
పుష్ప సినిమాలో జాలిరెడ్డిగా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటుడు ధనంజయ (Daali Dhananjaya) వివాహబంధంలో అడుగుపెట్టాడు. తన ప్రియురాలు డాక్టర్ ధన్యతతో కలిసి ఏడడుగులు వేశాడు. ఈ క్రమంలో తమ ఆత్మీయులకు, అభిమానులకు నూతన దంపతులు క్షమాపణ చెప్పారు. కర్ణాటకలోని మైసూరులో బంధుమిత్రులు సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఆదివారం (ఫిబ్రవరి 16న) వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు దాదాపు 30 వేల మందికి పైగానే హాజరయ్యారు.
పెళ్లి తంతు పూర్తి అయిన తర్వాత మీడియా పూర్వకంగా అందరి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ క్రమంలో ఆయన సోషల్‌మీడియా ద్వారా పలు విషయాలు పంచుకున్నారు. పెళ్లికి వచ్చిన వారందరికీ, రాలేకపోయిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెళ్లి వేడుకలు ఘనంగా జరగడానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, అభిమానులు, మీడియా, పోలీసు శాఖ ఇలా ఎంతో మంది కృషి చేశారు. వారందరికీ మా ఇద్దరి తరఫున ధన్యవాదాలు. మా పెళ్లి కోసం చాలామంది హాజరయ్యారు. దీంతో కొంతమంది మాపై అభిమానంతో ఫంక్షన్ హాలు వరకు వచ్చి కూడా లోపలికి రాలేకపోయారు. మీకు ఇబ్బంది కలిగించినందుకు దయచేసి మమ్మల్ని క్షమించండి. మేము తప్పకుండా మరిన్ని మంచి విషయాలతో తిరిగి మిమ్మల్ని కలుస్తాము. పెద్ద మనుసుతో మమ్మల్ని ఆశీర్వదించండి.' అని ఆయన తెలిపారు.

కన్నడలో హీరో కమ్ విలన్‌గా చాలా సినిమాల్లో ధనంజయ నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. అక్కడి ఫ్యాన్స్ ఇతడిని ముద్దుగా డాలీ అని పిలుస్తారు. ఇతడి యాక్టింగ్ నచ్చి డైరెక్టర్ సుకుమార్ తన 'పుష్ప'లో జాలీరెడ్డి రోల్ ఇచ్చారు. తనదైన స్లాంగ్‌తో ఫెర్ఫెక్ట్ విలనిజం చూపించాడు. డిసెంబర్‌లో రిలీజైన పుష్ప-2 ది రూల్ సీక్వెల్‌లోనూ ఆయన కనిపించారు. అయితే, పుష్ప1లో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంటుంది.
ధనంజయ్ సతీమణి ధన్యత విషయానికొస్తే.. చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన ఈమె డాక్టర్. ప్రస్తుతం బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గైనకాలజిస్ట్‌గా పని చేస్తోంది. స్నేహంతో మొదలైన వీరి పరిచయం..ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇప్పుడు పెళ్లితో ఒక్కటి అయ్యారు. ధనంజయ్ ప్రస్తుతం కన్నడలో ఉత్తరకాండ చేస్తున్నాడు. ఈయన నటుడు మాత్రమే కాదు పాటల రచయిత కూడా! కన్నడలో పదికి పైగా పాటలు రాశాడు.
Comments
Please login to add a commentAdd a comment