రూ.60 లక్షల హవాలా సొమ్ము పట్టివేత | Rs 60 lakhs havala seized by customs officials | Sakshi
Sakshi News home page

రూ.60 లక్షల హవాలా సొమ్ము పట్టివేత

Published Thu, Jul 28 2016 8:48 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM

Rs 60 lakhs havala seized by customs officials

సాక్షి ప్రతినిధి, చెన్నై: శ్రీలంకకు రహస్యంగా తరలిస్తున్న రూ.60 లక్షల హవాలా సొమ్మును చెన్నై విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై-శ్రీలంక విమానం బుధవారం రాత్రి 9.15 గంటలకు బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. ఇంతలో కస్టమ్స్ అధికారులకు ఓ సమాచారం అందింది.

వెంటనే కస్టమ్స్ అధికారులు విమానంలోకి ప్రవేశించి ఇద్దరు అనుమానితులను దించేశారు. చెన్నైకి చెందిన మహ్మద్ (40), అతని సహచరుడి లగేజీలను తనిఖీ చేయగా రూ.60 లక్షల విలువచేసే అమెరికన్ డాలర్లు, యూరో కరెన్సీ బయటపడింది. వారిద్దర్నీ అరెస్ట్ చేశారు. ఈ తనిఖీల కారణంగా శ్రీలంక విమానం 10.30 గంటలకు బయలుదేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement