ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చెన్నై : ఖర్జూర పండులో బంగారం తెచ్చిన వ్యక్తిని చెన్నై విమానాశ్రయ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఉదయం సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఇతను ఖర్జూర పండులో 300 గ్రాముల బంగారాన్ని ఉంచి తీసుకొచ్చాడు. చెన్నై మీనంబాక్కం విమానాశ్రయంలో తనిఖీలు చేసిన అధికారులు బంగారాన్ని గుర్తించారు. స్వాదీనం చేసుకున్న బంగారం విలువ రూ.15 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
ఏసీబీ వలలో ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్
జాయి వ్యాపారి వద్ద రూ.70వేలు లంచం తీసుకున్న కోవై మద్యం నిరోధక పోలీసు ఇన్‌స్పెక్టర్ సహా ముగ్గురిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఈరోడ్ జిల్లా భవానికి చెందిన ఓ గంజాయి వ్యాపారికి ఫోన్ చేసిన కోవై మద్యం నిరోధక పోలీసులు రూ.70 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే గంజాయి కలిగివున్నట్లు కేసు పెట్టి జైలులో పెడుతామని బెదిరింపులు ఇచ్చారు. దీంతో గంజాయి వ్యాపారి భార్య మహేశ్వరి కోవై ఏసీబీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇచ్చిన సలహా మేరకు రూ.70వేలు మహేశ్వరి గురువారం రాత్రి సంగనూరులో ఉన్న పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ పని చేస్తున్న మహిళా ఇన్‌స్పెక్టర్ సరోజిని, కానిస్టేబుల్ రంగస్వామి, అరుల్‌కుమార్‌ల వద్ద నగదును ఇచ్చారు. అక్కడికి వచ్చిన ఏసీబీ అధికారులు ఇన్‌స్పెక్టర్ సరోజినితో సహా ముగ్గురు పోలీసులను అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment