ఆ విషయం మాట్లాడను
శింబు గురించి మాట్లాడటానికేమీ లేదంటోంది నటి హన్సిక. ఈ ముంబాయి బ్యూటీలో చెప్పడానికి చాలా కోణాలున్నాయి. కోలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా రాణిస్తోంది. దర్శకుల నటిగా పేరు తెచ్చుకుంది. సేవా గుణం చెప్పాలంటే ఈ ముద్దుగుమ్మను అభినందించాల్సిందే. 23 ఏళ్ల హన్సిక సేవా భావం అపారం. ఇప్పటికే 23 మంది నిరుపేద పిల్లలను దత్తత తీసుకుని వారి సంరక్షణ బాధ్యతల్ని మోస్తున్న హన్సిక చెన్నైలో ఒక వృద్ధాశ్రమాన్ని నిర్మిం చాలనే తలంపుతో ఉంది. ఇక గ్యాసిప్స్ గురించి చెప్పాలంటే వాటికి కొదవేమీ లేదు. ముఖ్యంగా నటుడు శింబుతో ప్రేమ పెద్ద సంచలనాన్నే కలిగిం చింది. ప్రస్తుతం నటనపైనే పూర్తిగా దృష్టి సారిస్తున్నట్లు చెబుతున్న హన్సికతో చిన్న చిట్‌చాట్.
సినీ జీవితం ఎలా సాగుతోంది?
చాలా జాయ్‌ఫుల్‌గా, బిజీ బిజీగా సాగుతోంది. ప్రస్తుతం అరణై్మణై మిగామాన్, రోమియో జూలియట్, వాలు, చిత్రాలతోపాటు కొత్తగా విశాల్ సరసన ఒక చిత్రం చేయనున్నాను. మరో నూతన చిత్రాన్ని అంగీకరించాను. ఈ చిత్రాలన్నింటిలోను నా నటనే అందరూ చెప్పుకునే విధంగా ఉంటుంది. వాటిలో అరణ్మణై చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. నేనెప్పుడూ నటనకు రిహార్సల్స్ చెయ్యను. అలాంటిది ఇందులో చేశాను. నా అభినయం చూసి మా అమ్మ ఏడ్చేసింది. అలాగే మిగామన్ చిత్రంలో కూడా విభిన్న పాత్ర పోషిస్తున్నాను. ఇక రోమియో జూలియట్ చిత్రాన్ని చాలా ఎంజాయ్ చేస్తూ నటిస్తున్నాను. ఇదో భిన్నమైన లవ్‌స్టోరీ.
ప్రస్తుతం ఎవరిని పోటీగా భావిస్తారు?
నిజం చెప్పాలంటే నాకు నేనే పెద్ద పోటీ. ముందే చెప్పినట్లు ప్రస్తుతం నా చేతిలో అర డజను చిత్రాలున్నాయి. మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. పాత్రకు పాత్రకూ మధ్య వైవిధ్యం చూపిస్తూ నటించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను. నెంబర్ వన్ గేమ్‌ల పైనా నాకు నమ్మకం లేదు.
శింబుతో లవ్ బ్రేకప్ గురించి?
ఆ విషయం గురించి మాట్లాడదలచుకోలేదు. కొన్ని విషయాల్లో మౌనంగా ఉండటమే మేలు. సెలైన్స్ ఈజ్ మై డిగ్నిటీ. అయినా ఆయన గురించి చెప్పడానికేమీ లేదు. తను రెండు వ్యాఖ్యలు చేశారు. నేనూ రెండు వ్యాఖ్యలు అన్నాను. అక్కడితో అది ముగిసిపోయింది. ఇప్పుడు ఎవరినీ ఏ విధంగానూ హర్ట్ చెయ్యదలచుకోలేదు. నా పనేమిటో నేను చేసుకునిపోతున్నాను ఇప్పటికింతే.
ఈ పరిశ్రమలో మీకు మిత్రులెవరు?
నాకు చాలా మంది మిత్రులున్నారు. నటుడు జయం రవి. కో స్టార్స్ అందరితోను స్నేహంగా మెలుగుతాను. వారందరూ ఫోన్ చేస్తుం టారు. నేను పార్టీలకు పబ్‌లకు వెళ్లను. షూటింగ్ లేకపోతే ముంబాయి వెళ్లిపోతాను.