Telugu TV Federation Ban On Actor Chandan Kumar, Know Details Inside - Sakshi
Sakshi News home page

Actor Chandan Kumar: సెట్‌లో దురుసు ప్రవర్తన.. చందన్‌పై నిషేధం

Published Wed, Aug 3 2022 2:09 PM | Last Updated on Wed, Aug 3 2022 3:26 PM

Telugu TV Federation Ban On Actor Chandan Kumar - Sakshi

ఇటీవల షూటింగ్‌ సెట్‌లో బుల్లితెర హీరో ఓవరాక్షన్‌ చేసి చెంపదెబ్బతిన్న సంఘటన సంచలనం రేపింది.  ‘స్టార్‌ మా’ ధారావాహిక సావిత్రమ్మ గారి అబ్బాయితో తెలుగులో గుర్తింపు పొందిన నటుడు చందన్‌ కుమార్‌ ‘శ్రీమతి శ్రీనివాస్‌’ సీరియల్లో లీడ్‌ రోల్‌ పోషిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం జరిగిన షూటింగ్‌ సెట్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌తో దురుసుగా ప్రవర్తించాడు. అంతేకాదు దుర్భాషలాడుతూ, అతడి తల్లిని దూషించాడు. దీంతో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నటుడితో వాదనకు దిగాడు.

చదవండి: ఆ హీరోయిన్‌తో డేటింగ్‌ వార్తలపై నోరు విప్పిన చై

ఈ క్రమంలో చందన్‌ ప్రవర్తన కాస్తా ఇబ్బందిగా అనిపించడంతో అక్కడి వారంత అతడిపై సీరియస్‌ అయ్యారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌కి క్షమాపణ చెప్పమనడంతో చందన్ కుమార్ నేనేంటో చూపిస్తా అంటూ సీరియస్ అయ్యాడు. దీంతో ఆగ్రహించిన అసిస్టెంట్ డైరెక్టర్ చందన్ కుమార్‌ని అందరి ముందే కొట్టాడు. చుట్టూ ఉన్న వాళ్ళు ఆపడానికి ప్రయత్నించగా చందన్ షూటింగ్ నుంచి వెళ్ళిపోయాడు. అయితే అక్కడితో గొడవ ముగిసింది అనుకుంటే చందన్ కన్నడ మీడియా ముందు తెలుగు పరిశ్రమపై అసత్యాలు ప్రచారం చేస్తూ, తెలుగు బుల్లితెరని కించపరుస్తూ మాట్లాడాడు.

చదవండి: సెట్‌లో ఓవరాక్షన్‌ చేసి తన్నులు తిన్న హీరో.. వీడియో వైరల్‌

దీంతో ఈ వివాదం కాస్తా మరింత ముదిరింది. తెలుగు పరిశ్రమ గురించి తప్పుగా మాట్లాడినందుకు నేడు తెలుగు టీవీ ఫెడరేషన్ సమావేశం ఏర్పాటు చేసి చందన్‌పై బ్యాన్‌ విధించింది. తెలుగు టీవీ ఫెడరేషన్ సమావేశంలో బాధితుడు అసిస్టెంట్ డైరెక్టర్ మాట్లాడుతూ.. ‘షాట్ రెడీ అని నాలుగు సార్లు పిలిచాను, అయినా రాకుండా నన్ను కొట్టి, బూతులు తిట్టాడు. డైరెక్టర్‌కి కంప్లైంట్ చేస్తే బయటకి రా దమ్ముంటే నేనెంటో చూపిస్తానంటూ బెదిరించాడు’ అని తెలిపాడు. దీంతో చందన్‌ తీరును క్షమించరానిదిగా పరిగణించి తెలుగు టీవీ ఫెడరేషన్ చందన్‌ని బ్యాన్‌ చేస్తున్నట్లు ప్రకటన ఇచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement