Chennai Police
-
తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు.. కస్తూరి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలుగువారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సినీ నటి కస్తూరిని చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం నాడు గచ్చిబౌలిలో ఆమెను అరెస్టు చేసి చెన్నైకి తరలిస్తున్నారు.తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలుకాగా బ్రాహ్మణులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేసే క్రమంలో తెలుగువారిపై కస్తూరి అనుచిత వ్యాఖ్యలు చేసింది. సుమారు 300 ఏళ్ల క్రితం రాజుల పరిపాలనలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తెలుగు వారు తమిళనాడుకు వచ్చారంది. తెలుగువారు ఎవరు?అలా వచ్చినవారంతా ఇప్పుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని పేర్కొంది. అలాగైతే ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి తెలుగువారు ఎవరంటూ ప్రశ్నించింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపాయి. దీంతో ఆమె క్షమాపణలు చెప్పింది. పోలీసుల గాలింపుకానీ అప్పటికే ఆమెపై కేసులు నమోదవగా పోలీసులు తనకోసం గాలింపు చేపట్టారు. కేసుల భయంతో కస్తూరి పరారీ అయినట్లు పోలీసులు భావించారు. మరోవైపు తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కస్తూరి దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది.చదవండి: నా భార్య చూడకముందే బిడ్డను కప్పిపెట్టా.. సింగర్ ఎమోషనల్ -
పరారీలో సినీ నటి కస్తూరి.. సమన్లు జారీ చేసిన పోలీసులు
చెన్నైలో నటి కస్తూరి తెలుగు వారిపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆమెపై కేసులు నమోదు అయ్యాయి. దీంతో ప్రస్తుతం ఆమె పరారిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, తెలుగు గడ్డ తనకు మెట్టినిల్లు అని, తెలుగు ప్రజలను తాను కించపరిచే విధంగా మాట్లాడలేదని చెబుతూనే క్షమాపణ కూడా కస్తూరి చెప్పింది. తాను చేసిన వ్యాఖ్యలను డిఎంకే పార్టీ నేతలే తప్పుగా ప్రచారం చేశారని వారిపై ఆమె ఫైర్ అయింది. దీంతో ఆ పార్టీ నేతలే తనను టార్గెట్ చేస్తున్నారని కూడా ఆమె చెప్పింది.కస్తూరి చేసిన వ్యాఖ్యలతో చెన్నై,మదురై వంటి ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. దీంతో సమన్లు జారీ చేసేందుకు కస్తూరి ఇంటికి పోలీసులు వెళ్లారు. అయితే, తన ఇంటికి తాళం వేసి ఉందని పోలీసులు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఆమె ఫోన్ కూడా ఆఫ్ చేసి ఉందని సమాచారం. కేసుల భయంతో ఆమె పరారీలో ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, ఈ కేసుల విషయంలో ఆమె ఒక లాయర్‌ను సంప్రదించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.హిందూ పీపుల్స్ పార్టీ ఆఫ్ తమిళనాడు తరపున బ్రాహ్మణులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ.. నటి కస్తూరి తెలుగువారిపై ఈ వ్యాఖ్యలు చేసింది. సుమారు 300 ఏళ్ల క్రితం రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తమిళనాడుకు తెలుగు వారు వచ్చారని ఆమె వ్యాఖ్యలు చేసింది. అలా వచ్చిన వారంతా ఇపుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆమె కామెంట్ చేసింది. అలా అయితే, ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి తెలుగువారు ఎవరు..? అని ఆమె ప్రశ్నించింది. ఇదే వేదికపై ఆమె డిఎంకే పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ పలు విమర్శలు చేయడం వల్ల ఆ పార్టీ నేతలు తనపై కుట్రకు ప్లాన్ చేస్తున్నారని ఆమె ఆరోపించింది. -
వాహనదారుల భరతం పడుతున్న ట్రాఫిక్ పోలీసులు...
సాక్షి, చైన్నె: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి భరతం పట్టేవిధంగా చైన్నె పోలీసులు దూకుడు పెంచారు. గత ఏడు నెలల్లో రూ. 60 కోట్లను చలాన్ల రూపంలో వసూలు చేశారు. అలాగే మద్యం మత్తులో వాహనాలు నడిపిన మందుబాబులకు నుంచి ఏకంగా రూ. 19 కోట్లు రాబట్టారు. వివరాలు.. రాష్ట్ర రాజధాని నగరం చైన్నెలో ప్రమాదాల నివారణే లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. నిబంధనల్ని ఉల్లంఘించే వారి భరతం పట్టే రీతిలో దూకుడు పెంచారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించకుండా వాహనాలు నడిపే వారిని, ట్రిబుల్ రైడింగ్‌తో దూసుకెళ్లే ద్విచక్ర వాహనదారులను, సిగ్నల్స్‌లో ఆపకుండా ముందుకెళ్లే వారిపై గురి పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు సోదాలు విస్తృతంగా చేస్తున్నారు. అలాగే, రాత్రుల్లో మద్యం తాగి వాహనం నడిపే వారు , బైక్ రేసింగ్లలో పాల్గొనే వారికి జరిమానాల మోత మోగిస్తున్నారు. జరిమానాల జోరు.. నగరంలో అనేక కూడళ్లను హెల్మెట్ జోన్లు, స్పీడ్ కంట్రోల్ చెకింగ్ జోన్లుగా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో నిరంతరం దృష్టి సారిస్తూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారి భరతం పట్టే విధంగా జరిమానాల మోత మోగిస్తున్నారు. నిఘా నేత్రాల ద్వారా సైతం గురించి మొబైల్ ఫోన్లకు ఎస్ఎంఎస్ రూపంలో చలానా విధిస్తున్నారు. 32 రకాల నిబంధనలకు జరిమానాలు విధించాల్సి ఉన్నా, ప్రధానంగా ఏడు రకాల నిబంధనలు ఉల్లంఘించే వారిని నుంచి మాత్రమే ప్రసుత్తం ఫైన్ వసూలు చేస్తున్నారు. గత ఏడాది జరిమానాల రూపంలో ట్రాఫిక్ పోలీసు ఖాతాలో రూ. 149 కోట్లు చేరాయి. ఈ ఏడాది ఏడు నెలల్లో రూ. 60 కోట్లను దాటేశారు. ఇందులో మందు బాబుల నుంచి ఎక్కువ మొత్తమే వసూలు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 19,765 మందిపై కేసు నమోదు చేసి రూ. 19.76 కోట్లు జరిమానాల రూపంలో వసూళ్లు చేసి ఉన్నారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన 3,61,655 మంది నుండి రూ. 36.16 కోట్లు, ట్రిబుల్స్ డ్రైవింగ్‌లో 8,593 కేసులు నమోదు చేసి రూ. 85.93 లక్షలు, అతి వేగానికి సంబంధించి 2,716 కేసుల్లో రూ. 27.16 లక్షలు, సీటు బెల్ట్ ధరించని 9,101 మంది నుంచి రూ. 91.01 లక్షలు, సిగ్నల్ వద్ద వాహనం ఆపకుండా వెళ్లిన 39,320 మంది నుంచి రూ. 1.96 కోట్లు, కార్లకు బ్లాక్ ఫిల్మ్ అంటించిన 4,284 మంది నుంచి రూ.21.42 లక్షలు వసూలు చేశారు. ఇదే కాకుండా సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన వాహన నెంబర్లకు ఎస్ఎంఎస్ల ద్వారా చాలానా విధించారు. వీటి ద్వారా కోట్లాది రూపాయలు వసూలు కావాల్సి ఉంది. ఈ మొత్తాన్ని ఆన్లైన్ ద్వారా లేదా, ట్రాఫిక్ జరిమాన వసూళ్లు కేంద్రాల ద్వారా వాహన దారులు త్వరితగతిన చెల్లిస్తే మంచిది. లేని పక్షంలో వారి వాహనాలు, లైసెన్స్‌లను సీజ్ చేసే విధంగా ట్రాఫిక్ పోలీసులు దూకుడు పెంచనున్నారు. ఇక వాహనదారులు నిబంధనలు సక్రమంగా పాటిస్తే, జరిమానాల మోత మోగించాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కాగా వాహన దారులకు మరింత అవగాహన కల్పించే విధంగా రోడ్ సేఫ్టీ కార్యక్రమాలను విస్తృతం చేస్తామని చైన్నె పోలీసుల కమిషనర్ సందీప్ రాయ్ రాథోర్ తెలిపారు. -
22 కిలోల గంజాయిని ఎలుకలు తినేశాయి: కోర్టుకు తెలిపిన చెన్నై పోలీసులు
22 కిలోల గంజాయిని ఎలుకలు తినేశాయి: కోర్టుకు తెలిపిన చెన్నై పోలీసులు -
రన్నింగ్ ట్రైన్ ఫుట్‌బోర్డుపై కత్తులతో వీరంగం
చెన్నై: రన్నింగ్ ట్రైన్ ఫుట్‌బోర్డులో నిల్చుని.. కత్తులు, కొడవళ్లతో వీరంగం సృష్టించిన ఆకతాయిల ఆట కట్టించారు పోలీసులు. వాళ్లను కాలేజీ విద్యార్థులుగా గుర్తించి.. ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. ఈ విషయాన్ని చెన్నై డివిజనల్ రైల్వే మేనేజర్ మంగళవారం ట్విటర్ వేదికగా ప్రకటించారు. రైలు ఫుట్‌బోర్డుపై వేలాడుతూ.. ప్లాట్‌ఫామ్‌పైకి పదునైన ఆయుధాలు దూస్తూ.. గోల చేస్తూ ముగ్గురు యువకులు హల్ చల్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇలాంటి వాళ్ల వల్ల దేశానికి ఏం ఉపయోగమంటూ తిట్టిపోశారు కొందరు. ఈ నేపథ్యంలో ఆ వీడియోపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు. గుమ్మిడిపూండికి చెందిన అన్బరసు, రవిచంద్రన్‌ను, పొన్నేరికి చెందిన అరుల్‌ను అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు ప్రెసిడెన్సీ కాలేజీ విద్యార్థులుగా నిర్ధారించారు. రైళ్లలో, రైల్వే ప్రాంగణాల్లో ఇలాంటి దుర్మార్గపు ప్రవర్తన, ప్రమాదకరమైన విన్యాసాలను సహించేది లేదంటూ అధికారులు తెలిపారు. ఈ మధ్యకాలంలో రైలు ప్రయాణాలకు సంబంధించిన ఘటనలు ఇంటర్నెట్లో వైరల్‌కావడం, రైల్వే శాఖ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతుండడంతో.. రైల్వే శాఖ సకాలంలో స్పందించేందుకు యత్నిస్తోంది. We would like to inform you that the 3 youths seen in this viral video performing stunts with sharp weapons in their hand, have been arrested by @grpchennai! They are Anbarasu and Ravichandran from Gummidipoondi and Arul from Ponneri. They are all students of Presidency College. pic.twitter.com/3FQVpTWeoW — DRM Chennai (@DrmChennai) October 11, 2022 -
టీడీపీ నేత అజీజ్‌కు చెన్నై పోలీసుల నోటీసులు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు, నగర మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్‌కు చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ నెల 28వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఆయన తమ్ముడు, మరికొందరికి కూడా జారీ అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. అబ్దుల్ అజీజ్, అతని సోదరుడు జలీల్, కుటుంబ సభ్యుల పేరిట స్టార్ ఆగ్రో మెరైన్ ఎక్స్పోర్ట్ కంపెనీ నిర్వహించేవారు. దీనికి విదేశాల్లోనూ బ్రాంచిలు ఉన్నాయి. కాగా, చెన్నైలోని టీనగర్‌కు చెందిన ప్రసాద్ జెంపెక్స్ కంపెనీ స్టార్ ఆగ్రో కంపెనీలో భాగస్వామ్యం కోసం రూ.42 కోట్లు పెట్టుబడులు పెట్టింది. చదవండి: ‘బిగ్‌బాస్’ ఒక అనైతిక షో: సీపీఐ నారాయణ ఆ మొత్తాన్ని స్టార్ ఆగ్రో కంపెనీ డైరెక్టర్లుగా ఉన్న అజీజ్, అతని సోదరుడు అబ్దుల్ జలీల్ వారి వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించి మోసగించడంతో పాటు లెక్కలు చూపమని ప్రశ్నించిన తమ వారిపై బెదిరింపులకు దిగుతున్నారని జెంపెక్స్ కంపెనీ ప్రతినిధి మనోహరప్రసాద్ తమిళనాడు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు 2017 డిసెంబర్లో చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ టీమ్–1, ఈడిఎఫ్–1 వింగ్ పోలీసులు అజీజ్, జలీల్, అబ్దుల్ ఖుద్దూస్‌తో పాటు పలువురిపై ఐపీసీ 406, 420, 506 (ఐ) ఆర్/డబ్ల్యూ 120 (బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అప్పట్లో ఈ వ్యవహారం టీడీపీలో కలకలం రేకెత్తించింది. అయితే తాను క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చాక డైరెక్టర్ పదవికి రాజీనామా చేశానని అబ్దుల్ అజీజ్ అప్పట్లో చెప్పారు. కేసు నుంచి తప్పించుకునేందుకు అలా చెప్పారనే విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి. పై కేసులో తదుపరి విచారణ నిమిత్తం హాజరుకావాలని సీసీబీ పోలీసు అధికారులు సెక్షన్ 41ఏ కింద శనివారం నోటీసులిచ్చారు. ఈ నెల 28 ఉదయం 10.30 గంటలకు అబ్దుల్ జలీల్, 12 గంటలకు అబ్దుల్ ఖుద్దూస్, మధ్యాహ్నం ఒంటిగంటకు అబ్దుల్ అజీజ్ హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. -
విజయవాడలో అక్రమ ఔషధాల కలకలం
లబ్బీపేట (విజయవాడ తూర్పు): విజయవాడ నుంచి చెన్నైకి గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న మందులను చెన్నై పోలీసులు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకెళ్తే.. మత్తు కలిగించే రూ.4 లక్షల విలువైన టైడాల్ (టెపడడాల్) మందులను ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా కొరియర్ ద్వారా చెన్నైలో 10 మందికి పంపారు. ఈ సమాచారం తెలుసుకున్న చెన్నై పోలీసులు అవి విజయవాడ నుంచి వస్తున్నట్లు నిర్ధారించుకుని ఇక్కడకు వచ్చారు. స్థానిక పోలీసులు, డ్రగ్స్ కంట్రోల్ అధికారులతో కలసి తనిఖీలు నిర్వహించారు. నక్కల రోడ్డులోని సత్య డ్రగ్ హౌస్, పుష్పా హోటల్ సెంటర్లోని శ్రీ వెంకటాద్రి ఫార్మాలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా చెన్నైకి మందులు సరఫరా చేసినట్లు బిల్లులు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు రెండు షాపుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నొప్పి నివారణకు వాడే టెపడడాల్ మందులను బిల్లులు లేకుండా చెన్నై తరలించడంతో అక్కడి పోలీసులు పట్టుకున్నారని డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీరామమూర్తి తెలిపారు. -
ప్రముఖ నిర్మాతపై హీరో విశాల్ ఫిర్యాదు
చెన్నై: సూపర్ గుడ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ హౌజ్ అధినేత ఆర్బీ చౌదరిపై హీరో విశాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన తన డాక్యుమెంట్లను తిరిగి ఇవ్వకపోవడం వల్లే చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు విశాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. 2018లో ఇరుంబుతిరమ్(తెలుగులో అభిమన్యుడు) సినిమాను విశాల్ తన ఓన్ బ్యానర్ విశాల్ ఫ్యాక్టరీలోనే నిర్మించాడు. ఆ టైంలో విశాల్, ప్రముఖ నిర్మాత, ఫైనాన్షియర్ అయిన ఆర్బీ చౌదరి దగ్గర కొంత అప్పు తీసుకున్నాడు. ప్రతిగా చెక్ లు, బాండ్లు, ప్రామిసరీ నోట్లను తాకట్టు పెట్టాడు. ఇక అప్పు మొత్తం తీర్చినప్పటికీ తన పత్రాలు ఇవ్వకుండా ఆర్బీ చౌదరి తిప్పించుకుంటున్నాడని అసహనం వ్యక్తం చేస్తూ విశాల్ ఇప్పుడు చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. It’s unacceptable that Mr #RBChoudhary failed to return the Cheque Leaves,Bonds & Promissory Notes months after repaying the loan to him for the Movie #IrumbuThirai,he was evading giving excuses & finally told he has misplaced the documents We have lodged a complaint with Police — Vishal (@VishalKOfficial) June 9, 2021 కాగా, ఈ వ్యవహారం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం విశాల్ ‘ఎనిమీ’, ‘తుప్పరివాలన్ 2’ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఆర్బీ చౌదరి సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై తెలుగు, తమిళ్, మలయాళంలో సినిమాలు తీశాడు. ఆయన కొడుకులు జీవా, జతిన్ రమేశ్ ఇద్దరూ హీరోలే. చదవండి: విశాల్.. భగత్ సింగ్‌ను తలపించావ్ -
కోవిడ్: వైరలవుతోన్న చెన్నై మహిళా పోలీసుల డ్యాన్స్
చెన్నై: భారత్‌లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. మరోవైపు రికార్డు స్థాయిలో మరణాలు సంభవిస్తున్నాయి. నిత్యం నాలుగు లక్షల కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. కోవిడ్‌పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఎక్కవ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మాస్క్‌లు ధరించకపోవడం, సామాజిక దూరం పాటించకపోవడం కరోనా పెరిగేందుకు కారణాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై రైల్వే పోలీసులు కరోనా పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందనే దానిపై అవగాహన కల్పించేందుకు వినూత్నంగా ఆలోచించారు. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో యూనిఫాం, ముఖానికి మాస్కులు, చేతులకు గ్లౌవ్స్ ధరించి పోలీసులు డ్యాన్స్ చేశారు. పోలీసు అధికారులంతా ‘ఎంజాయ్ ఎంజామి’ అనే పాపులర్ పాటకు స్టెప్పులు వేశారు. వీరంతా మహిళా పోలీసు అధికారులే కావడం విశేషం. డ్యాన్స్‌తోపాటు మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటింజడం వంటివి కోవిడ్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు ఏ విధంగా సాయపడుతుందో తెలిపేందుకు ఓ స్కిట్‌ను రూపొందించారు. పోలీసుల ప్రదర్శన ప్రయాణీకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా దీనికి ముందు కూడా కేరళ పోలీసులు ఇదే పాటకు డ్యాన్స్ చేస్తూ ప్రజలకు కోవిడ్‌పై అవగాహన కల్పించారు. చదవండి: సీఎంని కదిలించిన 10 ఏళ్ల బాలుడి పరిస్థితి.. వీడియో వైరల్ -
లోన్ యాప్.. కటకటాల్లోకి చైనీయులు
సాక్షి, చెన్నై: రుణాలు ఇస్తామంటూ తియ్యటి మాటాలతో ఆకర్షించి, ఆ తర్వాత వడ్డీలపై వడ్డీలను బాధుతూ వేధింపులకు గురి చేస్తూ వచ్చిన లోన్ యాప్ గుట్టును చెన్నై పోలీసులు రట్టు చేశారు. బెంగళూరు కేంద్రంగా బెదిరింపుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కాల్ సెంటర్ నిర్వాహకులతో పాటు ఆ యాప్ ప్రతినిధులుగా ఉన్న ఇద్దరు చైనీయుల్ని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. చెన్నైకి చెందిన గణేష్ కరోనా కాలంలో ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో మొబైల్ ప్లే స్టోర్‌లో ఉన్న లోన్ యాప్‌లపై దృష్టి పెట్టాడు. ఇందులోని ఓ యాప్‌ను ఆశ్రయించిన కొన్ని క్షణాల్లో రూ. 5వేల రుణం ఖాతాలో పడింది. వారం తర్వాత వడ్డీ ఏదీ అంటూ మెసేజ్‌లు మొదలయ్యాయి. తాను చెల్లించాల్సిన మొత్తంలో సగం కట్టేసినా, వారానికి రూ. పదిహేను వందలు వడ్డీ చెల్లించాలంటూ మొదలైన మెసేజ్‌లు చివరకు వేధింపుల వరకు వెళ్లింది. ఆందోళనకు గురైన గణేష్ చెన్నై సెంట్రల్ క్రైం పోలీసుల్ని ఆశ్రయించాడు. గణేష్ మరికొన్ని యాప్‌ల నుంచి కూడా రుణం పొంది ఉండడంతో, అన్నింటికీ కలిపి బెంగళూరులో ప్రత్యేకంగా ఏర్పా టు చేసిన కేంద్రం నుంచి ఈ వేధింపులు వస్తున్నట్టుగా విచారణలో తేలింది. గుట్టు రట్టు..కటకటాల్లోకి ... ఈ యాప్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టిన సైబర్ క్రైం వర్గాలు గణేష్ నంబర్లకు వస్తున్న బెదిరింపులు, తిట్ల పురాణాల్ని రికార్డు చేశారు. సమగ్ర సమాచారంతో ప్రత్యేక బృందం బెంగళూరుకు పయనం అయింది. అక్కడ ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి ఉండడాన్ని గుర్తించారు. ఆ సెంటర్ నిర్వాహకులు ప్రమోద్, పవన్‌లను అదుపులోకి తీసుకుని విచారించారు. దేశంలో చైనా యాప్‌లను నిషేధించి ఉన్న నేపథ్యంలో చైనాకు చెందిన సంస్థకు అనుకూలంగా ఈ కాల్ సెంటర్ నిర్వహిస్తుండడం వెలుగు చూసింది. బెంగళూరులో తిష్ట వేసి తమ కార్యకలాపాల్ని సాగిస్తూ వస్తున్న చైనా లోన్ యాప్ కంపెనీకి చెందిన షియో యమోవు, ఉయున్లూన్ అరెస్టు చేశారు. చైనాలో ఉన్న తమ చైర్మన్ హంక్ ఇచ్చే సూచనలకు అనుగుణంగా తాము ఇక్కడ వ్యవహారాలు నడుపుతున్నామని వారు ఇచ్చిన సమాచారం పోలీసులకు పెద్ద షాకిచ్చింది. దీంతో ఆ నలుగుర్ని అరెస్టు చేసి శనివారం చెన్నైకు తరలించారు. తాంబరం న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచి కట కటాల్లోకి నెట్టారు. చెన్నై పోలీసు కమిషనర్ మహేష్ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ కొన్ని రకాల ప్లే స్టోర్లలోని యాప్‌ల జాగ్రత్తలు తప్పని సరి అని సూచించారు. (చదవండి: లోన్ యాప్ వేధింపులు: మరో వ్యక్తి బలి) -
ఖర్జూర పండులో బంగారం!
సాక్షి, చెన్నై : ఖర్జూర పండులో బంగారం తెచ్చిన వ్యక్తిని చెన్నై విమానాశ్రయ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఉదయం సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఇతను ఖర్జూర పండులో 300 గ్రాముల బంగారాన్ని ఉంచి తీసుకొచ్చాడు. చెన్నై మీనంబాక్కం విమానాశ్రయంలో తనిఖీలు చేసిన అధికారులు బంగారాన్ని గుర్తించారు. స్వాదీనం చేసుకున్న బంగారం విలువ రూ.15 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఏసీబీ వలలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జాయి వ్యాపారి వద్ద రూ.70వేలు లంచం తీసుకున్న కోవై మద్యం నిరోధక పోలీసు ఇన్స్పెక్టర్ సహా ముగ్గురిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఈరోడ్ జిల్లా భవానికి చెందిన ఓ గంజాయి వ్యాపారికి ఫోన్ చేసిన కోవై మద్యం నిరోధక పోలీసులు రూ.70 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే గంజాయి కలిగివున్నట్లు కేసు పెట్టి జైలులో పెడుతామని బెదిరింపులు ఇచ్చారు. దీంతో గంజాయి వ్యాపారి భార్య మహేశ్వరి కోవై ఏసీబీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇచ్చిన సలహా మేరకు రూ.70వేలు మహేశ్వరి గురువారం రాత్రి సంగనూరులో ఉన్న పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ పని చేస్తున్న మహిళా ఇన్స్పెక్టర్ సరోజిని, కానిస్టేబుల్ రంగస్వామి, అరుల్‌కుమార్‌ల వద్ద నగదును ఇచ్చారు. అక్కడికి వచ్చిన ఏసీబీ అధికారులు ఇన్స్పెక్టర్ సరోజినితో సహా ముగ్గురు పోలీసులను అరెస్టు చేశారు. -
‘కరోనా’హెల్మెట్‌తో వినూత్న ప్రచారం
సాక్షి, చెన్నై : దేశ వ్యాప్తంగా కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 21 రోజులపాటు లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 14 వరకు ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని, ఇళ్లకే పరిమితం కావాలని పోలీసులు పదే పదే వేడుకుంటున్నా కొంతమంది మాత్రం రోడ్డెక్కుతున్నారు. ఇలాంటి వాళ్లకు పోలీసులు ముందు పద్దతిగా చెప్పి చూస్తున్నారు.. కొన్నిచోట్ల మాత్రం తమ లాఠీలకు పనిచెబుతున్నారు. అయినప్పటికీ కొందరు ఆకతాయిలు రోడ్లపైకి వస్తూనే ఉన్నారు. ఇలాంటి వారికి కరోనావైరస్పై అవగాహన కల్పించేందుకు తమిళనాడు పోలీసులు వినూత్న ప్రయత్నం చేశారు. నిబంధనలు అతిక్రమించి.. అకారణంగా ఇళ్ల నుంచి రోడ్లపైకి వచ్చిన వారిని ఆపి, కరోనా ప్రభావం ఎలా ఉందో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మాములుగా చెప్తే వినడంలేదని.. వినూత్నంగా కరోనా వైరస్ రూపంలో డిజైన్ చేసిన హెల్మెట్ పెట్టుకొని వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. మాస్కులు ధరించాలని, దయచేసి ఎవరూ అకారణంగా బయటకు రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ప్రయత్నం సత్ఫలితాలు ఇస్తోందని పోలీసు అధికారులు చెబుతున్నారు . ‘ప్రజలు బయటకు రాకుండా అన్ని ప్రయత్నాలు చేశాం. అయినప్పటికి కొంతమంది అకారణంగా బయటకు వస్తున్నారు. అలాంటి వారికి అవగాహన కల్పించేందుకు ఏదైనా కొత్తగా చేయాలనిపించింది. దీనికోసం అచ్చం కరోనా వైరస్‌ను పోలిన హెల్మెట్ తయారు చేయించాం. ఇలాగైనా ప్రజల్లో కరోనాపై భయం పెంచి, వారిని ఇళ్లకే పరిమితం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ హెల్మెట్ కొంచెం డిఫరెంట్‌గా ఉండడంతో ప్రతి ఒక్కరికి ఈ మహమ్మారి ప్రభావం గురించి ఆలోచించగల్గుతారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు కరోనావైరస్పై అవగాహన కలిగి ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉంటారు’అని హెల్మెట్ ధరించిన ఓ పోలీసులు అధికారి తెలిపారు. -
అశ్లీల వీడియోల వీక్షణ
సాక్షి, చెన్నై : బాలికల అశ్లీల వీడియోలను వీక్షించిన 600 మందిపై పోలీసులు కేసులు పెట్టారు. దీంతో వీరంతా అరెస్టు కానున్నారు. ఇంటర్నెట్లో బాల, బాలికల అశ్లీల వీడియోలను చూసేవారిని అరెస్టు చేసేందుకు పోలీసులు నిర్ణయించారు. దీంతో మహిళలు, చిన్నారులపై నేరాల నియంత్రణ విభాగం అడిషనల్ డీజీపీ రవి నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా అశ్లీల వీడియోలను చూసే వారి జాబితాను పోలీసు అధికారులు సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి 600 మంది పేర్లు, వివరాలను సేకరించారు. దీన్ని చెన్నై, ఇతర జిల్లాల పోలీసు అధికారులకు పంపి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. చదవండి : చెన్నై ఐఐటీలో అశ్లీల చిత్రాల కలకలం అశ్లీల వీడియోల షేరింగ్ -
మొక్కులు తీర్చుకున్న పోలీసులు
సాక్షి, చెన్నై: కొలిక్కిరాని కేసు ఛేదించడంతో పోలీసులు మొక్కులు తీర్చుకున్నారు. సమయపురం మారియమ్మన్‌ను దర్శించుకుని తలనీలాలు కూడా సమర్పించుకున్నారు. ఇక, పంజాబ్ నేషనల్ బ్యాంక్, లలిత జ్యువెలరీ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న మురుగన్ దోపిడీల అనంతరం నటీమణులతో జల్సా చేసినట్టు విచారణలో తేలడం ఆ నటీమణులు ఎవరో అని ఆరాతీసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ ఏడాది జనవరిలో తిరుచ్చి సమయపురం టోల్గేట్ సమీపంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో దోపిడీ జరిగిన విషయం తెలిసిందే. 470 సవర్ల నగలు, రూ. 19 లక్షల నగదును దుండగులు అపహరించుకు వెళ్లారు. ఈ కేసు విచారణ పోలీసుల్ని ముప్పుతిప్పలు పెట్టాయి. కనీసం ఆదారం కూడా లభించకపోవడంతో నిందితుల కోసం తీవ్రంగా గాలింపు చేపట్టారు. అదే సమయంలో కొద్ది రోజుల క్రితం తిరుచ్చిలో మరో దోపిడీ జరిగింది. ప్రముఖ నగల షోరూమ్ లలిత జ్యువెలరీలో జరిగిన దోపిడీ స్టైల్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్టైల్ ఒకే రకంగా ఉండడంతో పోలీసులు విచారణను మరింత ముమ్మరం చేశారు. లలిత జ్యువెలరీ కేసు విచారణలో లభించిన సమాచారాలు, ఆధారాలు, దోపిడీ దొంగల చెంతకు పోలీసుల్ని తీసుకెళ్లింది. లలిత జ్యువెలరీ కేసులో తొలుత సెంగం కోర్టులో సురేష్ అనే నిందితుడు లొంగిపోయాడు. అతడ్ని విచారించగా, గణేష్ అనే మరో దొంగ దొరికాడు. ఈ దోపిడీల్లో ప్రధాన సూత్రధారిగా ఉన్న తిరువారూర్ మురుగన్ బెంగళూరు కోర్టులో లొంగి పోయాడు. ఇతగాడ్ని ఇక్కడకు తీసుకొచ్చి భూమిలో పాతిపెట్టిన బంగారాన్ని బయటకు తీశారు. మళ్లీ బెంగళూరు పోలీసులు తమ పరిధిలో ఉన్న కేసుల విచారణ నిమిత్తం మురుగన్‌ను పట్టుకెళ్లారు. తలనీలాలు సమర్పించుకుని.. మురుగన్‌ను తమ కస్టడీకి తీసుకునేందుకు తిరుచ్చి పోలీసులు ప్రయత్నాలు చేపట్టారు. అయితే, బెంగళూరు పోలీసు కస్టడీలో ఉన్న దృష్ట్యా, అక్కడ విచారణ ముగించినానంతరం, ఇక్కడకు అతడ్ని తీసుకొచ్చేందుకు నిర్ణయించి ఉన్నారు. లలితా జ్యువెలరీ దోపిడితోపాటు తొమ్మిది నెలల క్రితం జరిగిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ దోపిడీ కూడా మురుగన్ ముఠా పనితనంగా తేలింది. ఈ కేసులో రాధాకృష్ణన్ అనే నిందితుడ్ని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులు కొలిక్కిరావడంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కేసును విచారిస్తున్న బృందంలోని ఇద్దరు పోలీసులు హరిహరన్, విజయకుమార్ ఉదయాన్నే సమయపురం మారియమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కేసును ఎట్టకేలకు ఛేదించడంలో తమకు దేవుడి ఆశీస్సులు సైతం ఉన్న దృష్ట్యా, మొక్కులు తీర్చుకుంటూ తలనీలాలు సమర్పించుకోవడం గమనార్హం. 25 కేజీలు బంగారం స్వాధీనం.. లలిత జ్యువెలరీ కేసులో ఇప్పటి వరకు 25 కేజీల బంగారు స్వాధీనం చేసుకున్నట్టు తిరుచ్చి పోలీసు కమిషనర్ అమల్‌రాజ్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసు విచారణ గురించి వివరించారు. ప్రస్తుతం నిందితుడు మురుగన్ బెంగళూరు పోలీసుల కస్టడీలో ఉన్నాడని, అక్కడ విచారణ ముగించినానంతరం ఇక్కడ తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అతడిపై మరెన్ని కేసులు ఉన్నాయో అని ఆరా తీస్తున్నామని, అన్ని కోణాల్లో విచారణ సాగుతున్నదన్నారు. కాగా నిందితుడు మురుగన్ దోపిడీల అనంతరం మోడల్స్, నటీమణులతో కలిసి జల్సా చేసేవాడుగా విచారణలో తేలినట్టు సమాచారం. కొందరికి దోపిడీ చేసిన నగలను సైతం ఇచ్చి ఉన్నట్టుగా సంకేతాలు వెలువడడం, రెండు సినిమాలకు సైతం ఫైనాన్స్ చేసి ఉన్నట్టు తేలడంతో ఆ నటీమణులు ఎవరో, ఆ సినిమాల వెనుక ఉన్న వాళ్లు ఎవరో ఆరా తీసే పనిలో ప్రత్యేక బృందం నిమగ్నమైంది. -
చెన్నైలో తెలంగాణ ఆటగాళ్ల అరెస్ట్
-
చెన్నైలో తెలంగాణ ఆటగాళ్ల అరెస్ట్
చెన్నై : తెలంగాణకు చెందిన కబడ్డీ ఆటగాళ్లను తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కబడ్డీ మ్యాచ్ ఆడేందుకు పుదుచ్చేరి వెళ్లిన తెలంగాణ ఆటగాళ్లు తిరుగు ప్రయాణంలో భాగంగా చెన్నైకి చేరుకున్నారు. అక్కడ కోచ్‌తో కలిసి కొందరు ఆటగాళ్లు అన్నా సలై నుంచి ఎగ్మోర్ వెళ్లేందుకు 29ఏ నెంబర్ బస్సు ఎక్కారు. అయితే టికెట్ తీసుకునే సమయంలో బస్సు కండక్టర్‌తో కబడ్డీ కోచ్ లక్ష్మణ్‌కు మధ్య ఘర్షణ మొదలైంది. అయితే ఎగ్మోర్‌లో కబడ్డీ ఆటగాళ్లు బస్సు దిగిన సమయంలో వారిపై కండక్టర్ దాడికి యత్నించాడు. కండక్టర్‌కు మద్ధతుగా స్థానికులు కూడా కోచ్ లక్ష్మణ్‌తోపాటు ఆటగాళ్లపై దాడి చేశారు. ఈ ఘటనపై సమచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కోచ్‌తో పాటు కబడ్డీ ఆటగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు వీడియో తీశారు. కబడ్డీ కోచ్ అనుచిత ప్రవర్తనతో ఈ ఘటన జరిగినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. తొలుత లక్ష్మణ్ కండక్టర్‌పై దాడికి పాల్పడినట్టుగా వారు ఆరోపిస్తున్నారు. అయితే ఇందులో తమ తప్పేమిలేదని తెలంగాణ ఆటగాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
50మంది మహిళలపై సైకో అత్యాచారం
సాక్షి, చెన్నై: ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసి అత్యాచారాలకు పాల్పడుతున్న ఉన్మాది అరివలగన్‌ను అంబత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. మహిళలను బెదిరించి అత్యాచారం చేస్తూ, ఆ దృష్యాలను తన సెల్ ఫోన్లో అరివలగన్ రికార్డు చేసేవాడు. ఆ వీడియోలతో మహిళలను బ్లాక్ మెయిల్ చేస్తూ వాళ్లపై లైంగిక అకృత్యాలకు పాల్పడేవాడు. నేరస్తుడి సెల్ ఫోన్లో సుమారు 50 మందికి పైగా మహిళలపై అత్యాచారం చేసిన వీడియోలు ఉన్నాయని పోలీసులు చెప్పారు. కొద్దిరోజుల క్రితమే ఓ గృహిణి, ముగ్గురు ఐటీ ఉద్యోగినులు ఫిర్యాదు చేయడంతో ఈ దుర్మార్గుడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఒంటరి మహిళలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఉన్మాది అరివలగన్ కోసం ప్రత్యేకంగా గాలింపులు నిర్వహించిన పోలీసులు.. ఎట్టకేలకు అతన్ని అరెస్టు చేశారు. -
రాత్రికి రాత్రే జీవితం మారిపోయింది.!
సాక్షి, చెన్నై: రాత్రికి రాత్రే వారి జీవితం మారిపోయిందిరా.. అని చెప్పుకుంటుంటాం!. ఇందుకు మంచి ఉదాహరణ 18 ఏళ్ల సూర్యకుమార్. పెద్దగా చదువుకోకపోయినా మెకానిక్‌గా పనిచేస్తూ ఎంతో నిజాయతీగా బతుకుతున్న సూర్యకుమార్ జీవితం ఏప్రిల్ 19వ తేదీ రాత్రి తర్వాత ఒక్కసారిగా మారిపోయింది. ఇంతకీ ఆరోజు ఏం జరిగిందంటే... చెన్నై లోని అన్నానగర్‌లో ఉన్న మెకానిక్ షెడ్లో పనిచేస్తుండగా ఒక్కసారిగా ఓ మహిళ అరుపులు విన్నాడు. బయటకు వచ్చి చూస్తే డాక్టర్ అముతా అనే మహిళ మెడలో నుంచి ఓ దొంగ గొలుసు తెంచుకొని పారిపోతున్నాడు. సూర్యకుమార్ అతణ్ని వెంబడించి, పట్టుకొని, పోలీసులకు అప్పగించాడు. నిజాయతీగా గొలుసు తీసుకొచ్చి డాక్టర్‌కు ఇచ్చేశాడు. సూర్యకుమార్ ధైర్యసాహసాలు, నిజాయతీని మెచ్చుకున్న ఎస్ఆర్ఎమ్ గ్రూపు సంస్థ లక్ష రూపాయలు, చెన్నై రోటరీ క్లబ్ రూ.2 లక్షలు రివార్డుతో అభినందించాయి. చెన్నై పోలీస్ కమిషనర్.. సూర్యకుమార్‌ను స్వయంగా తనవద్దకు పిలిపించుకొని అభినందించాడు. నీకేం కావాలి? అని అడగ్గా.. ఉద్యోగం కావాలని చెప్పడంతో టీవీఎస్ సుందరం మోటార్స్ సంస్థ ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. పోలీస్ బాస్ సమక్షంలోనే గురువారం అపాయింట్మెంట్ లెటర్ కూడా అందుకున్నాడు. నాకెందుకులే అనుకున్నా.. గొలుసును తెచ్చి ఇవ్వకపోయినా సూర్యకుమార్ ఈ రోజు మెకానిక్‌గానే ఉండేవాడు. కానీ అతని ధైర్యసాహసాలు, నిజాయతీ ఇప్పుడతణ్ని ఓ ఉద్యోగిని చేశాయి. -
జీవితంపై విరక్తి చెంది..దారుణం
-
సోషల్ మీడియా ఎంత పని చేసింది!
చెన్నై: సోషల్ మీడియా ఎంత పని చేసిందని చెన్నై పోలీసులు వాపోతున్నారు. తాము చేసిన పని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడం పోలీసులకు తలనొప్పిగా మారింది. దీంతో సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని భావిస్తున్నారు. జల్లికట్టు ఆందోళనల సందర్భంగా చెన్నైలో నిరసనకారులకు ఆటోలకు నిప్పు పెడుతూ పోలీసులు వీడియోకు చిక్కారు. కమల్ హాసన్, అరవింద్ స్వామి లాంటి సినీ ప్రముఖులతో పాటు చాలా మంది ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి పోలీసుల తీరును ఎండగట్టారు. అడ్డంగా దొరికిపోవడంతో ఖాకీలు నష్టనివారణ చర్యలు చేపట్టారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు పూర్తి చేయడానికి వారం రోజులు పడుతుందని ఉన్నత పోలీసు అధికారి వి. బాలకృష్ణన్ తెలిపారు. వీడియోలో యూనిఫాంలో ఉన్నది నిజమైన పోలీసులా, కాదా అనే దాని గురించి పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఈ వీడియో వెంటనే ఫేస్ బుక్, వాట్సాప్, ట్విటర్ లో ప్రత్యక్షం కావడం తమ శాఖ వైఫల్యంగానే భావిస్తున్నామన్నారు. ఈ వ్యవహరం తమకు పాఠం నేర్పిందని, ఇక నుంచి సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉంటామని వెల్లడించారు. అయితే ఇది మార్ఫింగ్ చేసిన వీడియో అని అంతకుముందు పోలీసులు పేర్కొన్నారు. ఇది అసలైన వీడియోనా, కాదా అనేది దర్యాప్తులో వెల్లడవుతుందన్నారు. పోలీసు దుస్తుల్లో ఉన్న వ్యక్తులు నిరసనకారుల ఆటోలకు నిప్పు పెట్టినట్టు వీడియోలో కనబడడంతో కలకలం రేగింది. -
చెన్నైలో ఎటు చూసినా పోలీసులే
-
మదన్ ఉచ్చులో పచ్చముత్తు
-
ఎస్ఆర్ఎం విద్యాసంస్థల అధినేత అరెస్ట్!
చెన్నై: ఎస్ఆర్ఎం విద్యాసంస్థల అధినేత టీఆర్ పచ్చముత్తును సీఐడీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. మోసం సహా ఆయనపై మూడు కేసులు నమోదు చేశారు. ఎస్ ఆర్ ఎం యూనివర్సిటీ ఛాన్సలర్, ఐజేకే పార్టీ వ్యవస్థాపకుడైన పచ్చముత్తను గురువారం రాత్రి విచారణకు పిలిచారు. అయితే ఆయన అరెస్ట్ ను సీఐడీ ధ్రువీకరించలేదు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో మెడికల్ సీట్ల కోసం డబ్బు కట్టినా తమకు అడ్మిషన్లు ఇవ్వలేదని 100 మందిపైగా విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు. పచ్చముత్తుకు సన్నిహితుడైన సినీ నిర్మాత ఎస్. మదన్ తమకు సీట్లు ఇప్పిస్తామని డబ్బు తీసుకున్నాడని బాధితులు ఆరోపించారు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు లేఖ రాసి మే నెలలో మదన్ అదృశ్యం కావడంతో పచ్చముత్తు చిక్కుల్లో పడ్డారు. మదన్ దాదాపు రూ. 70 కోట్లు తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. మద్రాస్ హైకోర్టు ఆదేశంలో పచ్చముత్తును సీఐడీ అధికారులు విచారణకు పిలిచారు. కాగా, ఎస్ఆర్ఎం విద్యాసంస్థలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే అమరావతిలో 200 ఎకరాలు కేటాయించింది. -
చెన్నైలో పోలీసుల సైకిల్ గస్తీ
కేకే.నగర్: చెన్నైలో పోలీసుల గస్తీ నిర్వహించేందుకు ప్రభుత్వం సైకిళ్లను అందజేసింది. సుమారు 250 సైకిళ్లతో చెన్నైలో గల అన్ని ప్రాంతాల్లో పోలీసులు గస్తీ పెంచారు. హెడ్‌లైట్, సైరన్లు ఏర్పాటు చేసిన ఈ సైకిళ్లు పోలీసులకు ఎంతో అనువుగా ఉన్నాయి. చిన్నపాటి సందుల్లో కూడా వెళ్లే పోలీసులు గుడిసె ప్రాంతాల్లోని నేరాలను, నిందితులను సులభంగా అరెస్టు చేస్తున్నారు. టి.నగర్ సహాయ కమిషనర్ శరవణన్, కేకేనగర్ ప్రాంతంలో సైకిల్ గస్తీలను పర్యవేక్షించి పోలీసులను ప్రోత్సహించారు. గుడిసె ప్రాంతాల్లోని ప్రజల వద్ద పోలీసులు పని తీరు గురించి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. సైకిల్ గస్తీల వలన పోలీసులు ఎలాంటి సమస్య జరిగినా వచ్చి పరిష్కరిస్తున్నారని ప్రజలు తెలిపారు. -
స్వాతి హత్యకేసు చెన్నై పోలీసులకు బదిలీ
చెన్నై: ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసు విచారణను చెన్నై పోలీసులకు బదిలీ చేస్తూ మద్రాసు హైకోర్టు సోమవారం ఆదేశాలు ఇచ్చింది. చెన్నై నుంగంబాక్కం రైల్వేస్టేషన్లో స్వాతి శుక్రవారం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ముందుగా ఈ కేసును రైల్వే పోలీసులు విచారణ చేపట్టగా, ఎలాంటి పురోగతి లేకపోవడంతో హైకోర్టు కేసును చెన్నై పోలీసులకు బదిలీ చేసింది. అంతకు ముందు ఈ హత్య కేసుపై మధ్యాహ్నం 3 గంటలకు ప్రాథమిక నివేదిక సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించారు. మరోవైపు డీఎంకే నేత ఎంకే స్టాలిన్ ఇవాళ స్వాతి కుటుంబసభ్యుల్ని కలిశారు. ఆమె తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరో కుటుంబానికి ఇటువంటి పరిస్థితి రాకూడదన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకోవాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. కాగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకూ ఎవరినీ పోలీసులు అరెస్ట్ చేయలేదు. అయితే సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుడి ఊహా చిత్రాలను రైల్వే పోలీసులు విడుదల చేశారు. -
'నటి అల్ఫోన్సా నా భర్తను కిడ్నాప్ చేసింది'
చెన్నై : నటి అల్ఫోన్సా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. అల్ఫోన్సా తన భర్తను అపహరించిందంటూ మైలాడుదురైకు చెందిన సుజాత అనే ఓ మహిళ (అసలుపేరు కాదు) పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమె బుధవారం నగర పోలీసు కమిషనర్ జార్జ్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. పలు భాషల్లో శృంగార తారగాను, వివిధ పాత్రల్లోనూ నటించిన అల్ఫోన్సా ...రజనీకాంత్ నటించిన భాషా చిత్రంలో రా...రా..రా.. రామయ్య పాట ద్వారా ప్రాచుర్యం పొందారు. కాగా తన భర్తను కిడ్నాప్ చేసిందంటూ అల్ఫోన్సాపై ఫిర్యాదు చేయడం కలకలం సృష్టిస్తోంది. చెన్నై సైదాపేటలో నివసిస్తున్న తన భర్త జయశంకర్‌ను అల్ఫోన్సా అపహరించిందని, ప్రస్తుతం ఆమె తనను ఫోన్లో చంపుతానని బెదిరిస్తోందని సుజాత తన ఫిర్యాదులో తెలిపింది. ఎనిమిదేళ్లుగా తాను జయశంకర్ ప్రేమించుకుని 2013లో పెళ్లి చేసుకున్నట్లు ఆమె వెల్లడించింది. 'అలాంటిది అల్ఫోన్సా ఫోన్లో నీకంటే ముందే జయశంకర్‌ను నేను పెళ్లి చేసుకున్నాను. కాబట్టి నువ్వు అతన్ని వదలి పారిపోలేదంటే చంపుతానంటూ బెదిరిస్తోందని' తెలిపింది. సుజాత తన ఫిర్యాదుతో పాటు కొన్ని ఆధారాలను పోలీస్ కమిషనర్‌కు అందించింది. అందులో అల్ఫోన్సా, జయశంకర్ సన్నిహితంగా ఆడిపాడే సన్నివేశాలు వీడియోతోపాటు తన పెళ్లి ఫోటోలు ఉన్నాయి. సుజాత ఫిర్యాదును స్వీకరించిన కమిషనర్ జార్జ్ దర్యాప్తుకు ఆదేశించారు. అడయారు అసిస్టెంట్ కమిషనర్, కన్నన్ ఆధ్వర్యంలో సైదాపేట పోలీసులు ఈ కేసుపై విచారణ నిర్వహిస్తున్నారు. -
మత్తు ఇచ్చి తాళికట్టాడు !
చెన్నై: తనను ఒక యువకుడు మత్తు మందు ఇచ్చి వివాహం చేసుకున్నట్లు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఊటికి చెందిన యువతి చెన్నైలో ఒక ప్రైవేటు కళాశాలలో పోస్టు గ్రాడ్యుయేషన్ చదువుతోంది. కళాశాల ఎదుటగల ఉమెన్ హాస్టల్లో బసచేస్తోంది. ఈమెకు, కృష్ణగిరిలో జిమ్ నడుపుతున్న కుమార్ (27)తో పరిచయమైంది. ఇరువురూ గత కొన్ని రోజుల క్రితం కృష్ణగిరిలో తల్లిదండ్రులకు తెలియకుండా పూలదండలు మార్చుకుని వివాహం చేసుకున్నారు. తర్వాత విడిగా ఇల్లు తీసుకుని జీవించసాగారు. సమాచారం అందుకుని రమ్యను కలిసిన ఆమె తల్లిదండ్రులు ఆమెతో చర్చించారు. ఆమెకు వేరొక చోట వరుని చూసి వివాహం చేస్తామని చెప్పి ఆమెను తీసుకువెళ్లారు. దీంతో విరక్తి చెందిన కుమార్ తన భార్యను ఆమె తల్లిదండ్రులు కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారని కృష్ణగిరి జిల్లా, రాయకోట్టై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు దీనిగురించి కేసు నమోదు చేశారు. తన భార్యను అప్పగించాలంటూ చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో కుమార్ తరపున ఫిర్యాదు అందింది. అయితే రమ్య ఎగ్మూరు పోలీసు స్టేషన్లో మంగళవారం ఒక ఫిర్యాదు చేసింది. అందులో కుమార్ తనను కిడ్నాప్ చేసి మత్తుమందు ఇచ్చారని, తరువాత తనకు తాళి కట్టి తనపై అత్యాచారం చేశాడని తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న తాను తాళి విసిరికొట్టి చెన్నై చేరుకున్నానని పేర్కొంది. ప్రస్తుతం అతను తన వద్దకు రాకుంటే హత్య చేస్తానని బెదిరిస్తున్నట్లు తెలిపింది. అందుచేత కుమార్‌పై చర్యలు తీసుకోవాలని కోరింది. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
హెరాయిన్ పట్టివేత
అంతర్జాతీయ మార్కెట్లో కోట్ల విలువచేసే హెరాయిన్‌ను చెన్నై లో పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీ, చెన్నై పోలీసుల సంయుక్తంగా పూందమల్లిలో చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైంది. 18 కిలోల హెరాయిన్‌తో పాటు ముగ్గుర్ని అరెస్టు చేశారు. సాక్షి, చెన్నై: రాష్ట్రంలోచాపకింద నీరు లా మాదక ద్రవ్యాల విక్రయాలు సాగుతున్నాయి. ఇందుకు అద్దం పట్టే రీతిలో తరచూ పోలీసుల తనిఖీల్లో మాదక ద్రవ్యాలు పట్టుబడుతున్నా యి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు కోట్ల విలువచేసే మాదక ద్రవ్యాలతో పాటు విదేశీ ముఠాను చెన్నైలో పోలీసులు అరెస్టు చే శారు. ఇటీవల ఢిల్లీ పోలీసులకు చిక్కిన ఓ నింధితుడి వద్ద జరిపిన విచారణ మేరకు చెన్నై కేంద్రంగా దక్షిణాది రాష్ట్రాలకు మాద్యద్రవ్యాలు తరలుతున్నట్టు తేలింది. దీంతో ఢిల్లీ, చెన్నైలోని మాదక ద్రవ్యాల నియంత్రన విభాగం పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. రెండు రోజుల క్రితం రవి అనే వ్యక్తి వద్ద జరిపిన విచారణతో పూందమల్లిలో ఓ ఇంట్లోని వ్యక్తి అనుమానాస్పదంగా తరచూ కళాశాలల వద్ద కనిపించినట్టు తేలింది. అతడి పేరు పెరుమాల్. అతడికి రవి అనే వ్యక్తి ఇంటిని అద్దెకు ఇప్పించినట్టు గుర్తించారు. ఆపరేషన్ ఢిల్లీ, చెన్నై పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్‌కు సిద్ధమయ్యారు. శుక్రవారం నుంచి పూందమల్లి నరసింహ నగర్‌లోని ఆ ఇంటి పరిసరాల్లో తిష్టవేశారు. శనివారం అర్థరాత్రి ఆ ఇంటిపై దాడులు చేశారు. ఇంట్లో ఉన్న ముగ్గుర్నీ అరెస్టు చేశారు. అక్కడి సూట్ కేసుల్లో ఉన్న పార్సిళ్లను పరిశీలించి హెరాయిన్‌గా తేల్చారు. ఆ ముగ్గురిలో ఒక రు తిరునల్వేలికి చెందిన పెరుమాల్‌గా గుర్తించారు. మరో ఇద్దరు శ్రీలంకకు చెందిన రఫీక్(61), డెఫిక్(41)గా తేల్చారు. వీరిద్దరూ తండ్రీకొడుకులుగా నిర్ధారణ అయ్యింది. వీరి వద్ద నుంచి పట్టుబడ్డ 18 కిలోల హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.వంద కోట్లు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మరి కొందరు వాటి విలువ రూ.యాభై కోట్లు ఉండొచ్చని పేర్కొంటున్నారు. విచారణ వేగవంతం ఈ ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు తీవ్రంగా విచారిస్తున్నారు. ప్రధానంగా రఫీక్, డెఫిక్ల వద్ద విచారణ వేగవంతమైంది. శ్రీలంకకు చెందిన వాళ్లు ఇది వరకు చెన్నైలో పట్టుబడడం, వారంతా ఐఎస్ఐ ఏజెంట్లుగా తేల్చారు. ఈ దృష్ట్యా, తాజాగా పట్టుబడ్డ వీరు ఐఎస్ఐ ఏజెంట్లా..? అన్న అనుమానాలు బయలు దేరాయి. అలాగే, నగర శివారుల్లో ఇరవై కళాశాలల పరిసరాల్లో తరచూ పెరుమాల్ కనిపిస్తుండడంతో, వీరి వలలో పడ్డ విద్యార్థుల వివరాల్ని సేకరించేందుకు పోలీసులు ఉరకలు తీస్తున్నారు. -
ఆ భూముల్లోకి బాంబులు ఎలా వచ్చాయి?
చెన్నై : ఒక వైపు అటవీ భూమి, మరోవైపు స్పెషల్ టాస్క్ఫోర్సు అధికారుల పర్యవేక్షణ ఇవేమీ నిందితుల ఆగడాలను అడ్డుకోలేకపోయాయి. అయినా గుట్టుచప్పుడు కాకుండా భయంకరమైన పేలుడు పదార్థాలను భూమిలో పాతిపెట్టేసి, చల్లగా జారుకున్నారు. సేలం జిల్లా మేట్లూరు సమీపంలోని కొలత్తూరు అటవీ భూముల్లో మంగళ, బుధవారాల్లో బయటపడిన పేలుడు పదార్థాల డంప్ అధికారులను ఆందోళనకు గురిచేసింది. ఒకప్పుడు ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ సంచరించిన ప్రాంతం, 20 ఏళ్ల క్రితం విడుదలై చిరుతైగళ్ అనే విప్లవకారులు రహస్యంగా శిక్షణ పొందిన ప్రదేశం కావడంతో ప్రభుత్వం ప్రత్యేక ప్రాంతంగా పరిగణిస్తోంది. అందుకే ఈ అటవీ ప్రాంతంలో అన్యుల ప్రవే శాన్ని అడ్డుకునేందుకు స్పెషల్ టాస్క్ఫోర్సు పర్యవేక్షణ ఏర్పాటు చేసింది. పర్యావరణ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని అటవీశాఖవారు 50 ఎకరాల విస్తీర్ణంలో మొక్కలు నాటేందుకు సిద్ధమయ్యూరు. మొక్కల కోసం మంగళవారంనాడు అటవీ సిబ్బంది గుంతలు తవ్వుతుండగా లోహపు శబ్దాలు వినపడ్డాయి. మరింత లోతుకు తవ్విచూడగా భూమి లోతుల్లో దాచివుంచిన పాత ఇనుప బేరల్ దొరికింది. ఆ బేరల్‌ను పగులగొట్టి చూరగా, అందులో అనేక చేతి బాంబులు, డిటోనేటర్లు, తుపాకులు, మందుగుండు సామగ్రి కనిపించింది. అంతేగాక మూడు పాలిథిన్ కవర్లలో తుపాకీ విడిభాగాలు లభ్యమయ్యూయి. వాటిని చూసి హడలిపోయిన అటవీ సిబ్బంది సేలం ఎస్పీ శక్తివేల్‌కు సమాచారం ఇచ్చారు. ఎస్పీతోపాటూ క్యూబ్రాంచ్ పోలీసులు, ఇంటెలిజెన్స్ పోలీసులు అక్కడికి చేరుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. అదే పరిసరాల్లో తవ్విచూడగా మరిన్ని పేలుడు పదార్థాలు బయటపడ్డాయి. ఆయా పేలుడు పదార్థాల్లో కొన్నింటిపై ఎల్టీటీఈ అని రాసి ఉండటాన్ని కనుగొన్నారు. డంప్ దొరికిన స్థలానికి సమీపంలోని గోడమీద బుల్లెట్ తగిలిన గుర్తులను కనుగొన్నారు. 1980లో విడుదలై చిరుతైగళ్ అనే విప్లవకారులు పేలుడు పదార్థాల వినియోగం, తుపాకీ కాల్పులపై శిక్షణ పొందిన ప్రాంతంలో ఈ డంప్ దొరకడం అధికారులను ఆలోచింపజేసింది. డంప్‌లో దొరికిన పేలుడు సామగ్రి ఎక్కడా తప్పుపట్టినట్లుగా లేదు. రెండు దశాబ్దాలకు పైగా మట్టిలో పూడ్చిపెట్టి ఉన్నట్లయితే ఖచ్చితంగా తుప్పుపట్టి ఉండేవి. పోనీ విద్రోహశక్తులు ఇటీవలే దాచిపెట్టారా అందామంటే ఈ భూములు 20 ఏళ్లుగా స్పెషల్ టాస్క్ఫోర్సు ఆధీనంలో ఉన్నారుు. ఈ భూముల్లో డంప్‌ను పాతిపెట్టడం ఎలా సాధ్యమని తలలు పట్టుకుంటున్నారు. మందు గుండు సామగ్రి దొరికిన చోట బందోబస్తును ఏర్పాటు చేసి క్యూ బ్రాంచ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మనస్సాక్షి లేదా?
సాక్షి, చెన్నై:‘మనస్సాక్షి లేదా...అంధులతో ఎలా వ్యవహరించాలో తెలియదా?’ అని చెన్నై పోలీసులను మద్రాసు హైకోర్టు ప్రధాన బెంచ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసింది. చెన్నై పోలీసుల పనితీరుపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. గత ఏడాది సెప్టెంబరులో అంధులు తమ డిమాండ్ల సాధన కోసం రోజుల తరబడి ఆందోళనలు చేశారు. దీక్ష రూపంలో నిరసనలు తెలిపారు. ఎవ్వరూ తమను పట్టించుకోకపోవడంతో చివరకు రోడ్డెక్కారు. ఆ రోజు రోడ్డెక్కిన అంధులనుోలీసులు అరెస్టు చేయడం, ఆ మరుసటి రోజున మరో చోట నిరసనకు దిగడం అంధులకు దినచర్యగా మారింది. చివరకు పోలీసులు మానవత్వాన్ని మరిచే రీతిలో వ్యవహరించారు. అంధులను అరెస్టు చేసి రాజధాని నగరం నుంచి 72 కిలో మీటర్ల దూరం తీసుకెళ్లి వదిలి పెట్టారు. దీనిపై ఎవ్వరూ పెద్దగా పట్టించుకోనప్పటికీ, ఆ సమయంలో అంధులు ఎలాంటి వేదన అనుభవించి ఉంటారోనన్న విషయాన్ని చెన్నైకు చెందిన పౌరుడు మహ్మద్ నజూరుల్లా గ్రహించారు. అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆయన ఓ లేఖ రాశారు. అంధులతో పోలీసులు వ్యవహరించిన తీరును ఎత్తి చూపారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ లేఖను అప్పటి న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకుని విచారణ చేపట్టారు. వివరణ కోరుతూ చెన్నై పోలీసు కమిషనర్ జార్జ్‌కు నోటీసులు ఇచ్చారు. ప్రశ్నల వర్షం: సోమవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి సత్యనారాయణ నేతృత్వంలోని ప్రధాన బెంచ్ ముందు ఉదయం విచారణ జరిగింది. చెన్నై పోలీసు కమిషనరేట్ తరపున న్యాయవాది మూర్తి హాజరయ్యారు. వివరణకు మరింత సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీంతో చెన్నై పోలీసులను ఉద్దేశించి ప్రధాన బెంచ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మనస్సాక్షి లేదా? అంధులతో ఎలా వ్యవహరించాలో తెలియదా? అంత దూరం ఎలా తీసుకెళ్లారు? ఎక్కడ వదిలి పెట్టారు? మళ్లీ వారు ఎలా రాగలిగారు? ఎంత మందిని తీసుకెళ్లారు..? ఇలా ప్రశ్నల్ని సంధించడంతో పోలీసుల తరపున న్యాయవాది ఉక్కిరిబిక్కిరి కాక తప్పలేదు. అంధులతో ఇలా వ్యవహరించవచ్చన్న నిబంధనలు ఏమైనా ఉన్నాయా?, అంధులను ఏ ప్రాతిపదికన అరెస్టు చేశారు? ఎలాంటి సెక్షన్లు తమ వద్ద ఉన్నాయి...? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తమ ప్రశ్నలకు సమాధానాలతో పాటుగా, ఈ పిటిషన్‌కు రెండు వారాల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. -
మారన్ చుట్టూ ఉచ్చు
-
మారన్ సోదరులపై బిగుస్తున్న ఉచ్చు
చెన్నై: ఎయిర్‌సెల్ - మాక్సిస్ వ్యవహారంలో మారన్ సోదరులపై వచ్చేవారంలో చార్జ్‌షీటు దాఖలు చేస్తామని సీబీఐ డెరైక్టర్ తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ కూటమి ప్రభుత్వం 2004 నుంచి 14 వరకు అధికారంలో ఉంది. అందులో 2004 - 2007 మధ్య కేంద్ర ఐటీ శాఖ మంత్రిగా దయానిధిమారన్ పని చేశారు. ఆ సమయంలో ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్త శివశంకరన్ చెన్నైలో నడుపుతున్న ఎయిర్‌సెల్ సమాచార సంస్థకు బ్రాడ్‌బ్యాండ్ కేటాయింపు కోరుతూ 2006లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే దానికి ఒప్పందం కుదరలేదు. ఇలా ఉండగా ఎయిర్‌సెల్ సంస్థ షేర్లు హఠాత్తుగా మలేషియా మాక్సిస్ సంస్థకు చేతులు మారాయి. ఆ తరువాత అనేక ప్రాంతాల్లో ఎయిర్‌సెల్ సర్వీసును ప్రారంభించేందుకు 14 లెసైన్స్‌లు ఇచ్చారు. దీనికి ప్రతి ఫలంగా మాక్సిస్ సంస్థ తమ అనుబంధ సంస్థల ద్వారా దయానిధిమారన్ సోదరుడు కళానిధిమారన్ నిర్వహించే సన్ డెరైక్ట్ సంస్థలో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. ఆ తరువాత శివశంకరన్ విదేశాల్లో స్థిరపడ్డారు. 2008లో కరుణానిధి, మారన్ సోదరుల మధ్య అభిప్రాయాల భేదాలు ఏర్పడగా శివశంకరన్ ఢిల్లీ చేరుకున్నారు. సీబీఐతో మారన్ సోదరులకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. 2011లో ఎఫ్ఐఆర్ నమోదైంది. మారన్ సోదరులపై చార్జ్‌షీటు రూపొందించేందుకు సీబీఐ చర్యలు తీసుకుంటోంది. -
సినీ దర్శకుడిపై నిర్మాత ఫిర్యాదు
చెన్నై: సినీ దర్శకుడు మోసానికి పాల్పడ్డాడంటూ నిర్మాత పోలీసులకు ఫిర్యాదు చేయడం కోలీవుడ్‌లో కలకలం సృష్టిస్తోంది. కొన్ని నెలల క్రితం విడుదలైన చిత్రం ఈగో. ఈ చిత్ర ఓవర్సీస్ హక్కుల్ని వేందర్ మూవీస్ సంస్థ కొనుగోలు చేసి ఆ తరువాత శంకరనారాయణన్ అనే వ్యక్తికి విక్రయించింది. ఆయన నుంచి ఎఫ్‌సీఎస్ క్రియేషన్ అధినేత వీరశేఖర్ ఈగో ఓవర్సీస్ హక్కులను పొందారు. ఈయన నుంచి సేతురామన్ ఈగో చిత్ర ఓవర్సీస్ హక్కుల్ని పొందారు. ఆయన ఈ చిత్రాన్ని మలేషియాలో విడుదల చెయ్యడానికి అక్కడి అస్ట్రో టీవీ సంస్థను సంప్రదించారు. అయితే అదే చిత్రం హక్కులు తన వద్ద ఉన్నట్టు మరో వ్యక్తి తమను సంప్రదించారని అస్ట్రో టీవీ సంస్థ నిర్వాహకులు తెలిపారు. దీనిపై అసలైన హక్కుదారులు ఎవరన్న విషయం గురించి ప్రశ్నించారు. అయితే ఈగో చిత్ర హక్కులను మరో వ్యక్తికి చిత్ర దర్శకుడు శక్తివేల్ విక్రయించినట్లు తెలిసింది. దీంతో సేతుమాధవన్ దర్శకుడు శక్తివేల్‌తో సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్‌లోఉంది. దీంతో సేతురామన్ స్థానిక విరుగంబాక్కం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అక్కడి పోలీసులు సరిగా స్పందించకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు ఆదేశంతో దర్శకుడు శక్తివేల్‌పై కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నారు. -
ముగ్గురు తీవ్రవాదుల అరెస్ట్
- హిందూ మున్నని నేత హత్య కేసులో నిందితులు - పోలీసుల అదుపులో మరో అనుమానితుడు చెన్నై, సాక్షి ప్రతినిధి: అల్-ఉమ్మాకు చెందిన ముగ్గురు మాజీ తీవ్రవాదులను శుక్రవారం చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. కాశీమేడు ఫిషింగ్ హార్బర్ వద్ద మరో అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. తిరువళ్లూరు హిందూ మున్నని నేత సురేష్‌కుమార్ జూన్ 18వ తేదీ హత్యకు గురయ్యాడు. రాత్రి 10.30 గంటల సమయంలో అంబత్తూరులోని తన పార్టీ కార్యాలయానికి తాళం వేసి ఇంటికి వెళ్లేం దుకు రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. సంయుక్త పోలీస్ కమిషనర్ షణ్ముగవేల్ ఆదేశాల మేరకు సహాయ కమిషనర్ మయిల్‌వాహనన్ నాయకత్వంలో విచారణ బృందం ఏర్పడింది. విద్యార్థులను స్కూల్‌కు చేరవేసే వాహనం నిర్వహించే సురేష్‌కుమార్‌కు ఎవ్వరితోనూ విబేధాలు లేవని, అయితే హిందూ మున్నని నేతగా ఒక సభలో ఇతర మతస్తుల గురించి విమర్శలు చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. అయితే ఇది అల్-ఉమ్మా తీవ్రవాదుల పనేనని నిర్దారణకు వచ్చారు. ఇదే రకం నేరాలపై జైలు శిక్షను అనుభవిస్తున్న పోలీస్ ఫ్రకుద్దీన్, పన్నా ఇస్మాయిల్ తదితరులను విచారించారు. వారికోసం జైలుకు ఎవరెవరు వస్తున్నారని నిఘాపెట్టారు. అజ్ఞాతంలో ఉన్న అల్- ఉమ్మా తీవ్రవాదుల చిట్టాను పరిశీలించారు. ఈ దశలో అంబత్తూరు పాడికి చెందిన నజీర్ (28), కడలూరుకు చెందిన ఖాజా మెహిద్దీ న్ (32), కుతుబుద్దీన్ (30)లను చెన్నైలో శుక్రవారం పట్టుకున్నారు. విచారణలో సురేష్‌కుమార్‌ను హత్య చేసింది తామేనని వారు అంగీకరించారని పోలీసులు తెలిపారు. హత్యకు దారితీసిన విధానాన్ని వారు వివరిస్తూ, గత ఏడాది డిసెంబ ర్ 12వ తేదీన అంబత్తూరులో జరిగిన హిందూ మున్నని సభలో సురేష్‌కుమార్ ఇతర మతాల పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఈ ముగ్గురూ అగ్రహోద్రులయ్యారు. వారు బస్సులో అంబత్తూరు ఎస్టేట్‌కు చేరుకుని కాపుకాశారు. ఒంటరిగా రోడ్డు దాటుతుండగా నరికి చంపారు. గతంలో అల్-ఉమ్మా తీవ్రవాద సంస్థలో పనిచేసిన వీరు ఆ తరువాత నీది పాశరై అనే సొంత సంస్థను పెట్టుకున్నారు. మారణాయుధాలతోనే అన్యాయాలను ఎదిరించగలమనే భావనను ఒంటబట్టించుకున్నారు. అదుపులో అనుమానితుడు: చెన్నై శివార్లు కాశీమేడు ఫిషింగ్ హార్బర్ వద్ద ఒక అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఉదయం 9.25 గంటల ప్రాంతంలో సుమారు 25 ఏళ్ల యువకుడు చేతి సంచితో అక్కడి ఫైబర్బోటులోకి ఎక్కి దానిని స్టార్ట్ చేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఇంతలో బోటు యజమాని అతన్ని పట్టుకుని కాశీమేడు హార్బర్ పోలీసులకు అప్పగించాడు. అతని చేతిలోని సంచిని తెరిచి చూడగా రూ.10, రూ.50ల నోట్లతో కూడా కరె న్సీ కట్టలు బైటపడ్డాయి. పోలీసుల ప్రశ్నలకు మూగవానివలె సైగలు చేయడం ప్రారంభించాడు. ఆ యువకుడు నిజంగా మూగవాడేనా, సంచిలో ఉన్న డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఆతను ఎవరు అని విచారిస్తున్నారు. సముద్రమార్గంలో పారిపోయే ప్రయత్నాలు చేయడాన్ని బట్టి తీవ్రవాదిగా అనుమానిస్తున్నారు. -
చెన్నైలో నకిలీ కరెన్సీ పట్టివేత
-
ఏటీఎంలో సొమ్ము దొంగిలించి ... జూదంలో పెట్టాడు
ఏటీఎంలో సొమ్ము కొల్లగోట్టాడు. ఆ సొమ్మును సులభంగా రెట్టింపు చేయాలనుకున్నాడో ఏమో తీసుకువెళ్లి జూదంలో పెట్టాడు. జూదంలో ఆ సొమ్ముంతా పోయింది. వివరాలు....చెన్నై నగరంలోని గూడువాంజేరి పోలీసు స్టేషన్ ఎదురుగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఏటీఎం సెంటర్లోకి ఈనెల 14వ తేదీ అర్ధరాత్రి ఓ దొంగ చొరబడి జిలెటెన్ స్టిక్స్‌తో పేల్చాడు. ఆ ఏటీఎంలో నగదు చోరీపై పోలీసుల దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా తిరుచ్చి జిల్లా మిసిరితాలుకా కుత్తనాంబట్టి గ్రామం ఉత్తర వీధికి చెందిన కుమార్(25)కు ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించిన పోలీసులు... నిందితుడు కుమార మడిపాక్కంలో ఉన్నట్లు గుర్తించి చెంగల్పట్టు డీఎస్పీ కుమార్ ఆధ్వర్యంలోని అతడిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అతడిని సమయపురం ఇన్స్పెక్టర్ మనోహరన్ ఆధ్వర్యంలో నిందితుడు కుమారును విచారించారు. ఆ విచారణలో కుమార్ పలు అసక్తికరమైన విషయాలు పోలీసులకు వెల్లడించాడు. గతంలో తిరుప్పూర్ ఏటీఎం పేల్చివేత ఘటనలో తనకు సంబంధం ఉన్నట్లు కుమార్ పోలీసులకు వెల్లడించాడు. అలాగే గత మార్చిలో తిరుచ్చి టోల్‌గేట్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంకు ఏటీఎం కేంద్రాన్ని కూడా ఇదే విధంగా పేల్చివేసి రూ. 25 లక్షలు దోచుకున్నానని తెలిపాడు. ఆ నగదులో సగం సొమ్మును పుదుచ్చేరిలోని ఒక క్లబ్లో జూదం ఆడి పొగొట్టుకున్నట్లు చెప్పాడు. ఆ తర్వాత మిగిలిన సొమ్ముతో విలాసాలు చేసిటనట్లు పోలీసుల విచారణలో వివరించాడు. నిందితుడు కుమార్ తల్లి మంగై ముసిరి పంచాయతీ యూనియన్ అన్నాడీఎంకే కౌన్సిలర్ గా ఉన్నారు. ఆమె రెండో కుమారుడైన కుమార్ ఉద్యోగం లేకుండా జులాయిగా తిరుగుతుండేవాడు. ఆ క్రమంలో కొన్ని రోజుల క్రితం చెన్నై చేరుకున్నాడు. అనేక చిత్రాల్లో సహాయక నటుడిగా నటించాడు. ఆ తర్వాత సినిమాలు లేకపోవడంతో ఏటీఏంలో సొమ్ము దొంగిలించడమే పనిగా పెట్టుకున్నాడు. -
మామూళ్ల కోసం దాడి
మామూళ్ల కోసం దాడి తిరువొత్తియూరు: తమిళనాడు మేకమాంసం వ్యాపారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎకె షాన్‌బాషా, చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో గురువారం ఓ ఫిర్యాదు చేశాడు. తమ సంఘంలో ప్రత్యక్షంగాను, పరోక్షంగాను, కొన్ని వేల మంది సభ్యులుగా ఉన్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి మేకలను లారీలలో తీసుకువస్తుంటారని తెలిపారు. చెన్నై శాంతిభద్రత, ట్రాఫిక్ పోలీసులు లారీ డ్రైవర్లను దారిలో అడ్డగించి జరిమానా వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు.. కొందరిపై దాడికి కూడా పాల్పడుతున్నారని వాపోయూరు. మామూళ్లు కోరుతూ భాష తెలియని ఉత్తరాదికి చెందిన డ్రైవర్, క్లీనర్లను వేధిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
మలుపులు తిరుగుతున్న మున్నా కేసు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : నరహంతకుడు మున్నాభాయ్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసుతో ఇద్దరు రాజకీయ నాయకులు, నలుగురు ప్రభుత్వాధికారులకు సంబంధాలున్నట్లు నిర్ధారించుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు వస్తుందని ఆశ చూపించిన మున్నాభాయ్ అనేక మందిని వలలో వేసుకున్నాడు. డబ్బుకు ఆశపడి మున్నాకు సహకరించిన వారిలో అనేక మంది రాజకీయ నాయకులు, అధికారులు, ఇతర ప్రముఖులు ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. అత్యంత గోప్యంగా దర్యాప్తు చేస్తున్నారు. ఎలాంటి వివరాలూ బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దానిలో భాగంగానే ఈ కేసుతో సంబంధం ఉన్న నె ల్లూరు డీఎంహెచ్‌వో సుధాకర్‌ను అరెస్ట్ చేసి వారంరోజుల తర్వాతగానీ వెల్లడించలేదు. డీఎంహెచ్‌వోతో పాటు మరో నలుగురు ప్రభుత్వ అధికారులు, ఇద్దరు రాజకీయ నాయకులకు మున్నాతో ప్రత్యక్ష సంబంధాలున్నట్లు నిర్ధారించుకున్న పోలీసులు.. వారిలో ఇద్దరు అధికారులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మిగిలిన ఇద్దరు అధికారులు, ఇద్దరు రాజకీయ నాయకులను కూడా విచారిస్తున్నట్లు సమాచారం. అయితే వారి పేర్లు ఏమాత్రం బయటకు రాకుండా పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. రంగంలోకి చెన్నై పోలీసులు... మున్నా కేసు విచారణకు చెన్నై నుంచి ‘క్యూ’ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగినట్లు తెలిసింది. వీరు చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఐఎస్ఐ తీవ్రవాదులతో కలిసి మున్నాభాయ్ బెంగళూరులో గడిపినట్లు సమాచారం. ఆ సమయంలో నెల్లూరు డీఎంహెచ్‌వో సుధాకర్, ఇతర అధికారులు అనేకసార్లు బెంగళూరు వెళ్లి మున్నా బృందంతో కలిసి విలాసాలతో ఆనందంగా గడిపినట్లు తెలిసింది. అక్కడ మున్నాతో పాటు ఐఎస్ఐ వర్గాలకు కూడా నెల్లూరు డీఎంహెచ్‌వో సుధాకర్ మధ్యవర్తిత్వం వహించినట్లు సమాచారం. మున్నాకు డబ్బు చేరకపోతే సుధాకరే పలువురితో మాట్లాడి సెటిల్ చేసినట్లు పోలీసుల వద్ద ఆధారాలున్నాయి. మున్నా బ్యాంకు ఖాతాతో ఎక్కువ లావాదేవీలు నడిపిన వారిలో సుధాకర్ ఒకడిగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే సుధాకర్‌ను పూర్తిస్థాయిలో విచారించిన పోలీసులు.. అతని ద్వారా అనేక విషయాలు తెలుసుకుని మిగిలిన వారిపై కూడా దృష్టి సారించారు. సుధాకర్ గతంలో చిత్తూరు జిల్లాలో కూడా పనిచేసినందున అక్కడి వారితో కూడా ఈ కేసుతో సంబంధాలుండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, బెంగళూరు పోలీసులు కూడా ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. మూడు రాష్ట్రాల పోలీసులు విచారిస్తున్న నేపథ్యంలో మున్నాభాయ్ కేసు ఇంకా అనేక మలుపులు తిరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
తమిళ చానల్ న్యూస్ ఎడిటర్ అరెస్టు
సాక్షి, చెన్నై: లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ రాజకీయ పార్టీ అధినేతకు చెందిన తమిళ చానల్ చీఫ్ న్యూస్ ఎడిటర్ దినేష్‌ను చెన్నై పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అదే చానల్లో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పనిచేస్తున్న మహిళపై దినేష్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. వేధింపులకు తాళలేక ఆమె నెల్లాళ్ల కిందట ఉద్యోగానికి రాజీనామా చేసింది. అయినా, ఫోన్లో వేధింపులు సాగించడంతో ఆమె కోయంబేడు అసిస్టెంట్ పోలీసు కమిషనర్ సెంథిల్‌కుమార్‌కు శనివారం ఫిర్యాదు చేసింది. మదురవాయిల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, దినేష్‌ను అరెస్టు చేశారు. అతడిని కోర్టులో హాజరుపరిచారు. జడ్జి ఆదేశాలపై అతడిని పుళల్ జైలుకు రిమాండుకు తరలించారు. -
పుత్తూరులో ఇద్దరు ఉగ్రవాదుల హతం?
చిత్తూరు జిల్లా పుత్తూరులో భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. ఆ ఇంట్లో మరో నలుగురి వరకు అల్ ఉమా ఉగ్రవాదులున్నట్లు అనుమానిస్తున్నారు. అంబులెన్స్‌ను తెప్పించిన పోలీసులు ఆ మృతదేహాలను ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. మరోవైపు ఎన్ఐఏ బృందం పుత్తూరుకు చేరుకుంది. విషయం తెలిసిన వెంటనే ఆక్టోపస్ బలగాలను అక్కడకు తరలించినట్లు డీజీపీ బయ్యారపు ప్రసాదరావు తెలిపారు. సుమారు 30 మంది ఆక్టోపస్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అల్ ఉమా ఉగ్రవాది బిలాల్ మాలిక్ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అందటంతో చెన్నై పోలీసులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. చెన్నై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ హత్యకేసులో బిలాల్ మాలిక్ నిందితుడు. ఇక్కడి ఉగ్రవాదులు కోయంబత్తూరు బాంబు పేలుళ్ల నిందితులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 1998 ఫిబ్రవరి 15న కోయంబత్తూరులో 11 ప్రాంతాల్లో 13 పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 58మంది మృతి చెందగా, సుమారు 200మందికి పైగా గాయపడ్డారు. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం నేపథ్యంలో పుత్తూరు మేదర వీధిలోని ఓ నివాసంలో శుక్రవారం రాత్రి నుంచే తమిళనాడు, ఆంధ్రా పోలీసులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఉగ్రవాదుల దాడిలో ఓ కానిస్టేబుల్ మరణించగా.. సీఐ కళ్యాణ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను రుయా ఆస్పత్రికి, అక్కడినుంచి చెన్నైకి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొద్ది నెలల క్రితం నలుగురు వ్యక్తులు బీడీ కార్మికులుగా ఇల్లు అద్దెను తీసుకున్నారు. అయితే వాళ్లు రాత్రిళ్లే ఇంట్లో ఉండేవారని, వారి గురించి పూర్తి వివరాలు తెలియవని చెబుతున్నారు. మరోవైపు దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారం కాబట్టి మీడియా సహకరించాలని.... పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి ఓ అంబులెన్స్ చేరుకోవటంతో ఏం జరిగిందా అనే ఉత్కంఠ నెలకొంది. -
పుత్తూరులో ఉగ్రవాదుల దాడి.. కానిస్టేబుల్ మృతి