న్యూఢిల్లీ: పాక్ బాలికల విద్య, హక్కుల ఉద్యమకారిణి మలాలా యూసఫ్‌జాయ్‌లాగా తానేమీ స్వదేశం వదిలిపోలేదని, సొంత కశ్మీర్‌లో హాయిగా ఉన్నానంటూ బ్రిటన్ పార్లమెంట్ భవనంలో ప్రసంగించిన కశ్మీర్ యువతి యానా మిర్ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. బ్రిటన్ నుంచి విమానంలో తిరిగొచ్చాక ఆమె బ్యాగులను ఢిల్లీ కస్టమ్స్ అధికారులు తనిఖీచేయడమే ఆమె ఆగ్రహానికి లోనయ్యారు.
బ్రిటన్‌లో భారత్ గురించి గొప్పగా ప్రసంగించిన నాలాంటి వ్యక్తిని ఇలాగేనా అవమానించేది?. ఖరీదైన లూయిస్ విట్టన్ బ్రాండ్ షాపింగ్ ఖాళీ సంచులు తెచి్చనందుకే బిల్లులు ఎగ్గొట్టిన దొంగలా చూస్తున్నారు. నన్ను వాళ్లు ఇండియా మీడియా యోధురాలిగా భావిస్తే మీరేమో ఇక్కడ నన్ను బ్రాండ్ స్మగ్లర్‌లా భావించి పరువు తీస్తున్నారు’’ అని అధికారులతో స్వరం పెంచి మాట్లాడారు. అధికారులతో వాగ్వాదం తాలూకు వీడియోను స్వయంగా కెమెరాతో షూట్‌చేసి ‘ఎక్స్’లో షేర్‌చేశారు. దీనిపై ఢిల్లీ కస్టమ్స్ అధికారులు వివరణ ఇచ్చారు. ‘‘ అంతర్జాతీయ ప్రయాణికుల బ్యాగులను స్కానింగ్ చేయడం సర్వసాధారణం. గౌరవం చట్టాలకు అతీతం కాదు. బ్యాగ్ స్కానింగ్‌కు ఆమె ఒప్పకోలేదు’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment