Actress Hansika Motwani Latest Pics Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Hansika: మెరుపు తీగలా తయారైన హన్సిక!

Published Tue, Aug 23 2022 11:04 AM | Last Updated on Tue, Aug 23 2022 8:13 PM

Hansika Motwani Latest Pics Goes Viral - Sakshi

సినిమా రంగం గ్లామర్‌ ప్రపంచం. స్టార్‌ హీరోయిన్ల నుంచి వర్ధమాన హీరోయిన్ల వరకూ స్కిన్‌ షో ప్రదర్శిస్తుంటారు. హీరోయిన్‌ హన్సిక కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఈ ముంబై బ్యూటీ ఆది నుంచి దక్షిణాదినే నమ్ముకుంది. కోలీవుడ్‌లో ధనుష్‌కు జంటగా మాప్పిళై చిత్రంతో పరిచయం అయ్యింది.

బొద్దుగా, ముద్దుగా ఉంటే ఈ అమ్మడిని చిన్న కుష్బూ అని పిలిచేవారు. అలాంటి ఇమేజ్‌తో పలు చిత్రాలు చేసిన హన్సికకు ఒక దశలో అవకాశాలు తగ్గుముఖం పట్టాయి.

దీంతో అందంపై దృష్టి పెట్టిన ఈ అమ్మడు వర్కౌట్స్‌ చేసి బాగా చిక్కింది. దీంతో మళ్లీ అవకాశాలు వరుస కడుతున్నాయి. అయితే సక్సెస్‌ మాత్రం దరి చేరడం లేదు. ఇటీవల ఎన్నో ఆశలు పెట్టుకుని శింబుతో కలిసి హీరోయిన్‌ సెంట్రిక్‌ కథాచిత్రంలో నటించిన మహా చిత్రం నిరాశ పరచింది. ఇది హన్సిక అర్ధ సెంచరీ చిత్రం కూడా.

తాజాగా  గ్లామరస్‌ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసింది. ఇటీవలే పుట్టిన రోజు వేడుకను జరుపుకున్న హన్సిక, పొట్టి దుస్తులు ధరించి నడిరోడ్డుపై విన్యాసాలు చేస్తూ వార్తల్లోకి ఎక్కింది.

తాజాగా సముద్ర తీర ప్రాంతంలో అందాలను ఆరబోస్తూ తీసుకున్న ఫొటోలను తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేసింది. కావలసినంత తీరిక దొరకడంతో ఇలా అందం చూడవయా ఆనందించడయా అంటూ ఎంజాయ్‌ చేస్తూ అవకాశాల వేట మొదలెట్టిందంటూ నెటిజన్లు చురకలు వేస్తున్నారు. ప్రస్తుతం యాపిల్‌ బ్యూటీ తెలుగులో రెండు, తమిళంలో రెండు చిత్రాల్లో నటిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement