Hansika Motwani
-
నా కాపురంలో హన్సిక చిచ్చుపెడుతోంది.. పోలీసులకు నటి ఫిర్యాదు
హీరోయిన్ హన్సిక (Hansika Motwani) వేధింపులు తాళలేకపోతున్నానంటూ బుల్లితెర నటి ముస్కాన్ నాన్సీ పోలీసులను ఆశ్రయించింది. భర్త ప్రశాంత్ మోత్వానీ, అత్త జ్యోతి, ఆడపడుచు హన్సిక మోత్వానీలు తనను మానసికంగా హింసిస్తున్నారని వాపోయింది. ఈ మానసిక ఒత్తిడి వల్ల తన ముఖంలో కొంతభాగం పక్షవాతానికి గురైందని పేర్కొంది. నటి ఫిర్యాదు మేరకు పోలీసులు గృహ హింస కింద కేసు నమోదు చేసుకున్నారు. డిసెంబర్ 18న నటి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఖరీదైన గిఫ్టులు తెమ్మని..పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముస్కాన్ (Muskaan Nancy James), ప్రశాంత్ 2020లో పెళ్లి చేసుకున్నారు. వివాహమైన కొంతకాలానికే డబ్బు, ఖరీదైన బహుమతులు కావాలని నటి అత్త, ఆడపడుచు హన్సిక డిమాండ్ చేశారట! అంతేకాకుండా ఆస్తిలోనూ ఏవో కుట్రలకు పాల్పడ్డారని నటి ఆరోపించింది. తన వైవాహిక బంధంలోనూ హన్సిక పదేపదే జోక్యం చేసుకుని గొడవలకు కారణమయ్యేదని పేర్కొంది. వీరు పెట్టిన టార్చర్ వల్ల తన ముఖం పాక్షిక పక్షవాతానికి గురైందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై హన్సిక, ప్రశాంత్ ఇంతవరకు స్పందించలేదు. కాగా ముస్కాన్ దంపతులు 2022 నుంచి విడివిడిగానే జీవిస్తున్నారు. ప్రశాంత్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.చదవండి: అప్పట్లో ఐరన్ లెగ్ అని పేరొస్తుందని భయపడ్డా: చిరంజీవిపాక్షిక పక్షవాతం2022లో నటి తన ముఖం పాక్షిక పక్షవాతానికి గురైనట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో మనం అస్సలు ఊహించలేం. కొంతకాలంగా నేనేమైపోయానని అనుకుంటున్నారా? నా జీవితంలో ఏం జరుగుతుందనేది కొందరికి మాత్రమే తెలుసు. నేను ముఖ పక్షవాతంతో బాధపడుతున్నాను. అధిక ఒత్తిడి వల్ల నాకీ పరిస్థితి వచ్చింది. గతంలో ఈ వ్యాధి బారిన పడ్డప్పుడు కోలుకున్నాను. కానీ ఇప్పుడు మరోసారి ఆ వ్యాధి నా జీవితంలోకి ప్రవేశించింది.ఇంతకంటే దుర్భరమైన పరిస్థితి ఇంకేముంటుంది?గత కొద్ది నెలలనుంచి నేను, నా తల్లిదండ్రులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నాం. ముఖం ఉబ్బిపోయి ఆ బాధ భరించరాకుండా ఉంది. ఒక నటికి ఇంతకంటే దుర్భరమైన పరిస్థితి ఇంకేముంటుంది? నాముందున్న సమస్యలతో పోరాడే శక్తినిచ్చిన భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు సపోర్ట్‌గా నిలబడే పేరెంట్స్ ఉండటం నా అదృష్టం. జీవితం అంత ఈజీ కాదు.. కానీ ఏదో ఒకరోజు తప్పకుండా అన్నీ మారిపోతాయి అని రాసుకొచ్చింది.సీరియల్స్..ముస్కాన్ నాన్సీ.. తొడి ఖుషి తొడె ఘమ్ సీరియల్లో సహాయక నటిగా యాక్ట్ చేసింది. ఈ ధారావాహికతో విశేష గుర్తింపు తెచ్చుకున్న నాన్సీకి మాతా కీ చౌకి సీరియల్ ఆఫర్ వచ్చింది. ఇందులో ప్రధాన పాత్రలో నటించింది. అదాలత్, ఫియర్ ఫైల్స్, క్రైమ్ పెట్రోల్ షోలలో కొన్ని ఎపిసోడ్స్‌లో మెరిసింది. భారత్ కా వీర్ పుత్ర: మహారాణ ప్రతాప్, ఏజెంట్ రాఘవ్- క్రైమ్ బ్రాంచ్ షోలలో నటించింది. గత కొన్నేళ్లుగా నటనకు దూరంగా ఉంటోంది.చదవండి: అన్నీ ఒకేసారి.. నా వల్ల కావట్లేదంటూ ఏడ్చేసిన మాధవీలత -
వెన్నెలనీ దోచినదీ నీవేనా.. నవయవ్వనంగా మెరిసిపోతున్న ఈ బ్యూటీ ఎవరు? (ఫోటోలు)
-
మాల్దీవులు బీచ్‌లో హన్సిక అందాల హోయలు (ఫోటోలు)
-
వెడ్డింగ్ డే మూడ్: మాల్దీవుల్లో హన్సిక మోత్వానీ జిల్జిల్ జిగా (ఫోటోలు)
-
పెళ్లి రోజు స్పెషల్.. భర్తతో హన్సిక లవ్లీ పోస్ట్ (ఫొటోలు)
-
Hansika Motwani యాపిల్ బ్యూటీలా ఎంత క్యూట్‌గా ఉందో! (ఫోటోలు)
-
జిగేల్మనే అందాలతో ట్రెండింగ్‌లో హన్సిక మోత్వానీ (ఫోటోలు)
-
పెళ్లికూతురిలా మెరిసిపోతున్న టాలీవుడ్ హీరోయిన్.. ఫోటోలు
-
దీపావళి పటాకా మాదిరి గ్లామర్‌తో పేల్చేసిన హన్సిక (ఫోటోలు)
-
సరికొత్త ప్రయాణం : నటి హన్సిక గృహప్రవేశ వేడుక (ఫొటోలు)
-
గుడిలో టాప్ హీరోయిన్ .. ఫిదా అవుతున్న తమిళ అభిమానులు
తమిళం, తెలుగు భాషల్లో క్రేజీ కథానాయకిగా రాణించిన ముంబాయి బ్యూటీ హన్సిక. 2001లో ధనుష్‌కు జంటగా మాప్పిళై చిత్రం ద్వారా కోలీవుడ్‌కు కథానాయకిగా పరిచయమైన ఈమె తొలి చిత్రంతోనే ఇక్కడ సినీ ప్రముఖులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ఎంగేయుమ్ కాదల్, ఒరు కల్ ఒరు కన్నాడీ, బిర్యాని, సింగం 2 వంటి పలు సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించి కోలీవుడ్‌లో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అదేవిధంగా తెలుగులోనూ దేశముదురు చిత్రంతో రంగ ప్రవేశం చేసి తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ప్రముఖ హీరోలతో నటించి టాప్ కథానాయకిగా రాణించారు. అలా 50 చిత్రాలకు పైగా నటించిన హన్సిక 2022లో వివాహం చేసుకున్నారు. అయితే నటనకు మాత్రం దూరం కాలేదు. వివాహానంతరం అవకాశాలు తగ్గాయి అన్నది వాస్తవం. దీంతో మళ్లీ మంచి అవకాశాలు దక్కించుకోవడానికి హన్సిక తరచూ తన గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ దర్శక నిర్మాతల దృష్టిలో పడే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కాగా ఆదివారం ఉదయం ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి మధుర మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడ విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కామాక్షి అమ్మవారి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో హన్సిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ ఒకటి తమిళ వారిని మెప్పిస్తుంది. తాను ముంబైలో పుట్టినా మానసికంగా మాత్రం తాను తమిళ అమ్మాయినే అంటూ హన్సిక ఇచ్చిన స్టేట్మెంట్ వారిని మెప్పిస్తుంది. అంతేకాకుండా (నమ్మ ఊరు సాప్పాటు) మన ఊరు భోజనం సూపర్ అని ఆమె పోస్ట్ చేశారు. దీంతో తమిళ నెటిజన్లు హన్సికను ప్రశంసలతో ముంచెత్తేస్తున్నారు. తమిళ అభిమానుల ప్రేమకు ఫిదా అయిన ఆమె కూడా సంతోషం వ్యక్తం చేసింది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) -
మల్లెపూలతో మనోహరంగా హీరోయిన్ హన్సిక (ఫొటోలు)
-
అందానికి అందం హన్సిక
అందం అంటే గుర్తొచ్చేది నటి హన్సికనే అన్నంతగా తన సొగసులను మెయిన్‌టెయిన్ చేస్తున్నారీ ముంబాయి బ్యూటీ. ఈమె వయసు జస్ట్ 33 ఏళ్లు అంతే. బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయం అయిన నటీమణుల్లో ఈమె ఒకరు. 2003లో నటిగా హిందీలో ఎంట్రీ ఇచ్చిన హన్సికను దర్శకుడు పూరి జగన్నాథ్ దేశముదురు చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం చేశారు. అలా తెలుగులో తొలి చిత్రంతోనే చిత్రపరిశ్రమ దృష్టిని ఆకర్షించారు. ఇక తమిళంలోకి ధనుష్ కు జంటగా మాప్పిళ్లై చిత్రంలో వచ్చారు. ఈ చిత్రం సక్సెస్ కావడంతో తెలుగు, తమిళం భాషల్లో కథానాయకిగా దూసుకుపోయారు. అలా 50 చిత్రాల మైలురాయిని అవలీలగా దాటేశారు. సినిమాల్లో బిజీగా ఉంటూనే గత 2022లో డిసెంబర్ నెలలో తన బాయ్‌ఫ్రెండ్ సోహైల్ ఖతూరియను పెళ్లి చేసుకున్నారు. దీంతో హన్సిక సినిమాలకు గుడ్‌బై చెపుతారనే అందరూ భావించారు. అయితే ఆమె పెళ్లి అయిన కొద్దిరోజుల్లోనే నటించడానికి సిద్ధం అయ్యి అందరినీ ఆశ్చర్యపరిచారు. కానీ ఇటీవల హన్సికకు సరైన హిట్ పడలేదన్నది నిజం. అయితే అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. అలా ప్రస్తుతం రౌడీబేబీ, మ్యాన్, గాంధారి చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో ఈ బ్యూటీ ద్విపాత్రాభినయం చేసిన గాంధారి చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. అయితే గ్లామర్ విషయంలో తగ్గేదేలే అనే హన్సిక కొత్త అవకాశాల వేటలో పడ్డారు. అందుకోసం ఈమె తాజాగా ప్రత్యేకంగా ఫొటో సెషన్ నిర్వహించి తన గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. వాటిని చూసిన నెటిజన్లు వారేవ్వా హన్సిక అంటూ కామెంట్ చేస్తున్నారు. -
సైజ్ జీరోలో సంయుక్త .. గ్లామర్ డోస్ పెంచేసిన జగతి మేడమ్
జిమ్‌లో 108రోజుల వర్కౌట్‌తో సైజ్ జీరోకు చేరుకున్న సంయుక్త మీనన్ స్టైలిష్, క్లాస్‌గా మెరిసిపోతున్న హన్సిక గ్లామర్ డోస్ పెంచేసిన 'గుప్పెడంత మనసు' జగతి మేడమ్ View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaaj) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) -
Hansika Motwani: పుట్టినరోజు జరుపుకుంటున్న హన్సికా మోత్వాని రేర్ ఫోటోలు
-
అచ్చమైన పెయింటింగ్‌లా అందమైన భామ (ఫోటోలు)
-
ఆ డ్రెస్సేంటి? మెడలో ఆ నెక్సెట్ ఏంటి? వెరైటీ లుక్‌లో హన్సిక
-
క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న హన్సిక (ఫోటోలు)
-
బ్లాక్ డ్రెస్‌లో హన్సిక స్టన్నింగ్ లుక్స్.. ఫోటోలు
-
సూసేకి.. అగ్గిరవ్వమాదిరి.. హన్సిక డ్యాన్స్ అదిరిపోయింది!
అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం పుష్ప. ఈ సినిమా ఎంత హిట్ అయ్యిందో, అందులోని పాటలు అంతకుమించి హిట్ అయ్యాయి. సమంత నటించిన ఊ అంటావా మామా అనే ఐటమ్ సాంగ్ కుర్రకారును గిలిగింతలు పెట్టించింది. దేశ వ్యాప్తంగా పాపులర్ అయి సినిమాకే ఎంతో హైప్ తెచ్చి పెట్టింది. పలువురు సినీస్టార్స్తో పాటు, ఇతరులు కూడా ఈ పాటకు డ్యాన్స్ చేసి ఆ వీడియోలను వైరల్ చేశారు. అదేవిధంగా రష్మిక మందన్నా నటించిన రా రా సామి అనే పాట కూడా బాగా వైరల్ అయ్యింది. ప్రస్తుతం పుష్ప–2 చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆగస్ట్ 15న పాన్ ఇండియా స్థాయిలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇందులో సూసేకి అగ్గిరవ్వ మాదిరి అనే పాట సినిమా హైప్‌ను పెంచేస్తోంది.ఈ పాటకు హన్సిక లంగా ఓణి ధరించి నలుగురు కుర్రాళ్లతో కలిసి చేసిన డాన్స్ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఈ చిత్రానికి చిత్ర యూనిట్ ఇంకా పబ్లిసిటీని ప్రారంభించలేదు. అయితే హన్సిక వంటి సెలబ్రిటీలు అందులోని పాటకు డాన్స్ చేయడంతో ఇప్పటి నుంచే ఫ్రీ పబ్లిసిటీ మొదలైందన్నమాట. మరోవైపు సూసేకి సాంగ్.. తెలుగు, హిందీ వర్షన్స్ కలుపుకుని యూట్యూబ్‌లో 100 మిలియన్ (పది కోట్ల) వ్యూస్ రాబట్టడం విశేషం. View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) People just cannot stop vibing to #TheCoupleSong ❤️🔥#Pushpa2SecondSingle TRENDING #1 on YouTube for music with 100 MILLION+ VIEWS & 1.67 MILLION+ LIKES 💥💥▶️ https://t.co/Tgu57adbiT#Pushpa2TheRule Grand release worldwide on 15th AUG 2024. pic.twitter.com/FSw6yePP7j— Pushpa (@PushpaMovie) June 14, 2024చదవండి: ఊహించని పనిచేసి షాకిచ్చిన హీరో విశ్వక్ సేన్ -
రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు చిత్రం
పెళ్లి తర్వాత డిఫరెంట్ కాన్సెప్టులకే ఓటేస్తోంది హన్సిక. అలా ఆమె ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్, హారర్ మూవీ 105 మినిట్స్. రాజు దుస్సా దర్శకత్వం వహించిన ఈ సినిమాను బొమ్మక్ శివ నిర్మించారు. ఈ మూవీ అంతా హన్సిక పాత్ర ఒక్కటే ఉండటం విశేషం. ఇందులో 34 నిమిషాల షాట్‌ను సింగిల్ టేక్‌లో పూర్తి చేసింది. అలా ఎన్నో పెద్ద సన్నివేశాల్లో కట్ చెప్పకుండా అలవోకగా నటించేసింది. రెండు నెలల తర్వాత ఓటీటీలో ఈ హారర్ మూవీ జనవరి 26న థియేటర్లలో విడుదలవగా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. రెండు నెలల తర్వాత 105 మినిట్స్ ఓటీటీలోకి వచ్చేసింది. ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. కాకపోతే రెంట్ పద్ధతిలో అందుబాటులో ఉంది. వంద రూపాయలు కడితేనే ఈ సినిమా చూడొచ్చని కండీషన్ పెట్టింది. కథేంటంటే.. జాను (హన్సిక) కారులో ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుంది. మార్గమధ్యంలో ఓ అదృశ్య శక్తి తనను వెంటాడుతున్నట్లు అనిపిస్తుంది. భయంగా ఇంటికి చేరగానే భారీ వర్షం కారణంగా కరెంట్ పోతుంది. కొవ్వొత్తి వెలిగించగానే ఏవేవో భయంకర శబ్దాలు వస్తుంటాయి. తనను వెంటాడిన శక్తి.. ఇంట్లోకి వచ్చి జానును ఇనుప గొలుసుతో బంధించి చిత్రహింసలు పెడుతుంది. తన మరణానికి నువ్వే కారణమంటూ.. అందుకే అనుభవించంటూ మేల్ వాయిస్‌తో భయపెడుతుంది. ఆ అదృశ్య శక్తి మరణానికి, జానుకు సంబంధం ఏంటి? ఆ శక్తి నుంచి జాను తప్పించుకుందా? లేదా? అనేది తెలియాలంటే ఓటీటీలో సినిమా చూడాల్సిందే! చదవండి: చిరంజీవి, మోహన్‌బాబు మధ్య గొడవ.. వాళ్లకు ఎప్పుడూ అదే పని.. -
స్మశానంలో షూటింగ్.. హన్సిక హారర్ మూవీ రిలీజ్
వివాహానంతరం కథానాయకిగా బిజీగా ఉన్న కొద్దిమంది నటీమణుల్లో హన్సిక ఒకరు. ఈ బహుభాషా నటి యాక్ట్ చేసిన చిత్రాలు వరుసగా తెరపైకి వస్తున్నాయి. అలా తాజాగా హన్సిక నటించిన చిత్రం గార్డియన్. హారర్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీలో హన్సిక ఒక అందమైన యువతిగా, దెయ్యంగా ద్విపాత్రాభినయం చేసింది. ఫిలిం వర్క్స్ పతాకంపై విజయ్‌చందర్ నిర్మించిన ఈ చిత్రానికి దర్శక ద్వయం శబరి, గురుశరవణన్ దర్శకత్వం వహించారు. శ్యామ్ సీఎస్ సంగీతాన్ని, కేఏ.శక్తివేల్ చాయాగ్రహణం అందించారు. ఈ మూవీ శుక్రవారం (మార్చి 8న) తెరపైకి వచ్చింది. అరణ్మణై 1, 2 చిత్రాల తరువాత హన్సిక నటించిన హారర్ మూవీ ఇది. హన్సిక తన అనుభవం గురించి మాట్లాడుతూ.. గార్డియన్ చిత్రంలో నటించడం సరికొత్త అనుభవంగా పేర్కొంది. ఈ చిత్రంలో దెయ్యం పాత్ర కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టి నటించినట్లు చెప్పింది. ఈ పాత్ర గెటప్ ప్రత్యేకంగా ఉంటుందని తెలిపింది. ఇందుకోసం స్పెషల్ లెన్స్ పెట్టినట్లు వెల్లడించింది. చిత్రంలోని కొన్ని సన్నివేశాలను స్మశానంలో అర్ధరాత్రి 12 గంటలకు చిత్రీకరించారని, అదీ తలకిందులుగా వేలాడుతూ దెయ్యంగా అరిచే సన్నివేశాల్లో నటించడం సవాలుగా మారిందని తెలిపింది ఆ సమయంలో దెయ్యం గెటప్‌లో ఉన్న తనను చూసి తానే భయపడ్డానని హన్సిక చెప్పుకొచ్చింది. వివాహానంతరం నటించడంలో తనకెలాంటి వ్యత్యాసం అనిపించడం లేదని హన్సిక పేర్కొన్నారు. తన తల్లి, భర్త చాలా మద్దతుగా నిలుస్తున్నారని చెప్పారు. తర్వాత తాను నటిస్తున్న గాంధారి, ది మెన్ చిత్రాలు వరుసగా విడుదల కానున్నాయంది. -
ఈ ఫోటోతో వివాదంలో చిక్కుకున్న టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?
అల్లు అర్జున్ దేశముదురు సినిమాతో తెలుగు సినిమాలకు ఎంట్రీ ఇచ్చిన హన్సిక.. యూత్ గుండెల్లో చెరగిపోని ముద్రే వేసింది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. దీంతో ఎడా పెడా సినిమాలు చేయడం అవి పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో పూర్తిగా అవకాశాలు తగ్గాయి. ఈ మధ్యే మై నేమ్ ఈజ్ శృతి,105 మినిట్స్ సినిమాలతో మళ్లీ తెరపైకి కనిపించింది ఈ బ్యూటీ. తాజాగా హన్సిక చైల్డ్‌వుడ్ ఫోటో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. ముంబయికి చెందిన హన్సిక పలు హిందీ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. 2003లో రిలీజైన హృతిక్ రోషన్ 'కోయి మిల్ గయా'లో యాక్ట్ చేసింది. ఆ సమయంలోని ఫోటో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. కానీ ఈ ఫోటో వల్ల ఆమె కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంది. 2003లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్న హన్సిక కేవలం నాలుగేళ్ల గ్యాప్‌లో అంటే 2007లో దేశముదురు చిత్రంతో హీరోయిన్ అయిపోయింది. నాలుగేళ్ల గ్యాప్‌లో హన్సిక మార్పు చూసి, త్వరగా ఎదిగేందుకు ఆమె ఇంజెక్షన్స్ తీసుకుందని కొందరు కామెంట్స్ చేశారు. కానీ ఆ రూమర్స్‌ను ఆమె కొట్టిపారేసింది. కానీ తన అమ్మగారు చాలా బాధపడినట్లు ఆమె చెప్పుకొచ్చింది. దాదాపు 20 ఏళ్లుగా సినిమాలు చేస్తున్న హన్సిక రెండేళ్ల క్రితం ఓ బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకొని లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. -
105 Minutes Movie Review: ‘105 మినిట్స్’ మూవీ రివ్యూ
టైటిల్: 105 మినిట్స్ నటీనటులు:హన్సిక నిర్మాత: బొమ్మక్ శివ దర్శకుడు: రాజుదుస్సా సంగీతం: సామ్ సి. ఎస్ సినిమాటోగ్రఫీ : కిషోర్ బోయిదాపు విడుదల తేది: జనవరి 26, 2024 కథేంటంటే.. ఒకే పాత్ర చుట్టూ తిరిగే కథ ఇది. జాను(హన్సిక) కారులో ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరుతుంది. మార్గ మధ్యలో ఓ అదృశ్య శక్తి తనను వెంటాడుతున్నట్లు కనిపిస్తుంది. దీంతో ఆందోళన చెందిన జాను..భయం భయంతో ఇంట్లోకి వెళ్తుంది. భారీ వర్షం కారణంగా ఇంట్లో కరెంట్ పోతుంది. కొవ్వొత్తి వెలిగించగానే కొన్ని భయానక శబ్దాలు వస్తుంటాయి. తనను వెంటాడిన అదృశ్య శక్తి .. ఇంట్లోకి వచ్చి ఇనుప గొలుసుతో జానును బంధించి చిత్ర హింసలు పెడుతుంది.మేల్ వాయిస్‌లో మధ్య మధ్యలో తన మరణానికి నువ్వే కారణమంటూ.. అందుకే ఇదంతా అనుభవించాలంటూ భయపెడతుంది. ఇంట్లో నుంచి పారిపోయేందుకు జాను ప్రయత్నించినా.. ఆ అదృశ్య శక్తి బయటకు పోనివ్వదు. మరి జాను ఆ అదృశ్య శక్తి నుంచి ఎలా బయటపడుతుంది? ఆ మేల్ వాయిస్ ఎవరిది? తన మరణానికి జాను ఏ విధంగా కారణమైంది? చివరకు ఏం జరిగింది అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఒక సినిమా తీయాలంటే నటీనటులు ఎంతో కీలకం. చాలా పాత్రలు ఉంటాయి. ప్రతి పాత్రకు డైలాగ్స్ ఉండాలి. పాటలు, కామెడీ ఇవన్నీ ఉండాలి. కానీ అలాంటివేమీ లేకుండా సింగిల్ క్యారెక్టర్‌తో సినిమా తీయడం అంటే కత్తిమీద సామే అని చెప్పాలి. మరీ ముఖ్యంగా ఇలాంటి సినిమాను తీయాలంటే దర్శకుడికి చాలా ధైర్యం ఉండాలి. అలాంటిదీ చేసి చూపించారు దర్శకుడు రాజుదుస్సా. ఇలాంటి ప్రయోగం చేసిన దర్శక నిర్మాతలను అభినందించాల్సిందే. అయితే ఒక్క క్యారెక్టర్‌తో రెండున్నర గంటల పాటు ప్రేక్షకుడిని థియేటర్లో కూర్చోబెట్టాలంటే.. బలమైన కథ, ఆసక్తికరమైన సన్నివేశాలు ఉండాలి. లేదంటే ప్రేక్షకుడు ఒక్క పాత్రనే చూస్తూ కుర్చిలో కూర్చోలేడు. 105 మినిట్స్‌లో అది మిస్సయింది. కాన్సెప్ట్ బాగున్నా.. దాన్ని తెరపై ఆసక్తికరంగా చూపించడంలో దర్శకుడు తడబడ్డాడు. ఒక కనిపించని మనిషి పంచభూతాలని గుప్పెట్లో పెట్టుకొని అమ్మాయిని ఏడిపించే ఆటే ఈ సినిమా కథ. చాలా ఆసక్తికరంగా కథను ప్రారంభించాడు దర్శకుడు. భారీ వర్షం.. ఉరుములు మెరుపులు.. కారులో హీరోయిన్.. సడెన్‌గా ఓ అదృశ్య శక్తి ప్రత్యేక్షం అవ్వడం.. ఇలాంటి భయపెట్టే సన్నివేశాలన్నీ ప్రారంభంలోనే చూపించాడు. హీరోయిన్ ఇంట్లోకి వెళ్లిన తర్వాత కథ ముందుకు సాగదు. జాను కాళ్లకు కట్టిన సంకెళ్లను విడిపించేందుకు ప్రయత్నించడం.. అదృశ్య శక్తి దాన్ని అడ్డుకోవడం.. ఇంటర్వెల్ వరకు ఇదే సీన్ రిపీట్ అవుతుంటుంది. సినిమా మొత్తం హీరోయిన్ ఏడుస్తూనే ఉంటుంది. ప్రతిసారి ఆత్మ బెదిరించడం.. హీరోయిన్ అక్కడ నుంచి వేరే చోటుకి మారిపోవడం ఇదే జరుగుతుంది. అసలు ఆ ఆత్మ ఎందుకు జానుని వేధిస్తుందో అనేది కూడా బలంగా చూపించలేకపోయారు. క్లైమాక్స్ కూడా ఆసక్తికరంగా ఉండడు. హన్సిక ఇంట్లో ఎందుకు ఇరుక్కుంది? ఆ ఆత్మ నేపథ్యం ఏంటి అనేది క్లారిటీగా చూపిస్తే బాగుండేది. చివర్లో ఒక్క డైలాగ్‌తో ప్రేక్షకుడే కథను అర్థం చేసుకునేలా చేశారు. సింగిల్ షాట్ మూవీ కాబట్టి ఇతర పాత్రలు, ఎలిమెంట్స్ తీసుకొచ్చే అవకాశం ఉండడు. ఉన్న ఒక్క పాత్ర చుట్టు అయినా ఆసక్తికరమైన సన్నివేశాలు రాస్తే బాగుండేది. కానీ పలు సవాళ్ల మధ్య ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రయోగం అయితే బాగుంది కానీ..అది మాత్ర పూర్తిగా ఫలించలేదనే చెప్పాలి. ఎవరెలా చేశారంటే.. జాను పాత్రకు హన్సిక పూర్తి న్యాయం చేసింది. ఆమెకు ఇది ఒక డిఫరెంట్ మూవీ. తొలిసారి ఇలాంటి క్యారెక్టర్ చేసి మెప్పించింది. అయితే అయితే కథలో బలం లేనప్పుడు నటీనటులు ఎంత చక్కటి నటనను కనబర్చిన అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. సాకేంతిక పరంగా సినిమా బాగుంది. సామ్ సి. ఎస్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. కథలో బలం లేకున్నా.. తనదైన బీజీఎంతో కొన్ని చోట్ల భయపెట్టాడు. సినిమాటోగ్రపీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
క్షమాపణలు చెప్పిన హన్సిక