Chennai Airport
-
చెన్నై విమానాశ్రయంలో రూ.20 కోట్ల కొకైన్ స్వాధీనం
అన్నానగర్ (చెన్నై): దుబాయ్ నుంచి చెన్నైకి అక్రమంగా తరలిస్తున్న రూ.20 కోట్ల విలువైన కొకైన్, రూ.2 కోట్ల విలువ గల మత్తు మాత్రలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళుతున్న విమానంలో భారీగా మత్తు పదార్థాలు తరలిస్తున్నట్లు చెన్నై జోన్ సెంట్రల్ నార్కోటిక్స్ కంట్రోల్ యూనిట్ డైరెక్టర్ అరవిందన్‌కు శుక్రవారం సమాచారం అందింది. దీంతో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్, యాంటీ నార్కోటిక్స్ విభాగం అధికారులు తనిఖీ చేశారు.బొలీవియాకు చెందిన ఓ యువతి బ్యాగ్‌లో ఉన్ని దుస్తుల లోపల దూది మధ్య డ్రగ్స్‌ను దాచినట్లు గుర్తించారు. ఆమె నుంచి రూ. 20 కోట్ల విలువైన కిలో 800 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. బొలీవియా యువతితోపాటు ముంబైలో నివసిస్తున్న బ్రెజిల్‌కు చెందిన మహిళ సహా మరో ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు. అదేవిధంగా నెదర్లాండ్స్ నుంచి బెంగళూరు, పుదుచ్చేరి చిరునామాలతో రెండు పార్సిళ్లు కస్టమ్స్ విభాగానికి చెందిన పోస్టాఫీసుకు వచ్చాయి. ఆ పార్సిళ్లను కస్టమ్స్, నార్కోటిక్స్ కంట్రోల్ యూనిట్ అధికారులు తనిఖీ చేశారు. అందులో రూ.2 కోట్ల విలువైన కిలో 400 గ్రాముల మత్తు మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి బెంగళూరులో ఉంటున్న ఇద్దరు నైజీరియన్ యువకులను అరెస్టు చేశారు. -
చెన్నై ఎయిర్ పోర్ట్ లో మహేంద్రసింగ్ ధోని
-
అత్యంత సుందరంగా చెన్నై విమానాశ్రయం కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ (ఫొటోలు)
-
పుట్టింటికి వచ్చినంత సంతోషంగా ఉంది: హన్సిక
తమిళ సినిమా: సినిమా కెరీర్‌ను చక్కగా ప్లాన్ చేసుకున్న నటీమణుల్లో హన్సిక ఒకరని చెప్పవచ్చు. ఈ ముంబాయి భామ దక్షిణాదినే ఎక్కువగా చిత్రాలు చేసి పేరు తెచ్చుకుంది. గ్లామర్‌నే నమ్ముకున్న ఈ బ్యూటీ ముఖ్యంగా తెలుగు, తమిళం భాషల్లో స్టార్ హీరోలతో జతకట్టే అవకాశాలు దక్కించుకుంది. అన్ని భాషల్లో కలిపి ఇప్పటికీ 50 చిత్రాలకుపైగా నటించింది. కెరీర్ బిజీగా ఉండగానే పెళ్లి చేసుకుంది. సోహైల్ అనే ముంబైకి చెందిన వ్యాపారవేత్తతో గత ఏడాది డిసెంబర్ 4వ తేదీ పెళ్లి జరిగింది. ఒకపక్క వివాహ జీవితాన్ని అనుభవిస్తూనే నటనకు సిద్ధమైంది. సోమవారం సాయంత్రం ఈ అమ్మడు చెన్నైకి చేరుకుంది. విమానాశ్రయంలో ఆమె అభిమానులు పూలమాలలతో స్వాగతం పలికారు. మీడియా హన్సికను చుట్టుముట్టింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను చెన్నైలో అడుగుపెట్టగానే పెళ్లయిన కూతురు పుట్టింటికి వచ్చినంత సంతోషంగా ఉందని పేర్కొంది. 2022 సంవత్సరం తనకు చాలా లక్కీ అని.. ప్రస్తుతం తాను అంగీకరించిన 7 చిత్రాలు చేతిలో ఉన్నాయని చెప్పింది. పూర్తి చేయడానికి సిద్ధమైనట్లు పేర్కొంది. తన వివాహ జీవితం ఆనందంగా సాగుతోందని చెప్పింది. నెల రోజులపాటు చెన్నైలోనే ఉండి చిత్రాలను పూర్తి చేస్తానని వెల్లడించింది. -
విమానాశ్రయం విస్తరణే ధ్యేయం.. 300 ఎకరాలు కావాలి
మీనంబాక్కం విమానాశ్రయం విస్తరణే ధ్యేయంగా మరిన్ని పనులు చేపట్టాలని విమానయాన శాఖ చర్యలు చేపట్టింది. ఇందుకోసం 300 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. చెన్నై మీనంబాక్కం విమానాశ్రయం, స్వదేశీ, అంతర్జాతీయ టెర్మినల్స్‌గా సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయం తీర్చిదిద్దారు. ఇక్కడ విమానాల ట్రాఫిక్ పెరిగింది. దీంతో కాంచీపురం జిల్లా పరందూరులో మరో విమానాశ్రయానికి చర్యలు చేపట్టారు. ఈ విమానశ్రయం ప్రారంభమయ్యేలోపు చెన్నైలో సేవలను విస్తృతం చేయడం, ప్రయాణికుల సంఖ్య పెంచడంపై విమానయాన శాఖ దృష్టి పెట్టింది. ఇందుకోసం మీనంబాక్కం విమానాశ్రయ పరిసరాలను మరింతగా విస్తరించబోతున్నారు. ఇందుకు తగ్గ నివేదిక సిద్ధమైంది. ఆ మేరకు ప్రస్తుతం కార్గో ఉన్న పరిసరాలను విమాన సేవలకు ఎంపిక చేశారు. కార్గో స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. కార్గోను మరో చోటకు మార్చేందుకు తగిన ఏర్పాట్లపై దృష్టి పెట్టనున్నారు. విమానాశ్రయానికి అవతలి వైపు ఉన్న ఖాళీ స్థలాలపై సైతం అధికారులు దృష్టి పెట్టడం గమనార్హం. 300 ఎకరాల స్థలాన్ని మరింత విస్తరణ పనులకు స్వాధీనం చేసుకోబోతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. చదవండి: హమ్మయ్యా..ఎస్బీఐ ఖాతాదారులకు భారీ ఊరట! -
7 గంటలపాటు ఎయిర్‌పోర్ట్‌లో ఇళయరాజా పడిగాపులు
ఇటీవలే రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టిన సంగీత జ్ఞాని ఇళయరాజా ఎప్పటిలానే తన చిత్రాలతో, సంగీత కచేరీలతో బిజీగా ఉంటున్నారు. తాజాగా అంగేరి దేశంలో నిర్వహించనున్న సంగీత కచేరిలో పాల్గొనేందుకు దుబాయ్‌కి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం వేకువ జామున రెండు గంటలకు విమానం చెన్నై నుంచి దుబాయ్‌కి బయలుదేరనుండటంతో ఇళయరాజా అంతకుముందే చెన్నై విమానాశ్రయం చేరుకున్నారు. అయితే శనివారం రాత్రి వర్షం కారణంగా విమానయానాలకు అంతరాయం కలిగింది. ముఖ్యంగా ఇతర దేశాల నుంచి చెన్నైకు రావాల్సిన విమానాలు బెంగుళూరు, హైదరాబాద్ తదితర విమానాశ్రయంలో ల్యాండ్ కావలసిన పరిస్థితి. అదే విధంగా ఇళయరాజా పయనించాలని దుబాయ్‌కి వెళ్లే విమానం బయలుదేరడంలో చిక్కులు ఏర్పడ్డాయి. దుబాయ్‌కి వెళ్లే విమానం కొంత ఆలస్యంగా చెన్నైకు చేరుకుంది. అయితే రన్‌వేలో నీరు చేరుకోవడంతో విమానం బయలుదేరడానికి మరో మూడు గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆ తరువాత ఆకాశం మేఘాలు కమ్ముకోవడంతో మరో రెండు గంటలు అంతరాయం ఏర్పడింది. ఇలా ఏడు గంటల పాటు ఇళయరాజా చెన్నై విమానాశ్రయంలోనే ఉండిపోయారు. చదవండి: పబ్లిక్‌గా నటికి ముద్దులు.. అమ్మ చూస్తే ఏమంటుందోనంటున్న నటుడు డేటింగ్ చేసిన వ్యక్తే భర్తగా.. రెండోసారి పిల్లల్ని కనాలంటేనే భయం.. -
అమ్మను అనాథను చేసి.. అమెరికా పయనమైన కుమారుడి అరెస్ట్!
సాక్షి ప్రతినిధి,చెన్నై: నవమాసాలూ మోసి కనిపెంచిన తల్లి ఆ కుమారుడికి బరువైంది. భర్తను కోల్పోయి వృద్ధాప్యంలో ఒంటరిగా మిగిలిన తల్లిని వదిలేసి విదేశాలకు పారిపోతున్న కొడుకును పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై మైలాపూరుకు చెందిన దుర్గాంబాళ్ (74) ఈనెల 15న పోలీస్‌స్టేషన్‌లో తన కుమారుడిపై ఫిర్యాదు చేసింది. అందులో ‘నా భర్త కుప్పుస్వామితో కలిసి ఉండేదాన్ని. మాకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉంది. పెద్ద కుమారుడు రెండేళ్ల క్రితం మృతి చెందాడు. రెండో కుమారుడు రామకృష్ణన్ అమెరికాలో భార్యా బిడ్డలతో సకల సౌకర్యాలతో నివసిస్తున్నాడు. నాభర్త కుప్పుస్వామి గతనెల 3న మరణించాడు. రెండో కుమారునికి తండ్రి మరణవార్త తెలిపినా అంత్యక్రియలు ముగిసిన తరువాత 10 రోజుల తరువాత చెన్నైలోని ఇంటికి వచ్చాడు. భర్త మరణించాడు, జీవనాధారం కోసం ఆర్థికంగా ఆదుకోవాలని కోరగా వీలుకాదని చెప్పాడు. వయసు మీదపడి భర్తను కోల్పోయిన స్థితిలో తనకు సాయం చేసేందుకు నిరాకరించిన కుమారుడు రామకృష్ణన్‌పై తగిన చర్య తీసుకోవాలి’’ అని పేర్కొంది. సీనియర్ సిటిజన్స్ పర్యవేక్షణ చట్టం–2007 కింద పోలీసులు కేసు నమోదు చేసి, రామకృష్ణన్ విదేశానికి వెళ్లకుండా విమానాశ్రయానికి లుక్అవుట్ నోటీసు పంపారు. ఇదిలా ఉండగా, ఈనెల 22వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు రామకృష్ణన్ గుట్టుచప్పుడు కాకుండా పోలీసుల కళ్లుకప్పి అమెరికా వెళ్లేందుకు విమానాశ్రయానికి చేరుకున్నాడు. అతడి పాస్‌పోర్టు తనిఖీ సమయంలో ‘పోలీసులు వెతుకుతున్న నేరస్తుడి’గా విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు గుర్తించి మైలాపూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మైలాపూరు పోలీసులు రామకృష్ణన్‌ను అరెస్ట్ చేశారు. చదవండి: సీఎం బొమ్మై ఆర్ఎస్ఎస్ చేతిలో కీలుబొమ్మ.. రాష్ట్రంలో ప్రభుత్వం లేదు, పాలన లేదు -
శ్రీలంక విమానంలో సాంకేతిక లోపం: చెన్నైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాక్షి, చెన్నై: శ్రీలంక ఎయిర్‌లైన్స్ విమానం చెన్నై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. చెన్నై నుంచి కొలంబోకు బయలు దేరిన విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో ఈ రోజు (జూలై 15) ఉదయం చెన్నై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ప్రయాణీకులు అంతా క్షేమంగా ఉన్నారని విమానాశ్రయ అధికారులు ప్రకటించారు. కొలంబో-చెన్నై విమానం (UL121)లో లోపాన్ని గుర్తించిన వెంటనే పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి సమాచారం ఇచ్చారు. దీంతో అత్యవసర ప్రోటోకాల్ ప్రకారం రన్‌వే వద్ద విమానాన్ని ల్యాండ్ చేశారని చెన్నై విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ వల్ల చెన్నై నుంచి వచ్చే ఏ ఇతర సర్వీసులపై ఎలాంటి ప్రభావం పడలేదని వెల్లడించాయి. కాగా ద్వీప దేశం శ్రీలంక ఆర్థిక రాజకీయ సంక్షభంలో కొట్టుమిట్టాడుతోంది. దేశ ఆర్థిక మాంద్యంపై సామూహిక నిరసనల మధ్య శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే దేశంవిడిచిపోవంతో మరింత తీవ్ర గందర గోళ పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే. -
చికిత్స కోసం అమెరికా వెళ్లిన నటుడు.. ఎయిర్‌పోర్టులో ఎమోషనల్
T Rajendar Gets Emotional During Going To US For Medical Treatment: ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు టి. రాజేందర్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. ఇటీవల కడుపునొప్పితో బాధపడుతూ చెన్నైలోని ఓ హాస్పిటల్లో చేరిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన వైద్యుల సూచన మేరకు చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లారు. అయితే అమెరికాకు పయనమయ్యే సమయంలో మంగళవారం (జూన్ 14) రాత్రి చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో ఎమోషనల్‌గా మాట్లాడారు. ఆయన ఆరోగ్యం, కొడుకు శింబు గురించి పలు విషయాలు చెప్పుకొచ్చారు. 'నేను కేవలం నా కొడుకు కోసమే విదేశాలకు వెళ్తున్నా. నా కొడుకు చాలా గొప్పవాడు. ఎంతో మంచివాడు. ఎందుకంటే గత కొద్దిరోజులుగా శింబు అమెరికాలోనే ఉండి నా వైద్యానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. నా కోసం తన తర్వాతి సినిమా షూటింగ్‌లు, ఆడియో ఫంక్షన్స్‌ను వాయిదా వేసుకున్నాడు. శింబు సినిమాల్లో గొప్ప నటుడు మాత్రమే కాదు తన తల్లిదండ్రుల పట్ల మంచి మనసున్న కొడుకు. ఇలాంటి కొడుకును కన్నందుకు నాకెంతో గర్వంగా ఉంది. అలాగే నేను ఆస్పత్రిలో ఉన్నప్పుడు నన్ను పలకరించి, నా ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న కమల్ హాసన్, తమిళనాడు సీఎం స్టాలిన్‌కు కృతజ్ఞతలు.' అంటూ భావోద్వేగంగా తెలిపారు టి. రాజేందర్. చదవండి: ఇప్పుడు నా అప్పులన్నీ తీర్చేస్తా: కమల్ హాసన్ ఏం చెప్పాలో మాటలు రావడం లేదు.. నితిన్ ఎమోషనల్ -
అందులో దాచి తరలిస్తుండగా.. కోట్ల విలువైన వజ్రాలు సీజ్
తిరువొత్తియూరు: చెన్నై నుంచి దుబాయ్‌కి టెలిస్కోప్‌లో దాచి తరలిస్తున్న రూ. 5.76 కోట్ల విలువవైన 1052 క్యారెట్ వజ్రాలు నగలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు చెన్నైకి చెందిన యువకుడిని అధికారులు అరెస్టు చేశారు. గురువారం చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయ్‌కి వెళ్లే ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానం బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ప్రయాణికులను, వారి లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఆ సమయంలో చెన్నైకి చెందిన 30 ఏళ్ల యువకుడి సూట్‌కేసు, బ్యాగ్‌లను తనిఖీ చేయగా నాలుగు టెలిస్కోపులు ఉన్నాయి. వాటిని విప్పి చూడగా 22 చిన్న ప్లాస్టిక్ సంచుల్లో వజ్రాలు ఉన్నట్లు గుర్తించారు. వాటిని అధికారులు స్వాధీనం చేసుకుని యువకుడిని అరెస్టు చేశారు. -
IPL 2021: ఎయిర్‌పోర్టులో ప్రత్యక్షమైన ధోని.. ఫోటోలు వైరల్
చెన్నై: సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్ 14వ సీజన్ రెండో అంచె మ్యాచ్‌లు మొదలవనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ దుబాయ్‌కు పయనమయ్యాయి. కాగా సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని ఎయిర్పోర్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎయిర్‌పోర్ట్‌లో లగేజ్‌తో ఉన్న ధోని పీపీఈ కిట్ ధరించడంతో డ్రెస్సింగ్ స్టైల్ కాస్త కొత్తగా అనిపించింది. ధోనితో పాటు సురేశ్ రైనా, కర్ణ్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ చహర్, అంబటి రాయుడులు కూడా దుబాయ్ ఫ్లైట్ ఎక్కారు. అటు ముంబై ఇండియన్స్ జట్టు కూడా యూఏఈ బయలుదేరి వెళ్లింది. కాగా సెప్టెంబర్ 19 నుంచి మొదలుకానున్న రెండో అంచె పోటీల్లో తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్, సీఎస్కే మధ్య జరగనుంది. ఇక ఈ సీజన్లో సీఎస్కే మంచి ప్రదర్శన కనబరిచింది. ఏడు మ్యాచ్‌లు ఆడిన సీఎస్కే ఐదు విజయాలు.. రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఇక ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు అందుకొని టాప్‌లో కొనసాగుతుంది. ✈️ Mode ON#UrsAnbudenEverywhere#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/yHE4c2Qk4X — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) August 13, 2021 -
చెన్నై ఎయిర్‌పోర్టులో భారీగా అక్రమ బంగారం పట్టివేత
-
పేస్ట్ రూపంలో బంగారం; కాళ్లకు వేసుకునే సాక్స్‌లో
చెన్నై: చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని బుధవారం కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బహ్రయిన్ ప్రయాణికుడి వద్ద నుంచి రెండు కేజీలకు పైగా బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో ఆ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అతన్ని అడ్డుకున్న అధికారులు విచారించగా బంగారం దాచిన విషయం బయటపడింది. బంగారాన్ని కరిగించి పేస్టు రూపంలో చేసి కాళ్లకు వేసుకునే సాక్స్‌లో దాచిన రెండు కేజీలు స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు -
చెన్నై విమానాశ్రయంలో కలకలం..
సాక్షి, చెన్నై: దుబాయ్ నుంచి వచ్చిన ప్రత్యేక విమానంలో ఓ యువకుడి చర్యలు అనుమానాలకు దారి తీశాయి. నిషేధిత తీవ్ర వాద సంస్థ ఐసీస్‌లో శిక్షణ పొంది చెన్నైకు వచ్చినట్టుగా వచ్చిన సమాచారం కలకలం రేపింది. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇటీవల కాలంగా రాష్ట్రంలో నిషేధిత తీవ్రవాద సంస్థల కార్యకలాపాలు తరచూ వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. శ్రీలంకలో గతంలో సాగిన పేలుళ్ల తదుపరి తరచూ కేరళ నుంచి ఎన్ఐఏ వర్గాలు రాష్ట్రంలోకి రావడం, అనుమానితులు, నిషేధిత సంస్థల సానుభూతి పరులను పట్టుకెళ్లడం జరుగుతోంది. ఈ పరిణామాలతో సముద్ర తీరాల్లో, విమానాశ్రయాల్లో ప్రత్యేక నిఘా ఉంచారు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి దుబాయ్ నుంచి చెన్నైకు వచ్చిన ఓ విమానంలో 31 ఏళ్ల యువకుడిపై అధికారుల దృష్టి పడింది. అతడి పాస్‌పోర్టు, వీసాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఒమన్‌కు ఎందుకు వెళ్లినట్టో.. ఏడాదిన్నర క్రితం ఉద్యోగ రీత్యా ఆ యువకుడు దుబాయ్ వెళ్లినట్టు గుర్తించారు. గత ఏడాది కరోనా సమయంలో ఇతడు దుబాయ్ నుంచి తిరిగి రాలేదు. అదే సమయంలో ఆరు నెలలు ఒమన్‌లో ఉండడం అనుమానాలకు దారి తీసింది. నిషేధిత ఐఎస్ఐఎస్ తీవ్రవాద సంస్థ కార్యకలాపాలకు కేంద్రంగా ఒమన్ మారి ఉండడంతో ఆ దేశంపై భారత్ నిషేధం విధించింది. ఇక్కడకు తమిళనాడు నుంచి ఇప్పటికే పలువురు యువకులు సరిహద్దులు దాటి వెళ్లినట్టు ఎన్ఐఏ విచారణలో తేలింది. ఈ పరిస్థితుల్లో ఈ యువకుడు ఒమన్‌కు వెళ్లిరావడం అనుమానాలకు బలం చేకూరినట్టు అయింది. ఆ యువకుడు పెరంబలూరుకు చెందిన వ్యక్తి కావడంతో అక్కడి ఎస్పీకి సమాచారం ఇచ్చారు. అతడి కుటుంబం నేపథ్యం గురించి విచారిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎన్ఐఏ వర్గాలు సైతం యువకుడిని విచారించారు. దుబాయ్‌లో ఉద్యోగం నచ్చక, ఒమన్‌కు వెళ్లి పనిచేసినట్టుగా ఆ యువకుడు పేర్కొంటున్నాడు. అందులో వాస్తవాలు లేవని భావించిన అధికారులు చెన్నై సెంట్రల్ క్రైం బ్రాంచ్ కార్యాలయానికి తీసుకెళ్లి విచారించే పనిలో పడ్డారు. యువకుడు పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో అతడికి మరెవరితోనైనా సంబంధాలు ఉన్నాయా..? లేదా, అతడితో పాటుగా పెరంబలూరు నుంచి దుబాయ్‌కు వెళ్లిన వారి వివరాలను సేకరించి, విచారణను ముమ్మరం చేశారు. చదవండి: హఠాత్తుగా గోనెసంచిలో నుంచి లేచి.. ఇండియా బుక్‌లోకి ‘ఎన్నికల వీరుడు’ -
ఖర్జూర పండులో బంగారం!
సాక్షి, చెన్నై : ఖర్జూర పండులో బంగారం తెచ్చిన వ్యక్తిని చెన్నై విమానాశ్రయ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఉదయం సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఇతను ఖర్జూర పండులో 300 గ్రాముల బంగారాన్ని ఉంచి తీసుకొచ్చాడు. చెన్నై మీనంబాక్కం విమానాశ్రయంలో తనిఖీలు చేసిన అధికారులు బంగారాన్ని గుర్తించారు. స్వాదీనం చేసుకున్న బంగారం విలువ రూ.15 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఏసీబీ వలలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జాయి వ్యాపారి వద్ద రూ.70వేలు లంచం తీసుకున్న కోవై మద్యం నిరోధక పోలీసు ఇన్స్పెక్టర్ సహా ముగ్గురిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఈరోడ్ జిల్లా భవానికి చెందిన ఓ గంజాయి వ్యాపారికి ఫోన్ చేసిన కోవై మద్యం నిరోధక పోలీసులు రూ.70 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే గంజాయి కలిగివున్నట్లు కేసు పెట్టి జైలులో పెడుతామని బెదిరింపులు ఇచ్చారు. దీంతో గంజాయి వ్యాపారి భార్య మహేశ్వరి కోవై ఏసీబీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇచ్చిన సలహా మేరకు రూ.70వేలు మహేశ్వరి గురువారం రాత్రి సంగనూరులో ఉన్న పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ పని చేస్తున్న మహిళా ఇన్స్పెక్టర్ సరోజిని, కానిస్టేబుల్ రంగస్వామి, అరుల్‌కుమార్‌ల వద్ద నగదును ఇచ్చారు. అక్కడికి వచ్చిన ఏసీబీ అధికారులు ఇన్స్పెక్టర్ సరోజినితో సహా ముగ్గురు పోలీసులను అరెస్టు చేశారు. -
‘నివర్’ అతి తీవ్రం
ప్రపంచ వాతావరణ సంస్థ మార్గదర్శకాల ప్రకారం ఆయా దేశాలు తమ ప్రాంతాలలో తుపానులకు పేరు పెట్టడం ఆనవాయితీ. తద్వారా తుపాను పట్ల అవగాహన పెంచి, నష్ట నియంత్రణకు మార్గం సుగమం చేస్తుంది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తుపానుకు బంగ్లాదేశ్ ‘నిసర్గా’ అని, భారత్ ‘గతి’ అని సూచించగా, ఇరాన్ సూచించిన ‘నివర్’ పేరు ఖరారైంది. ‘ని’ అంటే కొత్త అని, ‘వర్’ అంటే దేశం లేదా స్థలం, ఇల్లు లేదా నివాస స్థలం అనే అర్థం వస్తుంది. మొత్తంగా ‘నివర్’ అంటే కొత్త ప్రదేశం అని అర్థం. ఈ పదాన్ని కుర్దిష్ నుంచి తీసుకున్నారు. సాక్షి, అమరావతి, విశాఖపట్నం/సాక్షి ప్రతినిధి, చెన్నై, కడప/నెల్లూరు అర్బన్/తడ : నివర్ తుపాను బుధవారం మరింత బలపడి అతి తీవ్ర తుపానుగా మారింది. పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తూ కరైకల్ – తమిళనాడులోని మామల్ల్లపురం మధ్య పాండిచ్చేరికి సమీపంలో బుధవారం అర్ధరాత్రి తర్వాత తెల్లవారుజాములోగా తీరం దాటనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం రాత్రి ప్రకటించింది. నివర్ తీరం దాటే సమయంలో ఆ ప్రాంతంలో గంటకు 120 నుంచి 130 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, ఇవి ఒక దశలో 145 కి.మీ. గరిష్ట స్థాయికి చేరే ప్రమాదం ఉందని పేర్కొంది. నివర్ ప్రభావం వల్ల గురువారం రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఉత్తర కోస్తాంధ్రలో గురు, శుక్రవారాల్లో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేకచోట్ల కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు వచ్చే రెండు రోజులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక ఎగరవేశారు. విశాఖపట్నం, కాకినాడ, గంగవరం పోర్టులో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తుపాన్ సహాయక చర్యల కోసం ముందస్తుగా 179 మంది సభ్యులతో కూడిన 5 ఎస్డీఆర్ఎఫ్, 85 మంది సభ్యులతో 4 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నట్లు విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. కాగా, దక్షిణ బంగాళాఖాతంలో ఈ నెల 29న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తమిళనాడులో చెరువులు, జలాశయాలు ఫుల్ ► నివర్ ప్రభావంతో తమిళనాడు తీరంలోని చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, నాగపట్నం, తంజావూరు, తిరువరూరు, కరైకల్, పుదుచ్చేరి, కడలూరు, విల్లుపురం జిల్లాల్లోని హార్బర్లలో బుధవారం సాయంత్రం 6వ నంబర్ వరకు ప్రమాద హెచ్చరికలను ఎగురవేశారు. ► సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా ప్రభుత్వం ప్రజలను కోరింది. సహాయ చర్యల నిమిత్తం ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, కోస్ట్‌గార్డ్, గజ ఈతగాళ్లు, అగి్నమాపక శకటాలు, రబ్బర్ బోట్లు, వృక్షాల తొలగింపునకు యంత్రాలు, వరద నీటిని తోడేందుకు జనరేటర్లు సిద్ధంగా ఉంచారు. చెన్నై మీనంబాక్కం విమానాశ్రయంలో 26 విమాన సర్వీసులను రద్దు చేశారు. ► ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి పరిస్థితిని సమీక్షించారు. చెన్నై దాహార్తిని తీర్చే పూండి, పుళల్, చోళవరం జలాశయాల్లో సైతం నీటిమట్టం పెరుగుతోంది. చెంగల్పట్టు జిల్లాలో 235 చెరువులు పూర్తిగా నిండాయి. బుధవారం భీకర తుపాను గాలుల ధాటికి చెన్నైలో కుప్పకూలిన భారీ వృక్షం సముద్రంలో చిక్కుకున్న 29 మంది మత్స్యకారులు ► బంగాళాఖాతంలో వేటకు వెళ్లిన 29 మంది మత్స్యకారులు శ్రీహరికోట పరిధిలోని తెత్తుపేట వద్ద బుధవారం సముద్రం, పులికాట్ సరస్సు మధ్య చిక్కుకున్నారు. తడ మండలం ఇరకంకుప్పానికి చెందిన 20 మంది, తమిళనాడు పరిధిలోని నొచ్చుకుప్పం, బాటకుప్పంకు చెందిన 9 మంది మత్స్యకారులు సముద్రంలో చిక్కుకున్నారు. వైఎస్సార్ జిల్లాలో అప్రమత్తం ► తుపాను నేపథ్యంలో వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా గురువారం అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కడప కలెక్టరేట్‌తోపాటు రాజంపేట, జమ్మలమడుగు ప్రాంతాల్లో 24 గంటలు పనిచేసేలా టోల్ ఫ్రీ నంబర్లతో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. ► మూడు ప్రత్యేక టీంలు, ప్రతి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఒక రెస్క్యూటీం ఏర్పాటు చేశామని, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇక్కట్లు లేకుండా ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ హరి కిరణ్, ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. నెల్లూరు జిల్లాలో 100 పునరావాస కేంద్రాలు ► నెల్లూరు జిల్లా అంతటా బుధవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. 12 తీర ప్రాంత మండలాలు, 8 పెన్నా పరీవాహక ప్రాంతాల్లోని లోతట్టు ఏరియాల్లో 100 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ► ఇప్పటికే సుమారు 700 కుటుంబాలను తరలించి, ఆహార సదుపాయాలు కల్పించారు. 9 మండలాలకు ఎన్టీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపించారు. కోట, వాకాడు, చిట్టమూరు తదితర మండలాల్లో ఇప్పటికే 90 నుంచి 110 మి.మీ. వరకు వర్షం కురిసింది. ► కోట, వాకాడు, నెల్లూరు ప్రాంతాల్లో చెట్లు విరిగి పడ్డాయి. పలుచోట్ల విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. తమిళనాడుకు చెందిన 124 బోట్లు నెల్లూరు వైపు కొట్టుకుని రావడంతో కృష్ణపట్నం పోర్టు సిబ్బంది.. బోట్లతో పాటు మత్స్యకారులును కాపాడారు. ► తుపాను ప్రభావంపై జల వనరులశాఖ మంత్రి పి.అనిల్‌కుమార్ అధికారులతో సమీక్షించారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
విమానం టాయ్లెట్లో కిలోలకొద్ది బంగారం
చెన్నై : విమానం టాయిలెట్లో దాచి ఉంచిన రూ. రూ.2.24 కోట్లు విలువ చేసే బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దుబాయ్ నుంచి భారీగా బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్టు కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది. ఈ మేరకు అధికారులు ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు నిర్వహించారు. మంగళవారం దుబాయ్ నుంచి చెన్నై చేరుకున్న ఎయిర్ ఇండియా విమానంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. విమానం వెనక భాగంలోని టాయిలెట్లో నలుపు రంగులో నాలుగు ప్యాకెట్లు కనిపించాయి. దీంతో కస్టమ్స్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అందులో రూ. 5.6 కిలోల బరువు ఉన్న 48 బంగారు కడ్డీలను అధికారులు గుర్తించారు. ఆ బంగారం విలువ దాదాపు రూ. 2.24 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్టు వెల్లడించారు. కాగా, దుబాయ్ నుంచి చెన్నై వచ్చిన ఆ విమానం.. అనంతరం సర్వీస్ నంబర్ మార్చుకుని ఢిల్లీ బయలుదేరి వెళ్లాల్సి ఉంది. -
చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత
సాక్షి, చెన్నై : చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు చేపట్టిన కస్టమ్స్ అధికారులు దాదాపు 8 కోట్ల రూపాయలు విలువ చేసే 23 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా బంగారం తరలింపుకు పాల్పడుతున్న సింగపూర్, మలేసియా నుంచి వచ్చిన నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. బంగారం అక్రమ తరలింపు వెనక ఇంకా ఎవరైన ఉన్నారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆరు కిలోల బంగారం పట్టివేత
సాక్షి, న్యూఢిల్లీ : చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుపడంది. ఎయిర్‌పోర్టులో అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఆరు కిలోల బంగారం పట్టుబడింది. దీని విలువ రూ.2 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. బంగారం పట్టుబడిన విషయమై ఎయిర్పోర్ట్ అధికారులు శ్రీలంక, దుబాయ్‌కు చెందిన 14 మంది ప్రయాణికులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
విమానం హైజాక్ బెదిరింపులు.. రెడ్ అలర్ట్
టీ.నగర్: విమానం హైజాక్ బెదిరింపులు రావడంతో చెన్నై విమానాశ్రయంలో శనివారం రెడ్ అలర్ట్ ప్రకటించారు. కశ్మీర్ పుల్వామాలో ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇందుకు భారత్ ప్రతిగా భారత వైమానిక దళం పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాదుల శిబిరాలపై బాం బుల వర్షం కురిపించడంతో అనేక మంది మృతి చెందారు. దీంతో తీవ్రవాదులు భారత్‌లో దాడులు జరపవచ్చని హెచ్చరికలు అందాయి. ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న విమానాశ్రయాల్లో విమానాలు హైజాక్ చేయనున్నట్లు బెదిరింపులు అందాయి. దీంతో దేశంలోని విమానాశ్రయాలపై దాడులు జరిపేందుకు తీవ్రవాదులు ప్రయత్నించవచ్చని కేంద్ర ప్రభుత్వాన్ని ఇంటెలిజెన్స్ శాఖ హెచ్చరించింది. దీనికి సంబంధించి భారత పౌర విమానయాన శాఖ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో భద్రతను పెంపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో చెన్నై విమానాశ్రయానికి రెడ్ అలర్ట్ భద్రత కల్పించారు. దీంతో తీవ్ర తనిఖీల అనంతరమే ప్రయాణికులను విమానాశ్రయంలోకి అనుమతిస్తున్నారు. విమానాశ్రయం లోపలికి సందర్శకులను అనుమతించడం లేదు. తదుపరి ప్రకటన విడుదలయ్యేంత వరకు సందర్శకులను అనుమతించకుండా నిషేధం విధించారు. -
తొమ్మిది కోట్ల విలువైన బంగారం పట్టివేత
సాక్షి, చెన్నై: చెన్నై విమానాశ్రయంలో శుక్రవారం భారీగా బంగారం పట్టుబడింది. ప్రయాణికులను తనిఖీ చేసే క్రమంలో ఎయిర్పోర్ట్ సిబ్బంది 25 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పార్సిల్ విభాగంలో తనిఖీలు చేస్తున్న డీఆర్ఐ అధికారులు స్మార్ట్ వాచ్‌లు, కెమెరా లెన్స్, యూఎస్బీ చిప్స్‌లలో భారీ ఎత్తున బంగారం ఉన్నట్లు కనుగొన్నారు. బంగారం విలువ తొమ్మిది కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
భారీగా బంగారం పట్టివేత..!
సాక్షి, చెన్నై: తమిళనాడులో సోమవారం భారీగా బంగారం పట్టుబడింది. చెన్నై, కోయంబత్తూరు ఎయిర్‌పోర్టుల్లో 2.4 కేజీల బంగారాన్నిపోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోయంబత్తూరులో సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా అక్రమంగా తరలిస్తున్న 1.5 కేజీల బంగారాన్ని ప్రయాణికుడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. దీంతో కేరళలోని పాలక్కాడకు చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
మత వ్యతిరేక సందేశం.. బీజేపీ నేత అరెస్ట్
తిరువొత్తియూరు: ఓ మతానికి సంబంధించి వ్యతిరేకంగా అభిప్రాయాలను ఫేస్బుక్లో వెల్లడించిన బీజేపీ ప్రముఖుని పోలీసులు చెన్నై ఎయిర్‌పోర్టులో శనివారం అరెస్టు చేశారు. చెన్నై నంగనల్లూరుకు చెందిన కల్యాణరామన్ బీజేపీ ప్రముఖుడు. ఈయన కాక్కచై సిద్ధర్ కళ్యాణ రామన్ పేరుతో ఫేస్బుక్ అకౌంట్ ఉంది. ఇందులో ఓ మతానికి వ్యతి రేకంగా సందేశాలు ఇచ్చినట్లు పలువురు కల్యాణరామన్పై చెన్నై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కమిషనర్ ఆదేశాల మేరకు ఆయనపై చెన్నై సెంట్రల్ క్రైం పోలీసులు 153ఎ, 295, 505 విభాగంలో కేసు నమోదు చేశారు. శనివారం అహ్మదాబాద్ నుంచి విమానంలో చెన్నైకి వచ్చిన కల్యాణరామన్ను ఎయిర్‌పోర్టు పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కమిషనర్ కార్యాలయానికి తీసుకెళ్లి అతని వద్ద విచారణ చేస్తున్నారు. -
చెన్నైకి చిరుత.. వయా థాయిలాండ్
సాక్షి, చెన్నై: చిరుతపులి కూనను దొంగచాటుగా తెచ్చిన ఓ వ్యక్తిని చెన్నై విమానాశ్రయం అధికారులు అరెస్ట్‌చేశారు. చెన్నైకి చెందిన మొహిద్దీన్(28) శనివారం వేకువజామున బ్యాంకాక్ నుంచి థాయ్ ఎయిర్‌లైన్స్ విమానంలో చెన్నైకి చేరుకున్నాడు. చేతిలో చిన్న వెదురుబుట్టతో విమానాశ్రయంలో సంచరిస్తున్న మొహిద్దీన్ను కస్టమ్స్ అధికారులు అనుమానించారు. వెదురు బుట్టలో ఏముందని ప్రశ్నించగా కుక్కపిల్ల ఉందని బదులిచ్చాడు. పొంతనలేని సమాధానాలివ్వడంతో జంతు సంరక్షణ విభాగం వారిని అధికారులు పిలిపించారు. అది చిరుత కూన అని ఆ అధికారులు తేల్చారు. కూనను తిరిగి బ్యాంకాక్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. దీనిని ఇక్కడి ఓ సర్కస్ కంపెనీ కోసం తీసుకొచ్చినట్లు మొహిద్దీన్ చెప్పాడు. -
విమానంలో చిరుత పులి పిల్ల స్మగ్లింగ్
-
విమానంలో పులి పిల్ల.. పాలు పట్టిన సిబ్బంది
చెన్నై : చిరుత పులి పిల్లను స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని చెన్నై ఎయిర్‌పోర్టులో పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు... బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి బ్యాగేజ్ చెక్ చేస్తున్న సమయంలో నెలన్నర వయసు ఉన్న చిరుత పులి పిల్ల బయటపడింది. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టు ఇంటిలెజిన్స్ అధికారులు దానిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చెన్నైలోని ఆరినగర్ అన్నా జువాలాజికల్ పార్కుకు తరలించారు. కాగా భయంతో వణికిపోతున్న చిరుత పులి పిల్లను ఎయిర్‌పోర్టు సిబ్బంది అక్కున చేర్చుకున్నారు. అనంతరం దానికి పాలు పట్టించారు. శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఆకర్షిస్తోంది. -
చెన్నై విమానాశ్రయంలో భారీ బంగారం పట్టివేత
-
ఎయిర్‌పోర్టులో 10 కిలోల బంగారం స్వాధీనం
అన్నానగర్ (చెన్నై): షార్జా, మలేసియా నుంచి ఆదివారం చెన్నై విమానాశ్రయానికి పిల్లలు ఆడుకునే పరికరాల్లో దాచి అక్రమంగా తెచ్చిన రూ.3.30 కోట్ల విలువ గల 10 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేశారు. చెన్నై మీనమ్బాక్కం ఎయిర్‌పోర్టుకు మలేసియా నుంచి ఆదివారం సాయంత్రం వచ్చిన కమర్‌అలీ (38) లగేజ్‌ను తనిఖీ చేయగా పిల్లలు ఆడుకునే 47 పరికరాల్లో బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. సుమారు రూ.కోటి 5 లక్షల విలువ గల 3 కిలోల 200 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి చెన్నైకి వచ్చిన విమానంలో రియాస్‌ఖాన్ (32), ఇఫ్రకీమ్‌షా (52) లగేజ్‌లను పరిశీలించగా.. పిల్లలు ఆడుకునే పరికరాల్లో దాచిన బంగారు బిస్కెట్లు దొరి కాయి. రూ.2.25 కోట్ల విలువున్న 6 కిలోల 600 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
చెన్నైలో విమానం అత్యవసర ల్యాండింగ్
చెన్నై: రాజమండ్రి నుంచి ఆదివారం చెన్నై బయలుదేరిన ఇండిగో 6ఈ7123 విమానం ఇంజిన్ విఫలమవడంతో చెన్నై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో విమానంలో 47 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం గాలిలో ఎగురుతుండగానే ఒక ఇంజిన్‌లో ఆయిల్ లీకై అది పనిచేయకుండా పోయిందనీ, దీంతో విమానాన్ని చెన్నైలో అత్యవసరంగా దించాల్సి వచ్చిందని అధికారులు చెప్పారు. ప్రయాణికులంతా క్షేమమేనన్నారు. ఆయిల్ లీక్ అయినా పైలట్ నేరుగా విమానాన్ని దించకుండా కొద్దిసేపు గాలిలో చక్కర్లు కొట్టారని అధికారి ఆరోపించారు. -
జాకెట్లో బంగారం!
సాక్షి ప్రతినిధి, చెన్నై: స్త్రీలు ధరించే జాకెట్లలో బంగారం దాచి, కనిపించకుండా ఎంబ్రాయిడరీ చేసి అక్రమంగా బంగారం తరలిస్తున్న వ్యక్తితో పాటు, అతనికి స్వాగతం పలికేందుకు వచ్చిన వ్యక్తిని చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు సోమవారం అరెస్టు చేశారు. చెన్నైకి చెందిన ఆయుబ్ ఖాన్ (32) కువైట్ నుంచి ఓమన్ ఎయిర్‌లైన్స్ విమానంలో సోమవారం చెన్నై విమానాశ్రయం చేరుకున్నాడు. అతను గ్రీన్ చానల్ మార్గంలో బయటకు వెళ్తున్నాడు. అతనికి స్వాగతం తెలిపేందుకు ముస్తఫా (27) అనే వ్యక్తి వేచి ఉన్నాడు. కస్టమ్స్ అధికారులు ఆయుబ్ ఖాన్‌ను మళ్లీ లోపలికి పిలువగా.. లోపలికి వెళ్లడానికి నిరాకరించడమే కాకుండా, తనిఖీలు ముగించుకునే కదా బయటకు వచ్చానని అధికారులతో వాగ్వాదం చేశాడు. దీంతో అతనిపై అనుమానంతో మళ్లీ తనిఖీ చేశారు. అతని సూట్‌కేస్‌లో మహిళలు ధరించే మూడు జాకెట్లు ఉన్నాయి. వాటికున్న ఎంబ్రాయిడరీ డిజైన్లను అధికారులు తొలగించి చూడగా చిన్న చిన్న ముక్కలుగా బంగారం దొరికింది. అలాగే ఓ వంట పాత్ర వస్తువు పేరుతో ఉన్న ప్యాకెట్లో బంగారు కమ్మీలు దొరిగాయి. సుమారు 11 బంగారు ముక్కలుగా, రూ.15 లక్షల విలువైన 500 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆయుబ్ ఖాన్, ముస్తఫాలను అరెస్టు చేశారు. -
చెన్నై విమానాశ్రయలో 13 కిలోల బంగారం స్వాధీనం
-
లేడీ స్మగ్లర్ అరెస్ట్.. బంగారం స్వాధీనం
చెన్నై : దుబాయ్ నుంచి చెన్నైకు బంగారం స్మగ్లింగ్ చేస్తున్న మహిళను చెన్నై విమానాశ్రయ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నిందితురాలని కర్ణాటకలోని చిక్మగులూరుకు చెందిన పద్మగా గుర్తించిన పోలీసులు ఆమె నుంచి 13 కిలోల 24 క్యారెట్ల బంగారు చైన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆమె కుర్తా లోపల నడుముకు కట్టుకుని మరీ బంగారం తీసుకొచ్చే ప్రయత్నం చేసి పోలీసులకు చిక్కింది. -
చెన్నై విమానాశ్రయంలో హైఅలర్ట్
సాక్షి, చెన్నై : సోమవారం ఉదయం చెన్నై విమానాశ్రయంలో బాంబు పెట్టామని దుండగుల నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. దీంతో బాంబ్ స్వ్కాడ్ తనిఖీలు చేపట్టింది. విమానాశ్రయంలో హైఅలర్ట్ ప్రకటించినట్లు విమానాశ్రయం అధికారులు తెలిపారు. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని నిఘా వర్గాలు హెచ్చరించాయి. -
ఇదేంటో గుర్తుపట్టారా ?.. తప్పిన భారీ ప్రమాదం
సాక్షి, చెన్నై : పైన ఫోటోలో ఏముందో గుర్తుపట్టారా ? ల్యాండ్ అయిన తర్వాత స్పైస్ జెట్ విమాన టైర్లు పేలడంతో రన్వేతే రాపిడి జరిగి ఫోటోలో ఉన్న ఆకారానికి వచ్చాయి. 199 మంది ప్రయాణికులతో గురువారం చెన్నై నుంచి ఢిల్లీ వెలుతున్న విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. టైర్లను లిఫ్ట్ చేసే హైడ్రాలిక్ సిస్టమ్‌లో సమస్య ఏర్పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలోని రన్ వే నుంచి టేకాఫ్ అవుతుండగా విమానం టైరు పేలినట్టు సిబ్బంది గుర్తించారు. అప్రమత్తమైన పైలట్ విమానాన్ని సురక్షితంగా తిరిగి చెన్నై విమానాశ్రయంలో దించారు. విమానంలోని ప్రయాణికులను సురక్షితంగా కిందికి దించి, తిరిగి టెర్మినల్ బిల్డింగ్‌లోకి తీసుకెళ్లారు. టైర్ పేలిన ఘటనతో మెయిన్ రన్ వే పాడయ్యింది. దీంతోమూడు గంటలపాటూ మెయిన్ రన్‌వేను మూసివేశారు. సంబంధిత వార్త : టేకాఫ్ అవుతుండగా పేలిన టైర్ -
టేకాఫ్ అవుతుండగా పేలిన టైర్
చెన్నై : చెన్నై నుంచి ఢిల్లీ వెలుతున్న స్పైస్ జెట్ విమానానికి గురువారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలోని రన్ వే నుంచి టేకాఫ్ అవుతుండగా విమానం టైరు పేలినట్టు సిబ్బంది గుర్తించారు. అప్రమత్తమైన పైలట్ విమానాన్ని సురక్షితంగా తిరిగి చెన్నై విమానాశ్రయంలో దించారు. విమానంలోని ప్రయాణికులను సురక్షితంగా కిందికి దించి, తిరిగి టెర్మినల్ బిల్డింగ్‌లోకి తీసుకెళ్లారు. టైర్ పేలిన ఘటనతో రన్ వేను సాయంత్రం 6 గంట వరకు మూసివేశారు. కాగా, మరో ఘటనలో ఇథియోఫియన్ ఎయిర్‌లైన్స్ కు చెందిన కార్గో విమానాన్ని చెన్నై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. మధ్యాహ్నం 2.44 గంటలకు ఇంధన కొరతతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. -
తెలివిగా స్మగ్లింగ్ చేసినా అడ్డంగా బుక్కయ్యాడు!
సాక్షి, చెన్నై: విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణా (స్మగ్లింగ్) చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీ స్థాయిలో అతడి వద్ద బంగారం లభించడంతో పోలీసులు షాకయ్యారు. సయీద్ రఫీ అనే వ్యక్తి బుధవారం జెడ్డా నుండి కువైట్ ఎయిర్‌లైన్స్ లో చెన్నైకి వచ్చాడు. అయితే అతడి కదలికలపై అనుమానం వచ్చిన డీఆర్ఐ అధికారులు రఫీ లగేజీ చెక్ చేయగా అందులో బంగారం ఉన్నట్లు గుర్తించారు. బంగారు బిస్కెట్లను ఖర్జూర ప్యాకెట్లలో దాచి విదేశాల నుంచి అక్రమ రవాణా చేస్తున్నట్లు అధికారులు గమనించారు. నాలుగు కేజీల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. బంగారం విలువ దాదాపు కోటిన్నర రూపాయలు ఉండొచ్చునని అంచనా వేశారు. -
చెన్నైను కమ్మేసిన పొగమంచు..
సాక్షి, చెన్నై : చెన్నై నగరాన్ని పొగమంచు కమ్మేసింది. దట్టమైన పొగమంచు కారణంగా పలు విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. విమానాశ్రయంలో పొగమంచు భారీగా పేరుకుపోవడంతో అధికారులు.. 12 విమానాలను దారి మళ్లించారు. అలాగే చెన్నై విమానాశ్రయం నుంచి బయల్దేరాల్సిన మరో 30 విమానాలు ఆలస్యంగా వెళ్లనున్నాయి. విమానాలు బయలుదేరడానికి కనీసం 400 మీటర్ల మేర విజిబులిటి ఉండాలని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు వెల్లడించారు. అయితే ప్రస్తుతం పొగమంచు కారణంగా 50 మీటర్ల విజిబులిటి మాత్రమే ఉండటంతో విమానాలు ఆలస్యంగా బయలుదేరనున్నాయని అధికారులు వెల్లడించారు. దీంతో ప్రయాణికులు...విమానాశ్రయంలో పడిగాపులు పడుతున్నారు. మరోవైపు చెన్నై నుంచి ఇవాళ ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి నాలుగు విమానాలు రావల్సి ఉండగా, వెలుతురు సరిగా లేకపోవడంతో ఆ విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. -
పాప్‌కార్న్ మిషన్‌లో బంగారం
టీ.నగర్: దుబాయ్ నుంచి చెన్నైకు వచ్చిన విమానంలో పాప్‌కార్న్ మిషన్‌లో తీసుకొచ్చిన బంగారాన్ని బుధవారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి చెన్నైకు ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానంలో వచ్చిన ప్రయాణి కుల వద్ద కస్టమ్స్ అధికారులు తనిఖీలు జరిపారు. నవాజ్ మాకింగల్ గెయిత్పాయిల్ అనే వ్యక్తి లగేజీని తనిఖీ చేయగా హానర్ పాప్‌కార్న్ మిషన్, తోషిబా రేడియో కనిపించాయి. వీటి బరువులో వ్యత్యాసం ఉండడంతో అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. పాప్‌కార్న్ మిషన్‌లో తొమ్మిది రేకులు, రేడియోలో 27 రేకులు సిల్వర్ కలర్లో కనిపించాయి. వీటిని పరిశీలించగా అవన్నీ 24 క్యారెట్ బంగారంగా తెలిసింది. వీటి బరువు 782 గ్రాములు. విలువ రూ.23లక్షలుగా తెలిసింది. బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని నవాజ్ మాకింగల్ గెయిత్పాయిల్‌ను అరెస్టు చేశారు. -
ఇండిగో బస్సులో మంటలు
సాక్షి, చెన్నై : చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. అయితే అదృష్టవశాత్తు బస్సులో అప్పుడు ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎయిర్ పోర్టు నుంచి ప్రయాణికులతో బయలు దేరిన బస్సు.. వారిని విమానం దగ్గర దించి తిరుగు ప్రయాణమైంది. విమానం నుంచి బస్సు కొద్ది దూరం ప్రయాణించగానే.. బస్సుముందు భాగం నుంచి మంటలు పైకి లేచాయి. ఈ ఘటన ఎలా జరిగిందన్న దానిపై ఇప్పటివరకూ స్పష్టత లేదు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని ఇండిగో ఎయిర్‌లైన్స్ అధికారులు తెలిపారు. ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలావుండగా రెండు రోజుల కిందట.. ఢిల్లీ నుంచి తిరువనంతపురం వెళ్లాల్సిన ఇండిగో విమానం.. ఇంధన లీకేజీతో ఆగిపోయిన విషయం తెలిసిందే. #WATCH: IndiGo passenger bus caught fire at #Chennai airport this morning as it was returning to the airport bay after dropping passengers. No passengers were present during the time of the incident; no casualties/injuries pic.twitter.com/Fz8cpeYNmu — ANI (@ANI) 29 December 2017 -
లోదుస్తుల్లో డాలర్ల కట్టలు..
సాక్షి, చెన్నై: లో దుస్తుల్లో దాచుకుని అక్రమంగా తరలించటానికి ప్రయత్నించిన ఓ యువకుడిని అరెస్టు చేసి అతడి వద్ద నుంచి రూ.5 లక్షల అమెరికా డాలర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన తమిళనాడులో మంగళవారం చోటు చేసుకుంది. చెన్నై నుంచి నేటి వేకువజామున 3.30 గంటల సమయానికి కొలంబో వెళ్లే శ్రీలంక ఎయిర్‌లైన్స్ విమానం బయలుదేరటానికి సిద్ధంగా ఉంది. ఆ విమాన ప్రయాణీకుల లగేజీని అధికారులు పరిశీలన చేసి పంపుతున్నారు. ఆ సమయంలో చెన్నైకి చెందిన షంషుద్ధీన్ (32) టూరిస్ట్ వీసా మీద శ్రీలంకకు వెళ్లటానికి వచ్చాడు. అతడి కదలికలపై అనుమానం రావడంతో అధికారులు షంషుద్దీన్ లగేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. అయినా అనుమానం నివృత్తి కాని అధికారులు షంషుద్ధీన్ ను గదిలోకి తీసుకుని వెళ్లి తనిఖీలు చేయగా అతడి లోదుస్తుల్లో కట్టలు కట్టలుగా ఐదు లక్షల అమెరికా డాలర్లు కనిపించాయి. అది లెక్కచూపని నగదు అని తేలటంతో అతడి ప్రయాణాన్ని రద్దు చేశారు. నిందితుడు షంషుద్దీన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. -
ఆమె విమానంలోనే కన్నుమూసింది..
సాక్షి, చెన్నై: సింగపూర్ నుంచి చెన్నైకు వచ్చిన ఓ వృద్ధురాలు విమానంలోనే కన్నుమూసింది. సింగపూర్ నుంచి ఎయిర్ ఇండియా విమానం శనివారం తెల్లవారుజామున 2.30 గంటలకు చెన్నై చేరుకుంది. అందులో నాగపట్టణం జిల్లా మైలాడుదురై సమీపాన గల తిరుమంగళంకు చెందిన రహ్మత్‌గని (70) ఉంది. ప్రయాణీకులందరూ దిగి వెళ్ళినప్పటికీ రహ్మత్‌గని దిగలేదు. వెంట ఉన్న బంధువులు ఆమెను లేపేందుకు ప్రయత్నించగా సీటులోనే వాలిపోయింది. దీంతో వెంటనే ఎయిర్‌హోస్టెస్ ద్వారా చీఫ్ పైలట్‌కు విషయాన్ని తెలిపారు. అక్కడి నుంచి సమాచారం అందుకున్న విమానాశ్రయ అధికారులు, వైద్య బృందం వచ్చి రహ్మత్‌గనిని పరీక్షించగా ప్రయాణికురాలు గుండెపోటుతో మృతి చెందిందని తెలిపారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం క్రోంపేట ప్రభుత్వాసుపత్రికి పంపారు. కుటుంబీకులకు సమాచారం అందించారు. -
విమాన సర్వీసులకు రెయిన్ ఎఫెక్ట్
సాక్షి, చెన్నై: భారీ వర్షాలు చెన్నైని ముంచెత్తాయి. కుంభవృష్టితో నగర వీధులు జలమయమయ్యాయి. వర్షాల తీవ్రతతో పాటు చెన్నై విమానాశ్రయాన్ని మేఘాలు కమ్మేయడంతో ఆదివారం ఉదయం 9 అంతర్జాతీయ విమానాలతో పాటు 14 ఫ్లైట్లను దారిమళ్లించారు. మరికొన్ని విమానాల రాకపోకల్లో తీవ్ర జాప్యం నెలకొంది. చెన్నై నగరంలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 25.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో ఆదివారం తెల్లవారుజామున 2 గంటల నుంచి 3.50 గంటల వరకు చెన్నైకు విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. లండన్, అబుదాబి నుంచి చెన్నై రావాల్సిన రెండు అంతర్జాతీయ విమానాలను హైదరాబాద్‌కు మళ్లించినట్టు ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. అయితే ఉదయం ఆరు గంటల తర్వాత విమాన రాకపోకలు యథాతథంగా సాగాయని వెల్లడించాయి. -
బంగారం మాత్రలు మింగి బుక్కు...
సాక్షి, చెన్నై : మాత్రల రూపంలో తయారు చేసిన బంగారాన్ని మింగి విదేశాల నుంచి వస్తున్న ఓ వ్యక్తిని చెన్నై విమానాశ్రయం అధికారులు పట్టుకున్నారు. అరబ్‌దేశం నుంచి వచ్చే విమానంలో బంగారం అక్రమంగా రవాణా అవుతున్నట్లు దిండుక్కల్ జిల్లా కాళికొడువై సమీపంలో ఉన్న కరిప్పూర్ విమానాశ్రయ అధికారులకు శుక్రవారం రహస్య సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన అధికారులు విమాన ప్రయాణీకులను నిశితంగా గమనిస్తున్నారు. అదే సమయంలో అనుమానాస్పదంగా నడిచి వస్తున్న ఓ యువకుడిని పట్టుకుని విచారణ చేశారు. అప్పుడు అతను పొంతన లేని సమాధానాలు చెప్పటంతో ఎక్స్‌రే ద్వారా అధికారులు పరిశీలన చేశారు. అప్పుడు అతని కడుపులో ఏదో పదార్ధం ఉండలుగా ఉన్నట్లు తేలింది. అనంతరం అధికారులు ఆ యువకుడిని కోళిక్కాడు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. అనంతరం ఆపరేషన్ చేసి కడుపులో మాత్రల ఆకారంలో ఉన్న బంగారాన్ని బయటికి తీశారు. ఆ మాత్రల విలువ రూ.7లక్షలని లెక్కగట్టారు. విచారణలో నిందితుడిని కోళికొడువై సమీపంలో ఉన్న కొడువళ్లి ప్రాంతానికి చెందిన నావాస్ (34)గా గుర్తించారు. ఈ మేరకు అతనిపై అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
విమానంలో సీటు కింద భారీగా బంగారం
చెన్నై: దుబాయి నుంచి వచ్చిన ఓ విమానంలో సోదా జరిపిన అధికారులు భారీగా బంగారాన్ని కనుగొన్నారు. ప్రయాణికులంతా వెళ్లి పోయిన తర్వాత అధికారులు విమానాన్ని తనిఖీ చేయగా ఓ సీటు కింద ఉన్న మూడు కిలోల బంగారం బిస్కెట్లను కనుగొన్నారు. దీని విలువ రూ.1.15 కోట్ల వరకు ఉంటుందని రెవెన్యూ ఇంటలిజెన్స్ డైరెక్టరేట్ అధికారులు వెల్లడించారు. అక్రమంగా తీసుకువచ్చిన బంగారం పట్టుబడుతుందనే భయంతోనే అక్కడే పడేసి ఉంటారని భావిస్తున్నారు. దీనిని ఎవరు వదిలి వెళ్లారనే దానిపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. -
చెన్నై విమానాశ్రయంలో యువతిపై అత్యాచారయత్నం
- యువకుడికి దేహశుద్ధి టీనగర్ (చెన్నై): చెన్నై విమానాశ్రయం విశ్రాంతి గదిలో ఉన్న యువతిపై అత్యాచారం జరిపేందుకు ప్రయత్నించిన యువకుడికి ప్రయాణికులు దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన అక్కడ సంచలనం రేపింది. బాధిత 17 ఏళ్ల యువతి బెంగుళూరులోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతోంది. గురువారం రాత్రి ఆమె అండమాన్ వెళ్లేందుకు బెంగుళూరు నుంచి చెన్నై చేరుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు అండమాన్ వెళ్లే విమానంలో టికెట్ రిజర్వ్ చేసుకున్నారు. చెన్నై విమానాశ్రయంలో వీఐపీలు బసచేసే విశ్రాంతి గదిలో యువతి బసచేసింది. శుక్రవారం ఉదయం 6.30 గంటలకు తలుపు తట్టిన చప్పుడు కావడంతో యువతి గదిని శుభ్రపరిచేందుకు ఎవరైనా వచ్చివుంటారని భావించి తలుపుతీశారు. ఆ సమయంలో గదిలోకి ప్రవేశించిన ఓ యువకుడు ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. తప్పించుకున్న ఆ యువతి బయటికి వచ్చి కేకలు వేయడంతో అక్కడున్న సిబ్బంది పరుగున వచ్చి యువకునికి దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత అతన్ని విమానాశ్రయ పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో పట్టుబడిన యువకుడు తమిళనాడులోని దిండుగల్ జిల్లాకు చెందిన హారున్ రషీద్ (32)గా తెలిసింది. ఇతను గత ఆరు రోజుల క్రితం అదృశ్యమైనట్లు దిండుగల్ పోలీసులకు ఫిర్యాదు అందింది. అతనికి మానసిక స్థిమితం లేదని, అతను ఇల్లు విడిచి పరారైనట్లు సమాచారం. అతని గురించి దిండుగల్‌లో ఉన్న కుటుంబీకులకు పోలీసులు సమాచారం అందించారు. -
రూ.1.34 కోట్ల కొత్త నోట్లు పట్టివేత
సాక్షి, చెన్నై: కరెన్సీ నోట్ల మార్పిడికి ప్రయత్నించిన ఓ ముఠాను గురువారం చెన్నైలో రెవెన్యూ ఇంటెలిజెన్స్ వర్గాలు పట్టుకున్నాయి. వారి నుంచి రూ.1.34 కోట్ల విలువైన రూ.2 వేల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారంతో గురువారం ఇంటెలిజెన్స్ వర్గాలు చెన్నై మీనంబాక్కం ఎయిర్పోర్ట్ కి సమీపంలోని పోలీసుల సహకారంతో వాహనాల తనిఖీ చేపట్టాయి. ఆ సమయంలో ఓ కారు ఆగకుండా ముందుకు దూసుకెళ్లింది. దీంతో ఆ కారును వెంబడించి ∙పల్లావరం వద్ద కారులో ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ కారులో రూ.1.34 కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు బయట పడ్డాయి. పట్టుబడ్డ వారిలో చెన్నైకు చెందిన రిజ్వాన్, ముక్దర్, సమీఅహ్మద్‌తో పాటు మరో ఇద్దరున్నారు. -
రూ.60 లక్షల హవాలా సొమ్ము పట్టివేత
సాక్షి ప్రతినిధి, చెన్నై: శ్రీలంకకు రహస్యంగా తరలిస్తున్న రూ.60 లక్షల హవాలా సొమ్మును చెన్నై విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై-శ్రీలంక విమానం బుధవారం రాత్రి 9.15 గంటలకు బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. ఇంతలో కస్టమ్స్ అధికారులకు ఓ సమాచారం అందింది. వెంటనే కస్టమ్స్ అధికారులు విమానంలోకి ప్రవేశించి ఇద్దరు అనుమానితులను దించేశారు. చెన్నైకి చెందిన మహ్మద్ (40), అతని సహచరుడి లగేజీలను తనిఖీ చేయగా రూ.60 లక్షల విలువచేసే అమెరికన్ డాలర్లు, యూరో కరెన్సీ బయటపడింది. వారిద్దర్నీ అరెస్ట్ చేశారు. ఈ తనిఖీల కారణంగా శ్రీలంక విమానం 10.30 గంటలకు బయలుదేరింది. -
రూ.4కోట్ల విలువైన కెటమైన్ స్వాధీనం
చెన్నై : చెన్నై విమానాశ్రయంలో భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత ఉత్ప్రేదిక పదార్థమైన 'కెటమైన్' డ్రగ్‌ను అధికారులు శుక్రవారం ఉదయం సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న కెటమైన్ మాదకద్రవ్యం విలువ సుమారు రూ.4కోట్లు ఉంటుందని అంచనా. ఇందుకు సంబంధించి ఇంతియాజ్ అలీ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. విమానాశ్రయంలో దిగిన ఇతగాడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో సందేహించిన అధికారులు, అతడి వద్ద సోదా చేయగా నాలుగు కోట్ల రూపాయలను విలువచేసే కెటమైన్ పట్టుబడింది. కేసు నమోదు చేసిన అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
విమానంలోనే మృతి చెందిన పారిశ్రామికవేత్త
తిరువొత్తియూరు: ఇండోనేషియా నుంచి దుబాయ్‌కి వెళుతున్న విమానంలో గుండెపోటుతో పారిశ్రామికవేత్త మృతి చెందాడు. ఇండోనేషియా నుంచి దుబాయ్‌కి బుధవారం రాత్రి విమానం బయలుదేరింది. విమానంలో ప్రయాణిస్తున్న ఇండోనేషియాకు చెందిన పారిశ్రామికవేత్త అవతీష్‌భాను (55)కు హఠాత్తుగా గుండెనొప్పి వచ్చింది. దీంతో ఆ విషయాన్ని విమాన సిబ్బందికి తెలిపాడు. సదరు విమానం చెన్నై సమీపంలో ఉండటం చేత ఎయిర్ పోర్టు అధికారులతో పైలట్లు సంప్రదించారు. చెన్నై ఎయిర్ పోర్టులో విమానం దిగేందుకు అనుమతి ఇచ్చారు. దాంతో చెన్నై ఎయిర్ పోర్టులో రాత్రి 9గంటలకు అత్యవసరంగా విమానాన్ని ల్యాండింగ్ చేశారు. అక్కడ సిద్ధంగా ఉన్న డాక్టర్లు అవతీష్‌భాను ఆరోగ్యాన్ని పరిశీలించారు. కానీ ఆయన అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు గుర్తించారు. అవతీష్ భాను మృతదేహాన్ని క్రోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాత్రి 11 గంటలకు విమానం తిరిగి దుబాయ్‌కి బయలుదేరింది. -
2.5 కిలోల బంగారం పట్టివేత
కేకే.నగర్: చెన్నై విమానాశ్రయంలో అక్రమంగా రెండున్నర కిలోల బంగారం తీసుకొస్తున్న ఆంధ్రా మహిళను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఉదయం 4 గంటలకు మీనంబాక్కం అంతర్జాతీయ విమానాశ్రయానికి కువైట్ నుంచి కువైట్ ఎయిర్‌లైన్స్ విమానం చేరుకుంది. అందులో వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేస్తుండగా, ఒక మహిళపై అధికారులకు అనుమానం రావడంతో ఆమె హ్యాండ్బాగ్ని పరిశీలించగా నలుపు పాలథిన్ కవరులో 100 గ్రాముల బరువు గల ఐదు బంగారు బిస్కెట్లు కనిపించాయి. దీంతో ఆమెను ప్రత్యేక గదికి తీసుకెళ్లి సోదా చేయగా లోదుస్తుల్లో రెండు కిలోల బరువు గల ఇరవై బంగారు బిస్కెట్లు పట్టుబడ్డాయి. ఆంధ్రా రాజంపేటకు చెందిన లక్ష్మీదేవి (38). రెండేళ్ల క్రితం ఇంటి పనులు చేయడానికి కువైట్ వెళ్లిందని, తిరిగి సొంతూరుకు వస్తున్న విషయం తెలిసి అంతర్జాతీయ బంగారం అక్రమ స్మగ్లర్లు ఆమెకు రూ.20వేలు ఇస్తామని చెప్పి బంగారు బిస్కెట్లు ఇచ్చి పంపినట్లు తెలిసింది. బ్యాగులో ఉన్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకుంటే వాటికి తగిన మూల్యం చెల్లిస్తామని, లోదుస్తుల్లో ఉన్న బంగారాన్ని మాత్రం వారు చెప్పిన హోటల్‌కు తీసుకువస్తే అక్కడ ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకుంటామని చెప్పినట్లు లక్ష్మీదేవి తెలిపింది. అధికారులు ఆమెను విచారణ చేస్తున్నారు. -
25 ఏళ్ల తర్వాత నిందితుడి అరెస్ట్
తిరువొత్తియూరు : 25 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్న నేరస్తుడిని చెన్నై విమానాశ్రయంలో శనివారం పోలీసులు అరెస్టు చేశారు. తంజావూరు జిల్లా అదిరామాపట్టణంకు చెందిన సులైమాన్ (56). ఇరువర్గాల మధ్య ఘర్షణ, దాడి చేసుకున్న సంఘటనకు సంబంధించి ఇతనిని పలు విభాగాల కింద అదిరామం పట్టినం పోలీసులు 1991వ సంవత్సరంలో కేసు నమోదు చేశారు. ఇతని కోసం గాలింపు చేపట్టిన సమయంలో ఇతను అజ్ఞాతంలోకి వెళ్లాడు. విదేశాలకు తప్పించుకుని వెళ్లకుండా అడ్డుకునేందుకు అన్ని విమానాశ్రయాలకు ఇతని ఫొటో ఇచ్చి గాలిస్తున్న నిందితుడిగా తెలిపారు. ఈ క్రమంలో శనివారం ఉదయం 4.30 గంటలకు చెన్నై నుంచి షార్జాకు వెళ్లు గతృ ఎయిర్వేస్ విమానం సిద్ధంగా ఉంది. ఈ విమానంలో ప్రయాణించేందుకు వచ్చిన వారిని తనిఖీ చేస్తుండగా సులేమాన్ వద్ద పాస్‌పోర్టు, వీసాను తనిఖీ చేయగా అతను 25 సంవత్సరాలుగా పోలీసులు వెతుకుతున్న వ్యక్తి అని తెలిసింది. దీంతో అతన్ని అరెస్టు చేసి దీని గురించి తంజావూరు పోలీసులకు సమాచారం అందించారు. తంజావూరు పోలీసులు చెన్నై వచ్చి సులేమాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
పాస్‌పోర్టు మరిచిన సూపర్‌స్టార్
తమిళసినిమా: నటుడు రజనీకాంత్ పాస్‌పోర్టు మరిచిపోవడంతో చెన్నై విమానాశ్రయంలో కలకలం చెలరేగింది. వివరాల్లోకెళ్లితే రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రాలలో కబాలి ఒకటి. ఈ చిత్రం షూటింగ్ మలేషియాలో జరుగుతోంది. అందులో పాల్గొనడానికి సోమవారం ఉదయం చెన్నై విమానాశ్రయానికి వెళ్లారు. ఆయనతో పాటు చిత్ర నిర్మాత కలైపులి ఎస్.థాను ఉన్నారు. విమానం ఉదయం 11.45 నిమిషాలకు మలేషియా బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. రజనీకాంత్ ఇమ్మిగ్రేషన్ శోధన ప్రాంతానికి వెళ్లారు. అప్పుడే తన పాస్‌పోర్టును తీసుకురావడం మరచినట్లు తెలుసుకున్నారు. దీంతో అక్కడ పెద్ద కలకలమే జరిగింది. పాస్‌పోర్టు మరిచిన విషయాన్ని రజనీకాంత్ ఇంటికి ఫోన్ చేసి చెప్పారు. అనంతరం విమానాశ్రయం అధికారులు ఆయన్ని విశ్రాంతి గదికి తీసుకెళ్లారు. దీంతో రజనీకాంత్ మలేషియా పయనం రద్దు అవుతుందనుకున్న పరిస్థితుల్లో ఆయన సహాయకుడు ఆగమేఘాల మీద ఒక ద్విచక్ర వాహనంలో పాస్‌పోర్టును తీసుకుని మలేషియా వెళ్లే విమానం మరి కొన్ని నిమిషాల్లో బయల్దేరుతుందనగా విమానాశ్రయానికి వచ్చారు. రజనీ పాస్‌పోర్టును పరిశీలించిన అధికారులు ఆయన పయనాన్ని ధ్రువీకరించి విమానంలోకి పంపించారు. అంత వరకూ ఉత్కంఠభరితంగా ఉన్న వాతావరణం రజనీ కాంత్ పయనం ఖాయం అవడంతో ఊపిరి పీల్చుకున్నట్లైంది. రజనీకాంత్ అక్కడున్న మీడియా వారి ఫొటోలకు ఫోజులిచ్చి మలేషియాకు పయనం అయ్యారు. -
ఆకాశంలో ఆడ దొంగ..
ఉన్నత చదువులు, ఆధునిక వస్త్రధారణ, మంచి జీతం, మరెన్నో అలవెన్సులు, అందరిలో గుర్తింపు.. వీలైనంతమేరలో హైఫై జీవితాన్ని అనుభవిస్తున్నప్పటికీ సంతృప్తి చెందని ఎయిర్ ఇండియా మహిళా ఉద్యోగిని.. అప్పనంగా దొరికినకాడికి దోచేసుకునే ప్రయత్నం చేసింది. విమానంలో ప్రాయాణికులకు అందించాల్సిన ఆహార పదార్థాలు, లిక్కర్ బాటిళ్లను ఎంచక్కా బ్యాగులో తోసేసి దొంగతనానికి పాల్పడింది. చివరికి ఎయిర్ పోర్టు విజిలెన్స్ అధికారులకు పట్టుబడి ఉద్యోగం పోగొట్టుకుంది. చెన్నై విమానాశ్రయంలో జనవరి 27న పట్టుబడ్డ ఆ ఆడ దొంగ వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఎయిర్ ఇండియా 274 (కొలంబో- ఢిల్లీ- చెన్నై) సర్వీసులో విధులు నిర్వహించిన మహిళా ఉద్యోగి.. ట్రిప్ పూర్తయిన వెంటనే భారీ బ్యాగుతో విమానంలోనుంచి దిగింది. ఆమె తీరును అనుమానించిన ఎయిర్ పోర్ట్ విజిలెన్స్ అధికారులు బ్యాగును తనిఖీ చేయగా అందులో పెద్ద ఎత్తున ఆహార పదార్థాలు, లిక్కర్ బాటిళ్లు కనిపించాయి. అవన్నీ ప్రయాణికులకు అందజేయాల్సినవే కావటం గమనార్హం. మహిళా సిబ్బంది చర్యను తీవ్రంగా పరిగణించిన ఎయిర్ ఇండియా వెంటనే ఆమెను విధుల నుంచి తొలిగించింది. సిబ్బంది ఇలా దొంగతనాలకు పాల్పడిన వార్తలు గతంలోనూ వెలుగుచూసినప్పటికీ ఇంత భారీ మొత్తంలో వస్తువులు లభించడం ఇదే మొదటిసారని అధికారులు చెబుతున్నారు. -
చెన్నై ఎయిర్‌పోర్టును వీడని వరుణుడు
-
ఈ నెల 6వ తేదీవరకూ రాకపోకలు రద్దు
-
చెన్నై నుంచి హైదరాబాద్ ప్రయాణికుల తరలింపు
హైదరాబాద్/చెన్నై: చెన్నై ఎయిర్ పోర్ట్‌లో చిక్కుకున్న మహానగర వాసులను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. సాయంత్రం 4:30 గంటలకు 106 మంది ప్రయాణికులను హైదరాబాద్ కు తరలించినట్లు చెన్నై అధికారులు తెలిపారు. ఆ తర్వాత మరో మూడు గంటలకు 87 మంది ప్రయాణికులను హైదరాబాద్‌కు తరలింపు కార్యక్రమాన్ని మొదలెట్టారు. చెన్నై విమానాశ్రయంలో చిక్కుకున్న ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులను వారి సొంత ప్రాంతాలకు పంపే యత్నాలు సాఫీగా సాగుతున్నాయి. తమిళనాడులో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. పలు విమాన, రైలు సర్వీసులు రద్దయిన విషయం అందరికీ విదితమే. చెన్నై ఎయిర్పోర్ట్ రన్ వే పూర్తిగా నీటితో నిండిపోవడం, రోడ్లు కూడా జలమయం అవకావడంతో ప్రయాణికులు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం వర్షాలు తగ్గడంతో అధికారులు తమ సహాయక చర్యలను ముమ్మరం చేశారు. -
ఈ నెల 6వ తేదీవరకూ రాకపోకలు రద్దు
చెన్నై : చెన్నై విమానాశ్రయంలో వరద నీరు తగ్గుముఖం పడుతోంది. తమిళనాడులో కుండపోతగా కురిసిన భారీ వర్షాలతో విమానాశ్రయంలోని రన్ వే పైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసిన విషయం తెలిసిందే. చెన్నై విమానాశ్రయ డైరెక్టర్ దీపక్ మిశ్రా గురువారమిక్కడ సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీ వరకూ రాకపోకలు రద్దు చేసినట్లు తెలిపారు. భద్రత, రన్ వే లను పరిశీలించాకే విమానాల రాకపోకలను అనుమతిస్తామన్నారు. వరదలతో 350 విమానాల రాకపోకలు నిలిచిపోయాయని దీపక్ మిశ్రా వెల్లడించారు. ఇక విమానాశ్రయంలో చిక్కుకుపోయిన 1500 మంది ప్రయాణికులను వివిధ మార్గాల్లో గమ్యస్థానాలకు పంపించినట్లు ఆయన తెలిపారు. -
'చెన్నై ఎయిర్ పోర్టులో చిక్కుకున్న ప్రయాణికులు'
చెన్నై: తమిళనాడులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెన్నై విమానాశ్రయం పూర్తిగా నీట మునిగిందని పౌర విమానాయాన శాఖ సహాయ మంత్రి మహేశ్ శర్మ తెలిపారు. చెన్నై ఎయిర్ పోర్టులో 700 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారని చెప్పారు. వీరికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. వీరిని సాధ్యమైనంత త్వరగా సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని అన్నారు. మరిన్ని వర్షాలు పడే అవకాశమున్నందున ఇప్పడప్పుడే చెన్నై నుంచి విమానాలు నడిపే పరిస్థితి లేదని పౌర విమానాయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు స్పష్టం చేశారు. కాగా, భారీ వర్షాలతో చెన్నైకు రావాల్సిన రావాల్సిన విమానాలు రద్దయ్యాయి. శంషాబాద్ నుంచి చెన్నైకు రావాల్సిన విమాన సర్వీసులను రద్దు చేశారు. శంషాబాద్ నుంచి కోయంబత్తూర్, కొచ్చిన్, అహ్మదాబాద్, విజయవాడ, కొచ్చి వెళ్లాల్సిన విమానాలు కూడా రద్దయ్యాయి. -
పడవలు కాదు.. విమానాలు!
చెన్నై: భారీ వర్షాల కారణంగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం చిన్నపాటి నదిలా మారిపోయింది. దాంతో విమానాలు కాస్తా పడవల్లా తేలుతున్నాయి. వరుసగా పార్కింగ్ చేసిన విమానాలు దూరంగా పడవల్లా కనిపిస్తుంటే కేవలం చెన్నై వాసులే కాదు.. భారతీయులంతా విస్తుపోతున్నారు. చెన్నై విమానాశ్రయం మొత్తం నీళ్లతో నిండిపోవడంతో విమాన సర్వీసులను పూర్తిగా రద్దు చేశారు. ఇక చెన్నై మీదుగా వెళ్లాల్సిన 19 రైళ్లు కూడా రద్దయ్యాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో పీకల్లోతు నీళ్లు ప్రవహిస్తుండటంతో జన జీవనం పూర్తిగా స్తంభించింది. అడయార్ నదిమీద ఉన్న వంతెన పై నుంచి నీళ్లు ప్రవహిస్తుండటంతో వంతెనపై రాకపోకలను నిలిపివేశారు. నగరంలో ప్రజలు ఎటూ కదలడానికి వీల్లేకుండా పోయింది. -
ఇరుక్కున్న హన్సిక
హీరోయిన్ హన్సికకు ఇదో మర్చిపోలేని అనుభవమైంది. వానలో షూటింగ్ అలవాటున్న ఈ అందాల రాశికి, వాన నీళ్ళలో ఇరుక్కుపోవడమంటే ఏమిటో తెలిసొచ్చింది. ఆ సంగతి గురించి హన్సిక చెబుతూ, ‘‘ఈ నవంబర్ 24ని ఎప్పటికీ మర్చిపోలేను. ముంబయ్కో, విదేశాలకో వెళ్లి, తిరిగొచ్చినప్పుడు ఎలా చెన్నై వస్తానో అలానే ఆ రోజు చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో దిగాను. భారీ వర్షాల కారణంగా చెన్నై పరిస్థితి దారుణంగా మారిన విషయం నాకు తెలియదు. నా హోటల్ రూమ్‌కి వెళ్లడానికి కారు ఎక్కాను. సమయం గడుస్తోందే తప్ప హోటల్ రావడం లేదు’’ అని గుర్తుచేసుకున్నారు. తుపానుతో ఎడతెగని వర్షాల కారణంగా చెన్నై రోడ్లన్నీ జలమయం కావడంతో కొన్ని ఏరియాల్లో ఆ నగరవాసులు పడవ ప్రయాణం చేస్తున్నారు. కారులో ప్రయాణం అంటే ఇక గమ్యం చేరినట్లే. హన్సికకు అదే జరిగింది. ఇలా అయితే ఎప్పటికీ హోటల్‌కి చేరుకోలేమని భావించిన ఈ బ్యూటీ కారు దిగారు. దగ్గరలోనే వేరే ఏదైనా హోటల్లో బస చేయాలనుకున్నారు. పూనమల్లి రోడ్డులో కత్తిపరా ఫ్లై ఓవర్ మీదుగా నడక మొదలుపెట్టారు. వానలో పూర్తిగా తడిసిపోయారు. ఈలోపు హన్సికను కొంతమంది గుర్తుపట్టారు. కానీ, ఆమెను ఇబ్బందిపెట్టలేదు. ఎలాగోలా ఆమె హోటల్ చేరారు. ‘‘ఉత్తరాది అమ్మాయినైనా సౌత్‌ని నా హోమ్ టౌన్లానే భావిస్తాను. ప్రకృతి వైపరీత్యం కారణంగా తమిళనాడు ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి’’ అన్నారు. మొత్తానికి, చెన్నై తుపాను వర్షాలు హన్సికకు ఒక అనుభవాన్నిచ్చాయన్నమాట. -
విమానంలో అసభ్య ప్రవర్తన, అరెస్ట్
కోయంబత్తూరు: విమానంలో అసభ్యంగా ప్రవర్తించిన ముగ్గురు ప్రయాణికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోయంబత్తూరు- చెన్నై ఇండిగో విమానంలో ఫుల్లుగా మద్యం సేవించి ఉన్న ఈ ముగ్గురు ప్రయాణికులు ఎయిర్ హోస్టెస్, ఇతర మహిళల పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించారు. విచక్షణ మర్చిపోయి ప్రవర్తించడంతో పాటు, ఎయిర్ హోస్టెస్ ను సెల్ ఫోన్ లో ఫోటో తీయడానికి ప్రయత్నించారు. దీన్ని అడ్డుకున్న మిగతా సిబ్బందితో గొడవకు దిగారు. దీంతో విమాన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ముగ్గురిపైనా కేసు నమోదయ్యాయి. వారిని గురువారం కోర్టులో హాజరు పరచగా, 14 రోజులు రిమాండ్ విధించింది. కాగా నిందితుల్లో ఒకరు హిందూ మహాసభ నేత కాగా మరో ఇద్దరు న్యాయవాదులు కావటం శోచనీయం. ఈ ఘటన గత రాత్రి చెన్నై ఇండిగో విమానంలో జరిగింది. సెంథిల్ కుమార్, రాజా... విమానం ఎక్కిన దగ్గర నుంచి పెరున్దురైకి చెందినవారు కాగా, స్వామినాథన్ ట్రిచ్చివాసి. -
చెన్నై ఎయిర్‌పోర్టులో జవాను ఆత్మహత్య
చెన్నై: సీఐఎస్ఎఫ్ జవాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం చెన్నై ఎయిర్‌పోర్టులోని టాయిలెట్ రూంలోకి జవాను వెళ్లాడు. అక్కడే తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రూ.50 లక్షల బంగారం స్వాధీనం
చెన్నై : చెన్నై విమానాశ్రయంలో శనివారం ఉదయం, శుక్రవారం రాత్రి జరిపిన తనిఖీల్లో అధికారులు రూ.50 లక్షల బంగారం స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. అబుదాబి నుంచి శనివారం చెన్నై విమానాశ్రయానికి ఒక విమానం వచ్చింది. ఈ విమానం నుంచి దిగిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేస్తుండగా కేరళకు చెందిన సమీర్ అనే వ్యక్తికి చెందిన సూట్‌కేసులో కిలో బంగారు కడ్డీలు ఉన్నట్టు గుర్తించారు. ఈ బంగారం విలువ రూ.30 లక్షలు చేస్తుంది. దీంతో బంగారాన్ని స్వాధీనం చేసుకుని సమీర్‌ను అరెస్టు చేశారు. అలాగే కౌలాలంపూర్ నుంచి శుక్రవారం అర్ధరాత్రి చెన్నై విమానాశ్రయానికి వచ్చిన విమానంలో దిగిన ప్రయాణికులు, కస్టమ్స్ అధికారులు తనిఖీ చేస్తుండగా రామన్ (30) అనే వ్యక్తికి చెందిన బ్యాగులో 600 గ్రాములు కలిగిన ఆరు బంగారు బిస్కెట్లను అక్రమంగా తీసుకొస్తున్నట్టు తెలిసింది. దీంతో అధికారులు ఆరు బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకుని రామన్‌ను అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.18 లక్షలు చేస్తుంది. -
టాయిలెట్లో 5 కేజీల బంగారం
చెన్నై: మలేషియా నుంచి చెన్నైకి చేరుకున్న విమానం నుంచి ఐదు కిలోల బంగారును కస్టమ్స్ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. తెల్లవారుజాము 2.30గంటలకు కౌలాలంపూర్ నుంచి ఏయిర్ ఇండి యా విమానం చెన్నై విమానాశ్రయం చేరుకుంది. ఈ విమానంలో పెద్ద ఎత్తున బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు ముందుగానే అధికారులకు సమాచారం రావడంతో ప్రయాణికులను మరింత తీవ్రంగా తనిఖీ చేయడం ప్రారంభించారు. అయితే ఎవ్వరి వద్ద బంగారు దొరకలేదు. ఆ తరువాత విమానంలోని టాయిలెట్‌ను తనిఖీ చేయగా అక్కడి వాటర్‌ట్యాంక్‌లో నల్లని బ్యాగులో బంగారం దొరికింది. 500 గ్రాముల బరువున్న 10 బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 5 కిలోల ఈ బంగారు విలువ ప్రపంచ మార్కెట్లో రూ.1.5 కోట్లుగా అధికారులు తెలిపారు. విమానాశ్రయంలో తీవ్రస్థాయిలో తనిఖీలు సాగుతున్నట్లు గ్రహించిన ప్రయాణికుడు బంగారు ప్యాకెట్‌ను టాయిలెట్లో దాచి పారిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. -
హై అలర్ట్
విమానాశ్రయానికి బాంబు బెదిరింపు చెన్నైలో ముంబయి ఫోన్ ప్రకంపనలు చెన్నై, సాక్షి ప్రతినిధి: జెట్ ఎయిర్వేస్ విమానాల్లో బాంబులు ఉన్నట్లు అజ్ఞాత వ్యక్తి చేసిన ఫోన్‌కాల్స్ చెన్నై విమానాశ్రయంలో ప్రకంపనలు సృష్టించాయి. చెన్నై ఎయిర్‌పోర్టులో హై అలర్ట్ ప్రకటించి శనివారమంతా తనిఖీలు చేపట్టారు. దీంతో అన్ని విమానాలు ఆలస్యంగా నడిచాయి. బెంగళూరు, ఢిల్లీ నుంచి బయలుదేరే జెట్ ఎయిర్వేస్ విమానాల్లో బాంబులు ఉన్నట్లు శుక్రవారం అర్ధరాత్రి తరువాత ఒక అజ్ఞాత వ్యక్తి ముంబయి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలను అప్రమత్తం చేశారు. ఇందులో భాగంగా చెన్నై విమానాశ్రయం నుంచి బయలుదేరే జెట్‌ఎయిర్‌వేస్ విమానాలతోపాటు అన్ని విమానాలను తనిఖీ చేయడం ప్రారంభించారు. ముంబయి, కోల్కత్తా, ఢిల్లీ, బెంగళూరు వెళ్లే విమానాలను ప్రత్యేకంగా పరిశీలించారు. బాంబ్ స్క్వాడ్ అధికారులు పోలీసు జాగిలాలతో ప్రయాణికుల లగేజీ, విమానాల్లోనూ తనిఖీలు నిర్వహించారు. విమానాశ్రయంలోకి వచ్చే వాహనాలను తనిఖీ చేయనిదే అనుమతించలేదు. ద్రవ పదార్థాలతో పేలుడు సృష్టించే అవకాశాలను తోసిపుచ్చలేక అటువంటి అనుమానిత ద్రవపదార్థాలపై నిషేధం విధించారు. శనివారం తెల్లవారుజాము 2 గంటలకు ప్రారంభమైన తనిఖీలు నిరంతరంగా కొనసాగాయి. ప్రయాణికులను, వారి లగేజీలను క్షుణ్ణంగా తనిఖీలు చేయనిదే లోనికి అనుమతించలేదు. అనుమానితులను ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లి మరీ తనిఖీలు నిర్వహించారు. స్వదేశీ ప్రయాణికులు గంటకు బదులుగా గంటన్నర ముందుగా, అలాగే విదేశీ ప్రయాణికులు మూడుగంటలకు బదులుగా మరో అరగంట ముందుగా విమానాశ్రయానికి చేరుకోవాలని అధికారులు సందేశాలు పంపారు. విమానాశ్రయం నలుమూలల గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అదృష్టవశాత్తు శనివారం రాత్రి 7 గంటల వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటుచేసుకోకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. -
సాంకేతిక లోపంతో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
చెన్నై: 230 మంది ప్రయాణికులతో ఆమ్స్టర్డామ్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న మలేసియా ఎయిర్ లైన్స్ విమానంలో గురువారం ఉదయం సాంకేతిక లోపం ఏర్పడింది. ఆ విషయాన్ని గమనించిన పైలెట్ వెంటనే మలేసియా విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించాడు. దాంతో వారు వెంటనే భారత్‌లోని చెన్నై విమానాశ్రయ అధికారులను సంప్రదించారు. సదరు విమానాన్ని దింపేందుకు చెన్నై విమానాశ్రయ అధికారులు సుముఖత వ్యక్తం చేశారు. దాంతో మలేసియా విమానం చెన్నై విమానాశ్రయంలో దిగింది. విమానంలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని చెన్నై అధికారులు సరి చేశారు. ఆ తర్వాత విమానం కౌలాలంపూర్ బయలుదేరి వెళ్లిందని చెన్నై విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. మలేసియా ఎయిర్ లైన్స్ విమానం సాంకేతిక లోపం ఏర్పడిన సమయంలో భారత గగన తలంపై ఉందని చెప్పారు. -
అదనపు సొబగులు
చెన్నై ఎయిర్‌పోర్టు స్థాయిపెంపు రూ.2,300 కోట్లు మంజూరు విమానాశ్రయంలో సౌర విద్యుత్ ప్లాంట్ భారతదేశంలోనే ప్రముఖమైనదిగా పేరుగాంచిన చెన్నై విమానాశ్రయం తన స్థాయిని మరింతగా పెంచుకోనుంది. అంతర్జాతీయ పెట్టుబడిదారుల సమావేశం సందర్భంగా అదనపు సొబగులు అద్దుకోనుంది. విమానాశ్రయ స్థాయి పెంపునకు కేంద్రం రూ.2,300 కోట్లు మంజూరు చేసింది. చెన్నై, సాక్షి ప్రతినిధి : ప్రస్తుతం చెన్నై విమానాశ్రయం ఏడాదికి 1.4 కోట్ల ప్రయాణికుల సేవలందించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీనిని 3 కోట్లకు పెంచాలని మూడేళ్ల క్రితమే నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇక్కడి విమానాశ్రయాన్ని ప్రయివేటీకరణ చేయాలని ఇండియన్ ఎయిర్‌లైన్స్ అథారిటీ భావిస్తున్న తరుణంలో ఈ నిర్ణయాన్ని పక్కన పెట్టేశారు. అయితే ఇప్పట్లో ప్రయివేటీకరణకు అవకాశం లేకపోవడంతో మూడేళ్ల క్రితం తీసుకున్న నిర్ణయం మళ్లీ తెరపైకి వచ్చింది. విమానాశ్రయ స్థాయి పెంపు పనుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2,300 కోట్లు మంజూరు చేసింది. తొలి విడతగా రూ.1000 కోట్లను విడుదల చేసింది. ఈ పనులపై అంతర్జాతీయస్థాయిలో టెండర్లను పిలవాలని, రెండు లేదా మూడు నెలల్లోగా పనులు ప్రారంభించాలని ఉన్నతాధికారులు ఎయిర్ ఇండియా అథారిటీ తీర్మానించింది. విమానాశ్రయ స్థాయిపెంపు పనులు మూడేళ్లలోగా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.అంతర్జాతీయ పెట్టుబడుల సమావేశం: చెన్నైలో వచ్చేనెల అంతర్జాతీయ పెట్టుబడుల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ప్రపంచం నలుమూలల నుండి నాలుగువేల మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో నిర్వహిస్తున్న ఈ సమావేశానికి హాజరయ్యే ప్రతినిధులకు విమానాశ్రయంలో ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు అందాయి. ప్రతినిధులను రాష్ట్ర ప్రభుత్వం స్వాగతించేందుకు వీలుగా విమానాశ్రయంలో అదనపు కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. విమానాశ్రయ ముఖద్వారాన్ని అత్యాధునిక పద్ధతిలో మెరుగులుదిద్ది రెండేళ్ల క్రితం ప్రారంభించారు. అయితే ఇక్కడి సీలింగ్‌లోని అద్దాలు తరచూ పడటం వంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ సంఘటనలు పునరావృతం కాకూడదని అధికారులు ఆదేశించారు. దేశంలో 19 వ స్థానం ప్రపంచంలో 59 పేరొందిన విమానాశ్రయాలు ఉండగా, చెన్నై విమానాశ్రయానికి 19వ స్థానం దక్కింది. స్థాయి పెంపుపనులతో విమానాశ్రయ ప్రస్తుత రూపురేఖలు దెబ్బతినకుండా అదనపు సొబగులు అద్దనున్నారు. తమిళ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిభింబించేలా రాష్ట్ర పర్యాటకశాఖ నేతృత్వంలో తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, విమానాశ్రయంలోని పైకప్పు భాగాన్ని సౌరశక్తి ఉత్పత్తికి వినియోగించనున్నట్లు విమానాశ్రయ జనరల్ మేనేజర్ రాజు తెలిపారు. సౌరశక్తి పనులు వచ్చే ఏడాది జూలైలోగా ప్రారంభిస్తామని చెప్పారు. అలాగే నేలపై కూడా సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. -
భారీ వర్షంతో.. విమానాల దారి మళ్లింపు
చెన్నై: చెన్నై విమానశ్రయంలో లాండ్ అవ్వాల్సిన మూడు విమానాలను భారీ వర్షం కారణంగా దారిమళ్లించినట్టు విమానశ్రయ అధికారులు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చెన్నైలో ధారాపాతంగా వర్షం కురుస్తుండటంతో రెండు అంతర్జాతీయ విమానాలు, ఒక దేశియ విమానాన్ని బెంగళూరు, తిరుచునాపల్లి విమానశ్రయాలకు మళ్లించారు. అయితే చెన్నై ఎయిర్‌పోర్ట్‌కు శనివారం పూణె నుంచి ఒక దేశియ విమానం, సింగపూర్, ప్రాంక్పర్ట్ నుంచి రెండు అంతర్జాతీయ విమానాలు రావాల్సి ఉంది. చెన్నైలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ముందు జాగ్రత్త చర్యగా ఆ మూడింటిని దారి మళ్లించాల్సి వచ్చిందని ఎయిర్ పోర్టు అధికారులు పేర్కొన్నారు. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ఈ మూడు విమానల్లోకి ఎక్కేందుకు ప్రయాణికులంతా సిద్ధంగా ఉండగా, చివరి క్షణంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. దాంతో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. -
ఆ సీటు బంగారం గానూ..
చెన్నై: సీటు బంగారం అంటే బంగారంతో చేసిన సీటు కాదు. సీటు కింద బంగారం దాచుకుని ప్రయాణించడం. అది కూడా ఒకటీ, అరా కాదు.. ఏకంగా మూడు కిలోల బంగారం!! చెన్నై ఎయిర్‌పోర్టులో కలకలం రేపిన ఈ సీటు కింద బంగారం కథేంటో చూద్దాం.. ఎయిర్ ఇండియాకు చెందిన ఓ విమానం కౌలాలంపూర్ నుంచి బుధవారం మధ్యాహ్నం చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ప్రయాణికులందరూ దిగి వెళ్లిపోయారు. షెడ్యూల్ ప్రకారం ఆ విమానం ముంబైకి ఓ ట్రిప్పు వెళ్లాల్సి ఉంది. దీంతో క్లీనింగ్ స్టాఫ్ హడావిడిగా వాక్యూమ్ క్లీనర్లు, మాప్‌లతో విమానాన్ని శుభ్రం చేసేందుకు లోనికి వెళ్లారు. ఆ క్రమంలో ఓ సీటు కింద ఒక పెట్టెను చూశారు. వెంటనే అధికారులకు కబురందించారు. బాక్సును స్వాధీనం చేసుకున్న అధికారులు.. ఏ బుట్టలో ఏ పాము ఉంటుందోనని జాగ్రత్తగా తెరిచి చూస్తే.. దాని నిండా బంగారమే! ఒకటికాదు రెండు కాదు దాదాపు కోటి రూపాయల విలువచేసే మూడు కేజీల బంగారం. అప్రమత్తమైన అధికారులు ఆ బంగారం ఉన్న సీటులో ప్రయాణించిన వ్యక్తి కోసం గాలింపు మొదలుపెట్టారు. ఎలాగోలా అతడ్ని పట్టుకోగలిగారు. ప్రస్తుతం అతణ్ని విచారిస్తున్నట్లు తెలిసింది. ఇదేకాకుండా చెన్నై ఎయిర్ పోర్టులో ఈ రోజు అక్రమంగా తరలిస్తున్న 35 నక్షత్ర తాబేళ్లను కూడా కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సింగపూర్ కు చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. -
పిట్టల్ని కొట్టబోతే మంటలంటుకున్నాయి
చెన్నై: చెన్నై విమానాశ్రయంలో ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు భయాందోళన కలిగించాయి. రన్ వేకు సమీపంలోని బే 55 వద్ద మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక దళం వెంటనే మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని విమానాశ్రయ సిబ్బంది తెలిపారు. పక్షులను చెదరగొట్టేందుకు పేల్చిన బాణాసంచా ఎండు గడ్డి మీద పడి మంటలు అంటుకున్నాయని వెల్లడించారు. గత వారం బే 48 వద్ద ఇలాంటి ప్రమాదమే చోటుచేసుకుంది. విమానాలు పైకి ఎగరడానికి, దిగడానికి ముందు పక్షులను చెదరగొట్టేందుకు బాణాసంచా కాల్చడం చేస్తుంటారు. -
ఎయిర్ పోర్ట్‌లో రూ. కోటి బంగారం పట్టివేత
చెన్నై: చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ఓ ప్రయాణికుడు విదేశాల నుంచి అక్రమంగా తీసుకొచ్చిన మూడు కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం దోహా నుంచి చెన్నై వచ్చిన సిరాజ్ అనే ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీలో అతడి వద్ద మూడు కేజీల బంగారం ఉన్నట్లు గుర్తించారు. ఆ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని అధికారులు ప్రశ్నిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ. 3 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. -
చెన్నై విమానాశ్రయంలో ఇద్దరి అరెస్ట్
తిరువొత్తియూరు (చెన్నై): నకిలీ పాస్పోర్టుతో విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నించిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆదివారం తెల్లవారుజామున దుబాయ్‌కు వెళ్లేందుకు ఓ విమానం సిద్ధంగా ఉంది. అందులో ప్రయాణించుటకు వచ్చిన ప్రయాణికులను పాస్‌పోర్టు తనిఖీ అధికారులు తనిఖీ చేశారు. ఆ సమయంలో అరందాంగికి చెందిన మహ్మద్ కలింజియం అనే వ్యక్తికి చెందిన పాస్‌పోర్టును తనిఖీ చేయగా అది నకిలీదని తేలింది. దీంతో అతన్ని ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. అలాగే ఇక్కడ్నుంచి శనివారం రాత్రి శ్రీలంకకు వెళ్లే విమానంలో ప్రయాణించుటకు వచ్చిన వారిలో చెన్నై ఆలపాక్కంకు చెందిన దేనిష్ (26) అనే యువకుని పాస్‌పోర్టు నకిలీదని తెలిసింది. దీంతో అతన్ని కూడా ఎయిర్‌పోర్టు పోలీసులు అరెస్టు చేశారు. -
ఎయిర్‌పోర్ట్‌లో విమాన ప్రయాణికుడి అరెస్ట్
టీనగర్: చెన్నై విమానాశ్రయంలో తుపాకీ, బుల్లెట్‌తో వచ్చిన ప్రయాణికుని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కాంబోడియాకు వెళ్లేందుకు గురువారం రాత్రి బయలుదేరేందుకు ఒక విమానం సిద్ధంగా ఉంది. అందులో ప్రయాణించేందుకు వచ్చిన వారి సామగ్రిని అధికారులు తనిఖీలు చేశారు. ఆ సమయంలో ఒక ప్రయాణికుని వద్ద పేలని తపాకీ బుల్లెట్ ఉన్నట్టు గుర్తించారు. విచారణలో అతడు కాంబోడియాకు చెందిన ఇన్సెల్కం (45) అని, కొన్ని రోజుల క్రితం చెన్నై, ఆళ్వారుపేటలోగల బధిరుల పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి తన బృందం సహా వచ్చినట్లు తెలిసింది. దీని గురించి ఇన్సెల్కం ఈ బుల్లెట్ కాంబోడియాలో తనకు లభించిందని, అనేక ఏళ్లుగా ఇది తన బ్యాగులో ఉందని తెలిపాడు. దీంతో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అధికారులు అతన్ని విమానాశ్రయ పోలీసులకు అప్పగించారు. వారు ఇన్సెల్కంను అరెస్టు చేశారు. -
నయనతారకు భంగపాటు
నటి నయనతారకు భంగపాటు తప్పలేదు. అదీ వందలాదిమంది నడయూడే విమానాశ్రయంలో. అక్కడ ఆమె స్టార్డమ్ ఏ మాత్రం పని చేయలేదు. అసలు విషయం ఏమిటంటే సూర్య సరసన మాస్, జయం రవికి జంటగా తనీ ఒరువన్, విజయ్ సేతుపతితో నానుం రౌడీదాన్ తదితర చిత్రాల్లో నటిస్తూ యమబిజీగా వున్న ఈ బ్యూటీ క్రిస్మస్ వేడుకలను స్వగృహంలో జరుపుకోవాలనే ఆకాంక్షతో బుధవారం హడావుడిగా చెన్నై నుంచి కొచ్చికి బయలుదేరారు. అయితే ఈ అమ్మడికి చాలా బిజీ షెడ్యూల్ కదా చెన్నై విమానాశ్రయానికి కాస్త ఆలస్యంగా చేరుకున్నారు. అంటే ఉదయం 10.30 గంటలకు ప్లైట్‌కు 10 గంటలకు విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి వరకు బాగానే ఉంది. పాపం నయనతార బయలుదేరింది పండుగ వేడుకకు కదా! కాస్త భారీ లగేజీతో వెళ్లారు. భారీ అంటే కేవలం ఐదు సూటుకేసులే. అయితే ఆ లగేజీతోనే వచ్చింది తంటా. ఆమె ఆలస్యంగా వెళ్లడంతో విమానాశ్రయ అధికారులు మీరు వెళ్లవచ్చు. కానీ మీ ఐదుసూట్‌కేసుల లగేజీని తీసుకెళ్లడానికి కాలవ్యవధి ముగిసిపోయిందని ఖరాఖండిగా చె ప్పేశారు. అక్కడికి నయనతార సాధ్యమైనంతవరకు చాలా సౌమ్యంగా వారిని అభ్యర్థించారు. అయినా ఫలితం లేకపోయింది. అక్కడి అధికారులు మాత్రం మీరు సింగిల్ బ్యాగ్‌తో వెళ్లడానికి మాత్రం అనుమతిస్తాం ఐదు సూట్ కేసులకు మాత్రం పర్మిషన్ ఇచ్చేది లేదంటూ నిరాకరించడంతో చాలా భంగపాటుకు గురైన నయనతార చివరికి తన సూట్‌కేసులను కారులోనే వదిలేసి సింగిల్ హ్యాండ్‌బ్యాగ్‌తో కొచ్చికి వెళ్లాల్సి వచ్చింది. నయనతార వ్యవహారం చెన్నై విమానాశ్రయంలో కలకలం సృష్టించింది. -
ఎయిర్‌పోర్ట్‌లో రూ. 2 కోట్ల బంగారం పట్టివేత
చెన్నై: సింగపూర్ నుంచి నగరానికి వచ్చిన ప్రయాణికుడి రియాద్ అహ్మద్ నుంచి 6.5 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం రియాజ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానంలో చెన్నై ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రయాణికుల లగేజీని కస్టమ్స్ అదికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రియాజ్ లగేజీలో 6.5 కేజీల బంగారం ఉన్నట్లు గుర్తించారు. దాంతో ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ స్వాధీనం చేసుకున్న బంగారం విలువ మార్కెట్లో రూ. 2 కోట్ల ఉంటుందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. -
బెల్ట్‌లో 1.3 కోట్ల బంగారం
తిరువొత్తియూరు: చెన్నై విమానాశ్రయంలో 4.2 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఒకరిని అరెస్ట్ చేశారు. గురువారం తెల్లవారుజామున సింగపూర్ నుంచి టైగర్ ఎయిర్‌లైన్స్ విమానంలో నగరానికి చేరుకున్న ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ప్రయాణికుల్లో ఒకరైన రాయపేటకు చెందిన ప్రభాకర్ అనే వ్యక్తి తన నడుముకు కట్టుకున్న బెల్టులో 14 బంగారం బిస్కెట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ బంగారం విలువ రూ. 1.3 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. -
లోదుస్తుల్లో బంగారం స్మగ్లింగ్.. మహిళల అరెస్టు
చెన్నై: విదేశాల నుంచి చాటుమాటుగా బంగారం తరలిస్తూ ఏడుగురు మహిళలు పట్టుబడ్డారు. బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఒకే రోజు ఏడుగురు మహిళలు పట్టుబడడం చెన్నై విమానాశ్రయం చరిత్రలో ఇదే ప్రథమం. కౌలాలంపూర్ నుంచి గురువారం రాత్రి చెన్నైకి వచ్చిన మలేషియన్ ఎయిర్ లైన్స్ విమానంలో దిగిన రాణి (43)ని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఆమె లోదుస్తుల్లో 14 బంగారు బిస్కెట్లు దొరికాయని అధికారులు తెలిపారు. ఒక్కొక్క బంగారం బిస్కెట్ బరువు 100 గ్రాములు ఉందని చెప్పారు. అలాగే సింగపూర్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో నగరానికి వచ్చిన శ్రీలంకకు చెందిన వడివళగి (48) పింగారా (40) శివగంగైకి చెందిన మారియమ్మాళ్ (50), జీనత్ (38)లను తనిఖీ చేశారు. ఈ నలుగురు మహిళలు 1550 గ్రాముల బంగారు బిస్కెట్లతో పట్టుబడ్డారు. సింగపూర్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో చెన్నైకి చెందిన కనియమ్మాళ్ (39) తన సెల్ ఫోన్లో బ్యాటరీ స్థానంలో బంగారం బిస్కెట్‌ను ఉంచి తెస్తుండగా దాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడుగురు మహిళల నుంచి ఒకే రోజు రూ. కోటి విలువైన 3.3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. వీరందరినీ విచారిస్తున్నట్లు వెల్లడించారు. ప్రాథమిక విచారణలో పట్టుబడిన మహిళలంతా స్మగ్లింగ్ ముఠాకు చెందిన వారుగా నిర్థారించినట్లు చెప్పారు. -
పోలీసు అధికారి సూట్‌కేసులో బుల్లెట్లు
చెన్నై : కర్ణాటక రాష్ట్ర పోలీసు అధికారి సూట్‌కేసులో తుపాకీ బుల్లెట్లు లభించటంతో చెన్నై విమానాశ్రయంలో కలకలం రేగింది. చెన్నై నుంచి అండమాన్‌కు వెళ్లే జెట్ ఎయిర్వేస్ విమానం శుక్రవారం ఉదయం డొమెస్టిక్ టెర్మినల్ నుంచి బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది.అందులో ప్రయాణికుల వద్ద భద్రతా అధికారులు తనిఖీలు జరిపారు. ఆ సమయంలో కర్ణాటకకు చెందిన క్రిమత్ అనే వ్యక్తి ఆ విమానంలో ప్రయాణించేందుకు వచ్చారు. ఆయన రాష్ట్ర సాయుధ పోలీసు విభాగంలో పనిచేస్తున్నారు. లగేజీ తనిఖీ చేస్తుండగా సూట్‌కేసులో బాంబులు ఉన్నట్లు అలారం మోగింది. దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన అధికారులు వెంటనే బాంబు స్క్వాడ్ నిపుణలను రప్పించారు. సూట్‌కేసును నిర్జీవ ప్రదేశానికి తీసుకువెళ్లి తనిఖీ చేయగా బాంబులేవీ లేవని గుర్తించారు. అయితే అందులో మూడు తుపాకీ బుల్లెట్లు కనిపించాయి. పోలీసులు క్రిమత్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కర్ణాటక డీజీపీకి ఈ సమాచారాన్ని అందించారు. -
చాక్లెట్లలో బంగారం బిస్కెట్లు
చెన్నై: మలేషియా నుంచి అక్రమంగా తీసుకొచ్చిన 2 కిలోల బంగారు బిస్కెట్లను కస్టమ్స్ అధికారులు చెన్నై ఎయిర్‌పోర్టులో స్వాధీనం చేసుకున్నారు. రాయపేటకు చెందిన యువకుడిని అరెస్టు చేశారు. మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి సోమవారం అర్ధరాత్రి 12.30 గంటలకు మలేషియా ఎయిర్ లైన్స్ విమానం చెన్నైకి వచ్చింది. అందులో వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. తనిఖీల్లో రాయపేటకు చెందిన అరాఫత్ (27) వద్ద ఉన్న బ్యాగులో చాక్లెట్లు ఉన్నాయి. వాటిని విప్పి చూడగా వాటిలో ముక్కలు ముక్కలుగా కత్తిరించిన బంగారం బిస్కెట్లు ఉన్నాయి. మూడు ప్యాకెట్లలో మొత్తం 2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.60 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. విచారణలో అరాఫత్ స్మగ్లింగ్ కూలీగా పనిచేస్తున్నట్టు తెలిసింది. -
ఎయిర్‌పోర్ట్‌లో చోరీ: నలుగురి అరెస్ట్
టీ.నగర్: చెన్నై విమానాశ్రయంలో ప్రయాణికుల వస్తువులను చోరీ చేసిన ఉద్యోగులు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులు విలువైన వస్తువులు చోరీకి గురవుతూ వచ్చాయి. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తమ సూట్‌కేసుల్లో విలువైన వస్తువులు తీసుకురావడం పరిపాటి. ఇళ్లకు వెళ్లి చూడగా వస్తువులు కనిపించడం లేదు. ఇవి ఎలా చోరీకి గురవుతున్నాయో తెలియక పలువురు ఫిర్యాదు చేయడం లేదు. కొందరు మాత్రం ఫిర్యాదు చేస్తున్నారు. చోరీలకు బద్షా అనే ప్రైవేటు సంస్థ ఉద్యోగులు పాల్పడుతున్నట్లు తెలిసింది. విమానాశ్రయంలో ప్రయాణికుల లగేజీని కన్వేయర్ బెల్ట్‌లో వేసే పనుల్లో ఈ ఉద్యోగులు నిమగ్నమవుతుంటారు. ఆ సమయంలో ఉద్యోగులు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు తెలిసింది. దీంతో కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం పోలీసులు దీనిపై నిఘా ఉంచారు. బుధవారం రాత్రి వచ్చిన ప్రయాణికుల లగేజీ నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులను బద్షా సంస్థ ఉద్యోగులు చోరీ చేసినట్లు కెమెరాల్లో నమోదైంది. పోలీసులు నలుగురు ఉద్యోగులను అరెస్టు చేసి వారి వద్ద విచారణ జరుపుతున్నారు.