అందానికి అందం హన్సిక | Hansika Motwani Special Photo Session For Movie Offers Trending On Social Media | Sakshi
Sakshi News home page

అందానికి అందం హన్సిక

Aug 14 2024 1:03 PM | Updated on Aug 14 2024 1:45 PM

hansika motwani special photo session

అందం అంటే గుర్తొచ్చేది నటి హన్సికనే అన్నంతగా తన సొగసులను మెయిన్‌టెయిన్‌ చేస్తున్నారీ ముంబాయి బ్యూటీ. ఈమె వయసు జస్ట్‌ 33 ఏళ్లు అంతే. బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయం అయిన నటీమణుల్లో ఈమె ఒకరు. 2003లో నటిగా హిందీలో ఎంట్రీ ఇచ్చిన హన్సికను దర్శకుడు పూరి జగన్నాథ్‌ దేశముదురు చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం చేశారు. అలా తెలుగులో తొలి చిత్రంతోనే చిత్రపరిశ్రమ దృష్టిని ఆకర్షించారు.

 ఇక తమిళంలోకి ధనుష్‌ కు జంటగా మాప్పిళ్‌లై చిత్రంలో వచ్చారు. ఈ చిత్రం సక్సెస్‌ కావడంతో తెలుగు, తమిళం భాషల్లో కథానాయకిగా దూసుకుపోయారు. అలా 50 చిత్రాల మైలురాయిని అవలీలగా దాటేశారు. సినిమాల్లో బిజీగా ఉంటూనే గత 2022లో డిసెంబర్‌ నెలలో తన బాయ్‌ఫ్రెండ్‌ సోహైల్‌ ఖతూరియను పెళ్లి చేసుకున్నారు. దీంతో హన్సిక సినిమాలకు గుడ్‌బై చెపుతారనే అందరూ భావించారు. అయితే ఆమె పెళ్లి అయిన కొద్దిరోజుల్లోనే నటించడానికి సిద్ధం అయ్యి అందరినీ ఆశ్చర్యపరిచారు. కానీ ఇటీవల హన్సికకు సరైన హిట్‌ పడలేదన్నది నిజం. 

అయితే అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. అలా ప్రస్తుతం రౌడీబేబీ, మ్యాన్, గాంధారి చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో ఈ బ్యూటీ ద్విపాత్రాభినయం చేసిన గాంధారి చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. అయితే గ్లామర్‌ విషయంలో తగ్గేదేలే అనే హన్సిక కొత్త అవకాశాల వేటలో పడ్డారు. అందుకోసం ఈమె తాజాగా  ప్రత్యేకంగా ఫొటో సెషన్‌ నిర్వహించి తన గ్లామరస్‌ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. వాటిని చూసిన నెటిజన్లు వారేవ్వా హన్సిక అంటూ కామెంట్‌ చేస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement