ఈ మధ్య సీరియల్ యాక్టర్స్ వరుస శుభవార్తలు చెప్తున్నారు. బుల్లితెర నటి మహేశ్వరి పండంటి బాబుకు జన్మనివ్వగా లేడీ విలన్ శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. అలాగే బుల్లితెర కమెడియన్ కొండమ్మ త్వరలో తల్లి కాబోతోంది. తాజాగా ఈ లిస్టులోకి మరో సెలబ్రిటీ కపుల్ వచ్చి చేరింది.
తెలుగువారికి సుపరిచితుడే!
చందన్ కుమార్- కవిత దంపతులు త్వరలోనే పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందనున్నారు. ఈ మేరకు ఓ ఫోటో షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చందన్ తెలుగు సీరియల్స్ చూసేవారికి సుపరిచితుడే..! సావిత్రమ్మగారి అబ్బాయి సీరియల్‌తో గుర్తింపు పొందిన చందన్ కుమార్ శ్రీమతి శ్రీనివాస్ ధారావాహికలోనూ ప్రధాన పాత్ర పోషించాడు.
చందన్‌పై బ్యాన్
అయితే ఈ సీరియల్ సెట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌తో దురుసుగా ప్రవర్తించాడు. అతడి తల్లిని దుర్భాషలాడటంతో ఆయన చందన్ చెంప చెళ్లుమనిపించాడు. దీంతో చందన్ తెలుగు బుల్లితెర గురించి దురుసుగా మాట్లాడాడు. ఇందుకుగానూ తెలుగు టీవీ ఫెడరేషన్ అతడిపై బ్యాన్ విధించింది. అలా ఈ కన్నడ నటుడు తెలుగు ఇండస్ట్రీకి దూరమయ్యాడు.
ఇటీవలే కొత్త బిజినెస్
కాగా చందన్- కవిత ఇటీవలే ఫుడ్ బిజినెస్‌లోకి దిగారు. మండిపేట్ ప్లేట్ ఇడ్లీ కేఫ్ పేరిట వెజిటేరియన్ రెస్టారెంట్ ప్రారంభించారు. కన్నడ హీరో కిచ్చా సుదీప్ చేతుల మీదుగా ఈ రెస్టారెంట్‌ను ఓపెన్ చేశాడు. చందన్ ఇటీవల జరిగిన సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో కర్ణాటక బుల్డోజర్స్ టీమ్ తరపున ఆడాడు. ఇతడు హీరోగా కన్నడ భాషలో పరిణయ, కట్టె, లవ్‌యూ అలియా, బెంగళూర్ 560023, ఎరడోండ్ల మూరు, ప్రేమ బరహ సినిమాలు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment