Dhananjaya
-
పెళ్లి బంధంలోకి అడుగు పెట్టిన పుష్ప విలన్ జాలిరెడ్డి.. హాజరైన సుకుమార్
పుష్ప విలన్ డాలీ ధనుంజయ్ వివాహాబంధంలోకి అడుగుపెట్టాడు. మైసూరులో ఆయన పెళ్లి వేడుగ ఘనంగా జరిగింది. పుష్ప సినిమాలో విలన్‌గా మెప్పించిన డాలీ ధనుంజయ్.. డాక్టర్ ధన్యత మెడలో మూడు ముళ్లు వేశారు. ఇవాళ ఉదయం జరిగిన ఈ పెళ్లి వేడుకలో కన్నడ సినీ ప్రముఖులు, సన్నిహితులు, స్నేహితులు హాజరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు చెబుతున్నారు. ఈ పెళ్లి వేడుక కోసం మైసూర్ ప్యాలెస్ పక్కన ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన పెళ్లికి అభిమానులు సైతం పెద్దఎత్తున పాల్గొన్నారు.కాగా.. కన్నడలో హీరో కమ్ విలన్‌గా పలు సినిమాలు చేసి చాలా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ధనంజయ. ఫ్యాన్స్ ఇతడిని ముద్దుగా డాలీ అని పిలుస్తారు. ఇతడి యాక్టింగ్ నచ్చి డైరెక్టర్ సుకుమార్ తన 'పుష్ప'లో జాలీరెడ్డి రోల్ ఇచ్చారు. తనదైన స్లాంగ్‌తో ఫెర్ఫెక్ట్ విలనిజం చూపించాడు. డిసెంబర్లో రిలీజైన పుష్ప-2 ది రూల్ సీక్వెల్లోనూ అదరగొట్టేశాడు. పుష్ప- 2 సినిమా దర్శకుడు సుకుమార్ కూడా డాలీ ధనంజయ్ పెళ్లికి హాజరయ్యారు.పెళ్లి కోసం ప్రత్యేకంగా సెట్..మైసూర్ ప్యాలెస్ ముందు ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఒక విలాసవంతమైన సెట్‌ను నిర్మించారు. ఫిబ్రవరి 15న సాయంత్రం రిసెప్షన్ జరిగింది. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, సన్నిహితులు, స్నేహితులు, అభిమానులు హాజరై నూతన జంటకు శుభాకాంక్షలు తెలిపారు.మైసూర్‌తో ప్రత్యేక అనుబంధం..డాలీ ధనుంజయ్‌కు మైసూర్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన ప్రాథమిక విద్య, జీవితం, సినిమా పరిశ్రమలోకి ప్రవేశం అన్నీ మైసూర్‌లోనే జరిగాయి. అందుకే మైసూర్‌లోనే వివాహం చేసుకున్నారు. చాముండేశ్వరి దేవి ఆశీర్వాదం పొందడానికి చాముండేశ్వరి ఆలయ నమూనాతో పెళ్లి వేదికను నిర్మించారు. అలాగే టవర్ ఆకారపు సెట్ పెళ్లికి హైలైట్‌గా నిలిచింది. -
వివాహా బంధంలోకి అడుగుపెట్టిన పుష్ప విలన్ డాలీ ధనుంజయ్ (ఫోటోలు)
-
జీవితంలో పెళ్లే చేసుకోనన్న జాలిరెడ్డి.. ఇప్పుడేకంగా లవ్ మ్యారేజ్
బ్లాక్‌బస్టర్ పుష్ప మూవీలో జాలిరెడ్డిగా క్రేజ్ తెచ్చుకున్న కన్నడ నటుడు ధనంజయ (Daali Dhananjaya) మరికొద్ది గంటల్లో పెళ్లిపీటలెక్కనున్నాడు. ప్రియురాలు డాక్టర్ ధన్యతతో కలిసి ఏడడుగులు వేయనున్నాడు. ఇప్పటికే పెళ్లి పనులు జోరందుకున్నాయి. ఇటీవల హల్దీ సెలబ్రేషన్స్ జరగ్గా తాజాగా ధనుంజయను పెళ్లికొడుకుగా, ధన్యతను పెళ్లికూతురిగా ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా ఆమె కాలికి మెట్టెలు తొడిగాడు.పెద్ద ఎత్తున వివాహ వేడుక!కర్ణాటకలోని మైసూరులో శనివారం (ఫిబ్రవరి 15న) రాత్రి రిసెప్షన్ జరగనుంది. బంధుమిత్రులు సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారు. ఆదివారం (ఫిబ్రవరి 16న) వీరి వివాహం జరనుంది. ఈ వేడుకకు దాదాపు 30 వేల మంది వస్తారని అంచనా! కాగా ధనంజయ్- ధన్యత గతేడాది నవంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. ధనంజయ.. అసలు పెళ్లే చేసుకోనని ఇంట్లో తెగ సతాయించేవాడట! దీంతో అతడ్ని ఎలా ఒప్పించాలా? అని తెగ టెన్షన్ పడిపోయానంటోంది నటుడి తల్లి సావిత్రమ్మ. పెళ్లి చేసుకోమని ఐదేళ్లుగా వెంటపడ్డానని.. ఎట్టకేలకు ఆ శుభకార్యం జరుగుతుండటం సంతోషంగా ఉందని పేర్కొంది.పెళ్లికూతురు ఎవరంటే?ధన్యత చిత్రదుర్గకు చెందిన అమ్మాయి. ప్రస్తుతం బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గైనకాలజిస్ట్‌గా పని చేస్తోంది. ధనంజయ్ విషయానికి వస్తే.. ఇతడు కన్నడలో హీరోగా, విలన్‌గా పలు సినిమాలు చేశాడు. పుష్ప మూవీతో తెలుగువారికి దగ్గరయ్యాడు. ప్రస్తుతం కన్నడలో ఉత్తరకాండ చేస్తున్నాడు. ఈయన నటుడు మాత్రమే కాదు పాటల రచయిత కూడా! కన్నడలో పదికి పైగా పాటలు రాశాడు.చదవండి: పెళ్లి, పిల్లలు వద్దంటేనే సినిమా ఛాన్స్..: హీరోయిన్ -
పుష్ప విలన్ జాలిరెడ్డి పెళ్లి పనులు షురూ (ఫోటోలు)
-
90ఎంఎల్‌పై విమర్శల వర్షం
పెరంబూరు: సమాజాన్ని భ్రష్టు పట్టించే చిత్రం అంటూ నటి ఓవియ నటించిన 90ఎంఎల్ చిత్రంపై విమర్శలు వెల్లువడుతున్నాయి. బిగ్‌బాస్ గేమ్ షో ఫేమ్ ఓవియ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 90 ఎంఎల్. దీన్ని మహిళా దర్శకురాలు అనితా ఉదీప్ తెరకెక్కించారు. నటుడు శింబు సంగీతాన్ని అందించడం విశేషం. శుక్రవారం తెరపైకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను పొందుతోంది. అయితే ఇందులో నటి ఓవియతో పాటు ఆమె స్నేహితురాళ్ల పాత్రలు మద్యం తాగడం, దమ్ము కొట్టడం, లిప్‌లాక్ చుంబనాలు, అదే విధంగా సహజీవనం, లెస్బియన్ సన్నివేశాలాంటివి చోటుచేసుకోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 90ఎంఎల్ చిత్రం గురించి నిర్మాత ధనుంజయన్ స్పందిస్తూ సమాజాన్ని భ్రష్టు పట్టించే చిత్రం అని ట్విట్టర్లో పేర్కొన్నారు. అంతే కాకుండా డబ్బు సంపాదన కోసం యువతరాన్ని నాశనం చేయకూడదని అన్నారు. ఈయన వ్యాఖ్యలకు 90ఎంఎల్ చిత్ర దర్శకురాలు అనితా ఉదీప్ బదులిచ్చేలా మీరు నిర్మించిన చంద్రమౌళి చిత్రంలో సందేశం ఇచ్చేలా అశ్లీల పాటను పొందుపరిచిన చిత్రానికి నేను దర్శకరాలిని కాదు అని వెటకారపు వ్యాఖ్యలతో ట్వీట్ చేశారు. అందుకు ధనుంజయన్ నా చిత్రంలో పాట గ్లామరస్‌గా ఉందే కానీ అశ్లీలంగా మాత్రం లేదని అన్నారు. నా చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్‌నే పొందాను. మీ చిత్రం మాదిరి ఏ సర్టిఫికెట్ కాదు. అయినా చిత్రంలో పాటలు ఎలా ఉండాలన్నది దర్శకుడి నిర్ణయం అని, నేనెప్పుడూ పాటల విషయంలో సొంత నిర్ణయాలను తీసుకోలేదని బదులిచ్చారు. దీంతో దర్శకురాలు అనితా ఉదీప్ సార్ మీతో వివాదం బోర్ కొడుతోంది. కాస్త ఆసక్తికరంగా, కొంచెం స్మార్ట్‌గా మాట్లాడండి అని పేర్కొన్నారు. ఆ తరువాత ధనుంజయన్ నుంచి బదులు రాకపోవడంతో అనితా ఉదీప్ ప్లీజ్ పారిపోకండి. మీతో కొంచెం కామెడీ చేయాలని ఉంది అని ట్వీట్ చేశారు. వీరి వివాదం ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. -
‘భైరవ గీత’ రెడ్ కార్పెట్ ప్రీమియర్
-
‘నువ్వే నా భగవద్గీత!’ : భైరవ గీత తొలి పాట
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమర్పణలో తెరకెక్కుతున్న సినిమా భైరవ గీత. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ ఫ్యాక్షన్ ప్రేమకథలో ధనుంజయ్, ఇర్రా మోర్లు హీరో హీరోయిన్లు నటించారు. వర్మశిష్యుడు సిద్ధార్థ్ తాతోలు దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రచార బాధ్యతలను వర్మ దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఇటీవల చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేసిన యూనిట్ తాజాగా ‘నువ్వే నా భగవద్గీత..’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. రవిశంకర్ సంగీత సారధ్యంలో విజయ్ ఏసుదాసు, సాక్షి హోల్కర్ ఆలపించిన ఈ గీతానికి సిరాశ్రీ సాహిత్యమందించారు. వర్మ మార్క్ ప్రొమోషన్‌తో భైరవ గీతపై ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ అయ్యింది. అభిషేక్ నామా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను అక్టోబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
భైరవ గీత మోషన్ పోస్టర్ విడుదల
-
బానిసల ధైర్యం కూడా పరాకాష్టకి..
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో మరో చిత్రం ప్రేక్షకులకు ముందుకు రాబోతోంది. భైరవ గీత పేరుతో కన్నడ, తెలుగు ద్విభాషా చిత్రం రూపొందబోతోంది. సిద్ధార్థ అనే డెబ్యూ దర్శకుడ్ని వర్మ పరిచయం చేయబోతున్నాడు. ధనంజయ అలియాస్ దాలి అనే కన్నడ నటుడు ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను కాసేపటి క్రితం వదిలారు. తొలుత లవ్ స్టోరీ అంటూ చూపించినప్పటికీ ఆ తర్వాత.. ‘దొరల పొగరు పరాకాష్టకి చేరినప్పుడు బానిసల ధైర్యం కూడా పరాకాష్టకి చేరుతుంది’ అంటూ ఓ ట్యాగ్ లైన్ చూపించాడు. వర్మ దర్శకుడు కాకపోయినా ఆ ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పైగా ఇదో వయొలెంట్ యాక్షన్ చిత్రమని వర్మ తేల్చేశారు కూడా. ఆర్జీవీతోపాటు భాస్కర్ రాశి భైరవ గీతాన్నినిర్మిస్తుండగా, రిలీజ్ తేదీని త్వరలో ప్రకటించనున్నారు. -
నాణ్యమైన విద్యను అందించాలి
గట్టు : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని ఎంవీఎఫ్ స్టేట్ క్వాలిటీ కోఆర్డినేటర్ ధనంజయ్య అన్నారు. బుధవారం ఎంవీఎఫ్ ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాల్లో పని చేస్తున్న విద్యావలంటీర్లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ తరగతి గదుల్లో విద్యార్థులకు అర్థమయ్యే విధంగా బోధన చేయాలన్నారు. విద్యార్థులతో కలిసిపోయి వారిని ఆటపాటల ద్వారా విద్యాబోధన సాగిస్తూ, చదువు పట్ల అమిత ఆసక్తి కలిగించాలన్నారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ప్రతిరోజు పాఠశాలకు వచ్చేలా చూడాలన్నారు. సమావేశంలో ఎంవీఎఫ్ స్టేట్ కోఆర్డినేటర్ వెంకటేశ్వర్రావు, ఆర్గనైజర్ హన్మిరెడ్డి, మొబిలైజర్లు మోహన్, రాజు, అమరేష్, నరేష్, భవాని, సువర్ణ, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన విద్యావలంటీర్లు పాల్గొన్నారు.