డాక్టర్‌తో నిశ్చితార్థం చేసుకున్న 'పుష్ప' విలన్ | Pushpa Actor Dhananjay Engagement Pics And News | Sakshi
Sakshi News home page

Dhananjay Engagement: సింపుల్‌గా ఎంగేజ్‌మెంట్.. పెళ్లి ఎప్పుడంటే?

Published Mon, Nov 18 2024 12:06 PM | Last Updated on Mon, Nov 18 2024 12:26 PM

Pushpa Actor Dhananjay Engagement Pics And News

'పుష్ప' మూవీలో జాలిరెడ్డిగా నటించి గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటుడు ధనంజయ.. నిశ్చితార్థం చేసుకున్నాడు. డాక్టర్ ధన్యతతో కొత్త జీవితం ప్రారంభించేందుకు సిద్ధమైపోయాడు. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వీరిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: 'పుష్ప 2' కోసం బన్నీ.. మెగా సపోర్ట్ ఎక్కడ?)

కర్ణాటక రాష్ట్ర దినోత్సవం సందర్భంగా నవంబర్ 1న తనకు కాబోయే భార్యని ధనంజయ పరిచయం చేశాడు. చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన ఈమె డాక్టర్. గైనకాలజీలో ఈమె స్పెషలిస్ట్. వీళ్లిద్దరికీ చాలా క్రితం నుంచే పరిచయం. తొలుత స్నేహితులుగా ఉండేవారు. క్రమంగా ప్రేమలో పడ్డారు. ఇప్పుడు ఆదివారం (నవంబర్ 17) నిశ్చితార్థం చేసుకున్నారు. వచ్చే ఫిబ్రవరి 16న మైసూరులో వీళ్ల పెళ్లి జరగనుంది.

'పుష్ప' తొలి భాగంలో జాలిరెడ్డి పాత్రలో ఆకట్టుకున్న ధనంజయ.. ఇప్పుడు పార్ట్ 2లోనూ ఉన్నాడు. ట్రైలర్‌లో ఒక్క షాట్‌లో ఇతడిని చూపించారు. ధనంజయ నిశ్చితార్థం చేసుకున్న సందర్భంగా తోటి యాక్టర్స్, ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు.

(ఇదీ చదవండి: మహేశ్-ప్రభాస్ రికార్డ్ బ్రేక్ చేసిన 'పుష్ప 2' ట్రైలర్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement