హీరోయిన్ హన్సికకు అందం అలంకారం అయితే చిరునవ్వు అదనపు ఆకర్షణ. ఈమె నటన గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 50కు పైగా చిత్రాల్లో నటించి తన అభినయంతో ప్రేక్షకుల ఆదరణను గెలుచుకుందీ బ్యూటీ. వివాహానంతరం కూడా చెక్కు చెదరని అందాలతో తగ్గని ఆదరణతో, పెరుగుతున్న అవకాశాలతో పుల్ జోష్‌లో ఉందీ అమ్మడు.
తాజాగా తమిళంలో నటిస్తున్న గార్డియన్ చిత్రం టీజర్, తెలుగులో నటిస్తున్న మై నేమ్ ఈజ్ శృతీ చిత్రం టీజర్ ఒకేసారి విడుదలై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. విభిన్న కథలతో రూపొందుతున్న ఈ రెండు చిత్రాలపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈమె బహుభాషా నటిగా నిరూపించుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ తమిళం, తెలుగు భాషల్లో బిజీగా చిత్రాలు చేస్తున్నారు. అంతే కాకుండా వెబ్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చిన హన్సిక హిందీలో మై 3 అనే వెబ్ సిరీస్‌లో నటించారు.
ఈ సిరీస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమీంగ్ అవుతూ విశేష ఆదరణ పొందుతోంది. ఈ సందర్భంగా హన్సిక మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ప్రేక్షకుల ఆదరాభిమానాలతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నారు. గార్డియన్, మై నేమ్ ఈజ్ శృతీ చిత్రాలు తనకు చాలా ప్రత్యేకమైనవి అన్నారు. కాగా ప్రస్తుతం తెలుగులో 105 నిమిడంగళ్, తమిళంలో మ్యాన్ చిత్రాల్లో నటిస్తున్నారు. కాగా 2024 తనకు చాలా స్పెషల్ అని ఈ బ్యూటీ పేర్కొంది.
చదవండి: అమర్ దీప్‌కు షాకిచ్చిన బిగ్ బాస్.. తెలియకుండానే ఏడ్చాను అంటూ..
Comments
Please login to add a commentAdd a comment