Shimbu
-
కోలీవుడ్‌లో సంచలనం.. నలుగురు స్టార్ హీరోలకు షాక్!
తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో నలుగురు స్టార్ హీరోలకు షాకిచ్చింది. నిర్మాతలకు సహకరించలేదనే ఆరోపణలతో రెడ్ కార్డ్ ఇవ్వాలని నిర్ణయించింది. హీరోలు ధనుశ్, శింబు, విశాల్, అథర్వకు తమిళ నిర్మాతల సంఘం నిషేధం విధించింది. ఇకపై వీరు ఏ సినిమాల్లోను నటించకుండా రెడ్ కార్డ్ ఇవ్వనున్నారు. (ఇది చదవండి: మాట నిలబెట్టుకున్న విజయ్.. రూ. కోటి పంపిణీకి లిస్ట్ రెడీ!) నిషేధానికి కారణాలివే! నిర్మాత మైఖేల్ రాయప్పన్‌తో ఏర్పడిన వివాదాలతోనే హీరో శింబుకు రెడ్ కార్డు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ వివాదంపై ఇప్పటికే ఎన్నోసార్లు సంప్రదించినా ఎలాంటి మార్పు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రొడ్యూసర్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా వ్యవహరించిన సమయంలో నిధులను విశాల్ దుర్వినియోగం చేశారని ఆరోపణలతో రెడ్ కార్డు ఇవ్వనున్నారు. తెనందాల్ నిర్మాణ సంస్థలో ధనుష్ చేసిన సినిమా 80 శాతం షూట్ పూర్తయ్యాక.. ఆ తర్వాత సహకరించకపోవడంతో నిర్మాతకు నష్టం జరిగినట్లు తెలిసింది. అందుకే విశాల్‌పై చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. మదియలకన్ నిర్మాణ సంస్థతో అథర్వ ఓ చిత్రానికి ఓకే చేశారని.. అయితే షూటింగ్ సమయంలో సహకరించడం లేదనే ఆరోపణలతో అథర్వకు రెడ్ కార్డు ఇవ్వనున్నట్లు సమాచారం. వీరితో పాటు నిర్మాతలకు సహకరించని మరికొందరు నటీనటులకు రెడ్ కార్డ్ ఇవ్వాలని నిర్మాతల సంఘం కొన్ని నెలల క్రితమే నిర్ణయించింది. ఇక ఈ జాబితాలో ధనుష్, శింబు, విశాల్, అథర్వతో పాటు ఎస్జే సూర్య, విజయ్ సేతుపతి, అమలా పాల్, వడివేలు, ఊర్వశి, సోనియా అగర్వాల్ సహా 14 మంది నటీనటులు ఉన్నట్లు సమాచారం. (ఇది చదవండి: పెళ్లికి సిద్ధమైన స్టార్ హీరో కుమార్తె.. డేట్ ఫిక్స్! ) మరోవైపు తమిళ చిత్ర పరిశ్రమలోని ప్రధాన సంఘాలైన దక్షిణ భారత నటీనటుల సంఘం, తమిళ చిత్ర నిర్మాతల సంఘం మధ్య ఎలాంటి విభేదాలు లేవు. నటీనటుల కాల్షీట్స్, కొత్త ఒప్పందాలపై నిర్మాతల నుంచి కొన్ని ఫిర్యాదులు అందాయి. అదే విధంగా నటీనటుల వైపు నుంచి కొన్ని సమస్యలు ప్రస్తావించారు. ఈ భేటీలో నిర్మాతలకు నష్టం కలిగేలా వ్యవహరించినందుకు నలుగురు హీరోలపై చర్యలకు దిగింది. అయితే నలుగురు స్టార్ హీరోలకు రెడ్ కార్డ్‌లు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. -
రామ్ పోతినేని 'బుల్లెట్టు' సాంగ్ రికార్డు.. ఏంటో తెలుసా ?
Ram Pothineni The Warrior Movie Bullet Song Gets 100 Million Views: రామ్ పోతినేని హీరోగా తమిళ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘ది వారియర్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. కృతీశెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా, అక్షర గౌడ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూలై 14న రిలీజ్ కానుంది. ఈ సినిమా నుంచి 'కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ది బుల్లెటు..' సాంగ్ రిలీజై తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సాంగ్ కొత్త రికార్డ్‌ను నమోదు చేసింది. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ పాట మొత్తంగా 100 మిలియన్ క్లబ్‌లోకి చేరింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చిత్రబృందం తెలిపింది. ఈ సాంగ్‌ను కోలీవుడ్ స్టార్ హీరో శింబు, హరిప్రియ ఆలపించారు. తెలుగులో శ్రీమణి, తమిళంలో వివేక సాహిత్యమందించిన ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. కాగా ఈ సినిమాలో ఈ ఒక్క పాట కోసం రూ. 3 కోట్లు ఖర్చు చేశారు నిర్మాతలు. చదవండి: 13 ఏళ్ల పిల్లల నుంచి అత్యాచార బెదిరింపులు, తట్టుకోలేకపోయాను: నటి ముసలిదానివైపోతున్నావ్.. అంటూ అనసూయపై కామెంట్లు తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకునేలా ఉన్నావని నాన్న అన్నారు: సాయి పల్లవి #BulletSong Spark Causing the Wildfire on YouTube 💥 Continues to make whole India groove with 100 Million+ Views 🕺💃 Telugu: https://t.co/XiPpHzsESj Tamil: https://t.co/amuQsznXC2@ramsayz @SilambarasanTR_ @AadhiOfficial @dirlingusamy @ThisisDSP @IamKrithiShetty @SS_Screens pic.twitter.com/HU9lVFA1Z1 — Srinivasaa Silver Screen (@SS_Screens) June 15, 2022 -
లాక్డౌన్లో 27 కేజీల బరువు తగ్గాను : శింబు
Hero Simbu Says He Lost 27 Kgs In Lockdown: ‘‘నేను నటించిన ‘మన్మథ, వల్లభ’ వంటి చిత్రాలను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. మంచి కథ కుదిరితే తెలుగులో స్ట్రైట్ ఫిల్మ్ చేయడానికి సిద్ధం’’ అని హీరో శింబు అన్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో శింబు, యస్.జె. సూర్య, కల్యాణీ ప్రియదర్శన్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మానాడు’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘ది లూప్‘ పేరుతో అనువదించారు. అల్లు అరవింద్, బన్నీ వాసు తెలుగులో విడుదల చేస్తున్నారు. తమిళ్, తెలుగు భాషల్లో ఈ నెల 25న ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా శింబు మాట్లాడుతూ– ‘‘పొలిటికల్, సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ‘ది లూప్’ రూపొందింది. ఇందులో నేను చేసిన అబ్దుల్ కాలిక్ పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. రాజకీయాల వల్ల సామాన్య వ్యక్తి అయిన అబ్దుల్ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? వాటిని ఎలా అధిగమించాడు? అన్నదే ఈ చిత్రకథ. ఒక్క రోజులో వేరే వేరే సమయాల్లో జరిగే కథ ఇది. తర్వాత ఏం జరుగుతుంది? అనే ఆసక్తి ప్రేక్షకులకు కలుగుతుంది. ఈ చిత్రంలో నేను హంతకుడి పాత్ర పోషించాను. ఈ పాత్ర కోసం 27 కిలోల బరువు తగ్గాను. వెంకట్ ప్రభు మంచి దర్శకుడు. గతంలో ‘మన్మథ’ చిత్రాన్ని నేను తెలుగులో రీమేక్ చేద్దామంటే వద్దన్నారు.. అయినా పట్టుబట్టి నేను డబ్బింగ్ చేయించి, రిలీజ్ చేశాను. ఆ సినిమాను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. ‘ది లూప్’ని కూడా నేనే తెలుగులో రిలీజ్ చేయిస్తున్నాను. నాపై నమ్మకంతో తెలుగులో రిలీజ్ చేస్తున్న అల్లు అరవింద్, బన్నీ వాసుగార్లకు థ్యాంక్స్’’ అన్నారు. -
ఇబ్బంది పెడుతున్నారంటూ స్టేజ్‌పైనే ఏడ్చిన హీరో శింబు
Simbu Cries At His Maanadu Movie Event: కొందరు కావాలని తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ తమిళ హీరో శింబు కన్నీరు పెట్టుకున్నారు. వెంకటేశ్ ప్రభు దర్శకత్వంలో శింబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘మానాడు’ ఈ నెల 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చెన్నైలో మీడియా సమావేశం నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా శింబు మాట్లాడుతూ.. మూవీ విశేషాలను పంచుకుంటూనే ఒక్కసారిగా కన్నీటిపర్యంతరం అయ్యాడు. చదవండి: పునీత్ సంస్మరణ సభలో స్టార్ హీరోకు చేదు అనుభవం వెంకట్ ప్రభు, తాను కలిసి సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నామని, అయితే కొన్ని కారణాల వల్ల కుదరలేదన్నాడు. ‘మానాడు’ సినిమాలో వినోదానికి కొదవ ఉండదని, ఈ సినిమా కోసం ఎంతో శ్రమించానని చెప్పాడు. ఇక ఈ సినిమాలో ఎజ్జే సూర్య నటన అద్భుతంగా ఉంటుందని శింబు పేర్కొన్నాడు. అంతేగాక సినిమా విడుదల తర్వాత తన మరో స్థాయికి వెళ్తుందన్నాడు. ఇప్పటి వరకు సరదాగా మాట్లాడిన శింబు ఆ తర్వాత ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంటూ తనని కొందరూ టార్గెట్ చేశారని, కావాలని ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: పోలీసులను ఆశ్రయించిన నటి స్నేహా శింబు ఏడవడం చూసిన పక్కనే ఉన్న మిగతా సినిమా క్రూడ్ ఆయనను ఓదార్చే ప్రయత్నం చేశారు. కాసేపటికి దాని నుంచి తేరుకున్న శింబు ఆ సమస్యల సంగతి తాను చూసుకుంటానని, తన సంగతిని మాత్రం మీరు (అభిమానులు) చూసుకోవాలని కోరారు. శింబు కన్నీళ్లు పెట్టుకోవడంతో వేదికపై ఉన్న భారతీరాజా, ఎస్ఏ చంద్రశేఖర్, ఎస్జే సూర్య, నిర్మాత కె.రాజన్ తదితరులు ఆయనను ఓదార్చారు. -
ఈ సమస్యలకు శింబునే కారణం: ఆర్కే సెల్వమణి
సాక్షి, చెన్నై: తమిళ నిర్మాతల మండలికి, దక్షిణ భారత సినీ కార్మికుల సమ్మేళనం (ఫెఫ్సీ)కు మధ్య సమస్యకు నటుడు శింబునే కారణమని ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి అన్నారు. శింబు ‘అన్బానవన్ అడంగాదవన్ అసరాదవన్’ మూవీ నిర్మాత మైఖెల్ రాయప్పన్‌కు ఆ చిత్రం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. శింబు తీరుతోనే తాను నష్టపోయానని.. తనకు పరిహారం చెల్లించాలని రాయప్పన్ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. దీంతో రాయప్పన్‌కు శింబు నష్టపరిహారం చెల్లించాలని తీర్మానం చేశారు. లేనిపక్షంలో ఆయన నటిస్తున్న చిత్రాలకు ఎలాంటి సహకారం అందించబోమని ప్రకటించారు. అయినా శింబు చిత్రాలకు ఫెఫ్సీ కార్మికులు పని చేశారు. ఈ వ్యవహారంతో ఫెఫ్సీ, నిర్మాతల మండలి మధ్య సమస్యలు తలెత్తాయి. దీనిపై ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్.కె సెల్వమణి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. నిర్మాతల మండలి విజ్ఞప్తి మేరకు శింబు నటిస్తున్న 4 చిత్రాలకు తాము కూడా ఎలాంటి సహకారం అందించలేదన్నారు. అయితే శింబు హీరోగా ఐసరిగణేష్ నిర్మిస్తున్న చిత్రం ఇతర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో 4 రోజులు అనుమతి ఇవ్వాలని కోరాలన్నారు. నిర్మాతల మండలి అనుమతితోనే ఫెఫ్సీ కార్మికులు ఈ సినిమాకు పని చేశారని వివరించారు. సీఎం స్టాలిన్‌తో చర్చించి సమస్యను పరిష్కరిస్తామన్నారు ఆయన పేర్కొన్నారు. -
ఐదు భాషల్లో శింబు ‘రివైండ్’
‘‘శింబు హీరోగా నటిస్తున్న సినిమా టీజర్‌ని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. శింబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు’’ అన్నారు హీరో రవితేజ. శింబు, కల్యాణీ ప్రియదర్శన్ జంటగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రివైండ్’. హిందీ–తమిళ్– తెలుగు–కన్నడ–మలయాళ భాషల్లో సురేష్ కామాచి నిర్మిస్తున్నారు. తమిళంలో ‘మానాడు’, తెలుగులో ‘రివైండ్’ టైటిల్‌తో రూపొందుతోంది. బుధవారం శింబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా తెలుగు టీజర్‌ని రవితేజ రిలీజ్ చేశారు. ‘మానాడు’ హిందీ టీజర్‌ని దర్శకుడు అనురాగ్ కశ్యప్, తమిళ టీజర్‌ని సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్, కన్నడ టీజర్‌ని హీరో సుదీప్ విడుదల చేశారు. ‘‘పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రమిది. ఈ సినిమాలో శింబు ముస్లిమ్ పాత్ర చేస్తున్నారు. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో దర్శకులు భారతీరాజా, ఎస్.ఎ. చంద్రశేఖర్, ఎస్.జె. సూర్య, కరుణాకరన్ నటిస్తుండడం విశేషం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతదర్శకుడు. -
గౌతమ్ మీనన్‌తో ముచ్చటగా మూడోసారి
తమిళ హీరో శింబు, దర్శకుడు గౌతమ్ మీనన్ మూడోసారి ఒక ప్రాజెక్ట్‌కి కలవనున్నారు. గతంలో వీరి కాంబినేషన్లో ‘విన్నైత్తాండి వరువాయా, అచ్చం ఎన్బదు మడమయడా’ (ఈ రెండు సినిమాలను ‘ఏ మాయ చేశావే’, ‘సాహసం శ్వాసగా సాగిపో’గా నాగచైతన్యతో తెలుగులో తెరకెక్కించారు గౌతమ్ మీనన్) చిత్రాలు వచ్చాయి. లాక్డౌన్లో ‘కార్తీక్ డయల్ సెయ్ ద ఎన్’ అనే షార్ట్‌ఫిల్మ్ కూడా చేశారు శింబు, గౌతమ్ మీనన్. ఐ ఫోన్‌తో ఎవరింట్లో వాళ్లు ఉండి ఈ లఘు చిత్రం చేశారు. తాజాగా ఓ కొత్త సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. వేల్స్ ఇంటర్నేషనల్ నిర్మాణంలో ఇషారీ కే గణేశ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘కొన్ని కథలు చాలా స్పెషల్‌గా ఉంటాయి. ఈ స్క్రిప్ట్ కూడా చాలా స్పెషల్‌గా అనిపిస్తుంది’’ అన్నారు గౌతమ్ మీనన్. ఇది ‘విన్నైత్తాండి వరువాయా’కు సీక్వెల్ అని ప్రచారంలో ఉంది. -
త్రిబుల్ ధమాకా
శింబు హీరోగా, తమన్నా, శ్రియ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘అఅఅ’. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కుసుమ ఆర్ట్స్ పతాకంపై యాళ్ళ కీర్తి నిర్మాణ సారథ్యంలో యాళ్ళ వెంకటేశ్వరరావు (కృపావరం) తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా యాళ్ళ వెంకటేశ్వరరావు విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. శింబు మూడు పాత్రల్లో కనిపిస్తారు. తమన్నా, శ్రియల పాత్రలు బాగుంటాయి. తమిళ డబ్బింగ్ సినిమా అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా అన్ని హంగులు ఉంటాయి. డైలాగ్స్, పాటలు ఆడియన్స్‌ని మెప్పిస్తాయి. అందరూ మా సినిమా చూసి ఆశీర్వదించాలని కోరుతున్నాను’’ అన్నారు. ఈ సమావేశంలో జక్కుల నాగేశ్వరరావు, బాలాజీ నాగలింగం, బొప్పన గోపీ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: జక్కుల నాగేశ్వరరావు, సహ నిర్మాతలు: యాళ్ళ మేరీ కుమారి, యాళ్ళ రాహుల్. -
అప్పుడే నా పెళ్లి.. లేదంటే..!: త్రిష
చెన్నై: దాదాపు రెండు దశాబ్ధాల పాటు తెలుగులో అగ్రనటిగా రాణించారు చెన్నై భామ త్రిష. తెలుగులో అగ్రహీరోలందరి సరసన నటించిన త్రిష చివరిగా జూనీయర్ సరసన ‘దమ్ము’లో చిత్రంలో నటించారు. ఆ తర్వాత సినిమాలకు కాస్తా విరామం ఇచ్చిన త్రిష ప్రస్తుతం తెలుగులో తక్కువ.. తమిళ సినిమాలలోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇక మూడు పదుల వయసుకు వచ్చినప్పటికి ఆమె ఇంకా పెళ్లి చేసుకోలేదు. అప్పట్లో ఓ వ్యాపారవేత్తతో ఆమెకు నిశ్చితార్థం జరిగినప్పటికి అది పెళ్లి పీటల వరకు వెళ్లలేదు. ఆ తర్వాత త్రిష సినిమా పరిశ్రమలోని ఓ హీరోతో ప్రేమాయాణం నడుపుడుతున్నట్లు తరచూ వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో తమిళ హీరో శింబు-త్రిషలు ప్రేమలో ఉన్నారని, త్వరలో వారిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. (చదవండి: పెళ్లి పీటలు ఎక్కనున్న శింబు, త్రిష?) ఈ క్రమంలో ఓ ఇంటర్యూలో త్రిష తన పెళ్లిపై క్లారిటి ఇచ్చారు. ‘నా మనసుకు నచ్చిన వ్యక్తి దొరికితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. నన్ను పూర్తిగా అర్థం చేసుకునే వ్యక్తి దొరికినప్పుడే నా పెళ్లి లేదంటే సింగిల్‌గానే ఉంటాను’ అని పేర్కొన్నారు. అంతేగాక తను ప్రేమ వివాహమే చేసుకుంటానని, మనసుకు నచ్చిన వ్యక్తి దొరికే వరకు పెళ్లి చేసుకోనన్నారు. ఒకవేళ అలాంటి వ్యక్తి తారసపడకుంటే జీవితాంతం ఒంటరిగా ఉండటానికైనా తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతం త్రిష మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న హిస్టారికల్ డ్రామా ‘పొన్నియిన్ సెల్వన్’లో నటిస్తున్నారు -
బాబు బంగారం!
సినిమా షూటింగ్ అంటే మినిమమ్ వంద రోజులు యూనిట్ అంతా ట్రావెల్ చేస్తారు. సినిమా భారీతనాన్ని బట్టి రోజులు పెరుగుతాయి. చిన్న సినిమాలంటే ముప్ఫై నలభై రోజుల్లో పూర్తవుతాయి. రోజులు ఎన్నయినా ఒక సినిమా పూర్తయ్యేంతవరకూ కలిసి ప్రయాణం చేస్తారు కాబట్టి షూటింగ్ చివరి రోజు ఒకింత ఎమోషన్ అవుతారు. కొంతమందైతే బహుమతులు కూడా ఇచ్చుకుంటారు. తమిళ చిత్ర పరిశ్రమలో ఇలా జరుగుతుంటుంది. షూటింగ్ చివరి రోజున అజిత్, విజయ్ వంటి స్టార్ హీరోలు యూనిట్ సభ్యులకు బహుమతులు ఇస్తుంటారు. తాజాగా మరో స్టార్ శింబు కూడా ‘ఈశ్వరన్’ సినిమాకి పని చేసిన 400 మందికి ఒక గ్రాము బంగారు నాణెం బహుమతిగా ఇచ్చారు. అలాగే 200 మంది జూనియర్ ఆర్టిస్టులకు బట్టలు పెట్టారు. శింబూకి వివాదస్పద వ్యక్తి అనే పేరుంది. అయితే ఇలాంటి మంచి పనులు చేసి ‘బాబు బంగారం’ అని కూడా అనిపించుకుంటుంటారు. ఇక సుశీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ‘ఈశ్వరన్’ సంక్రాంతికి విడుదల కానుంది. -
జోడీ కుదిరింది
శింబు, శ్రుతీహాసన్ జంటగా ఓ సినిమాలో నటించబోతున్నారా? అంటే, అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం రవితేజ సరసన ‘క్రాక్’, పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాలు చేస్తున్నారు శ్రుతీహాసన్. తమిళంలో ‘లాభం’ అనే సినిమా చేస్తున్నారు. తాజాగా శింబు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ప్రస్తుతం శింబు ‘మహా’, ‘మానాడు’ అనే రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాల తర్వాత మిస్కిన్ దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేయనున్నారని. ఇందులోనే శింబు సరసన శ్రుతీహాసన్ కథానాయికగా నటించనున్నారట. కరోనా కారణంగా షూటింగ్స్ పెద్దగా జరగడంలేదు. పరిస్థితులు అనుకూలంగా మారాక ఈ చిత్రం షూటింగ్‌ని ఆరంభించాలనుకుంటున్నారని సమాచారం. -
సీక్వెల్‌కి టీజర్?
శింబు, త్రిష జంటగా దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కించిన క్లాసిక్ లవ్ స్టోరీ ‘విన్నైత్తాండి వరువాయా’ (తెలుగులో నాగ చైతన్య, సమంతలతో ‘ఏ మాయ చేసావే’గా గౌతమ్ తీశారు). ఈ సినిమాకు సీక్వెల్ తీయబోతున్నట్టు పలు సందర్భాల్లో ప్రకటించారు గౌతమ్ మీనన్. తాజాగా జెస్సీ, కార్తీక్ (సినిమాలో త్రిష, శింబు పాత్రల పేర్లు) పాత్రలతో ఓ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కిస్తున్నారు మీనన్. ‘కార్తీక్ డయల్ సెయ్ద ఎన్’ టైటిల్‌తో ఈ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కింది. ఈ లఘు చిత్రం ట్రైలర్ కూడా విడుదలయింది. శింబు, త్రిష ఎవరింట్లో వాళ్లు ఉండి ఈ చిత్రంలో నటించారు. త్వరలోనే ఈ షార్ట్ ఫిల్మ్ విడుదల కానుంది. ‘విన్నైత్తాండి వరువాయా’ సీక్వెల్ ఎలా ఉండబోతోందో ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా ఓ టీజర్లా మీనన్ చూపించబోతున్నారని టాక్. -
చలో మలేషియా
దాదాపు ఇరవై రోజులకు సరిపడ సామాన్లు సర్దుకునే పనిలో ఉన్నారు హీరో శింబు. ఇంతకీ ఎక్కడికెళుతున్నారనేగా మీ సందేహం. ఆయన మలేషియాకు వెళ్లబోతున్నారు. శింబు హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘మనాడు’ అనే పొలిటికల్ థ్రిల్లర్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో కల్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్గా నటిస్తారు. ఈ సినిమాలోని పాత్ర కోసం శింబు బరువు తగ్గడమే కాకుండా, మార్షల్ ఆర్ట్స్‌లో ఫారిన్లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈ నెల 25న ప్రారంభం కానుందని కోలీవుడ్ సమాచారం. ఈ షెడ్యూల్ దాదాపు నెల రోజులు ఉంటుందట. మలేషియాలో హీరోహీరోయిన్లపై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు కొన్ని యాక్షన్ సీన్స్‌ను కూడా ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. -
కలిసిపోయారు
తమిళ నటుడు శింబు, హన్సిక అప్పట్లో ప్రేమలో ఉన్నారు. ఆ తర్వాత విడిపోయారు. తాజాగా మళ్లీ కలిశారు. కలిసిపోయారా? అని ఆశ్చర్యపడకండి. ఈసారి కలిసింది ప్రొఫెషనల్‌గా మాత్రమే. హన్సిక తాజా చిత్రం ‘మహా’లో శింబు ఓ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం షూటింగ్లో శింబు జాయిన్ అయ్యారు. హన్సిక చేస్తున్న ఈ తొలి ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ ఆమెకు 50వ సినిమా కావడం విశేషం. యుఆర్ ఉజ్వల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శింబు ఫ్లాష్‌బ్యాక్ భాగంలో మెరుస్తారట. ప్రస్తుతం ఫారిన్లో శింబు, హన్సికలపై ఓ సాంగ్ షూట్ జరుగుతోంది. ఈ సినిమాలో నటించడానికి శింబూని హన్సికనే ఒప్పించారని దర్శకుడు ఇటీవల పేర్కొన్నారు. -
కొత్త కోణం
ఇన్ని సంవత్సరాలుగా ఐశ్వర్యా రాయ్‌ను రకరకాల పాత్రల్లో చూశాం. అందం, అభినయం బ్యాలెన్స్ చేస్తూ గుర్తుండిపోయే రోల్స్ చేశారామె. అయినా నటిగా ఆమె దాహం తీరలేదు. లేటెస్ట్గా ఐష్ తనలోని కొత్త కోణాన్ని బయటకు తీసుకురానున్నారని తెలిసింది. ఆమె నెగటివ్ రోల్లో కనిపించనున్నారట. తమిళ ఫేమస్ నవల పొన్నియిన్ సెల్వన్ ఆధారంగా మణిరత్నం ఓ భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. విక్రమ్, శింబు, జయం రవి, కార్తీ, నయనతార, అమలా పాల్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారట. ఇందులో ఐశ్వర్యా రాయ్ పాత్రకు నెగటివ్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. అధికార దాహం కలిగిన రాణి పాత్రలో ఐష్ నటించనున్నారట. చోళుల సామ్రాజ్యం చుట్టూ ఈ కథ సాగనుంది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
37 రోజులు...13 కిలోలు
చెప్పినంత ఈజీ కాదు సాధించడం. కానీ యాక్టర్ శింబు సాధించాడు. 37 రోజుల్లో 13 కిలోల బరువు తగ్గుతానని సవాల్ చేశాడు. అన్నట్లుగానే తగ్గాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో శింబు హీరోగా సురేశ్ నిర్మాణంలో ‘మానాడు’ అనే పొలిటికల్ థ్రిల్లర్ రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కల్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్గా నటిస్తారు. ఈ సినిమాలోని పాత్ర కోసం లండన్‌లో మార్షల్ ఆర్ట్స్ విభాగంలో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాడు శింబు. అలాగే లుక్‌పై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టి సరైన డైట్‌తో కూడిన వర్కౌట్‌తో బరువు తగ్గాడు. ఈ సినిమా చిత్రీకరణ ఈ నెలలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాతో పాటు ఓ మల్టీస్టారర్ సినిమాకు సైన్ చేశాడు శింబు. ఇందులో గౌతమ్ కార్తీక్ మరో హీరో. -
యంజీఆర్ – యంఆర్ రాధల కథేంటి?
తమిళ సినీ చరిత్రలో యంజీఆర్‌ను యంఆర్ రాధా తుపాకితో కాల్చడం పెద్ద సంచలనంతో పాటు మిస్టరీ. ఈ సంఘటన తమిళ ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోనిది, ఎప్పుడూ చర్చ జరిగే టాపిక్. ఈ కాల్పుల్లో యంజీఆర్ తన గొంతును కోల్పోవడం, ఆ తర్వాత మాటల్లో స్పష్టత లోపించడం తమిళ ప్రేక్షకులకు తెలుసు. ఎంజీఆర్‌ను కాల్చిన సంఘటనలో రాధా అరెస్ట్ కావడం తెలిసిందే. ఇప్పుడు ఆ సంఘటన వెనక ఏం జరిగిందో తెలిసే అవకాశం ఉంటుందని తమిళ ప్రే„ý కులు భావిస్తున్నారు. దానికి కారణం.. యంఆర్ రాధా మీద ఓ బయోపిక్ రూపొందనుండటమే. నటి, యంఆర్ రాధ కుమార్తె రాధిక తన సొంత బ్యానర్ రధన్ మీడియా వర్క్స్‌పై ఈ బయోపిక్‌ను నిర్మించనున్నారు. రాధా మనవడు ఐకీ ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో రాధ పాత్రలో శింబు, యంజీఆర్ పాత్రలో అరవింద స్వామిని ఎంపిక చేసినట్టు సమాచారం. గత ఏడాదే మణిరత్నం ‘చెక్క చివంద వానమ్’ (తెలుగులో నవాబ్) సినిమాలో అరవింద స్వామి, శింబు అన్నదమ్ములుగా యాక్ట్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. మళ్లీ మరోసారి కలసి నటించబోతున్నారన్న మాట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
ఇది యూత్ కోసమే
ఐదుగురమ్మాయిలు తమ జీవితాల్లో ఎదుర్కొన్న సమస్యల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘90ఎంఎల్’ ‘ఇది చాలా తక్కువ’ అనేది క్యాప్షన్. ఓవియా ప్రధాన పాత్రలో నటించారు. హీరో శింబు గెస్ట్ రోల్ చేసి, సంగీతం అందించారు. అనితా ఉదీప్ దర్శకత్వం వహించారు. కర్ణ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై యిన్నం శ్రీనివాసరావు సమర్పణలో కృష్ణ కాకర్లమూడి నిర్మాణ సారథ్యంలో పఠాన్ చాంద్‌బాషా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం ఆడియో రిలీజ్ హైదరాబాద్‌లో జరిగింది. తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సాయివెంకట్, సురేశ్ కొండేటి సీడీను ఆవిష్కరించి మాట్లాడుతూ – ‘‘యూత్‌ని లక్ష్యంగా చేసుకొని రూపొందించిన చిత్రం ఇది. పాటలు, ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. తప్పకుండా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అన్నారు. ‘‘వెన్నెలకంటి తనయుడు రాకేందు మౌళి సాహిత్యం అందించారు. ఈ నెల 26న చిత్రాన్ని భారీగా విడుదల చేస్తున్నాం’’ అన్నారు పఠాన్ చంద్. ఈ వేడుకలో విజయరంగరాజు, మల్లికార్జున్, రంగనాయకులు, కరుణాకర్ రాము తదితరులు పాల్గొన్నారు. -
ఇది చాలా తక్కువ!
తమిళ బిగ్‌బాస్ ఫేమ్ ఓవియా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘90ఎంఎల్’. ‘ఇది చాలా తక్కువ’ అన్నది ట్యాగ్‌లైన్. అనితా ఉదీప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శింబు ప్రత్యేక పాత్రలో కనిపించి, సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని అదే టైటిల్‌తో పఠాన్ చాంద్‌బాషా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను ఆదివారం రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన సాయి వెంకట్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తమిళంలో హిట్ అయినట్టే తెలుగులోనూ హిట్ సాధించాలని అన్నారు. నిర్మాత చాంద్‌బాషా మాట్లాడుతూ – ‘‘తెలుగు హక్కుల కోసం చాలా పోటీ ఏర్పడింది. మేం దక్కించుకున్నాం. కామెడీ డ్రామాగా సాగే చిత్రమిది’’ అన్నారు. ‘‘ఐదుగురు అమ్మాయిలు.. వాళ్లకు ఎదురైన సమస్యల వల్ల మద్యపానం, ధూమపానానికి అలవాటు పడి ఎలా బయటపడ్డారన్నది కథ. శింబు స్పెషల్ రోల్, సంగీతం ఆకట్టుకుంటుంది’’ అన్నారు నిర్మాణ సారథి కృష్ణ కాకర్లమూడి. ఈ కార్యక్రమంలో డా. రంగనాయకులు, శ్రీధర్, వాసుదేవ్ వైజాగ్ దివాకర్ పాల్గొన్నారు. -
రాజకీయం చేస్తారా?
టాలీవుడ్‌ను, కోలీవుడ్‌ను భలేగా బ్యాలెన్స్ చేస్తున్నారు హీరోయిన్ కల్యాణీ ప్రియదర్శన్. తెలుగులో సాయిధరమ్‌తేజ్ (చిత్రలహరి), శర్వానంద్ సినిమాల షూటింగ్‌ను కంప్లీట్ చేశారు. ఇటీవల తమిళంలో దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందనున్న ‘వాన్’ సినిమాలో కథానాయికగా నటించే చాన్స్ కొట్టేశారు. తాజాగా శింబు హీరోగా నటించనున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘మానాడు’ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తారు. ‘‘అమేజింగ్ స్క్రిప్ట్. ‘మానాడు’ షూటింగ్లో పాల్గొనడానికి ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాను’’ అని పేర్కొన్నారు కల్యాణి. మరి.. ఇది పొలిటికల్ థ్రిల్లర్ కాబట్టి ఇందులో కల్యాణి ఏదైనా పొలిటికల్ పార్టీకి చెందిన అమ్మాయి పాత్రలో కనిపిస్తారా? లేక వేరే పాత్రలో అలసరిస్తారా? వెయిట్ అండ్ సీ! -
రాజకీయం చేస్తారా?
టాలీవుడ్‌ను, కోలీవుడ్‌ను భలేగా బ్యాలెన్స్ చేస్తున్నారు హీరోయిన్ కల్యాణీ ప్రియదర్శన్. తెలుగులో సాయిధరమ్‌తేజ్ (చిత్రలహరి), శర్వానంద్ సినిమాల షూటింగ్‌ను కంప్లీట్ చేశారు. ఇటీవల తమిళంలో దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందనున్న ‘వాన్’ సినిమాలో కథానాయికగా నటించే చాన్స్ కొట్టేశారు. తాజాగా శింబు హీరోగా నటించనున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘మానాడు’ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తారు. ‘‘అమేజింగ్ స్క్రిప్ట్. ‘మానాడు’ షూటింగ్లో పాల్గొనడానికి ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాను’’ అని పేర్కొన్నారు కల్యాణి. మరి.. ఇది పొలిటికల్ థ్రిల్లర్ కాబట్టి ఇందులో కల్యాణి ఏదైనా పొలిటికల్ పార్టీకి చెందిన అమ్మాయి పాత్రలో కనిపిస్తారా? లేక వేరే పాత్రలో అలసరిస్తారా? వెయిట్ అండ్ సీ! -
మళ్లీ కలిశారు!
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నది సామెత. సినిమా ఇండస్ట్రీలోనూ అంతే.. కొందరు కలిసి నటించడం.. ప్రేమలో పడటం చకచకా జరిగిపోతాయి. ప్రేమలో ఉన్నన్నాళ్లూ చెట్టాపట్టాలేసుకుని తిరగుతుంటారు. పెళ్లిపీటలు ఎక్కబోతున్నారనే టైమ్‌లో లవ్‌కి బ్రేకప్ చెబుతుంటాయి కొన్ని జంటలు. అలా విడిపోయిన జంటల్లో శింబు, హన్సిక కూడా ఉన్నారు. విడిపోయాక కలిసి సినిమాలు చేయడం మానేసే జంటలు.. ఆ తర్వాత కొన్నాళ్లకు మనసు మార్చుకుని కలిసి నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తుంటారు. శింబు, హన్సిక కూడా బ్రేకప్ తర్వాత కలిసి నటించడం మానేశారు. ఇప్పుడు హన్సిక 50వ చిత్రం ‘మహా’లో నటించడానికి శింబు అంగీకరించారు. యు.ఆర్. జమీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పోస్టర్లతో వివాదాస్పదం అయ్యింది. దాంతో ఈ సినిమాపై తమిళ సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇంత క్రేజ్ ఉన్న సినిమాకు అదనపు ఆకర్షణ జోడించాలనే ఉద్దేశంతో శింబుతో అతిథి పాత్ర చేయిస్తున్నారట జమీల్. ‘ఈ విషయాన్ని మేమే చెప్పాలనుకున్నాం. కానీ ముందే బయటికొచ్చేసింది. నేను, శింబు ‘మహా’లో కలిసి నటిస్తున్నాం’’ అని హన్సిక స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. -
90ఎంఎల్‌పై విమర్శల వర్షం
పెరంబూరు: సమాజాన్ని భ్రష్టు పట్టించే చిత్రం అంటూ నటి ఓవియ నటించిన 90ఎంఎల్ చిత్రంపై విమర్శలు వెల్లువడుతున్నాయి. బిగ్‌బాస్ గేమ్ షో ఫేమ్ ఓవియ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 90 ఎంఎల్. దీన్ని మహిళా దర్శకురాలు అనితా ఉదీప్ తెరకెక్కించారు. నటుడు శింబు సంగీతాన్ని అందించడం విశేషం. శుక్రవారం తెరపైకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను పొందుతోంది. అయితే ఇందులో నటి ఓవియతో పాటు ఆమె స్నేహితురాళ్ల పాత్రలు మద్యం తాగడం, దమ్ము కొట్టడం, లిప్‌లాక్ చుంబనాలు, అదే విధంగా సహజీవనం, లెస్బియన్ సన్నివేశాలాంటివి చోటుచేసుకోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 90ఎంఎల్ చిత్రం గురించి నిర్మాత ధనుంజయన్ స్పందిస్తూ సమాజాన్ని భ్రష్టు పట్టించే చిత్రం అని ట్విట్టర్లో పేర్కొన్నారు. అంతే కాకుండా డబ్బు సంపాదన కోసం యువతరాన్ని నాశనం చేయకూడదని అన్నారు. ఈయన వ్యాఖ్యలకు 90ఎంఎల్ చిత్ర దర్శకురాలు అనితా ఉదీప్ బదులిచ్చేలా మీరు నిర్మించిన చంద్రమౌళి చిత్రంలో సందేశం ఇచ్చేలా అశ్లీల పాటను పొందుపరిచిన చిత్రానికి నేను దర్శకరాలిని కాదు అని వెటకారపు వ్యాఖ్యలతో ట్వీట్ చేశారు. అందుకు ధనుంజయన్ నా చిత్రంలో పాట గ్లామరస్‌గా ఉందే కానీ అశ్లీలంగా మాత్రం లేదని అన్నారు. నా చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్‌నే పొందాను. మీ చిత్రం మాదిరి ఏ సర్టిఫికెట్ కాదు. అయినా చిత్రంలో పాటలు ఎలా ఉండాలన్నది దర్శకుడి నిర్ణయం అని, నేనెప్పుడూ పాటల విషయంలో సొంత నిర్ణయాలను తీసుకోలేదని బదులిచ్చారు. దీంతో దర్శకురాలు అనితా ఉదీప్ సార్ మీతో వివాదం బోర్ కొడుతోంది. కాస్త ఆసక్తికరంగా, కొంచెం స్మార్ట్‌గా మాట్లాడండి అని పేర్కొన్నారు. ఆ తరువాత ధనుంజయన్ నుంచి బదులు రాకపోవడంతో అనితా ఉదీప్ ప్లీజ్ పారిపోకండి. మీతో కొంచెం కామెడీ చేయాలని ఉంది అని ట్వీట్ చేశారు. వీరి వివాదం ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. -
నాకున్న ఇద్దరు, ముగ్గురి ఫ్యాన్లకే చెబుతున్నా : హీరో
తమిళ నాట నిత్యం వివాదాల్లో ఉండే స్టార్ హీరో శింబు.. ప్రస్తుతం ఓ సినిమాతో అక్కడి ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ అత్తారింటికి దారేది మూవీ రీమేక్‌గా రాబోతోన్న 'వంద రాజవతాన్ వరువేన్' ఫిబ్రవరి ఒకటో తేదీన రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా తన అభిమానులకు ఓ సందేశాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. థియేటర్ల వద్ద హంగామా చేయవద్దు, టిక్కెట్లను బ్లాక్‌లో కొనకండి, థియేటర్లలోనే చూడండి.. భారీ ప్లెక్స్‌లు, కటౌట్లు, పాలాభిషేకాలు చేయకండి.. డబ్బును వృథా చేయకండి. ఆ డబ్బుతో అమ్మానాన్నలు బాగా చూసుకోండి వారి తరువాతే ఎవరైనా అంటూ వీడియోను పోస్ట్ చేశాడు. అయితే నెటిజన్లు మాత్రం శింబును ఓ ఆటాడేసుకున్నారు. ఇదొక పబ్లిసిటీ స్టంట్ అని, నీకు అంతా సీన్ లేదు, నువ్వు అంత పెద్ద హీరోవి కాదని, నీకు ఉండేదే ఇద్దరు ముగ్గురు అభిమానులు అంటూ నానా రకాలుగా కామెంట్లు చేశారు. అసలే కోలీవుడ్ బ్యాడ్ బాయ్‌గా ముద్రపడిన శింబు.. వీటికి తన స్టైల్లో సమాధానం చెప్పాడు. వెంటనే మరో వీడియోను షేర్ చేస్తూ..తాను ఇంతకు ముందు షేర్చేసిన వీడియోలో చెప్పిన వాటికి కొంతమంది నెగెటివ్‌గా కామెంట్ చేశారని, నాకు ఉన్నది ఇద్దరు ముగ్గురు ఫ్యాన్సేనని వారికే ఇది చెబుతున్నా అని.. ఇంతవరకు చేయనంత హంగామా చేయండని, భారీ ప్లెక్సీలు, పెద్ద పెద్ద కటౌట్లు కట్టండని, పాల ప్యాకెట్లతో కాదు పాల క్యాన్లతో పాలాభిషేకం చేయండంటూ తన స్టైల్లో నెటిజన్లకు కౌంటర్ వేశాడు. -
తమిళ ‘అత్తారింటికి దారేది’ రిలీజ్ డేట్ ఫిక్స్!
టాలీవుడ్లో అత్తారింటికి దారేది ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సగం సినిమా పైరసీ ద్వారా బయటకు వచ్చినా.. కలెక్షన్లలో ఈ మూవీ రికార్డులు సృష్టించింది. ఈ చిత్రాన్ని తమిళంలో శింబు హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ మూవీ (‘వంత రాజవథాన్ వరువెన్’) టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేయగా.. ‘అత్తారింటికి దారేది’ని ఉన్నది ఉన్నట్టుగా దించేశారని కామెంట్స్ వినిపించాయి. ఈ మూవీని ఫిబ్రవరి ఒకటో తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మేఘా ఆకాష్, కేథరిన్ థెరిసాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీకి సుందర్.సి దర్శకత్వం వహించగా.. హిప్ హాప్ తమీజా సంగీతాన్నిఅందించారు. మరి ఈ చిత్రం.. అక్కడ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. -
కటౌట్లు పెట్టొద్దు
ఏ హీరో అయినా తన సినిమా రిలీజ్ రోజు థియేటర్ల వద్ద భారీ కటౌట్లు ఉండాలని కోరుకుంటాడు. ఎన్ని కటౌట్లుంటే అంత స్టార్డమ్ ఏర్పరచుకున్నట్టు లెక్క. కానీ తమిళ నటుడు శింబు మాత్రం తన తర్వాతి సినిమా నుంచి కటౌట్లు ఏర్పాటు చేయొద్దని ఫ్యాన్స్‌ని కోరారు. ‘అత్తారింటికి దారేది’ చిత్రం రీమేక్ ‘వందా రాజావాదాన్ వరువేన్’ సినిమాలో నటì ంచారు శింబు. ఈ చిత్రానికి సుందర్ సి. దర్శకుడు. మేఘా ఆకాశ్, కేథరీన్ థెరీసా కథానాయికలుగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌ను ఉద్దేశిస్తూ ఓ వీడియో పోస్ట్ చేశారు శింబు. ‘‘నా సినిమా రిలీజ్ అని పెద్ద పెద్ద కటౌట్లు, బ్యానర్లు కట్టి మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృథా చేయకండి. దానికి బదులు మీ ఇంట్లో వాళ్లకు కొత్త దుస్తులు కొనండి, చిన్నపిల్లలకు చాక్లెట్లు కొనండి. అప్పుడు నేనింకా హ్యాపీగా ఫీల్ అవుతాను’’ అని శింబు పేర్కొన్నారు. -
శింబు శిక్షణ
తమిళ యంగ్ హీరో శింబుకు ‘చెక్క చివంద వానమ్’ (తెలుగులో ‘నవాబ్’) మంచి కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఈ హిట్‌తో శింబు వరుసగా కొత్త సినిమాలు సైన్ చేస్తున్నారు. సుందర్ సి. తో ‘అత్తారింటికి దారేది’ రీమేక్‌లో నటిస్తున్నారు. తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘మానాడు’ అనే పొలిటికల్ థ్రిల్లర్‌లో కనిపించనున్నారు. అందులో పాత్రకు సంబంధించి శింబు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకోనున్నారట. అందుకోసం బ్యాంకాక్‌లో దాదాపు నెలరోజులు గడపనున్నారట. మార్షల్ ఆర్ట్స్ బేసిక్స్ అన్నీ నేర్చుకుంటారని కోలీవుడ్ టాక్. ‘మానాడు’ చిత్రం మార్చిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. -
ముద్దు శింబుకేనట
సినిమా: శింబుకే ముద్దిస్తానంటోంది నటి వరలక్ష్మీ శరత్‌కుమార్. కోలీవుడ్‌లో డేరింగ్ నటిగా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ. ఎలాంటి పాత్రనైనా సవాల్‌గా తీసుకుని నటిస్తూ నటిగా తన ప్రత్యేకతను చాటు కుంటున్నారు. ప్రస్తుతం వరలక్ష్మీశరత్‌కుమార్ చేతిలో అరడజను చిత్రాలకు పైగా ఉన్నాయి. వాటిలో కొన్ని కమర్షియల్ హీరోయిన్ పాత్రలు, మరి కొన్ని లేడీ ఓరియంటెడ్ పాత్రలు, ఇంకొన్ని విలనిజాన్ని ప్రదర్శించే పాత్రలతో కూడిన చిత్రాలు ఉండటం విశేషం. వరలక్ష్మీ శరత్‌కుమార్ విలనిజాన్ని ప్రదర్శించిన సర్కార్ చిత్రం ఈ మధ్య విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ధనుష్‌తో నటించిన మారి–2 చిత్రం ఈ నెల 21వ తేదీన తెరపైకి రానుంది. ఈ అమ్మడు ఇటీవల ఒక అవార్డుల వేడుక కార్యక్రమంలో పాల్గొంది. అక్కడ ఒక వ్యాఖ్యాత ఆమెతో ఒక ముద్దు ఇవ్వాల్సివస్తే, ఒకరిని చంపాల్సివస్తే, ఒకరిని పెళ్లి చేసుకోవాల్సివస్తే ఈ మూడు విషయాల్లో మీ చాయిస్ ఎవరు? అని ప్రశ్నించగా ఈ సంచలన నటి ఏమాత్రం తడుముకోకుండా ముద్దు శింబుకు ఇస్తానని చెప్పింది. ఇక చంపాల్సివస్తే అది విశాల్‌నేనని అంది. పెళ్లి మాత్రం వేరెకరిని చేసుకుంటానని బదులిచ్చింది. ఈ అమ్మడు తొలిసారిగా శింబుతో కలిసి పోడా పోడీ చిత్రంతో కథానాయకిగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఇక నటుడు విశాల్‌తో కలిపి ఈ బ్యూటీ గురించి చాలా వదంతులు ప్రచారంలో ఉన్న విషయం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అదే విధంగా సండైకోళి–2 చిత్రంలో విశాల్‌కు పత్రినాయకిగా నటించి అదరగొట్టిన విషయం తెలిసిందే. -
అత్తారింటికి దారేది.. దించేశారు
తెలుగులో ఘనవిజయం సాధించిన ‘అత్తారింటికి దారేది’ సినిమాను కోలీవుడ్‌లో ‘వంత రాజవథాన్ వరువెన్’ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరిగరాసింది. ఈ సినిమా తమిళ్ రీమేక్‌లో పవన్‌కల్యాణ్ పాత్రలో శింబు నటించనుండగా.. ఆయనకు జోడీగా మేఘాఆకాష్, కేథరిన్ థెరీసా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర అయిన అత్త పాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నారు. ఈ చిత్రానికి సుందర్.సి దర్శకుడు. లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్ర టీజర్ తాజాగా విడుదలైంది. తొలిసారి సుందర్- శింబు జతకట్టడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఫన్, సెంటిమెంట్, ఎమోషన్స్‌తో తెలుగులో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన అత్తారింటికి దారేది.. విమర్శకులచే ప్రశంసలు అందుకుంది. ‘వంత రాజవథాన్ వరువెన్’ టీజర్లోనూ అవే ఎలిమెంట్స్‌తో, కథ కథనంలో ఎలాంటి మార్పులు చేయకుండానే చిత్రాన్ని తెరకెక్కిచ్చినట్టు కొట్టొచ్చినట్టు తెలుస్తోంది. ఇందులోని సీన్స్ చాలా భాగం తెలుగు వర్షన్ మాదిరిగానే ఉన్నాయి. ఈ చిత్రంలో ప్రభు, నాజర్, యోగిబాబు, మోట్టా రాజేంద్రన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తున్నారు. -
నెక్ట్స్ ఏంటి?
రిజల్ట్‌తో సంబంధం లేకుండా చేసే ప్రతీ ప్రాజెక్ట్‌తో అభిమానుల్లో అంచనాలు పెంచగల దర్శకుడు మణిరత్నం. ఆయన ప్రతీ రిలీజ్ తర్వాత అభిమానుల నుంచి వినిపించే ప్రశ్న నెక్ట్స్ ఏంటి? అని. మణిరత్నం దర్శకత్వం వహించిన లేటెస్ట్ సినిమా ‘చెక్క చివంద వానమ్’ (తెలుగులో ‘నవాబ్’) మంచి సక్సెస్ అయింది. తాజాగా మణిరత్నం నెక్ట్స్ విజయ్‌తో సినిమా చేస్తారనే వార్తలు కోలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. ‘చెక్క చివంద..’ సినిమాలానే విజయ్, విక్రమ్, శింబు కాంబినేషన్లో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారన్నది మరో వార్త. మరి.. మణిరత్నం నెక్ట్స్ సినిమా ఏంటి? అంటే.. అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడటమే. -
పొంగల్ పోరులో...
సినిమా రిలీజ్‌లకు ‘బెస్ట్ సీజన్స్’లో సంక్రాంతి ఒకటి. తెలుగువారికి సంక్రాంతి అంటే తమిళంలో ‘పొంగల్’. మూడు నాలుగు రోజుల స్కూల్ సెలవులను, ఆఫీస్ సెలవులను క్యాష్ చేసుకోవడానికి సరైన సమయం. వచ్చే ‘పొంగల్ పోరు’లో నిలిచేది ఎవరు? అనేది ఇప్పుడు తమిళనాడు కోడంబాక్కమ్ ఏరియాలో హాట్ టాపిక్. మనకు ఫిల్మ్ నగర్ అయితే.. అక్కడ కోడంబాక్కమ్ అన్నమాట. ఇక.. పొంగల్ సందడి గురించి తెలుసుకుందాం. 4 రోజుల ముందే పండగ పండగ స్టార్ట్ అవ్వడానికి 4 రోజులు ముందే ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు సూపర్ స్టార్ రజనీకాంత్. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన ‘పేట్టా’ చిత్రం జనవరి 10న విడుదల కానుందని సమాచారం. ‘బాషా’ (1995) సినిమా తర్వాత రజనీకాంత్ నటించిన ఏ సినిమా కూడా పొంగల్‌కి రిలీజ్ కాలేదు. అందుకే పొంగల్‌కి ‘పేట్టా’ అనగానే అభిమానుల హృదయాలు ఆనందంతో ఉప్పొంగాయి. ‘బాషా’ సినిమాలో రజనీకాంత్ రెండు క్యారెక్టర్స్‌లో కనిపిస్తారు. ‘పేట్టా’ సినిమాలో కూడా రజనీకాంత్‌కు చెందిన రెండు డిఫరెంట్ లుక్స్‌ను ఆల్రెడీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. మరి.. ‘బాషా’ రేంజ్లో ‘పేట్టా’ కూడా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుందా? లేదా అని తెలియడానికి కాస్త టైమ్ ఉంది. ఇంకో విశేషం ఏంటంటే... దాదాపు 15ఏళ్లుగా ఇండస్ట్రీలో కథానాయికగా ఉన్న త్రిష కెరీర్లో తొలిసారి రజనీకాంత్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న చిత్రమిది. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తొలిసారి తమిళ సినిమాలో నటించారు. సిమ్రాన్, విజయ్ సేతుపతి, మాళవికా మోహనన్, మేఘా ఆకాష్, సనత్‌రెడ్డి, బాబీ సింహాలతో పాటు డైరెక్టర్లు మహేంద్రన్, శశికుమార్ నటించిన ఈ సినిమాకు అనిరు«ద్ రవిచంద్రన్ సంగీతం అందించారు. ఈ ఏడాది జూన్‌లో ‘కాలా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రజనీకాంత్ ‘2.ఓ’ సినిమాతో ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మళ్లీ 45 రోజులకే థియేటర్స్‌లో కనిపించనుండటం విశేషం. సంక్రాంతికి ‘పేట్టా’గా వస్తున్నారు. జస్ట్ ఏడు నెలల్లో రజనీకాంత్ నటించిన మూడు సినిమాలు రావడం అంటే ఫ్యాన్స్‌కు పండగే కదా. తలైవర్ వర్సెస్ తల? అజిత్ ‘విశ్వాసం’ సినిమాతో పొంగల్‌కి రాబోతున్నారు. శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నయనతార కథానాయిక. ‘వీరమ్, వేదాలం, వివేగమ్’ వంటి హిట్ మూవీస్ తర్వాత అజిత్–శివ కాంబినేషన్లో వస్తోన్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో అంచనాలు ఉన్నాయి. ఇటీవలే రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను బట్టి అజిత్ ‘విశ్వాసం’ సినిమాలో డ్యూయల్ రోల్ చేశారని తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. మరి.. బాక్సాఫీస్ వద్ద తలైవర్ రజనీకాంత్‌తో తల అజిత్‌కు పోరు తప్పదా? అంటే అదేం లేదు అంటున్నాయి కోడంబాక్కమ్ వర్గాలు. ‘పేట్టా’ సినిమా జవనరి 10కి రిలీజ్ కానుందట. ‘విశ్వాసం’ చిత్రాన్ని జనవరి 14కి ప్లాన్ చేస్తున్నారు. సో.. 4 రోజులు గ్యాప్ ఉంది. ‘నో వార్’ అని జోస్యం చెబుతున్నారు. కానీ అధికారికంగా విడుదల తేదీని రెండు చిత్రవర్గాలూ ప్రకటించలేదు. అయితే రెండూ జనవరిలో విడుదలవ్వడం ఖాయం. ‘విశ్వాసం’లో అజిత్ రాజులా వస్తాను శింబు హీరోగా సుందర్. సి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వందా రాజావాదాన్ వరువేన్’. తెలుగు హిట్ ‘అత్తారింటికి దారేది’ సినిమాకు ఇది రీమేక్. ఇందులో మేఘా ఆకాష్, కేథరిన్ కథానాయికలు. ఈ సినిమా కూడా పొంగల్ రేస్‌లో నిలిచింది. అయితే పేట్టా, విశ్వాసం సినిమాలు పొంగల్‌కి వస్తున్నాయి కాబట్టి ‘వందా రాజావాదాన్ వరువేన్’ సినిమా పొంగల్ తర్వాత రిలీజ్ అవుతుందని అనుకున్నారు. కానీ పొంగల్‌కి వరోమ్ (పొంగల్‌కి వస్తున్నాం) అని ఓ స్టేట్మెంట్ను రిలీజ్ చేశారు శింబు. అలాగే తన గురించి కోలీవుడ్‌లో వినిపిస్తున్న రెడ్ కార్డ్ (‘ఏఏఏ’ సినిమాకి సంబంధించిన సమస్యని ఉద్దేశించి) గురించి కూడా ఆందోళన చెందవద్దని కూడా ఆ స్టేట్మెంట్లో పేర్కొన్నారు శింబు. ‘వందా రాజావాదాన్ వరువేన్’లో శింబు బాలాజీ ఎల్కేజీ ఇంతకాలం హాస్యనటుడిగా వెండితెరపై ప్రేక్షకులను నవ్వించారు ఆర్జే బాలాజీ. ఇంతకు ముందు రేడియో జాకీగా వర్క్ చేశారు. ప్రస్తుతం ఆయన లీడ్ రోల్ చేస్తున్న సినిమా ‘ఎల్.కే.జీ’. టైటిల్ బట్టి ఇదేదో చిన్న పిల్లల సినిమా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇది పొలిటికల్ సెటైరికల్ మూవీ. ఇందులో ప్రియా ఆనంద్ కథానాయికగా నటిస్తున్నారు. ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను పొంగల్‌కి రిలీజ్ చేస్తున్నట్లు ఆర్జే బాలాజీ తెలిపారు. మరి... రజనీకాంత్, అజిత్, శింబు వంటి స్టార్స్ సినిమాలు వస్తున్న టైమ్‌లో బాలాజీ ‘ఎల్.కే.జీ’ వస్తే? రావాలంటే దమ్ముండాలి. సినిమా మీద బోలెడంత నమ్మకం ఉండాలి. ఈ చిత్రబృందానికి ఈ రెండూ ఉన్నట్లున్నాయి. అందుకే పొంగల్ పోరుకి రెడీ అవుతున్నారు. ‘ఎల్కేజీ’లో ఆర్జే బాలాజీ -
ఇండియన్ 2లో ఇరుక్కారా?
తెలుగు హిట్ ‘అత్తారింటికి దారేది’ తమిళ రీమేక్ ‘వందా రాజావాదాన్ వరువేన్’ సినిమాతో బిజీగా ఉన్నారు శింబు. ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరి శింబు నెక్ట్స్ చిత్రం ఏంటీ? అంటే ‘ఇండియన్ 2’ అంటున్నారు కోలీవుడ్ సినీ వాసులు. కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్వకత్వంలో రూపొందనున్న సినిమా ‘ఇండియన్ 2’. ఇటీవల ఈ సినిమా సెట్ వర్క్ కూడా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. 1996లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు ఇది సీక్వెల్. కాజల్ అగర్వాల్ కథానాయికగా ఎంపికయ్యారని, మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ఓ కీ రోల్ చేయబోతున్నారనీ ప్రచారం సాగుతోంది. ‘ఇండియన్ 2’లో శింబు కూడా భాగమయ్యారన్నది తాజా టాక్. ఇందులో శింబు స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేయబోతున్నారని సమాచారం. వచ్చే నెలలో ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ కానుందట. మరి.. ఈ సినిమాలో శింబు ఇరుక్కారా (ఉన్నారా)? లేదా? అనేది అప్పుడు తెలిసిపోతుంది. -
మరోసారి అత్తగా..
ఇటీవల వచ్చిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రంలో పవర్ఫుల్ అత్తగా కనిపించిన రమ్యకృష్ణ మరోసారి అత్త పాత్రలో కనిపించబోతున్నారు. తెలుగు హిట్ చిత్రం ‘అత్తారింటికి దారేది’ తమిళంలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. సుందర్ సి. దర్శకత్వంలో శింబు హీరోగా నటిస్తున్నారు. ముందుగా నదియా పాత్రలో ఖుష్భు కనిపిస్తారని వార్తలు వచ్చాయి. తాజాగా శింబు అత్త పాత్రను రమ్యకృష్ణ పోషించనున్నారట. ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా మేఘా ఆకాశ్, కేథరీన్ థెరీసా నటిస్తున్నారు. ఫైనల్‌గా అత్త దొరికేసింది. ఇక అత్తారింటికి దారి వెతికే పనిలో బిజీ అయ్యారు శింబు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. -
మరదలు దొరికింది
అత్తారింటికి దారి కనుక్కునే పనిలో తమిళ హీరో శింబు బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఆయనతో ప్రయాణానికి కేథరిన్ కూడా తోడయ్యారట. సుందర్ సి. దర్శకత్వంలో శింబు హీరోగా తెలుగు హిట్ చిత్రం ‘అత్తారింటికి దారేది’ రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మేఘా ఆకాశ్ ఓ హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కేథరిన్ థెరీసా కూడా తోడయ్యారు. దీంతో బావకు ఇద్దరు మరదళ్లు దొరికారు. తెలుగులో సమంత, ప్రణీత కథానాయికలుగా నటించిన విషయం తెలిసిందే. మరి.. మేఘా, కేథరిన్ ఏయే పాత్రలు చేస్తారన్నది ఇంకా బయటకు రాలేదు. అలాగే శింబుకు అత్తగా ఎవరు నటిస్తారన్నది కూడా చిత్ర బృందం వెల్లడించలేదు. ఖుష్బూ పేరును పరిశీలిస్తున్నారని సమాచారం. -
నవాబ్ వస్తున్నాడు
శింబు, విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అరుణ్ విజయ్, జ్యోతిక, ఐశ్వర్యా రాజేష్, అదితీరావ్ హైదరి, జయసుధ, ప్రకాశ్‌రాజ్ ముఖ్య తారలుగా రూపొందిన మల్టీస్టారర్ ‘నవాబ్’. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు రిలీజ్ హక్కులను అశోక్ వల్లభనేని సొంతం చేసుకున్నారు. నాని ‘సెగ’, గౌతమ్‌మీనన్ ‘ఎర్ర గులాబీలు’ చిత్రాలను విడుదల చేయడంతో పాటు నాగశౌర్య ‘ఛలో’, రాజశేఖర్ ‘పీఎస్వీ గరుడవేగ’ వంటి చిత్రాలకు ఫైనాన్స్ చేశారు అశోక్. ‘నవాబ్’ గురించి అశోక్ మాట్లాడుతూ– ‘‘తమిళంలో ‘చెక్క చివంద వానం’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘నవాబ్’ పేరుతో ఈ నెల 27న తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన చిత్రమిది. ఈ నెల 25న హైదరాబాద్‌లో జరగనున్న ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుకలో మణిరత్నం, ఏఆర్ రెహమాన్ పాల్గొంటారు’’ అన్నారు. -
మామియార్ వీట్టుక్కు...
అత్తను తీసుకురావడానికి మేనల్లుడు శింబు తన ప్రయత్నాలను మొదలెట్టేశారు. మరి అత్తను తిరిగి ఇంటికి తీసుకురావడానికి ఎలాంటి పథకాలను రచిస్తున్నాడు? అత్తారింటికి దారిని ఎలా కనుక్కున్నాడో తెలుగు సినిమా చూసినవాళ్లకు తెలుసు. తమిళంలో మామియార్ వీట్టుకు (అత్తారింటికి) అడ్రస్ ఎలా కనిపెడతాడో చూడాలి. శింబు హీరోగా సుందర్ సి. దర్శకత్వంలో తెలుగు హిట్ చిత్రం ‘అత్తారింటికి దారేది’ రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మేఘా ఆకాశ్ కథానాయిక. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జార్జియాలో ఆరంభమైంది. ఇందులో శింబుకు అత్తగా అప్పటి స్టార్ హీరోయిన్, దర్శకుడు సుందర్ భార్య ఖుష్బు యాక్ట్ చేయనున్నారట. చిత్రబృందం మాత్రం ఆ విషయంలో అప్డేట్ ఇవ్వలేదు. -
శింబుపై మద్రాస్ హైకోర్టు సీరియస్
సాక్షి, చెన్నై : నటుడు శింబుపై మద్రాసు హైకోర్టు సీరియస్ అయ్యింది. నిర్మాత నుండి తీసుకున్న అడ్వాన్స్ వడ్డితో సహా చెల్లించాలని ఆదేశించింది. డబ్బు చెల్లించకపోతే ఇల్లు, ఇతర ఆస్తులు జప్తు చేయాల్సి వస్తుందని న్యాయస్థానం హెచ్చరించింది. ప్యాషన్ మూవీ మేకర్స్ దగ్గర అరాసన్ చిత్రంలో హీరోగా నటించేందుకుగానూ 2013 జూన్ 17న రూ. 50 లక్షలు అడ్వాన్స్‌గా శింబు తీసుకున్నారు. అయితే అనుకున్న ప్రకారం శింబూ ఆ ప్రాజెక్టులో నటించకపోవడంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. శింబు వడ్డీతో సహాకలిపి రూ.85 లక్షలు ప్యాషన్ మూవీ మేకర్స్‌కు చెల్లించాలని కోర్టు పేర్కొంది. -
అతిథిలా వచ్చాడు
రేడియో జాకీగా రేడియో స్టేషన్లో ఫుల్ బిజీగా యాంకరింగ్ చేస్తున్నారు జ్యోతిక. ఇంతలో అక్కడికి శింబు గెస్ట్‌గా వచ్చారు. వెంటనే వాతావరణం అంతా సందడి సందడిగా మారిపోయింది. ఇదంతా తమిళ చిత్రం ‘కాట్రిన్ మొళి’ కోసమే. జ్యోతిక ప్రధాన పాత్రలో హిందీ హిట్ చిత్రం ‘తుమ్హారీ సులు’ రీమేక్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శింబు అతిథి పాత్రలో కనిపించనున్నారు. దానికి సంబంధించిన సీన్స్‌ను రీసెంట్గా షూట్ చేశారు. ఈ చిత్రంలో జ్యోతిక బాస్ పాత్రలో మంచు లక్ష్మీ కనిపించనున్నారు. రాధామోహన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. -
తర్వాత ఏంటి?
‘మహానటి’ సూపర్ సక్సెస్ తర్వాత ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదు కీర్తీ సురేశ్. తమిళంలో విక్రమ్‌తో చేస్తున్న ‘సామి స్క్వేర్’, విశాల్‌తో చేస్తున్న ‘సండై కోళి 2’ (పందెం కోడి 2).. ఈ రెండూ కూడా ‘మహానటి’కి ముందు కమిట్ అయిన సినిమాలే. ఈ రెండు సినిమాల తర్వాత ఏంటి? అంటే.. తాజాగా కోలీవుడ్‌లో వినిపిస్తున్న వార్త ప్రకారం శింబుతో దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించనున్న సినిమాలో హీరోయిన్గా కీర్తీ సురేశ్ పేరును పరిశీలిస్తున్నారట. ఈ చిత్రానికి ‘అదిరడి’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. ఒకవైపు చెన్నై ఫిల్మ్‌నగర్‌లో టైటిల్, హీరోయిన్ గురించి జోరుగా వార్తలు షికారు చేస్తుంటే, దర్శకుడు వెంకట్ ప్రభు మాత్రం ‘‘టైటిల్, నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం. టైటిల్ మాత్రం ‘అదిరడి’ కాదు. కొత్త టైటిల్ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది’’ అని పేర్కొన్నారు. -
వెయ్యి కోట్లున్నాయి
షూటింగ్‌కి టైమ్‌కి రాడు. శింబుతో సినిమా అంటే అనుకున్న టైమ్‌కి కంప్లీట్ అవ్వదు. ఇలాంటి కామెంట్స్ వినిపిస్తుంటాయి శింబుతో వర్క్ చేసిన దర్శక – నిర్మాతల దగ్గరి నుంచి. ‘‘నా మీద ఉన్న ఈ నెగటీవ్ కామెంట్స్ అన్నింటినీ చెరిపేసుకుంటాను. ప్రస్తుతం దాని మీదే వర్కౌట్ చేస్తున్నాను’’ అన్నారు శింబు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ – ‘‘హీరోగా నా తొలి సినిమాని మా నాన్న (టి. రాజేందర్)గారితో చేసినప్పుడు షూటింగ్‌కి పది గంటలకు వెళ్లేవాణ్ని. అలాగని నాకెవరన్నా లెక్కలేదని కాదు. మా నాన్నే కదా అని గ్రాంటెడ్‌గా తీసుకున్నట్లూ కాదు. అది నా లైఫ్ స్టైల్. నేను చాలా గారంగా పెరిగాను. చిన్నప్పటి నుంచి కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తూ వచ్చాను. నాకు వెయ్యి కోట్లు పైగా ఆస్తులున్నాయి. వాటితో విలాసవంతమైన జీవితాన్ని గడపొచ్చు. కానీ నాకు సినిమాలంటే పిచ్చి ప్రేమ. సినిమా ఒక్కటే తెలుసు. వేరే వాళ్లను ఇబ్బంది పెట్టాలని, హర్ట్ చేయాలనీ నాకెప్పుడూ లేదు. నా మీద ఉన్న బ్యాడ్ కామెంట్స్ అన్నీ క్లియర్ చేసే దిశగా వర్క్ చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు శింబు. అంటే.. శింబు ఇక టైమ్‌కి షూటింగ్‌కి ఎటెండ్ అవుతారా? టైమే చెప్పాలి. -
ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్
...అని తమిళ నటుడు విజయ్ సేతుపతి అంటున్నారు. మరి.. ఆ అన్ఎక్స్పెక్టెడ్ విషయం ఎంటో ‘నవాబ్’ సినిమాలో చూడాల్సిందే. మణిరత్నం దర్శకత్వంలో అరవింద స్వామి, శింబు, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్, జ్యోతిక, ఐశ్వర్యా రాజేశ్, అదితీరావ్ హైదరీలు ముఖ్య తారలుగా రూపొందుతోన్న సినిమా ‘చెక్కా చివంద వానమ్’. తెలుగులో ‘నవాబ్’. ఈ చిత్రంలోని కీలక సన్నివేశాలను అబుదాబిలో షూట్ చేశారట. తాజాగా ఈ సినిమాలో విజయ్ సేతుపతి షూటింగ్ పార్ట్ పూర్తయ్యింది. ‘‘మణిరత్నంగారితో వర్క్ చేయడాన్ని గౌరవంగా ఫీలవుతున్నా. కల నిజమైనట్లుంది. ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ ఇన్ ‘నవాబ్’’ అన్నారు విజయ్ సేతుపతి. రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో తన పాత్ర గురించి విజయ్ మాట్లాడుతూ –‘‘కార్తీక్‌పై నాకు నమ్మకం ఉంది. ఇంకా స్క్రిప్ట్ వినలేదు. రజనీసార్‌తో నటించబోతున్నందుకు హ్యాపీ’’ అన్నారు. చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ‘సైరా’ చిత్రంలో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. -
నలుగురి గురి.. సింగిల్ టార్గెట్!
ఒక పోలీస్, ఇంజనీర్, రాజకీయ నాయకుడు, రౌడీ.. ఈ నలుగురి ప్రొఫెషన్స్ వేరు అయినా టార్గెట్ మాత్రం ఒక్కటే. అయితే ఈ టార్గెట్‌ను గెలిచి ఎవరు నవాబ్‌గా నిలుస్తారో తెలుసుకోవాలంటే మాత్రం ‘చెక్క చివంద వానమ్’ చూడాల్సిందే. శింబు, విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అరుణ్ విజయ్, జ్యోతిక, అతిదీ రావ్ హైదరీ, ప్రకాశ్‌రాజ్ ముఖ్య తారలుగా తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న మల్టీస్టారర్ మూవీ ఇది. తెలుగులో ‘నవాబ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఓ న్యూక్లియర్ ప్రాజెక్ట్ చుట్టూ సినిమా కథాంశం సాగుతుందని సమాచారం. శింబు, విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అరుణ్ విజయ్ల్లో ఒకరు పోలీస్‌గా, మరొకరు రాజకీయ నాయకుడిగా, ఇంకొకరు ఇంజనీర్‌గా నటిస్తున్నారని చెన్నై ఇండస్ట్రీ టాక్. ఈ సినిమాలో అరవింద్ స్వామికి జోడీగా జ్యోతిక నటిస్తున్నారన్నది తాజా సమాచారం. ఆల్రెడీ రీసెంట్గా జరిగిన షూట్లో వీరిపై పెళ్లి సీన్ కూడా షూట్ చేశారట. సగానికి పైగా షూట్‌ను కంప్లీట్ చేసుకున్న ‘నవాబ్’ చిత్రాన్ని ఈ ఏడాది ద్వితీయార్ధంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
నలుగురిలో నవాబ్ ఎవరు?
నవాబ్.. అనుకున్నంత ఈజీ కాదు అవ్వడం. ఆరాటపడేవారు, పోరాడేవారు, లాక్కోవాలనుకునేవారు, కష్టపడి దక్కించుకునేవారు... అందరూ లిస్ట్‌లో ఉంటారు. ప్రస్తుతం ఆ లిస్ట్ డైరెక్టర్ మణిరత్నం దగ్గర ఉంది. సినిమాలో నవాబ్ ఎవరన్నది తెరపై చూడాల్సిందే అంటున్నారాయన. అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, శింబు, అరుణ్ విజయ్, జ్యోతిక, అదితీరావ్ హైదరి, ఐశ్వర్య రాజేష్, ప్రకాశ్‌రాజ్ ముఖ్యతారలుగా మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేయనున్నారు. తమిళ్లో ‘చెక్కవంద వానమ్’ (ఎర్రని ఆకాశం తెలుగులో)అని, తెలుగులో ‘నవాబ్’ అనే టైటిల్స్‌ను ఖరారు చేశారు. శుక్రవారం టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. మరి.. ఎవరు నవాబ్? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ సినిమాలో ఓ ఇద్దరు హీరోలు అన్నదమ్ముల పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమాలో న్యూ లుక్‌లో కనిపించడానికి హీరో శింబు ఆల్రెడీ వర్కౌట్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. మదరాస్ టాకీస్ పతాకం, లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ సినిమాకు సంగీతం: ఏఆర్ రెహమాన్. -
రత్నం లాంటి చాన్స్
మరోసారి గోల్డెన్ ఛాన్స్ కొట్టేశారు అదితీరావ్ హైదరి. మణిరత్నం సినిమాలో హీరోయిన్ ఛాన్స్ అంటే గోల్డెన్.. గోల్డెన్ ఏంటి? డైమండ్ అని కూడా అనొచ్చేమో. ‘‘మణిరత్నంగారి దర్శకత్వంలో గతేడాది ‘చెలియా’ చేశాను. ఆ తర్వాత సంజయ్‌దత్ సినిమా ‘భూమి’లో కీలక పాత్ర చేశాను. గతేడాది చాలా పాజిటివ్‌గా గడిచింది. ఇప్పుడు మణి సార్ సినిమాలో మళ్లీ నటించబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతానికి నా క్యారెక్టర్ డిటైల్స్ సీక్రెట్’’ అని పేర్కొన్నారు అదితీరావ్ హైదరి. ప్రజెంట్ మణిరత్నం దర్శకత్వంలో విజయ్‌సేతుపతి, శింబు, జ్యోతిక, ఐశ్యర్య రాజేష్, ఫాజల్ కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకే అదితీని తీసుకున్నారట మణి. ఇటీవల ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. -
శింబుపై చర్యలేవి.?
నటుడు శింబుపై చర్యలేవి అంటూ నిర్మాత పీఎల్.తేనప్పన్ ప్రశ్నించడంతో ఒక ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం రచ్చరచ్చగా మారింది. వివరాల్లోకి వెళితే నిర్మాత మైకెల్ రాయప్పన్ ఇంతకు ముందు శింబు కథానాయకుడిగా అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఫ్లాప్ అయ్యింది. అయితే ఈ చిత్రంతో తాను రూ. 20 కోట్లకు పైగా నష్ట పోయానని, అందుకు కారణం నటుడు శింబునే అని చెప్పారు. తాను సరిగా షూటింగ్‌కు రాకపోవడంతోనే షూటింగ్ ఆగిందని నిర్మాత మైకెల్ రాయప్పన్ నిర్మాతల మండలిలో శింబుపై ఫిర్యాదు చేశారు. తాను నష్టపోయిన రూ. 20 కోట్లను శింబు చెల్లించాలని అందులో పేర్కొన్నారు. అదే నిర్మాత తాజాగా జీవా, నిక్కీగల్రాని జంటగా ‘కీ’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమంలో నటుడు, నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ పాల్గొన్నారు. మరో అతిథిగా పాల్గొన్న నిర్మాత పీఎల్. తేనప్పన్ మాట్లాడుతూ ఈ చిత్ర నిర్మాత మైకెల్ రాయప్పన్ నటుడు శింబుపై నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసినా, ఆయనపై చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏమిటని విశాల్‌ను ప్రశ్నించారు. దీంతో విశాల్‌కు అనుకూలంగా విన్నర్ చిత్ర నిర్మాత రామచంద్రన్ ఈ ప్రస్తావన ఇక్కడ అప్రస్తుతం అని అనడంతో వాగ్వాదం రచ్చగా మారింది. అనంతరం విశాల్ మాట్లాడుతూ మైకెల్‌రాయప్పన్ ఫిర్యాదుపై నటుడు శింబును వివరణ కోరామని, అయితే ఆయన స్పందించలేదని తెలిపారు. ఈ సమస్యపై త్వరలోనే చర్చిస్తామని చెప్పారు. నిర్మాతలకు మంచే జరుగుతుందని విశాల్ అన్నారు. తాను మైకెల్ రాయప్పన్ నిర్మించిన కీ చిత్రం కోసం ఫిబ్రవరి 9వ విడుదల చేయాల్సిన తన చిత్రం ఇరుంబుతిరై చిత్రాన్ని మరోసారి వాయిదా వేసుకుంటున్నానని తెలిపారు. అదే విధంగా ఆయన సంస్థలో తాను పారితోషికం తీసుకోకుండా నటించడానికి సిద్ధం అని, ఆ చిత్ర విజయం సాధిస్తే అప్పుడు పారితోషికం తీసుకుంటానని విశాల్ అన్నారు. -
శింబు ఫిక్స్
‘ముందుగా అనుకున్న అందరూ ఉన్నారు. ఆ హీరో ప్లేస్ ఒక్కటే డౌట్. మలయాళ హీరో నివిన్ పౌలీని అతని ప్లేస్‌లో సంప్రదించారు’... ఇది నిన్న మొన్నటి వరకు కోలీవుడ్‌లో మణిరత్నం మెగా మల్టీస్టారర్ సినిమా గురించి వినిపించిన వార్త. అతను శింబు అని ఊహించే ఉంటారు. శింబు, విజయ్ సేతుపతి, జ్యోతిక, అరవింద్ స్వామి, ఐశ్యర్య రాజేష్, ఫాజిల్ ముఖ్య పాత్రల్లో మణిరత్నం ఓ మెగా మల్టీస్టారర్ మూవీ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే శింబు ఈ ప్రాజెక్ట్‌లో ఉంటారా? లేదా అనే సందేహం చాలామందికి ఉండేది. దానికి కారణం అతను తమిళంలో చేసిన ‘అన్బానవన్ అసరాదవన్, అడంగాదవన్ (ఏఏఏ) సినిమా వివాదంలో చిక్కుకుంది. శింబుపై ఈ చిత్రనిర్మాత మైఖేల్ రాయప్పన్ కొన్ని ఆరోపణలు చేశారు. దీంతో ఈ హీరోగారిపై కోలీవుడ్‌లో కొంతకాలం వేటు పడుతుందన్న వార్తలు వచ్చాయి. అయితే ఈ వివాదం ఇప్పుడు సద్దుమణిగింది. దాంతో మణిరత్నం మెగా మల్టీస్టారర్ మూవీలో శింబునే ఫైనల్ అయ్యారు. అంతేకాదు మణిరత్నం స్టార్ట్ చేసిన యాక్టర్స్ వర్క్ షాష్‌కు కూడా శింబు హాజరవుతున్నారు. జనవరిలో షూటింగ్ ఆరంభం కానుంది. -
నా తప్పూ ఉంది!
తమిళసినిమా: నా తప్పు లేదని అనడం లేదు. ఉంది అయితే..అని వ్యాఖ్యానించారు సంచలన నటుడు శింబు. ఆయనపై నిర్మాత మైఖెల్‌రాయప్పన్ అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రానికి నష్టపోయిన రూ.20 కోట్లు చెల్లించాలంటూ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.ఆ వ్యవహారం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. శింబుపై రెడ్ కార్డ్ వేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నటుడు సంతానం హీరోగా నటించిన చక్క పోడు పోడు రాజా చిత్రాన్ని నటుడు వీటీవీ, గణేశన్ నిర్మించారు. సేతురామన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారా నటుడు శింబు సంగీత దర్శకుడగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం సాయంత్రం స్థానిక ట్రిబుల్కేన్లోని కలవానర్ ఆవరణలో జరిగింది. ఆ కార్యక్రమంలో నటుడు ధనుష్ ఆడియోను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ తానిక్కడికి శింబు ఆహ్వానం మేరకే వచ్చానన్నారు. తామిద్దరి మధ్య స్నేహమే ఉందన, కొందరు అనుకుంటున్నట్లు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు. తమ మధ్య ఉన్న వాళ్లకే సమస్యలు ఉన్నాయని, వాళ్లే తమ మధ్య సమస్యలు సృష్టిస్తున్నారని అన్నారు. శింబు ఆయన అభిమానులకోసం ఏడాదికి రెండు చిత్రాలైనా చేయాలని, ఆయన అభిమానుల తరఫున తాను విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. మణిరత్నం నా అభిమానేమో అనంతరం నటుడు శింబు మాట్లాడుతూ తన మిత్రుడు సంతానం కోరిక మేరకే ఈ చిత్రానికి సంగీతాన్ని అందించానన్నారు.అతని ఎదుగుదలకు తానెప్పుడూ పక్కాబలంగా ఉంటానని అన్నారు. ఇటీవల తన గురించి చాలా చర్చ జరిగిందని, అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రం నిర్మాత తనపై ఆరోపణలు చేశారని అన్నారు. తాను తప్పు చేయలేదని చెప్పడం లేదని, అయితే ఆయన చిత్ర షూటింగ్ సమయంలోనో, విడుదలకు ముందో, ఆ తరువాతో ఈ ఆరోపణలు చేస్తే సమంజసంగా ఉండేదని, చిత్రం విడుదలైన ఆరు నెలలకు ఎవరో చెబితే రచ్చ చేయడం ఏమిటని ప్రశ్నించారు.తాను చేసిన తప్పుకు క్షమాపణ చెప్పుకుంటున్నానని అన్నారు. ఇకపోతే తానిప్పుడు మణిరత్నం చిత్రంలో నటించనున్నానని, ఆయన కూడా తన అభిమానో ఏమోగానీ, ఆ చిత్రం నుంచి తనను తొలగించలేదని తెలిపారు.ఈ నెల 20 నుంచి చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు మణిరత్నం చెప్పారని శింబు తెలిపారు. -
అంతా మీ ఇష్టమేనా?
అంతా నటీనటుల ఇష్టమేనా? కథ నచ్చిందనో... పారితోషకం నచ్చిందనో... మరొకటో... ఏవేవో కారణాల వల్ల సినిమా ఒప్పుకుని, తర్వాత ‘తూచ్! నేనీ సినిమా చేయడం లేదు’ అనడం నటీనటుల ఇష్టమేనా?!! కొన్ని రోజులు షూటింగ్ చేసిన తర్వాత సినిమా నుంచి తప్పుకుంటే నిర్మాతల పరిస్థితేంటి? తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి ఇప్పుడీ ప్రశ్నలే వేస్తోంది. అటువంటి నటీనటులపై తప్పకుండా చర్యలు ఉంటాయని చెబుతోంది. చెప్పడమే కాదు... చేతల్లో చూపిస్తోంది! త్రిష, వడివేలు, శింబుల నుంచి వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చింది. ఇంతకీ, ఈ ముగ్గురూ ఏం చేశారంటే.... మీతో సెట్ కాదులే సామి! విక్రమ్ హీరోగా హరి దర్శకత్వంలో 14 ఏళ్ల క్రితం వచ్చిన ‘సామి’లో త్రిష హీరోయిన్. ఇప్పుడు ఆ సిన్మాకి సీక్వెల్‌గా దర్శకుడు హరి ‘సామి స్క్వేర్’ తీస్తు న్నారు. విక్రమ్ హీరో. త్రిష, కీర్తీ సురేశ్‌లను హీరోయిన్లుగా తీసుకున్నారు. అయితే... కొన్ని రోజులు షూటింగ్ చేశాక ‘‘క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ‘సామి–2’ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా. వాళ్లకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా’’ అని త్రిష సినిమాకి ‘గుడ్‌బై’ చెప్పేశారు. దాంతో చిత్రనిర్మాణ సంస్థ తమీన్స్ ఫిలిమ్స్ నిర్మాతల మండలికి కంప్లయింట్ చేసింది. త్రిష తప్పుకోవడంతో మాకెంతో నష్టం ఏర్పడిందని కంప్లయింట్లో పేర్కొన్నారు. పులికేసి... ప్రాబ్లమ్ ఏంటి? హాస్యనటుడు వడివేలు హీరోగా చింబుదేవన్ దర్శకత్వంలో దర్శకుడు శంకర్ ‘ఇమ్సై అరసన్ 23వ పులికేసి’ నిర్మించారు. తమిళంలో మంచి హిట్! తెలుగులో ‘హింసించే 23వ రాజు–పులికేసి’ పేరుతో విడుదల చేస్తే.. ఇక్కడా బాగానే ఆడింది. దానికి సీక్వెల్‌గా సేమ్ టీమ్ ‘ఇమ్సై అరసన్ 24వ పులికేసి’ స్టార్ట్ చేశారు. కొన్ని రోజులు షూటింగ్ చేశారు. త్రిషలా వడివేలుకి కూడా టీమ్‌తో ఏవో క్రియేటివ్ ప్రాబ్లమ్స్ రావడంతో షూట్‌కి రావడం మానేశారు. అప్పుడు చేద్దాం... ఇప్పుడు చేద్దామంటూ డేట్స్ ఇవ్వకుండా అలస్యం చేస్తున్నారట! మరోపక్క ఐదు కోట్ల రూపాయలతో సెట్ వేసిన యూనిట్ ఆయన కోసం వెయిట్ చేస్తోంది. చివరకు, చిరాకు వచ్చి నిర్మాతల మండలికి శంకర్ కంప్లయింట్ చేశారు. శింబు వల్ల 18 కోట్లు హాంఫట్!? త్రిష, వడివేలు ఇష్యూలతో కంపేర్ చేస్తే శింబుది డిఫరెంట్! ఈ యంగ్ హీరో ట్రిపుల్ రోల్ చేసిన సినిమా ‘అన్బానవన్ అసురాదవన్ అడంగాదవన్’. మొన్న జూన్‌లో విడుదలైన ఈ సిన్మా ఫ్లాప్. అయితే విడుదలకు ముందు సినిమాను రెండు పార్టులుగా తీయనున్నట్టు వార్తలొచ్చాయి. అసలు మేటర్ ఏంటంటే... నిర్మాత సింగిల్ పార్టుగానే తీయాలనుకున్నారట! శింబు రెండు పార్టులు తీయాలని వాదించాడట! నిర్మాత కాదనే సరికి ఇప్పటివరకు నేను నటించిన సన్నివేశాలతోనే సినిమా విడుదల చేసుకోమని వదిలేశాడట! కట్ చేస్తే... శింబు షూటింగ్ చేసింది 29 రోజులే. దర్శకుడు ఏవో సర్దుబాట్లు చేసి సినిమా రెడీ చేశారు. ఫ్లాప్ కావడంతో నిర్మాతకు 18 కోట్లు నష్టం వచ్చిందట! శింబు ప్రవర్తన వల్లనే 18 కోట్లు హాంఫట్ అయ్యాయని చిత్రనిర్మాత మైఖేల్ రాయప్పన్ తమిళ చలనచిత్ర నిర్మాతల మండలికి కంప్లయింట్ చేశారు. దాంతో నిర్మాతల మండలి ముగ్గురికీ నోటీసులు పంపించింది. వీళ్ల వివరణతో సంతృపి చెందకపోతే... ఒక్కొక్కరిపై రెండేళ్లు బ్యాన్ విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏం జరుగుతుందో? వెయిట్ అండ్ సీ!! -
అక్టోబరులో హాలీవుడ్‌కు..
తమిళసినిమా: నటుడు శింబుది సపరేట్ భాణీ. సంచలనాలకు కేంద్ర బిందువుగా పేర్కొనే శింబు మరో రికార్డును సృష్టించడానికి రెడీ అవుతున్నారు. అభిమానులు శింబుకు పోటీగా భావించే నటుడు ధనుష్ ఇప్పటికే హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా శింబు కూడా అదే మార్గంలో పయనించడానికి సిద్ధం అయ్యారు. వ్యత్యాసం ఏమిటంటే ధనుష్ హీరోగా హాలీవుడ్లో తెరంగేట్రం చేస్తుంటే, శింబు దర్శకుడిగా పరిచయం కానున్నారు. రెండు నెలల్లో తన చిత్రాన్ని విడుదల చేస్తానని శింబు ఆ మధ్య వెల్లడించారు. అందులో పాటలు ఉండవు, ఇంటర్వెల్ ఉండదు అని చెప్పారు గానీ అది హాలీవుడ్ చిత్రం అని తెలపకుండా సస్పెన్స్ మెయిన్‌టెయిన్ చేశారు. ఆయన చెప్పినట్లుగా అయితే ఈ చిత్రం ఇప్పటికే సెట్‌పైకి వెళ్లాల్సింది. కొందరు ప్రముఖ సాంకేతిక వర్గం ఇతర చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల హాలీవుడ్ చిత్ర ప్రారంభం ఆలస్యం అయ్యిందని శింబు తాజాగా తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ చిత్రానికి మాటలను అందిస్తున్న దర్శకుడు గౌతమ్‌మీనన్ తన ధ్రువనక్షత్రం చిత్ర షూటింగ్‌తోనూ, కెమెరామెన్ సంతోష్‌శివన్ స్పైడర్ చిత్రంతోనూ బిజీగా ఉండటం వల్ల తన హాలీవుడ్ చిత్రం సెట్‌పైకి వెళ్లడానికి కాస్త ఆలస్యం జరిగిందని చెప్పారు. ప్రస్తు తం వాళ్లు ఫ్రీ అవుతుండటంతో అక్టోబరులో హాలీవుడ్ చిత్రం ప్రారంభం కానుందని తెలిపారు. డిసెంబరు చివర్లోగా చిత్రాన్ని పూర్తి చేయనున్నామని చెప్పారు. ఈ చిత్రానికి ఆంటోనీ ఎడిటింగ్, యువన్ శంకర్రా జా నేపథ్యం సంగీతం అందించనున్నారని తెలిపారు. -
అక్కడ జీఎస్టీ 15 శాతమే..!
తమిళసినిమా: తెలుగు చిత్రపరిశ్రమలో 15 శాతం జీఎస్టీ అమలవుతోందని, అక్కడ రాష్ట్రప్రభుత్వం అధనంగా పన్ను విధించడం లేదని సీనియర్ నటుడు, దర్శకుడు టీ.రాజేందర్ పేర్కొన్నారు. ఈయన కొడుకు, నటుడు శింబు కథానాయకుడిగా నటించిన ఇదునమ్మఆళు చిత్రం సరసుడు పేరుతో శుక్రవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకతో పాటు తమిళనాడులోనూ విడుదల కానుంది. తమిళంలో శింబు, నయనతార జంటగా నటించిన ఈ చిత్రాన్ని శింబు ఆర్ట్స్ పతాకంపై టీ.రాజేంద్రన్ నిర్మించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో 50, 60 సన్నివేశాలను రీషూట్ చేసి తెలుగులో నేరుగా టీ.రాజేందర్ విడుదల చేస్తున్నారు. ఇందులో టీ.రాజేందర్ ఒక పాటను రాయడంతో పాటు ఒక పాటను పాడటం విశేషం. సరసుడు చిత్రాన్ని తానే శింబు ఆర్ట్స్ బ్యానర్లో సొంతంగా విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రేమసాగరం చిత్రం నుంచి తనను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే విధంగా శింబు నటించిన పలు తమిళ చిత్రాలు తెలుగులో అనువాదం అయ్యి మంచి విజయాన్ని సాధించాయన్నారు. సరసుడు చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు. -
బడ్జెట్ కాదు..సబ్జెక్ట్ కావాలి..!
బ్రేకప్ తర్వాత శింబు, నయనతార జంటగా నటించిన సినిమా ‘సరసుడు’. పాండిరాజ్ దర్శకత్వంలో టి. రాజేందర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం టి. రాజేందర్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘గతంలో నేను అందించిన ‘ప్రేమసాగరం’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. మా అబ్బాయి శింబు నటించిన ‘వల్లభ’, ‘మన్మధ’ చిత్రాలు కూడా ప్రేక్షకులను మెప్పించాయి. ఇప్పుడు అదే నమ్మకంతో ‘సరసుడు’ చిత్రంతో వస్తున్నాం. నైజాం, ఆంధ్ర, సీడెడ్‌లో మేమే రిలీజ్ చేస్తున్నాం. చిన్న సినిమాకు కావాల్సింది బడ్జెట్ కాదు.. సబ్జెక్ట్ అని నమ్మి ఈ సినిమా చేశాం. మా రెండో అబ్బాయి కురళ్ స్వరపరచిన ఐదు పాటలు ఈ చిత్రానికి ఓ హైలైట్. తెలుగు ప్రేక్షకుల కోసం ఈ సినిమాకి ‘హలో..’ అనే పాట రాశాను. అలాగే ‘బావ వెయిటింగ్..’ అనే పాటను నేనే పాడా’’ అన్నారు. -
మణిరత్నం చిత్రంలో శింబు
తమిళసినిమా: ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన కాట్రువెలియిడై చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో ఆయన తదుపరి చిత్రం ఏమిటన్నది ఆసక్తిగా మారింది. తాజాగా ఒక ఆసక్తికరమైన ప్రచారం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. మణిరత్నం ఒక మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది. అదే ఇప్పుడు వాస్తవం కాబోతోందనిపిస్తోంది. ఆయన తాజా చిత్రంలో విజయ్‌సేతుపతి హీరోగా నటించనున్నారని, అదే విధంగా కథానాయకిగా ఐశ్వర్యరాజేశ్ నటించనున్నారని, మరో ప్రధాన పాత్రలో నటి జ్యోతిక, అదే విధంగా అరవిందస్వామి, ఫాహద్ ఫాజిల్ వంటి ప్రముఖ నటీనటులు కూడా నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ టీమ్‌లోకి సంచలన నటుడు శింబు వచ్చి చేరారు. అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రం నిరుత్సాహపరిచిన తరువాత శింబు నటించే చిత్రం ఏమిటని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆయన అభిమానులకిది సంతోషాన్నిచ్చే వార్తే అవుతుంది. దీనికి మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందించనున్నారు. పాటలను వైరముత్తు రాస్తున్నారట. ఈ చిత్రంతో మణిరత్నం, ఏఆర్.రెహ్మాన్, వైరముత్తుల కలయిక అన్నది రోజా చిత్రం నుంచి అంటే 25 ఏళ్లుగా కొనసాగుతోందన్నది గమనార్హం. ఈ భారీ మల్టీస్టారర్ చిత్రానికి సంతోష్‌శివన్ ఛాయాగ్రణను అందించనున్నారని సమాచారం. రజనీకాంత్ నటించిన దళపతి చిత్రంతో ప్రారంభమైన మణిరత్నం, సంతోష్‌శివన్‌ల కాంబినేషన్ ఆ తరువాత రోజా, ఇరువర్, ఉయిరే, రావణన్ చిత్రాల వరకూ సాగింది. తాజా చిత్రం ఆరోది అవుతుందన్న మాట. ఈ చిత్రాన్ని మణిరత్నం జనవరిలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. -
పాటల్లేవ్ మిత్రమా!
తమిళసినిమా: పాటల్లేవు మిత్రమా, విశ్రాంతి ఉండదు. అందుకే ముందుగానే వాష్‌రూమ్‌కు వెళ్లడం, కూల్డ్రిం క్స్, పాప్‌కార్న్ వంటి తినుబండారాలను కొనుక్కోండి. సమయం కూడా లేదు అభిమానులారా, సెప్టెంబర్‌లోనే వచ్చేస్తున్నా. ఇదంతా ఏమిటనేగా మీ ప్రశ్న. అక్కడికే వస్తున్నాం. నటుడు శింబు న టించిన అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రం భారీ అంచనాల మధ్య ఆ మధ్య తెరపైకి వచ్చి పూర్తిగా నిరాశ పరచిన విషయం తెలిసిందే. దీంతో ఆ చిత్రానికి రెండవ భాగం వస్తుందన్న యూనిట్ వర్గాలు చెప్పినా, అది జరిగేపనేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. మరి నటుడు శింబు తదుపరి చిత్రం ఏమిటన్న ప్రశ్నకు మధ్యలో ఆగిపోయిన కెట్టవన్ చిత్ర బూజు దులపడానికి ఆయన సన్నద్ధం అవుతున్నారని, కాదు బిల్లా–3 చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారనే ప్రచారం జోరందుకుంది. అయితే దీనికి స్పందించిన శింబు ఆ ప్రచారంలో నిజం లేదని, తన తదుపరి చిత్రం గురించి తానే త్వరలో ప్రకటిస్తానని ట్విట్టర్లో పేర్కొని వదంతులకు పుల్‌స్టాప్ పెటా ్టరు. ఇటీవల శింబు తన తాజా చిత్రం గురించి ప్రకటించారు. కెట్టవన్ కెట్టిటిల్ కిట్టిడుమ్ రాజయోగం చిత్రంలో నటిం చనున్నట్లు, దీనికి తన తండ్రి టి.రాజేందర్ నిర్మాత అని తెలిపారు. ఇందులో పాటలు ఉండవని, చిత్ర మధ్యలో విశ్రాంతి కూడా ఉండదని, అం దుకే ప్రేక్షకులు ముందుగానే వాష్‌రూమ్ కార్యక్రమాలను ముగించుకుని థియేటర్లలో చిత్రాన్ని చూడడానికి సిద్ధం కావాలన్నారు. సెప్టెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు శింబు ట్విట్టర్లో పేర్కొన్నారు. -
ఎలా విడిపోయారు?
శింబు, నయనతార పీకల్లోతు ప్రేమలో మునిగి, పెళ్లి దాకా వెళ్లి విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రేమకి ఫుల్స్టాప్ పెట్టాక ఈ మాజీ ప్రేమికులు కలిసి నటించిన తమిళ చిత్రం ‘ఇదు నమ్మ ఆళ్’. పాండిరాజ్ దర్శకత్వంలో ‘ప్రేమసాగరం’ టి.రాజేందర్ సమర్పణలో శింబు సినీ ఆర్ట్స్, జేసన్‌రాజ్ ఫిలింస్‌పై టి.రాజేందర్ నిర్మించిన ఈ చిత్రం ‘సరసుడు’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. టి.రాజేందర్ మాట్లాడుతూ– ‘‘సాఫ్ట్వేర్ రంగంలోని యువతీ యువకులు ఎలా ప్రేమలో పడుతున్నారు? ఎలా విడిపోతున్నారు? చివరికి వారి ప్రేమ పెళ్లిదాకా వస్తుందా? లేదా? అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. మా చిన్నబ్బాయి కుళల్ అరసన్ ఈ చిత్రానికి మంచి సంగీతం అందించాడు. నయనతార, ఆండ్రియా, అదా శర్మ డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో నటించారు. జులైలో ఈ సినిమా రిలీజుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కో–ప్రొడ్యూసర్: శ్రీమతి ఉషా రాజేందర్. -
అందుకోసం ప్రేక్షకులు రారు
ప్రేక్షకులు అందుకోసమే థియేటర్లకు రారు అంటోంది నటి మంజిమామోహన్. గౌతమ్‌మీనన్ అచ్చం యంబదు మడమయడా చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం చేసిన మలయాళీ అమ్మడు మంజిమామోహన్ అన్న సంగతి తెలిసిందే. శింబుతో రొమాన్స్ చేసిన ఈ చిత్రం సక్సెస్ అనిపించుకోవడంతో ఈ బ్యూటీకి అవకాశాలు వరుసకట్టాయి. ఇక్కడి వరకూ బాగానే ఉంది. విక్రమ్‌తో జత కట్టే అవకాశం కూడా అమ్మడి తలుపు తట్టింది. స్కెచ్ చిత్రంలో నటించే అవకాశం వచ్చినా, దాన్ని మంజిమామోహన్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. కారణం ఆ చిత్ర పాటల సన్నివేశాల్లో కాస్త గ్లామర్‌గా నటించాలని దర్శక నిర్మాతలు చెప్పారట. అంతే గ్లామర్‌కు తాను దూరం అని ముందే నిర్ణయించుకున్న మంజిమామోహన్ ఆ నిర్ణయంపైనే స్టాండ్ అయ్యిందట. అందాలారబోతకు ససేమిరా అనడంతో స్కెచ్ చిత్రంలో నటించే అవకాశం మిస్ అయ్యింది. దీంతో ఆ లక్కీ చాన్స్‌ను నటి తమన్నా అందుకుంది. ఇదే విధంగా మరికొన్ని అవకాశాలు పీచే మూడ్ అన్నాయి. అయినా గ్లామర్ విషయంలో తన నిర్ణయం మారదు అంటోంది నటి మంజిమా మోహన్. అంతే కాదు గ్లామర్ కోసం ప్రేక్షకులు సినిమా థియేటర్లకు రారు అని, మంచి కథా చిత్రాలను చూడడానికే వస్తారని తన నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. ప్రస్తుతం మంజిమామోహన్ చేతిలో రెండు తమిళ సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి క్షత్రియన్. విక్రమ్‌ప్రభు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇక మరో చిత్రం ఇప్పడై వెల్లుమ్. ఉదయనిధి స్టాలిన్‌తో జత కడుతున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ రెండు చిత్రాలపైనే అమ్మడి జాతకం ఆధారపడి ఉంది. -
మమ్మల్ని అలా చూడాలనుకోరు
మమ్మల్ని అలా చూడాలనుకుంటున్నారనడం చాలా తప్పు అంటోంది నటి మంజిమామోహన్. అచ్చంయన్బదు మడమయడా చిత్రం ద్వారా సంచలన నటుడు శింబుకు హీరోయిన్గా కోలీవుడ్‌కు దిగుమతి అయిన కేరళా కుట్టి మంజిమామోహన్. మాతృభాషలో ఒరు వడక్కన్ సెల్ఫీ చిత్రంతో హీరోయిన్గా రంగప్రవేశం చేసిన ఈ అమ్మడు ఇప్పుడు తమిళంలో బిజీ నాయకిగా మారింది. ఈ భామను దర్శకుడు గౌతమ్‌మీనన్ ఏక్ ధమ్న తమిళం, తెలుగు భాషల్లో నాయకిని చేసేశారు. ప్రస్తుతం విక్రమ్‌ప్రభుకు జంటగా నటిస్తున్న క్షత్రియన్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతుండగా, తాజాగా ఉదయనిధిస్టాలిన్‌తో ఇప్పడై వెల్లుమ్ చిత్రంతో నటిస్తోంది. ఈ అమ్మడికి ఫేస్బుక్లో అభిమానుల ఫాలోయింగ్ అధికంగానే ఉందట. అయితే అందరూ ఒకలా ఉండరుకదా ఒక తుంటరి హీరోయిన్లను నగ్నంగా చూడడానికే ప్రేక్షకులు ఆసక్తి చూపుతారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడట. అంతే అతని మాటలకు మంజిమామోహన్‌కు కోపం కట్టలు తెంచుకొచ్చిందట. అంతే అదే ఫేస్బుక్లో అతన్ని చెడామడా తిట్టేసిందట. దీంతో ఆ వ్యక్తి తన ఫేస్బుక్ అకౌంట్‌నే క్లోజ్ చేసేశాడట. దీని గురించి నటి మంజిమామోహన్ తెలుపుతూ ప్రేక్షకుడు హీరోయిన్లను నగ్నంగా చూడడానికి థియేటర్లకు వస్తారనడం చాలా తప్పు అని, అదే విధంగా అరకొర దుస్తుల్లో చూడాలని ప్రేక్షకులు కోరుకోరని అంది. మంచి కథా చిత్రాలను చూడడానికే వారు ఆసక్తి చూపుతారని పేర్కొంది. ఈ అమ్మడి అభిప్రాయాన్ని చాలా మంది అభిమానులు లైక్ చేస్తూ అవును మంచి కథా చిత్రాలను చూడాలనే తాము ఆశిస్తున్నామని, కథానాయికల్ని కురచ దుస్తుల్లో చూడాలనుకోవడం లేదని అంటున్నారట. మొత్తం మీద నటి మంజిమామోహన్ ఇలా కూడా ప్రచారం పొందేస్తోంది. -
సాఫ్ట్వేర్ లవ్
వారానికి రెండు సెలవులు. ఐదంకెల జీతం. హైఫై జీవితం. అప్పుడప్పుడు ఫారిన్ టూర్స్. ఇలా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న ముగ్గురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ప్రేమలో పడతారు. తర్వాత వారి జీవితాలు అనుకోని మలుపులు తిరుగుతాయి. అసలు ఆ ప్రేమికులు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? వారి ప్రేమ విజయం సాధించిందా లేదా? అన్న విషయాలు తెలుసుకోవాలంటే మా ‘సరసుడు’ చూడాల్సిందే అంటున్నారు దర్శకుడు పాండిరాజ్. శింబు సినీ ఆర్ట్స్, జేసన్‌రాజ్ ఫిలింస్ పతాకాలపై శింబు హీరోగా ఆయన తండ్రి, ‘ప్రేమసాగరం’ ఫేమ్ టి.రాజేందర్ నిర్మించారు. నయనతార, ఆండ్రియా, అదాశర్మ కథానాయికలు. మేలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. నిర్మాత టి. రాజేందర్ మాట్లాడుతూ– ‘‘మా శింబు సినీ అర్ట్స్ బ్యానర్లో ‘కుర్రాడొచ్చాడు’ తర్వాత రిలీజ్ అవుతున్న తెలుగు సినిమా ఇది. ఐటీ బ్యాక్‌డ్రాప్‌లో విభిన్నంగా సాగే ప్రేమకథ. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్. మా చిన్న కొడుకు కుళల్ అసరన్ అందించిన మ్యూజిక్ చాలా బాగుంది. హీరో ఫ్రెండ్‌గా ‘సత్యం’ రాజేష్ బాగా నటించారు. వచ్చే నెల మూడో వారంలో చిత్రాన్ని విడుదల చేస్తాం. దర్శకుడు పాండిరాజ్ అద్భుతంగా తెరకెక్కించారు’’ అన్నారు. ఈ చిత్రానికి కో–ప్రొడ్యూసర్: శ్రీమతి ఉషా రాజేందర్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: వెంకట్ కొమ్మినేని, కెమెరా: సతీష్. -
విజయ్ చిత్రానికి శింబు సంగీత బాణీలు
సంచలన నటుడు శింబు నటుడు అజిత్‌కు వీరాభిమాని అన్నది తెలిసిందే. ఒక స్టార్ హీరోగా ఉండి అజిత్ చిత్రాన్ని తొలిరోజు తొలి ఆటనే చూసేంత అభిమానం ఆయనది. ఈ మధ్య శింబు చిత్రం వాలు విడుదల సమయంలో సమస్యలను ఎదుర్కొనగా నటుడు విజయ్ కల్పించుకుని ఆ సమస్యను పరిష్కరించి వాలు చిత్ర విడుదలకు కారణం అయ్యారు. అప్పటి నుంచి విజయ్, శింబుల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇక అజిత్‌పై అభిమానం తగ్గినట్టేనా అన్న ప్రశ్నకు విజయ్ తనకు అన్నయ్య లాంటివాడని అజిత్‌కి తానెప్పుడూ అభిమానినేనని బదులిచ్చారు శింబు. అలాంటి శింబు త్వరలో విజయ్‌తో చేతులు కలపడానికి సిద్ధం అవుతున్నారన్న ప్రచారం కోలీవుడ్‌లో హల్చల్ చేస్తోంది. విజయ్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తన 61వ చిత్రాన్ని చేస్తున్నారు. సమంత, కాజల్, నిత్యామీనన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి దళపతి అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. విజయ్ తదుపరి ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి నటుడు శింబు సంగీతబాణీలు కట్టబోతున్నట్లు తాజాగా కోలీవుడ్ వర్గాల బోగట్టా. శింబులో ఒక్క నటుడే కాకుండా గీతరచయిత, గాయకుడు ఉన్నారు. తాజాగా సంతానం కథానాయకుడిగా నటిస్తున్న ఓడి ఓడి ఉళక్కునుమ్ చిత్రం ద్వారా సంగీతదర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం విడుదల కాకుండానే విజయ్ 62వ చిత్రానికి బాణీలు కట్టడానికి రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది.అయితే ఇందులో వాస్తవమెంత అన్నది మరికొన్ని రోజులు ఆగితేగానీ తెలియదు. -
బ్రేకప్ తర్వాత...
కోలీవుడ్ మన్మథుడు శింబు, మలయాళ బ్యూటీ నయనతార గతంలో పీకల్లోతు ప్రేమలో మునిగి, పెళ్లి కూడా చేసుకుంటారనే టైమ్‌లో విడిపోయిన సంగతి తెలిసిందే. విడిపోయాక ఈ ఇద్దరూ కలసి నటించడం మానేశారు. ఇక ఎప్పటికీ కలవరనుకుంటున్న సమయంలో ‘ఇదు నమ్మ ఆళ్’ అనే చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, అందర్నీ ఆశ్చర్యపరిచారు. బ్రేకప్ తర్వాత.. ఈ ఇద్దరూ నటించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలైంది. పాండిరాజ్ దర్శకత్వంలో శింబు సినీ ఆర్ట్స్ పతాకంపై టి.రాజేందర్ నిర్మించిన ఈ చిత్రం తెలుగులో ‘సరసుడు’ పేరుతో రిలీజ్ కానుంది. టి. రాజేందర్ మాట్లాడుతూ –‘‘రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. ఐటీ ఉద్యోగులు ఎలా లవ్ చేసుకుంటున్నారు? ఏ విధంగా విడిపోతున్నారు? చివరికి వారి ప్రేమ పెళ్లిదాకా వస్తుందా, లేదా? అన్నదే కథ. తమిళంలో ఘనవిజయం సాధించింది. నవంబర్లోనే తెలుగులో రిలీజ్ చేయాల్సి ఉన్నా నోట్ల రద్దు వల్ల వాయిదా వేశాం. ఈలోపు తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేశాం. నా పెద్ద కొడుకు హీరోగా నటించిన ఈ చిత్రానికి చిన్న కొడుకు కుళల్ అరసన్ మంచి సంగీతం ఇచ్చాడు. ఈ నెల 14న పాటలు రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ఆండ్రియా, అదాశర్మ, సత్యం రాజేష్, సూరి, సంతానం, జయప్రకాష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: బాలసుబ్రమణ్యం, కో–ప్రొడ్యూసర్: శ్రీమతి ఉషా రాజేందర్. -
మనసులో ఉన్నది మాట్లాడకూడదు
మనసులో ఉన్నది మాట్లాడకూడదంటున్నారు నటి తమన్నా. దశాబ్దానికి పైగా నాయకిగా ప్రకాశిస్తున్న తారల్లో ఈ అమ్మడు ఒకరు. మధ్యలో కాస్త వెనుక పడ్డా బాహుబలి చిత్రం భలే ఆదుకుందీ భామను. ఆ తరువాత మళ్లీ వరుస విజయాలతో స్టార్డమ్ అందుకున్నారు. ప్రస్తుతం శింబుతో అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రంలో డ్యూయెట్లు పాడుతున్నారు. ఈ మిల్కీబ్యూటీ ఇటీవల ఒక భేటీలో చాలా విషయాల గురించి మనసు విప్పి మాట్లాడారు. అవేమిటో చూద్దాం. సినీ రంగంలో ప్రతిభ ఉంటేనే పది కాలాల పాటు నిలబడగలం. అందమైన నా శరీరం గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. దశాబ్దానికి పైగా ఒకేలా అందాన్ని ఎలా మెయిన్ టెయిన్ చేయగలుగుతున్నారు. ఆ రహస్యం ఏమిటో చెప్పకూడదూ అని అడుగుతున్నారు. కేరళాకు చెందిన వారు కాఫీలో నెయ్యి కలుపుకుని తాగుతారు. నేను కాఫీ గానీ, బ్లాక్ కాఫీలో గానీ వెన్న కలుపుకుని తాగుతాను. ఆహారంలో అధిక కాయగూరలు తింటాను. కోడిగుడ్లు తింటాను. పప్పు పదార్ధాలు దగ్గరికి రానీయను. నిత్యం శారీరక కసరత్తులు చేస్తాను. ఇదే నా సౌందర్య రహస్యం. ఇంట్లో ఉంటే మేకప్ జోలికి పోను. చక్కగా పైజామా ధరించి స్వేచ్ఛగా ఉంటాను. పెళ్లిళ్లకు వెళ్లేటప్పుడు మాత్రం కచ్చితంగా చీరలే ధరిస్తాను. నిజం చెప్పాలంటే అవే చాలా సౌకర్యంగా ఉంటాయి. ఇక సినిమా గురించి చెప్పాలంటే అది కొన్ని నిబంధనలతో కూడిన ప్రపంచం. ఇక్కడ మనసులో ఉన్నది మరచి బయటకు నవ్వుతూ మాట్లాడాలని తెలుసుకున్నాను. సినిమా ప్రేక్షకుల్లో ఒక రకమైన మోహాన్ని కలిగిస్తుంది. నేనూ ఆ మోహంతోనే నటినయ్యాను. అయితే ఇక్కడ మంచిది మాత్రమే తీసుకుని ఇతరత్రా వదిలేయాలి. సినీ పరిశ్రమలో నాకు నటి అనుష్కతో మంచి స్నేహబంధం ఉంది. నా డ్రస్ విషయంలో తన సలహాలు తీసుకుంటాను. సినీ రంగంలో హీరోయిన్ గా ఐదేళ్లకు మించి కొనసాగడం అపూర్వం అనే చెప్పాలి. ఇక్కడ ప్రతిభ కలిగిన వారే పది కాలాల పాటు నిలదొక్కుకోగలరు. నయనతార, త్రిష, కాజల్, కరీనాకపూర్ లాంటి నటీమణులు ప్రతిభతోనే పదేళ్లకు పైగా రాణిస్తున్నారు. ఇకపోతే పెళ్లెప్పుడు చేసుకుంటారని చాలా మంది అడుగుతున్నారు. వివాహం అన్నది చాలా ఉన్నతమైన బంధం. దాన్ని నేను గౌరవిస్తాను. అయితే నేను ఇప్పట్లో పెళ్లి చేసుకోను. ఇప్పటి వరకూ ఎవరినీ ప్రేమించలేదు. అలాంటి వ్యక్తి ఎవరైనా తారసపడితే తల్లిదండ్రులతో చెప్పి వారి అనుమతితో పెళ్లి చేసుకుంటాను. అలా కాకపోతే పెద్దలు నిశ్చయించిన వ్యక్తినే వివాహమాడతాను. షూటింగ్ లేని రోజుల్లో నాన్నతో కలిసి నగల వ్యాపారం చేస్తాను. -
మన సంప్రదాయాన్ని కాపాడుకుందాం!
నటుడు శింబు మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పును కూడా ఎత్తి చూపేవిధంగా మాట్లాడి చర్చకు దారి తీశారు. ఏదో ఒక చర్యతో వివాదాలకు నటుడు శింబు సంచలనాలకు కేంద్రబిందువుగా మారుతుంటారు. ఆ మధ్య బీప్సాంగ్తో పెద్ద సంచలనం కలిగించిన ఈయన తాజాగా నిషేధానికి గురైన జల్లికట్టు క్రీడకు మద్దతుగా వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లోకెక్కారు. అదేమిటో ఆయన మాటల్లోనే చూద్దాం. జల్లికట్టు మన సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నం. కొందరు వ్యక్తులు, స్వార్థంతో కూడిన కొన్ని సంఘాలు తప్పుడు సమాచారంతో ఈ క్రీడను జరగకుండా అడ్డుకుంటున్నారు. ప్రభుత్వం, న్యాయస్థానం రగులుతున్న పలు సమస్యలపై దృష్టి సారించకుండా జల్లికట్టును నిషేధించడం ప్రధాన బాధ్యతగా తలచడం ఎందుకో అర్థం కావడంలేదు. జల్లికట్లు క్రీడ అన్నది తమిళుల వీరత్వానికి నిదర్శనం. అంతే కాదు మన ఎద్దుల జాతి హరించకుండా కాపాడే విధానం. అలాంటి జల్లికట్టు క్రీడను కోర్టు తీర్పు కారణంగా రెండేళ్లుగా నిర్వహిచంలేని పరిస్థితి. ఒక దేశ పౌరుడిగా ప్రతి తమిళుడు న్యాయస్థానాలను గౌరవిస్తున్నారు. అయితే అది తమిళ సంస్కృతిని మీరేదిగా ఉండదు, ఉండరాదు కూడా. మన సంస్కృతికి తూట్లు పొడిచే ఎలాంటి చట్టం అయినా మన ఆత్మాభిమానాన్ని బాధిస్తుందన్నది ప్రతి ఒక్కరూ గుర్తెరుగుతారని నమ్ముతున్నాను. ఈ దేశ పౌరుడిగా మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలసిన బాధ్యత ఉన్న వాడిగా నా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాను. తమిళనాడులో పొంగల్ సందర్భంగా జల్లికట్టును నిర్వహించాలని పలు సంఘాలు ఆందోళనలు చేపడుతున్నారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మెతక వైఖరిని చూపకుండా జల్లికట్టు క్రీడను నిర్వహించడానికి తీవ్ర చర్యలు తీసుకోవాలి. మన సంస్కృతి, సంప్రదాయాలు మళ్లీ పరిరక్షింపబడతాయని నమ్ముతునాను. జల్లికట్టును నిర్వహించేవరకూ విశ్రమించకూడదు. ఇది మన సంస్కృతి, సంప్రదాయం. మన పారంపర్యాన్ని ఎవరి కోసం విడనాడేదిలేదు. శింబు వ్యాఖ్యలపై రియాక్షన్ ఎలా ఉంటుందన్నది వేచి చూడాలి. -
స్నేహం కోసం!
ఓ స్టార్ హీరో.. ఓ కామెడీ హీరో సినిమాకి సంగీత దర్శకుడిగా వ్యవహరించడం అంటే అది న్యూసే. ఇప్పుడు చెన్నై కోడంబాక్కమ్‌లో ఈ న్యూస్ జోరుగా ప్రచారంలో ఉంది. అవును మరి... హీరో శింబు... హీరోగా మారిన కమెడియన్ సంతానం సినిమాకి పాటలు స్వరపరచడం అంటే న్యూసే కదా. వాస్తవానికి శింబూలో మంచి సింగర్ ఉన్న విషయం తమిళ ప్రేక్షకులకు తెలుసు. ‘పోటుగాడు’లో పాడిన ‘బుజ్జి పిల్ల...’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు తన సింగింగ్ టాలెంట్‌ను వినిపించారు శింబు. ఇక, సంగీతదర్శకుడిగా చేస్తున్న తాజా చిత్రం ‘సక్కపోడు పోడు రాజా’ విషయానికి వస్తే.. సేతురామన్ దర్శకత్వంలో వీటీవీ గణేశ్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. సంతానంతో ఉన్న స్నేహం కారణంగానే శింబు ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. ‘‘సంగీత దర్శకుడిగా నా కొత్త ప్రయాణం మొదలైంది. ఈ చిత్రానికి మ్యూజిక్ అందించడానికి కారణం సంతానం. ఎప్పటిలాగే మీ ప్రేమ, ఆశీస్సులు నాకు ఉండాలి’’ అని శింబు పేర్కొన్నారు. -
సంగీత దర్శకుడిగా శింబు
సంచలన నటుడు శింబు మరో కొత్త అవతారం ఎత్తడానికి సిద్ధం అయ్యారు. కథానాయకుడిగా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న శింబు కథకుడిగా, దర్శకుడిగా, గాయకుడిగానూ తన సత్తా చాటుకున్నారు. ఆ మధ్య బీప్ సాంగ్‌తో వివాదాలకు కారణమై, కేసులు, కోర్టుల వరకూ వెళ్లిన శింబు తాజాగా సంగీత దర్శకుడనే కొత్త హోదాకు రెడీ అయ్యారు. శింబు, సంతానం మధ్య ఉన్న స్నేహం గురించి అందరికీ తెలిసిందే. బుల్లితెర నటుడైన సంతానంను వెండి తెరకు పరిచయం చేసిన ఘనత శింబుదే. అదే విధంగా శింబు హీరోగా నటించిన విన్నైతాండి వరువాయా చిత్రంతో హస్యనటుడుగా ప్రాచుర్యం పొందిన వీటీవీ గణేశ్‌కు ఆయనంటే ప్రత్యేక అభిమానం. సంతానం కథానాయకుడిగా వీటీవీ.గణేశ్ నిర్మిస్తున్న చిత్రం చక్కపోడు పోడు రాజా చిత్రం ద్వారా శింబు సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సర్వర్ సుందరం చిత్రం ఫేమ్ వైభవి శాండిల్య నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి సేతురామన్ దర్శకుడు. తాను సంగీత దర్శకుడిగా అవతారమెత్తడం గురించి శింబు స్పందిస్తూ ఆ చిత్ర దర్శక, నిర్మాతలు సంగీతాన్ని అందించమని కోరారని, కథ విన్న తాను నచ్చడంతో సంగీతాన్ని అందించడానికి అంగీకరించానని తెలిపారు. తనకు సంగీతం అంటే ఆసక్తి అధికం అన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అందువల్ల సంగీత దర్శకుడిగా అవతారమెత్తినట్లు చెప్పారు. తాను మంచి సంగీతాన్ని అందించడానికి కృషి చేస్తానని, దాన్ని ఎలా ఆదరిస్తారన్నది ప్రేక్షకుల చేతిలో ఉంటుందని శింబు పేర్కొన్నారు. ఆయన ఇప్పుడు త్రిపాత్రాభినయం చేస్తున్న అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రంలో నటిస్తున్నారు. -
బాలా దర్శకత్వంలో శింబు?
దర్శకుడు బాలా, నటుడు శింబు కాంబినేషన్లో ఒక భారీ చిత్రం తెరకెక్కనుందా?అన్న ప్రశ్నకు కోలీవుడ్‌లో అవుననే సమాధానమే వస్తోంది. శింబు నటించిన అచ్చంయన్భదు మడమైయడా చిత్రం ఇటీవల తెరపైకి వచ్చి పెద్ద నోట్ల రద్దు ప్రభావాన్ని అధిగమించి మంచి వసూళ్లను సాధించింది. తాజాగా ఆధిక్ రవించద్రన్ దర్శకత్వంలో నటిస్తున్న అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రంపై మరింత అంచనాలు పెరిగారుు. మిల్కీబ్యూటీ తమన్నా, ,శ్రీయ నారుుకలుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీని తరువాత శింబు సంచలన విజయాన్ని సాధించిన ప్రేమమ్ చిత్ర దర్శకుడు ఆల్ఫోన్‌స పుత్రన్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు బాలా పేరు తెరపైకి వచ్చింది. తారైతప్పటై్ట చిత్రం తరువాత జాతీయ ఉత్తమ దర్శకుడు బాలా కుట్రపరంపరై అనే మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెకిక్కంచడానికి సన్నాహాలు చేశారు.అరుుతే అదే కథతో దర్శకుడు భారతీరాజా చిత్రం ప్రారంభించడంతో అది వివాదంలో పడింది.చివరికి ఆ ఇద్దరు దర్శకులు ఆ కథతో చిత్రం చేయడాన్ని విరమించుకున్నారు. తాజాగా దర్శకుడు బాలా నటుడు శింబు కథానాయకుడిగా ఒక భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్న ప్రచారం కోలీవుడ్‌లో జరుగుతోంది. బాలా ప్రస్తుతం ఈ చిత్ర కథను తయారు చేసే ప్రయత్నంలో ఉన్నారట. వచ్చే ఏడాది బాలా, శింబుల సంచలన కాంబినేషన్లో చిత్రం ప్రారంభం కానుందని, దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడి అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది.. -
శింబు విందుకు వరలక్ష్మి
నటుడు శింబు విం దులో వరలక్ష్మిశరత్‌కుమార్ పాల్గొన్నారు. ఇందులో ఆశ్చర్యం ఏముంది, తారలు విందు, వినోదాల్లో పాల్గొనడం షరామామూలే కదా..అంటారా? నిజమే శింబు, వరలక్ష్మి కలిసి పోడాపోడీ చిత్రంలో కూడా నటిచారు. ఇంకా చెప్పాలంటే వరలక్ష్మి శరత్‌కుమార్‌కు తొలి హీరో శింబునే. అరుునా కాస్త ఆలోచిస్తే వీరి తాజా కలరుుక ఆసక్తిగానే ఉంటుంది. నటుడు విశాల్‌కు వరలక్ష్మికి మధ్య ప్రేమాయణం సాగుతోందని, వారిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోనున్నారని హాట్‌హాట్ వందంతులు చాలానే విన్నాం. అలాంటిది ఇటీవల వారి ప్రేమ బ్రేకప్ అరుు్యందనే ప్రచారాన్ని చూశాం. ఇక నడిగర్‌సంఘం ఎన్నికల సమయంలో విశాల్ వ్యతిరేక వర్గానికి శింబు మద్దతునిచ్చిన విషయం తెలిసిందే. ఈ కూడికలు, తీసివేతలు చూస్తే శింబు విందులో వరలక్ష్మి పాల్గొనడం ఆసక్తికరంగా అనిపించక మానదు. ఇక అసలు విషయం ఏమిటంటే నటుడు శింబుకు విన్నైతాండి వరువాయా చిత్రం తరువాత సరైన హిట్ లేదనే చెప్పాలి. పైగా ఆ తరువాత వివాద సంఘటనలు, కేసులు, కోర్టులు అంటూ చాలా సమస్యలను ఎదుర్కొన్నా రు. అలాంటి సరిస్థితుల్లో ఆయన న టించిన అచ్చంయన్భదు మడమైయడా చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను పొందుతోంది. ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేయడానికి చిత్రం యూనిట్ ఇటీవల ఒక నక్షత్ర హోటల్లో విందు, వినోదాలతో గడిపారు. ఈ పార్టీలో వరలక్ష్మిశరత్‌కుమార్, త్రిష, రమ్యకృష్ణ పాల్గొని ఆకర్షణగా మారారు. అందరూ శింబుతో సెల్ఫీలు తీసుకుంటూ సరదాగా గడిపేశారు. ఆ ఫొటోలిప్పుడు మీడియాలో హల్చల్ చేస్తున్నారుు. -
అశ్విన్‌తో ప్రేమలో పడిందా?
మొండోడు.. దేనికీ భయపడడు.. ఈ రెండు లక్షణాలకు తోడు ప్రేమ ఉన్నోడు.. ఇటువంటి వ్యక్తితో ప్రేమలో పడితే బాగుంటుందని కొందరు అమ్మాయిలు కోరుకుంటారు. తమన్నాకు అలాంటోడు దొరికాడు. కానీ, తన ఈడూ జోడూ ఉన్న అబ్బాయి కాదు, 60 ఏళ్ల అశ్విన్ తాత. ఆ అశ్విన్ తాతయ్య ఎవరో కాదు, హీరో శింబు. ఇదంతా తమిళ సినిమా ‘అన్బానవన్ అసురాదవన్ అడంగాదవన్’ సంగతి. ‘‘అరవై ఏళ్ల తాతయ్యతో ఇరవై ఐదేళ్ల అమ్మాయి ప్రేమలో పడిందా? లేదా? సినిమా చూసి తెలుసుకోండి. ఈ జోడీ మాత్రం చరిత్ర సృష్టించడం ఖాయం’’ అంటున్నారు చిత్ర దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్. ఈ సినిమాలో శింబు మూడు పాత్రల్లో కనిపించనున్నారు. అందులో అశ్విన్ తాత పాత్ర ఒకటి. ఈ తాతగారితో తమన్నా చేసే సందడి భలేగా ఉంటుందట. శ్రీయ మరో హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. -
మళ్లీ శింబుతోనా?
సంచలన నటుడు శింబు పేరెత్తితే నే నటి హన్సిక బెంబేలెత్తిపోతున్నారనిపిస్తోంది. ఆయనతో రెండు చిత్రాల్లో నటించిన ఈ ఉత్తరాది భామ ఆ చిత్రాల షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య లవ్ మొదలైంది.అది ఎంతవరకు వెళ్లిందంటే పేళ్లి అంచుల వరకు. అయితే ఆ పెళ్లి కథ మాత్రం పలు ప్రకంపనల తరువాత కంచికే చేరింది. మొత్తం మీద శింబు హన్సిక నటించిన వాలు చిత్రం అతి కష్టం మీద పూర్తి అయ్యి తెరపైకి వచ్చింది. మరో చిత్రం వేట్టై మన్నన్‌కు ఇంకా మోక్షం కలగలేదు. శింబు తాజాగా అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రంలో నటిస్తున్నారు. త్రిష ఇల్లన్నా నయనతార చిత్రం ఫేమ్ ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శింబు త్రిపాత్రాభినయం చేస్తున్నారు. కాగా అందులో ఒక పాత్రలో 1980 పాత పాత్రలో నటించడం విశేషం.కాగా ఈ పాత్రకు జంటగా నటి శ్రీయ నటిస్తున్నారు. మెయిన్ నాయకి పాత్రలో హన్సిక నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం ఆమె చెవిన పడింది. అంతే అయ్యయ్యో అంటూ బెంబేలెత్తిపోయింది. శింబు సరసన మళ్లీనా? అంటూ అదంతా అసత్య ప్రసారం అని తన ట్విట్టర్లో పేర్కొన్నారు. అసలు విషయం ఏమిటంటే శింబు మొదటి మాజీ ప్రియురాలు నయనతార ఇటీవల ఇదునమ్మఆళు చిత్రంలో ఆయనతో నటించిన విషయం తెలిసిందే. అదే విధంగా తాజా చిత్రం అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రంలో మరో మాజీ ప్రియురాలు హన్సికను నటింపచేయాలని చిత్ర యూనిట్ భావించినట్లు సమాచారం. ఇదే విషయం కాస్త అటూ ఇటుగా ప్రచారం అవడంతో హన్సిక కంగారు పడిపోయారట. ఇప్పుడీ చిత్రంలో నటి కీర్తీసురేశ్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. -
ఆ హీరోకి తల్లిగా!
నటి శ్రీయను అదృష్టం, దురదృష్టం రెండూ వెంటాడాయని చెప్పాలి. కోలీవుడ్‌లో తొలి దశలోనే సూపర్‌స్టార్‌కు జంటగా శివాజీ చిత్రంలో రొమాన్స్ చేసే అవకాశాన్ని అందుకున్న అదృష్ట నటి శ్రీయ. ఆ తరువాత హాస్యనటుడు వడివేలుతో సింగిల్ సాంగ్‌లో ఆడడం ఆమె దురదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఆ తరువాత అజిత్ తదితర ప్రముఖ హీరోల సరసన నటించే అవకాశాలను శ్రీయ కోల్పోయారు. ఇక తాజా విషయానికొస్తే శ్రీయ ప్రతిభావంతురాలైన నటి అని ఇప్పడు కొత్తగా సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే అవకాశాలు తగ్గాయన్నది వాస్తవం. అందులోనూ హీరోయిన్ అవకాశాలు దాదాపు అడుగంటాయని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీయ సంచలన నటుడు శింబుకు అమ్మగా నటించడానికి సమ్మతించినట్లు కోలీవుడ్ వర్గాల బోగట్టా. శింబు తాజాగా అన్బానవన్ అసరాదవన్ అదంగాదవన్ అనే చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. త్రిష ఇల్లన్నా నయనతార చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన ఆధిక్ రవిచందర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇందులో శింబు త్రిపాత్రాభినయం చేయనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్లు ఎవరన్న విషయాన్ని చిత్ర యూనిట్ బహిర్గతం చేయలేదు. కానీ, శింబు పోషించే మూడు పాత్రల్లో ఒకటి నడి వయసు పాత్ర అని సమాచారం. బహుశా ఈ పాత్ర ఇతర రెండు పాత్రలకు తండ్రి కావచ్చు. ఈ పాత్రకు జోడీగా మొదట చెన్నై చిన్నది త్రిషను సంప్రదించగా ఆ బ్యూటీ నో అన్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. తాజాగా ఆ పాత్రను చేయడానికి ఉత్తరాది భామ శ్రీయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. త్వరలో ప్రారంభం కానున్న ఈ అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రానికి సంగీత దర్శకుడు యువన్ శంకర్‌రాజా ఇప్పటికే సంగీత బాణీలు కట్టే పనిలో నిమగ్నమయ్యారన్నది గమనార్హం. -
లేడీ డాన్‌గా వరలక్ష్మి
కబాలి చిత్రం కోసం సూపర్‌స్టార్ రజనీకాంత్ దాదాగా మారితే నటి వరలక్ష్మి శరత్‌కుమార్ కసబా అనే మలయాళ చిత్రం కోసం లేడీ దాదాగా అవతారమెత్తారు. బహు భాషా నటీమణులుగా పేరు తెచ్చుకుంటున్న వారిలో నటి వరలక్ష్మీ ఒకరు. మొదట కల్సా డాన్స్, భరత నాట్యం వంటి నృత్యాల్లో శిక్షణ పొంది ఆ రంగంలో పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత పోడాపోడీ చిత్రంతో హీరోయిన్గా పరచయమయ్యారు. శింబు హీరోగా నటించిన ఆ చిత్రానికి నటి నయనతార ప్రియుడిగా ప్రచారం జరుగుతున్న విఘ్నేశ్‌శివ దర్శకుడు. పోడాపోడి చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయినా వరలక్ష్మీ మాత్రం మంచి గుర్తింపునే పొందారు. ఆ తరువాత విశాల్‌కు జంటగా నటించిన మదగజరాజా చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నా ఆర్థిక సమస్యల కారణంగా విడుదలకు నోచుకోలేదు. చిన్న గ్యాప్ తరువాత బాలా దర్శకత్వంలో తారైతప్పట్టై చిత్రంలో నటించారు. ఆ చిత్రం నిరాశ పరచినా గరగాటకార యువతిగా వరలక్ష్మి నటనకు మాత్రం పరిశ్రమ వర్గాల నుంచి ప్రశంసలు జల్లు కురిసింది. దీంతో వరలక్ష్మీ బహుభాషా నటిగా మారిపోయారు. తమిళం, కన్నడం, మలయాళం భాషలో నటిస్తూ బిజీగా ఉన్నారు. మలయాళంలో తొలి చిత్రంతోనే అక్కడి సూపర్‌స్టార్ మమ్ముట్టితో నటించే లక్కీచాన్స్‌ను అందుకున్నారు. అంతే కాదు ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్ లేడీ దాదాగా ఫుల్ మాస్ పాత్రలో నటిస్తున్నారట. దీని గురించి ఆమె తెలుపుతూ తారైతప్పట్టై చిత్రంలో తన నటనకు చాలా మంచి పేరు వచ్చిందన్నారు. తదుపరి మంచి పాత్రల కోసం ఎదురు చూస్తున్నప్పుడు మలయాళ దర్శకుడు నితిన్ చెప్పిన కసబా చిత్ర కథ బాగా నచ్చిందన్నారు. ఇందులో గ్రామీణ ప్రాంతానికి చెందిన దాదా యువతిగా నటిస్తున్నానని తెలిపారు. మమ్ముట్టి హీరోగా నటిస్తున్నారని చెప్పారు. ఆయన తన తండ్రి శరత్‌కుమార్‌తో కలిసి పళసీరాజా చిత్రంలో నటించారని, మమ్ముట్టి అంటే తనకు చాలా గౌరవం అని అన్నారు. ప్రస్తుతం తమిళంలో అమ్మాయి అనే హార ర్ కథా చిత్రంలో నటిస్తున్నానని చెప్పారు.అదే విధంగా తమిళం, కన్నడం భాషలలో తెరకెక్కుతున్న నిపుణన్ చిత్రంలో అర్జున్, ప్రసన్నలతో కలిసి నటిస్తున్నానని వరలక్ష్మీ శరత్‌కుమార్ తెలిపారు. -
విజయ్‌సేతుపతికి జతగా మంజిమా మోహన్
కేరళ కుట్టీలు కోలీవుడ్‌కు దిగుమతి అన్నది అప్రహతంగా కొనసాగుతూనే ఉంది. ఇటీవల సంచలనం సృష్టించిన మలయాళ చిత్రం ప్రేమమ్ విజయం చాలా మందికి చాలా రకాలుగా ఉపయోగపడింది. ముఖ్యంగా ఆ చిత్రంలోని నటించిన ముగ్గురు కథానాయికలకు తమిళ చిత్ర పరిశ్రమ రెడ్‌కార్పెట్‌తో ఆహ్వానించింది. ఇక అలా దక్షిణాదిలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవాలని ప్రయత్నిస్తున్న మరో మలయాళీ బ్యూటీ మంజిమామోహన్. ఇప్పటికే శింబుకు జంట గా అచ్చంయంబ్బదు మడమయడా చిత్రంలో నటిస్తున్న ఈ భామ తెలుగులోనూ పాగా వేయనున్నారు. అక్కడ సాహసం శ్వాసగా సాగిపో అనే చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా తమిళంలో వరుస విజయాలతో జోరు మీదున్న విజయ్‌సేతుపతి దృష్టిలో పడ్డారు. ఈయన కేవీ.ఆనంద్ దర్శకత్వంలో నటించనున్న చిత్రంలో మంజిమామోహన్‌ను హీరోయిన్గా ఎంపిక చేయడానికి చర్చలు జరుగుతున్నాయన్నది తాజా సమాచారం. విజయ్‌సేతుపతితో రొమాన్స్ చేసే మంచి అవకాశాన్ని మంజిమామోహన్ వదులు కుంటుందని ఎవరూ అనుకోరు. అనేగన్ చిత్రం తరువాత కేవీ.ఆనంద్ దర్శకత్వం వహించనున్న తాజా చిత్రం ఇది. అనేగన్ చిత్రాన్ని నిర్మించిన ఏజీఎస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థనే ఈ చిత్రాన్ని రూపొందించనుంది. ప్రస్తుతం రెక్క చిత్రంలో నటిస్తున్న విజయ్‌సేతుపతి తదుపరి ఈ చిత్రానికి కాల్షీట్స్ ఇచ్చారని తెలిసింది. దీనికి హిప్ హాప్ తమిళా సంగీతాన్ని అందించనున్నారు. ఇక కేవీ.ఆనంద్ ఆస్థాన రచయితల ద్వయం శుభ కథ, కథనం, మాటలను అందిస్తున్నారు. -
మేలో అచ్చంయంబదు మడమయడా
అచ్చంయంబదు మడమయడా చిత్రం విడుదల తేదీ ఖారారైందని సమాచారం. శింబు నటించిన చిత్రం అచ్చంయంబదు మడమయడా. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మలయాళం చిత్రం ప్రేమమ్ ఫేమ్ మంజిమామోహన్ కథానాయకిగా పరిచయం అవుతున్నారు. విన్నైతాండి వరువాయా వంటి విజయవంతమైన చిత్రం తరువాత శింబు, గౌతమ్ మీనన్‌ల కలయికలో తెరకెక్కుతున్న చిత్రం అచ్చంయంబదు మడమయడా. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. తళ్లీ పోగాదే అనే ఇందులోని సింగిల్ ట్రాక్ పాట జనవరి నెలలో యూట్యూబ్‌లో విడుదలై పెద్ద విశేష స్పందన పొందింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న అచ్చంయంబదు మడమయడా చిత్రం ఆడియో త్వరలో విడుదల సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది.చిత్రాన్ని మే 17న విడుదలకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.అయితే దీనికి ముందే శింబు నటించిన ఆయన సొంత నిర్మాణ సంస్థ నిర్మించిన ఇదునమ్మ ఆళు చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. నయనతార, ఆండ్రియా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ రెండవ వారంలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారా శింబు సోదరుడు కురలరసన్ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారన్నది తెలిసిన విషయమే. -
ఇప్పుడు నాకన్నీ తెలుసు!
ఎంత అనుభవజ్ఞులైనా నాకు తెలిసింది ఇసుమంతే నేర్చుకోవలసింది ఎంతో ఉంది అంటుంటారు విజ్ఞులు. అలాంటిది నటి కాజల్‌అగర్వాల్ మాత్రం నాకన్నీ తెలుసు అంటున్నారు. ఇది కాస్త అతి అనిపించినా ఈ బ్యూటీ భావనేమిటన్నది ఒక సారిచూస్తే పోలా.దక్షిణాది చిత్ర పరిశ్రమలో దాదాపు యువ హీరోలందరితోనూ జోడీ కట్టేసిన కాజల్‌అగర్వాల్ ఉత్తరాదిలోనూ తన స్థాయిని పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతం ఈమెకు కోలీవుడ్‌లోనే పరిస్థితి బెటర్‌గా ఉందని చెప్పవచ్చు. ద్విభాషా(తెలుగు,తమిళం)చిత్రం బ్రహ్మోత్సవంతోపాటు జీవాతో కవలైవేండామ్ అనే తమిళ చిత్రంలోనూ నటిస్తున్నారు. తాజాగా శింబుతో రొమాన్స్ చేసే అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. తెలుగు చిత్రం టెంపర్ రీమేక్‌లో శింబు నటించనున్నారన్న విషయం తెలిసిందే.ఇందులో ఆయనకు జంటగా కాజల్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా కోలీవుడ్‌లో అవకాశాలు పెంచుకుంటున్న కాజల్‌అగర్వాల్ తన గురించి ఏమంటున్నారో చూద్దాం. నటీనటుల్లో ఒక్కొక్కరిలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కొందరికి డాన్స్‌లో ప్రావీణ్యం ఉంటే, మరొకరికి ప్రేమ సన్నివేశాల్లో చక్కగా నటించే నేర్పరితనం ఉంటుంది. ఇంకొందరికి శోక సన్నివేశాల్లో జీవించే ప్రతిభ ఉంటుంది. అయితే నాకు మాత్రం అన్నీ తెలుసు. ఏ తరహా పాత్రనైనా అవలీలగా చేసేయగలను. నిజం చెప్పాలంటే తొలి రోజుల్లో నాకూ ఏమీ తెలియదు. ముఖ్యంగా ఏడవడం అస్సలు తెలియదు. చిన్నతనం నుంచీ నేను ఏడ్చిన సందర్భాలు లేవు.అందుకే అలాంటి సన్నివేశాల్లో నటించడానికి చాలా కష్టపడేదాన్ని. కన్నీరు వచ్చేవి కానీ అందులో జీవం ఉండేదికాదు. ఇప్పుడు ఏడవడంతో పాటు అన్నీ నేర్చుకున్నాను. కెమెరా ముందుకు రాగానే దర్శకుడు యాక్షన్ అనగానే ముఖంలో శోకాన్ని నింపుకుని ఏడుపు సన్నివేశంలో జీవించేస్తాను. ఇప్పుడీ తరహా నటనను చూసి నా స్నేహితులు ఆశ్చర్యపోతున్నారు. కథ, పాత్రలను అవగాహన చేసుకుని అందులో లీనమై నటించే పరిణితిని సాధించాను. అందుకే నటిగా తానీ స్థాయికి చేరుకోగలిగాను. -
నా పెళ్లి మీ ఇష్టం
నా పెళ్లి మీ ఇష్టం కానీ అంటూ సంచలనాలకు కేంద్ర బిందువైన నటుడు శింబు మరోసారి వార్తల్లోకెక్కారు.ఈ మధ్య నటి హన్సికతో ప్రేమ ఫెయిల్యూర్, ఇటీవల బీప్‌సాంగ్ కలకలం సంఘటనలు కాస్త సద్దుమణిగాయనుకుంటున్న సమయంలో వివాహం విషయంలో శింబు పేరు మరోసారి హెడ్లైన్లో కొచ్చేసింది. ప్రేమ వివాహం చేసుకోవాలన్నది శింబు బలమైన కోరిక. ఈ విషయాన్ని ఆయన చాలా సార్లు బహిరంగంగానే వెల్లడించారు. ఆ దిశగా ప్రయత్నించి విఫలం అయ్యారు కూడా. శింబు నయనతార ప్రేమ వ్యవహారం, నటి హంన్సికతో ప్రేమ పెళ్లి వరకూ వెళ్లి బెడిసికొట్టిన విషయం తెలిసిందే. అలా రెండు సార్లు ప్రేమ బ్రేకప్ అవ్వడం, ఇటీవల బీప్ సాంగ్ వివాదం శింబు మనసును బాగా కలచివేశాయని చెప్పవచ్చు. మరో పక్క ఆయన తల్లిదండ్రుల పెళ్లి ఒత్తిడి కూడా శింబుపై చాలా ప్రభావం చూపినట్లుంది. వెరసి ప్రేమ వివాహం చేసుకోవాలనే తన ఆకాంక్షను పక్కన పెట్టి పెద్దలు కుదిర్చిన పెళ్లికి తలవంచేలా చేశాయి. ఎస్ శింబు తన తల్లిదండ్రులు సెలెక్ట్ చేసి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సమ్మతించారు. అయితే ఒక నిబంధనను విధించారట. అదేమిటంటే తల్లిదండ్రులు చూసిన అమ్మాయి తనకు నచ్చాలి. అదే సమయంలో తానూ ఆ అమ్మాయికి నచ్చి ఉండాలి అన్నది శింబు కండిషన్ అట. ఈ విషయాన్ని ఆయన తండ్రి టీ.రాజేందర్ వెల్లడించినట్లు కోలీవుడ్ మీడియా సమాచారం. శింబు తల్లిదండ్రులు ఆయనకు తగిన వధువు అన్వేషణలో ఉన్నారు. అయితే ఇటీవల శింబు కుటుంబ సభ్యులు తమ సన్నిహిత కుటుంబ సభ్యులతో కలిసి ఒక విందులో పాల్గొన్నారని అక్కడ వారి మధ్య శింబు పెళ్లికి సంబంధించిన చర్చ జరిగిందనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో నిజం లేదని టీ.రాజేందర్ కొట్టిపారేశారు.అయితే శింబుకు నచ్చిన పెళ్లికూతురుని వెతికే పనిలో ఉన్నట్లు ఆయన తెలిపారు. -
కేసును రద్దు చేయండి
హైకోర్టులో పిటిషన్ :శింబు చెన్నై: నటుడు శింబు తనపై నమోదైన కేసుల నుంచి చాకచక్యంగా బయట పడే ప్రయత్నాలు చేస్తున్నారు. మహిళలను అగౌరపరిచేలా పాటరాసి, పాడిన బీప్ సాంగ్ వివాదంలో ఇప్పటికే మద్రాసు హైకోర్టులో ముందస్తు బెయిల్‌కు అర్హత పొందిన శింబు కోవై రేస్‌కోర్స్ పోలీసులు, చెన్నై నేరపరిశోధనా విభాగం పోలీసుల ఎదుట ఈ నెల 11న హాజరుకావలసి ఉన్నా ఆ తేదీని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఈ నెల 29కు గడువును పొందారు. తాజాగా చెన్నై నేరపరిశోధనా విభాగం పోలీసులు నమోదు చేసిన కేసును రద్దు చేయాలంటూ మరో పిటిషన్‌ను హైకోర్టులో దాఖలు చేశారు.అందులో ఆయన పేర్కొంటూ ఒకే నేరానికి ఒకటికి మించిన కేసులు నమోదు చేయరాదని సుప్రీమ్ కోర్టు ఇంతకు ముందే తీర్పు ఇచ్చిందన్నారు. ఆ విధంగా బీప్ సాంగ్ అనే ఒక్క నేరానికి తనపై ఒక్క కేసు మాత్రమే నమోదు చేయాలన్నారు. ఆ విధంగా కోవై పోలీసులు ఇంతకు ముందే తనపై కేసు నమోదు చేశారని అందువల్ల చెన్నై నేరపరిశోధనా విభాగం పోలీసులు నమోదు చేసిన కేసును రద్దు చేయాలని కోరారు. ఈ కేసు మంగళవారం న్యాయమూర్తి ఆర్.సుబ్బయ్య సమక్షంలో విచారణకు వచ్చింది. ప్రభుత్వం తరపున నేరపరిశోధనా విభాగం న్యాయవాది షణ్ముగవేలాయుధం హాజరై వాదించారు. అయితే శింబు తరపు న్యాయవాది వేరే కోర్టుకు హాజరవడం వల్ల విచారణను న్యాయమూర్తి మధ్యాహ్నానికి వాయిదా వేశారు. -
ఎట్టకేలకు పోలీసుల ముందుకు బీప్ సాంగ్ అనిరుధ్
'బీప్ సాంగ్' వివాదంలో ఇరుక్కున్న సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ పోలీసుల వద్ద హాజరయ్యాడు. నటుడు శింబుతో ఈ పాట పాడించి ఒక్కసారిగా వివాదాలు మూటగట్టుకున్న అనిరుధ్.. ఇన్నాళ్లుగా విదేశాల్లో ఉన్న విషయం తెలిసిందే. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో రేస్ కోర్స్ రోడ్డు పోలీసు స్టేషన్ వద్ద హాజరైన అనిరుధ్.. రెండు పేజీల ప్రకటన సమర్పించాడు. ఆ పాటను తాను కంపోజ్ చేయలేదనే మరో సారి చెప్పాడు. కోయంబత్తూరులో పోలీసుల వద్ద హాజరై తన ప్రకటన ఇచ్చానని వాట్సప్ మెసేజి ద్వారా మీడియాకు చెప్పాడు. ఆలిండియా డెమొక్రాటిక్ ఉమెన్ అసోసియేషన్ (ఐద్వా) వాళ్లు ఈ పాట విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పాటలో మహిళలను కించపరిచేలా అసభ్య లిరిక్స్ ఉన్నాయని ఐద్వా మండిపడిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు కేసు నమోదుచేసి శింబు, అనిరుధ్ ఇద్దరినీ డిసెంబర్ 19న హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. అయితే శింబు వాళ్లను నెల రోజుల గడువు కోరాడు. అనిరుధ్ మాత్రం తాను ఆ పాటను కంపోజ్ చేయలేదని, అందవల్ల తనపై ఎఫ్ఐఆర్ ఎత్తేయాలని అడిగాడు. పోలీసులు దాన్ని నిరాకరించి, జనవరి 2న హాజరు కావాలన్నారు. అప్పుడు మళ్లీ అనిరుధ్ 15 రోజుల గడువు కోరాడు. తాను చెన్నై వరద బాధితుల సహాయార్థం విదేశాల్లో ప్రదర్శనలు చేస్తున్నానని, వచ్చాక హాజరవుతానని చెప్పాడు. -
శింబుపై కేసు వాపస్
నటుడు శింబు బీప్ సాంగ్ కలకలం కొనసాగుతూనే ఉంది. మహిళలను అవమానించే విధంగా అసభ్య పదజాలాలతో పాట రాసి, పాడారంటూ నటుడు శింబుపై తమిళనాడులోని పలు మహిళా సంఘాల నిర్వాహకులు మండిపడుతూ ఆందోళనకు దిగుతున్న విషయం తేలిసిందే. ఈ నేపథ్యంలో శింబుపై కోవై, చెన్నైలో పలు విభాగాల్లో పోలీసులు కేసులు నమోదు చేసి, ఆయన్ని అరెస్ట్ చేసే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. దీంతో శింబు పరారీలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే శింబు ఎక్కడికి పారిపోలేదనీ తమిళనాడులోనే ఉన్నాడనీ ఆయన తల్లిదండ్రులు టి.రాజేందర్, ఉషారాజేందర్ అంటున్నారు. శింబు మాత్రం పోలీసులకు దొరకడం లేదు. తను ముందస్తు బెయిల్ కోసం చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జనవరి నాలుగున విచారణ జరగనుంది. శింబుపై పాట్టాలీ మక్కల్ కట్చికి చెందిన వెంకటేశన్ అనే వ్యక్తి చెన్నై సైదాపేట కోర్టులో బీప్ సాంగ్ వ్యవహారంలో పిటీషన్ దాఖలు చేసిన విషయం తేలిసిందే. దానిపై సోమవారం విచరణ జరగనున్న నేపథ్యంలో వెంకటేశన్ తన పిటీషన్‌ను వాపస్ తీసుకున్నారు. పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకే ఆయన కేసును వాపస్ తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. శింబుకు మద్దతుగా ఆందోళన నటుడు శింబుకు మద్దతుగా ఇప్పటికే కొందరు సినీ ప్రముఖులు గొంత్తెతిన నేపథ్యంలో అభిమానులు ఆయనకు అనుకూలంగా ఆందోళనకు దిగుతుండడం గమనార్హం. సోమవారం ఉదయం 50కి పైగా శింబు అభిమానులు సతీష్ హరికరన్ ఆధ్వర్యంలో స్థానిక నుంగంబాక్కం సమీపంలోని వళ్లువర్‌కూటం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. సమాచారం అందిన పోలీసులు వెంటనే అక్కడకు వచ్చి ఆందోళన కార్యక్రమానికి అనుమతి లేదంటూ వారందరినీ పంపించేశారు. దీంతో అభిమానులందరూ టీనగర్, హిందీ ప్రచారసభ వీధిలోని శింబు ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగాా సతీష్ హరికరన్ మాట్లాడుతూ శింబు పాటను ఎవరో తస్కరించి ఇంటర్నెట్లో ప్రసారం చేశారన్నారు. వారెవరో పోలీసులు కనిపెట్టి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
శింబు పాటలో మంచి పదాలూ ఉన్నాయి
శింబు పాటలో మంచి పదాలు ఉన్నాయనీ, వాటిని పక్కన పెట్టి మాటలు లేని బీప్ అంశాన్ని తెరపైకి తెచ్చి రాద్ధాంతం చేస్తున్నారని ఆయన తండ్రి టీ రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వాట్స్‌యాప్‌లో ఒక ప్రకటన విడుదల చేస్తూ శింబుపై కావాలనే కొందరు కుట్ర పన్ని దుష్ర్పచారానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. తాను మహిళలను ఉన్నతంగా చూపిస్తూ పలు చిత్రాలు రూపొందించాననీ, తనకు మహిళలపై చాలా గౌరవం ఉందని, అదే మర్యాద శింబుకు ఉందని అన్నారు. తను స్త్రీలను ఏనాడు అగౌరవ పరచలేదని అన్నారు. మహిళా సమాజం మనోభావాలు దెబ్బతిన్నాయని భావిస్తే తాను వారికి క్షమాపణలు చెప్పుకుంటున్నానన్నారు. చట్ట నిబంధనలు తెలియవు నటుడు శింబు ఒక టీవీ ఛానల్‌కు బేటీ ఇస్తూ తాను 30 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉన్నానన్నారు. సినిమా మినహా తనకేమీ తెలియదనీ అదేవిధంగా చట్ట నిబంధనలు తనకు తె లియవని అ న్నారు. ఆ కష్ట కాలంలో తన కు అండగా నిలబడిన తన తల్లిదండ్రుల కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. తాను పాటను కావాలని వాట్స్‌యాప్‌లో పోస్ట్ చేయలేదని అందువల్ల తనను విమర్శించడం సబబు కాదని అన్నారు. తప్పుగా భావిస్తే క్షమించమని కోరుకుంటున్నానని అన్నారు. రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ శింబు సోమవారం చెన్నై హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.అయితే ఆ పిటీషన్‌పై ఈ నెల 23న విచారణ జగపనున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. శింబుపై ఫిర్యాదులను, ఆర దోళనలను భరించలేక ఆయన ఇంటి ముందు సోమవారం నలుగురు ఆయన అభిమానులు ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నడిగర్‌సంఘం ఖండన శింబు చర్యల్ని నడిగర్ సంఘం ఖండించింది. దీని గురించి ఒక ప్రకటన విడుదల చేస్తూ సినిమా అన్నది కళకు, కోట్లాది రూపాయల వ్యాపారానికి చిరునామా అన్నారు. అలాంటి సినీ రంగంలో తప్పు చేస్తే చింతించడం, క్షమాపణ కోరడం చేయాలని పేర్కొన్నారు. శింబుపై సోమవారం మరో రెండు కేసులు నమోదు కావడం విశేషం. -
ప్రాచుర్యానికి మనమే కారణం
ఏ విషయమైనా ప్రాచుర్యంలోకి రావడానికి మనమే కారణం అన్నారు సీనియర్ నటి స్నేహ. బీప్ సాంగ్‌గా చెప్పబడుతున్న నటుడు శింబు రాసి, పాడగా సంగీత దర్శకుడు అనిరుద్ బాణీలు కట్టినట్లు ప్రచారంలో కలకలం సృష్టిస్తున్న పాటపై మహిళా సంఘాలు మండిపడుతున్న విషయం తెలిసిందే. శింబు ,అనిరుద్‌లపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో పలు కేసులు నమోదవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖుల నుంచి విమర్శలు రావడంతో బీప్ పాట తమిళనాట ప్రకంపనలు సృష్టిస్తోంది.దీంతో ఆ పాటను వినని వారికి కూడా ఇప్పుడు వినాలనే ఆకాంక్ష అధికం అవుతోంది. ఆ బీప్ సాంగ్ ఇంతకు ముందుకన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువగా వాట్స్‌యాప్‌లో హల్చల్ చేయడం గమనార్హం. మనమే కారణం ఈ విషయంపై నటి స్నేహ స్పందించారు. ఒక పాట ప్రాచుర్యం పొందడానికి మనమే కారణం అన్నారు. ఇంతకు ముందు స్త్రీలను గౌరవించే వారి ఘనతను చాటే పాటలు చాలా వచ్చాయి. అదే విధంగా ఆ మధ్య అడిడా అవళ్(కొట్టరా ఆమెను) లాంటి మహిళలను కించపరచే స్థాయికి మన పాటలు పడిపోయాయి. వాటి గురించి ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. ఇప్పుడు మనం ఏమీ చేయలేని పరిస్థితి అని పేర్కొన్నారు. ఒక పాట గురించి పదే పదే చర్చించడం వల్ల దానికి కచ్చితంగా ప్రాచుర్యం లభించడానికి మనమే కారణం అవుతున్నాం అన్నారు. దాని విజయానికి దోహదపడుతున్నామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన బీప్ పాట గురించి తనను చాలా మంది అడిగారని, నిజానికి తానా పాటను వినలేదని చెప్పారు. ఇప్పుడా పాట వినాలనే ఆసక్తి తనకూ కలుగుతోందన్నారు. అయితే ఆ పాట అసభ్యపదజాలాలతో కూడిన పాట అని తెలిసిందన్నారు. అది మంచి పాట కాదని తెలిసిన తరువాత అసలు దాని గురించి చర్చించకుండా ఉండడమే ఉత్తమం అన్నారు. అదే విధంగా దానికింత ప్రాచుర్యం వచ్చేది కాదు కూడా అన్నారు. ఒక మహిళగా చెప్పాలంటే ఇప్పుడు చిన్న పిల్లలు కూడా పాటలు వింటున్నారు. కాబట్టి పాటల్లో అసభ్య పదాలు లేకుండా ఉంటే బాగుంటుంది అని స్నేహ అన్నారు. -
టీఆర్నూ వదలని బీప్ సాంగ్
సరదాగా అనుకున్న విషయాలు ఒక్కోసారి తీవ్ర పరిణామాలను చూపుతాయి. కాలక్షేపం కోసం చేసిన పనులు అనూహ్యంగా కాళ్లకు చుట్టుకుంటాయి. చెరపకురా చెడేవు అన్న నానుడి తరహాలోనే నవ్వకురా నలుగురిలో నానేవు అనేలా తయారయ్యింది నటుడు శింబు, సంగీత దర్శకుడు అనిరుద్‌ల పరిస్థితి. శింబు,అనిరుద్ ఊసుపోక రూపొందించిన ఒక్క పాట వారి కెరీర్‌కే పెద్ద మచ్చగా మారిం ది. ఆడ వారిని అవమానించే విధంగా అసభ్య పదజాలాలతో కూడిన ఆ పాటను మహిళా లోకమే కాకుండా సభ్య సమాజమే అసహ్యహించుకుంటోంది. పలువురు శింబు,అనిరుద్ చర్యల్ని ఖండిస్తున్నారు. ఫిర్యాదుల పర్యంతం మేరకు చట్టం తన పని తాను చేయడానికి సన్నద్ధం అవుతోంది. ఇక శింబు, అనిరుద్ రూపొందించిన పాటగా చెప్పబడే ఆ బీప్ సాంగ్ ఇప్పటికీ సోషల్ నెట్ వర్క్స్‌లో హల్ చల్ చేస్తూనే ఉంది. అవకాశాలు వెనక్కి శింబు నటించిన ఇదు నమ్మ ఆళు చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని చాలా కాలంగా విడుదలకు నోచుకోకుండా ఉండి పోయింది. తాజాగా నటిస్తున్న అచ్చం ఎంబదు మడమయడా చిత్రం చాలా కాలంగా నిర్మాణంలోనే ఉంది. తాజాగా చేయాల్సిన ఒక చిత్రం సందిగ్ధంలో పడింది. త్రిష ఇల్లన్నా నయనతార చిత్ర దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ తన తదుపరి చిత్రాన్ని శింబు హీరోగా చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితిలో శింబు బీప్ సాంగ్ ప్రకంపనలు సృష్టించడంతో ఆ చిత్ర నిర్మాతలు ఇప్పుడు ఆలోచనల్లో పడ్డట్టు సమాచారం. ఇక అనిరుద్ పరిస్థితి అంతకంటే దారణంగా మారింది. ఈ యువ సంగీత దర్శకుడి సూర్య చిత్రం సింగం-3 కి సంగీతాన్ని అందించే అవకావం వచ్చింది. అయితే తన బీప్ సాంగ్ రగడ కారణంగా ఆయన్ని ఆ చిత్రం నుంచి తొలగించారు. ఇదే విధంగా అనిరుద్‌కు మరో రెండు చిత్రాలు పోయినట్లు తెలిసింది. తండ్రిని వదలని బీప్ సాంగ్ పాట రాసి పాడిన శింబును బాణీలు కట్టిన అనిరుద్‌ను కష్టాల్లోకి నెట్టిన బీప్ సాంగ్ శింబు తండ్రి టీ.రాజేందర్‌ను వదలలేదు. 10 ఎండ్రదుకుళ్ చిత్రం తరువాత ఆ చిత్ర దర్శకుడు విజయ్ మిల్టన్ టీ.రాజేందర్ కథానాయకుడిగా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజా పరిణామాలతో విజయ్ మిల్టన్ తన చిత్రం నుంచి టీఆర్ను తొలగించినట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ఒక్కపాట ఎందరి కెరీర్లకు ఎఫెక్ట్ ఇచ్చిందో చూశారా? ఇది శింబు,అనిరుద్‌లకు అవసరమా! -
విక్రమ్‌తో నయనతార?
తమిళసినిమా : నటి నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంచలనాలకు చిరునామా ఈ భామ. శింబుతో ప్రేమాయనమః వరకూ, ప్రభుదేవాతో వివాహాయనమః దాకా వెళ్లి తుదకు మళ్లీ కన్యాయనమః అంటూ నటన దారి పట్టిన ఈ కేరళ కుట్టి మీడియాకు దూరంగా ఉంటుందంటారు గానీ ఆమె చేసే వ్యాఖ్యలు మాత్రం చాలాకాలం కలకలం సృష్టిస్తుంటాయి. ఆ మధ్య ఆమె ఏ నటుడితోనైనా నటిస్తాను కానీ విక్రమ్‌తో మాత్రం చేసేది లేదు అన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఆమె అలా అనడానికి ఫ్లాష్‌బ్యాక్ వేరే ఉందిలెండి. అక్కడికి వెళ్లకుండా ప్రస్తుత విషయానికొస్తే విక్రమ్ తాజా చిత్రంలో నయనతార నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తున్న వార్తే. విక్రమ్ చాలా ఆశలు పెట్టుకున్న 10 ఎండ్రదుక్కుళ్ చిత్రం ఆయన ఆశలపై నీళ్లు చల్లింది. వెంటనే చిత్రం చేయలేని పరిస్థితి. అందుకే అంతకు ముందే కమిట్ అయిన మర్మమనిధన్ చిత్రం ప్రారంభానికి కాస్త ఆలస్యమైందని చెవులు కొరుక్కున్న వారూ లేకపోలేదు. ఏదేమైనా విక్రమ్ మర్మమనిధన్ సెట్‌పైకి వెళ్లడానికి టైమ్ ఆసన్నమైయ్యింది. అరిమానంబి చిత్రం ఫేమ్ ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి ముందు అనుకున్న నిర్మాత మారారు.దీన్ని ఐయింగరన్ సంస్థ మొదట నిర్మించతలపెట్టింది. ఇప్పుడీ చిత్రాన్ని పులి చిత్ర నిర్మాతల్లో ఒకరయిన శిబు తమీస్ నిర్మించనున్నారు. ఇందులో కాజల్‌అగర్వాల్ నాయకిగా నటించనున్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడామె స్థానంలో నయనతార నటించడానికి పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. ఇప్పటికే మాజీ ప్రియుడు శింబుతో ఇదు నమ్మ ఆళు చిత్రంలో రొమాన్స్ చేసిన నయనతార ఇప్పుడు విక్రమ్‌తో కలిసి నటించడానికి సిద్ధం అవుతోంది. ఇదే తరహాలో ఒక మాజీ ప్రియుడితో నటించిన ఈ మలయాళీ బ్యూటీ మరో మాజీ ప్రియుడు ప్రభుదేవాతో నటించనని తెగేసి చెప్పింది. అలాంటి నటి భవిష్యత్‌తో ఆయనతో నటించినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదంటున్నారు కోలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం నయనతార జీవాతో తిరునాళ్, కార్తీకి జంటగా కాస్మోరా చిత్రాల్లో నటిస్తోంది.త్వరలో తన తాజా ప్రియుడిగా ప్రచారంలో ఉన్న విఘ్నేశ్‌శివ దర్శకత్వంలో రెండవసారి నటించడానికి రెడీ అవుతోంది. -
కామెడీ కావాలి గురూ!
నటి నయనతార మైండ్ సెట్ మారిందా? అవుననే అంటున్నారు కోలీవుడ్ వర్గాలు. శింబు, ప్రభుదేవాలతో ప్రేమ బెడిసికొట్టిన తరువాత నయనతారలో చాలా మార్పు వచ్చింది. అంతకు ముందు సెట్లో గలగలా నవ్వుతూ సందడి చేసే ఈ మలయాళీ బ్యూటీని ప్రేమ వ్యవహారం చాలా బాధించిందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో ఆమె మూడీగా మారిపోయారు. కెమెరా ముందు మినహా ఇతర సమయాల్లో ఒక మూల ఏకాంతంగా కూర్చుంటారని యూనిట్ వర్గాలు అంటుంటారు. ఏవరైనా జోక్స్‌తో సందడి చేసినా మొహమాటానికి చిన్న నవ్వుతో సరిపెట్టుకునేవారట. నయనతార ఈ తరహా ప్రవర్తనతో దర్శక నిర్మాతలు కూడా ఆమెకు సీరియస్ కథా పాత్రలే ఇస్తున్నారు. అలా సెకెండ్ ఇన్నింగ్స్‌లో నయనతార ఎక్కువగా సీరియస్ పాత్రలే పోషించారని చెప్పవచ్చు.రాజారాణి, అనామిక, నన్బేండా, మాస్ చిత్రాలే ఇందుకు ఉదాహరణ.నానూమ్ రౌడీదాన్, కాష్మోరా,తిరునాళ్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇప్పటి వరకూ ప్రేమ,పాటలు అంటూ షరా మామూలు పాత్రలు పోషించిన నయనతారకు నానూమ్ రౌడీదాన్, తిరునాళ్ చిత్రాల్లో కాస్త హాస్యం రంగరించిన పాత్రలు లభించాయట. ఆపాటి హాస్యానికే ఖుషీ అయిన నయన్‌కు ఇప్పుడు పూర్తి వినోదభరిత పాత్రల్లో నటించాలనే ఆశ కలుగుతోందట.దీంతో తన వద్దకు వచ్చే దర్శకనిర్మాతలకు పూర్తి హాస్యభరిత పాత్రలతో రండి గురూ అంటూ విన్నవించుకుంటున్నారట. రియల్ లైఫ్‌లో కొరవడిన వినోదాన్ని రీల్ లైఫ్‌లో నయినా పొందాలనుకుంటున్నారేమో నయన్ అనే కామెంట్ కోడంబాక్కంలో వినిపిస్తోంది. సో నయనతారతో చిత్రాలు చెయ్యాలనుకునే దర్శక నిర్మాతలు వినోదభరిత పాత్రలు కావాలంటున్న ఆమె నయా కోరికను పరిశీలించాలి. -
శింబు చిత్రానికి హైకోర్టు బ్రేక్
వాలు చిత్రానికి హైకోర్టు బ్రేక్ వేసింది. శింబు, హన్సిక జంటగా నటించిన చిత్రం వాలు. నిక్ ఆర్ట్స్ చక్రవర్తి నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 17న విడుదల చేయనున్నట్లు టి.రాజేందర్ ప్రకటించారు. అయితే మ్యాజిక్ దేస్ సంస్థ వాలు విడుదల హక్కులు తాము పొందినట్లు ఈ చిత్రాన్ని వేరే వ్యక్తి విడుదల చేయనున్నట్లు ప్రకటించినట్లు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు వాలు చిత్ర విడుదలకు పై తాత్కాలిక నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ కేసులో తమను ప్రతివాదిగా చేర్చుకోవాలని టి.రాజేందర్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసు మంగళవారం విచారణకు వచ్చింది. టి.రాజేందర్ పిటీషన్‌ను న్యాయస్థానం కొట్టి వేసింది. చిత్ర నిర్మాత చక్రవర్తి తరపు వాదనలను మేజిక్ దాస్ సంస్థ తరపు వాదనలు విన్న న్యాయస్థానం వాలు చిత్ర విడుదలపై నిషేధాన్ని విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా వాలు చిత్రంపై నిషేధం విధించాలంటూ మరో ఐదు పిటిషన్లు కోర్టులో దాఖ లయ్యాయి. వీటిపై బుధవారం విచారణ జరగనుంది. దీంతో చిత్రం ఈ నెల 17న విడుదల సాధ్యం కాదని సినీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. -
ఇకపై కమెడియన్‌గానూ చేస్తాను
ఇకపై హీరోగానే కాకుండా సూర్య, శింబు, ఉదయనిధి స్టాలిన్ లాంటి హీరోల చిత్రాలలో హాస్యపాత్రలూ చేస్తానని ప్రముఖ కమెడియన్ సంతానం వ్యాఖ్యానించారు. ఆయన హీరోగా నటించి సొంతంగా నిర్మించిన చిత్రం ఇనియే ఇప్పుడిదాన్. ఈ నెల 12న విడుదలకు సిద్ధమవుతోంది. నటి ఆస్కా జవేరి, అఖిల్ హీరోయిన్లుగా నటించారు. దర్శక ధ్వయం మురుగన్, ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గురించి సంతానం మాట్లాడుతూ ఇనిమే ఇప్పడిదాన్ చిత్రాన్ని తొలిసారిగా తానే నిర్మించి విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. సినిమాలు నిర్మించడం సులభమేనని, విడుదల చేయడమే కష్టమవుతోందని అన్నారు. చిత్ర టైటిల్ నమోదు చేయడం నుంచి థియేటర్ల వద్దకు తీసుకురావడం వరకు చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఈ చిత్రం కథ సహజత్వానికి దగ్గర ఉంటుందన్నారు. కామెడీ, సెంటిమెంట్ పుష్కలంగా ఉంటాయని తెలిపారు. కమెడియన్‌గానే తనకు గుర్తింపు వచ్చిందని, కాబట్టి కేవలం హీరో పాత్రలే వేస్తానని చెప్పనని, తనకు సౌలభ్యంగా ఉండే నటులు సూర్య, శింబు, ఉదయనిధి స్టాలిన్ చిత్రాలలో హాస్య పాత్రలు చేస్తానని చెప్పారు. డాన్స్ నేర్చుకున్నా : తాను హీరోగా నటించడానికి సిద్ధమైన తర్వాత ఆర్య సలహాతో బరువు తగ్గానన్నారు. ఎలాంటి దుస్తులు ధరించాల్సిన విషయం గురించి శింబు సూచనలు పాటించానని తెలిపారు. ఇనిమే ఇప్పడిదాన్ చిత్రంలో తాను చూసిన కొన్ని సంఘటనలు, స్నేహితుల ప్రేమ విషయాలు కొన్ని చోటు చేసుకుంటాయని చెప్పారు. ఈ చిత్రం కోసం కష్టపడి డాన్స్ నేర్చుకున్నానని, పాటలు జనరంజకంగా వచ్చాయని సంతా నం అన్నారు. -
శింబుతో రొమాన్స్‌కు ఓకే
ప్రేమించిన నటిని వదిలేసి వెళ్లడం, అలాగే తన సరసన నటించడానికి ముందుకొచ్చిన ఒక నటి ఆ తరువాత చిత్రం నుంచి వైదొలగడం, రెండేళ్లుగా సినిమాలు లేకపోవడం లాంటి కారణాలతో బాధలో ఉన్న నటుడు శింబుతో చిత్రంలో రొమాన్స్ చేయడానికి హీరోయిన్ ఓకే అన్నారు. సంచలన నటి త్రిష ఇటీవల వరుసగా రెండు చిత్రాల నుంచి వైదొలిగారు. అందులో నటుడు శింబు చిత్రం ఒకటి. దాదాపు రెండేళ్ల తరువాత దర్శకుడు సెల్వరాఘవన్ మెగాఫోన్ ఇంచుమించు అదేగ్యాప్ తరువాత శింబు ముఖానికి రంగేసుకోవడానికి సిద్ధం అవుతున్నారు. వీరిద్దరూ కలసి చేయనున్న చిత్రంలో నటి త్రిష హీరోయిన్గా ఎంపికయ్యారు. నా ఫేవరేట్ దర్శకుడు సెల్వరాఘవన్ చిత్రంలో నటించడం సంతోషంగా ఉందంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అలాంటిది చిత్ర ప్రారంభానికి సన్నాహాలు జరుగుతుండగా ఈ చిత్రం చేయడం లేదంటూ తప్పుకున్నారు. దీంతో శింబుకు హీరోయిన్ వేట మళ్లీ మొదలైంది. అలా త్రిష పాత్రలో నటించే లక్కీచాన్స్ నటి క్యాథరిన్ ట్రెసా తలుపుతట్టింది. ఆ మోడ్రన్ చిత్రం ఫేమ్ బ్యూటీ ఆ చిత్రం విజయం సాధించినా తదుపరి అవకాశం లేదన్న బాధలో ఉన్న క్యాథరిన్ ట్రెసాకు లడ్డులాంటి అవకాశం శింబుతో కలిసి నటించడం, దీంతో వెంటనే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారని సమాచారం. ఈ చిత్రంలో మరో హీరోయిన్గా నటి తాప్సీ నటించనున్నారు. చిత్ర షూటింగ్ త్వరలో సెట్‌పైకి రానుంది. -
ఆ ముద్దు నేను పెట్టలేదు
నటుడు శింబుకు ముద్దు పెట్టింది తాను కాదంటోంది కన్నడ నటి హర్షిక. శింబు ఒక నటిని గాఢంగా ముద్దుపెట్టుకుంటున్న సన్నివేశాలు ఇంటర్నెట్లో ప్రచారమై కలకలం సృష్టిస్తున్నాయి. ఒక నక్షత్ర హోటల్లో ఈ చుంబనాల దృశ్యాలను చిత్రీకరించారు. ఇటీవల పలువురు నటీనటులు మలేషియాలో జరిగిన స్టార్‌నైట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పుడు అక్కడి నక్షత్ర హోటల్లో ఈ ముద్దు సన్నివేశాల వీడియోను చిత్రీకరించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సన్నివేశాల్లో శింబుపై ముద్దుల వర్షం కురిపించింది కన్నడ నటి హర్షిక అనే కథనాలు వెలువడుతున్నయి. అయితే ఈ ప్రచారాన్ని నటి హర్షిక ఖండించింది. దీని గురించి ఆమె స్పందిస్తూ వీడియోలో ఉన్న నటిని తాను కాదని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో తన పేరును పొరపాటుగా ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. నటుడు శింబు కూడా ఆ వీడియోలో ఉన్న నటుడిని తాను కాదని వెల్లడించారు. -
ఆ విషయం మాట్లాడను
శింబు గురించి మాట్లాడటానికేమీ లేదంటోంది నటి హన్సిక. ఈ ముంబాయి బ్యూటీలో చెప్పడానికి చాలా కోణాలున్నాయి. కోలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్గా రాణిస్తోంది. దర్శకుల నటిగా పేరు తెచ్చుకుంది. సేవా గుణం చెప్పాలంటే ఈ ముద్దుగుమ్మను అభినందించాల్సిందే. 23 ఏళ్ల హన్సిక సేవా భావం అపారం. ఇప్పటికే 23 మంది నిరుపేద పిల్లలను దత్తత తీసుకుని వారి సంరక్షణ బాధ్యతల్ని మోస్తున్న హన్సిక చెన్నైలో ఒక వృద్ధాశ్రమాన్ని నిర్మిం చాలనే తలంపుతో ఉంది. ఇక గ్యాసిప్స్ గురించి చెప్పాలంటే వాటికి కొదవేమీ లేదు. ముఖ్యంగా నటుడు శింబుతో ప్రేమ పెద్ద సంచలనాన్నే కలిగిం చింది. ప్రస్తుతం నటనపైనే పూర్తిగా దృష్టి సారిస్తున్నట్లు చెబుతున్న హన్సికతో చిన్న చిట్‌చాట్. సినీ జీవితం ఎలా సాగుతోంది? చాలా జాయ్‌ఫుల్‌గా, బిజీ బిజీగా సాగుతోంది. ప్రస్తుతం అరణై్మణై మిగామాన్, రోమియో జూలియట్, వాలు, చిత్రాలతోపాటు కొత్తగా విశాల్ సరసన ఒక చిత్రం చేయనున్నాను. మరో నూతన చిత్రాన్ని అంగీకరించాను. ఈ చిత్రాలన్నింటిలోను నా నటనే అందరూ చెప్పుకునే విధంగా ఉంటుంది. వాటిలో అరణ్మణై చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. నేనెప్పుడూ నటనకు రిహార్సల్స్ చెయ్యను. అలాంటిది ఇందులో చేశాను. నా అభినయం చూసి మా అమ్మ ఏడ్చేసింది. అలాగే మిగామన్ చిత్రంలో కూడా విభిన్న పాత్ర పోషిస్తున్నాను. ఇక రోమియో జూలియట్ చిత్రాన్ని చాలా ఎంజాయ్ చేస్తూ నటిస్తున్నాను. ఇదో భిన్నమైన లవ్‌స్టోరీ. ప్రస్తుతం ఎవరిని పోటీగా భావిస్తారు? నిజం చెప్పాలంటే నాకు నేనే పెద్ద పోటీ. ముందే చెప్పినట్లు ప్రస్తుతం నా చేతిలో అర డజను చిత్రాలున్నాయి. మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. పాత్రకు పాత్రకూ మధ్య వైవిధ్యం చూపిస్తూ నటించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను. నెంబర్ వన్ గేమ్‌ల పైనా నాకు నమ్మకం లేదు. శింబుతో లవ్ బ్రేకప్ గురించి? ఆ విషయం గురించి మాట్లాడదలచుకోలేదు. కొన్ని విషయాల్లో మౌనంగా ఉండటమే మేలు. సెలైన్స్ ఈజ్ మై డిగ్నిటీ. అయినా ఆయన గురించి చెప్పడానికేమీ లేదు. తను రెండు వ్యాఖ్యలు చేశారు. నేనూ రెండు వ్యాఖ్యలు అన్నాను. అక్కడితో అది ముగిసిపోయింది. ఇప్పుడు ఎవరినీ ఏ విధంగానూ హర్ట్ చెయ్యదలచుకోలేదు. నా పనేమిటో నేను చేసుకునిపోతున్నాను ఇప్పటికింతే. ఈ పరిశ్రమలో మీకు మిత్రులెవరు? నాకు చాలా మంది మిత్రులున్నారు. నటుడు జయం రవి. కో స్టార్స్ అందరితోను స్నేహంగా మెలుగుతాను. వారందరూ ఫోన్ చేస్తుం టారు. నేను పార్టీలకు పబ్‌లకు వెళ్లను. షూటింగ్ లేకపోతే ముంబాయి వెళ్లిపోతాను. -
ముందు వాళ్లు.. తరువాత నేను
కోలీవుడ్‌లో పెళ్లికాని ఏజ్‌బార్ హీరోలు చాలామందే ఉన్నారు. వారిలో ముందు వరుసలో నిలిచేది ఆర్య, శింబు, జయ్ల పేర్లను పేర్కొనవచ్చు. వీరి ముగ్గురిపై హీరోయిన్లతో కలుపుతూ పుకార్లు జోరుగానే సాగుతున్నాయి. ఆర్య తన సరసన నటించిన హీరోయిన్లందరితోను రొమాన్స్ చేస్తాడనే టాక్ బహిరంగంగానే వినిపిస్తుంది. ఇక శింబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నయనతార, హన్సికల గురించి కథలు కథలుగా ప్రచారం అయ్యాయి. యువ నటుడు జయ్ ఈ విషయంలో తక్కువేమీ కాదు. అలాంటి జయ్‌ను పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని ప్రశ్నిస్తే, ముందు ఆర్య, శింబులను పెళ్లి చేసుకోమని చెప్పండి ఆ తరువాత ఈ ప్రశ్న తనను అడగండి అంటున్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ తాను నటనే చాలనుకోవడం లేదని, అందువలనే కార్ రేసింగ్‌లో పాల్గొంటున్నానని తెలిపారు. తన కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోయినా తన ఆసక్తిని కాదనలేక కారు రేసింగుకు అంగీకరించారని చెప్పారు. నటి నజ్రియాతో కలసి నటించిన తిరుమణం ఎన్నుం నిఖా చిత్రం తెరపైకి వచ్చిందన్నారు. ఈ చిత్ర విడుదలలో జాప్యానికి కారణాలు చాలా ఉన్నాయని చెప్పారు. కొన్ని సంప్రదాయ వేడుకలను నిజంగానే చిత్రీకరించాలని భావించామని చెప్పారు. ఆ సమయం కోసం వాటి అనుమతి కోసం ఎదురు చూడాల్సి వచ్చిందని వివరించారు. ఇక తన పెళ్లి ఎప్పుడని అడుగుతున్నారని ఈ ప్రశ్నను మొదట శింబు, ఆర్య, విశాల్ ను అడగండి అని అన్నా రు. వాళ్లు పెళ్లి చేసుకున్న తరువాత తా ను చేసుకుంటానని అన్నారు. తన వయసు చాలా తక్కువని ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటానని జయ్ అన్నారు. -
వారి మనసే మారుతోంది
తన ప్రేమ ఒకే రీతిలో ఉందని, అయితే ప్రియురాళ్ల మనసే మారుతోందని నటుడు శింబు వేదాంత ధోరణిలో వ్యాఖ్యానించారు. శింబు, నయనతారల మధ్య ప్రేమ వ్యవహారం ముగిసిన తర్వాత హన్సికతో ప్రేమాయణం మొదలైంది. ఇదీ ప్రస్తుతం తెగతెంపులకు దారితీసింది. వాలు చిత్రంలో జనించిన ఈ ప్రేమ ఆ చిత్ర షూటింగ్ ముగిసేలోపే అంతమైంది. దీంతో షూటింగ్ చివరి షెడ్యూల్‌కు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ వ్యవహారం నిర్మాతల సంఘంలో పంచాయతీ వరకు వెళ్లింది. ప్రస్తుతం బెంగుళూరులో శింబు, హన్సిక డ్యూయెట్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ అనుభవం గురించి హన్సికతో మాట్లాడగా ఈ చిత్రాన్ని ముగించాల్సిన బాధ్యత తనపై ఉందని, తాను శింబు కోసం నటించలేదన్నారు. డెరైక్టర్ కోసమే నటిస్తున్నానని తెలిపారు. తాను జరిగిన దాని గురించి ఆలోచించడం లేదని, భవిష్యత్తు గురించే ఆలోచిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. దీని గురించి శింబు వద్ద విలేకరులు ప్రశ్నించగా మాజీ ప్రియురాలితో నటించడం కొత్తకాదని అన్నారు. తన ప్రేమ ఒకే రీతిలో ఉందని, అయితే ప్రియురాళ్ల మనస్తత్వమే మారుతోందన్నారు. -
శింబుకు కటీఫ్ చెప్పిన హన్సిక
-
నెట్లో శింబు 'వాలు' లీక్డ్ పాటలు
-
ఔను పోటీ పడ్డాం
ఔను మేము పోటీపడ్డాం, చిత్రాల్లో ఒకరినొకరు విమర్శలు గుప్పించుకున్నాం అంటున్నారు నటుడు శింబు. ఈ సంచలన నటుడు మాట్లాడుతోంది ధనుష్ గురించే. ఇంతకు ముందు వీరిద్దరు బద్దశత్రువులుగా మెలిగారు. ఒకే వేదికపై సినిమా కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా ఇష్టపడేవారు కాదు. అయితే ఇదంతా ఒకప్పుడు ఇప్పుడు కలిసే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. విదేశాలకూ ఒకటిగా వెళుతున్నారు. తాజాగా వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుష్ నిర్మిస్తున్న కాకాముట్టై చిత్రంలో శింబు ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. అంతేకాదు శింబు ఇటీవల ధనుష్‌తో కలిసి ఉన్న ఫొటోను తన ట్విట్టర్లో పోస్ట్ చేసి మంచి పోటీతత్వం ఉన్న వాళ్లే మంచి మిత్రులవ్వగలరంటూ పేర్కొనడం విశేషం. ధనుష్‌తో పోటీ గురించి శింబు ప్రస్తావిస్తూ తామిద్దరం 2000 సంవత్సరంలో ఒకే సారి హీరోలుగా రంగ ప్రవేశం చేశామన్నారు. అప్పట్లో ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొందన్నారు. ఆ ప్రభావం తాము నటించిన చిత్రాల్లోనూ చోటు చేసుకునేదని తెలిపారు. ఒకరి సినిమా మరొకరి గురించి విమర్శలు గుప్పించుకునేవాళ్లం అన్నారు. ఈ పోటీ, పోరు అనేది తమ అభిమానుల వరకు పాకిందన్నారు. ఫేస్బుక్, ట్విట్టర్లలో వాళ్లు ఢీ అంటే ఢీ అంటూ మోదుకునేవారని తెలిపారు. అయితే ధనుష్‌కు తనకు మధ్య కోల్డ్‌వార్ అనేది కొంత కాలం తరువాత తగ్గుముఖం పడుతూ వచ్చిందన్నారు. సినిమా కార్యక్రమాల్లో ఒకరినొకరం పలకరించుకోవడం షేక్ హ్యాండ్లిచ్చుకోవడం ప్రారంభం అయ్యిందని చెప్పారు. అలా మొదలయిన తమ స్నేహం ఇప్పుడు పూర్తిగా బలపడిందని శింబు పేర్కొన్నారు. -
శ్రీమతికొక బహుమతి
రెండు హృదయాల మధ్య తీయని ఆనందాన్ని, అనుబంధాన్ని పెంచే మంచి వస్తువు బహుమతి. రక్త సంబంధం కావచ్చు, ప్రేమికులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు. ముఖ్యంగా ప్రేమికులకంటూ ఒక రోజు ఉంది కాబట్టి ఫిబ్రవరి 14 కోసం ఈ జంటలు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇక సినిమా జంటల విషయానికొస్తే ఒకరికొకరు ఖరీదైన బహుమతులతో తమ అనుబంధాన్ని పెంచుకుంటుంటారు. అలా బహుమతుల పంపకాలతో ప్రణయ సాగరంలో మునిగితేలుతున్న కొన్ని జంటల గురించి చూద్దాం. బాయ్స్, కాదల్, వానం, 555 వంటి పలు చిత్రాలతో ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్న నటుడు భరత్. ఈయన ఈ మధ్య జెస్సీని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమ, పెళ్లి గురించి ఆయన మాటల్లోనే.. జస్లీ దంత వైద్యురాలు. దంత వైద్యశాలలోనే నేనామెను తొలిసారిగా కలుసుకున్నాను. కొన్ని నెలల తర్వాత ఒక స్నేహితుని వేడుకలో మళ్లీ కలుసుకున్నాం. ఆ కలయిక మమ్మల్ని స్నేహితుల్ని చేసింది. తొలి చూపులోనే మామధ్య ప్రేమ పుట్టలేదు. ఎస్ఎంఎస్ల ద్వారా మా స్నేహం పెరిగి ప్రేమగా మారింది. గత ఏడాది ప్రేమికుల రోజున జెస్సీకి విందు ఇచ్చాను. ఈ ఏడాది ఆమె కోసం వజ్రాల నెక్లెస్ బహుమతిగా అందజేశాను. చిరకాలంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న మరో నవజంట సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ కుమార్, గాయని సైందవి. వీరి ప్రేమానుబంధం గురించి జీవీ ప్రకాష్ కుమార్ పేర్కొంటూ ‘నేను పదవ తరగతి చదువుతున్న సమయంలో అదే పాఠశాలలో సైందవి ఎనిమిదవ తరగతి చదువుతుండేది. లవ్ ఎట్ ఫస్ట్ టైమ్ అన్నట్లు తొలి చూపులోనే మా మధ్య ప్రేమ మొలకెత్తింది. అలా 12 ఏళ్లు మా మధ్య ప్రేమ కొనసాగింది. గత ఏడాది ప్రేమికుల రోజున సైందవికి సర్ప్రైజ్ ఇచ్చాను. ఈ ఏడాది ఒక పెద్ద సర్ప్రైజ్ ఆమె కోసం ఎదురు చూస్తోంది’ అని తెలిపారు. సంచలన ప్రేమ జంట శింబు హన్సిక మధ్య గత ఏడాది ప్రేమ మొలకెత్తింది. ఇద్దరు పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించి సంచలనం కలిగించారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమ బ్రేక్ అయినట్లు ప్రచారం జరిగింది. అలాంటి పరిస్థితిలో ఇటీవల శింబు పుట్టిన రోజున నటి హన్సిక హఠాత్తుగా ఆయన ముందు ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో వీరి ప్రేమ గురించి మళ్లీ రకరకాల ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నయనతార సరసన ఇదు నమ్మ ఆళు చిత్రంలో నటిస్తున్న శింబును హన్సిక, నయనతార గురించి అడగ్గా హన్సిక నా లవర్, నయనతార నా ఫ్రెండ్ అంటూ బదులిచ్చారు. -
ముహూర్తం కుదిరింది
నటుడు శింబు, నయనతారల పునర్ కలయికకు ముహూర్తం కుదిరింది. ఈ జంట కలయికను ఇంత విశేషంగా చెప్పుకోవడానికి కారణం తెలియంది కాదు. ఇంతకుముందు నువ్వు లేక నేను లేను అన్నంతగా ప్రేమించుకున్న శింబు, నయనతార ఆ తర్వాత మనస్పర్థల కారణంగా విడిపోయారు. 2006లో వల్లవన్ చిత్రం షూటింగ్ సమయంలో వీరి ప్రేమకు బీజం పడింది. కొన్ని నెలలకే ఆ ప్రేమ బ్రేక్ అప్ అయ్యింది. ఏడేళ్ల తర్వాత ఈ మాజీ ప్రేమికులు కలిసి డ్యూయెట్లు పాడడానికి సిద్ధం అవుతున్నారు. పాండిరాజ్ దర్శకత్వంలో శింబు నిర్మిస్తూ హీరోగా నటిస్తున్న చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో మళ్లీ ఈ జంట కలయికకు డిసెంబర్ ఐదున ముహూర్తం కుదిరింది. ఆ రోజున వీరిద్దరూ నటించే సన్నివేశాలను దర్శకుడు పాండిరాజ్ చిత్రీకరించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై క్రేజ్ పెరిగిపోయింది. బయ్యర్లు అప్పుడే చిత్ర కొనుగోలుకు పోటీ పడుతున్నారట. పడరా మరి సంచలనాలకు కేంద్రబిందువు అయిన జంట నటిస్తున్న చిత్రం కదా! -
శింబు, ఆండ్రియాల సాన్నిహిత్యం
నటుడు శింబు, నటి ఆండ్రియా చాలా సన్నిహితంగా మెలుగుతున్నారని, ఇది మింగుడుపడని శింబు ప్రేయసి హన్సిక షాక్‌కు గురైందని తాజా సమాచారం. కోలీవుడ్‌లో సంచలన నటుడిగా పేరొందిన నటుడు శింబు నిజ జీవితంలో నటి నయనతారతో లవ్ డ్యూయెట్లు పాడారు. వీరి ప్రేమ పెళ్లిపీటలు ఎక్కకుండానే ముక్కలైంది. సమీప కాలంలో నటి హన్సిక, శింబు ప్రేమ లో పడ్డారు. వీరు వెట్టై మన్నన్, వాలు చిత్రాల్లో నటిస్తున్నప్పుడు ప్రేమకు బీజం పడింది. వీరి గురించి రకరకాల ప్రచారం జరగడంతో ఒక ఫైన్‌డే ‘మేము ప్రేమించుకుం టున్నాం. పెళ్లి కూడా చేసుకుంటాం’ అంటూ శింబు, హన్సిక బహిరంగంగా ప్రకటించారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాల వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శింబు ఇటీవల సొంతంగా ఒక అం దమైన భవనాన్ని కట్టించుకుని గృహ ప్రవేశం కూడా చేశాడు. ఇక హన్సికతో పెళ్లే తరువాయి అనుకున్నాడు. ఈ నేపథ్యంలో ఐదేళ్ల తర్వాతే తమ పెళ్లి ఉంటుందని నటి హన్సిక స్టేట్మెంట్ ఇచ్చింది. దీని వెనుక ఆమె తల్లి ఒత్తిడి ఉందన్నది అసలు విషయం. నటిగా హన్సిక కెరీర్ ప్రస్తుతం చాలా బ్రైట్‌గా ఉంది. చేతినిండా చిత్రాలున్నాయి. విజయాల బాటలో పయనిస్తోంది. పారితోషికం బాగా డిమాండ్ చేస్తోంది. దీపముండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలనే సామెతను హన్సిక తల్లి అమలుచేస్తోంది. పెళ్లి చేసుకుంటే నటనకు స్వస్తి చెప్పాలి. లక్షల ఆదాయానికి గండి పడుతుంది. అలా జరగడం హన్సిక తల్లికి ఇష్టం లేదు. ఇది శింబుకు మింగుడు పడ లేదు. దీంతో వారి మధ్య దూరం పెరిగినట్లు సమాచారం. ఇలాంటి సమయంలో హాస్యనటుడు వీటీవీ గణేష్ ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న ఇంగ ఎన్న సొల్లుదు చిత్రంలో శింబు అతిథి పాత్ర పోషిస్తున్నాడు. ఈయన సరసన సంచలన నటి ఆండ్రియా నటిస్తోంది. ఈమె ఆ మధ్య యువ సంగీత దర్శకుడు అనిరుద్‌తో ప్రేమ కలాపాలు సాగించింది. అది నెట్లో హల్చల్ చేయడంతో ముగిసిపోయిన ప్రేమ కథ అంటూ తేలిగ్గా కొట్టి పారేసింది. తాజా గా శింబుతో సన్నిహితంగా ఉంటున్నట్లు సమాచారం. ఇంగ ఎన్న సొల్లుదు చిత్ర షూటింగ్ సమయంలోనే వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగినట్లు టాక్. ఈ టాక్ నటి హన్సికకు పెద్ద షాక్ ఇచ్చినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. -
శింబుకు జోడీ ఎవరో?
శింబు చిత్రం తెరపైకి వచ్చి చాలా కాలమైంది. పోడాపోడినే తెరపైకొచ్చిన ఆయన చివరి చిత్రం. అది ఆశించిన విజయం సాధించలేదు. దీపావళికి విడుదలవుతుందనుకున్న వాలు చిత్రం తెరపైకి రాలేదు. దీంతో శింబు అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యూ రు. అయితే తన అభిమానుల్ని అలరించడానికి శింబు సిద్ధమయ్యారు. ఈసారి తనే సొంతంగా చిత్ర నిర్మాణం చేపట్టారు. శింబు సినీ ఆర్ట్స్ పతాకంపై రూపొందే చిత్రంలో ఆయన హీరోగా నటిస్తున్నారు. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చెన్నై పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించి హీరోరుున్ను ఇంకా ఎంపిక చేయలేదట. దర్శకుడు మాట్లాడుతూ శింబుకు జంటగా నటించే హీరోయిన్ ఇంకా దొరకలేదన్నారు. ఏంజిల్ లాంటి ఒక అందమైన నటి కావాలని పేర్కొన్నారు. అలాంటి బ్యూటీ కోసం తీవ్రంగా అన్వేషణ సాగుతోందని వివరించారు. ఈ చిత్రానికి శింబు సోదరుడు కురళరసన్ సంగీతం అందించడం విశేషం.