మహేశ్-ప్రభాస్ రికార్డ్ బ్రేక్ చేసిన 'పుష్ప 2' ట్రైలర్ | Pushpa 2 Trailer Telugu Views Creates Record Latest | Sakshi
Sakshi News home page

Pushpa 2 Trailer Telugu: మహేశ్, ప్రభాస్‌లని దాటేసిన బన్నీ!

Nov 18 2024 11:26 AM | Updated on Nov 18 2024 11:37 AM

Pushpa 2 Trailer Telugu Views Creates Record Latest

'పుష్ప 2' ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో ఏమో గానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం తెగ చూసేస్తున్నారు. ఎంతలా అంటే ఇప్పటివరకు టాలీవుడ్‍‌లో మహేశ్ బాబు, ప్రభాస్ సినిమాల ట్రైలర్స్‌ వ్యూస్ పరంగా టాప్‌లో ఉన్నాయి. ఇప్పుడు వాటిని అల్లు అర్జున్ ఇంకా సమయం ఉండగానే దాటేశాడు. సరికొత్త రికార్డ్ సృష్టించాడు.

(ఇదీ చదవండి: కీరవాణి ఇంట్లో పెళ్లి సందడి.. ప్రీ వెడ్డింగ్ ఫొటో వైరల్)

తెలుగులో ఇప్పటివరకు వచ్చిన ట్రైలర్లలో 24 గంటల్లో ఎక్కుమంది చూసింది అయితే మహేశ్ 'గుంటూరు కారం' ట్రైలర్‌నే. 37.68 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. తర్వాత ప్లేస్‌లో ప్రభాస్ సలార్ 32.58 మిలియన్ వ్యూస్‌తో ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని కేవలం 15 గంటల్లో అల్లు అర్జున్ దాటేశాడు. 'పుష్ప 2' తెలుగు వెర్షన్ ట్రైలర్ ఈ స్టోరీ రాసేటప్పటికే అంటే 15-16 గంటల్లోనే 42 మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. 24 గంటలు పూర్తయ్యేసరికి ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి?

ఇక ట్రైలర్ విషయానికొస్తే కథనేం పెద్దగా రివీల్ చేయలేదు. కానీ జాతర ఎపిసోడ్, పుష్పరాజ్‌కి ఎలివేషన్స్, భన్వర్ సింగ్ షెకావత్ సీన్లు చాలానే చూపించారు. పక్కా కమర్షియల్‌గా ట్రైలర్ కట్ చేశారు. 2:48 నిమిషాల నిడివితో ఉన్న ట్రైలర్ వైల్డ్ ఫైర్ అనేలా ఉంది. డిసెంబరు 5న థియేటర్లలో బ్లాస్ట్ అయిపోవడం గ్యారంటీ అనిపిస్తోంది.

(ఇదీ చదవండి: పుష్ప 2 ట్రైలర్‌.. ఈ అర గుండు నటుడు ఎవరంటే?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement