనంలో ఫటీచర్కి ఒక సామాన్యుడి జీవితం ఎంత దుర్భరమైనదో వాస్తవంలో తెలుసుకుంటాడు. ఆకలి–ఆహారం గురించి ప్రత్యక్షంగా తెలుసుకుంటాడు. మృదు స్వభావి కావడంతో ఫటిచర్ ను అందరూ ఇష్టపడుతుంటారు. నిరుపేదలను తాను పుట్టుకొచ్చిన లగ్జరీ హోటల్‌కి తీసుకెళుతుంటాడు. వారికి నచ్చిన ఆహారం పెట్టిస్తాడు. ఆ బిల్లు రచయిత అజిత్‌కు వెళుతుంటుంది. తను సృష్టించిన పాత్ర బయటకు రావడమేంటో అర్థంకాక ఫ్రస్టేషన్‌తో అజిత్ కాగితాలన్నీ చించేస్తుంటాడు. పేద ప్రజల్లో ఉండే ఒక నైరాశ్యం గురించి ఫటీచర్ ఎక్కువ ఆందోళన చెందుతుంటాడు. తనదైన హాస్యభరిత శైలిలో అక్కడి సమస్యలను తెలుసుకుంటూ, పరిష్కరిస్తుంటాడు. ఫటీచర్ జనంలోనే ఉంటాడు. జనంతోనే ఉంటాడు. ఆ నవలకు ఎండ్ అనేది ఉండదు. ఇదొక అసంపూర్తి నవలగానే మిగిలిపోతుంది. అనిల్ చౌదరి రాసి, దర్శకత్వం వహించిన ఈ ఫటీచర్ టీవీ సీరీస్ గోల్డెన్ డేస్ దూరదర్శన్ సీరియల్స్‌లో తప్పక ప్రస్తావించదగ్గది.– ఎన్.ఆర్ -
విభజన గాయం
దేశ విభజన రేపిన గాయం ఈనాటికీ ఇరు దేశాలనూ సలపుతూనే ఉంది. నేల మీద గీచిన గీత హృదయాలను భగ్నం చేసింది. ఆనాటి చరిత్ర, ఆ ప్రజల వేదన సాహిత్యంలో ప్రతిబింబించింది. భీష్మ సహాని రచన ‘తమస్’కు గోవింద్ నిహ్లాని ఇచ్చిన బుల్లితెర రూపమే ‘తమస్’. నాథు తన షాప్‌లో పనిచేసుకుంటూ ఉన్నాడు. థెకెదార్ అనే పశువైద్యుడు నాథు వద్దకు వచ్చి తన వైద్య అవసరాల కోసం ఓ పందిని చంపి తీసుకురావాలని అడుగుతాడు. తాను ఆ పని చేయలేనని, పందిని చంపడంలో తనకెలాంటి నైపుణ్యం లేదంటాడు నాథు. థెకెదార్ పట్టుబట్టి నాథుకు 5 రూపాయలు ఇచ్చి ఒప్పించడంతో ‘సరే, రేపు ఉదయం నాటికి చంపి తీసుకొస్తా’నని చెబుతాడు.నాథు పందిని చంపే మొట్టమొదటి సీన్ ప్రేక్షకుల్లో ఒక ఉత్కంఠను కలిగిస్తుంది. 1947 దేశ విభజన కాలంలో సిక్కులు, ముస్లింలు మత విద్వేషాలతో ఏ విధంగా రగిలిపో యారో బుల్లితెర మీద ధైర్యంగా చూపిన సీరీస్ ‘తమస్’. మరుసటి రోజు ఉదయం బక్షిజి, రాజకీయ పార్టీలోని కొంత మంది సభ్యులు ప్రచారంలో భాగంగా ముస్లిం మత పెద్ద మొహల్లా వద్దకు చేరుకుంటారు. అక్కడి మురికి కాలువలను శుభ్రపరచడం, దేశభక్తి గీతాలను పాడటం చేస్తూ... మొహల్లాతో పాటు ఉన్న ఇతర ముస్లింలను కూడా తమ కార్యక్రమంలో పాల్గొనమని కోరుతారు. వాళ్లు అందుకు ఒప్పుకోరు. అంతలోనే మసీదు మెట్ల వద్ద ఎవరో ఒక పంది మృతదేహాన్ని విసిరేశారనే వార్త దావానలంలా వ్యాపిస్తుంది. దీంతో అక్కడి ముస్లింల నుంచి పార్టీ సభ్యుల మీదకు రాళ్లు వచ్చి పడతాయి. ఇండ్లకు నిప్పు అంటుకుంటుంది. కాసేపట్లో అంతటా అశాంతి నెలకొంటుంది. అశాంతికి మూలం సమాజంలో ఏర్పడిన అశాంతికి భయపడి, ముస్లిం లీగ్ ప్రతినిధి బక్షిజీ, హయత్ బక్ష్ డిప్యూటీ కమిషనర్ రిచర్డ్‌ను కలిసి, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరుతారు. పోలీసులను మోహరించాలని లేదా కర్ఫ్యూ విధించాలని బక్షిజీ, హయత్ చేసిన సూచనలను రిచర్డ్ తిరస్కరిస్తాడు. బదులుగా పార్టీ సభ్యులే శాంతి భద్రతలను కాపాడాలని ఈ విషయాన్ని మిగతా వర్గాలను కోరమని చెబుతాడు. నాథు మసీదు వద్ద పంది మృతదేహాన్ని చూసి తాను గత రాత్రి చంపిన పంది అదేనని గుర్తుపట్టి ఆశ్చర్యపోతాడు. అశాంతికి లోనవుతాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు వీధిలో ఉన్న థెకెదార్ను చూస్తాడు. నాథు అతని దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నిస్తాడు. కాని, థెకెదార్ నాథుకి అందకుండా పరిగెత్తుతాడు. తాను చంపిన పంది వల్లే అల్లర్లు తలెత్తాయని తెలుసుకున్న నాథు అపరాధ భావనతో ఇంటికి వెళ్లి గర్భవతిగా ఉన్న తన భార్య కమ్మోకి అసలు విషయం చెబుతాడు. బయటనుంచి వినిపిస్తున్న గొడవలను చూసిన వాళ్లకు దూరాన ఇండ్లు కాలిపోవడం కనిపిస్తుంది. ఆ మత హింస కు తానే కారణమని నాథూ తనని తాను నిందించుకుంటాడు. ఇల్లు వదిలి... ప్రమాదాన్ని గ్రహించిన నాథు భార్య, తల్లితో కలిసి ఆ ప్రాంతం వదిలి సిటీకి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు. వాళ్లు కాలినడక తమ ప్రయాణాన్ని మొదలుపెడతారు. నాథు తన వికలాంగ తల్లిని వీపుపై మోస్తుంటాడు. ప్రయాణ సమయం లో నాథు తల్లి చనిపోతుంది. అడవిలోనే తల్లి భౌతిక కాయాన్ని కాల్చి, తల్లికి సరైన అంత్యక్రియలు చేయలేని తన దుస్థితికి దుఃఖిస్తాడు. కూతురు కోసం.. హర్నంసింగ్ అతని భార్య బాంటో లది సిక్కు కుటుంబం. పొరుగూర్లో ఉన్న తమ కుమార్తె జస్బీర్ ఇంటికి వెళ్లాలనుకుని బయల్దేరుతారు. వారు రాత్రంతా కాలినడకన ప్రయాణించి ఒక గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ఎవరింటిలోనైనా కాసేపు విశ్రాంతి తీసుకొని బయల్దేరుదామని ఓ ఇంటి తలుపు తడతారు. ఆ ఇల్లు ముస్లిం ఎహ్సాన్ అలీకి చెందినది. అతను గతంలో హర్నం సింగ్‌కు స్నేహితుడే. తన కొడుకుకు తెలియకుండా స్నేహితుడి కుటుంబానికి ఆశ్రయం ఇస్తాడు ఎహ్సాన్. పగటిపూట వాళ్లు దాక్కున్నా రాత్రి సమయంలో ఎహ్సాన్ కొడుకు హర్నం సింగ్ వాళ్లను చూస్తాడు. తమ ఇంటిని తక్షణమే వదిలి వెళ్లమనడంతో అక్కణ్ణుంచి బయల్దేరుతారు హర్నం సింగ్, అతని కుటుంబం. మరుసటి రోజు ఉదయం నాథు, అతని భార్యను అడవిలో కలుస్తారు. అందరూ కలిసి గురుద్వారాకి బయల్దేరుతారు. గురుద్వారా ముస్లింలు నిరంతరం ఆయుధాలు సేకరిస్తున్నారని, తామంతా అదేవిధంగా ఆయుధ సంపత్తిని పెంపొందించుకోవాలని సిక్కుల సంఘం నాయకుడు గురుద్వారాలో తేజ్‌సింగ్ సిక్కులకు చెబుతుంటాడు. గురుద్వారాలో ఏర్పాటు చేసుకున్న సమావేశంలో తేజ్‌సింగ్ మాట్లాడుతూ సిక్కుల వద్ద తగినన్ని ఆయుధాలు లేవని, సంధి కోసం 2 లక్షల రూపాయలు అవసరం అవుతాయని చెబుతాడు. తేజ్‌సింగ్, సిక్కు కౌన్సిల్ అంత డబ్బు చాలా ఎక్కువగా భావించి ముస్లింలతో చర్చలు జరపడానికి జూనియర్ గ్రంథి, నాథూలను పంపుతుంది. అయితే, ముస్లిం గుంపు నాథు, గ్రంథీలతో పాటు గురుద్వారాను చుట్టుముట్టి దాడి చేస్తారు. దీంతో ఆగ్రహించిన సిక్కులు ఆయుధాలు తీసుకొని నినాదాలు చేస్తూ పోరాడటానికి బయల్దేరుతారు. గురుద్వారా వద్ద జస్బీర్ అనే వ్యక్తి సిక్కు మహిళలను బావిలోకి దూకి సామూహిక ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తాడు. ఆ సమయంలో కొంతమంది తల్లుల చేతుల్లో పసిపిల్లలు ఉంటారు. ♦ 1947లో పంజాబ్ విభజన సమయంలో అల్లర్లతో అట్టుడుకుతున్న పాకిస్తాన్ నేపథ్యంలో ఈ చిత్రం విభజన పర్యవసనాలను కళ్లకు కట్టింది. ఆ సమయంలో భారతదేశానికి వలస వచ్చిన సిక్కు, హిందూ కుటుంబాల దుస్థితిని చూపింది. 1988లో వచ్చిన ఈ సీరియల్ ఆ తర్వాత నాలుగు గంటల నిడివిగల చలనచిత్రంగా రూపొందింది. 35వ జాతీయ సినిమా అవార్డులో మూడు అవార్డులు ‘తమస్’ సినిమా గెలుచుకోవడం విశేషం. ♦ 1988 కాలంనాటి సీరీస్ తమస్. మొదటి సన్నివేశంలోనే ఓమ్ పురి పాత్ర ఒక పందిని చంపడానికి ప్రయత్నిస్తుంది. ఓపెనింగే ఒక ఆకట్టుకునే ప్రదర్శన. కానీ, భయం, హింస వంటి ఇతివృత్తాలతో ఒక చీకటి కోణాన్ని ఆవిష్కరించింది. దూరదర్శన్‌లో ప్రసారమైన ఈ మినీ సిరీస్‌కు స్వరకర్త వన్రాజ్ భాటియా సంగీతం మనల్ని వెంటాడుతుంది. రచయిత భిషమ్ సహ్ని హిందీ నవల తమస్ నుంచి దర్శకుడు గోవింద్ నిహ్లాని తీసుకుని ఈ సీరియల్‌ను రూపకల్పన చేశాడు. ♦ తమస్, అంటే చీకటి. భారత విభజన సమయంలో వలస వచ్చిన సిక్కులు, హిందూ కుటుంబాల కథ ఇది. ఈ కథాంశం నిహ్లానీని ఆశ్చర్యపరించింది. ‘ఇది సినిమాకు తగిన కథాంశం అవుతుంది’ అనుకున్నారు. అయితే, ఈ ప్రాజెక్ట్‌కు చాలా డబ్బు అవసరం అవుతుంది. ఇది అంత ఆచరణీయం కాకపోవచ్చు అని కూడా అనుకున్నాడు. ‘ఈ ఇతివృత్తాన్ని పరిచయం చేయడానికి ముందు దూదర్శన్ ప్రతినిధులతో మాట్లాడాను. వారూ ఆసక్తి కనబరిచారు. ఈ కథాంశం వివాదాస్పదమని, అభ్యంతరాలు ఉండవచ్చనీ భావించాను. ముందు కొంత భయపడ్డాను. ఈ సీరీస్‌ను నిషేధించవచ్చని కూడా అనుకున్నాను. నన్ను కొందరు హిందూ వ్యతిరేకి అనుకున్నారు. దేశ శాంతి భద్రతలకు భంగం కలిగిస్తుందనీ భావించారు. కొందరు విభజన వాస్తవాలను కచ్చితంగా ప్రదర్శించలేదన్నారు’ అని నాటి విషయాలను ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు నిహ్లాని వివరించారు. ♦ ఇందులోని సీన్స్ కోసం గుర్గావ్లోని కొన్ని ప్రదేశాలు, అక్కడి ఫిల్మ్‌సిటీని ఎంచుకున్నారు. అప్పటికే పేరున్న నాటక, సినిమా రంగ అగ్ర నటీనటులు.. ఓమ్పురి, అమ్రిష్‌పురి, దినా పథక్, ఎ.కె.హంగల్, ఇఫ్త్ఖర్, సురేఖ సిక్రీ.. మొదలైనవారు ఇందులో నటించారు. కమిటీ ఏర్పాటు.. ఇంత ఘోరం జరిగాక రిచర్డ్ నగరంలోని ప్రముఖ వ్యక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, అక్కడి ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యల గురించి తెలియజేస్తారు. శాంతి సందేశాన్ని పంపడానికి నాయకులను అమన్ కమిటీ ఏర్పాటు చేయాలని కోరుతారు. బక్షిజీ, హయత్ బక్షన్ను అమన్ కమిటీ ఉపాధ్యక్షులుగా నియమిస్తారు. సమావేశం ముగింపులో థెకెదార్ మత సామరస్యం నినాదాలు చేస్తూ కనిపిస్తాడు. శరణార్ధి శిబిరంలో హర్నం సింగ్, బాంటో, కమ్మో ఉంటారు. ముస్లింలతో చర్చలు జరిపేందుకు జూనియర్ గ్రంథీతో వెళ్లినప్పటి నుండి కనిపించని నాథును కనుక్కోవడానికి సహాయం చేయాలని హర్నం సింగ్ ఒక ప్రభుత్వ ఉద్యోగిని అభ్యర్థిస్తాడు. నగరంలో ఆసుపత్రి గుడారాలన్నింటిలోనూ ఆరా తీయాలని ఆ ఉద్యోగిని అడుగుతాడు. నేల మీద వరసగా పడి ఉన్న మృతదేహాలను చూస్తూ, వాటిలో నాథు మృతదేహాన్ని గుర్తించి కమ్మో నిలువునా కూలిపోతుంది. నర్సులు ఆమెను ప్రసవానికి గుడారంలోకి తీసుకువెళతారు. గుడారం బయట కూర్చొని ఉన్న హర్నం సింగ్, బాంటోలకు ‘అల్లాహు అక్బర్’, హర్ హర్ మహాదేవ్’ నినాదాలతో పాటు గుడారం లోపల నుంచి అప్పుడే పుట్టిన పసిబిడ్డ ఏడుపులు వినిపిస్తాయి.– ఎన్.ఆర్. -
ఏ జో హై జిందగీ..ఫ్యామిలీ సర్కస్
కోడలిని వేధించే అత్త ఉండదు.భర్తకు విషం కలిపి పెట్టే భార్య ఉండదు.ఆడపడుచును ఎలా వేధించాలా అని ఆలోచించే వదిన ఉండదు.అందమైన జీవితం ఉంటుంది. వాస్తవమైన సరదాల గిల్లికజ్జాల మధ్యతరగతి సంసారం ఉంటుంది. స్నేహం ఉంటుంది. సరదా ఉంటుంది.నిజంగా ఆ రోజులే వేరు. దూరదర్శన్ సీరియళ్ల రోజులే వేరు. ‘ఏ జో హై జిందగీ’ లాంటి సీరియల్స్ ఇప్పుడు లేవు నిప్పుల మీద ఉప్పు వేసినట్టు ఎప్పుడూ చిటపటలాడుతూ ఉండే దంపతులు మన ఇరుగింట్లోనో, పొరుగింట్లోనూ కనిపిస్తూనే ఉంటారు. వారిమధ్య నిత్యం ఏవో చిన్నా పెద్ద సమస్యలు, కాసింత గందరగోళం, కూసిన్ని సరదాలు, తగినంత ప్రేమ.. తోకటపాసుల్లా టప్ టప్మని పేలుతుంటాయి. రోజూ ఏదో ఒక సందర్భం కథలా నడుస్తూనే ఉంటుంది. దీనిని 35 ఏళ్ల క్రితమే బేస్‌గా తీసుకుంది దూరదర్శన్. అలా బుల్లితెర ఆలూమగలుగా రేణు–రంజిత్‌లు వీక్షకులకు పరిచయం అయ్యారు. దశాబ్దాలు దాటిపోతున్నా ఆ జంట వేసిన నవ్వుల పందిరి ఇంకా కళ్లను దాటిపోలేదు. వారిద్దరి మధ్య రకరకాల గందరగోళ సమస్యలు, సరదా సన్నివేశాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. దూరదర్శన్‌లో సీరియళ్లు మొదలైన తొలినాళ్లు అవి. అలాంటి రోజుల్లో మధ్యతరగతి భార్యాభర్తల జీవితంలోని సరదా సన్నివేశాలతో మొట్టమొదటి కామెడీ సిరియల్‌గా అందించింది బుల్లితెర. నటీ నటులు.. షరీప్ ఇనామ్దార్, స్వరూప్ సంపత్, రాకేష్ బేడి, సతీష్ షా , రచయిత షరాద్ జోషి, దర్శకులు కుందన్‌షా, మంజుల్ సిన్హా, రామన్ కుమార్‌లు కలిసి చే సిన హంగామా ఫన్ సీరియల్ ఏ జో హై జిందగీ. 1984లో ప్రతీ శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ప్రేక్షకులను అలరించే ఈ సీరియల్‌కి టైటిల్ ట్రాక్ అందించినవారు కిశోర్‌కుమార్. దంపతులైన రంజిత్ వర్మ, రేణువర్మ ఆమె నిరుద్యోగి తమ్ముడు రాజా ఒక ఇంట్లో ఉంటారు. ఆలూ మగల ఇంట్లో ఏం జరుగుతుందో చూద్దామా..! ఒకనాడు.. తమ పెళ్లిరోజును భర్త రంజిత్ గుర్తుపెట్టుకున్నాడో లేదో టెస్ట్ చేయాలనుకుంటుంది భార్య రేణు. రంజిత్ తమ పెళ్లిరోజును మరిచిపోయినట్లు నటిస్తాడు. రేణుకి కోపం వచ్చి లాయర్ని కలుస్తుంది విడాకుల కోసం. ఆ లాయర్‌కి అది మొదటి కేసు. ఒక అబద్ధపు విడాకుల పత్రాన్ని రంజిత్‌కి పంపించి బెదిరించాలనుకుంటుంది. తీరా సాయంత్రానికి రంజిత్ గిఫ్ట్‌తో రేణుని సర్ప్రైజ్ చేయడంతో ఇద్దరూ కలిసిపోతారు. ఇదో విడాకుల కహాని. మర్నాడు.. రేణు, రంజిత్ల ఇంటికి ఒక కొత్త సోఫాను తీసుకొస్తాడు సేల్స్‌మ్యాన్. పొరుగింట్లో ఇవ్వాల్సిన డెలివరీని సేల్స్‌మ్యాన్ పొరపాటున వీళ్ల ఇంట్లో ఇచ్చి వెళ్లిపోతాడు. అతిథులు వచ్చి సోఫాలో కూర్చుంటారు. ఆ సమయంలోనే పొరుగింటివాళ్లు వచ్చి అసలు విషయం చెప్పి, సోఫా తీసుకెళ్తామంటారు. అతిథుల ముందు పరువు పోగొట్టుకోలేక, పొరుగింటి వాళ్లను మేనేజ్ చేయడానికి రేణు, రంజిత్‌లు పడే పాట్లు కడుపుబ్బా నవ్విస్తాయి. ఒకరోజు.. పొరుగింటివాళ్లు రంజిత్, రేణుల ఇంటికి వచ్చి ‘మా అమ్మాయి కవితకి పెళ్లి చూపులు. మా ఇంట్లో సరైన స్థలం లేదు మీ ఇంట్లో ఏర్పాటు చేస్తాం చూపులు’ అంటే ‘సరే’ అంటారు. వరుడు, అతని తరపు వాళ్లు వచ్చాక పొరపాటున రేణుని వధువుగా పరిచయం చేస్తారు. వాళ్లూ రేణుయే పెళ్లికూతురు అనుకుంటారు. అయితే వరుడు కవితను ఇష్టపడతాడు. ఈ విషయం తెలియక తల్లిదండ్రులు తమ రెండో అబ్బాయికి కవితను ఇచ్చి చేయాలనుకుంటారు. ఇరుకుటుంబాల మధ్య పెద్ద గందరగోళం. చివరకు సమస్య పరిష్కారం అవడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. మరో రోజు.. రంజిత్ రొటీన్ మెడికల్ చెకప్‌కి డాక్టర్ వద్దకు వెళతాడు. మెడికల్ రిపోర్టులు చూసిన డాక్టర్ రంజిత్‌కు క్యాన్సర్ ఉందని, ఐదు రోజులకన్నా బతకడని బాధగా చెబుతాడు. రంజిత్ డిప్రెషన్‌కి గురవుతాడు. రేణుకి ఆమె తమ్ముడు రాజాకి ఈ విషయం చెప్పవద్దని నిర్ణయించుకుంటాడు. అయితే, వింతగా నటించడం మొదలుపెడతాడు. చివరకు నర్సు పొరపాటు కారణంగా రిపోర్టులు మారిపోయాయని డాక్టర్ ద్వారా నిజం తెలుస్తుంది. ఇంకోరోజు.. పొరుగింటి కవిత తాను తల్లిని కాబోతున్నాననే విషయం చెప్పి, పుట్టబోయే బిడ్డకు సాక్స్ అల్లి ఇవ్వమని అడుగుతుంది రేణుని. అలాగే అని చెప్పిన రేణు సాక్సులు అల్లుతుంటుంది. ఇది చూసిన రంజిత్ రేణు గర్భవతి అనుకుంటాడు. రంజిత్ తమ ఇంట్లోకి రాబోయే కొత్త ప్రాణి గురించి మాట్లాడుతుంటాడు. రేణు కొత్తగా వచ్చే కుక్క పిల్ల గురించి ఆలోచించి తనూ అదేవిధంగా మాట్లాడుతుంది. ఈ గందరగోళం చివరికెప్పటికో క్లియర్ అవుతుంది. ఇలాగే మొత్తం 67 వారాలు. సరదా సరదా సన్నివేశాలతో 67 ఎపిసోడ్లలో ప్రతీవారం అరగంటపాటు బుల్లితెర నిండుగా నవ్వుల జల్లులు కురిశాయి. ఈ షో విజయవంతం అవడం, ఆ తర్వాత కొన్నికారణాల వల్ల రంజిత్ పాత్రధారి ఇనామ్దార్ బయటకు వెళ్లిపోవడంతో సెకండ్ అటెమ్ట్గా రేణు తమ్ముడు రాజాతో కథను నడిపించారు. రంజిత్–రేణులు విదేశాలకు వెళ్లినట్టు, రాజా రంజిత్ బంధువులింట్లో ఉన్నట్టు, వారి కూతురు రశ్మి, పనిమనిషి, రాజా ప్రేమించే నివేదిత .. వీళ్లందరి మధ్య సాగే కథనాన్ని ఇందులో చూపించారు. రంజిత్–రేణులు 45 ఎపిసోడ్ల వరకు ఉండగా, ఆ తర్వాత ఎపిసోడ్లలో రాజా స్టోరీ ఉంటుంది. మూడు సీజన్స్‌గా 67 ఎపిసోడ్లతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మొట్టమొదటి కామెడీ సీరియల్ ‘ఏ జో హై జిందగీ.’ -
ఇదీ భారతం
బహుముఖ సాంస్కృతిక భారతాన్ని..ఆచారాల భారతాన్ని.. సహజీవన భారతాన్ని.. ఆధ్యాత్మిక భారతాన్ని.. బహుజనుల భారతాన్ని మొదటిసారి దూర్‌దర్శన్‌లో చూపిన షో ‘సురభి’. సిద్ధార్థ్ కక్, రేణుకా సహాని యాంకర్లుగా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ♦ భారతీయ సంగీత దర్శకుడు, వయోలినిస్ట్ డా.ఎల్ సుబ్రమణ్యమ్ సురభికి సంగీతాన్ని అందించారు ∙ఈ కార్యక్రమాన్ని అమూల్ సంస్థ స్పాన్సర్ చేయడంతో ‘అమూల్ సురభి’ అని పేరు పడిపోయింది ♦ దీర్గకాలం ప్రసారమైన సాంస్కృతిక సీరీస్‌గా సురభి ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు చేసుకుంది. ఇప్పుడంటే వంటకాలకో చానెల్, సంగీతానికో చానెల్, భక్తికి ఓ చానెల్, పర్యటనకు ఓ చానెల్.. ఇలా ప్రతీ అంశానికి సంబంధించిన చానెల్స్ విడివిడిగా ఉన్నాయి. కానీ, దాదాపు మూడు దశాబ్దాల క్రితం ఇవన్నింటినీ ఓ ప్రోగ్రామ్ ద్వారా అందించింది దూరదర్శన్. భారతీయ సంస్కృతిని వెలుగులోకి తెచ్చి కొత్తగా దేశభక్తిని ఆవిష్కరించింది. ఈ నేలలో పాదుకున్న నీతి, సామాజిక విలువలను కళ్లకు కట్టింది. ఈ థీమ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇండియన్ టెలివిజన్ షోలలో అత్యంత ప్రజాదరణ పొందిన, అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమంగా ‘సురభి’ అలా ఇండియన్ టెలివిజన్ చరిత్రలో సగౌరవంగా నిలిచిపోయింది. ఎంచుకున్న అంశాలు విభిన్న స్వభావాలతో కూడినవి కావడంతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ‘సురభి’ అపార ఖ్యాతిని పొందింది. ఎక్కువకాలం ప్రసారం ప్రతి ఆదివారం బుల్లితెర స్క్రీన్‌పై యాంకర్లుగా సిద్ధార్ద్ కక్, రేణుకా సహానీలు చిరునవ్వులు చిందిస్తూ 30 నిమిషాల సేపు కార్యక్రమాన్ని నిర్వహించేవారు. కొత్త కొత్త వ్యక్తులను, ప్రదేశాలను, సంప్రదాయాలను, మనిషి సృష్టించిన అద్భుతాలను చూపేవారు. ఆ సమయంలో సీరియల్సన్నీ సాధారణ కుటుంబ సంబంధాల నేపధ్యంతో వచ్చేవి. సురభి ఒక్కటే వీటికి భిన్నంగా వచ్చింది. 1990లో మొదలైన సురభి 2001 వరకు దాదాపు 415 ఎపిసోడ్లతో అత్యంత ఎక్కువ కాలం ప్రసారమైన షో గా రికార్డులను సొంతం చేసుకుంది. పోస్ట్.. పోస్ట్ ‘సురభి’ షో విపరీతమైన ప్రేక్షకాదరణ పొందడం వెనుక మరో కృషి ఉంది. షో చివరలో తామడిగిన ప్రశ్నలకు సమాధానాలు పంపమని ప్రేక్షకులను కోరడంతో పోస్టుకార్డు వ్యవస్థ కొత్త ఊపిరి పోసుకుంది. ప్రతీవారం ప్రేక్షకులను క్విజ్ కాంటెస్ట్‌లో పాల్గొనెలా చేయడంతో ‘సురభి’ రేటింగ్ అమాంతం రాకెట్లా దూసుకుపోవడం ఆరంభించింది. ఆ సమయంలో మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ సదుపాయాలు లేకపోవడంతో జనం 15 పైసల పోస్టుకార్డును ఇలాంటివాటికి ఉపయోగించేవారు. వారానికి దాదాపు పదిన్నర లక్షల పోస్టుకార్డులు ప్రేక్షకుల నుంచి దూరదర్శన్‌కి అందేవి. ఈ పోటీలో పాల్గొనడానికి ఒక్కో కార్డ్‌కు 2 రూపాయల ధరతో ‘కాంపిటిషన్ పోస్ట్‌కార్డ్స్’ను పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా జారీచేయాల్సి వచ్చింది. అలా ఇండియన్ టెలివిజన్ చరిత్రలో ప్రజల నుంచి అత్యధిక ఆదరణ పొందిన కార్యక్రమంగా లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటుచేసుకుంది సురభి. 90ల కాలంలో ఒక బెంచ్ మార్క్ షోగా మారింది. ఈ షో తర్వాత కక్ ఫోర్డ్ ఫౌండేషన్ సహాయంతో సురభి ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి, సాంస్కృతిక కళాఖండాలను పరిరక్షించే ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. చిరునవ్వుల సురభి ఆమె చిరునవ్వు సురభికి ఒక నక్షత్రంలా అమరింది. అప్పటికే ఆమె 1989లో టెలివిజన్ సీరియల్ సర్కస్‌లో నటించింది. ఆ సీరియల్ మంచి ప్రజాదరణ పొందింది. అటు తర్వాత సురభితో ప్రజాదరణను సుస్థిరం చేసుకుంది. సురభి మొదలైన రెండేళ్లకు ఆమె ఎంట్రీ ఇచ్చింది. మొత్తం 350 ఎపిసోడ్లను తన ఖాతాలో జమ చేసుకుంది. ఆమె.. నటి, దర్శకురాలు రేణుకా సహానీ. సురభి గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సహానీ ‘మళ్లీ అలాంటి రోజులను, అలాంటి షోను తిలకించలేం. దేశ సంస్కృతి, చరిత్రకి అసలు సిసలు భాష్యం చెప్పింది నాటి దూరదర్శన్. గతాన్ని చూపుతూ భవిష్యత్తుకు బంగారంగా నిలిచింది’ అన్నారు. నిర్మాత, వ్యాఖ్యాత ఈ షో గురించి నిర్మాత, వ్యాఖ్యాత సిద్ధార్థ్ కక్ మాట్టాడుతూ ‘నాటి రోజుల్లో ఎలాంటి జాగ్రత్తలు లేకుండా మాట్లాడే స్వేచ్ఛ మాకు ఉండేది. దీని వల్లే విస్తృతంగా ప్రేక్షకులతో సంభాషించాం. భారతీయ సంస్కృతి సమగ్ర దృక్పథాన్ని సరైన సందర్భంలో ప్రదర్శించాం. ఈ ప్రయాణంలో మాకున్నది తక్కువ కమ్యూనికేషన్ కానీ ప్రజలతో కలిసి ఎక్కువ కాలం ప్రయాణించాం. ముందే ఎంచుకున్న ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడ చిన్న చిన్న వివరాలు సైతం జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకుని చిత్రించేవాళ్ళం. చివరికి మా కష్టం ప్రేక్షకులకు అర్ధమైంది. దీంతో వారు మాకు సహకరించారు’ అని ఆనందంగా గతాన్ని గర్తు చేసుకుంటారు సిద్ధార్థ్. ఒక్క చిరునవ్వు సురభి ప్రయాణంతో రేణుకా సహానీ ‘హమ్ ఆప్ హై కౌన్, తున్ను కి టీనా.. వంటి సినిమాలోనూ నటించింది. 2009లో మరాఠీ చిత్రం ‘రీటా’కు దర్శకత్వం వహించింది. రేణుకా సహానీ సినిమాలలో నటించినా, సామాజిక, రాజకీయ సమస్యలపై బలమైన అభిప్రాయాలను వినిపించినా ఇప్పటికీ సిసలైన గుర్తింపు అంటే అది ‘సురభి’ వల్లే. రేణుకా సహానీ మాట్లాడుతూ ‘మొబైల్ ఫోన్లు, టెక్నాలజీ ఇప్పుడున్నంతగా అప్పుడు లేదు. ప్రజలు వినోదం, మంచి కథలు ఉన్న కార్యక్రమాలవైపు ఆసక్తిగా చూస్తున్నారు. మేం వాటికనుగుణంగా కంటెంట్‌లో సర్దుబాటు చేశారు. మొదట మా వ్యాఖ్యాన్యం చాలా సాధారణంగా ఉండేది. సురభి మొదలైన రెండేళ్లకు నేను వచ్చాను. కొన్ని ఎపిసోడ్స్ పూర్తయ్యాక సిద్దార్థ గారు, నేను షోను ప్లెజెంట్‌గా మార్చాలంటే ఏం చేయాలని ఆలోచించాం. అందుకు చిరునవ్వుతో యాంకరింగ్ చేయాలన్నారు. అలా మొదలైంది నా ప్రయాణం. ఒక్క చిరునవ్వు నా జీవితాన్నే మార్చేసింది. బాంబేలో పుట్టి పెరిగిన నేను విదేశాల్లో చదువుకున్నాను. ఈ షో ద్వారా నేను నా దేశం గొప్పతనాన్ని స్వీయ అన్వేషణతో తెలుసుకోగలిగాను. దేశమంతా తిరిగాను. నాగరికత ఆనవాళ్లు, తరాతరాల గొప్పతనం తెలుసుకున్నాను. ఈ ఉద్యమంలో నేనూ భాగమైనందకు గర్వంగా ఉంది’ అన్నారు . వారపత్రిక వారం వారం అనేక సాంస్కృతిక అంశాలతో అలంరించే సురభిని ఒక వీక్లీ మ్యాగజైన్‌తో పోల్చుతారు. భారతీయ సంస్కతిలో భాగమైన సంగీతం, నృత్యం, శిల్పం, ప్రజల జీవనవిధానం, వంటకాలు, చేతిపనులు.. ప్రతీ అంశాన్ని ఈ షోలో కవర్ చేశారు. అవన్నీ ఇప్పుడు ఎన్నో చానెల్స్ అనుసరిస్తున్నాయి. ఆ కాన్సెప్ట్ ఇప్పటికీ రకరకాల చానెల్స్‌లో నడుస్తూనే ఉంది. ఇన్ని కార్యక్రమాలకు ‘సురభి’ ఒక్కటే సమాధానమైంది. అంతేకాదు, సురభిని సాధ్యం చేసిన మరో విషయం ఏమిటంటే సామాన్య ప్రజల నుండి ఈ షోకు లభించిన భారీ మద్దతు. పట్టణ కేంద్రాలకే కాదు మారుమూల ప్రాంతాలకు ప్రయాణించింది సురభి. అక్కడి ప్రజలు సహాయం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. సంస్కృతి, చరిత్ర మనకు వారసత్వంగా వచ్చింది. వాటిని మనం మార్చలేం. ప్రజలే స్వయంగా వచ్చి సంస్కృతిని అందించడానికి సహాయపడ్డారు. కొన్నింటిని ప్రజలే నేరుగా వచ్చి మార్పులు చేయడానికి సహకరించారు. తమ ఆలోచనలను షో నిర్వాహకులతో పంచుకున్నారు.– ఎన్.ఆర్. -
టీవీ వచ్చిందోయ్ సీరియల్ తెచ్చిందోయ్
ఒక ఇంట్లో... ‘దీపను కార్తీక్ ఎప్పుడు అర్ధం చేసుకుంటాడో.. భర్త అయ్యుండి మరీ అంత హార్ష్‌గా ఎలా బిహేవ్ చేస్తాడో. ఈ మగాళ్లు ఇంతే’ టీవీలో సీరియల్ చూస్తూ అందులోని కథానాయిక పడే కష్టాలు తనే పడుతున్నంత బాధగా అనుకుంది వంట చేస్తున్న శ్రావణి.మరో ఇంట్లో...‘అసలా సమీర్ కోకిలను చేసుకుంటాడో, సింధును చేసుకుంటాడో. సమీర్ కోకిల జోడీ మాత్రం సూపర్ కదా..’ చాటింగ్‌లో ఫ్రెండ్‌ను అడుగుతోంది కాలేజీ అమ్మాయి కోమలి.వేరే ఇంట్లో...‘పాపం ఆ అమ్ములుకెన్ని కష్టాలే... తల్లిదండ్రులే కాదంటే ఇంక ఆ పిల్ల గతేం కాను?’ కళ్లజోడు తీసి తుడిచి మళ్లీ పెట్టుకుంటూ అంది మనవారిలితో బామ్మ అన్నపూర్ణమ్మ. టీవీ సీరియల్స్‌లో వచ్చే కథలు తమవే అయినట్టు, అందులోని పాత్రలు తమ మధ్యే తిరుగుతున్నట్టు, తమలోనే ఉన్నట్టు ఆవాహన చేసుకుంటోంది. నిన్నటి, నేటి తరం.నట్టింట చేరిన బుల్లిపెట్టెలో వచ్చే వరుస సీరియళ్లను అర్థరాత్రి వరకు వరుసపెట్టి చూస్తూ, వాటి గురించి మాట్లాడుకునే బామ్మలు, భామలు ఇటు అనకాపల్లి నుంచి అటు అమెరికా దాకా ఉన్నారు. ‘ఆ సీరియళ్ల ధ్యాసలో పడి మొగుడికి వేళకింత తిండిపెట్టాలన్న ఆలోచన కూడా పోయింది ఈ ఆడాళ్లకు’ అంటూ మగవాళ్లు కస్సుబుస్సుమన్నా ‘ప్రకటనల గ్యాప్‌లో కాపురాలను కానిచ్చేస్తున్నారు..’ అని కామెడీ మతాబులు పేల్చినా.. సీరియళ్ల ప్రవాహానికి అడ్డుగా నిలిచే శక్తి ఎవ్వరికీ లేదన్నది నేటి టీవీ సీరియళ్ల టీఆర్పి రేటింగ్స్ చూస్తే అర్ధమైపోతుంది. జీళ్లపాకం సీరియల్స్ అని తిట్టుకునే మగవారు సైతం ‘మా కాలక్షేపం ఈ సీరియల్సే’ అని సీన్ మిస్సవ్వకుండా చూస్తున్నవారే ఎక్కువ. అందుకే ఆ సీరియళ్లు వెయ్యిన్నొక్క ఎపిసోడు, రెండువేల రెండో ఎపిసోడు అంటూ రికార్డులు తిరగరాసుకుంటున్నాయి. ఇంతకీ ఈ సీరియల్స్ మన నట్టింట్లో ఎప్పుడు ఎలా అడుగు పెట్టాయి? ఏళ్లపాటు కొనసాగే వీటి ఉనికి ఎన్నేళ్ల క్రితం మొదలయ్యింది తెలుసుకోవడం కూడా ఆసక్తి పుట్టిస్తుంది. నెక్ట్స్ కథనంలో ఏమవుతుందో అనే ప్రేక్షకుడి ఆసక్తే ఈ సిరియల్స్‌కు అసలు సిసలు పెట్టుబడి అవుతోందన్నది ముమ్మాటికీ నిజం. రేడియో నుంచి టీవీకి ధారావాహిక అనేది ముందు అమెరికాలో మొదలైంది. అక్కడి రేడియోలో ‘గైడింగ్ లైట్’ అనే నాటకం 1937 నుంచి 1956 వరకు దాదాపు 19 ఏళ్లపాటు ప్రసారమైంది. దీనిలో చాలా పాత్రలు, భావోద్వేగ బంధాల మధ్య కథనం సాగుతూ ఉంటుంది. టీవీ ప్రాచుర్యంలోకి వచ్చాక అదే నాటకం జూన్ 30, 1952 నుంచి సెప్టెంబర్ 18, 2009వరకు దాదాపు 57 ఏళ్లపాటు సీరియల్‌గా ప్రసారం అయ్యింది. టెలివిజన్ చరిత్రలోనే ఫస్ట్ అండ్ లాంగెస్ట్ రన్నింగ్ డ్రామాగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో పేరు సంపాదించుకున్న ఈ సీరియల్ అమెరికా బ్రాడ్కాస్ట్ చరిత్రలోనే విశేషంగా చెప్పుకోదగినది. అంటే అటు రేడియో, ఇటు టీవీ మాధ్యమాలలో ప్రసారమైన ఈ కార్యక్రమం ప్రసార కాలం 72 ఏళ్లు అన్నమాట. దీని విజయంతో యూరప్, ఆఫ్రికా, ఆసియా దేశాల్లో సీరియల్ ట్రెండ్ విస్తరించింది. ఇక ఈ సీరియల్స్‌ని మొదట సబ్బుల (సోప్) తయారీదారులు స్పాన్సర్ చేసేవారు. అందుకే వీటికి సోప్ వారు నిర్వహించే ధారావాహిక అనే పేరు వచ్చింది. ఆ తర్వాత్తర్వాత ‘సోప్ ఒపెరా’ పేరు అంతర్జాతీయంగా ఖరారైంది. మన నట్టింట్లో మొదటి అడుగు ఇండియన్ టెలివిజన్‌లో మొట్టమొదటగా అడుగుపెట్టిన డ్రామా సీరీస్ ‘హమ్ లోగ్’. దూరదర్శన్‌లో ఈ సీరియల్ 1984 జూలై 7న ప్రారంభమై 17 డిసెంబర్ 1985 వరకు 154 ఎపిసోడ్లు ప్రసారమైంది. 1980ల నాటి మధ్యతరగతి కుటుంబంలోని నిత్య సంఘర్షణలు, వ్యక్తుల ఆకాంక్షల గురించిన కథనంతో విద్య–వినోదం ప్రధానాంశంగా ఈ సీరియల్ సాగింది. ముఖ్యంగా సామాజికాంశాలైన కుటుంబనియంత్రణ, కుల సామరస్యం, మహిళా సాధికారత, జాతీయ సమైక్యత, కట్నం, మద్యపానం– మత్తు పదార్థాల దుర్వినియోగం .. వంటి అంశాలపై ప్రజలలో అవగాహన కల్పించే విధంగా ఈ సీరియల్‌ని రూపుదిద్దారు. ఈ కథను మెక్సికన్ టెలివిజన్ సీరీస్ ‘వెన్ కన్‌మిగో (V్ఛn ఛిౌnఝజీజౌ 1975)లోని మూల కథ నుంచి తీసుకొని మనవారి మనోభావాలకు అనుగుణంగా తీర్చిదిద్దారు. 1982లో నాటి కేంద్ర ప్రసార శాఖా మంత్రి వసంత్ సాథే మెక్సికన్ పర్యటనకు వెళ్లి అక్కడ ‘వెన్ కన్‌మిగో’ చూసి ఇండియాలోనూ ఈ తరహా కార్యక్రమం ప్రసారం చేయాలనే ఆలోచన చేశారట. దీంతో రచయిత మనోహర్ శ్యామ్ జోషి, స్క్రిప్ట్ రైటర్, ఫిల్మ్ మేకర్ పి.కుమార్ వాసుదేవ్, మ్యూజిక్ డైరెక్టర్ అనిల్ బిస్వాస్, హిందీ సినీ నటుడు అశోక్‌కుమార్‌ల ఆధ్వర్యంలో ‘హమ్‌లోగ్’ సీరియల్ ప్రసారమైంది. ఈ సీరియల్ వచ్చిన 17 నెలల్లో నటుడు అశోక్‌కుమార్‌కు ‘మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటామ’ని 4 లక్షల మంది అమ్మాయిలు ఉత్తరాలు రాశారు. దానిని బట్టి ఈ సీరియల్ ఎంతటి జనాదరణ పొందిందో అర్థం చేసుకోవచ్చు. రెండవ అడుగు ‘ఏ జో హై జిందగీ’ పేరుతో 1984లో కేవలం 67 ఎపిసోడ్స్‌తో హాస్య ధారావాహిక రూపొందింది. భార్యాభర్తలైన రంజిత్‌వర్మ, రేణు వర్మల మధ్య చోటు చేసుకునే ఫన్నీ సందర్భాలను దీంట్లో చూపించారు. ‘హమ్‌లోగ్’ ముగిసిన ఐదు నెలలకు (మే 1986) ‘బునియాద్’ సీరియల్ ప్రారంభమైంది. 1947లో ఇండియా–పాకిస్తాన్ విభజన నాటి సామాజిక స్థితిగతుల ఆధారంగా ఈ కథను నడిపించారు రచయిత కమల్సైగల్. దానికి అందమైన దృశ్యరూపం ఇచ్చారు దర్శకులు రమేష్ సిప్పి, జ్యోతీ స్వరూప్. ఉద్యోగాలు చేసుకునే ఒంటరి మహిళలు ఒకింట్లో పెయింగ్గెస్ట్గా చేరడం, అక్కడ ఎదురయ్యే సమస్యలు, సరదా విషయాలను ‘ఇధర్ ఉధర్’ (1985) లో చూపించారు. ఇదే సీరియల్‌ను తిరిగి 1998లో రెండవ సీజన్‌గా ప్రసారం చేశారు. ఆ తర్వాత సీరియల్స్ ట్రెండ్‌ను ఓ ఊపు ఊపినవి.. అశేష జనాన్ని టీవీల ముందు కట్టిపడేసినవి ఇతిహాసాలైన రామాయణ్ (1987–1988), మహాభారత్ (1989–1990)లు. ఒక ఆధ్యాత్మిక భావనను ఈ రెండు సీరియళ్లు ప్రతి మదిని తట్టిలేపాయి. దేవతలే తమ నట్టింటికి వచ్చి అలనాటి కథను చూపుతున్నట్టు ఫీలయ్యారు జనం. టీవీల ముందు కొబ్బరికాయలు కొట్టి, హారతలు పట్టారు. 1980 నుంచి 90ల కాలంలో బుల్లితెర పై దూరదర్శన్ సీరియల్స్‌కి మహర్దశ పట్టిందని చెప్పవచ్చు. ఇక ఆ తర్వాతి వరుస క్రైమ్ థ్రిల్లర్ది. ‘కరమ్‌చంద్’, ‘బ్యోంకేశ్ బక్షీ’, జాన్కీ జాసూస్’తో పాటు చారిత్రక నేపథ్యం ఉన్న చంద్రకాంత, చాణక్య, జనం నాడితో ఫీట్లు చేయించిన సర్కస్ .. వంటి సీరియల్స్‌తో ప్రతి ఇంటా బుల్లితెర ఓ అనివార్యమైన వస్తువయ్యింది. మూడవ అడుగు అప్పటివరకు సామాజిక పరిస్థితులు, చారిత్రకాంశాలమీద ఫోకస్‌పెట్టిన సీరియళ్ల కన్ను ఆటపాటలు, పుస్తకాలతో కుస్తీపట్టే పిల్లల వైపు మళ్లింది. ఇది బుల్లితెర వామనుడి మూడవ అడుగుగా చెప్పవచ్చు. బామ్మలు చెప్పిన కథలకు దృశ్యరూపం బుల్లితెర ఆకాశమే హద్ధయ్యింది. మాల్గుడి డేస్, విక్రమ్ బేతాల్, తెనాలి రామకృష్ణ.. వంటి సీరియల్స్ పిల్లలు ఎక్కడున్నా సమయానికి లాక్కొచ్చి కూర్చోబెట్టేవి. పెద్దలనూ టీవీల ముందు నుంచి కదలనిచ్చేవి కావు. ఈ మూడవ అడుగుతో సీరియల్ అన్ని తరాలనూ తన వైపు తిప్పుకుంది. హిందీ సీరియల్స్‌తో నార్త్ టు సౌత్‌ను ఆకట్టుకుంటున్న మన బుల్లితెర ఆ తర్వాత మరాఠీ, గుజారాతీ, బెంగాలి, తమిళ, కన్నడ, ఒడియా, తెలుగు, మలయాళం.. ఇతర అన్ని భాషలలో సీరియళ్లని చూపించడం మొదలుపెట్టింది. (వచ్చేవారం మరికొంత) – నిర్వహణ: నిర్మలారెడ్డి -
పేరు కోసం పోరు
‘‘నా పేరును వాడుకుంటున్నావు.. రాయల్టీ కట్టు లేదా లీగల్ నోటీస్ కోసం సిద్ధంగా ఉండు’’ అని నటుడు–దర్శకుడు అనుపమ్ ఖేర్‌పై హెచ్చరిక జారీ చేశారు అనిల్ కపూర్. విషయం ఏంటంటే.. ‘‘బెల్లెవ్యూ’’ అనే ఓ కెనెడా పాపులర్ టీవీ సిరీస్‌లో ముఖ్య పాత్ర పోషించనున్నారు అనుపమ్ ఖేర్. ఆ సిరీస్‌లో అనుపమ్ క్యారెక్టర్ పేరు డా. అనిల్ కపూర్. ఆ క్యారెక్టర్‌కు తన పేరును వాడుకుంటున్నారు అనే కారణంతో ట్విట్టర్లో ఈ కామెంట్స్ చేశారు అనిల్. దాంతో అనిల్, అనుపమ్ మధ్య గొడవ మొదలైందనే వార్తలు స్టార్ట్ అయ్యాయి. ఈ విషయం పై అనుపమ్ ఖేర్ స్పందిస్తూ – ‘‘అనిల్‌కపూర్ సరదాగా జోక్ చేశాడు. ఈ విషయంపై అనవసరమైన చర్చ జరుగుతోంది. అయినా అనవసరమైన విషయాల్ని ఫోకస్ చేయడం మనకు అలవాటే కదా. అనిల్ అన్నాడని కాదు కానీ, అతని పేరుతో నేను ఆ క్యారెక్టర్‌ను చేస్తే కొంచెం అయోమయంగా ఉండొచ్చు. అందుకని నా పాత్ర పేరును మార్చమని ప్రొడక్షన్ టీమ్‌ను కోరాను. ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఈ సిరీస్‌లో పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంటర్నేషనల్ టెలివిజన్‌లోనే ‘బెల్లవ్యూ’ మోస్ట్ అవెయిటెడ్ సిరీస్. నటుడిగా నా పరిధుల్ని పెంచుకుని, వరల్డ్ క్లాస్ టాలెంట్‌తో పని చేసే అవకాశం కల్పించనుంది ఈ సిరీస్’’ అని పేర్కొన్నారు. డేవిడ్ స్కల్నర్ రాసిన ఈ టీవీ సిరీస్‌ను ఎరిక్ మాన్హైమర్ నిర్మిస్తున్నారు. ఒక హాస్పిటల్లో పన్నెండు మంది పేషంట్స్ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ సిరీస్‌ను రూపొందిస్తున్నారు. ఈ సిరీస్ షూటింగ్లో అనుపమ్ ఖేర్ మార్చి నుంచి పాల్గొననున్నారు. -
సీరియల్ కోసం స్వారీ!
ఫ్రమ్ సిల్వర్ స్క్రీన్ టు స్మాల్ స్క్రీన్‌కి వెళ్లినంత మాత్రాన తారలు తక్కువైపోరు. ఇంకా చెప్పాలంటే ప్రతి ఇంట్లోనూ ఉంటారు. ఇవాళ టీవీ లేని ఇల్లు ఉందా? చెప్పండి. బిగ్ బి నుంచి మన చిన్న ఎన్టీఆర్ వరకూ ఫామ్‌లో ఉన్న స్టార్స్ అందరూ టీవీ షోస్ చేస్తున్నారు. ఇప్పుడు కన్నడ బ్యూటీ సంజన స్మాల్ స్క్రీన్కు అరంగేట్రం చేయనున్నారు. బుజ్జిగాడు మేడిన్ చెన్నై, సత్యమేవ జయతే, సర్దార్ గబ్బర్ సింగ్ వంటి చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ ‘స్వర్ణ ఖడ్గం’ అనే సీరియల్లో నటించనున్నారు. ‘‘ఇండియన్ ఎపిక్ ‘బాహుబలి’ని నిర్మించిన ‘ఆర్కా మీడియా’ సంస్థ ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ ఈ సీరియల్‌ను నిర్మించనున్నారు. టెలివిజన్ టాప్ డైరెక్టర్ యాతా సత్యనారాయణగారు దర్శకుడు. ‘బాహుబలి’కి పని చేసిన వీఎఫ్ఎక్స్ మరియు సీజీ టీమ్ ఈ సీరియల్‌కు పని చేస్తున్నారు. ‘‘ఇది పీరియాడిక్ సీరియల్ కాబట్టి గుర్రపు స్వారీ నేర్చుకున్నాను. హీరోయిన్ సెంట్రిక్ సీరియల్. 100కు పైగా ఎపిసోడ్లు ఉన్న ఈ మెగా సీరియల్లో నేను నా డ్రీమ్ రోల్ చేస్తున్నా’’ అని ‘సాక్షి’తో సంజన చెప్పారు. -
చిన్నారిని బలిగొన్న టీవీ సీరియల్!
టీవీలు, సినిమాలు వినోదాన్ని పంచాలి. నవ్వించాలి. ఏకాంతాన్ని మరిపించాలి. విజ్ఞానాన్ని పంచాలి. చరిత్రను, సంస్కృతిని చాటిచెప్పాలి. కానీ.. అలా జరగడంలేదు. సినిమాలే కాదు, సీరియళ్లు కూడా హింసను, పగను, ద్వేషాన్ని ప్రేరేపిస్తున్నాయి. వినోదాన్ని పంచాల్సిందిపోయి.. విషాదాన్ని మిగిలిస్తున్నాయి. సాక్షి, బెంగళూరు: హింస, పగ, ద్వేషంతో కూడిన నేటి టీవీ సీరియళ్లు పిల్లలపై ఎంతటి దుష్ప్రభావాన్ని చూపుతాయో తెలిపే సంఘటన ఇది. తల్లిదండ్రులతో కలిసి టీవీలో సీరియల్ చూసిన ఓ చిన్నారి, అందులో హీరోయిన్ చేసినట్లుగానే మంటల మధ్య డ్యాన్స్ చేయడానికి యత్నించి సజీవ దహనమైంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాల్లోకెళ్తే... దావణగెరె జిల్లా హరిహర పట్టణలోని ఆశ్రయ కాలనీలో నివాసం ఉంటున్న చైత్రా, మంజునాథల కుమార్తె ప్రార్థన (7). రెండో తరగతి చదువుతోంది. ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో ఓ టీవీ చానల్లో ప్రసారమయ్యే ‘నందిని’ సీరియల్‌ను ఇష్టంగా చూసేది. ఈ నెల 11న ప్రార్థనను పాఠశాల నుంచి తీసుకొచ్చిన నాయనమ్మ టీవీ ఆన్ చేసి బయటికి వెళ్లిపోయింది. ఆ సమయంలో సీరియల్లో హీరోయిన్ తనకు తాను నిప్పంటించుకొనే సన్నివేశం రావడంతో తాను కూడా అలాగే చేయాలనుకున్న బాలిక.. ఇంట్లో ఉన్న పేపర్లను చుట్టూ వేసుకుని నిప్పంటించింది. వాటి మధ్య నిలబడి డ్యాన్స్ చేయడానికి ప్రయత్నించింది. ఈ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రార్థనా శరీరానికి నిప్పంటుకొని తీవ్ర గాయాలయ్యాయి. బాధను తట్టుకోలేక ప్రార్థన కేకలు వేయడంతో పొరుగువారంతా వచ్చి, మంటలను ఆర్పేసి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కోలుకోలేనిస్థాయిలో బాలిక శరీరం కాలిపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 24 గంటలు గడవకముందే మరణించింది. ఏ తల్లిదండ్రులకూ ఈ పరిస్థితి వద్దు.. ఘటన వివరాలను ప్రార్థన తల్లిదండ్రులు బుధవారం మీడియాకు వివరించారు. ‘మా చిన్నారి ఆ సీరియల్‌ను ప్రతిరోజూ చూస్తూ వాటిలోని పాత్రలను అనుకరించేది. ఆ సీరియల్లో హీరోయిన్ చేసినట్లుగానే చేసింది. ఇన్ని రోజులు బాధలో ఉన్న మేము, భవిష్యత్తులో ఏ తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితి రాకూడదనే నిజాన్ని మీడియా ఎదుట చెబుతున్నాం’అని కంటతడి పెట్టుకున్నారు. -
లబ్..డబ్..
-
ఏక్తా క్వీన్
ఏక్తా కపూర్ పర్ఫెక్షనిస్ట్. సినిమా అయినా, టీవీ సీరియల్ అయినా తను అనుకున్నట్టు రావాల్సిందే. అందుకోసం ఆమె ఎన్నిసార్లయినా స్క్రిప్టు మారుస్తారు. హీరోయిన్ చేత ఎన్ని డ్రెస్సులైనా మార్పిస్తారు. అంత ‘పట్టింపు’లోనూ ప్రేక్షకాదరణ తగ్గకుండా యేళ్లకు యేళ్లు కుటుంబ కథలను వేళ్లకు దారాలు కట్టుకున్నట్టుగా నడిపిస్తున్నారు. అందుకే ఆమె ‘డ్రామా క్వీన్’ అయ్యారు. కథ ఏదైనా ఏక్తానే.. క్వీన్. సినిమాలు మూడు కారణాల వల్ల నడుస్తాయి. ఒకటి ఎంటర్టైన్మెంట్. రెండు ఎంటర్టైన్మెంట్. మూడు ఎంటర్టైన్మెంట్. ‘డర్టీపిక్చర్’లోని డైలాగ్ ఇది. సినిమాలోని ైడె లాగ్ మాత్రమే కాదు. సినిమాను నడిపించిన సూత్రం కూడా అదే. ఆ సినిమా నిర్మాణసంస్థ బాలాజీ మోషన్ పిక్చర్స్ (బి.ఎం.పి.)ని హిట్ చేసిందీ అదే ఎంటర్టైన్మెంట్. బి.ఎం.పి. 2001లో మొదలైంది. అది జితేంద్ర కంపెనీ. అంతకు ఏడేళ్ల క్రితం (1994) నుండీ ‘బాలాజీ టెలీ ఫిలింస్ ప్రొడక్షన్ హౌజ్’ నిర్మిస్తున్న టీవీ సీరియల్స్‌కు టీఆర్పీ టాప్ రేటింగ్స్ ఇస్తున్నది కూడా ఎంటర్టైన్మెంటే. 1995 నుండి జితేంద్ర కూతురు ఏక్తా కపూర్ దీనిని నడిపిస్తున్నారు. కాదు. పరుగెత్తిస్తున్నారు. టీవీ ధారావాహికలకు ఒక చెడ్డపేరు ఉంది. నత్తనడక నడుస్తాయని! నత్తల్లా కదలొచ్చుగాక... ఏక్తా స్క్రీన్ ప్లేలో ఆ నడక పరుగులా ఉంటుంది. అదే ఆమె స్పెషాలిటీ. కథ ఏదైనా.. ఏక్తానే క్వీన్! పేరుకు తండ్రి కంపెనీలే కానీ... బాలాజీ టెలీఫిలిమ్స్, బాలాజీ పిక్చర్స్.. ఈ రెండిటికి తెరవెనుక ప్రధాన నాయిక ఏక్తా కపూర్. గ్లిజరిన్ అమ్మకందార్లకు విపరీతంగా గిరాకీ పెంచిందని ఆమె మీద పెద్ద సెటైర్. దాన్ని ఆమె ఏనాడూ లెక్క చేయలేదు. తను తీయాలనుకున్నది తీశారు. ఏక్తా తీసిన వాటిల్లో 25 టీవీ సీరియళ్లు సూపర్ హిట్. అందుకే... ప్రేక్షకాదరణ ఏమాత్రం చెక్కుచెదరకుండా యేళ్లకు యేళ్లు కుటుంబ కథలను వేళ్లకు దారాలు కట్టుకున్నట్టుగా నడిపిస్తున్న ఏక్తా ‘డ్రామా క్వీన్’ అయ్యారు. కథ ఏదైనా ఏక్తానే.. క్వీన్. తొలినాళ్ల థీమ్‌లు వేరు నిజజీవితంలో ఎక్కడా లేని, ఎక్కడా జరగని సన్నివేశాలతో ఏక్తా సీరియళ్లు తీస్తారని ఆమెపై ఇంకో విమర్శ. ఏక్తా లెక్క చేయలేదు. తను నమ్మిన ఎంటర్టైన్మెంట్ ఫార్ములానే ఫాలో అయ్యారు. అవుతున్నారు. ప్రతిసారి ఒక కొత్త సక్సెస్‌ని ఒక కొత్త కిరీటంలా ధరిస్తున్నారు. 2010లో ఫోర్బ్స్ పత్రిక విజయవంతమైన పారిశ్రామిక మహిళల్లో ఏక్తాకు మూడో స్థానం ఇచ్చింది. అది ఆమెకు ఫోర్బ్స్ ఇచ్చిన స్థానమే అయుండొచ్చు. ఇచ్చేలా చేసింది మాత్రం టీవీ ప్రేక్షకులే. ‘‘ఈ రంగంలోకి వచ్చిన కొత్తలో ‘పెళ్లి తర్వాతి ప్రేమ..’ అనే థీమ్‌తో కొన్ని సీరియల్స్ తీశాను. టీఆర్పీ రేస్‌లో అవి చివరన ఉన్నాయి. అప్పుడర్థమైంది నాకు.. వీక్షకులకు కావల్సింది కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమేనని. అంతే నా రూట్ మార్చుకున్నాను.. కథాంశాలను మార్చేశాను’ - విమర్శకులకు ఏక్తా సమాధానం. నాడి పట్టుకున్నారు ఏక్తా. క్యోంకీ సాస్ భీ... 1997లో సీరియళ్ల నిర్మాణంలోకి అడుగుపెట్టినా.. అసలైన విజయంతో ఏక్తా వేలమందికి తెలిసింది మాత్రం 2000 సంవత్సరంలో మొదలైన ‘క్యోంకీ సాస్ భీ కభీ బహూ థీ’ అనే సీరియల్‌తోనే. ఈ కథతో ఆమె టెలివిజన్ సీరియళ్ల చరిత్రనే తిరగరాశారు. కనిపించకుండా పోతున్న ఉమ్మడి కుటుంబాలు, ఆ కుటుంబాల్లో నిరంతరం కనిపిస్తుండే కలహాలు, ఆస్తుల తగాదాలు, దాయాదుల పగలు, పంతాలు, కుట్రలు వీటన్నింటినీ ఏక్తా తన సీరియల్స్‌కు కథాంశాలుగా ఎంచుకున్నారు. విపరీతమైన డ్రామా! ఏళ్లకు ఏళ్లుగా ఎపిసోడ్లు. చివరికి తమ సీరియళ్లతోనే ఇంట్లో ఆడవాళ్లు టీవీ చూసే టైమ్‌ను సెట్ చేసుకునే పరిస్థితి కల్పించింది బాలాజీ టెలీఫిలిమ్స్! తన ప్రొడక్షన్స్‌తో జీటీవీ ఛానల్‌ను పాపులర్ చేసింది. ఒక దశలో స్టార్ ప్లస్, సోనీ, జీటీవీ లాంటి ప్రముఖ చానళ్లంటిలోనూ.. బాలాజీ టెలీఫిలింస్ సీరియల్సే ప్రసారమయ్యేంత డిమాండ్‌ని సంపాదించిపెట్టింది. తొణకలేదు.. బెణకలేదు! సరిగ్గా ఈ సమయంలోనే ఏక్తా తీవ్రమైన విమర్శలను ఎదుర్కొన్నారు. స్త్రీని విలన్‌గా చూపిస్తోందని.. అత్తాకోడళ్లను ఆగర్భ శత్రువులుగా చిత్రీకరిస్తోందని విమర్శకులు ధ్వజమెత్తారు. అయినా ఏక్తా తొణకలేదు..బెణకలేదు. అలాంటి సీరియళ్ల కొనసాగింపును ఆపలేదు. దటీజ్ ఏక్తా! ఆమె సాహసాన్ని, ధైర్యాన్ని తెలిపే సంగతులు చాలానే ఉన్నాయి. మచ్చుకు సన్నీ లియోన్ బాలీవుడ్ ఎంట్రీ! రాగిణీ ఎంఎంఎస్2 అనే సినిమాతో ఎక్కడో బ్రిటన్‌లో పోర్న్‌స్టార్‌గా ఉన్న సన్నీలియోన్‌ను ఏక్తా బాలీవుడ్‌కి తెచ్చారు. రాగిణీ ఎంఎంఎస్2 కు ఏక్తానే నిర్మాత. ఎందరు ముక్కున వేలేసినా.. సన్నీలియోన్‌కు కొత్త ఇమేజ్నిచ్చేందుకు చేసిన ఆమె ప్రయత్నాన్ని కొందరు మెచ్చుకున్నారు. ఇదీ ఎక్తాకపూర్ వ్యక్తిత్వం. బిజినెస్.. ప్రొడక్షన్ విషయాల్లో ఎంత నిక్కచ్చిగా.. ధైర్యంగా ఉంటారో.. కొన్ని చిన్న చిన్న విషయాల్లో ఆమె అంతే భయస్తురాలు అని ఏక్తా తమ్ముడు, ప్రముఖ బాలీవుడ్ హీరో తుషార్ కపూర్ చెప్తాడు. ‘అక్కకు ఎత్తయిన ప్రదేశాలన్నా, చీకటి అన్నా, హెలికాప్టర్ ఎక్కడమన్నా చాలా భయం’ అంటాడు. స్క్రిప్టు మార్చాల్సిందే! పనిలో పర్ఫెక్షన్ లేకపోతే ఏక్తాకు ఎక్కడలేని కోపం. ఈ స్వభావంతోనే ఆమె చాలామందికి శత్రువు అయ్యారు ‘కుమ్కుమ్ భాగ్య’ అనే సీరియల్లో ఒక సన్నివేశం కోసం హీరోయిన్‌కి 19 డ్రెస్‌లు మార్పించారట ఏక్తా! ఆ అమ్మాయి ఓపిక నశించి ఇక నా వల్ల కాదు అన్నా వినలేదట. అంతేకాదు స్క్రిప్ట్‌ను ఎంచుకునేటప్పుడు.. దాన్ని ఖరారు చేసే విషయంలో కూడా అంతే నిక్కచ్చిగా ఉంటారు ఏక్తా.. ఒక్కోస్క్రిప్ట్ను కనీసం 20 సార్లయినా మార్చందే ఫైనలైజ్ చేయదనే దర్శకుల కినుకా ఆమె మీద ఉంది. పెళ్లిపై ఏక్తా అభిప్రాయం ‘వైవాహిక జీవితంలో ఇమడాలంటే చాలా ఓపిక, సహనం ఉండాలి. నాకు అవి లేకే పెళ్లికి దూరంగా ఉన్నా’ అని ఏక్తా (40) అంటారు. ‘పెళ్లి చేసుకున్నాక మగాడు మగాడిగానే ఉంటాడు. కానీ స్త్రీ జీవితమే మారిపోతుంది. భార్య, కూతురు, కోడలు, తల్లి పాత్రలో ఒదగాల్సి వస్తుంది. ఆ బాధ పురుషుడికి లేదు. భర్త అనే పేరు వస్తుంది తప్ప బాధ్యత ఉండదు. పురుషుడు.. పురుషుడు అనే స్వేచ్ఛతోనే ఉంటాడు. స్త్రీగా నేను అన్ని పాత్రలు పోషించలేను’ అని ఏక్తా కపూర్ ముగించారు. నాన్నంటే ఇష్టం... చిన్నప్పుడు ఏక్తా తన తండ్రి జితేంద్ర పట్ల చాలా పొసెసివ్‌గా ఉండేదట. జితేంద్రతోపాటే షూటింగ్‌కి వెళ్లి కాపుకాసేదట. షూటింగ్లో భాగంగా తండ్రి హీరోయిన్‌తో నటిస్తుంటే ‘ మా నాన్నను ఎక్కడికి తీసుకెళ్తున్నావ్ అంటూ హీరోయిన్ను వెంబడించేదట ఏక్తా.. పనిలో ఎంత కఠినంగా ఉంటారో.. మూగజీవాల పట్ల అంతగా దయతో ఉంటారు. బాలివుడ్ ప్రముఖులంతా ఫారిన్ బ్రీడ్ కుక్కలను లక్షలు పెట్టి కొనుక్కొని తెచ్చి పెంచుకుంటుంటే.. ఏక్తా మాత్రం ముంబైలోని తమ ఇంటి దగ్గర్లో ఉన్న ఓ పది వీధి కుక్కలను చేరదీసి పెంచుతున్నారు. వాటిలో ఒకటి రెండు శునకాలు ఎప్పుడూ ఆమె వెంటే ఉంటాయి. ఆఖరుకు ఆమె షూటింగ్‌కి వెళ్లేటప్పుడు కూడా వదలవు. సినిమాలు, సీరియల్సే కాకుండా ఫ్యాషన్ప్రపంచంలోకీ అడుగుపెట్టారు ఏక్తా. తన పేరులోని రెండు పొడి అక్షరాలు ’ఉఓ’ అనే బ్రాండ్‌నేమ్‌తో ఫ్యాషన్ దుస్తులను రూపొందిస్తున్నారు ఏక్తా టీనేజ్‌లోకి వచ్చేదాకా చాక్లెట్లు విపరీతంగా తినేదట. ఇప్పటికీ చాక్లెట్లంటే పడిచస్తుంది అని ఆమె స్నేహితులు చెబుతారు. ఆమె చేత చాక్లెట్లు, ఐస్‌క్రీమ్ మాన్పించడానికి ఆమె తండ్రి జితేంద్ర చాలా కష్టపడ్డారట. పొగరు.. పరిణతి.. పట్టుదల ఈ మూడూ కలిస్తే.. ఏక్తా. నుదుటి మీద నిలువెత్తు నామం.. విరబోసుకున్న జుత్తు... నవ్వీనవ్వని పెదాలు.. ఏక్తా రూపానికి ఆకర్షణలు. బాంబే స్కాటిష్ స్కూల్లో బాల్యవిద్య, మితిభాయి కాలేజ్‌లో కామర్స్ డిగ్రీ. అక్కడితో ఆగిపోయారు ఏక్తా. పై చదువుల మీద అంత ఆసక్తి చూపించలేదు. నిజానికి ఆమె బ్రిలియంట్ కాదు. క్రియేటివ్. ఇంకా చెప్పాలంటే.. బ్రిలియంట్లీ క్రియేటివ్. ఈ విషయాన్ని తండ్రి జితేంద్ర కనిపెట్టారు. ఆమెను టీవీ రంగం వైపు ప్రోత్సహించారు. ‘బాలాజీ టెలీఫిలింస్ ప్రొడక్షన్ హౌజ్’ను ప్రారంభించారు. క్రియేటివ్ డెరైక్టర్‌గా కూతురికి బాధ్యతలు అప్పగించాడు. తండ్రి ఇంత చేసినా తన విజయానికి స్ఫూర్తి మాత్రం తల్లి శోభాకపూరే అని చెప్తారు ఏక్తా. సెట్లో అమ్మ వెన్నంటే ఉండాలని కోరుకుంటారు ఆమె. శోభ కపూర్ ఇప్పుడు బాలాజీ టెలీఫిలింస్ మేనేజింగ్ డెరైక్టర్. ‘కె’ సెంటిమెంట్ ఒక వ్యూహం! ‘జారినా ఆఫ్ టీవీ’గా పేరున్న ఏక్తా స్వయంశక్తిని ఎంతగా నమ్ముకున్నారో జాతకాలనూ అంతకన్నా బలంగా నమ్ముతారు. జ్యోతిష్యం, న్యూమరాలజీ మీద నమ్మకం జాస్తి. తన సీరియల్స్‌లో చాలా వాటికి ‘కె’ అనే అక్షరంతోనే మొదలయ్యే టైటిల్స్‌నే ఆమె పెట్టారు. ‘మా ప్రొడక్షన్ హౌజ్‌కి ఓ బ్రాండ్‌నేమ్ స్థిరపడడానికే నేను ఈ కె సెంటిమెంట్‌ను వాడుకున్నా. అందుకే మొదట్లో మేం తీసిన సీరియల్స్ అన్నిటికీ కెతో టైటిల్స్ పెట్టాం. ఎప్పుడైతే ఆ సీరియల్స్ అన్నీ బాలాజీ వాళ్లవని జనాల్లో ఓ ముద్ర పడిపోయిందో అప్పుడు నెమ్మదిగా కెని వెనక్కి నెట్టా. తర్వాత నుంచి అలాంటి సెంటిమెంట్ లేకుండా కథాంశానికి అనుగుణంగా టైటిల్స్ పెట్టడం స్టార్ట్ చేశా’ అని చాలాసార్లు చెప్పారు ఏక్తా. ఏక్తా టీవీ సీరియల్స్ తెలుగు డబ్బింగ్ బడే అచ్చే లగ్తే హై (నువ్వు నచ్చావ్), పరిచయ్ (అభినందన), బైరీ పియా (నువ్వే కావాలి) తెలుగులో వచ్చినవి కళ్యాణి, బ్రహ్మముడి, కన్నవారి కలలు, కొత్త బంగారం, కార్తీకదీపం, కాళరాత్రి, కంటే కూతుర్నే కనాలి, కలవారి కోడలు, పవిత్రబంధం, కుటుంబం, అనుబంధం, పెళ్లికానుక, కలిసుందాం రా, కావ్యాంజలి. ఇప్పుడు వస్తున్నవి యే హే మొహొబ్బతే (మనసు పలికే మౌనగీతం), కుంకుమ్ భాగ్య (కుంకుమభాగ్య), జోథాఅక్బర్ (జోథాఅక్బర్). సావధాన్ ఇండియా - క్రైమ్స్టోరీస్ సిరీస్ (లైఫ్ ఓకే చానెల్లో వస్తోంది. తెలుగులోనూ ఇదే పేరుతో వస్తోంది) - సరస్వతి రమ -
మళ్లీ... శ్వేతాబసు
చిన్నితెర నుంచి వెండితెరకు వచ్చిన శ్వేతాబసు ప్రసాద్ మళ్లీ బుల్లితెరపై పలకరించనున్నారు. బుజ్జి బుజ్జిగా ఉన్నప్పుడు బుల్లితెరపై సందడి చేసిన ఆమె ఇప్పుడు పాతికేళ్ల వయసులో టీవీ వైపు రావడం విశేషం. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బెంగాలీ బ్యూటీ ఆ మధ్య ఓ కేసు నుంచి బయటపడిన విషయం తెలిసిందే. మళ్లీ నటిగా బిజీ కావాలనుకుంటున్న శ్వేత ఒకపక్క సినిమాల్లో చాన్స్‌ల కోసం ప్రయ త్నిస్తూనే, ‘డర్ సబ్కో లగ్తా హై’ అనే టీవీ సీరియల్ కాన్సెప్ట్ నచ్చి, అందులో నటించడానికి ఒప్పుకున్నారు. మొత్తానికి, 14 ఏళ్ల తర్వాత టీవీలో మళ్ళీ సందడి చేయనున్నారు. సిటీకి కొత్తగావచ్చిన అమ్మాయికి హాస్టల్లో ఎదురైన భయా నక అనుభవాలు ఈ సీరియల్ కథ. -
పాపం... సీత కష్టాలు!
టీవీక్షణం: ప్రేమించే భర్త దొరికితే ఆడ పిల్లకి అంతకన్నా అదృష్టం మరొ కటి ఉండదంటారు. మీనాక్షికి ప్రేమించే భర్తే దొరికాడు. కానీ ఆ ప్రేమను భరించడం ఆమె వల్ల కాలేదు. ప్రేమ పేరుతో భర్త పెట్టే హింసను భరించలేక కుమిలిపో తుందామె. అలాంటప్పుడే ఓ రోజు ప్రమాదవశాత్తూ నదిలో పడిపోతుంది. తర్వాత వేరే చోటికి చేరుతుంది. మరి ఆమె మళ్లీ తనకోసం వెతుకుతోన్న భర్తకి దొరుకుతుందా? కష్టాల్లో పడుతుందా? తెలుసుకోవాలంటే జీ తెలుగులో ప్రసారమయ్యే ‘రామా.. సీత..’ సీరియల్ చూడాలి. మొదట ‘రామా... సీతెక్కడ’ అన్న టైటిల్ పెట్టినా, కొన్ని సమస్యల కారణంగా ‘రామా.. సీత’గా మార్చారు. పాత కథే అయినా కథనం ఆసక్తికరంగానే ఉంది. మీనాక్షిగా హీరోయిన్ నటన బాగుంది. కానీ శాడిస్టు భర్తగా హీరో నటన అంతంత మాత్రం. హావభావాలు ఎప్పుడూ ఒకేలా ఉండటమే కాక, డైలాగ్ డెలివరీ కూడా అంత బాగా లేదు. సీరియస్‌గా కనిపించే ప్రయత్నంలో బిగుసుకుపోతు న్నట్టుగా కనిపిస్తున్నాడు. అదొక్కటే సీరియల్‌కి మైనస్! -
‘అమ్మమ్మ డాట్ కామ్’తో పేరొచ్చింది
పాలకొల్లు : ‘అమ్మమ్మ డాట్ కామ్’ సీరియల్‌తో తనకు మంచి పేరొచ్చిందని.. బుల్లితెర రంగంలో స్థిరపడగలిగానని నటుడు మంత్రిప్రగడ నాగరవిశంకర్ అన్నారు. మంచిని స్వాగతిస్తూ ప్రేక్షకాదరణ లభించే పాత్రలు చేయడమే లక్ష్యమని చెప్పారు. దాసరి నారాయణరావు సారథ్యంలో కాపుగంటి రాజేంద్ర దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘గోకులంలో సీత’ సీరియల్లో హీరోగా నటిస్తున్న ఆయన పాలకొల్లులో విలేకరులతో ముచ్చటించారు. ప్రశ్న : పరిశ్రమకు ఎలా పరిచయమయ్యారు రవిశంకర్: 2002 నంది అవార్డుల ప్రదానోత్సవ సభలో అల్లూరి సీతారామరాజు వేషం వేశా. దాంతో సీరియల్లో నటించే అవకాశాలు వచ్చాయి. ప్రశ్న : బుల్లితెర నటుడు కావాలని ఎందుకు అనుకున్నారు రవిశంకర్: నాకు ఎవరూ గాడ్ఫాదర్లు లేరు. మాది శ్రీకాకుళం. బీకాం చదువుకున్నా. యాక్టింగ్ నేర్చుకోవాలని 2002లో రూ.10 వేలు పట్టుకుని హైదరాబాద్ వెళ్లా. మీడియా వర్కుషాపు ఆన్ యాక్టింగ్‌లో చేరా. శిక్షణ అనంతరం నెలరోజులే లక్ష్యంగా పెట్టుకున్నా. 30వ రోజు రాత్రి 11 గంటలకు కెమెరా ముందు నిలుచునే అవకాశం వచ్చింది. లేకపోతే వెనక్కి వెళ్లిపోయేవాడిని. ప్రశ్న : డిగ్రీ పూర్తికాగానే ఏమి చేశారు రవిశంకర్: కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం చేశా. సునామీ డేటా వింగ్‌లో విధులు నిర్వర్తించా. ప్రశ్న : నటించిన తొలి సీరియల్.. గుర్తింపు తెచ్చింది ఏది రవిశంకర్: అలౌఖిక సీరియల్‌తో బుల్లితెరకు పరిచయమయ్యా. ‘నువ్వువస్తావని’లో నెగిటివ్ రోల్ చేశా. ‘అమ్మమ్మ డాట్ కామ్’తో పేరువచ్చింది. ప్రశ్న : ఇప్పటివరకు ఏయే సీరియల్స్‌లో నటించారు రవిశంకర్: నిజం-నిజం, అపరాధి, నమ్మలేని నిజాలు, అలౌఖిక, నువ్వువస్తావని, అమ్మమ్మ డాట్ కామ్, ఏడడుగులు, శ్రావణమేఘాలు, లయ, యువ, సావిరహే, ఇట్లు ప్రేమతో అమ్మ.., అభిషేకం, కుంకుమరేఖ, నెం.23 మహాలక్ష్మి నివాసం, చిన్నకోడలు, బంగారు కోడలు, అష్టాచమ్మాలో నటించాను. ప్రశ్న: సినిమా అవకాశాలు రవిశంకర్: కథ (జెనీలియా ఫేం), స్నేహితుడా (నాని హీరో) సినిమాల్లో నటించాను. సీరియల్స్‌లో బిజీ అవ్వడం వల్ల సినిమా అవకాశాల కోసం ఎదురుచూడలేదు. ఆర్టిస్టుగా స్థిరపడడానికి కారణమైన సీరియల్ అమ్మమ్మ డాట్ కామ్, లయ, అభిషేకం. ప్రశ్న : ఏయే అవార్డులు తీసుకున్నారు రవిశంకర్ :‘అభిషేకం’లో నటనకు వంశీ, ఉగాది, ఆరాధన అవార్డులు, ‘చిన్నకోడలు’లో నటనకు మా టీవీ, జెమినీ టీవీ, ఈటీవీ అవార్డులు అందుకున్నా. -
అనుకోకుండా నటినయ్యాను
సినీ తారలకు దీటుగా బుల్లి తెర నటులు రాణిస్తున్నారు. తమదైన నటనతో ప్రేక్షకుల మనసును దోచేస్తున్నారు. అలాంటి వారిలో పల్లవి ఒకరు. భార్యామణి సీరియల్లో అలేఖ్యగా సుపరిచుతురాలైన పల్లవి.. ఆడదే ఆధారం అంటూ తన నటనతో అనతి కాలంలోనే మహిళల అభిమానాన్ని సొంతం చేసుకుంది. బుధవారం బీబీనగర్ మండలం చత్రఖానిగూడెంలో నిర్వహిస్తున్న భార్యామణి సీరియల్ షూటింగ్లో పాల్గొంది. సింగర్ కావాలనుకుని.. అనుకోకుండా నటినయ్యాయని పేర్కొంటున్న పల్లవి అంతరంగం... అందరూ పిలిచే పేరు అలేఖ్య, అమృత స్వస్థలం విజయవాడ ప్రస్తుత నివాసం హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ విద్యార్హత సోషాలజీ పూర్తి(చిన్ననాటి నుంచి హైదరాబద్‌లోనే చదువుకున్నాను) కుటుంబ నేపథ్యం మాది మధ్య తరగతి కుటుంబం. నేను ఒక్కదాన్నే. నాన్న నాగేశ్వరరావు, అమ్మ లలిత. ఇష్టమైన దైవం సాయిబాబా. ప్రతి పుట్టిన రోజు శిర్డీకి వెళ్తా. ఇష్టమైన వంటకాలు హైదరాబాద్ బిర్యానీ నటిస్తున్న సీరియల్స్ ప్రస్తుతం భార్యామణి, ఆడదే ఆధారం సీరి యల్స్‌లో నటిస్తున్నాను. మరికొన్ని సీరియల్స్‌లో నటించే అవకాశం లభించింది. సిని మాలలో సైతం ఆపర్లు వచ్చాయి. ప్రభాస్ సినిమాలో అవకాశం వచ్చింది. కానీ సమయం లేక వదులుకున్నా. పేరు తెచ్చిన పాత్రలు అలేఖ్య, అమృత అవార్డు.. రివార్డులు 2012లో భార్యామణి సీరియల్‌కు గాను నంది అవార్డు లభించింది. ఆడదే ఆధారం సీరియల్‌కు బెస్ట్ యాక్టర్‌గా 15అవార్డులు వచ్చాయి. పాఠశాల, కళాశాల స్థాయిల్లో సింగర్‌గా అనేక బహుమతులు గెలుపొందా. యువతకు మీరు ఇచ్చే సందేశం.. సింగర్ కావాలనుకున్నా.. కానీ నటినయ్యాను. గతంలో ఎలాంటి అనుభవం లేకపోయినా బుల్లి తెరకు వచ్చాక నటించడం నేర్చుకుని స్వశక్తితో ఎదుగుతున్నా. ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేకపోయినా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందుకు సాగుతున్నాను. ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉటుంది. అందివచ్చిన అవకాశాలను సద్విని యోగం చేసుకుంటూ ఉన్నత స్థాయి కి ఎదిగేం దుకు కృషి చేయాలి. -
బుల్లితెరపై అమల
నాగార్జున తరువాత ఇప్పుడు ఆయన సతీమణి అమల వంతు వచ్చినట్లుంది. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ గేమ్ షోతో బుల్లితెర వీక్షకులను నాగ్ ఆకట్టుకుంటూ ఉంటే, తాజాగా అమల ఓ టీవీ సీరియల్‌కు పచ్చ జెండా ఊపినట్లు కోడంబాకమ్ కబురు. తమిళంలో త్వరలో రానున్న ఓ టీవీ సిరీస్‌లో ఆమె నటిస్తున్నారు. అందులో ఆమె ఓ డాక్టర్ పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలో ఉన్న అమల ఆ టీవీ షూటింగ్లో పాల్గొంటున్నారు. సదరు టీవీ సిరీస్ పేరు -‘ఉయిర్మే’. ‘‘ఇప్పటికే రకరకాల బాధ్యతల్లో తలమునకలుగా ఉంటున్నాను కాబట్టి, ఎంతో ప్రత్యేకమైన పాత్ర అయితే కానీ సినిమాలో అయినా, సీరియల్లో అయినా నటించడానికి ఒప్పుకోవట్లేదు. ఈ స్క్రిప్టు నాకు బాగా నచ్చడంతో, నో చెప్పలేకపోయా’’ అని అమల వ్యాఖ్యానించారు. మొత్తం 12 మంది డాక్టర్ల జీవితాలు, వారి కుటుంబాలు, రోగుల చుట్టూ నడిచే ఈ టీవీ షో ఆగస్టులో ప్రసారం ప్రారంభం కానుంది. -
ఇక బుల్లితెరపై డాక్టర్ అమల!
అక్కినేని నాగార్జున 'మీలో ఎవరు కోటీశ్వరుడు' అంటూ బుల్లితెర మీదకు రంగ ప్రవేశం చేసి కొన్ని వారాలు గడిచిందో, లేదో గానీ.. అప్పుడే ఆయన భార్య అమల కూడా మళ్లీ మేకప్ వేసుకుని బుల్లితెర మీదకు వస్తున్నారు. భర్త అడుగుజాడల్లోనే నడుస్తూ.. టీవీ సీరియళ్లలోకి రాబోతున్నారు. అయితే, నాగార్జున తెలుగులో షో చేస్తుంటే అమల మాత్రం తమిళ టీవీ సీరియల్‌ను ఎంచుకున్నారు. ప్రస్తుతం చెన్నైలో ఉన్న అమల.. తాను ఓ తమిళ సీరియల్లో డాక్టర్ పాత్ర పోషిస్తున్నట్లు చెప్పారు. ''ఉయెర్మి అనే ఈ సీరియల్ షూటింగ్ ఇప్పుడే ప్రారంభమైంది. ఇందులో నేను డాక్టర్ పాత్ర పోషిస్తున్నాను. ఇప్పటివరకు జీవితంలో చాలా పాత్రలు పోషించాను. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ సినిమాలు, టీవీ సీరియళ్లలోకి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సీరియల్ విషయానికే వస్తే, దీని స్క్రిప్టు చాలా అద్భుతంగా ఉంది. ఈ పాత్ర గురించి స్క్రిప్టు తీసుకుని నా దగ్గరకు వచ్చినప్పుడు కాదని ఏమాత్రం చెప్పలేకపోయాను. మొత్తం కథ అంతా 12 మంది వైద్యులు, వాళ్ల జీవితాలు, కుటుంబాలు, రోగుల చుట్టూ తిరుగుతుంటుంది. బహుశా ఆగస్టు రెండోవారం తర్వాత ఇది ప్రసారం కావచ్చు'' అని అమల తెలిపారు. -
అంతా ఉత్తుత్తిదే!
అవన్నీ నిజం ఫైట్స్ కాదు డబ్ల్యూడబ్ల్యూఈ ఓ టీవీ సీరియల్ దాదాపు రెండు దశాబ్దాల క్రితం భారత్‌లో కొత్తగా కేబుల్ ప్రసారాలు ప్రారంభమైన రోజులవి... స్పోర్ట్స్ చానల్లో వచ్చే డబ్ల్యూడబ్ల్యూఎఫ్ పిల్లల్ని కట్టిపడేసింది. బయట ఆటలకు కూడా పోకుండా టీవీలకు అతుక్కునేలా చేసింది. ఇద్దరు బలమైన వ్యక్తులు ఒకరినొకరు భయంకరంగా రక్తం వచ్చేలా కొట్టుకునేవాళ్లు. దాదాపు 20 సంవత్సరాలు గడిచిపోయాయి. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ పేరు మార్చుకుని డబ్ల్యూడబ్ల్యూఈ అయ్యింది. అప్పట్లో టీవీలకు అతుక్కుని దీనిని చూసిన వాళ్లు... ఇప్పుడు తమ పిల్లలు దీనిని చూస్తుంటే రిమోట్ ఇచ్చేస్తున్నారు. చూసే తరాలు మారినా వినోదం అలాగే ఉంది. అయితే ఇది నిజమైన యుద్ధం కాదని, కేవలం స్క్రిప్ట్ ప్రకారం సాగే ఓ సీరియల్ మాత్రమే అని తెలిసిన వాళ్లు తక్కువే. - శ్యామ్ తిరుక్కోవళ్లూరు ‘కుస్తీ’... భారతీయులకు పెద్దగా పరిచయం అక్కర్లేని క్రీడ. కండలు తిరిగిన వస్తాదులు పోటీపడుతుంటే ఆసక్తిగా చూసే వాళ్లకు కొదువే ఉండదు. అంతర్జాతీయంగా దీన్ని రెజ్లింగ్ అని కూడా పిలుస్తారు. ఇది ఒలింపిక్స్‌లో కూడా క్రీడాంశమే. ఈ రెజ్లింగ్‌కు కాస్త గ్లామర్ జోడిస్తే అదే డబ్ల్యూ.డబ్ల్యూ.ఈ. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాల రెజ్లర్లు డబ్ల్యూడబ్ల్యూఈలో పాల్గొంటారు. ఈ రెజ్లింగ్‌ను అభిమానించే వాళ్లు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు నాలుగు కోట్ల మంది ఉన్నారు. అయితే ఇది అంతగా ఆకట్టుకోవడానికి కారణం ఆ ఆటలోని ప్రత్యేకత. కండలు తిరిగిన రెజ్లర్లు ప్రత్యర్థిని ఇష్టమొచ్చినట్లుగా కొట్టడమే ఈ రెజ్లింగ్. రకరకాల ఫీట్లు ఈ రెజ్లింగ్‌కు మరింత వన్నె తెచ్చిపెట్టాయి. రెజ్లింగ్‌ను టీవీల్లో చూసిన వాళ్లకు ఇలా కొట్టుకుంటే ఎవరైనా బతుకుతారా అనే సందేహం రాక మానదు.. అలా ఉంటాయి ఫీట్లు. స్టోరీ-స్క్రీన్‌ప్లే-డెరైక్షన్... ఒళ్లు గగుర్పొడిచే ఈ ఫీట్లు చేస్తే ఎవరైనా కచ్చితంగా ఆస్పత్రి పాలు కావాల్సిందే . కానీ ఈ రెజ్లర్లకు మాత్రం సాధారణంగా ఏమీ కాదు. ఇందుకు కారణం ఇదంతా డ్రామానే. ఒకడు కొడుతుంటాడు.. ఇంకొకడు చేష్టలుడిగిపోయి దెబ్బతింటుంటాడు... మనకు కనిపించేది అంతవరకే. కానీ అదంతా తూచ్. డబ్ల్యూడబ్ల్యూఈ అంతా నటన. రెజ్లింగ్‌ను వినోదాత్మకంగా చూపించడమే దీని పని. స్క్రిప్ట్ ప్రకారమే మ్యాచ్‌లు జరుగుతాయి. ఎలా ఆడాలి.. ఎలా రక్తికట్టించాలి.. అన్నదే ఇందులో ప్రధానం. అయితే ఇదంతా నిజం అని భ్రమ కల్పించేలా ఫీట్లు ఉంటాయి. అవి అంతవరకే నిజం. నిజానికి ఈ రెజ్లింగ్ మ్యాచ్‌లు అచ్చం సినిమాల్లో కథలా, టీవీల్లో సీరియల్లా సాగుతాయి. కథనంతో మ్యాచ్‌లను రక్తికట్టిస్తారు.. ఎప్పుడూ ఒకేలా పోటీలు జరిగితే ఎవరికీ ఆసక్తి ఉండదు. అందుకే శృంగార సంబంధాలు, ఒకడి లవర్‌ను మరొకడు ఎత్తుకెళ్లడం, ముక్కోణపు ప్రేమ కథలు, పెళ్లిళ్లు, ఒకరిపై మరొకరు ప్రతీకారం తీర్చుకోవడం, జాతి వివక్ష, కిడ్నాప్‌లు... ఇలా డబ్ల్యూడబ్ల్యూఈలో స్క్రిప్ట్ ఆసక్తికరంగా ఉంటుంది. ఒక్కసారి డబ్ల్యూడబ్ల్యూఈ మ్యాచ్ చూస్తే ఇందులో ఎంత డ్రామా ఉంటుందో ఇట్టే అర్థమైపోతుంది.‘డబ్ల్యూడబ్ల్యూఈలో ట్రిపుల్ హెచ్ స్టార్ రెజ్లర్.. అతనికో గర్ల్‌ఫ్రెండ్ ఉంది. పేరు స్టెపనీ మెక్‌మహోన్. తోటి రెజ్లర్ (డానియల్ బ్రయాన్) ఆమెతో అనుచితంగా ప్రవర్తిస్తాడు. ఈవిషయాన్ని స్టెపనీ, ట్రిపుల్ హెచ్ దగ్గర మొర పెట్టుకుంటుంది. ఎందుకిలా చేశావంటూ అతను బ్రయాన్‌ను నిలదీస్తాడు. అయితే అనుచితంగా ప్రవర్తించిన బ్రయాన్‌ను చితక్కొడతాడని ఆమె అనుకుంటుంది. కానీ ట్రిపుల్ హెచ్ ఏమీ చేయకపోవడంతో స్టెపనీ, సెక్యూరిటీ సిబ్బందికి ఫిర్యాదు చేస్తుంది. వాళ్లొచ్చి అతని చేతికి బేడీలు వేస్తారు. నీవేమీ చేయలేకపోయావంటూ ట్రిపుల్హెచ్పై మండిపడుతుంది. దీంతో అతనికి ఎక్కడా లేని కోపం వస్తుంది. బేడీలతో ఉన్న బ్రయాన్‌ను ట్రిపుల్ హెచ్ చితక్కొట్టేస్తాడు. అంతేకాదు ఆమెతో కూడా కొట్టిస్తాడు. మొత్తానికి తగినశాస్తి జరిగిందంటూ స్టెపనీ తెగ సంబరపడిపోతుంది. చివరికి బ్రయాన్‌ను మ్యాచ్‌లో ఓడించడంతో ఆ ఆనందంలో ట్రిపుల్ హెచ్‌ను ముద్దాడుతుంది. ఇలా ప్రతీ మ్యాచ్ ఆద్యంతం ప్రేక్షకులు ఆసక్తికరంగా చూసేలా ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తారు. సాధారణంగా ప్రొఫెషనల్ రెజ్లింగ్ మ్యాచ్‌లు ఇలా జరగవు. ఉత్తుత్తి మ్యాచ్‌లు కాబట్టే ఇలా సీరియల్లా రక్తికట్టిస్తారు. సూపర్ టెక్నిక్స్... సాధారణంగా రెజ్లింగ్ క్రీడ యుక్తితో కూడుకున్నది. ప్రత్యర్థిని మట్టికరిపించాలంటే బలమొక్కటే సరిపోదు. యుక్తి కూడా ప్రధానం. దీంతో పాటు వేగం, చురుకుదనం రెజ్లింగ్‌లో విజేతను నిర్ణయిస్తాయి. బలంతో కొట్టలేని రెజ్లర్లు ప్రత్యర్థిని టెక్నిక్‌తో చిత్తు చేస్తారు. స్క్రిప్ట్ ప్రకారం పోటీలు జరిగినా...ప్రేక్షకులను ఆకట్టుకునేవి రెజ్లింగ్ టెక్నిక్లే. ఈ రెజ్లింగ్‌లో లెక్కలేనన్ని టెక్నిక్‌లు ఉన్నాయి. ఇవే అభిమానులను టీవీలకు అతుక్కుపోయేలా చేస్తున్నాయి. డైవింగ్ బుల్డాగ్, డైవింగ్ హెడ్‌బట్, డైవింగ్ షోల్డర్ బ్లాక్, ఫ్లయింగ్ నెక్ బ్రేకర్, ఫ్లయింగ్ స్పైనంగ్ హీల్ కిక్, సూసైడ్ డైవ్, ప్లాంచా, రోప్ వాక్, సోమర్సాల్ట్, సూపర్ ప్లెక్స్, పవర్ బాంబ్స్, ఫ్రాగ్ స్ప్లాష్, సెన్టెన్ బాంబ్, సీటెడ్ సెన్టెన్ బై సైకిల్ కిక్, సూపర్ కిక్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఆటలో ప్రత్యర్థిని చిత్తు చేసేందుకు చాలా టెక్నిక్లే ఉన్నాయి. అయితే వీటిలో చాలా టెక్నిక్‌లు ప్రమాదకరమైనవి. అందుకే వీటిని ప్రదర్శించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ అప్పుడప్పుడు అనుకోని ప్రమా దాలు జరుగుతాయి. రిస్క్‌తో కూడిన టెక్నిక్లను ప్రదర్శించడం ద్వారా రెజ్లర్లు ప్రమాదాల బారిన పడిన సందర్భాలున్నాయి. మనోడూ ఉన్నాడు రాక్, అండర్టేకర్, ట్రిపుల్ హెచ్, కేన్, రికిషి, క్రిస్ బెనాయిట్, స్టోన్ కోల్డ్, రాండీ ఆర్టన్, జాన్ సెనా, క్రిస్ జెరికో...ఇలా డబ్ల్యూడబ్ల్యూఈలో చాలామంది స్టార్స్ ఉన్నారు. ఈ స్టార్స్ జాబితాలో భారతదేశానికి చెందిన ఓ రెజ్లర్కూడా ఉన్నాడు. పేరు... దలిప్ సింగ్ రాణా అలియాస్ ది గ్రేట్ ఖలీ. పంజాబ్‌లో పుట్టి పెరిగిన ఖలీ ఎనిమిదేళ్లుగా డబ్ల్యూడబ్ల్యూఈలో ఆకట్టుకుంటున్నాడు. ఏడు అడుగుల 1 అంగుళం పొడుగు ఉండే ఈ భారీకాయుడికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అన్నట్లు ఖలీ రెజ్లింగ్ పాపులారిటీతో బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించాడు. డబ్ల్యూడబ్ల్యూఈలోకి అడుగుపెట్టే కంటే ముందే ద లాంగెస్ట్ యార్డ్ (2005లో)అనే హాలీవుడ్ సినిమాతో తెరంగేట్రం చేశాడు. గెట్ స్మార్ట్ (2008), మెక్ గ్రూబెర్ (2010)తో పాటు 2012లో ఓ ఫ్రెంచ్ సినిమాలో కూడా నటించాడు. 2010లో కుస్తీ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. అదే ఏడాది రామా ది సేవిలియర్లో వాలిగా నటించి మెప్పించాడు. ఖలీ బాలీవుడ్, హాలీవుడ్‌లోనే కాదు.. బుల్లితెరపైనా మెరిశాడు. కలర్స్ చానెల్లో బిగ్ బాస్ రియాల్టీ షోలో తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు. తొలి రన్నరప్‌గా నిలిచాడు. డబ్బే డబ్బు... ప్రస్తుతం ఇది వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్(డబ్ల్యూడబ్ల్యూ ఈ)గా బాగా ప్రాచుర్యం పొందింది. అయితే గతంలో దీన్ని క్యాపిటల్ రెజ్లింగ్ కార్పొరేషన్, వరల్డ్ వైడ్ రెజ్లింగ్ ఫెడరేషన్, వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్‌గా పిలిచేవారు. అమెరికాలోని స్టాంఫోర్డ్ కేంద్రంగా డబ్ల్యూడబ్ల్యూఈ కార్యకలాపాలు సాగుతున్నాయి. న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో డబ్ల్యూడబ్ల్యూఈగా ట్రేడవుతోంది. 1952లో ప్రొఫెషనల్ రెజ్లింగ్ ప్రమోషన్‌గా మొదలైన దీనికి జెస్ మెక్‌మహోన్, టూట్స్ మోండ్ సృష్టికర్తలు. అతికొద్ది మందితో మొదలైన ఈ రెజ్లింగ్.. ఇంతింతై అన్నట్లు 62 ఏళ్లుగా అభిమానులకు వినోదాన్ని అందిస్తోంది. ఏడాదికి 320 హౌస్ షోలతో 150 దేశాల్లో రెజ్లింగ్ పోటీలు ప్రసారమవుతున్నాయి. 2013లో డబ్ల్యూడబ్ల్యూఈ రాబడి : రూ. 3955.98 కోట్లు మొత్తం మిగులు ఆదాయం : రూ. 828 కోట్లు లాభం : రూ. 594 కోట్లు ఆస్తుల విలువ : రూ. 20,232 కోట్లు ఈక్విటీ : రూ. 13,248 కోట్లు -
కథ ఒకటే... సీరియళ్లు అనేకం!
టీవీ ప్రముఖురాలు ఏక్తా కపూర్ అనగానే టీవీలోని ఏడుపులు పెడబొబ్బల సీరియళ్ళు, అత్తా కోడళ్ళ కథలే గుర్తుకొస్తాయి.‘సెక్స్, లవ్ ఔర్ ధోకా’, ‘డర్టీ పిక్చర్’, ‘రాగిణి ఎం.ఎం.ఎస్’ లాంటి సినిమాలతో తరచూ వార్తల్లోకి వస్తున్న ఏక్తా సర్వసాధారణంగా సుదీర్ఘమైనఇంటర్వ్యూలు ఇవ్వరు. పెపైచ్చు, ఎంతటి ప్రశ్నకైనా మూడు ముక్కల్లో జవాబు తేల్చేస్తారు. ఆ చెప్పే సమాధానం కూడా ఇట్టే ఊహించగలిగే రీతిలో ఉంటుంది. అలాంటి ఏక్తా తాజాగా ఓ మాట ఒప్పుకున్నారు. తాను తీసే టీవీ సీరియళ్ళలో చాలా వాటి కథలు దాదాపు ఒకేలా ఉంటాయని అంగీకరించారు. తప్పనిసరి విజయసూత్రమైన కుటుంబ కథల ఫార్ములాతోనే సీరియళ్ళు తీస్తున్నట్లు చెప్పారు. వచ్చే వారం ప్రసారం ప్రారంభం కానున్న తన తాజా టీవీ సీరియల్ ‘కుంకుమ్ భాగ్య’ ప్రమోషన్లో పాల్గొంటూ, ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంతకాలంగా తన మీద వస్తున్న విమర్శలను ఒక రకంగా ఒప్పుకున్నారు. అయితే, ‘‘కథలన్నీ ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. కానీ, మనం వాటిని చెప్పే తీరు వల్ల ఆ కథలు కొత్తగా కనిపిస్తాయి. అలాగే, అందులోని పాత్రల వల్ల కూడా కొత్తదనం వస్తుంది. కానీ, పాత కథనే విభిన్నంగా కనిపించేలా తెరకెక్కించడం అంత తేలికేమీ కాదు’’ అని ఏక్తా చెప్పారు. ఒకప్పటి ప్రముఖ హిందీ నటుడు జితేంద్ర కుమార్తె అయిన ఏక్తా కపూర్ టి.ఆర్.పి.ల కోసం టీవీ కథలను సాగదీస్తానంటూ నిజాయతీగా చెప్పారు. ‘‘నా సీరియళ్ళలో కొన్ని ఆరేడేళ్ళు నడిచినవి కూడా ఉన్నాయి. వీక్షకులకు నచ్చిన సీరియల్ వీలుంటే 20 ఏళ్ళు నడపమన్నా, నాకు ఓ.కె’’ అని ఏక్తా వ్యాఖ్యానించింది. జేన్ ఆస్టెన్ రచన ‘సెన్స్ అండ్ సెన్సిబిలిటీ’ ఆధారంగా తాజా సీరియల్ ‘కుంకుమ్ భాగ్య’ను నిర్మిస్తున్నారామె. ‘‘ఏ సీరియల్ అయినా హిట్టవ్వాలంటే పాత్ర చిత్రణ చాలా ముఖ్యం. ఆ పాత్రలను పోషిస్తున్న నటీనటులు వాటిలో పూర్తిగా జీవించాలి. అప్పుడు ఆ సీరియల్ జనాకర్షణీయంగా వస్తుంది’’ అని ఏక్తా ముక్తాయించారు. తీస్తున్న కథలే తీస్తూ, బుల్లితెరపై విజయం సాధిస్తున్న ఆమె మాటలు మన సీరియల్ దర్శక, రచయితలు పైకి ఒప్పుకోని నిజాలు కదూ!