
పుష్ప సినిమాలో జాలిరెడ్డిగా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటుడు డాలీ ధనంజయ (Daali Dhananjaya). ఇటీవలే ఆయన వివాహబంధంలో అడుగుపెట్టారు. తన ప్రియురాలు డాక్టర్ ధన్యతను పెళ్లాడారు. మైసూరులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన వేదికపై మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. వీరి పెళ్లికి శాండల్‌వుడ్ సినీతారలతో పాటు టాలీవుడ్ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. పుష్ప డైరెక్టర్ సుకుమార్ సైతం జాలిరెడ్డి పెళ్లికి హాజరైన నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ భారీ వెడ్డింగ్ వేడుకకు దాదాపు 30 వేల మందికి పైగానే హాజరయ్యారు.
అయితే తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ పెళ్లి వేడుకలో డాలీ ధనుంజయకు తన భార్య కాళ్లు మొక్కుతూ కనిపించింది. ఇందులో డాలీ ధనుంజయ వద్దని చెబుతున్నప్పటికీ వినకుండా గడ్డం పట్టుకుని మరీ భర్త పాదాలను నమస్కరించింది. ఆ తర్వాత వెంటనే తను కూడా భార్య పాదాలకు మొక్కారు. దీనికి సంబంధించిన వీడియో ఓ నెటిజన్ వీడియోను షేర్ చేయడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
(ఇది చదవండి: పెళ్లి తర్వాత క్షమాపణలు చెప్పిన జాలిరెడ్డి దంపతులు)
కాగా.. కన్నడలో హీరో కమ్ విలన్‌గా చాలా సినిమాల్లో ధనంజయ నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. అక్కడి ఫ్యాన్స్ ఇతడిని ముద్దుగా డాలీ అని పిలుస్తారు. ఇతడి యాక్టింగ్ నచ్చి డైరెక్టర్ సుకుమార్ తన 'పుష్ప'లో జాలీరెడ్డి రోల్ ఇచ్చారు. తనదైన స్లాంగ్‌తో ఫెర్ఫెక్ట్ విలనిజం చూపించాడు. డిసెంబర్‌లో రిలీజైన పుష్ప-2 ది రూల్ సీక్వెల్‌లోనూ ఆయన కనిపించారు. అయితే, పుష్ప పార్ట్-1లో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంటుంది.
కాగా.. డాలీ ధనుంజయ్ ప్రస్తుతం కన్నడలో ఉత్తరకాండ చేస్తున్నాడు. ఈయన నటుడు మాత్రమే కాదు పాటల రచయిత కూడా! కన్నడలో పదికి పైగా పాటలు రాశాడు. ఇక డాలీ ధనుంజయ్ సతీమణి ధన్యతా విషయానికొస్తే.. చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన ఈమె డాక్టర్. ప్రస్తుతం బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గైనకాలజిస్ట్‌గా పని చేస్తోంది. స్నేహంతో మొదలైన వీరి పరిచయం..ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇప్పుడు పెళ్లితో ఒక్కటి అయ్యారు.
Men in love 🤌🏻✨!!!#DaaliDhananjay #DaaliDhanyata #DaaliDhanyata #kfi pic.twitter.com/KXc7gqwTIa
— MASS (@Thalassophilee6) February 16, 2025