
బ్లాక్‌బస్టర్ పుష్ప మూవీలో జాలిరెడ్డిగా క్రేజ్ తెచ్చుకున్న కన్నడ నటుడు ధనంజయ (Daali Dhananjaya) మరికొద్ది గంటల్లో పెళ్లిపీటలెక్కనున్నాడు. ప్రియురాలు డాక్టర్ ధన్యతతో కలిసి ఏడడుగులు వేయనున్నాడు. ఇప్పటికే పెళ్లి పనులు జోరందుకున్నాయి. ఇటీవల హల్దీ సెలబ్రేషన్స్ జరగ్గా తాజాగా ధనుంజయను పెళ్లికొడుకుగా, ధన్యతను పెళ్లికూతురిగా ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా ఆమె కాలికి మెట్టెలు తొడిగాడు.

పెద్ద ఎత్తున వివాహ వేడుక!
కర్ణాటకలోని మైసూరులో శనివారం (ఫిబ్రవరి 15న) రాత్రి రిసెప్షన్ జరగనుంది. బంధుమిత్రులు సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారు. ఆదివారం (ఫిబ్రవరి 16న) వీరి వివాహం జరనుంది. ఈ వేడుకకు దాదాపు 30 వేల మంది వస్తారని అంచనా! కాగా ధనంజయ్- ధన్యత గతేడాది నవంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. ధనంజయ.. అసలు పెళ్లే చేసుకోనని ఇంట్లో తెగ సతాయించేవాడట! దీంతో అతడ్ని ఎలా ఒప్పించాలా? అని తెగ టెన్షన్ పడిపోయానంటోంది నటుడి తల్లి సావిత్రమ్మ. పెళ్లి చేసుకోమని ఐదేళ్లుగా వెంటపడ్డానని.. ఎట్టకేలకు ఆ శుభకార్యం జరుగుతుండటం సంతోషంగా ఉందని పేర్కొంది.
పెళ్లికూతురు ఎవరంటే?
ధన్యత చిత్రదుర్గకు చెందిన అమ్మాయి. ప్రస్తుతం బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గైనకాలజిస్ట్‌గా పని చేస్తోంది. ధనంజయ్ విషయానికి వస్తే.. ఇతడు కన్నడలో హీరోగా, విలన్‌గా పలు సినిమాలు చేశాడు. పుష్ప మూవీతో తెలుగువారికి దగ్గరయ్యాడు. ప్రస్తుతం కన్నడలో ఉత్తరకాండ చేస్తున్నాడు. ఈయన నటుడు మాత్రమే కాదు పాటల రచయిత కూడా! కన్నడలో పదికి పైగా పాటలు రాశాడు.
చదవండి: పెళ్లి, పిల్లలు వద్దంటేనే సినిమా ఛాన్స్..: హీరోయిన్
Comments
Please login to add a commentAdd a comment