సాక్షి, హైదరాబాద్: తెలుగువారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సినీ నటి కస్తూరిని చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం నాడు గచ్చిబౌలిలో ఆమెను అరెస్టు చేసి చెన్నైకి తరలిస్తున్నారు.
తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు
కాగా బ్రాహ్మణులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేసే క్రమంలో తెలుగువారిపై కస్తూరి అనుచిత వ్యాఖ్యలు చేసింది. సుమారు 300 ఏళ్ల క్రితం రాజుల పరిపాలనలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తెలుగు వారు తమిళనాడుకు వచ్చారంది.
తెలుగువారు ఎవరు?
అలా వచ్చినవారంతా ఇప్పుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని పేర్కొంది. అలాగైతే ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి తెలుగువారు ఎవరంటూ ప్రశ్నించింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపాయి. దీంతో ఆమె క్షమాపణలు చెప్పింది.
పోలీసుల గాలింపు
కానీ అప్పటికే ఆమెపై కేసులు నమోదవగా పోలీసులు తనకోసం గాలింపు చేపట్టారు. కేసుల భయంతో కస్తూరి పరారీ అయినట్లు పోలీసులు భావించారు. మరోవైపు తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కస్తూరి దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది.
Comments
Please login to add a commentAdd a comment