పెరంబూరు: సమాజాన్ని భ్రష్టు పట్టించే చిత్రం అంటూ నటి ఓవియ నటించిన 90ఎంఎల్ చిత్రంపై విమర్శలు వెల్లువడుతున్నాయి. బిగ్‌బాస్ గేమ్ షో ఫేమ్ ఓవియ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 90 ఎంఎల్. దీన్ని మహిళా దర్శకురాలు అనితా ఉదీప్ తెరకెక్కించారు. నటుడు శింబు సంగీతాన్ని అందించడం విశేషం. శుక్రవారం తెరపైకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను పొందుతోంది. అయితే ఇందులో నటి ఓవియతో పాటు ఆమె స్నేహితురాళ్ల పాత్రలు మద్యం తాగడం, దమ్ము కొట్టడం, లిప్‌లాక్ చుంబనాలు, అదే విధంగా సహజీవనం, లెస్బియన్ సన్నివేశాలాంటివి చోటుచేసుకోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 90ఎంఎల్ చిత్రం గురించి నిర్మాత ధనుంజయన్ స్పందిస్తూ సమాజాన్ని భ్రష్టు పట్టించే చిత్రం అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
అంతే కాకుండా డబ్బు సంపాదన కోసం యువతరాన్ని నాశనం చేయకూడదని అన్నారు. ఈయన వ్యాఖ్యలకు 90ఎంఎల్ చిత్ర దర్శకురాలు అనితా ఉదీప్ బదులిచ్చేలా మీరు నిర్మించిన చంద్రమౌళి చిత్రంలో సందేశం ఇచ్చేలా అశ్లీల పాటను పొందుపరిచిన చిత్రానికి నేను దర్శకరాలిని కాదు అని వెటకారపు వ్యాఖ్యలతో ట్వీట్ చేశారు. అందుకు ధనుంజయన్ నా చిత్రంలో పాట గ్లామరస్‌గా ఉందే కానీ అశ్లీలంగా మాత్రం లేదని అన్నారు. నా చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్‌నే పొందాను. మీ చిత్రం మాదిరి ఏ సర్టిఫికెట్ కాదు. అయినా చిత్రంలో పాటలు ఎలా ఉండాలన్నది దర్శకుడి నిర్ణయం అని, నేనెప్పుడూ పాటల విషయంలో సొంత నిర్ణయాలను తీసుకోలేదని బదులిచ్చారు. దీంతో దర్శకురాలు అనితా ఉదీప్ సార్ మీతో వివాదం బోర్ కొడుతోంది. కాస్త ఆసక్తికరంగా, కొంచెం స్మార్ట్‌గా మాట్లాడండి అని పేర్కొన్నారు. ఆ తరువాత ధనుంజయన్ నుంచి బదులు రాకపోవడంతో అనితా ఉదీప్ ప్లీజ్ పారిపోకండి. మీతో కొంచెం కామెడీ చేయాలని ఉంది అని ట్వీట్ చేశారు. వీరి వివాదం ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
90ఎంఎల్ చిత్రంపై విమర్శల వర్షం
Published Mon, Mar 4 2019 8:08 AM | Last Updated on Mon, Mar 4 2019 8:08 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment