పెళ్లైనా తగ్గేదేలే అంటోన్న స్టార్ హీరోయిన్.. ఏకంగా బికినీలో! | Hansika Motwani Stunning Looks In Switzerland Vacation, Beautiful Photos Goes Viral On Social Media- Sakshi
Sakshi News home page

Hansika Motwani Viral Photos: బికినీలో చిల్‌ అవుతోన్న హన్సిక.. వీడియో వైరల్!

Dec 24 2023 12:08 PM | Updated on Dec 24 2023 1:51 PM

Hansika Motwani Stunning Looks In Switzerland Vacation  - Sakshi

సినిమా అంటేనే గ్లామర్‌ ప్రపంచం అన్నది అందరికీ తెలిసిందే. ఇక్కడ ప్రతిభతో పాటు అందానికి కూడా అధిక ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో అందం అనేది చాలా ముఖ్యం. అందుకే చాలామంది హీరోయిన్లు తమ గ్లామర్‌ను కాపాడుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. అందుకు తగిన ఆహారపు అలవాట్లతో పాటు కసరత్తు చేస్తుంటారు. అలాంటి హీరోయిన్లలో దేశముదురు భామ హన్సిక ఒకరు. 32 ఏళ్ల ఈ ముంబయి బ్యూటీ హిందీలో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన కొన్ని చిత్రాలలో నటించారు. ఆ తరువాత పదహారేళ్ల ప్రాయంలోనే దేశముదురు అనే తెలుగు చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు

ఆ తరువాత తమిళంలో ధనుష్‌ సరసన మాప్పిళ్‌లై చిత్రంతో మెప్పించారు. ఈ రెండు భాషల్లోనూ స్టార్ హీరోల సరసన నటించి పాపులర్‌ అయ్యారు. నటిగా అర్ధసెంచరీ కొట్టిన హన్సిక గతేడాది డిసెంబర్‌లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. సొహైల్‌ కుతురియాను పెళ్లాడినా ముద్దుగుమ్మ.. ఆ తర్వాత కూడా నటనకు మాత్రం దూరం కాలేదు. ఒక పక్క మ్యారేజ్ లైఫ్‌ ఎంజాయ్ చేస్తూనే సినిమాల్లోనూ నటిస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో 105 అనే తెలుగు చిత్రం, రౌడీ బేబీ, గార్డియన్‌, మెన్‌ అనే తమిళ చిత్రాలు ఉన్నాయి.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న హన్సిక ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటోంది. హీరోయిన్‌గా నటిస్తూ తన గ్లామర్‌పై ప్రత్యేక కసరత్తు చేస్తూ ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటోంది. తాజాగా తన భర్తతో కలిసి స్విట్జర్లాండ్‌ వెళ్లిన ముద్దుగుమ్మ ఫుల్‌గా చిల్ అవుతున్నారు. బికినీ దుస్తుల్లో ప్రత్యేకంగా ఫొటో షూట్‌ చేయించుకున్నారు. తాజాగా ఆమె ఫొటోలను తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. స్విమ్మింగ్‌ చేస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement