అందుకోసం ప్రేక్షకులు రారు | Manjiya mohan did not utilize her chance in sketch movie | Sakshi
Sakshi News home page

అందుకోసం ప్రేక్షకులు రారు

Published Mon, Jun 5 2017 2:16 AM | Last Updated on Tue, Sep 5 2017 12:49 PM

అందుకోసం ప్రేక్షకులు రారు

అందుకోసం ప్రేక్షకులు రారు

ప్రేక్షకులు అందుకోసమే థియేటర్లకు రారు అంటోంది నటి మంజిమామోహన్‌. గౌతమ్‌మీనన్‌ అచ్చం యంబదు మడమయడా చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం చేసిన మలయాళీ అమ్మడు మంజిమామోహన్‌ అన్న సంగతి తెలిసిందే. శింబుతో రొమాన్స్‌ చేసిన ఈ చిత్రం సక్సెస్‌ అనిపించుకోవడంతో ఈ బ్యూటీకి అవకాశాలు వరుసకట్టాయి. ఇక్కడి వరకూ బాగానే ఉంది. విక్రమ్‌తో జత కట్టే అవకాశం కూడా అమ్మడి తలుపు తట్టింది. స్కెచ్‌ చిత్రంలో నటించే అవకాశం వచ్చినా, దాన్ని మంజిమామోహన్‌ సద్వినియోగం చేసుకోలేకపోయింది. 

కారణం  ఆ చిత్ర పాటల సన్నివేశాల్లో కాస్త గ్లామర్‌గా నటించాలని దర్శక నిర్మాతలు చెప్పారట. అంతే గ్లామర్‌కు తాను దూరం అని ముందే నిర్ణయించుకున్న మంజిమామోహన్‌ ఆ నిర్ణయంపైనే స్టాండ్‌ అయ్యిందట. అందాలారబోతకు ససేమిరా అనడంతో స్కెచ్‌ చిత్రంలో నటించే అవకాశం మిస్‌ అయ్యింది. దీంతో ఆ లక్కీ చాన్స్‌ను నటి తమన్నా అందుకుంది. ఇదే విధంగా మరికొన్ని అవకాశాలు పీచే మూడ్‌ అన్నాయి.

అయినా గ్లామర్‌ విషయంలో తన నిర్ణయం మారదు అంటోంది నటి మంజిమా మోహన్‌. అంతే కాదు గ్లామర్‌ కోసం ప్రేక్షకులు సినిమా థియేటర్లకు రారు అని, మంచి కథా చిత్రాలను చూడడానికే వస్తారని తన నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. ప్రస్తుతం మంజిమామోహన్‌ చేతిలో రెండు తమిళ సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి క్షత్రియన్‌. విక్రమ్‌ప్రభు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇక మరో చిత్రం ఇప్పడై వెల్లుమ్‌. ఉదయనిధి స్టాలిన్‌తో జత కడుతున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ రెండు చిత్రాలపైనే అమ్మడి జాతకం ఆధారపడి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement